శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

యాగవివరణ

జైశ్రీరాం

భగవద్బంధువులందరికీ హనుమత్స్మరణపూర్వక నమస్కారములు.

లోకశ్రేయస్సుకై శ్రీ వేంకటేశ్వర జగన్మాతపీఠం , నుండి గత మూడు సంవత్సరములు "హనుమత్ రక్షాయాగం"అను క్రతువును నిర్వహించుట జరిగినది . భకతసులభుడైన హనుమంతుని అనుగ్రహంబడయుటకు అత్యంత సరళము అతిమహిమాన్వితమైన సాధనలను[మహాత్ములు మనకు ప్రసాదించిన మార్గములు] జతపరచి సాగించిన ఈయాగంలో పాల్గొన్న ఎంతో మందిభక్తులు స్వామి కరుణకు పాత్రులై వారి వారిసంకటములను తొలగించుకుని,శ్రేయస్సునుపొంది హనుమన్మహిమలకు ప్రత్యక్షసాక్షులైనిలచారు. ఎందరో ఉద్యోగ,విద్య,కుంటుంబసమస్యలు,అనారోగ్య, ఈతిబాధలను స్వయంగా చేసిన హనుమదుపాసనద్వారా శక్తివంతులై తొలగించుకోగలిగారు.
మహర్షులు మనకిచ్చిన సాధనామార్గాలను అనుసరించటం ద్వారా ప్రత్యక్షంగా ఫలితాలను చవిచూడవచ్చా లేదా అని ప్రయోగపూర్వకంగా సాధనామార్గంలో నడచి, నిలచి, గెలచి హనుమంతులవారి ఉపానసనకుండే శక్తి ఏమిటో అన్నింటినీ గీటురాయిమీద గీచి చూస్తే కానినమ్మలేని ఈ కలిమాయ మోహితకాలంలోనూ నిరూపించారు.వారికి వారి వెనుక ఉన్న స్వామివారికి కైమోడ్పులు.

ఇక ఈసంవత్సరం స్వామి ఆదేశంతోనేమో నాలుగవ ఆవృతిని "కోటిహనుమాన్ చాలీసా" పారాయణం జరిపి అష్టోత్తర శతకుండీయ[108] హనుమత్ రక్షాయాగంగా హనుమజ్జయంతి [మే 15,2012] జరపాలనే ప్రేరణగా ఆజ్ఞదయచేయబడింది . ఈమహత్తర కార్యక్రమం ఉడత వంటి ,నా చేత జరుగుతుందా ? ఎన్నడుకాదు. కనుకనే హనుమత్ పరివారం అంతా అండగా నిలబడుతుంది ....స్వామి భక్తులంతా తరలివచ్చి తలోవైపునా నిలుచుని మహావైభవంగా జరుపుతారనే సంకేతాలు అందుతున్నందున సాహసం చేసి మన అందరి తరపున ఈకార్యక్రమానికి సిద్దమవుతున్నాము.
ఇప్పుడు భూమిపై జరగనున్న ప్రమాదాలనుండి భక్తులు రక్షింపబడుటకై స్వామి అనుగ్రహం వేడుతూ కొనసాగే ఈ యాగానికి మీరందరూ పెద్దలే . ప్రతి ఒక్కరూ [ప్రతికుటుంబం]నుండి వెయ్యిన్నెనిమిది చాలీసాపారాయణములకు తగ్గకూండా చేసి అంత సంఖ్యలో రామనామం లిఖించి అందచేయటమేకాక మరో పదిమంది భక్తులచే పారాయణం చేపించి కార్యకర్తలుగా కూడా సాధనచేయవలసినదిగా మనవి. పూర్వం ఇంట్లో కొబ్బరికాయ దేవునికి నివేదన చేసుకుని తాము ప్రసాదంగా తీసుకొనుటయేగాక దానిని వీధిలోకొచ్చి పదిమందికీ పంచే వారు పెద్దలు . ఇదే నీతినీ మన సాధనారీతిగా మలచుకుంటూ ఈ కార్యక్రమం సాగిద్దాం . . సాధనలోపాల్గొనే భక్తులకు వలసిన లిఖిత,పారాయణ ప్రతులను అందజేయుటకు ఇంకా ఇంటర్ నెట్ లోంఛి డౌన్ లోడ్ చేసుకొనుటకు ఏర్పాట్లు జరుగుతున్నవి. వివిధ భక్తసమాజములు, సత్సంగములు,పాఠశాలలు,కళాశాలలో విద్యార్థులను కూడా ఈకార్యక్రమంలో సాధకులుగా మేళవించుకొను మార్గములు రూపకల్పనజరుగుతున్నవి.
ఇందులో పాల్గొను ప్రతి భక్తుని పేరునా అర్చన,హోమములో ఆహుతులివ్వబడి యాగానంతరం అత్యంతశక్తిపూరి తములైన "హనుమద్రక్షలు " యాగంలో పాల్గొన్న భక్తులు ఎక్కడ ఉన్నా వారికందజేయు కార్యక్రమం రూపొందించబడుతున్నది .

ఇక స్వామి పరివారంగా మారి మీరు ఈయాగానికి కార్యకర్తలై ముందుకుసాగాలి . ఇందుకోసం మీరున్న ప్రాంతాన్నే కార్యక్షేత్రంగా ఎన్నుకుని స్వామికార్యాన్ని సాధించాలి. అనుమానంలేదు హనుమ అనుగ్రహం మనపై పరిపూర్ణంగా వర్షించనుంది .తరలిరండి మెయిల్ ,లేదా ఫోన్ ద్వారా మీ సంసిధ్ధతను తెలియపరచండి.
జైశ్రీరాం .


 durgeswara     ......... duergeswara@gmail.com      9948235641

mohan kishore  [gurgav] [hindi]  ........... mohankissor@gmail.com

sharat panada   [oriya]  .........     sarata1212 @gmail.com
manohar             [bengalore ]                           chkrman@gmail.com
raamaraaju  bhaaskar      [america]     ramarajubhaskar@gmail.com

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP