శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

గ్రహణసమయం లో ఏమీ తినరాదు.ధ్యానం శుభకరం

>> Thursday, December 31, 2009



ఈరోజు అర్ధరాత్రినుంచి మొదలవుతున్న చంద్రగ్రహణ సమయం లో ఏ పదార్ధాలను ఆహారంగా స్వీకరించరాదు. ఈసమయం లో ఆహారములో ఆరోగ్యానికి హాని కలిగించే లక్షణముంటుంది . ఈసమయం లో చేసే జపధ్యానాదులకు విశేషఫలితాలుంటాయి కనుక ధ్యానాదులు ఆచరించటం శుభం.

దురదృష్టవశాత్తూ విదేశీ సంస్కృతీ ప్రభావంతో అర్ధరాత్రి పిశాచాల సంచార సమయం లో నూతనసంవత్సర వేడుకలంటూ తాగటం ,తినటం వంటి అనాచారాలు ప్రబలి ఉన్నాయి .అవి ఎందుకు ,ఏమిటి అనే ఆలోచనలు లేకుండా యువత అనాలోచితంగా ఆచరించే ఈకార్యక్రమం ఏమాత్రం మంచిఫలితాలనీయదు. ఎవరు చెప్పినా వినేస్థితిలో లేనప్పుడు చెప్పటం ఎందుకని పెద్దలు చెప్పక మిన్నకుంటున్నారు .
ఈరోజు గ్రహణ సమయం లో ఈవిధంగా ఆహారం ,మద్యమాంసాదుల స్వీకరణ దోషభూఇష్టం . అది ఆరోగ్యానికి పరోక్షంగా హాని చేస్తుంది . దీనికి బదులు ఆసంయంలో ప్రశాంతంగా కూర్చుని ధ్యానమో,మీఇష్టదైవనామ స్మరణమో చేస్తూ లోకశాంతిని కాంక్షించండి .అది విశేషంగా ఫలిస్తుంది. విన్నావినకపోయినా మేము విన్నాక తరువాత వారికి చెప్పాల్సినబాధ్యత ఉన్నదికనుక చెబుతున్నాము . వినటం వినకపోవటం మీ ఇష్టం.

Read more...

ఇప్పుడు మనమేధర్మాన్ని అనుసరించాలి ?

>> Wednesday, December 30, 2009


శిష్యుడు : ఇప్పుడు మనమేధర్మాన్ని అనుసరించాలి ?
స్వామీజీ : హనుమన్మహావీరుడే మనకిప్పుడాదర్శపురుషుడు .రామాజ్ఞతో అతడు సాగరాన్ని ఎలా లంఘించాడో చూడు. అతనికి ప్రాణభీతిలేదు.మృత్యుభయం లేదు .అతడు జితేంద్రియ చక్రవర్తి . అత్యద్భుత వివేక మహిమాన్వితుడు. మనం ప్రస్తుతమున్న దాస్య భావ నిర్మూలనకోసం హనుమంతుని జీవితాదర్శంగా ఎన్నుకోవాలి . దానివల్ల మిగతా ఆదర్శాలన్నీ జీవితం లో క్రమంగా అభివ్యక్తమవుతాయి . ఎదురు చెప్పకుండా గుర్వాజ్ఞను పాటించటం.కఠోర బ్రహ్మచర్య పాలన - ఇవే జయం పొందటానికి కీలకాలు .


----------------------------- స్వామి వివేకానంద

Read more...

శ్రీవారి చుబుకానికి కర్పూరం అద్దటం ఎందుకు ? స్వామివారిని పలుగుతో కొట్టిన భక్తుడెవ్వడు

>> Monday, December 28, 2009


అదో వైష్ణవగోష్ఠి .సభ గంభీరముద్రదాల్చి యున్నది . ఆదిశేషాంశ సంభూతులైన శ్రీ రామానుజచార్యులవారి అనుగ్రహ భాషణం జరుగుతోంది.ఆయనడుగుచున్నారు ." శ్రీనివాసుని దివ్యవిహారస్థలం ,వేంకటాచలం. ఈ వేంకటాద్రి భగవన్ముఖోల్లాస హేతువు ,పరాత్పరుడైన శ్రీవారికి పుష్పకైంకర్యమత్యంతప్రియకరము. పుష్పసమృద్దికి హేతువైనదీకొండ. అనవథిక సౌశీల్యగుణ ప్రథగల,దివ్యసౌందర్యశాలి ,ప్రాప్తస్వామి[అన్నివిధముల తగినట్టి] పరాత్పరుడు అగునీ వేంకటేశ్వరుడు అవస్యమారాధనీయుడు ,పుష్పకైంకర్యముచే పూజింపదగినవాడని శాస్త్రములనుచున్నవి. కనుక శ్రీ మద్వేంకటానాథుని ముఖోల్లాసముకై ఒక నందనవనమును ఏర్పరచి అనుదినము అతిసురభికుసుమ,తులసిమాలలు సమర్పించెడి కైంకర్యము సలుపగలవాడెవ్వరున్నారు ఈ గోష్ఠిలో అని అడిగారు.

అచ్చటి శీతబాధ తలచుకుని ,రక్తం గడ్డం కట్టించేంత ఆచలిలో ఈ సేవను జరుపగలందులకు భీతులైన శిష్యులెవరూ నోరు మెదపటం లేదు. భగవద్రామనుజులు శిష్యుల ముఖాలను పరిశీలిస్తున్నారు .వీరి గురుభక్తి ఇంతేనా ? అని.
వారిలో నున్న అనంతార్యుల వారికి బాధకలిగింది. అహో ! భగవద్దాసుడు ఇట్టిశీతభీతికా వణకవలెను? పరలోక హాని భయముగాని,గుర్వాజ్ఞను ధిక్కరించిన కలుగు అనర్ధములు తెలియలేకున్నారే ! గురువు ఆజ్ఝయే శిష్యునకు శిరోధార్యము ,ఆచరణీయము ఎంతదుష్కరకర్మమైనా సరే గుర్వాజ్ఞైనచో తప్పక ఆచరించవలసినదే .అని నిర్ణయించుకుని
గురుదేవా ! ఇదిగో నేను వేంకటనాథుని పుష్పకైంకర్యమునకు సన్నధ్ధుడనై ఉన్నాను అని ఎలుగెత్తి పలికెను .

ఆ అనంతార్యుని చూచి మిగులసంతసించిన ఆయోగిపుంగవుడు ! అనంతార్యా నీవుగదా పరిపూర్ణాత్మగుణ విశిష్ఠుడవు .ఆచార్యుల శాసనమును తలదాల్చిన నీవే మా నిజమైన శిష్యుడవు అని గౌరవించి ఆయనను వేంకటాచలమునకు పంపెను.

గురుపదములను తలచుకుంటూ అనంతార్యులవారు పత్నీ సమేతుడై వేంకటాచలము చేరాడు. భగవంతునికి మొక్కుతూ ఒక విశాలమైన పూలతోటను ,పెద్దతటాకమును ,ఆపూలతోటయందొక బావిని నిర్మించి ,నీరు పారించుటకొక మార్గమును ఏర్పాటుచేసుకుని స్వామి సేవ చేస్తుండేవారు. వాటన్నింటికీ తమగురునిపేరే పెట్టుకున్నాడు. అలాగే పూలమాలలు గట్టెడి మండపమును నిర్మింపజేసాడు . వనమునందు పూలు గొనితెచ్చి ఆమండపమందు కూర్చుని పూలమాలలు కట్టి బుట్టలోనుంచి ,ముక్కుకు నోటికి గుడ్డనడ్డము పెట్టుకుని,పరమభక్తితో తలనిడుకుని స్వామివారి ఆలయమునకు ప్రదక్షిణము చేసి భగవదారాధన సమయమున భగవత్సన్నిధికి ప్రతిదినము కొనిపోవుచుండెడివాడు .

ఈ అనంతార్యుడు ఈ సేవకొరకు శ్రీరామానుజ తటాకమును తవ్వుచుండగా ,మట్టిని భార్యమోస్తున్నది. పాపమా ఇల్లాలు పూర్ణగర్భిణి .కాని ఆదంపతులు స్వామి సేవే ముఖ్యమనుకొని తమ భౌతికి బాధలను లెక్కచేయక అలా శ్రమిస్తూనే ఉన్నారు. ఆతల్లి నిండుగర్భిణిగా ఇలా మట్టితట్టలు మోయటం శ్రీవారు చూడలేకపోతున్నాడు . ఒక వటువు వేషములో వచ్చాడు . అమ్మా ఆతట్టను ఇటుతే . నేను మోస్తాను .అని అడిగాడు. దానికి ఆదంపతులు వద్దుబాబూ ! ఇది మాగురుదేవులు మాకప్పగించిన సేవాభాగ్యం మేమే చేయాలి అని ఆపిల్లవాన్ని నివారించారు. అయినా మరలా వచ్చి అడుగుతున్నాడా పిల్లవాడు .దానికి వాల్లు కోప్పడుతున్నారు ,అదలించారు .అయినా సరే ఆపిల్లవాడు మరలమరలా అడ్డుతగులుతూ మట్టి మోసుకెళ్ళు ఆతల్లి చేతులలో మట్టితట్టను బలవంతంగా లాక్కుని మోసుకెళుతున్నాడు మధ్యలో వచ్చి.ఇలా పలుమార్లు చెప్పినా వినని ఆపిల్లవానిపై మట్టితవ్వుతున్న అనంతార్యులవారికి బహుకోపం వచ్చినది .తవ్వుతున్న పలుగు తీసుకుని వెంటపడ్డాడు . పిల్లవాడు ఉడికిస్తూ వెనక్కెళ్లుతున్నాడు . కోపం పట్టలేక ఆయన గడ్డపారను విసరగా అది పిల్లవాని గడ్డమునకు తగిలి ధారగా రక్తం కారటం మొదలెట్టింది . ఆపిల్లవాడు పరుగిడుతూ పోయి తన ఆనందనిలయములో ప్రవేశించాడు .అతనిని తరుముకొస్తున్న అనంతార్యులవారు గర్భగుడిలో స్వామి వారిని చూసి అదిరిపడ్డాడు. స్వామి వారి మూర్తి చుబుకం నుండి రక్తం ధారగా కారుతున్నది. విషయం అర్ధమైనది. స్వామి .కరుణాంతరంగుడు .తన భార్య శ్రమను చూచి ఓర్వలేక తానే ఆశ్రమను భరించటానికి సిద్దమై చివరకు తనచేతిలో దెబ్బతిన్నాడు .ఎంత అపచారం జరిగినది .స్వామి వారి పాదాలపైబడి వలవలా ఏడ్చాడు .తన తప్పిదం క్షమించమని వేడుకున్నాడు. ఆరక్తం ఆగుటకై పుప్పొడిని అద్దాడు. నిరంతరం కన్నీరుకారుస్తూ స్వామినివేడుకుంటూ ఉన్న ఆయనకు కోటివీణలు మ్రోగినట్లు ఆస్వామివారి లాలింపుమాటలు వినవచ్చాయి ఇలా.
అనంతార్యా ! ఇది నాలీల ,నీచే చేయబడిన గాయముకూడా శ్రీవత్స చిహ్నము వలె నాకొక అలంకారము కాగలదు. భక్తుని మహిమను వెళ్లడించుకొనుటకై నేనే కల్పించిన లీల ఇది. అది అందరికీ తెలియపరచేందుకై చుబుక స్థానమున పరిమళకర్పూర చూర్ణమును ధరిస్తాను ఇకపై .అలాగే నన్ను గాయపరచిన గడ్డపారను సర్వజనులకు సందర్శనయోగ్యముగా ఉంచాలి. అది నాభక్తపరాధీనతను తెలియపరస్తుంది . అని స్వామివారు అనంతార్యులవారిని ఊరడించారు . నాటినుండి స్వామికి చుబుకానికి కప్పురం అద్దటం మోహనరూపుడైన ఆయన కొక కొత్త అలంకారంగా శోభిస్తున్నది . ఆనాటి పలుగును కూడా మనం ఆలయం పైన దర్శించవచ్చు ఇప్పటికీ .

ఆశ్రయించినవారి నెన్నంటి ఉండడం స్వామికెంతో ఇష్టం .


Read more...

మూడుకోట్లదేవతలు దేవదేవుని దర్శనానికై వస్తారు రేపు. మనం వెళదాం రండి

>> Sunday, December 27, 2009


తిరుపతి, భద్రాచలం వంటి వైష్ణవ దేవాలయ ఉత్తర ద్వారాలను మామూలు రోజుల్లో మూసే ఉంచుతారు. అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజున మాత్రం వాటిని తెరచి ఉంచుతారు. అందుచేత ఆ రోజున భక్తులు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి, శుచిగా స్నానమాచరించి విష్ణుపూజ చేయాలి.

ప్రముఖ వైష్ణవ దేవాలయాలలో ఉత్తర ద్వారం ప్రవేశించి ప్రదక్షిణలు ముగించుకుని, దైవదర్శనం చేసుకోవాలి. ముక్కోటి ఏకాదశిన ఇలా... ఉత్తరద్వార ప్రదక్షిణలు చేసుకునే వారికి సకల సంపదలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి.

ఇంకా చెప్పాలంటే... "పుత్రద" ఏకాదశి అని పిలువబడే ముక్కోటి ఏకాదశి రోజున ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం శుభప్రదమని పురాణాలు పేర్కొంటున్నాయి. పూర్వం "సుకేతుడు"-"భద్రావతి" అనే రాజదంపతులకు ఏకాదశీ వ్రతం ఆచరించడం ద్వారానే పుత్రసంతానం కలిగిందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుచేత ఆ రోజున శుచిగా, నిష్ఠనియమాలతో వ్రతమాచరించి విష్ణుమార్తిని కొలిచే వారికి కోరిన కోర్కెలు నెరవేరుతాయని విశ్వాసం.
ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని వేయికనులతో వీక్షించి, శ్రీహరిని సేవించి తరించాలని మూడు కోట్లమంది దేవతలు వైకుంఠమునకు చేరుకునే రోజే వైకుంఠ ఏకాదశిగా పరిగణించబడుతోంది. ఈ వైకుంఠ ఏకాదశి శనివారంలో వస్తే మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.

ముక్కోటి ఏకాదశి రోజున విష్ణు, వెంకన్న దేవాలయములకు వెళ్లి స్వామివారిని దర్శించుకుని విష్ణు అష్టోత్తరమును పఠించడం మంచిది. అదే రోజున సత్యనారాయణ వ్రతమును ఆచరించి విష్ణుమూర్తిని నిష్ఠతో పూజించే వారికి అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

ఆ రాత్రి నిద్రపోకుండా విష్ణు నిత్యపూజ, విష్ణు స్తోత్రమాల, విష్ణు సహస్రనామ స్తోత్రములతో పారాయణ చేయాలి. మరుసటి రోజు ఉదయం శుచిగా స్నానమాచరించి శ్రీహరిని పూజించి సన్నిహితులకు శుభాకాంక్షలు తెలయజేయడం శుభప్రదం.

విష్ణు సహస్ర నామ సోత్రమ్, విష్ణు పురాణం, సత్యనారాయణ స్వామి వ్రతము వంటి పుస్తకాలను ఫల, పుష్ప, తాంబూలాలతో స్త్రీలకు దానం చేయడం మంచిది. అదేవిధంగా ఏకాదశిన దేవాలయాల్లో విష్ణుమూర్తికి లక్ష తులసి పూజ చేయించేవారికి సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి.
వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠనియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశిన మరణించేవారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారికోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది.

అందుచేత వైకుంఠ ఏకాదశి dec28 రోజున ఉదయం ఐదు గంటలకే లేచి, శుచిగా స్నానమాచరించాలి. పూజా మందిరమును శుభ్రపరచి, గడపకు పసుపు, కుంకుమలు, తోరణాలు, ముగ్గులతో అలంకరించుకోవాలి. తలస్నానము చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజామందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు, కుంకుమ, చందనం వంటి సుగంధద్రవ్యాలతో అలంకరించుకోవాలి.

విష్ణుమూర్తి పటం లేదా విగ్రహం ముందు కలశమును పెట్టి దానిపై తెలుపు రంగు వస్త్రముతో కప్పి, టెంకాయ మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలి. పూజకు తామరపువ్వులు, తులసి దళములు ఉపయోగించాలి.

ఇకపోతే... వైకుంఠ ఏకాదశి రోజున జాజిపువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లైతే సర్వపాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత జాజిమాలను విష్ణుమూర్తి పటానికి వేసి, పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను నైవేద్యం సమర్పించి శ్రీహరిని స్తుతించడం శుభప్రదమని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేయడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. రెండు ఎర్రటి ప్రమిదలను తీసుకుని, తామర వత్తులతో పంచముఖ దీపారాధన చేయడం శుభప్రదమని పురాణాలు చెబుతున్నాయి. పూజ చేసే సమయంలో తూర్పుదిక్కున తిరిగి విష్ణుమూర్తిని పూజించాలి. దీపారాధనకు కొబ్బరినూనెగానీ, ఆవునేతిని గానీ ఉపయోగించడం ద్వారా మోక్షఫలము సిద్ధిస్తుంది.

నుదుట తిరునామము, మెడలో తులసి మాల ధరించి, "ఓం నమోనారాయణాయ" అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం. జపమునకు తులసిమాల వాడటం మంచిది. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన విష్ణుమూర్తికి పంచామృతములతో అభిషేకం చేయించే వారికి పుణ్యఫలములు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

ముక్కోటి ఏకాదశి రోజున శ్రీమన్నారాయణ హృదయం, విష్ణు సహస్ర నామము, శ్రీమన్నారాయణ స్తోత్రములతో విష్ణుమూర్తిని పారాయణ చేయడం శుభప్రదం. అదేవిధంగా విష్ణుపురాణములోని దశావతార అధ్యాయములను పఠించడం మంచిది. విష్ణు ధ్యానములు, విష్ణు సహస్రనామ పూజలు చేసి, విష్ణు, శ్రీ వేంకటేశ్వర ఆలయాలను దర్శించుకోవడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం

సకృదుచ్చరితం యేన హరిదిత్యక్షరద్వయం బద్ధ: పరికరస్తేన మోక్షాయ గమనం ప్రతి"

ఎవరైతే హరి అనే రెండక్షరాలను నిత్యం స్మరిస్తుంటారో వారు మోక్షానికి వెళ్ళేందుకు ప్రయాణ సన్నద్ధులై ఉంటారు.
[ఈసమాచారాన్ని అంతర్జాలం నుంచి webdunia numdi గ్రహించాను .వారికి ధన్యవాదములు



Read more...

చదువులలో వెనుకబడ్డ విద్యార్థులకోసం


ఓం ప్రణోదేవీ సరస్వతీ / వాజేభిర్వాజినీవతీ /ధీనా మవిత్ర్యవత్ .ఓం సరస్వత్యై నమ:

అంటూ చదువుల తల్లి సరస్వతీ దేవీని స్మరించుకుంటే విద్యార్థులకు బుద్ధిశక్తులు లభిస్తాయని పండితులు అంటున్నారు. దేవతలలో నదులలో శ్రేష్ఠులారైన సరస్వతీ దేవీని ప్రతి నిత్యం పై మంత్రాన్ని స్మరించుకునే వారు బుద్ధికుశలతతో జీవిస్తారని విశ్వాసం. అంతేగాకుండా అన్నప్రదాయినిగా, ధనప్రదాయినిగా శారదాదేవిగా భక్తులకు అండగా నిలుస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

అందుచేత విద్యార్థులు పరీక్షా సమయంలోనే మాత్రం కాకుండా ప్రతినిత్యం, శుచిగా స్నానమాచరించాలి. తర్వాత పూజగదిలోని సరస్వతీ దేవీ పటమో, లేదా విగ్రహాన్ని నిష్ఠతో పూజించి పై మంత్రాన్ని ఉచ్చరించినట్లైతే వాక్చాతుర్యతతో పాటు బుద్ధికుశలతలు దరిచేరుతాయని పండితులు అంటున్నారు.

మనిషికి మంచి మాటే అలంకారమని, మాటతోనే సర్వజగత్తు నడుస్తోందని, ఆ వాక్కుకు దేవత స్వరూపిణి అయిన సరస్వతీ దేవిని స్మరిస్తే సకల సంతోషాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

చదువులలో వెనుకబడ్డ విద్యార్థుల కు ఈ మంత్రజపం అద్భుతప్రయోజనాలనిస్తుంది .



Read more...

గొర్రెలు కసాయి వాడ్నే నమ్ముతాయట ,మనం మన నాయకులను నమ్ముతున్నట్లుగానే !

>> Thursday, December 24, 2009

వారెన్ మహాశయుడు ఒక మాటంటాడు ,ఈప్రపంచం తుడుచిపెట్టుకుని పోవటానికి ఈమూడింటిలో ఏ ఒక్క కారణమైనా చాలు అని. అవి.
1. ఎయిడ్స్ 2 అణుయుద్ధం 3. సరయిన నాయకత్వలేమి

నిజమే . అనాలోచిత నిర్ణయాలద్వారా రాష్ట్రాన్ని రావణ కాష్టం లామండిస్తున్న ఈ రాజకీయ నాయకులను వారి నాయకత్వ ప్రతిభను చూస్తే అణుబాంబులకంటే ఈ అసమర్ధ నాయకుల నాయకత్వమే మనకు ప్రమాదకరమని అర్ధమై పోతున్నది.
ప్రజలు నమ్మి తమను నాయకులుగా ఎన్నుకున్నది వెర్రిజనమని భావించారేమో గాని మనం మాత్రం అన్నింటికీ ఆవేశపడిపోయి ఆవిషయం నిజం చేస్తున్నాము లావుంది. కాంగ్రెస్ పార్టీ ఓట్లకోసం నాడు తెలంగాణా జపం అందుకున్నప్పుడు కోరస్ గా అదే పల్లవి ఆలపించిన అన్ని పార్టీలను అదరించాము . రాజకీయంగా మనుగడకోసం భావోద్వేగాలను రెచ్చగొట్టిన కేసీఆర్ ను అనుసరించి ఆస్తులు తగలెట్టుకుని,ఒళ్ళుకాల్చుకుని చావులు కొనితెచ్చుకున్నాము. మరి ఈ నాటకాన్ని ఖండించకుండా గోడమీద పిల్లుల్లా వున్న పార్టీ లకు ఈ లబ్ది చేకూరకూడదని కాంగ్రేస్ కుత్సిత వ్యూహంతో కనీస మర్యాదలు పాటించకుండా మన ముఖ్యమంత్రికి కూడా తెలియకుండా తెలంగాణా పై ప్రకటన చేయగానే సమైక్యాంధ్ర ఉద్యమంటూ రోడ్లెక్కి రచ్చరచ్చ చేసుకున్నాము .మన ఆస్తులు మనం తగలెట్టుకుని ఆవేశాలతో గుండెపోట్లు ,జాతికి కడుపులో గుణపాలు దింపుకుంటున్నాము. ఇంతలోనే అక్కడ ఇక్కడ రెండు దుకాణాలు మొదలెట్టిన తె.దే. పార్టి , హఠాత్తుగా సమైక్యాంద్రన్న చిరు చెయ్యేసి చేటంత చేయబూనుతున్నాడుసమస్యను ,అదితెలిసినా మనం అందరికీ జై అన్నాం ,కాంగ్రేసోల్లు అధికార ప్రతిపక్ష పాత్రలు రెండూ తామే పోషించాలని తహతహ లాడుతుంటె ఏది నిజమైన విధానమని ఏపార్టీని మనం ప్రశ్నించలేదు . మరలా ఇప్పుడు ఒకడు హైదరాబాద్ నిజాములదంటాడు .సమైక్యమంటూనే హైదరాబాద్ ఉమ్మడిదంటాడు. ఏమాట చెబితే ఆమాటకు జైఅంటున్నాము ,మరలా తెలంగాణ ను తగల బెట్టుకోవటానికి తయారయ్యాము. ఏమిటి నమ్మకం .ఎంతవరకు నమ్ముదామింకా . నమ్ముతాం ,తప్పనిసరిగా ఈ నాయకులనే నమ్ముతాం .ఎందుకంటే గొర్రె కసాయివాడ్నే నమ్ముతుంది .

Read more...

శని దోషాలు తొలగటానికి హనుమంతునికి ఈరోజు జరిపిన సింధూరాభిషేకం

>> Tuesday, December 22, 2009











శని గ్రహ సంచారం వలన జాతకం లో దోషాలు ప్రబలంగా ఉన్నప్పుడు , అందువలన వచ్చే కష్టాలను దాటటానికి ఒక మార్గంఉంది. మంగళ వారం రోజు హనుమంతుల వారికి సింధూరాన్ని నువ్వులనూనెతో కలిపి అభిషేకం జరిపితే దోషాలు సులభంగా తొలగి పోతాయి . శనీశ్వరులవారే ఆంజనేయునికిచ్చిన వాగ్దానమిది. నీ భక్తులు మంగళవారం రోజు నువ్వులనూనెతో సింధూరం కలిపి నీకు అభిషేకం జరిపితే నా సంచారం వల్ల కలిగేదోషాలు వాళ్లనేమీ చేయకుండా నేను అనుగ్రహిస్తాను ,అని ఆయన ఒక సందర్భం లో హనుమంతునికి మాత ఇచ్చారట.

ఎప్పుడూ చిరునవ్వుల వెలుగులు చిమ్మే ఓ భాస్కరునికి ఈమధ్య కొద్దిగా మబ్బులు అడ్దువస్తున్నాయట , శని ప్రభావం వలన . ఆయన కోసం ఈ రోజు స్వామికి చాలీసా సహితంగా ఇలా సింధూరాభిషేకము జరిపాము .

Read more...

ఇలాచేస్తే రాష్ట్రం లో ప్రస్తుత సమస్య సులభంగా పరిష్కరించబడొచ్చు.

>> Sunday, December 20, 2009


ఓట్లకోసం ఎన్నికలప్పుడు వేర్పాటువాదాన్ని లేవనెత్తిన వాళ్లను,దానిని సమర్ధించినవారిని ,ఇప్పుడు తెలంగాణా అని ,సమైక్యాంధ్ర ఉద్యమాలని జనాన్ని రెచ్చగొడుతున్న సదరు రాజకీయనాయకులందరినీ కట్టగట్టి రాష్ట్ర ప్రధాన రహదారులపై పనుకోబెట్టి 1. లారీడ్రయివర్లకు వీళ్ళ సంగతి చూసుకోండని చెప్పడం 2. బస్సులు తగలెట్టొద్దుబాబూ మా నోటికాడికూడు పోద్దిఅని వేడుకుంటున్నా ఆర్టీసీ డ్రైవర్లకు ఈసమస్య ఇకముందు రాకుండా ఏంచేయాలో చేయండని చెప్పటం . ౩. ముందుగా రెక్కాడితేగాని్ డొక్కాడని జనమంతా గలసి ఈ రాక్షసీయుల ఇళ్లలో వంటగదులు తెరవకుండాచూసి వీళ్లవాహనాలన్నీ తగలబెట్టడం ,వీళ్లందరినీ థార్ ఎడారిలో పండుకోబెట్టిరావటం.

పనిలో పని ముందు తెలంగాణా ఉద్యమం ఆహా.. ఓహో... అంటూ పొగిడి రెచ్చగొట్టి ,మరలా సమక్యాంధ్ర ఉద్యమం అదిరిపోతుంది భూమి దద్దరిల్లుతూ ఉందని ,రెచ్చగొడుతూ ఏవాదమో తెలియకుండా వార్తలు వ్రాస్తున్న పత్రికలవాళ్లను ,టీ వీ ఛానల్ వాళ్లను కూడా వీళ్లతో కలపండి పీడా వదలిపోతుంది.

Read more...

ప్రసాదానికి కూడా ప్రాంతీయ వాసనలా !? ముదిరిపోయిన మూర్ఖత్వం .

>> Saturday, December 19, 2009

మూర్ఖత్వం ముదిరితే మనిషి ఆలోచనలెలా దిగజారతాయో ఇప్పుడు జనం లో పెరుగుతున్న పట్టుదలలు వివేకం లేని వాదలను చూస్తుంటే తెలుస్తోంది .
మొన్న భవానీ దీక్షల సందర్భంగా విజయవాడలో తయారు చేసిన ప్రసాదాలను రాష్ట్రం లో ఆరు ప్రధాన దేవాలయాలకు పంపారు .అందులో వేములవాడ కు పంపిన ప్రసాదాలను అవి ఆంధ్రా ప్రాంతాన్నుంచి వచ్చాయి కనుక ఈ ప్రసాదాలు మాకొద్దని తిప్పి పంపారట. అమ్మవారికి ఈ ప్రాంతీయ తత్వాలు ఆపాదించవద్దని ఆలయ ఈ వో ప్రాధేయ పడ్దాడని వార్తలొచ్చాయి.

అమ్మవారు జగన్మాత అని విన్నామేగాని ఇలా ఆంధ్రావాళ్లకో .తెలంగాణా వాల్లకో ,ఏహిందీవాళ్లకో ,అరవ వాళ్లకో మాత అనే మౌఢ్యపు మాటలు ఇప్పుడే వింటున్నాము . భగవంతున్ని కూడా మని ఇష్టాఇష్టాలతో ప్రమాణికరించే తత్వం కలిపురుషుని ప్రభావం తో పెరుగుతున్నది ,మనుషులలో . రంగులు మారుతున్న రాజకీయారణాలు భౌతిక విషయాలు .అవి ఆథ్యాత్మిక విషయాలకు ఆపాదించవచ్చా. ఆసద్వివేకాన్ని పెంపొందించుకోవాలి మనం. ఇలా భగవత్ ప్రసాదాన్ని తిరస్కిరించటం దోషమవుతుంది . జగన్మాత ప్రసాదాన్ని తిరస్కరించి అవమానించి కష్టాలు కొనితెచ్చుకున్న చరితములు మనం చదువుకున్నాం . లోకమంతటికి తల్లి ఆజగన్మాత మా అవివేకాన్ని మన్నించి లోకాన్ని రక్షించమని వేడుకుంటున్నాము .

Read more...

బంగారు కొండ

>> Friday, December 18, 2009



బంగారు కొండ

Read more...

ధనుర్మాస పూజల విశిష్టత

కురువృద్ధుడు భీష్ముడు అంపశయ్యమీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు ఆగి ఆ పుణ్యకాలం వచ్చాకే మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. దేవతా పూజలకు ధనుర్మాసం విశిష్టమైంది. అందుకే ఈ మాసంలో ధనుర్మాసంలో శుభకార్యాలను పక్కన బెట్టి దేవతలను పూజించాలని పండితులు అంటున్నారు. దేవతలతో పాటు కృష్ణభగవానుడికి ప్రీతికరమైన ఈ ధనుర్మాసం పూర్తిగా ఆ భగవానుడిని స్మరిస్తూ పూజ చేసే వారి అభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం. ఇంకా పెళ్లికాని కన్యలు ధనుర్మాసంలోని 30 రోజులు దీక్షతో ఆ దేవదేవుడిని ప్రార్థిస్తే గుణవంతుడైన భర్తను పొందవచ్చునని పురోహితులు చెబుతున్నారు. అందుచేత ఈ మాసం పూర్తిగా విష్ణుమూర్తిని ప్రార్థించి ఆయన అనుగ్రహం పొందుదుము గాక..!

Read more...

మిత్రపుత్ర,కళత్ర శతృత్వ కారకాయై నమ:

>> Wednesday, December 16, 2009


మిత్ర,పుత్ర,కళత్ర శతృత్వ కారకాయై నమ:
______________________________________

పై నామాన్ని మీరెప్పుడో పూజలో వినిఉంటారు కదా ? ఇది శనీశ్వరుని అష్టోత్తరశతనామావళి లో ఒకటి . ఏమిటయ్యా ఈ నామానికి అర్ధం అంటే .ప్రాణ స్నేహితులనైనా ,కడుపున పుట్టిన పుతృనితోనైనా .చివరకు కట్టుకున్న భార్యతోనైనా విబేధాలు తెచ్చి శతృత్వం కలిగించగల స్వామి అని నమస్కరించటం.

ఇటువంటి నామాన్ని జపించటమెందుకు? అలాంటివారిని పూజించటమెందుకు ? అని మీరు కోపపడవచ్చు. కానీ విశ్వసృష్టి పాలనా ధర్మాన్ని పాటించే శక్తులే నవగ్రహ దేవతలు . మనం కావాలనుకున్నా ,వద్దనుకున్నా వారి ధర్మం వారు నిర్వర్తించవలసినదే. కర్తవ్య బద్ధులు . కాబట్టి వారివారి సంచారం జరిగేప్పుడు ఆయా ఫలితాలను ఆజీవులకు అందిస్తుంటారు. బాగా బలవంతునితో విరోధం పెట్టుకోవటం కంటే మిత్రత్వం నెరపి ,అతని గుణగణాలను పొగడి ఆతని బారినుంచి కొద్దిగా తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి కదా సాధారణ జీవనం లో. కాబట్టే నవగ్రహ పూజలు శాంతులు . గర్వించి తమ బలాలమీద ఆధారపడినవారికంటె దైవాన్నాశ్రయించిన వారిపైన వారి విరోధభావం అంతగా ఉండదు.
శనీశ్వరుడు ఆథ్యాత్మిక భావాలను పెంపొందించేవాడు ,మంచి చూపులలోఉన్నప్పుడు అధికారాన్ని సహితం ప్రసాదించగలవాడు. అయితే వక్ర దృష్టి సమయం లో మాత్రం పైన చెప్పినవిధంగా నానాయాతనలు పెట్టి విరోధాలు కల్పించి ఆ జీవి ఖర్మ ఫలితాలను అనుభవింపజేస్తాడు .

ప్రస్తుతం మన రాష్ట్ర విషయానికొస్తే .ఇది ఏర్పడ్డ సమయము చిత్తా నక్షత్రము .కన్యారాశికి చెందిన నక్షత్రమిది .ఇప్పుడు కన్యారాశిలో శని సంచారం జరుగుతున్నందున .అన్నదమ్ములమధ్యే కత్తులు నూరుకునే కర్కశత్వం పెరుగుతున్నది. అదిగాక ఇది విరోధినామ సంవత్సరం లేస్తే తగాదాలే. సంవత్సరం మొదటినుంచి కూడా .
ఈసమయం లో భగవంతుని ఆశ్రయించి భగవత్ కృపను పొందే యత్నం చేయటం మానవుని విధి. తద్వారా ఈ ఆటంకాలు అధికమించవచ్చు. వచ్చే ఫిబ్రవరిలో కుజస్తంభన యోగము కూడా ఉన్నందున మరొక సారి ప్రకృతి విలయం చూడవలసి రావచ్చని జ్యోతిషవేత్తలు హెచ్చరిస్తున్నారు.
కాబట్టి భగవంతునికి శరణాగతులవ్వటం అత్యవసరం . కనుకనే శ్రీపీఠం ఉగాది మొదలుగా హనుమత్ రక్షాయాగమ్ జరిపినది.

ప్రస్తుతము వ్యక్తిగతంగాను .సామాజికంగాను శ్రేయస్సు కలగటానికై "నారాయణ శరణాగతి " యాగమును నలభై రోజులపాటు జరిపి లోక కళ్యాణార్ధం శ్రీవారి కళ్యాణం కూడా జరుపబూనాము. మీరందరూ మీమీ గోత్రనామాలను పంపి ఈ యాగములో పాల్గొని మంత్రజపం ,పారాయణం చేయాలని తద్వారా మీ వ్యక్తిగత జీవితం లోను ,సామాజిక జీవితం లోను కలుగుతున్న అలజడులు తొలగి సర్వత్రా శాంతి స్థాపన జరిగేందుకు సహకరించాలని కోరుతున్నాము

నారాయణ యాగం వివరాలు ఇక్కడ చూడండి
http://durgeswara.blogspot.com/2009/12/blog-post_15.html

Read more...

"శ్రీమన్నారాయణ శరణాగతి" యాగం లో పాల్గొనండి .ప్రస్తుతం సమాజంలో ,జీవితం లో సంభవిస్తున్న ఉపద్రవాలను నివారించండి

>> Tuesday, December 15, 2009


శ్రీరామ
------

నారాయణ శరణాగతి యాగం
****************************

పుష్య శుద్ద విదియ [18/12/2009] నుండి మాఘశుద్ధ ఏకాదశి[26-01-2010] వరకు

సంకల్పం :సమాజ శ్రేయస్సు,వ్యక్తి శ్రేయస్సు పరస్పరాశ్రయాలు కనుక రాష్ట్రం లో నెలకొన్న అలజడులు .ఉత్పాతాలు శమించాలని,ధర్మ బద్ధమైన అందరి ఆకాంక్షలు నెరవేరాలి. . వ్యక్తిగతం గా జీవితం లో వచ్చే అవరోధాలన్నీ తొలగి ,ఆపదలనుండి ప్రస్తుత విపత్కర పరిస్థితులలో హరిపాదముల నాశ్రయించినవారందరూ రక్షణ పొందాలి .లోకమంతటా ఆసురీ శక్తుల విజృంభణ అణచివేయబడి అందరికీ శాంతి సౌభాగ్యాలు ప్రసాదింపబడాలి. జ్యోతిషశాస్త్రకారులు హెచ్చరిస్తున్న ఫిబ్రవరిలో సంభవించనున్న కుజస్తంభయోగము వలన ఏ ఉత్పాతాలు జరగకుండా ఎవరికీ కీడు జరగకుండా తొలగిపోవాలి.


సాధనా విధి

౧ మంత్రం : ఓం నమో నారాయణాయ

{ ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లకు తక్కువకాకుండా జపించాలి}శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రపటం,మూర్తి ముందు కూర్చుని చేయటం శుభకరం యాగకాలం లో ప్రతి వ్యక్తికి లక్ష జపం చేస్తే విశేష ఫలితం ఉంటుంది .

లక్ష్మీ అష్టోత్తరాలతో కలిపి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం రోజుకొకపరి సాగించాలి.

నియమములు :లోక కల్యాణము కొరకై చేయువారు నిత్యం ఉదయం స్నానానంతరం జపం చేయాలి . [మద్యమాంసాదులు వర్జిస్తే శక్తివంతంగా సాగుతుంది]
వ్యక్తిగతంగా ప్రత్యేక కోరికలతో చేయువారు నియమములు పెంచుకొని సాగించాలి .ఏ బేధములు లేకుండా మానవులందరు జపించి తరించగల మంత్రరాజము కనుక ప్రతి ఒక్కరు జపించవచ్చు.

ఫలం : కుటుంబం లో ,జీవితం లో ,సమాజం లో సంభవించే అలజడులు ,ఆటంకములు తొలగి శ్రీవేంకటేశ్వరుని పరి పూర్ణానుగ్రహానికి పాతృలవుతారు .సర్వత్రా స్వామివారి రక్షణ కలుగుతుంది. సమాజం లో అలజడులు వ్యక్తిశ్రేయస్సుకు అపాయం కనుక లోకములో శాంతిని చేకూర్చగల యాగమిది.
సామూహికంగా జపించటం లక్షజపసంఖ్య పూర్తయినచోట అష్టాక్షరీ మంత్రజప హోమం జరుపుకొనుట మిక్కిలి శుభప్రదము.
----------------------------------------------------------------------------------------------------------------------------------------
ఈ కార్యక్రమములో పాల్గొనువారు తమ గోత్రనామాలను durgeswara@gmail.com నకు పంపటం ద్వారా
,శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠములో శ్రీవారికి జరిగే సేవలలో .,యాగం జరిగే నలుబదిరొజులలోను.సంకల్పంగా చెప్పబడతాయి
ది 25-01-2010 పూర్ణాహుతి, .శ్రీవేంకటేశ్వర స్వామివారి కళ్యాణం 26-01-2010 Saamthi poojalu జరుపబడతాయి.
ఈకార్యక్రమాలన్నింటా మీతరపున కూడా సేవలు జరుగుతాయి.


అలాగే సమీపములోగల దివ్యక్షేత్రాలలో,దైవస్థానాలలో సామూహికంగా పారాయణము ,జపము ,హోమము జరుపుకొనుట అత్యంత శీఘ్రఫలములనొసగుతుంది .ఆయా క్షేత్రములలో కార్యక్రమాలు జరపాలని ఆసక్తి ఉన్నవారు మమ్మల్ని సంప్రదిస్తే మీకు విధివిధానాలను తెలియపరచటం వీలైన చోట్లకు వచ్చి మీ తో పాలుపంచుకోవటం జరుగుతుంది. యజ్ఞయాగాదులు పారయణాదులవల్ల ఆచుట్టుపట్ల ఉన్న వారందరి హృదయాలలో ప్రేమపూరిత భావాలు పెరుగుతాయి .ఇది సత్యం . పెద్దగా అర్ధికభారం లేకుండా కార్యక్రమాలను శాస్త్రీయంగా జరుపుకునే విధానం సూచిస్తాము కనుక ఎక్కువమంది ఈ కార్యక్రమాలను మీ ప్రాంతం లో చేపట్టాలి. వ్యక్తిగతంగా మీ సాధనతో పాటు సామూహికంగా చేసే ఈ కార్యక్రమాలు సమాజ శ్రేయస్సుకు ఎంతో అవసరం.{ 27 మంది వృత్తాకారం లో కూర్చుని జపించిన చోట మాహాశక్తివంతమైన దైవానుగ్రహతరంగాలు ప్రసరిస్తాయి అన్ని వైపులకు}

అలాగే ఇక్కడ పీఠం లోను ,మీప్రాంతం లోనూ జరిగే ఈ సత్కార్యాలకు మీకు తోచిన విధంగా సహాయం అందించగలరు. యజ్ఞ ద్రవ్యాలు ,పూజాద్రవ్యాలు , ఇతర సహాయాలు అందించటానికి సహృదయులైన మీరందరూ ముందుకు రావాలని ప్రార్ధన . దేవుని పెళ్ళికి అందరూ పెద్దలే కనుక మీరంతా ఈ కార్యక్రమాన్ని మీకుసాధ్యమయినంత ఎక్కువమందికి అందించగలరు . పారాయణాదులు చేయలేని వారికి అష్టాక్షరీ మంత్రాన్నైనా జపించమని సూచించండి. అసురశక్తుల విజృంభణ వేళ ,నారద,ప్రహ్లాద.ధృవ,అంబరీషాది భక్తులు జపించి లోక కళ్యాణము జరిపిన మంత్రరాజమిది . గురూపదేశము లేకున్నా జపించిఫలాన్ని పొందగల మంత్రమని లోకమంతటికీ శ్రేయస్సు కలగాలని సద్గురువులు రామానుజాచార్యులు లోకానికి బహిరంగం చేసిన మహామంత్రము.






Read more...

చేతులెత్తి మొక్కుతూ ":తెలుగుజాతికొక వేడికోలు"

>> Monday, December 14, 2009

శ్రీరామ
_______

తెలుగుజాతి కొక విన్నపము. ప్రస్తుతకాలము రాష్ట్రానికి కష్టకాలము. జనజీవితములో తీవ్ర ఆందోళనలు పెరిగి అంతటా అభద్రతా భావాలు పెచ్చురిల్లి అశాంతి రేకెత్తుతున్నది. రాష్ట్ర అవతరణమే "చిత్తా" నక్షత్రములో జరిగినది .ప్రస్తుతము ఆ నక్షత్ర రాశి యగు" కన్య"లో శని సంచారం వలన ఉత్పాతాలు పెచ్చురిల్లితున్నాయని పెద్దలు చెబుతున్నారు. అన్నదమ్ముల మధ్య పరస్పర అనుమానాలు , రేకెత్తి కత్తులు దూసుకునేస్థితి కొస్తున్నారు.అంతటా ఆవేశకావేశాలు పెరుగుతూ భయాందోళనలను కలిగిస్తున్నాయి.

ఈసంవత్సరము ప్రారంభం లోనే విరోధి నామ సంవత్సరం లో ఇటువంటి ఉత్పాతాలు జరగనున్నాయని హెచ్చరించి భక్తజన రక్షణార్ధం ఏబది నాలుగురోజులపాటు [ఉగాదిమొదలుగా ]" హనుమత్ రక్షాయాగం" నిర్వహించుట జరిగినది. ఇందు పాల్గొన్నవారికి వచ్చిన ఫలితాలు తెలుసుకుంటున్న కొద్దీ భగవంతుని కృపపైన మాకు అనన్యమైన శ్రద్దను పెంచినది .
ఆరోజు హెచ్చరించిన విషయాలు వరుసగా ఒక్కొక్కటి వాస్తవానికొస్తూ లోకానికి హానికారకంగా మారుతున్నాయి. రానున్న కాలంలో జరగబోయే అనర్ధాలనుండి జాగ్రత్తపడమని సూచించటానికై అపారకరుణతో మన మహర్షులు మనకు ప్రసాదించిన విజ్ఞానసంపద జ్యోతిష శాస్త్రము సహాయముతో ఈ హెచ్చరికలను పెద్దలు పంచాంగ కర్తలు తమ బాధ్యతగా లోకానికి తెలియజేశారు. అయితే జ్యోతిషశాస్త్రము హెచ్చరిస్తుంది . ప్రమాదం నుంచి తప్పించుకునే పురుషప్రయత్నము మానవుని బాధ్యతే. ఉన్న విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటామో లేక అపహాస్యం చేసుకుని మన అవివేకాన్ని వంద సిద్దాంతాలతో కప్పిపుచ్చుకుంటామో మన ఇష్టం .

ఇక ప్రస్తుత తరుణం లో కలిపురుషుని ఇనుపగజ్జెల పదఘట్టనలతో పుడమి దద్దరిల్లుతున్నది. అనేకానేక ఉత్పాతాలు ,వివాదాలతో జనం పరస్పరం కలహించుకుంటూ తమ సంపదలను శాంతిని తామే ధ్వంసం చేసుకుంటున్నారు. అదితప్పో, ఒప్పో ఆలోచించుకోలేని ఓ ఉన్మాదస్థితి .కారణం యోచనాజ్ఞానాన్ని కప్పేసిన ఆవేశం. దానిని పెంచుతున్న కలిపురుషుని సైన్యం. పవిత్ర దైవస్థలాలలో మనం చేస్తున్న అపచారాలు కలగలసి ఈ అశాంతి కి కారణ మవుతున్నాయి. మనసులలో కలహప్రియత్వం పెరుగుతున్నది. దీనికి సైదోడుగా ఆసురీ శక్తులు రాజకీయరాక్షసక్రీడలాడుతున్నాయి , ఇందులో ఏప్రాంతం మినహాయింపు కాదు .

ఈసమయం లో భగవంతుని ఆశ్రయించటం వినా గత్యంతరం లేదు. ప్రస్తుతం రాష్ట్రప్రజలలో నెలకొన్న విబేధాలు సమసిపోవాలని . పరస్పరం ప్రేమభావాలతో తమందరికీ సరిపడే నిర్ణయాలను తీసుకోవాలంటే అందరిలోనూ ప్రేమ,సౌహార్ధభావాలు వెల్లి విరియాలి .అందుకు భగవన్నామమే సరయిన మందు . కనుకనే అందరి మనసులూ కలవాలని అందరికీ శాంతి సౌభాగ్యాలు కలగాలని ,అందరి ధర్మబద్ధమైన ఆకాంక్షలు నెరవేర్చాలని కోరుతూ భగవత్ అనుగ్రహం కొరకై ఒక శాంతిక్రతువును నలభైరోజుల పాటు నిర్వహించాలని సంకల్పం చేస్తున్నాము. ఇది ఒక్కరి సంకల్పంతో సాధ్యంకాదు. చినుకు ,చినుకు వాగులై వంకలై ,నదులై మహోన్నతోత్తుంగతరంగప్రవాహం గాసాగినట్లు మీ అందరి సంకల్పాలను ,సాధనలను అనుసంధానం చేస్తూ క్రతువు నిర్వహించాలని ప్రయత్నము . లోకకళ్యాణమునకై సంకల్పిస్తున్న ఈ యాగమునకు మీ అందరి సహాయ సహకారములను అందించాలని వేడుకుంటున్నాము. యాగవివరాలన్నింటినీ మీకు ఇక్కడ అందిస్తాము రేపు ఎల్లుండి లోపల. దయచేసి గమనించండి ఇది జాతికందరికీ ముఖ్యంగా తెలం"గాన"మైనా ఆంధ్రరాగమైనా అందరి క్షేమం కోసం సాగుతున్నందున రంధ్రాన్వేషణ చేయవద్దని చేతులెత్తి మొక్కుతున్నాము.

భక్తజనదాసదాసానుదాసుడు

దుర్గేశ్వర




Read more...

దేవుడా ! రక్షించు ఈ దేశాన్ని.......................

>> Friday, December 11, 2009



చరిత్ర గుర్తులేని జాతి జనం మధ్య చిచ్చుపెట్టటం ఎంత తేలిక !? జాతిని విభజించటమెలాగో తెలిసిన మాకియవెల్లి వారసత్వగుణాలుగల విదేశీ శక్తుల కుటిల క్రీడలెంత తేలికగా కొనసాగుతున్నాయో ఏ మాత్రం ఆలోచించుకోలేని యువత ఈరాక్షస క్రీడకు బలయిపోతున్నది . ఎక్కడాలేని నీతి,రీతి మనం చూస్తున్నాం. మా బస్సులు ఆస్తులు మేం తగలెట్టుకుంటాం ,రేపు అడుక్కుతింటాం అనేచందంగా ఈ ఉద్యమకారులనబడె మౌఢ్యంతలకెక్కిన ఉన్మాదపు గుంపు దురాగతాలకు పాల్పడుతుంది. తమ చర్యలకు పరిణామాలేంటో ఏమాత్రం యోచనా జ్ఞానం లేని మేధావుల కుంచితపు ఆలోచనలతో
మారణహోమం రగుల్కొంటున్నది. అసలు వీల్ల లక్ష్యమే దేశాన్ని బలహీనపరచి ఆక్రమించాలనే విదేశీ శక్తుల కుట్రలకు ఇతోధికంగా సహకరించటమేనని అనిపిస్తున్నది.
ఇక ఈ జాతిని రక్షించటానికి భగవంతుడు తప్ప వేరు దిక్కులేదేమో ?
జనం అభిప్రాయానికి విలువనిచ్చి విభజనకు మద్దతిస్తామని , మరలా విభజన వద్దని రెండు నాలుకలతో మాట్లాడే నాయకులు
తెలంగాన ఉద్యమం గూర్చి గోరంతను కొండతలుగా చేసి చూపి రెచ్చగొట్టిన పత్రికలే .మరలా సమైక్యాంధ్ర ఉద్యమం గూర్చి మరింత రెచ్చగొట్టెలా వార్తలు ప్రసారం చేస్తున్నాయి. వీటి తీరేమిటో ? ఉద్దేశ్యమేమిటో ,వీరి వెనుకున్నదెవరో ? ఆలోచించే శక్తి ఉద్రేక పూరిత మనస్కులకు ఉండదు . కాబట్టి వీల్లకెదురు ఉండదు.

మన చదువులు మనవి కాకపోయె ! మన భూములు మనవి కాకుండా పోతుండె ! మన సంపదలు మనవి కాకపోయినా పరవాలేదు గాని మన మనసులు . ఆలోచనలు కూడా మనవి కాకుండా పోతున్నాయి
.దేవుడా ! రక్షించు ఈ దేశాన్ని మా మూర్ఖత్వపు ఆలోచనలనుండి. అమ్ముడు పోయిన మా జాతి నాయకుల పైశాచిక ,స్వార్ధపూరిత యోచనలనుండి .

Read more...

దేనిని ఎక్కడ ఉంచాలో పరమాత్మకు తెలియదంటారా !?

>> Thursday, December 10, 2009

ఓసారి ఒక మనిషి బాగా ఎండకు ప్రయానం చేస్తున్నాడు .బాగా మధ్యాహ్నానికి ఒక మర్రి చెట్టు నీడలో చేరి అలసి పోయి చెట్టుక్రింద విశ్రాంతి తీసుకుంటున్నాడు . ఆపక్కనే బాగా అల్లికున్న గుమ్మడి పాదు కూడా ఉంది. కాస్తాగి చెట్టును పరిశీలిస్తూ నవ్వుకుంటూ ఇలా అనుకున్నాడు .భగవంతుడు సృష్టి కర్తేగాని ఆయనకు బొత్తిగా లోకజ్ఞానం లేదు. అంతా అవకతవక సృస్టి . ఇంత పెద్దమర్రి చెట్టుకు ఇంత చిన్నకాయలా ?! నిలబడటమే కుదరని గుమ్మడి కి అంత పెద్దకాయలా !? ఇవి దానికి ,అవిదీనికి కదా ఉండాల్సినది ! ఈమాత్రం కూడా తెలియకపోయెనే అని ఎగతాళిగా నవ్వుకున్నాడు. అలసి పోయి ఉండటాని కాస్తంత కునుకు తీశాడు . మెలకువ వచ్చి చూసేసరికి తనమీదా చుట్టూతా మర్రి కాయలు పడివున్నాయి. ఇవే గుమ్మడికాయంత సైజు లో ఉంటే అన్న ఆలోచన వచ్చేసరికే గుండె గుభేల్ మన్నది. చెంపలు వాయించుకుని . తండ్రీ ! ఎక్కడ ఏది వుంచాలో సర్వం తెలిసిన పరమాత్మవు . నీసృష్టి నే ఎగతాళి చేశాను. ఎంత అపచారం . నన్నుక్షమించు ప్రభూ అని ప్రార్ధించాడు.


Read more...

ఇండియన్ నయాగరా.. ఔషధీ జలపాతం "హొగెనక్కల్

>> Monday, December 7, 2009




భారతదేశం లో ప్రతి అణువూ ఒక ప్రత్యేకత కలిగి ఉన్నదే .ఒక్కో చోట ఒక్కో విశేషం ఆప్రాంత ప్రాధాన్యతను తెలుపుతూ ఉంటుంది . దర్శించ గలిగితే పరమాత్మ లీలా విభూతులన్నీ ఈ పుణ్యభూమిలో ప్రత్యక్షంగా అనుభవానికొస్తాయి. అందుకే మన పెద్దలు తీర్ధ యాత్రలకు అంత ప్రాధాన్యతనిచ్చారు .

ఇండియన్ నయాగారా పేరొందిన ఔషధీయ గుణాలు కలిగిన ఒక జలపాతాన్ని దాని వివరాలను తెలుసుకోవాలనుకుంటే
ఇక్కడ చూడండి

http://telugu.webdunia.com/entertainment/tourism/mountains/0911/28/1091128048_1.హతం



Read more...

విదేశాలలో ఆలయాలెలా వున్నాయో ! దర్శించండి ఇక్కడ

>> Sunday, December 6, 2009


Arulmigu Sri Raja Kaliamman Temple, Johor Baru, Malaysia - The only Hindu Glass Temple abroad

Sri Srinivasa Perumal Temple or Sri Perumal Temple, Little India, Serangoon Road, Singapore


Sri Prasanna Venkateswara Swami Temple, Memphis, Tennessee, US

Quad City Hindu Temple , Rock Island, IL, US

Sri Murugan Temple, London, UK

Shiva - Vishnu Temple of Melbourne, Melbourne, Australia


Shiva Vishnu Temple of South Florida Inc, FL, US


Sri Venkateswara Swami Temple, Pittsburgh, US


Sri Lakshmi Temple - Ashland, MA, US


Sri Venkateshwara Temple - New Jersey, US


Ekta Mandir, Irving, Texas, US


Sri Meenakshi Devasthanam - Pearland, Texas, US



Velmurugan Gnana Muneeswarar Temple, Rivervale Crescent Sengkang, Singapore



Sri Venkateswara Swami Temple, Helensburgh, Sydney, Australia



Venkateswara Swami temple, Riverdale near Atlanta, Georgia, US



Murugan Temple, Sydney, Australia



Mother Temple of Besakih, Bali, Indonesia


Sri Venkateswara Temple, Bridgewater, NJ, US


Sri Murugan Temple “Batu Caves”, Penang, Malaysia


BAPS Shri Swaminarayan Mandir, London (Neasden Temple), United States


Sri Siva Vishnu Temple, Washington DC, United States



BAPS Shri Swaminarayan Mandir - Toronto, Canada


Prambanan Shiva Temple, Central Java, Indonesia


Lord Vishnu Temple, Angkor, Cambodia


Shiva-Vishnu Temple, Livermore, California, US


Malibu Hindu Temple, Malibu, California, US


Lord Venkateshwara Temple, Birmingham, United Kingdom



మన దేశంలో హిందూ మతానికి జరుగుతున్న అవమానానికి గుర్తుగా మన గుళ్ళని నాశనం చేస్తూ ఉంటే పాశ్చాత్య దేశాల్లో వాటిని ఎలా వృద్ధి చేస్తున్నారో చూడండి.అందుకే ఆ దేశాలకు పురోగమనం మనకు తిరోగమనం జరుగుతున్నాయేమో అనిపిస్తోంది.

ఒకా ఊరు పాడవడానికి ఆ ఊరి గుడి స్థితిగతులు కారణం అన్న మాట నిజమే అనిపిస్తోంది.







Read more...

మతిమరపు జబ్బు వదిలించే దానిమ్మపండు

>> Friday, December 4, 2009



ఆయుర్వేదంలో ప్రస్తావించిన వాత, పిత్త, కఫ గుణాలను దానిమ్మ నియత్రిస్తుంది. దానిమ్మ వేరు, కాండాలలో రోగ నిరోధకశక్తిని పెంచే గుణాలున్నాయి. దానిమ్మ పువ్వులు దంతాలకు మేలు చేస్తాయి. దానిమ్మ పండును తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాక గుండె జబ్బులను నివారిస్తుంది.

డయేరియా సమస్యతో బాధపడేవారు దానిమ్మ రసాన్ని తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ప్రొస్టేటు క్యాన్సర్ నివారించడానికి దానిమ్మ రసాన్ని ఉపయోగిస్తారు. రక్తం గడ్డకట్టకుండా నివారించే ఆస్పిరిన్‌లో ఉన్న లక్షణాలన్నీ దీనిలో ఉన్నాయి.

తరచుగా దానిమ్మ పళ్లను తీసుకునేవారిలో మతిమరుపు సమస్య తలెత్తదు. చక్కని జ్ఞాపకశక్తిని కలిగి ఉంటారు. చర్మ సౌందర్యానికి కావలసిన మాయశ్చరైజర్‌గా దానిమ్మ నూనె ఉపయోగపడుతుంది. వాపులు, నొప్పులు పోగొట్టడానికి దానిమ్మ నూనెను విరివిగా ఉపయోగిస్తారు.


Read more...

స్వామీ ! నిన్నిలా చూస్తుంటే ...చాలనిపిస్తున్నది ఈ జన్మకు

















Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP