శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అన్నయ్యా ! అందరూ నా గురించి మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు?

>> Monday, April 16, 2018

#ఆసీఫా : అన్నయ్య,మనదేశంలో అందరూ నా గురించి మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు? నా కన్నా ముందే ఎందరో అమ్మాయిలు రాక్షసులకు బలైపోయారు కద మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడడం లేదు?
నేను:  నువ్వు ముస్లిం గా పుట్టినందుకు అమ్మ.
ఆసీఫా: అదేంటి అన్నయ్య నా ఒక్కదాని గురించి మాత్రమే ఎందుకు ఇంత మాట్లాడుతున్నారు అంటే నువ్వు మతం గురించి చెబుతున్నావ్?
నేను: నీకు ఎలా చెప్పాలి తల్లి...మనదేశంలో ఒక వార్త సంచలనం అవ్వాలంటే దాని వెనక మతం అయినా ఉండాలి,రాజకీయాలు అయినా ఉండాలి. మనదేశంలో ముస్లింగా  పుట్టిన రాక్షసుడు ముస్లిం అమ్మాయిని రేప్ చేస్తే అది పెద్ద వార్త అవ్వదు...హిందుగా పుట్టిన రాక్షసుడు హిందూ అమ్మాయిని రేప్ చేస్తే అది పెద్ద వార్త అవ్వదు...ముస్లింగా పుట్టిన రాక్షసుడు హిందూ అమ్మాయిని రేప్ చేస్తే అది పెద్ద వార్త అవ్వదు.కానీ హిందుగా పుట్టిన రాక్షసుడు ముస్లిం అమ్మాయిని రేప్ చేస్తే అది మాత్రమే పెద్ద వార్త అవుతుంది. అప్పటివరకు ఎన్ని రేప్లు జరిగినా చూసి చూడనట్టు ఉన్న ఈ సెక్యులర్ మీడియా "ముస్లింపై హిందూ రేప్" అనగానే ఎక్కడ లేని ఎనర్జీతో 24గంటలు ఆ వార్తనే చూపించడంలో బిజీ అయిపోతారు.
ఇక ఇన్నాళ్ళు ఎన్ని రేప్లు జరిగినా ఒక్కసారి కూడా మాట్లాడని హిందూ వ్యతిరేకి ఖాన్'గ్రెస్,కమీనే'ష్టులు నీ గురించి ఇప్పుడు తెగ మాట్లాడేస్తున్నారు..బాధపడుతున్నట్లు యాక్టింగ్ ఇరగదీస్తారు..ఫేస్ బుక్ లో ఆసీఫా అంటూ పూటకో పోస్ట్ పెడతారు.అదంతా నీ మీద ప్రేమతోనో జాలితోనో కాదు.నిన్ను రేప్ చేసింది హిందుగా ఉన్న రాక్షసులే కాబట్టి...మిగితా హిందువులకు సంబంధం లేకున్నా మొత్తం హిందువులు అందరూ రేపిస్టులే అన్నట్టు హిందువుల మీద పడి ఏడవడానికి ఒక మంచి చాన్సు దొరికింది అని సంతోషిస్తారు ఈ కాంగ్రెస్-కమ్యూనిస్టులు- సెక్యులరిస్టులు.ఇప్పుడు నీ చావుని చూసి ఏడుస్తున్న ప్రజలు/ఏడుస్తున్నట్టు నటిస్తున్న రాజకీయ పార్టీలు...ఇంతకుముందు జరిగిన ప్రతి అత్యాచారాన్ని ఇదే స్థాయిలో ప్రచారం చేసి,ప్రజా ఆందోళనలు చేసి ఉంటే,ఇప్పటివరకు ఏ మతంవాడైనా ఏ కులంవాడైనా #రేప్_చేస్తే_ఉరిశిక్షే అనే ఒక చట్టం వచ్చి ఉండేది.అలా చట్టం వచ్చివుంటే నీపై ఆ దారుణ అత్యాచారం జరిగివుండేది కాదేమో నువ్వు కూడా ఇప్పుడు నవ్వుతూ మా చూట్టే ఉండేదానివి.
ఇంతకుముందు చాలా దారుణాలు జరిగాయి...నీ కంటే చిన్న వయసు ఉన్న ఎందరో పసిపిల్లలను రాక్షసులు రేప్ చేసి చంపేసారు...ఒక మహిళని తొమ్మిదిమంది తొమ్మిది రోజులు అత్యాచారం చేసారు...కానీ ఆ వార్త సంచలనం అవ్వలేదు..కారణం ఏంటో తెలుసా? ఆ మహిళ ఒక హిందువు..అత్యాచారం చేసింది ముస్లింరాక్షసులు కాబట్టి.
అమ్మా #ఆసీఫా...నీ పేరు చెప్పుకుని ఈ చెత్త సెక్యులర్ రాజకీయ పార్టీలు ఇంకొద్దిరోజులు రాజకీయాలు చేస్తారు...కొద్దిరోజులు గడిస్తే నిన్ను అంతా మరిచిపోతారు.ఆ తర్వాత మళ్లీ అంతా మామూలే...ఎన్ని అత్యాచారాలు జరిగినా ఏ ఒక్కడు కూడా మాట్లాడడు.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP