శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మళ్ళీ ఏదో ముంచుకొస్తోంది

>> Sunday, September 9, 2018

మళ్ళీ  ఏదో  ముంచుకొస్తోంది
సంకేతాలు చూస్తుంటే   కర్మదేవతలు మనకు  హెచ్చరికలు  జారీచేస్తున్నట్లు  కనపడుతున్నది  .  శ్రీవారి ఆలయం లో జరుగుతున్నా అపచారాలపై కథనాలు ,అక్కడ రాజకీయనాయకుల నీచక్రీడలు ,మొన్న న్యాయ స్థానాలు  పవిత్ర ఆలయమర్యాదలపై అనవసరపు తీర్పులు,నిన్న కేరళ లో ఉత్పాతం ,పలురాష్ట్రాలలో  ప్రమాదాల హోరు ఇవిచాలవన్నట్లు    ఈరోజు   సాక్షాత్తూ  శ్రీవారి ఉత్సవమూర్తి మలయప్ప స్వామివారు  అర్చకుల చేతినుండి జారిపడటం  భయాన్ని కలిగిస్తోంది .
ఇందులో అర్చకుల తప్పేమి లేదు . కానీ ఇప్పుడు ఇలా జరగటానికి కారణం మాత్రం ఉత్పాదితాలకు సూచనే . ఎవరినో భయపెట్టటానికి వ్రాయటం లేదు.   ఎవరు ఎన్ని చెప్పినా జరిగేవి ఆపలేరు . సామూహిక పాపాలకు సామూహిక శిక్షలను మనం అనుభవించక తప్పదు.  వంద ముచ్చ్చట్లు చెప్పు . చర్యకు ప్రతిచర్య తప్పదు. అలాగే చేసే పాపాలకు అందుకు మౌనంగా ఉండి  మన అంగీకారాన్ని తెలిపినట్లు ప్రవర్తించినా ...తిలాపాపం తలాపిడికెడు ... అన్నట్లు  భాగస్వామ్యం తప్పదు.
ఇప్పటికైనా మనజీవితాలను ధర్మంతప్పని మార్గంలో నడుపుకునే ప్రయత్నం చేయటం భగవంతునికి శరణాగతి అవటం ..ఆయనకు ఆగ్రహం కలగకుండా జీవించటం కాక మరో మార్గమేమి లేదు


     జైశ్రీరామ్ 

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP