శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఇప్పటి ఆథ్యాత్మిక సాధనలలో ఇదో అమాయకత్వం

>> Thursday, August 27, 2009

ఆథ్యాత్మిక లోకంలో ఇదొక అమాయకత్వం


అథ్యాత్మిక సాధనలో వున్నాము అనుకుంటున్న కొందరు తమస్వధర్మాని విమర్శించడమనే అమాయకత్వాన ఇహపరశ్రేయస్సులను ఎలా కోల్పోతున్నారో ఈ ఉదాహరణ చూడండి.

నేనొక సంవత్సరం క్రితం వినుకొండలోనున్న రంగారెడ్దిగారు అనే తెలిసివారి ఇంటికి వెళ్ళాను. వాల్లబ్బాయి రమణారెడ్డి ఇంటర్మీడియట్ లో మాక్లాస్ మేట్ అవటం వలన మేము చదువునేప్పుడు మారూమ్ కూడా వారింటికి దగ్గరవటం వలన రమణ వాల్ల అమ్మగారితో మాకుకూడా స్వంతఇంటిలో పిల్లలాగా చనువెక్కువ. ఆమె అమ్మవారి భక్తురాలు .ఆవిడకూడా నవరాత్రులప్పుడు కలశస్తాపని చేసి పూజలు నిర్వహించుకుంటూంది. ఆయనకూడా బ్రతికివున్నరోజులలో హనుమద్దీక్షతీసుకునేవారు. నేను వెళ్ళేసమయానికి వాల్ల కోడలు క్రిందగదిలో వున్నది,ఆమ్మా! అత్తయ్యఎక్కడికెళ్ళినది? అని అడిగాను. ఇప్పుడొక కొత్త సత్సంగం ప్రారంభించారన్నయ్యా ! మీకు తెలియదా .అత్తయ్య ఇప్పుడు మనపూజలు అవీ వదిలేసి ఆసత్సంగం చేస్తున్నారు పైన మేడమీద గదిలో వాళ్లంతావున్నారు ,వాల్ల సంస్థతరపున ఒకాయన గుంటూరునుంచి వచ్చి వున్నారు పైకెల్లు అని చెప్పినది. నాకనుమానం వచ్చి అవునమ్మా ! నువ్వెళ్లలేదేం అనడిగాను .నాకు ఈగుడ్దలుత్రుక్కోవటం వంతచేసుకోవటం తీరికలేదు .ఐనా వాల్లు చెప్పేది నాకర్ధంకాదులే అని అనినవ్వి ఊరుకున్నది. సరేలేమ్మా వాల్లేదన్నా సాధనలోవున్నరేమో నేను వెళితే ఇబ్బందేమో నువ్వెళ్ళి అత్తయ్యఖాళీగా వుంటే పిలువు నేనొచ్చానని చెప్పి అన్నాను . ఆవిడదిగలేరన్నయ్యా ! అనిచెప్పి ఆ అమ్మయి వెళ్ళి విషయం చెప్పినది .ఆవిడ మేడమీద గది వరండాలోకొచ్చి క్రిందున్న నన్నుచూసి దుర్గా సమయానికొచ్చావు పైకిరా అని పిలచినది.నేను మామూలుగా ఫాంట్ చొక్కామీదే వున్నాను .పైకెళ్ళి చూసేసరికి అక్కడ సత్సంగం చేస్తున్నది ఈమధ్య కాలంలో సాధనారంగం లో విస్తరిస్తున్న ఒకసంస్థ [................ మిషన్] పేరెందుకులేండి .అనవసర వివాదం .
వెళ్లాను .అక్కడ గదిలో కొందరు నేలమీద .మరికొందరు కుర్చీలలో కూర్చుని వారి గురువుగారిలాంటి వ్యక్తి ఏదో చెబుతున్నారు వింటున్నారు. ఆయనమాత్రం నేలమీదే కూర్చున్నాడు . అక్కడ వారి గురువుగారి లామినేషన్ ఫోటో [బహుశా ఆసంస్థ స్థాపకులయ్యుంటారు] పెట్టి పూలమాల వేశారు. ఆపక్కనే తరువాత వితరణ చేయడానికనుకుంటా ఘుమఘుమలాడే నేతితో చేసిన హల్వా పాత్ర నోరూరించే సువాసన వెదజల్లుతోంది . నన్నుతీసుకెళ్ళి ఆవిడ వాల్లందరికీ పరిచయం చేసినది .ఇతను దుర్గా అని మనపిల్లవాడే .పూజలూ యాగాలను చేయిస్తుంటాడు జనాలచేత అని .వాల్లుకూడా రండి రండి అని ఆహ్వానించారు. వెళ్ళి నేలమీదకూర్చున్నవారిపక్కన కూర్చున్నాను. మీరు కుర్చీమీదైనా కూర్చోవచ్చు అని చెప్పారు. పరవాలేదు ఇక్కడ క్రింద గురువుగారి ఫోటో వున్నదికదా అలా కూర్చోలేనులేండి .ఇక్కడే బాగుంది అని చెప్పాను.

సరే ! ఇప్పటిదాకా వాల్లేమి చెప్పుకున్నారో నాకు తెలియదుగానీ ఇప్పుడు నావేపుకు మల్లారందరూ . మీరేమి చేస్తుంటారు ?ప్రశ్నించారు సత్సంగం జరుపుతున్నపెద్ద నన్ను.
పెద్దగా ఏమీ చేయమండీ పెద్దలనుండి అలవాటయిన పూజ .ఎదో క్రిష్ణా! రామా !అనుకోవటం
అలాగా ! మీకు మెము చెస్తున్న కార్యక్రమం గూర్చి తెలుసా ?
లేదండీ ! ఇదే చూడడం
మీరు ఆథ్యాత్మిక సాధనలో విజ్ఞానంతో వ్యవహరించాలి .ఎప్పుడొ పెద్దలు చెప్పారని మనం చెసే వన్నీ అజ్ఞానపు పనులు .అవి వదిలి ఈమార్గానికి రావాలి ఆథ్యాత్మికంగా ఉన్నతిపొందాలంటే
ఏదోలెండి ! అందరికీ అన్నీ చేతకాదుకదా ! ఎవరికి చేతనైన మార్గం లో వారు వెలుతుంటారు .సమాధానమ్,ఇచ్చాను.

అలాకాదు ! తెలుసుకోవాలి ముందు .తెలియదనివుంటే మనిషిఎలా ఎదుగుతాడు ? మా కార్యక్రమములో మాగురుదేవులు.................. ఇలా వారి మిషన్ కార్యక్రమాలగూర్చి చెప్పుకు పోతున్నారాయన.
సరే ! కూర్చున్నాము కదా . అని వింటున్నాను.
ఎవరికి చేతనైన తెలిసిన పద్దతిలో సాధన సాగిస్తే మేలు అంతారు కదా పెద్దలు.అలాకాక తెలియని వాటిలో చేతులు పెట్టి ఉభయబ్రష్టత్వం ఎందుకు అని నేను సున్నితంగా చెబుతున్నాను.
సమయము గడిచేకొద్దీ ,నా అజ్ఞానం పట్ల గురువుగారికి అసహనం పెరుగుతోంది .ఎన్ని చెప్పినా వారి మాటలకు అంగీకారం తెలుప్కపోవటమే గాక తిరస్కరిస్తున్ననన్న భావం వ్చ్చినది కాబోలు శిష్యులముఖాలలోనూ అదే భావం గోచరిస్తున్నది.
ఈ అజ్ఞానమే మీలాంటి వారిని ఎదగనీయటం లేదు మీరుచేస్తున్న పూజలతో ప్రయోజనమున్నదా ? గురువుగారి ఆగ్రహంగొంతులో కనపడుతోంది.
అలా అని కాదండీ ! మనకు పెద్దలు చెప్పిన మార్గాలు వారు నడచిన బాటలు మన పయనానికి అనుకూలంగావుంటాయి అని నాభావం . కొద్దిగా నాకు అసహనం వస్తున్నది.వారికంటే నేను ఇంకా తక్కువస్థాయిలో వున్నాను కనుక సహజం.
మీలాంటి వారు మారరు .మూర్ఖత్వాన్నెక్కించి మనుషులను అజ్ఞానం లోనే వుంచే మార్గం మీది .గురువుగారు ఈసారి బయటపడి తిట్టటం ప్రారంభించారు . ఇక శిష్యులందుకున్నారు బోధన
ఏమయ్యా ! ఏమి తెలివిటేటలయ్యా ?చదువుకున్నావు ,.ఆలోచననుండదా ? ఆయనచెబుతున్నది అర్ధం చెసుకోవేమి? అసలు మీలా కొబ్బరికాయలు పూజలు కుంకుమలు ఇవేతప్ప వీటివల్ల ఏంలాభమని చెబుతుంటే వినవేమి . మూర్ఖులలో మొదటగావున్నావే ? వారెవరికీ నేనింతవరకు తెలియకపోయినా వాల్లు నన్ను అలా స్వంత మనిషిలా తిట్టి సంస్కరించాలని ప్రయత్నం చేస్తున్నారు. మధ్యలో పాపం ఇంటావిడ నన్ను ఇలాధూషించటం ఇబ్బందిగా వుండి పోనీలే అతనితో మనకెందుకు అతనే తెలుసుకున్న రోజు అతనే తెలిసి వస్తాడు అని వారించబోతున్నా వారు వినటం లేదు .పైగా ఆడవాల్లు కూడా ఇంకాఎక్కువగా బోధిస్తున్నారు నాకు . మేము చేయలేదా పూజలు ఇంతకుమునుపు .వాటివల్ల లాభమేమిటీ? ఇలా మాటలు చాలాదూరం వెళుతున్నాయి .

చెప్పొద్దూ ! నాకు కూడా అజ్ఞానికి కోపం సహజం కనుక ఈమాటలతో కోపం నషాలానికెక్కింది .విసుగొచ్చింది.
చూడండి , మా అమ్మ నాకు మా నాన్నను౮ చూపి వీడే మీ నాన్న అన్నది . నాకు మా అమ్మ మాటమీద పూర్ణవిశ్వాసముంది .సందేహానికి తావులేదు . కనుక ఆమె చూపినవాడే మానాన్న. అలాగే మా పెద్దలు ఇది సక్రమమైన దారిరా భగవంతుని చేరటానికి అని చెప్పారు. అంటే కాదు ఆచరించి చూపారు ,అది నిజం కనుకనే లోకం లో ఎక్కువమంది ఈమార్గాన సాగుతున్నారు. ఇక మీ అమ్మమాటలమీద మీకు నమ్మకమున్నదో లేదో ? నాకెందుకు మీఇష్టం . అని అన్నాను కోపంగా .
నువ్వు చాలాతప్పుగా మాటలాడుతున్నావు .మగవాల్లు ఆవేశపడిపోయారు .ఆడవాల్లు ముఖం మాడ్చుకున్నారు.
ఎందుకు . నేను చేసే పూజలు ,భజనలు పనికిరానివని మీరనొచ్చా ? మీమార్గాన్ని నేను ఇక్కడకొచ్చాక ఒక్కమాటన్నా అన్నానా? నేను ఇందాకనే వెళ్ళేవాడిని పిలిచారుకనుక అలావెల్లటంపద్దతికాదని మిమ్మల్ని అవమానించినట్లవుతుందని కూర్చున్నాను నామార్గాన్ని. మీరెంత తిడుతున్నా ,,సహించాను. దానికీ హద్దువుంటుంది.
అసలు నేను చేస్తున్నదీ ,మీరుచేస్తున్నదీ తేడాలేదు గమనించండి.
మీరు ఏదో విషయాలగూర్చి చెప్పుకుని ధ్యానం చేసుకుంటారు .మేమూ భగవంతుని పూజచేసుకుని ఏ భాగవతమో చదువుకుంటాము పక్కనెవరన్నా వుంటే చెప్పుకుంటాము. మొన్నటిదాకా మీరు చేసినది ఇదేకదా .
ఇప్పుడు చూడండి మీరూ మీగురువుగారి పటం బెట్టి పూలమాలవేశారు .మేమూ దేవుడు పటం పెట్టుకుని కొద్దిగా పూలుచల్లుకుని పూజచేనుకుంటాము. అంటే ! మీరు డబ్బుండి లామినేషన్ పటం పెట్టుకుంటే ఒప్పు ,మేము ఏదో మామూలు పటం పెట్టుకుంటే అది విగ్రహారధన తప్పు అవుతుంది. మరి మీదెలా కాకుండాపోయినది. మీ హల్వా ఘుమఘుమలు లేకపోయినా ఏదో మా పాయసం కూడా ప్రసాదమేగా .ఏమిటీ తేడా .గట్టిగా వాదించాను.
వీడేవడో మనకంటె తలతిక్కవెధవనుకున్నాడేమో !గురువుగారు ఈసారి మెత్తబడ్డారు .చూడండి ఇలావాదనవలన లాభం లేదు .అతని గూర్చి మనకెందుకు ,అనవసరం .వదిలేయండి అని ఆజ్ఞాపించారు సరేనండి మీరిక వెల్లవచ్చు అన్నారు ,
"నే వెళ్లను."
ఏం ఎందుకని?
"మీరింకా ప్రసాదం పెట్టలేదు."
"మరచిపోయాము ,ముందు ప్రసాదం పెట్టండివెంటనే" .గురువుగారి ఆజ్ఞ అయినది తడవు ఘుమఘుమ లాడే హల్వా
చేతికొచ్చినది .
"తీసుకోండి"
"నేను తినలేను"

"ఎందుకని?"
"నేనొక్కడినే ఎలాతినగలను ?"
అలాగా అందరికీ ఇవ్వండి . గురువుగారి ఆజ్ఞ

ఆనందంగా ఆపటములోని రూపంలో కూడా వున్న దత్తస్వామికి ఒకనమస్కారం పడేసి .చక్కగా తినేసి వచ్చేశాను .సత్సంగములో గడిపిన ఆసమయములో వచ్చే పుణ్యమెలాగూ వస్తుందనుకోండి మరలా వెళ్లలేదు ఇప్పుడెలాసాగుతున్నదో వారి సాధన చూద్దామని మనసులోవున్నా !




Read more...

ఈమతం పనికిరానప్పుడు కులమెందుకు ?

>> Tuesday, August 25, 2009

హిందూధర్మం లో లోపాలున్నాయి . ఇది మనకు పనికిరాదు . మాకు వద్దు. మేము మమ్మల్ని ఉద్దరించగల ,ఈ అసమానతలు లేని ,మాస్థాయిని పెంచగల మతం లోకి మేము మారతాము . ఇదీ మతం మార్చుకునేవారి భావన. సరే ఈమతం నుంచి మారావు ,బాగనేవుంది .అంటే నీ నమ్మకం ప్రకారం నీస్తాయి మతం మారగనే సంస్కరించబడి పోయినప్పుడు ఇక పాత మతం తాలూకూ గుర్తులెందుకు ? ఆయామతం లోవున్నవారితో సమానత్వాలు,అసమానత్వాలపట్ల చర్చలెందుకు .? ఆపాత మత మిచ్చిన కులగుర్తింపులెందుకు ? వాటికోసం పాకులాటలెందుకు ?

ప్రస్తుత ముఖ్యమంత్రి గారు వారి పూర్వీకులు ఈమతవిధానం పట్ల విరక్తితో మతం మారారు. కానీ వారి పేరు వెనుక రెడ్డి గారిని తీసెయ్యలేదు .కారణమేమిటి ? ఆ తోకతో ఏప్రయోజనం ఆశించకుంటే .ఈమతాన్ని ద్వేషించి వదలినప్పుడు ఈమత మిచ్చిన ఆ అవశేషం ఎందుకు ? ఇక ఊరికి ఒకటి రెండు చర్చీలున్నా జనాభాలెక్కలలో మాత్రం ,స్కూల్లరికార్డులలో మాత్రం హిందువులుగా కనపడే జనం వారికి గిట్టని ఈ కులతోకలు ఎందుకు ఉంచుకోవాలి? వాటిద్వారా ఎందుకు లబ్దిపొందాలని ప్రయత్నించాలి? ధర్మం మారితే మనస్థితి మారిపోతుందనుకున్న ఆశలు నిరాశలయ్యాయా? ఆలోచించాలి .

ఒక్కటిగుర్తుంచుకోండి .ఏసమాజం లోనైనా మానవుల అవివేకం వలన అసమానతలు సహజం గాచోటుచేసుకుంటాయి .ఈదేశం లో వున్న్ అలాంటి అసమానతలను బాపటానికే వీరబ్రహ్మేంద్రులవంటి ప్రవక్తలు ప్రయత్నిస్తూనే వచ్చారు. అమెరికాలో నల్లవాల్లపట్ల అసమానత లేదా? వాటికి వ్యతిరేకంగా పోరాడటానికి మార్టిన్ లూథర్ కింగ్ మతం మారాడా? లేదే ? పరాయి శక్తుల చేతిలో పావుగామారి మనలోమనం సంస్కరించుకోవాల్సిన లోపాలలో బయటివారిప్రమేయాన్ని మనకు తెలియకుండానే పెంచుతున్నాము. తద్వార బలహీనులమయి ఎవరి ఎత్తులకోబలిచేసుకోబోతున్నాము మన మాతృభూమిని . ఈసందర్భంగా నమీబియా అధ్యక్షుడు అన్నమాట గమనించాలి. "తెల్లవాడు ఈదేశానికొచ్చేసరికి మాచేతిలో భూములున్నాయి .వాని చేతిలో బైబిలుంది . ఏభై ఏళ్ళు గడిచాక చూసుకుంటే మాచేతిలో బైబిలుంది ,వానిచేతిలో మాభూమి వున్నది"

ఇక్కడ లోపాలు ఇక్కడ సవరించుకోవాలి గాని పరాయి మతాల ప్రలోభాలకో ,మనమతం పట్లద్వేషం తోనో ఇలా వలసపోయి పరాయిశక్తులవారి వ్యూహాలలో భాగమయి పోయి ఈదేశ సంస్క్రుతీ సంపదలను ధ్వంసం చేసుకుంటే ఏమిజరగనున్నదో .అసలెందు కిలా జరుగుతున్నదో ? ఎప్పుడో వేలసంవత్సరాలనాడే మనమహర్షులు హెచ్చరించిన విషయాన్ని వరుస టపాలలో మీకు తెలియజేస్తాను.

ఆథ్యాత్మికత అంటే కొబ్బరికాయలు ,ప్రసాదాలవరకే తప్ప అంతకంటే ఎక్కువ ఆలోచించని స్థితికి చేరుకుంటూన్న భౌతికంగా మాత్రమేహిందువులుగా బ్రతుకుతున్న వారికొక హెచ్చరిక .కళ్ళుతెరచి చూడండి.
ఈదేశం లో మతమార్పిడి జరిగి క్రిష్టియనయినవారికి ఏదన్నా ప్రమాదం వస్తే వారినాదుకోవటానికి ఒక వంద దేశాలు ఉన్నాయి ప్రపంచాన పెద్దదిక్కుగా , ఇక అదేస్థితి ముస్లిములకొస్తే వారికోసం ఓ యాభై దేశాలు సహాయమందించడానికి ముందుకొస్తాయి. ఈదేశం లో హిందువులమైన మనకు ఆపదొస్తే తలదాచుకోవడానికి అందరికంటె పెద్దదిక్కువుంది . అదేమిటో తెలుసా? హిందూమహాసముద్రం . దాదాపు డెబ్బైకోట్లాదాకావున్న మనం శక్తిహీనులమై కాపాడమని పరుగులు పెట్టి వెళ్ళి కోరితే ,ఏంపర్వాలేదు నేనున్నాను రండి అని తనలోకి ఆహ్వానిస్తుంది. కొద్దిసేపు సంచలనం కలిగినా ఏంపర్వాలేదు తరువాతంతా ప్రశాంతంగా వుంటుంది. .కాబట్టి మనం కూడా భయపడవలసిన పనిలేదు .ఏమాత్రం స్పందించవలసిన అవసరం లేదు . కలిపురుషుని సేన ఎలా కదం తొక్కనుక్కదో? ప్రపంచాన ఎంతముప్పువాటిల్లనున్నదో ?ఆలోచించాల్సిన అగత్యం అంతకంటే లేదు.


Read more...

భళా !బెజవాడ గోవిందరెడ్డీ . .

>> Monday, August 24, 2009

భళా !బెజవాడ గోవిందరెడ్డీ . .


ఈరోజు శ్రీవేంకటేశ్వరుని సన్నిధిలో చేరిన పందికొక్కులు శ్రీవారి బొక్కసాన్ని ఎలా కుళ్లగొడుతున్నాయో వార్తలలోతెలుసుకుని ప్రతి ధార్మికుని రక్తం ఉడుకుతున్నది. కొందరు ఒకరితో ఒకరు చర్చించడం ,మరొకరితో చెప్పుకుని బాధపడటం ,మరుసనాటికి మరచిపోవటం జరుగుతుంది. మనలాంటివాల్లు ఇంతటితో సరిపెట్టుకుంటే అదే బలంగా శేషాద్రి లాంటి డాలర్ దొంగలు ఎదురు లేకుండా దోపిడిచేస్తున్నారు. మనంభక్తులమేగాని ధర్మనిష్ట వున్నవాల్లంకాదు.కానీ కొందరుంటారు నిజంగా దేవుని పట్ల శ్రద్దావిశ్వాసాలు కలవారు. వారు మాత్రం దీనిని తమ ఆత్మీయులకు జరిగే అన్యాయంగా భావించి ఎదుర్కొనేవారు. అలాంటి వారిలో నెల్లూరు జిల్ల కాంగ్రెస్ నాయకుడు బెజవాడ గోవిందరెడ్డిగారొకరు.

ఈరోజు[24-8-09] ఆంధ్రజ్యోతి లో మెయిన్ పేపర్ చూడండి ఆయన్ గురించితెలుస్తుంది. అందరిలా ఆయన శ్రీవారి సొమ్ము దోచుకుంటున్నారు దుర్మార్గులు అని సరిపెట్టుకోలేదు. టీటీడీ ఆస్తులపైన హైకోర్ట్ లో ప్రజాహిత వ్యాజ్యాన్ని వేశారు. దానితో ఇప్పుడు పొగబెడితే కలుగుల్లోంచి ఎలుకలు బయటపడుతున్నాయి. ఆయనను ఆవ్యాజ్యం ఉపసంహరించుకుంటే పదికోట్లు ఇస్తామని ,లేకుంటే ఏమైనా చెస్తామనే బెదిరింపులు వస్తున్నాయట . ఐనా చలించకుండా భగవంతుని తరపున పోరాడుతున్నారు . శ్రీవారి ఆభరాణలవిలున సుమారు ఏభైఅరువేల కోట్లు ఉండగా దానిని తక్కువచేసి ముప్పైఆరు వేల కోట్లుమాత్రమే అని ఎందుకు చెబుతున్నారో.సస్పెండైన శేషాద్రి నే మరలానియమించి రెండుతాలాలు అతనిచేతికెందుకిచ్చారో తెలుపాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు

ఇప్పడు మనమేం చేయాలి . భలేచేస్తున్నాడని సంతోషపడితే అతని పోరాటానికి అర్ధం లేకుండాపోతుంది.నిజంగా శ్రీవారి పట్ల నమ్మకమున్నవారమైతే .ఆయనపట్లమనకు ప్రేమాభిమానాలుంటే[కేవలం అవసరభక్తి కాదు] మనం కూడా గొంతెత్తి ఈ అన్యాయాన్ని నిరసిద్దాము ,ఒక మెయిల్ ,ఒకవుత్తరం ముక్కద్వారా ప్రభుత్వానికి టిటీడి పాలకవర్గాలకు మననిరసన తెలిపి చూస్తూ ఊరుకోమని హెచ్చరిక చేద్దాము. ఇలా ధర్మం కోసం భగవంతుని కోసం పోరాడేవారికి నైతిక మద్దతునిద్దాము.


టి టి దే వారి అన్ని వివరాలు ఇక్కడ నుంచి చూడొచ్చు
www.omnamovenkatesaya.com




Read more...

మనబొజ్జగణపయ్యకే అగ్రతాంబూలం

>> Friday, August 21, 2009


హిందూధర్మం లో ముక్కోటి దేవతలున్నా విఘ్నేశ్వరునికే అగ్రతాంబూలం .వైష్ణవులైనా శైవులైనా శాక్తేయులైనా మరేసాంప్రదాయకులైనా నిత్యార్చననుండి ప్రత్యేక కార్యక్రమాల్వరకు తొలిపూజ వినాయకునికేచేస్తారు. మనధర్మం లోగణపయ్యకు అంతప్రాధాన్యతఎందుకిచ్చారో ఆలోచిద్దాము. అది వారి అంధవిశ్వాసం అని కొట్టిపారేయటం తేలిక . కానీ ఏవిశ్వాసమైనా ఇన్నివేలసంవత్సరాలు కోట్లాది జనాన్ని ఆకట్టు కోగలుగుతున్నదంటే ,ఎక్కడో మానవహృదయాల లోతులలో ఎంతో నిగూఢమూ ప్రగాఢమూ అయిన అవసరాన్ని నెరవేరుస్తూండితీరాలి అనే యోచన వాస్తవికదృష్టికి,విజ్ఞతకు కనీసపు కొలబద్ద. ఆప్ర్యోజనమేమిటో యోచించటము సరైన మానవత్వము. విజ్ఞత. యిటువంటి విషయాన్ని మూఢవిశ్వాసమని కొట్టివేయడం ఆధునిక మూఢనమ్మకం.

కొన్నివేల సంవత్సరాలు మానవుడు భూమిమీద జీవిస్తూ వ్యక్తియొక్క జాతి యొక్క మనుగడ తక్కిన ప్రకృతితో ముడి పడివున్నదని తెలుసుకున్నాడు. .జాతి యొక్క జీవితావసరాలకు మించి ఇతరప్రాణులను,వృక్షజాతులనైతేనేమి బాధించక గౌరవించాలని నేర్చుకున్నాడు. సంస్క్రుతీ నాగరికతలు వికసించినకొద్దీ అదే అహింసా సూత్రం గా రూపోందింది.
మరొఅకపక్క వాటికి మనకి ఆధారమైన ప్రకృతిని కూడా గౌరవించాలని ,అన్ని ఆనందాలకు అవసరాలౌ ప్రకృతే ఆధారమని గ్రహించాడు. ఈభావాన్ని త్రికరణశుద్ధిగా ప్రకటించుకొనటమే ఆరాధన .ప్రకృతిలో వివిధ వస్తువుల ,జీవులరూపాలలో సకలాన్ని సృష్టించి పోషించే సృజనాత్మక శక్తినిదర్శించి ఆరాధించాడు మానవుడు.

ఈదర్శనమంతటీనీ ఇముడ్చుకున్నది విఘ్నేశ్వరుని ఆరాధన.ప్రత్యక్షంగా మానవునికి తెలిసిన అతిపెద్దజంతువునుండి అతిచిన్న చిట్టెలుకదాకా జంతుజాలాలన్నింటికీ ప్రతీక గణపతి రూపం.ఇందులో మానవుడుకూడా విదదీయరాని అంతర్భాగమేనన్న వివేకాన్ని సూచిస్తుంది మానవదేహం. వీటన్నిటినీ పోషించేది వాస్తవానికి వృక్షజాలమే ,కనుక వివిధపత్రితో ఆయనను పూజిస్తారు.అందరికీ ఆధారం భూమే ,అందుకే మట్టితో వినాయకుని ప్రతిరూపం చేయబడుతుంది. అయితే భూమ్మీద నీరులేకుంటేఏ జీవరాసి మనుగడలేదు కనుకనే సర్వజీవులు భూసారాన్ని జలముద్వారపొంది ఏర్పడినవే అని సూచిస్తూ పూజానంతరం విగ్రహాలను నదుల నీటిలో నిమజ్జనం చేయటం. అది సాధ్యపదనప్పుడు బావిలోవేస్తారు.

ఈరోజుల్లో ఇదంతా మూఢనమ్మకమని ప్రజల అజ్ఞానానికి మచ్చుతునకాని తోచడం సహజం. నానాటికీ ఆవులు గేదెలులాంటి పశువులు కూడా ఎలావుంటాయో తెలియని పిల్లలుతయారవుతున్నారు .డెయిరిఫారాలలోపరికరాలనుండి పాలు తయారయి వస్తాయనుకునే అమాయకత్వం తయారవనున్నది. కోళ్లఫారాలచూస్తేతప్ప కోల్లెలావున్నాయో తెలియపోతున్నాయి పిల్లలకు.దానికి మించికుటుంబావసరాలుతప్పతెలియని ,తెలుసుకోజూదని తరాలు తరువాత తయారయ్యి తమఇష్టాఇష్టాలుతప్ప ఇతరం పట్టించుకోని తరాలు తయారవుతున్నాయి. సమిష్టిగా మనవజాతికూడా తాత్కాలికమైన అవసరాలు క్షణికమైన సుఖాలు,ఆడంబరాలు.రాజకీయ ప్రాబల్యాలుగురించి మాత్రమే ప్రాకులాడుతున్నది. మానవత్వాన్ని ప్రకృతిలో తామొకభాగం మాత్రమేనన్న విషయాలను మరుస్తున్నారు.ప్రకృతి మనుగడపైన మానవజాతి మనుగడ ఆధారపడివున్నది. ఆసంగతి తిరిగి కనుగొన్నవారిని గొప్పవిజ్ఞానవేత్తలుగా గుర్తించి గౌరవి్ంచుకోలసిన దుస్థితికి వచ్చాము.విదేశాలలో ఇప్పుడు ఈజ్ఞానాన్నిగ్రహించి మేధావులులెందరో ప్రకృతిపట్లప్రేమ పెంచుకోవాలని గుర్తిస్తున్నారు.అత్యాధునికమైన ఈపోకడలు తెలియని నేటిమనవిద్యావంతులు వినాయకచవితి వంటి వేడుకలు విడ్డూరంగాతలచటం సహజం. విదేశీవిజ్ఞానవేత్తలందరూ కనుగొన్న జీవితసత్యాలు అనాదిగా మనమాచరిస్తున్న విఘ్నేశ్వరునిపూజలో వున్నాయని తెలియాలంటే నిర్మాణాత్మకమైన పరిశోధన అవసరము.

అయితే విఘ్నేశ్వరున్ని కొలిస్తేవిఘ్నాలు తొలగుతాయా? నిజమా? దేశమంతా కొలుస్తున్నపుడు వారందరికీ తొలగుతున్నాయా? వారి జీవితాలలో కష్తాలు లేవా ? అంటారేమో !

విఘ్నాలు కష్టాలు స్తూలంగా మూడురకాలు. అవి అనివార్యంగా ప్రకృతిరీత్యాజరిగేవి ,మరణం జబ్బు భూకంపం మొదలైనవి.ఒకరకం. సాటివారివలన సమాజపరంగాజరిగేవి ప్రమాదాలు ,అవినీతి ,రాజకీయాలు మతకలహాలు బాధ్యతారాహిత్యం వలన జరిగేవి ఇంకోరకం . మనఏకాగ్రతాలోపం వలన రాగద్వేషవ్యామోహాదులవలన వచ్చేవి మూడోరకం .సామన్యంగా మొదటిరకం ఇబ్బందులగూర్చి ఏమీచేయలేరు.మిగిలిన రెండురకాల ప్రమాదాలను మానవప్రయత్నం తో నివారించుకోవటం సిద్దాంతరీత్యాసాధ్యమే. పైనచెప్పిన పూజలోని అంతరార్ధాన్ని విపులీకరించి బోధించగలిగితే రెండవరకం ఇబ్బందులు నివారించుకోవచ్చు. అందులో అంతర్భాగం గానే అతి ప్రధానంగానో మూడవ రకం విఘ్నాలు నివారణ అవుతాయి .ఇందుకు తత్వమెరిగి పూజచేయాలి. సూక్ష్మమెరిగి నిత్యం పూజధ్యానాదులను చేయటం ద్వారా బుద్ధిసూక్ష్మమౌ ఏకాగ్రము అవుతుంది .ప్రతివిషయాన్ని లోతుగా అర్ధం చెసుకునే సామర్ధ్యం పెరుగుతుంది . అంతటితో వ్యామోహాలు తొలగుతాయి .అధిక న్యూనతా భ్రాంతులను వదలి మానవజీవిత మనుగడకవసరమైన అంశాలకు మత్రమే ప్రాధాన్యతనిస్తాడు. పైన చెప్పిన విఘ్నేశ్వరపూజాతత్వాన్ని అతనెరుగుటవల ప్రకృతిపట్ల సాటి మానవులపట్ల సరైన రీతిన ప్రవర్తించగలుగుతారు. ఇలాజీవించటానికే ఎక్కువప్రాధాన్యతనిచ్చి అనివార్యమైన కష్టసుఖాలపట్లనిర్లిప్తుడయి వుండగలుగుఇతాడు. ఇలా సమాజం లోఎంతమంది చేయగలుగుతారనదాన్నిబట్టి ఆవ్యక్తి సమాజములమనుగడ నిర్ణయమవుతుంది. ఏవిధంగాచూచినా విఘ్నేశ్వర పూజ ఒక చవితినాడెకాక పైవిషయాన్ని గమనిస్తూ తరచుగాచేస్తుండటమే శ్రేయస్కరం.

Read more...

రోజుకు ఓ ఇరవైరూపాయలు ఖర్చుబెడితే చాలు ఇంటిల్లపాదికీ ఆరోగ్యం .[ఇకనైనా ఈ విద్యలను ఉపయోగించుకోండి]

>> Monday, August 17, 2009



మనకు మహాత్ములిచ్చిన విద్యలున్నాయి సుఖవంతమైన జీవనం గడపటానికి. ముఖ్యంగా ఆరోగ్యం కాపాడటం లో హోమాలకున్న ప్రాధాన్యతను పలుదేశాలలో శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలద్వారా నిరూపించారు. ఇంటిలో ఓ పాతికా ఇరవైరూపాయలతో నిత్యం అగ్నికార్యం నిర్వర్తించుకుంటే పలు రోగకారక క్రిములు ,విషవాయువులు తొలగిపోతాయి.
లక్నోలో వృక్షశాస్త్రవేత్తల పరిశోధన ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినది చూడండి. గాయత్రీ పరివార్ ,వారిదగ్గరగాని ,ఎక్కిరాల క్రిష్ణమచార్యులు స్థాపించిన వరల్డ్ టీచర్స్ ట్రస్ట్ వారిదగ్గరగాని తేలిగకా అందరూ హోమము చేసుకునే విధానాన్ని వివరించిన గ్రంథాలు న్నాయి వాటి సహాయం తో చక్కగా అందరూ స్వయంగా నిర్వహించుకోవచ్చు. . హోమకుండీలు కూడా రాగి తో చేసినవి మార్కెట్లో దొరుకుతున్నాయి .లేకుంటే పన్నెండు ఇటుకలతో కూడా హోమకుండి ఏర్పాటు చేసుకోవచ్చు. ఇకనన్నా ఈ విద్యలను ఉపయోగించుకుందాము మనలను మనం రక్షించుకోవటానికి.

Read more...

పూర్ణాహుతితో ముగిసిన రామనామ జపయాగము

>> Sunday, August 16, 2009


భగవంతుని అనుగ్రహ చే్త సంకల్పించబడిన రామనామ జప యజ్ఞము ,నిర్విఘ్నం గా పూర్తయినది. ఆదివారం రోజున పీఠము లోనూ గాంధీనగర్ గ్రామము లోనూ యాగం నిర్వహించి పూర్ణాహుతి ఇవ్వటం జరిగినది.మొదలు పెట్టిన వారం రోజులకు చక్కగా వర్షాలు కురవటమ్ తో జపం చేస్తున్న పదిగ్రామాల రైతులు ఆనందం తో ఈకార్య క్రమములో పాల్గొని శ్రీరాముని సేవించుకున్నారు. లోకాస్సమస్తా సుఖినోభవంతు

Read more...

తిప్పతీగ ఫోటోలు





Read more...

నేతాజీకు స్ఫూర్తి నిచ్చిన నేత ఎవ్వడు !?

>> Saturday, August 15, 2009

భగవంతుని కరుణమనమీద ఎప్పుడూ వున్నది. దానిని మనం గుర్తించం గాని మనజీవితాలలో అనుక్షణం గుర్తించవచ్చు..అయితేమనందరము [నిజానికి] నాస్తికులమే . అందుకే ఆయన కరుణయొక్క గాంభీర్యాన్ని గుర్తించలేకున్నాము. బాధలు వచ్చినప్పుడు మాత్రం ఆయననను ప్రార్ధిస్తాము. .అది కొంతవరకు హృదయపూర్వకమై ఉండవచ్చుగాక . కానీ మనకష్తం గట్టెక్కిన,పరిస్థితులు మెరుగుపడిన మరుక్షణం ఆయనను ప్రార్ధించటం మానివేస్తాము.
ఆయనను మరుస్తాము. అందుకే కుంతీదేవి అన్నది " ప్రభూ ! నన్నెల్లప్పుడు కష్టాలలో వుంచు. నేను ఎల్లప్పుడూ హృదయపూర్వకంగా ప్రార్ధించ్గలుగుతాను.సుఖాలు నిన్ను మరచేలా చేయవచ్చు. కనుక నన్ను సుఖంగా వుండనివ్వవద్దు. అని.

మానవజీవిత సారమంతా -జనన మరణ పరంపర రూపమైనది. శ్రీహరికి సమర్పణమే. అదిలేకుంటే జీవితం అర్ధ రహితమే. నాకూ జంతువుకు బేధమేమిటంటే అది భగవంతుని ఉనికిని గుర్తించలేదు .ఆయనను ప్రార్ధించలేదు. .మనం ప్రయత్నించి ప్రార్ధించగలము. కనుక ఆయననౌ కీర్తించకపోతే నాజన్మే వ్యర్ధమవుతుంది.నాకు భక్తి,భగవంతుడున్నా డన్న నిస్సంశయమైన విశ్వాసం ఆవస్యకము. విశ్వాసం భక్తిని జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. భక్తి జ్ఞానానికి దారితీస్తుందని మహర్షులన్నారు. మేధను పదునుబట్టి వివేకాన్ని వికసింపజేయటమే విద్యయొక్క లక్ష్యం .ఈరెండు ప్రయోజనాలు సిద్దించినప్పుడు విద్యసార్ధకమైనదనవచ్చు. విద్యావంతుడైన వ్యక్తి ఎవడికైనా నైతికత లోపిస్తే వాణ్ణి విద్యావంతుడనగలమా? ఎన్నటికీ అనలేము. విద్యా రహితుడైనా తన నడవడికలో హృదయసిద్ధి కలిగివుంటే ,అతడు భగవమ్తుని ప్రేమిస్తుంటే అతడే మహాపండితుడని అంగీకరించగలను. .నాలుగు మంచిమాటలు నేర్చినంతనే పండితుడు కాజాలడు.నిజమైన జ్ఞానం భగవదనుభూతి వలన వస్తుంది. తదన్యమైనది జ్ఞానమే కాదు. కేవలం చదువుకున్న పండితుణ్ణి నేను గౌరవించలేను..భగవద్భక్తి పొంగిపొరలే హృదయం కలవారినే నేనారాధిస్తాను..అతడు న్యూన కులానికి చెందినవాడైనా ,అతని పాదధూళిని పరమ పవిత్రమైనదిగా స్వీకరించగలను.ఎవరు హరి ,దుర్గ .అన్న దివ్యనామం వినగానే స్వేదము ,ఆర్థత చెందుతారో అట్టి భక్తి చిహ్నములు కలవాడి నిస్సందేహంగా దైవస్వరూపమే..అట్టివార్తి ఉనికి చేతనే ప్రపంచమంతా పావనమవుతుంది. మనం బొత్తిగా వ్యర్ధజీవులం.

నిరర్ధకంగా మనం సిరిసంపదల కోసం తపిస్తాము గాని నిజమయిన శ్రీమంతుడెవరో ఆలోచించము. ఈప్రపంచము లో ఎవరైతే భగవద్భక్తి మొదలయిన వెలలేని సద్గుణ సంపదలు కలిగియుంటాడో అతడే శ్రీమంతుడు. అతడితొపోలిస్తే మహామహారాజులు కూడా బిచ్చగాళ్ళే . అటువంటి సంపదను కోల్పోయి కూడా ఎలా బ్రతుకుతున్నామా అన్నదే ఆశ్చర్యం .!

పరీక్షలు సమీపిస్తున్నాయని మనం ఆందోళన చెందుతాము గానీ ,అనుక్షణమూ మనము పరీక్షింపబడుతున్నామని గుర్తించము .మనము భగవంతుని ఎదుట విచారణకు గురి అవుతున్నాము. మనధర్మం ఎదుట పరీక్షింపబడుతున్నాము. విద్యాలయాలలో ని పరీక్షలు చాలా అపప్రధానాలు- అశాశ్వతాలు కానీ ఆ యితర పరీక్షలు శాశ్వతమైనవి. వాటి ఫలితాలనుఈ జన్మలోనో రాబోయే జన్మలోను కూడా అనుభవించాలి.
[నేతాజీ లేఖలనుండి]



Read more...

"నారాముడు కలలోకూడా అబద్దమాడడయ్యా ! " [అవును తనప్రతిజ్ఞానుసారం కురిపిస్తున్నాడు వర్షం ఇక్కడ]

>> Friday, August 14, 2009


రామనామ మహిమతో కురుస్తున్నవర్షం

ఎక్కడ పరమ పవిత్రమైన రామ నామము జపించబడుతుందో అక్కడ సర్వదోషాలూ తొలగి పోయి శుభాలు ప్రాప్తిస్తాయంటారు పెద్దలు. వర్షా భావస్థితి తో తల్లడిల్లుతున్న ఇక్కడ పరిస్థితిని చూసి కరుణించమని వేడుకుంటూ మన పాఠశాల పిల్లల చేత పది గ్రామాలలో గత శనివారం మొదలు వారం రోజులుగా రామనామ జపము ,పీఠములో యజ్ఞమూ నిర్వహించబడుతున్నది. పిల్లల సాధనచూసిన కొంతమందిపెద్దలు కూడా రామ నామాన్ని జపిస్తూ వున్నారు .ఆరోజునుంచి వాతావరణం చల్లబడింది..
ఈరోజుకు ఖచ్చితంగా వారం రోజులైనది ఈకార్యక్రమాన్ని.సప్తాహంగా కదా మొదలుపెట్టినది., ,తన నామ స్మరణచేసిన వారి నాదుకోవటం లో జాగుచేయని ఆధర్మ ప్రభువు తన కరుణ చూపించారు .ఈరోజు తెల్లవారుఝామున మబ్బులు కమ్మి నాలుగునుంచి ఐదున్నరదాకా వర్షమ్ కురిసినది. ఇక గంటనుంచి వర్షం పోతపోస్తున్నది ఇప్పుడు ఇది వ్రాస్తున్న సమయానికి..
మన భక్తిలో లోపముండవచ్చుకానీ .ఆయనన నామానికున్నశక్తి లోనూ ఆయన కరుణలోనూ లోపం లేదని మనసా గుర్తించి ప్రణామాలర్పిస్తున్నాము.శరణన్నవారిని కాపాడటమే తననియమమని స్వామి ఆరోజు మాటఇచ్చాడుకదా. .భక్తరామదాసు సినిమాలో భక్తురాలి పాత్ర పలికిన ఒకమాటగుర్తుకువస్తుంది ,"నారాముడు కలలోకూడా అబద్దమాడడయ్యా "!అని , అవును యుగాలుదాటినా ,జగానలు మారినా మాటతప్పడు స్వామి. రేపు ఆదివారమ్ ఏకాదశిరోజున పూర్ణాహుతి హోమము జరపటానికి సిద్ధమవుతున్నాము

ముక్తిదము శ్రీరామనామము ,భుక్తిదము శ్రీరామనామము
కోరి కొలచినవారికెల్లను కొంగుబంగరు రామనామము

Read more...

తిప్పతీగ .తులసి కలిపి తినండి స్వైన్ ఫ్లూ మీదగ్గరకు రాదు.

>> Thursday, August 13, 2009

సాధారణంగా పల్లెలలో దొరికే మూలిక తిప్పతీగ ,దీనిని హిందీ లో జిదాయ్ అని సంస్కృతం లో అమృత అని పేర్లున్నాయి. ఇది చెట్లమీదకు పాకి అల్లుకుంటుంది . కాడలకు బొడిపెలు ,బొడిపెలు వుంటాయి .ఆకులు పచ్చగా చిన్న సైజ్ తమలపాకుల్లావుంటాయి. కాస్త వగరు చేదు ,కారంగా రుచి కలగలసి వుంటుంది.నమిలితే జిగటగా వుంటుంది. దీనివిశేషమేమిటంటే మనం పీకి వేసినాక కొద్దికాలం ఆగాక మరలా తడితగిలినా బ్రతుకుతుంది .ఆరునెలలైనా తిప్పతీగ మరలాబ్రతుకుతుంది అని అంటారు పెద్దలు. ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్నగారు ఆయుర్వేదవైద్యం చేసేవారు కనుక అప్పుడు ఎక్కువగా తెస్తున్నప్పుడు పరిశీలించిన ఈమొక్కను ఈరోజు వెళ్ళితెచ్చాను .ఇలాంటి దివ్యమైన మూలికలు అదృశ్యమవుతున్నాయి .
ఎక్కడ బడితే అక్కడ దొరికే ఈమొక్క ఇప్పుడు అంతగా కనిపించటం లేదు .

తిప్పతీగను తులసిని కలిపి తింటే స్వైన్ ఫ్లూను ఎదుర్కునే రోగనిరోధక శక్తి శరీరానికి చేకూరుతుంది. అలాగే స్వైన్ ఫ్లూ వచ్చినా తగ్గించగల దివ్యౌషధమిది. దీనినే ఈమధ్య యోగా గురువు ప్రసిద్ధ ఆయుర్వేద వైద్య పరిశోధకులు రామ్ దేవ్ బాబా ఈవ్యాధి నివారణకు మందుగా సూచించారు. దీనిని కాదను ఒకటిరెండంగుళాల ముక్కను ,పది తులసి ఆకులతో కలిపి పొద్దుటే నమిలి తినాలి. అలా నాలుగైదు రోజులకు ఒకసారి తీసుకోవాలి.వ్యాధిసోకినప్పుడు ఎక్కువమోతాదులో తీసుకోవాలి. అద్భుతంగా పనిచేస్తుంది .
దీనిని మన పూలకుండి లో నాటుకుంటే నీరుపోస్తుంటే అదేపెరుగుతుంది .కనుక పెంచటము తేలికే . పుట్టకొక్కులు ,తేనె పల్లెటూర్లనుంచి తెచ్చి అమ్మే యానాదులకు ఈమూలిక బాగ పరిచయం కనుక వారినడిగితెప్పించుకోవచ్చు. లేదా మీకు పల్లెలలో ఎవరన్నా చుట్టాలుంటే వారినడిగినా పంపిస్తారు.తులసి మొక్క ఎలాగూ మీదగ్గరలో దొరుకుతుంది . లాగే విదేశాలలో వున్న మనవారికి కూడా పంపుతాను .ఐతే పది,పదిహేను రొజులలో చేరగలిగితే అక్కడ దానిని నాటుకోవచ్చు .లేదా అక్కడ దొరుకుతుందేమో ప్రయత్నించండి .అక్కడ తులసి కూడా దొరకదనుకుంటాను . కాబట్టి ఇక్కడనుండి ఎవరైనా మీబంధువులుంటె వారిని పంపమంటే తులసి విత్తనాలు పంపుతారు.
ఇక ఎలా నూ తెప్పించుకోవటానికి వీలుకానివారు .ఏమార్గం లేనివారు కోరితే శ్రీపీఠంయొక్క నియమాలలోఒకటైన భక్తజన సేవలో భాగంగా ఒక అడుగు పొడవు తీగను కొరియర్ లోపంపగలను .అదీ మీ పోస్టల్ ఖర్చుతో . దయచేసిఇది వ్యాపారం కాదుఅని గమనించగలరు అలాగే ఇక్కడా వర్షాలు సరిగాలేక ఆమొక్క తక్కువగా కనపడుతున్నది . కాబట్టి తప్పనిసరై ,తెప్పించుకోవటానికి ఇంక ఏమార్గము లేనివారే నన్ను సమ్ప్రదించవలసినదిగా ప్రార్ధన . ఎందుకంటే అవకాశం వున్నవారు ఎలాగోలాతెప్పించుకోగలుగుతారు . కనుక అవకాశము లేనివారికి కూడా అందుతుంది . ఇక నాసలహా ఏమిటంటే ఏమూలికైనా ఔషధమైనా భగవంతుని స్మరించి తీసుకుంటే అత్యధిక శక్తితో పని చేస్తుంది . కనుక ఈ ఔషధాన్ని అలాతీసుకోమని మనవి. [ ఈచెట్టు,కాడల ఫోటోలను రేపు ఇక్కడ వుంచుతాను]

దుర్గేశ్వర
durgeswara@gmail.com

cell .9948235641



[విదేశాలకు పంపంటం లో కొన్ని ఇబ్బందులున్నాయట . కనుక దేశము బయటకు పంపలేము .క్షమించగలరు. ]



Read more...

స్వైన్ ఫ్లూ వ్యాధికి మెయిల్ లో వచ్చిన జాగ్రత్తలు

>> Wednesday, August 12, 2009

One of the preventive measures against Swine Flu

Use “Nilgiri Oil” (Eucalyptus oil) drops on handkerchiefs and masks as one of the preventive measures against Swine Flu (NIV) National Institute of Virology.

Please share this valuable information with your friends.

Not just Tulasi, Vitamin C rich substances are known to boost immunity. So taking hot Lemon or Amla (Indian Gooseberry) powder mixed with hot water would be very helpful.

Indian herbs

Tulsi can help keep swine flu away: Ayurvedic experts

Lucknow, May 27: Wonder herb Tulsi can not only keep the dreaded swine flu at bay but also help in fast recovery of an afflicted person, Ayurvedic practitioners claim.

"The anti-flu property of Tulsi has been discovered by medical experts across the world quite recently. Tulsi improves the body's overall defence mechanism including its ability to fight viral diseases. It was successfully used in combating Japanese Encephalitis and the same theory applies to swine flu," Dr U K Tiwari, a herbal medicine practitioner says.

Apart from acting as a preventive medicine in case of swine flu, Tulsi can help the patient recover faster.

"Even when a person has already contracted swine flu, Tulsi can help in speeding up the recovery process and also help in strengthening the immune system of the body," he claims.

Dr Bhupesh Patel, a lecturer at Gujarat Ayurved University, Jamnagar is also of the view that Tulsi can play an important role in controlling swine flu.

"Tulsi can control swine flu and it should be taken in fresh form. Juice or paste of at least 20-25 medium sized leaves should be consumed twice a day on an empty stomach."

This increases the resistance of the body and, thereby, reduces the chances of inviting swine flu," believes Patel.

Bureau Report



Read more...

స్వైన్ ఫ్లూ ముప్పుకు మందు మనదగ్గరేవుంది

>> Tuesday, August 11, 2009


స్వైన్ ఫ్లూ మహమ్మారి ముంచుకొస్తుంది .అదేకాదు మరికొన్ని కొత్తవ్యాధులు కాచుకు కూర్చుని వున్నాయి.ఈసమయం లో జనాన్ని కాపాడేశక్తి ప్రభుత్వాలకుందని నమ్మలేము .ఎందుకంటే గుంటూరు జిల్లా లాంతి ఒకపెద్దజిల్లాలో స్వైన్ఫ్లూ నిర్దారించే పరికరాలు ప్రయోగశాలలూ కానీ లెవని ఇరవై నాలుగుగంటలలో పూనే కో ఢిల్లీకో సాంపిల్స్ ను పంపించటం సాధ్యమయ్యేపనికాదని ఇక్కడ జిల్లాస్థాయి వైద్యాధికారులు స్పష్టం చేసారు ఈరోజు . అంటే ఒకదానివెంట ఒకటిగా దాడులు చేస్తున్న ఈ మహమ్మారులను నిలువరించగలగటం కేవలం ఆధునిక పద్దతులవలనమాత్రమేసాధ్యం కాదు .సాంప్రదాయ పద్దతులను పక్కనబెట్టటం ఎంతనష్ట మో ఇప్పుడైనా అలోచించాల్సిన విషయం . ప్రకృతిని హింసించి ,ప్రకృతి విరుద్దమైన పనులు చేసి తెచ్చుకున్న ముప్పును మనం మరలా ప్రకృతిని ఆశ్రయించటం ద్వారామాత్రమే నివారించుకోగలుగుతాము.



ప్రస్తుతం మనలను వణికిస్తున్న ఈ స్వైన్ఫ్లూ వ్యాధికి తులసి దివ్యౌషధమని వైద్యలోకం అంగీకరిస్తుంది .అలాగే ఆవుపాలతో ఈవ్యాధికి ఔషధాన్ని తయారు చేస్తున్నామని మహారాష్ట్ర లోని ఆయుర్వేదవైద్యులు వెల్లడించారు .అంటే సమస్య తోపాటు పరిష్కారం కూడా ప్రకృతి కరుణతో ప్రసాదిస్తూనేవున్నది. దానిని గ్రహించి జాగ్రత్తపడవలసినది మనం.

ఇక ప్రతి ఇంట్లో సాంప్రదాయంగా వుంచుకునే తులసి కోటను ఏర్పాటుచేసుకోవటం ,అలాగే తులసి తీర్ధం ,తులసి సేవనం వలన ఈ వ్యాధికారక క్రిములను ఎదుర్కోవచ్చు.

ఆలాగే ప్రతి గృహం లో యజ్ఞం జరపటం వలన అది భౌతికంగనూ, అలాగే ఆథ్యాత్మికంగా ను సత్ఫలితాలనిస్తుంది .
యాగం చేయటం లో స్వల్ప వ్యయం తో గాయత్రీ పరివార్ వారు ఆచరిస్తున్న విధానం అనుకూలంగావుంటుంది .
ఒక పావుగంట సమయాన్ని వెచ్చించి ఇటిలో ఈ అగ్నికార్యం చేయటం వలన మనుషులకు ఇలాంటి వ్యాధికారక క్రిములను ఎదుర్కునే సామర్ధ్యం పెరగటమేగాక ,ఈ క్రిముల నిర్మూలన జరుగుతుంది . ఇక ఆ మంత్రోచ్చారణా తరంగాల ప్రభావం గూర్చి మీకు చెప్పనవసరం లేదనుకుంటాను . దేశం లో పెద్ద ప్రమాదమైన కార్బైడ్ ఫాక్టరీ గ్యాస్ లీక్ సమయం లో ఈవిషయం నిరూపించబడినది.
ఇక ఈవిద్యలనిచ్చిన మహర్షులు మానవాళిశ్రేయస్సును కోరి చెప్పారు .జాగ్రత్తగా దీనిని వుపయోగించుకుంటామా లేక అనవసర వివాదాలతో ముప్పు కు బలవుతామా అనేది మనిష్టం .ఎవరన్నా కోరితే ఈ అగ్నికార్యం సులభంగా చేయటమెలాగో వివరించటానికి శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం సిద్దంగావున్నది.

ఇక భూకంపాది ప్రమాదాలు విస్తరిస్తున్నాయి . "విక్రమవత్సరం నుండి విపరీతములు పుట్టి జననష్టమే సమ్భవించేను" అనే తాతగారి [వీర్బ్రహ్మేంద్రుస్వామివారి] కాలజ్ఞాన హెచ్చరికలు గుర్తు తెచ్చుకుని గడచిన విక్రమ వత్సరం నుండి భూమ్మీద జరుగుతున్న పరిణామాలను బేరీజు వేసుకుని అవి ఎంత సత్య మో తెలుసుకొవాలి.
"రామా" అనని వారెల్లా రాలిపోయేరు అనే "కాలజ్ఞాన" వాక్యాల హెచ్చరికలను గమనించి మానవాళి భగవంతుని ప్రసన్నం చేసుకోవాల్సిన ఆపత్సమయమిది. ఇది భయపెట్టటానికి చెప్పటం లేదు .బయటపడే మార్గాన్ని తెలియజేస్తూ చెబుతున్న మాట.
[ సనాతనమైన భారతీయ సాంప్రదాయ రీతులను ఆచరించే వారి కోసం వ్రాయబడినది . నమ్మకమన్నది మీఇష్టం ]
అనవసర వివాదాత్మక వాఖ్యలు అంగీకరిపబడవు

Read more...

సాగుతున్నయాగానికి సానుకూల పరిణామాలు

>> Monday, August 10, 2009

లోక కళ్యాణం కోసం చేస్తున్న రామనామ జపయజ్ఞానికి ఆటంకాలు తొలగిపోతున్నాయి .ఆపవనసుతుని రక్షణలో సాగుతున్న ఈ యాగానికి సానుకూలవాతావరణం ఏర్పడుతున్నది. మా పిల్లలు యాగం మొదలెట్టిన శనివారం నుండి వాతావరణం చల్లబడినది . మబ్బులు పట్టి వున్నవి. స్వామి అనుగ్రహమా అన్నట్లు ఆరోజు రెండు చినుకులు చిలకరించాయి . మనమంటే నోరున్నది కనుక ఏదోఒకటి అడిగితెచ్చుకుని తినగలుగుతాము ,పాపం ఆమూగజీవులు చూడండిరా గడ్డిలేక నేలనే నాక్కుంటున్నాయని ,చుట్టూ పరిసరాల్లోవున్న పశువులను చూపాను. మాపిల్లలు మరింత పట్టుదలతో జపం చేస్తున్నారు , వర్షాలు కురిసి వాటికి మంచి పచ్చిక దొరకాలని కోరుతూ .

ప్రస్తుతము ఈయాగం వివరాలు చెప్పగానే లక్ష్మీపురం ,గాంధీనగర్ ,సాయినగర్ ,తిమ్మాపురం ,రాముడుపాలెం ,తండా ,బుర్రిపాలెం గ్రామస్తులు తమ గ్రామం లో జపయాగం జరపటానికి సిద్దమయ్యారు. వచ్చే ఆదివారం అన్నిగ్రామాలలో ఒకేసమయం లో యజ్ఞము పూర్ణాహుతి జరపాలని సంకల్పంతో సాగుతున్నాము
జై శ్రీరామ్

Read more...

రామనామము ,రామనామము రమ్యమైనది రామనామము [ప్రారంభమైన యాగం]

>> Saturday, August 8, 2009


మానవుల ఆనాచారాలవలన ప్రకృతి ఉపద్రవాలు ఏర్పడి దు:ఖానికి కారనమౌతుంది . కనుక సర్వదోషపరిహారం కోసం భగవన్నామ స్మరణమనే దివ్యౌషధాన్ని ప్రసాదించారు మహర్షులు మానవాళికి . ఈ సంకటస్థితిలో ఎవరికి చేతనైనంత స్థాయిలో భగవన్నామాని వారు స్మరించాల్సిన సమయం ఆసన్నమైనది ఇప్పుడు.

ఒకవైపు వానలు పడక ,మరొకవైపు రోగాలు ముప్పుముంచుకొస్తూన్న ప్రమాదకరపరిస్థితి. కనుక గతం లో మనపెద్దలు చూపిన మార్గం లో కనీసం మాచుట్టుపక్కల గ్రామాలలోనన్నా రామనామము జపింపజేసి ఒకేసారి అన్ని గ్రామాలలో హోమము జరపాలని కోరికతో రాత్రి ఈప్రయత్నం మీద కొన్ని గ్రామాలకు వెళ్ళివచ్చాను . కానీ అక్కడ జనం ఆలోచనలు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో తెలియని స్థితి ఏర్పడింది.

ఒక గ్రామం లో నిజమే మాస్టారూ ! ఇలాచేస్తే బాగుంటుంది .కానీ మావూరి సంగతి మీకుతెలియదు .మొన్నసర్పంచ్ గా మొదట అవతలి వర్గం రెండున్నరసంవత్సరాలు ,తరువాత మావర్గం చెయాలని ఒప్పందం చేసుకుని ఇప్పుడు వాల్లు మాటతప్పారు అటువంటి వాల్లతో కలసి ఏకార్యక్రమం చేసే ప్రశ్నే లేదు .అని ఒక నాయకుడు తెగేసి చెప్పాడు.
ఇది రాజకీయాలతో ముడిపెట్టే సమయమటయ్యా ? ఈ ప్రమాదకాలం లో భగవన్నామాన్ని ఆశ్రయించకపోతే అందరికీ ఇబ్బందయ్యా అని సర్దిచెప్పబోయాను .ఏంపర్వాలేదు వచ్చేనష్టమేదో వాల్లకొస్తే గదామాకొచ్చేది అన్నాడాయన్ .ఇంకేమి చెప్పగలమాయనకు.

ఇంకొకాయన అబ్బా ఏకాహంగా నామం చేయాలంటే పాతికవేలన్నావుతుంది ,అన్నాడు ,
నాకైతే మతిపోయినది . ఏమయ్యా నోరువిప్పి భగవన్నామాన్ని పలకటానికి డబ్బెందుకయ్యా ? భక్తితో భగవంతున్నాశ్రయించమంటే నువ్వు ఆర్కెస్ట్రా లు ,ప్రోగ్రాములుగా పరిగణిస్తున్నావు . దేవుడిచ్చిన నోరు నుపయోగిస్తేచాలు అని చెప్పినా ఆయనకు నామస్మరణమంటే , ఖర్చుపెట్టిచేసే పనిగానే కనిపిస్తున్నదిది.

నిజమేమాస్టారూ ,మావూర్లో నువ్వొచ్చి అందరినీ అడుగు మేం చెబితే అవుతుందా ,అని తప్పుకున్నాడు మరొక ఊరి పెద్ద. పాపం ఆయనకు ఇదంత ముఖ్యమైనదిగా తోచలేదు కాబోలు.

