శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నమ్మేవాడిదే పైచేయి

>> Wednesday, May 28, 2014


భగవంతుణ్ణి నమ్మేవారికి, మనస్సును స్వాధీనం చేసుకోవడానికి సంబంధించినంతవరకూ ఆ నమ్మకం లేనివారికంటే కొంత పై చేయి ఉంటుంది. భగవంతుని మీద ఎప్పుడైతే చిత్తశుద్ధితో విశ్వాసాన్ని పెంపొందించుకుంటామో అప్పుడు మనస్సు స్వాధీనానికి కావలసిన శక్తిమంతమైన సహాయం మనకు లభిస్తుంది. భక్తిని సాధన చేయడం వలన భగవంతుని కోసం పట్టుదల పెరుగుతుంది. ఈ పట్టుదల మనస్సును స్వాధీనం చేసుకోవడంలో కలిగే అడ్డంకులను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది. శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు- పెద్ద పులి ఇతర జంతువులని తినివేసినట్టు ఈ దేవుని కోసం పట్టుదల అనే పెద్దపులి కామక్రోధాలను తిని వేస్తుంది. ఒకసారి ఈ విధమైన పట్టుదల హృద యంలో పెరిగిన తరువాత కామం, క్రోధం మొదƒ లైన మనోవికారాలు మాయమైపోతాయి. కృష్ణుడి పట్ల ఉన్న పట్టుదల వల్ల బృందావనంలో గోపికలకు అటువంటి మనఃస్థితి ఉండేది.

ఎప్పుడైతే కామం క్రోధం మొదలైన మనో వికారాలు పోతాయో అప్పుడు మనస్సు పవిత్రమ వుతుంది. పవిత్రమైన మనస్సును స్వాధీనం చేసుకోవడం సులభం. కాని నమ్మకం లేనివాడు దీని కోసం చాలాకాలం కష్టపడాలి. ఎందుకంటే అతడు తన అపనమ్మకాన్ని వదిలించుకుంటే తప్ప అతనిలో దేవుని కోసం పట్టుదల పెంపొందదు. శ్రీకృష్ణుడు ఇలా బోధించాడు.. నా భక్తుడయిన వాడు తన ఇం ద్రియాలను పూర్తిగా అదుపులో పెట్టుకోలేకపోయి నా, ఇంద్రియ సుఖాలు తనను చికాకు పెడుతున్న ప్పుడు, నా మీద అతనికి శక్తిమంతమైన భక్తి వల్లనే వాటికి లొంగిపోకుండా నిలద్రొక్కుకోగలుగుతాడు.

భగవంతుని మీద నమ్మకం ఉన్నవాడికి మనస్సులో పవిత్రత ఎలా కలుగుతుందన్న విషయాన్ని వివరించడం సులభం. ఎప్పుడైతే భగవంతుని పట్ల ప్రేమను పెంచు కుంటాడో అప్పు డు వ్యక్తి మనస్సు భగవంతుని గురించే ఆలోచిం చటం ప్రారంభిస్తుంది. ఎందుకంటే మనం దేన్ని ప్రేమిస్తామో సహజంగానే దాని మీదే మనస్సును ఏకాగ్రం చేస్తాం. మన మనస్సు దేని మీద ఏకాగ్రం అవుతుందో దాని లక్షణాలనే పుణికిపుచ్చుకుంటాం. కాబట్టి భగవంతుడి మీద మన మనసుసని ఏకాగ్రం చేసినప్పుడు భగవంతుని లక్షణాలను జీర్ణించుకుం టాం. భగవద్గీత వాటినే `దైవీ సంపద' (దైవ లక్షణా లు) అని పేర్కొంది. హృద యంలో పవిత్రత, ఇంద్రి య నిగ్రహం, ప్రశాంతత, క్రోధం లేకపోవడం, చప లత్వం లేకపోవడం మొదలైన దైవీలక్షణాలను నిజమైన భగవ…ద్భక్తుడు ఎటువంటి శ్రమ పడకుం డానే పొందుతాడు. మరో మాటలో చెప్పాలంటే అతని మనస్సు దానంతట అదే స్వాధీనంలోకి వస్తుంది.
Email | Print |

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP