tag:blogger.com,1999:blog-2668918242718835328.post6193639261374602388..comments2024-03-14T15:42:13.805-07:00Comments on హరిసేవ: కళ్యాణము చేతమురారండీ ! [మీ ఇంటిల్లపాదీ రావాలి సుమా !]Unknownnoreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-2668918242718835328.post-29923092470750020422011-02-05T08:51:55.682-08:002011-02-05T08:51:55.682-08:00శ్రీరస్తు. శుభమస్తు. ...శ్రీరస్తు. శుభమస్తు. అవిఘ్నమస్తు.
స్వస్తి శ్రీ చాంద్రమాన వికృతి నామ సంవత్సర మాఘ శుద్ధ దశమీ భానువారం అనగా తే. ౧౩ - ౦౨ - ౨౦౧౧.ని
రవ్వవరమందలి శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠమున కొలువై యున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారు శ్రీదేవీ, భూదేవి లను,
శ్రీ రామ లింగేశ్వర స్వామివారు శ్రీ దుర్గా దేవిని
పరిణయమాడుచున్న సందర్భముగా భక్త కోటి తరపున
చింతా రామ కృష్ణా రావు సమర్పించిన
-:కల్యాణ శుభ కృతి:-
శార్దూలము:-
శ్రీమద్వేంకట నాయకుండు కరుణన్ శ్రీదేవి, భూదేవినే
ప్రేమన్ లోకులఁ గావనెంచి యెలమిన్ బెండ్లాడు నివ్వేళలో
శ్రీమత్శంకర పార్వతీ పరిణయశ్రీ కాంతులున్ లోకులన్
నీమంబొప్పగ గాచునయ్య కరుణన్ నిత్యంబు దుర్గేశ్వరా!
కవిరాజ విరజితము:-
రమణుఁడు సజ్జన రక్షణఁ గొల్పగ రవ్వ వరంబున రాజిలుచున్.
సుమధుర భావ సుశోభిత సద్గుణ సుందర భక్త ప్రచోదకుఁడై
సమధిక శక్తిని, శాంతిని యుక్తిని, సమ్మతిఁ గొల్పుచు శాశ్వితమౌ
సమధిక భక్తి, ప్రశస్త విముక్తిని, చక్కఁగఁ గొల్పును సత్కృపతో.
పంచచామరము:-
మహేశుఁడున్మనోజ్ఞ భావ మానవాళిఁ గావగా
మహేశ్వరిన్ వివాహమాడె మాన్యుఁడై వరించుచున్,
మహీతలంబునన్ బ్రమోద మానసంబుఁ గొల్పుచున్
మహా విశిష్టతన్ గ్రహించి మాన్యుఁడయ్యెనిచ్చటన్.
క:-
హరి హరులకు కల్యాణము
ధరనొక్కెడ చేయుచున్న ధన్యాత్మకులన్
మరిమరి శుభముల నొసగుత
హరిహరులు నిరంతరంబు హాయి నొసగుతన్.
గీ:-
మంగళంబగు హరికిని మంగళంబు.
మంగళంబగు హరునకు మంగళంబు.
మంగళంబగు దుర్గేశ మంగళంబు.
మంగళంబగు జగతికి మంగళంబు.
మంగళమ్. మహత్.
శ్రీశ్రీశ్రీశ్రీశ్రీచింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.com