మా చిన్నతనం లో ఊర్లో ఏక్కడన్నా నిప్పంటుకుని ,ఇల్లుగాని వాములుగాని తగలబడుతుంటే జనం చేతికందిన బిందె లు,బుంగలు బక్కెట్లు తీసుకుని బావులదగ్గరకు పరుగులుతీసి నీళ్ళు, తెచ్చి ఆర్పేప్రయత్నం చేస్తుండేవారు. మేము కూడా[చిన్నపిల్లలం అప్పుడు] తపెలాలు చెంబులు ఏవిదొరికితే నీల్లునింపుకుని వెల్లి విసిరేవారం అవి మంటదాకా పోకపోయినా .అదొక ప్రయత్నం .అప్పుడు పసిమనసులో మేమూ ఆర్పగలమనే ఆత్మ విశ్వాసం .జనం కూడా అదెవడిఇల్లు? వాడు నాకుశత్రువా ? మిత్రుడా అని ఆలోచించరు .వాల్లాలోచించేదల్లా ఒకటే .అది ప్రమాదము . నాకెందుకులే అని చూస్తూ కూర్చుంటే ఆనిప్పు మనకొంపమీదకు కూడా వస్తుంది వదిలేస్తే అలాగే . మరిప్పుడో తగలబడనియ్యి .పోతే నాదేకాదుగా వాడిదికూడా పోతుందనే ధోరణి పెరిగిపోతుంది జనం లో .
కనుక ,పెద్దలమీద ఈపనికి సహకరిస్తారనేనమ్మకం పోయినది .అందుకే మాపిల్లలనడిగాను ఏరా ! ఇలావర్షం లేకుంటే పంటలు పండవు .అవిలేకపోతే మనకు ఆకలితీరదు డబ్బులేకుంటే ఇలా నీడన కూర్చుని చదివే అవకాశము ఉండదు . చుట్టూ పశువులు పక్షులు చూడండి నీటి కోసం ఎలా అల్లాడుతున్నాయో . కాబట్టి మనం భక్తిగా జపం చేసివేడుకోవాలి . తప్పనిసరిగా వానకురిపిస్తాడు భగవంతుడు అని చెప్పాను .అంతే బాలాంజనేయులులాగా మాపిల్లలు కిలకిలారావాలుచేస్తూ సిద్దమైపోయారు . మాఒక్క స్కూల్ లోనే పదిగ్రామాలకు చెందిన పిల్లలున్నారు . ప్రతిరోజూ వారితోపాటు వారివారిగ్రామాలలో మిగతాపిల్లలను కలుపుకుని ,గ్రామం లోని గుడిలో అరగంటసేపు రామనామాన్ని జపించాలి . అలాగే పాఠశాలకు రాగానే క్లాసులు ప్రారంభానికి ముందు ఒక పావుగంట జపం చేయాలి మొత్తం కోటిజపం జరగాలి వచ్చేశనివారానికల్లా అని నిర్ణయించుకుని , పిల్లలంతా సంతోషం తో పాల్గొన్నారు. ఇంతకుముందు కూడా మనమిలగాచేస్తే వానకురిసింది కదా సార్ !సీనియర్లు గుర్తుచేశారు గతం లో చేసిన జపయాగ ఫలితాలను .

ఇక ఈరోజు పిల్లలు జపం ప్రారంభించగనే అప్పటిదాకా ఎండాకాలం సూర్యునిలావస్తున్న భానుని వేడి కిరణాలకు మేఘాలు అడ్డుపడి వాతావరణం చల్లబడినది . నిష్కల్మషమైన వారి ప్రయత్నాలు నాకు సంతోషమని ప్రకృతిమాత ఆశీర్వచనాలిస్తున్నట్లు చల్లని గాలితెమ్మెరలు వచ్చి తాకాయి

ఇక ఎలాజరుపుతాడో చూడాలి !? స్వామి ,ఆ పసివారు చేస్తున్న యాగాన్ని . .



Read more...

రామనామ జపయజ్ఞం

>> Thursday, August 6, 2009






ప్రస్తుతము భూమ్మీద విపత్కరపరిస్థితులు నెలకొంటున్నాయి .ఒకవైపు అనావృష్టి .మరొవైపున కొత్తరకం రోగాలు కమ్ముకువస్తూ జనజీవనాన్ని భీతావహం చేస్తున్నాయి . మానవులు చేసే సామూహిక పాపం ,అనాచారాలద్వారా జరిగేదోషాలు ,ఇలా ప్రకృతికోపానికి కారణమవుతాయని శాస్త్రాదులు ఘోషిస్తున్నాయి-ప్రస్తుత సమాజం తాగుడు జూదాలు మొదలు పలు వ్యసనాలుపెరిగిపోయి వాటి కి బానిసలైన వారు చేస్తున్న సామూహికపాపం అందరికీ కష్టాలు తెస్తుంది. ఉదాహరణకు ఒకడు నాఇష్టమని తనైంటిని మురికికూపంగా మార్చి మురికినీరు నిలువజేస్తే దానివలన పెరిగిన దోమలు,క్రిములు చుట్టుపక్కలన అందరికి హానికలిగిస్తాయిగాని కేవలం వాటిపెరుగుదలకు కారణమైన వానికొక్కనికే కాదుగదా !ఇక దైవస్థానాలలో కూడా పాపాత్ములు చేరి చేస్తున్న పలురకాల అపచారాలు మానవలోకానికి కష్తాలు పెంచుతున్నాయి. ఇవి చూస్తూ కూర్చున్న మనం కూడా ఆపాపం లోభాగము తీసుకోవాల్సినదే అది ప్రకృతి నియమము.ప్రకృతిమాత శాంతిస్తుంది . మనమంటే నోరున్నదికనుక ఎలాగోలా గడుపుతున్నాము . కాణి నోరులేని జీవరాసి ఎవరిని అడగలేక ,ఎక్కడా తిండి ,నీరు దొరకక తల్లడిల్లి పోతున్నాయి. వాటి శోకం చెప్పనలవికాకుండావుంది .


ఈసమయం లో లోకంలో జరుగుతున్న పాపాలను ధ్వంసం చేయటానికి మహాయోగులు హిమాలయలాలో తీవ్రతపశ్చర్యలో వున్నా మనంచేస్తున్న పాపపురాసి అంతకంతకు పెరిగి వారి ప్రయత్నాలనుకూడా సఫలం కాకుండ అడ్డుకుంటున్నది.అని పెద్దలమాట.

ఐతే కలియుగం లో ఈ పాపాన్ని దహించటానికి హరినామ స్మరణ చేయటమే మార్గమని మనకు మనఋషిపరంపర సూచించివున్నది. కనుక మనం సామూహికంగా పరమ పావనమైన "రామ" నామాన్ని జపించటం ద్వారా అది మాహాశక్తివంతమై సర్వపాపాలను దహించివేస్తుంది . ప్రకృతిమాత శాంతిస్తుంది .తగిన విధంగా కరుణించి కాపాడుతుంది. వర్షాలు కురిపించి కాపాడాలని కోరుతూ ప్రతి మనిషి రామ నామాన్ని జపించాలి. పూర్వం గ్రామగ్రామాన రామనామాన్ని జపించి న మనపూర్వీకులు శాంతి సౌభాగ్యాలను పొందారు .ఆపత్సమయం లో కూడా ఆ నామాన్ని ఆశ్రయించి గండాలనుండి గట్టేక్కారు

లోకశాంతి కోసం శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం లో 8-8-1999 శనివారం నుండి నామజపం సప్తాహంగా ప్రారంభించుట జరుగుతున్నది. ప్రతిరోజూ రామనామ జపము జరిపి 16-8-1999 పూర్ణాహుతి హోమము జరుపబడుతుంది .

ఈసందర్భంగా వ్యక్తిగతంగాను ,సామూహికంగాను ప్రతివారు మీమీ ఇంటిలోనూ గ్రామం లోని ఆలయాలలోనూ శ్రీరామ నామాన్ని జపించవలసినదిగా కోరుతున్నాము .
సంప్రదించవలసిన చిరునామా

శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం
రవ్వవరం

నూజండ్ల [మం] గుంటూరు [జిల్లా]

mail : durgeswara@gmail.com

cell : 9948235641

Read more...

రాఖీలు కట్టించా ....తిక్కకుదిరింది ... గాడిదలకు .

>> Wednesday, August 5, 2009

సార్ ,..ఇక చదువులు చెప్పలేంసార్ .మీరే ఎదో ఒకటి చేయాలి అంటూవచ్చాడు మా స్కూల్ లో సోషల్ మాస్టర్ గారు.

ఏమైందిసార్ .అనడిగాను

ఏమైందేమిటిసార్ .పిల్లలకు వయస్సుకుమించిన ఆలోచనలు .మేము పాఠం చెబుతుంటే ముసిముసి నవ్వులు వంకచూపులు , కొత్తగావచ్చినవాల్లతో మరీ ఇబ్బంది సార్ టెన్త్ లో . ఈసినిమాలు మరీ చెడగొడుతున్నాయి పిల్లలను వెధవలు జోకులొకటి..........
మనం చదువుకునేప్పుడు పదవతరగతి లో ఇలా ఆడపిల్లలతో మాట్లాడాలంటే ఎంత భయం సార్ ..మనకు... ఆయన తనగోడు వెల్లబోసుకుంటున్నాడు.
నిజమే మాస్టారూ అన్నాను నేను .[ అప్పట్లో పదవతరగతి ఆడపిల్లలంటె అదొక ప్రత్యేక వర్గం వి ఐ.పి. లన్నమాట .పంతుల్లుకూడా కొట్టరు వాల్లకు మార్కులు తగ్గినా .మాకైతే వీపు విమానం మోతమోగేది .అలాంటి రోజులలో ఆడపిల్లలతో మాట్లాడటం కూడానా! ?]

మాకు ఇక్కడ పల్లెటూళ్ళలో ఎనిమిది తొమ్మిది దాకా గవర్నమెంట్ స్కూల్లోనో .లేక బయట వినుకొండ ,దర్శి లాంటి పట్టనాలలోనో చదివించి ఆతరువాత అలివిగాని బాచ్ లను ..ఇహ లాభం లేదు ..దుర్గా సార్ దగ్గరైతే అణగేస్తాడు అని తెచ్చి నాపాలిట పడేసి పోతుంటారు. తప్పదు మొహమాటాలు కనుక చేర్చుకోవటం . వీల్లలో చాలామందికి చదువు తక్కువైనా కళలు ఎక్కువ .పదవతరగతి కొచ్చేస్తారు గనుక కాస్త మాటతీరు మనసుతీరు కూడా తేడావస్తుంది. ఇక మనసినిమాల పుణ్యమా అని ఆఅతితెలివి కూడా పెరిగిపోతుంది. నాదగ్గర చిన్నతనం నుంచి చదివిన పిల్లలు పరవాలేదుగానీ ఇలా తొమ్మిది పదులలో చేరేవాల్లతో కాస్త తలనొప్పి. దానికితోడు మా మాస్టర్లు పిల్లల్తో స్నేహితుల్లా మెదిలితే బాగ చదువస్తుందనుకుంటారేమో వాల్లిచ్చేచనువెక్కువై పోతుంది ఒకోసారి.

అసలే పోర్షన్లు కాక మనం అల్లాడుతుంటే ఇదొక గోల . చదువని చెబుదామా ,కాపలాలు కాద్దమా ఏమిటో సార్ గట్టిగా కొడదామంటే చిన్నపిల్లల్లా లేరు ఇప్పుడు కాలం మారింది. ఏ అఘాయిత్యాలు చేసుకుంటారో ... అయన మరీ భయస్తుడు ఆయన భయం నాకెక్కిస్తున్నాడనిపించింది.
ఆడపిల్లలు జాగ్రత్తగావుంటూన్నారా ? అడిగాను
అమ్మో ! దొంగముండలు ..వాల్లలో కూడా కొంతమంది తో జాగ్రత్తగా వుండాలిసార్ ,మీరొస్తున్న అలికిడైతే చాలు బుద్దిమంతుల్లా తెగ నటించేస్తుంటారు . క్లాసులో ఒకటే గోల వాల్లది కూడా .

సరేలెండి కొడితే లాభం లేదు . నాలుగురోజులాగండి అని చెప్పిపంపించా ఎవరెవరు కాస్త ఎక్స్ ట్రా గాల్లో కనుక్కుని .

[ఈసందర్భంగా నాకోసన్నివేశం గుర్తొచ్చింది . మేము డీగ్రీ చదివేరోజులలో మక్కెన శ్రీను అనేవాడుమ్డేవాడు ఫైనలియర్ లో .వాడూ రౌడీ షీటర్ కూడా . మాముందు వాడు కాలరెగరేస్తూ ఆడపిల్లలదగ్గరకెల్లేవాడు మాట్లాడాలని .వాల్లు పళ్ళుతెగ ఇకిలిం చేస్తూ ఏంటన్నాయ్యా ... అని పలకరించేవాల్లు .అంతేవాడు కాలర్ దింపి పాతసినిమాలో ఎన్టీఆర్ లా చూడండమ్మా మీకేదన్నా అవసరమయితే నన్నడగండి ,మీకేంభయం లేదు నేనున్నానని హామీ ఇచ్చేసి వచ్చేవాడు .పాపం వాడి బ్రతుకలా అఖిలాంధ్ర ఆడపిల్లలకు అన్నయ్యగా మిగిలిపోయింది .]


ఇక పదవతరగతి వాల్లకు ఆఫీస్ లోకి పిలచి చెప్పాను . ఒరే ..అబ్బాయిలూ రేపు రాఖీ పండుగరోజు చిన్న పార్టీ చేకుందాము తలా ఓపాతికా పట్రాండ్ర్రా అని . అలాగే ఆడపిల్లల దగ్గర తలా ఓ పాతిక వసూలుచేసి వాల్లకు చెప్పకుండా చిన్నసైజ్ రాఖీలు తలా ఓపదిహేను తెప్పించాను .

ఈరోజు ప్రేయర్ లో రాఖీపండుగ గురించి చెప్పి ,దాని ప్రాముఖ్యతన్చెప్పి అన్నయ్యలు తమకు రక్షగావుండాలని చెల్లెల్లు అక్కలు ఇలాకట్టాలిరా .చూడండి మన పదవతరగతి వాల్లు ఎంతచక్కగా .సామూహికంగా చేసుకుంటున్నారో ఈపండుగ అని ప్రకటించేశా .పక్కలోబాంబులు పడ్డట్టు బిత్తరచూపులు చూస్తున్న వారిలో కొంతమందిని క్రీగంట గమనిస్తూ మీరుకూడా అలా పదవతరగతి వాల్లలా కల్సి మెలసివుండాలి .అర్ధమైనదా ? అంటూ సాగించా నా వుపన్యాసాన్ని.

ఆతరువాత పదవతరగతి మగపిల్లలనందరినీ ఒకవరుస నిలబెట్టి , ఆక్లాస్ ఆడపిల్లలందరిచేత వరుసగా అందరికీ రాఖీలు కట్టీంచా మిగతవారిచేత చప్పట్లు కొట్టిస్తూ ,ఒక్కొక్కడి ముఖం చూడాలి . మాస్టర్లు నవ్వలేక చస్తున్నారు అవతల . కొద్దిసేపటికి రాఖీలుకట్టీంచుకుంటున్న పిల్లకాయలకు తప్పలేదు నవ్వటం . తరువాత వాల్లచేత మాట్లాడించా . ఒక్కొక్కడూ మాక్లాసు ఆడపిల్లలు మాకు అక్కలు చెల్లెల్లుఅంటూ మనపాఠశాలలో మనమందరం ఒకేతల్లిపిల్లల లాంటివారము అంటూ చెప్పకతప్పలేదు ,ఎందుకంటే వాడికంటె ముందువాడిలా మాట్లాడకుంటే ఎక్కడ తప్పుపడతారోనని.

ఇప్పటివరకు పంతుల్లను జోకర్లుగా చిత్రిస్తున్న సినిమా వాల్లు మాలాంటి వారి విలనిజాన్ని కూడా చూపించుకోండి అని సలహా ఇస్తున్నాను.







Read more...

సకల పాపహరణం... గుప్తేశ్వరుని దర్శనం

>> Tuesday, August 4, 2009





సకల పాపహరణం... గుప్తేశ్వరుని దర్శనం


సీతారాములు నడయాడిన పుణ్యస్థలమది. దట్టమైన అడవిలో... ప్రకృతి అందాల నడుమ... పుణ్య శబరి నది ఒడ్డున... కొండ శిఖరాన... త్రేతాయుగంనాటి స్వయం భూలింగం గుప్తేశ్వరుని దర్శనం చేసుకున్నవారెవరైనా భక్తి పారవశ్యంలో మునిగి తేలాల్సిందే.

ప్రకృతి అందాలకు నెలవైన ఆ అరణ్యమార్గంలో రామగిరి నుండి పది మైళ్లు ప్రయాణిస్తే ఎతై ్తన సున్నపురాతి కొండ కనిపిస్తుంది. ఆ కొండ శిఖర గుహ ముందు భాగంలో... ఆరడుగుల ఎత్తు, పదడుగుల వెడల్పున్న శివలింగమే... గుప్తేశ్వరుడు. స్వామివారిని దర్శిస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయనే నమ్మకం ఉంది.

గుప్తేశ్వరుడు త్రేతాయుగంలో ఆవిర్భవించినా త్రేతాయుగం, ద్వాపర యుగాలు గడచి... కలియుగం వచ్చే వరకూ గుప్తంగానే ఉండి పదిహేడవ శతాబ్దంలో బహిర్గతమయ్యారు. స్వామివారున్న గుప్తేశ్వరాన్ని ఎంత వర్ణించినా తక్కువే. ఒరిస్సాలోని కొరాపుట్‌ జిల్లా, జయపురం నగరానికి అరవై కిలోమీటర్ల దూరంలో, రామగిరికొండ సమీపంలో ఈ గుహ ఉంది. కొండ మట్టం నుంచి శిఖరం వరకూ మెట్లు, వాటికిరువైపులా చంపక వృక్షాలు. వాటి నీడలో వెళ్తే పదడుగుల ఎతై ్తన పెద్ద గుహ వద్దకు చేరుకోవచ్చు. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాసమేతంగా అరణ్యవాసానికి పంచవటికి వెళ్తూ, మార్గమధ్యంలో ఈ అడవిలో కొంతకాలం ఉన్నారట.



గుప్తేశ్వరుని లింగాకారం

ఆ సమయంలో రాముడు తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యారట. అరణ్యవాస దీక్ష నిర్విఘ్నంగా నెరవేరుతుందని, సమీప పర్వతం రామగిరిగా కీర్తి పొందుతుందని పలికారట. తానక్కడే లింగాకారంలో వెలసి గుప్తంగా ఉంటూ కలియుగంలో భక్తులచే పూజలు అందుకుంటానని వరమిచ్చిన శివుడు... రాముని సమక్షంలోనే లింగాకారం దాల్చారట. శివుడు చెప్పిన విధంగా ద్వాపర, త్రేతాయుగాలు ముగిసి కలియుగంలోని పదిహేడవ శతాబ్దం వరకూ ఆ లింగం ఉనికి ఎవరికీ తెలియలేదు. ఆ పర్వతాల చుట్టూ దట్టమైన అడవి ఉండటం, ఆ ఆడవిలో క్రూర మృగాలు సంచరిస్తూ ఉండటం వల్ల అక్కడికెవరూ చేరలేకపోయారు.

స్థలపురాణం...

గుప్తేశ్వరం గురించి అక్కడి ప్రజల్లో ఓ కథ నానుడిలో ఉంది. 17వ శతాబ్దిలో మహారాజు వీరవిక్రమదేవ్‌ జైపూర్‌ సంస్థానాన్ని పాలించాడు. సంస్థానాధీనంలోని రామగిరికి ఠాణాదారునిగా గొడియా పాత్రో ఉండేవాడు. అతనికి మాంసాహారమంటే మక్కువ. ఆ ప్రాంతానికి చెందిన సవరజాతి (గిరిజన) వ్యక్తి వేట చేసి, జంతు మాంసాన్ని పాత్రోకి ఇచ్చేవాడట. ఓ రోజు ఆ గిరిజనుడు ఓ లేడిని వేటాడేందుకు బాణం విసరగా అది కాస్తా లేడి కడుపులో గుచ్చుకుంది. ఆ లేడి శివలింగం ఉన్న గుహలోకి పరుగున వె ళ్లింది. దాన్ని వెంబడించిన గిరిజనుడికి గుహలో శివలింగం, రుషి, పక్కనే లేడి కనిపించాయి.

వెంటనే అతడు రుషికి నమస్కరించి వచ్చి, వేట మానేసి, జరిగిందంతా పాత్రోకి వివరించాడు. పాత్రో మరికొందరు సవరలను వెంటబెట్టుకుని లింగం ఉన్న గుహకు వెళ్లగా శివలింగం తప్ప ఎవరూ కనిపించలేదు. విషయాన్ని మహారాజుకు వివరించగా... శివలింగాన్ని దర్శించుకుని, యుగాలుగా గుప్తంగా ఉన్న లింగానికి గుప్తేశ్వరుడని నామకరణం చేశాడు. నాటి నుంచీ ప్రతి శివరాత్రికీ గజాదిదళాలు, వందలాది భక్తులతో వచ్చి గుప్తేశ్వరునికి ప్రత్యేక పూజలు చేయనారంభించారు.

యాభై యేళ్లపాటు ఒక్క శివరాత్రి పర్వదినాన మాత్రమే గుప్తేశ్వరుని దర్శనం లభించేది. రానురాను రహదారి ఏర్పడి క్రూరమృగాల సంచారం తగ్గింది. అప్పట్నుంచీ కార్తీక మాసాల్లో దర్శనం దొరికేది. ఆ తరువాత కొన్నాళ్లకు ప్రతి సోమవారం కొందరు భక్తులు దర్శించుకోవడానికి వెళ్లనారంభించారు. ప్రస్తుతం రాకపోకలకు వీలు కలుగడంతో భక్తులు స్వామిని నిత్యం దర్శించుకుంటున్నారు. శివరాత్రి రోజు ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రాల నుంచి కూడా వేలాదిమంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారు. వారంతా ఈ ప్రాంతాన్ని గుప్త కేదారిగా పిలుస్తూ, స్వామికి మొక్కులు చెల్లిస్తారు. గుప్తేశ్వరుని ఆరాధిస్తే దీర్ఘవ్యాధులు నయమవుతాయని భక్తుల విశ్వాసం.

గుప్తేశ్వరుని గుహకు సమీపంలో మరికొన్ని గుహలు ఉన్నాయి. అన్ని గుహల్లోకీ కామధేను గుహకు ప్రాశస్త్యం ఉంది. ఈ గుహలో గోవు పొదుగు రూపంలో ఉండే శిలల నుంచి అడపాదడపా నీటి బిందువులు పడుతుంటాయి. చేయి చాచినపుడు, ఆ నీటి బిందువు అరచేతిలో పడితే కోరిన కోర్కెలు తీరుతాయని ఇక్కడివారు నమ్ముతారు. సమీపంలోనే సీతాగుండాన్ని దర్శించవచ్చు. అరణ్యవాసంలో అక్కడకు వచ్చిన సీతమ్మ స్నానమాచరించిన కొలనే సీతాగుండం. అతి ఎత్తయిన కొండ పై భాగాన స్వచ్ఛమైన నీటితో ఎల్లప్పుడూ నిండుగా ఉంటుంది.

ఒరిస్సా రాష్ట్ర దేవాదాయ శాఖ ఈ క్షేత్ర నిర్వహణను చూస్తోంది. రహదారులు, రవాణా సౌకర్యాలు, యాత్రికులు ఉండేందుకు ఇంకా ఏర్పాట్లు కల్పించాల్సి ఉంది. దీని ప్రాశస్త్యాన్ని మరింత ప్రచారం చేస్తే, గుప్తేశ్వరుని క్షేత్రానికి సముచితమైన గుర్తింపు లభించడమే కాక, పర్యాటక కేంద్రంగా విరాజిల్లే అవకాశమూ ఉంది.
- శ్రీశైలం శ్రీనివాస్‌, న్యూస్‌లైన్‌, శ్రీకాకుళం

Read more...

త్రిదండి అంటే ఎవరు ?

త్రిదండి
మంగళవారం-4-ఆగస్టు ; మనం చేసే కర్మల ఫలాన్ని అనుసరించి, ఉత్తమ జన్మను కానీ, నీచజన్మను కానీ మనంపొందుతాం. ఉత్తమ కర్మలను ఆచరించడం వలన దేవత్వం లభిస్తే, మధ్యమ స్థాయి కర్మలు అనగా పుణ్యపాపాల కల యిక వలన తిరిగి మానవ లోకంలో జన్మిస్తాం. అధమస్థాయి కర్మఫలం వలన, (అన్నీ పాపాలు, హింస, మోసం, అసత్యం, అధర్మంవంటివి) పశువులుగా, పక్షులుగా జన్మించ వలసి వస్తుంది. మనస్సు, మాట, క్రియలనే ఈ మూడింటి వలన చేసే కర్మ ఫలం జన్మలను నిర్దేశిస్తుంది. కానీ అన్నింటికంటే ముఖ్యమైన మనస్సు సంకల్పాల వల్లే జన్మలు కలుగడానికి కారణం అవుతున్నాయి.లి ఈ సందర్బ ంగా మనం జడ భర తుని వృత్తాంతాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆయనఅన్నీత్యజించి, మునియై, తపస్సాచరిస్తూ లేడి మీద సానుభూతితో, మరణకాల మున దానినే స్మరిస్తూ మరణించడం వలన ఆ లేడిజన్మనెత్తవలసివచ్చింది. కనుక సంకల్పాలు మనస్సు నుండి ఉద్బ వించేవి అధిక ప్రభావాన్ని చూపుతున్నట్లు తెలుస్తోంది. దేహంతో చేసే మంచిచెడు పనుల ఫలితం దేహంఅనుభవించకతప్పదు. మంచి కార్యఫలం వలన శరీరానికి సుఖం, భోగభాగ్యాలు కలిగితే, చెడుకార్య ఫలితం వల్ల వ్యాధులు, రోగాలతో బాధపడవలసిందే. కనుక మనం వివేకంతో ఈ మూడు విధాలైన మనస్సు, మాట, దేహంతో జరిగే పాపకర్మలు, నాల్గు విధాలుగా జరిగే నోటితో వాణిక్కుల ద్వారా పాపకర్మలు, మూడువిధాల మనోసంబంధ పాపకర్మలు మొత్తం 10విధాలైన పాపపు పద్ధతులను విడచి, ధర్మమార్గాన్ని అనుసరించి, పాపఫలం నుండి విముక్తి పొంద వలసి ఉంది. మనం శరీర సంబంధమైన కర్మదోషాల వలన, కొండలు,చెట్లు మున్నగు స్థావర రూపాలు ఎత్త వలసి ఉంటుంది. నాల్గురకాల వాణిక్‌కర్మలచేత,పక్షిగాకానీ,మృగంగా కానీ జన్మించాల్సి ఉంటుంది. మాన సిక పాప కర్మఫలాల చేత చండాల జన్మలు లభిస్తాయి. పలుకకూడని మాటలు, దుర్మార్గపు ఆలోచనలు, చెడుప్రవర్తన లేనివారిని త్రిదండి అంటారు. అంటే వాగ్దండం, మనో దండం, కాయదండం అను వాటిని త్రికరణ శుద్ధిగా పాటించేవారు. వీటికై కామక్రోధాదులైన అరిషడ్వ ర్గాలను అణచి, వీటిపై జయం సాధించినా మోక్ష ప్రాప్తి పొందగలం. ఆదూరి హైమవతి[వార్త
నుండి ]


Read more...

ఇది మతవిద్యకాదు ! ధార్మికవిద్య .ధర్మమంటే ఏమిటో తెలిపేవిద్య

>> Monday, August 3, 2009

పసితనం నుంచి పిల్లలకు మతవిద్య అవసరం లేదు అనే వాదనపై కొద్దిగా పరిశీలన జరుపుదాము.

ముందుగా మతమంటే ఏమిటి అనేది నిర్ధారించుకుందాము. మతమంటే ఒక మార్గము, ఒక అభిప్రాయము ,లేదా ఒక సిద్దాంతము కూడా కావచ్చు .కొద్దిమంది లేక పెద్దసమూహం యొక్క నమ్మకం కావచ్చు .అది సత్యమైనా కావచ్చు కాకపోవచ్చు. ఒక్కోసారి మనం అంటుంటాము వాడిమతం వేరురా వాడు ఎవరు చెప్పినా వినడు అని . కాబట్టి ఈరీతి లోచూస్తే మన పుణ్యభూమి యగు భరతఖండములో వున్నది మతమా ? కాదు అనిచెప్పవచ్చు .ఎంతోమంది మహాత్ములు చూపిన బాటలు ఎన్నోవున్నాయి .ద్వైతం ,అద్వైతం ఇలా చాలా . అవి సత్యాన్వేషకులైన మహాత్ములు మానవాళికి చూపిన బాటలు .ఆయామార్గాలను ఆచరించే కోట్లాదిమంది మాత్రం వీటన్నిటినీ ఒకేదృష్టితో చూస్తున్నారు. అంటే ఇక్కడ ఈమతప్రవక్తలు లేక సిద్దాంతకరతలు చెప్పినది ఏదో అదిమాత్రం ఒక్కటే .అది సత్యము సత్యము సత్యము.
దానినే ధర్మం అంటాము. మతాలు మారినా ధర్మం మాత్రం మారదు. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అనేది ప్రకృతి ధర్మం .అది ఎంతమంది ఎన్నిరకాలుగా ఎన్నిభాషలలో చెప్పినా మార్పులేని ఒకేధర్మం . కాబట్టి మనం వారసత్వంగా పొందుతూ వస్తున్నది మతం కాదు .ధర్మాన్ని . కనుక మనది హిందూమతం కాదు ,హిందూధర్మం . కనుకనే ఇది ధర్మ భూమి అయినది. పరమాత్మ వాదనలకు అందని నిత్యసత్యధర్మం . దానిని మనం తెలుసుకున్నా తెలుసుకోలేకపోయినా ఆయన సత్యం . కనుక ఆసత్యాన్ని నమ్మిన మహర్షులు ,జగద్గురువులు ఈపుణ్యభూమిపైనే అవతరించి మానవాళికి సత్యమైన మార్గాన్ని ధర్మయుక్తమైన జీవితమార్గాన్ని పలురకాలుగా బోధించి శాసించి నిర్దేశించారు .ఇది మానవాళి సంపూర్ణవికాశానికి ,మానవ శరీరం లోవున్న ఆత్మ ,అవ్యక్తంగావుండే ఆ పరమాత్మను చేరుకుని పరిపూర్ణత పొందటానికి .

కనుక మనది హిందూధర్మము . ఇందులో మానవుడు తల్లి గర్భం లో పడ్డప్పటినుండి పెరిగేదశలలోనూ ఉడిగేదశలలోనూ చివరకు కాటికి ఒరిగేదశలోనూ .ప్రతి దశలోనూ ధర్మానికనుగుణంగా ను దైవం పట్ల విశ్వాసం తో మమేకమై జీవన యానం సాగిస్తాడు. చిన్నప్పడు తల్లికడుపున పడటానికి కారణమైన సన్నివేశాన్నుంచి సీమంతము .జాతకర్మ .నామకరణం ,అక్షరాభ్యాసం ,ఒడుగు చేయటం ,వివాహం ,షష్టిపూర్తి ,మరణసమయాన తులసితీర్థసేవనం ,దశదినకర్మకాండలనుండి పిండప్రదానాలదాకా ప్రతిదశ అథ్యాత్మిక మేళవింపుతో .ప్రకృతి ధర్మాలకు,దైవన్యాయానికి అనుగుణంగా పుట్టి ,జీవించి మరణించటం మన ప్రత్యేకత .ఇతరులలాగా మనకు దేవుడు ,వేరు జీవితం వేరుకాదు ,దైవంతోనే జీవితం .ధర్మం తోనే జీవనయానం సాగుతుంది.
మనజీవితం లో దైవానికి ఏ ప్రాధాన్యత నిస్తామో .ధర్మానికి అదే స్థాయి లోవిలువనిస్తాము. అసలు మనకు ధర్మమే దైవమని మనవిద్యనేర్పుతుంది. కనుక మానవునిగాపుట్టుటం కేవలం తిని ఆనందించి భౌతిక సుఖాల సంపాదనలో పరుగులిడటమే మన విద్యాలక్ష్యం కాదు కనుక .సాటి జీవరాశికి మేలు చెకూర్చతమే అసలు విద్యగా విద్యయొక్క లక్ష్యం గాచెప్పబడుతున్నది. కాబట్టి చదువు విజ్ఞానాన్ని పెంచటానికి అని గట్టినమ్మకం .అది భౌతిక వనరులను పెంచే నేటి విజ్ఞానమని చెప్పబడుతున్నదికాదు .అంతకంటె వున్నతమైనది . అత్యున్నత స్తాయి మానవత్వాన్ని నేర్పగలది ఆవిజ్ఞానాన్ని పొందటమే మన అసలు లక్ష్యం . కనుక అది ప్రసాదించే పరమాత్మకు సన్నిహితంగా వుండే భావాలతోనే మనవిద్యావిధానం సాగేది గతం లో .
ఈలక్షణాలను లక్ష్యాలను కలిగివున్న మానవుడు సాటి జీవరాశి కి శత్రువుగామారక విశ్వమునకు మితృడుగా మార్తాడు. కనుకనే ఒకవరుసలో జీవిత విధానం నేర్పారు మనవాల్లు .ధర్మార్ధ కామ మోక్షాలు అని. అంటే ముందు నేర్చుకోవలసినది ధర్మం అదితెలిసినవాడు అర్ధాన్ని[డబ్బుని] కూడా ఆదారిలోనే సాధించ యత్నిస్తాడు. అలాసాధించిన డబ్బుతో కామాన్ని అంటె కోరికలను తృప్తిపరచి మోక్షాన్ని గూర్చి సాగుతాడు తరువాత దశలో..

కాబట్టి ఈసోపాన మార్గం లో సాగేప్పుడు మొదటి దశ విద్యార్ధి గా ముందు ధర్మాన్ని నేర్చుకుంతాడు.ధర్మమంటె ఏమిటి ? అది దైవంతో సమానము . మరిదైవమంటె తెలియకుంటే ధర్మము యొక్క ఔన్నత్యం తెలియదు కదా ! కనుక దైవాన్ని గూర్చిన విజ్ఞానం మనకు పురాణాలద్వార కథలద్వారా .పలువురు సమాజానికి బోధించేవారు. ఆదైవభక్తి చిన్నతనాన్నే నేర్చుకున్నవాడు సమాజానికి హితుడుగా తనను తాను మలచుకుంటాడు. మహోన్నతమైన విలువలు అలవర్చుకుంటాడు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఏమిటం టే మిగతా మతాల లో భగవ్ంతుడు వేరని ధర్మం వేరని చెప్పబడితే ఇక్కడ మాత్రం ధర్మమే దైవమని చెప్పబడుతుంది. ధర్మాచరణలో అవసరమైతే దైవాన్నెదిరించినా ఆదైవానికి అది సంతోషమేనని బోధింపబడుతుంది. కనుకనే ఈవిద్యావ్యవస్థ లోపెరగగలిగిన పిల్లలు ధర్మానికి హానికలిగితే సహించరు. ఒకదైవం పేరుతో హింసకు ,ఇతరుల మనసు నొప్పించటానికి సాహసించరు. అది ఇక్కడవిద్యలో గొప్పతనం .


ఎక్కడో పిల్లలకు మతవిద్యనిచ్చి యుక్తాయుక్తవిచక్షణను లేకుండా మతమౌఢ్యులుగా మార్చుతున్నారేమో తెలియదు. కాని ఈపుణ్యభూమి లో ధర్మం నేర్పబడుతుంది .భగవంతునిఅవతారమైన రాముని గూర్చి చెప్పినప్పుడు ,పెద్దలమాటమీద గౌరవం చూపటం .అన్నదమ్ములమధ్య ఆప్యాతలు ,ఉన్నతమైన పాతివ్రత్య లక్షణాలు ఇలా ఉన్నతమైన విలువలు నేర్పబడతాయి . తల్లిదండ్రులను కావడి లో మోసి సాకిన శ్రావణకుమారుని కథలు పిల్లలలోమానవీయ విలువలను మహోన్నతంగా పెంచుతాయి . తప్పుచేస్తే ఎంతటి దుర్గతి పొందుతారో అనేక ఉదాహరణలను పిల్లలు ఇక్కడ పురాణాదుల ద్వారా సంతోషంగా కథాశ్రవణ పద్దతి లో నేర్చుకుంటారు.

సత్యమార్గ ప్రవర్తకులుగా భావితరాలను తయారు చేయటం ఈవిధానంద్వారా సులభం. దీన్ని తిరస్కరించి న నేటి మనవిద్యావిధానం వలననే దానవకృత్యాలు చేస్తున్న మనవిద్యార్ధులు కొందరిిగూర్చి మనం నిత్యం పేపర్లలో చదువుతున్నాము.చివరకు వారిని దిశానిర్దేశం లేని ఆందోళనాపూరితమనస్కులుగా తయారు చేస్తున్నాము.ఈవిద్యనివ్వగలగటం వలననే నాడు ప్రహ్లాద ,ధృవులు వీరాభిమన్యులు శివాజీ లు సుఖదేవ్ లు ,రాణాప్రతాపులు ,వివేకానందులు ,భగత సింగ్ లు, గాంధీజీలు అల్లూరి లాంటి దేశభక్తులు త్యాగపురుషులు మదర్ థెరిస్సాలవంటి సేవానిరతులు పుట్టి సమాజ శ్రేయస్సుకు తమ తనుమానప్రాణాలను ఆనందంగా అర్పించారు. ఈవిద్య లోపించటం వలననే నేడు ప్రేమ పేరుతో రాక్షసకృత్యాలకు పాలపడి ఆయేషాలంటి పసిబిడ్దల ప్రాణాలు హరిస్తున్నా మనోహర్ లాంటి మృగాలు ,ర్యాంగింగ్ పేరుతో ఇతరులను హింసించి ఆనందపడే మానసిక రోగులు ,స్వల్ప కారణాలకె ఆత్మహత్యలు చేసుకునే బలహీన మనస్కులు తయారవుతున్నారు.తాగుడు ,వ్యభిచారాది దుర్గుణాలు పెరిగి , స్వార్ధమే పరమావధిగా లోకాన్నించి దోచుకుని పోగేసుకోవాలనే మనస్తత్వంపెరిగి సమాజం అల్లకల్లోలమవుతున్నది ఈవిద్యను సక్రమమైన రీతిలో అందించకపోవటము వలననే

ఇలాంటి విద్య ఈదేశం లో ఏమూలకూడా మిగిలి వుండకూడదనే వుద్దేశ్యం తో ఎన్నో ధర్మవ్యతిరేకశక్తులు చేస్తున్న కుట్రల ఫలితంగా మనపిల్లలకు పాఠశాలలో ఎలాగూ ఈధర్మ విద్య దూరమవుతున్నది. ఇంకా బయటకూడా దీని ఆనవాలు లేకుండా చేయాలని" కలి " పురుషుని సైన్యం తీవ్రంగా శ్రమిస్తున్నది.
ఇది ధర్మ భూమి .ఇక్కడ నేర్చుకుంటూన్నది ధార్మిక విద్య . కనుక ఎక్కడో పాశ్చాత్యదేశాలలో పలికిన అక్కడివాతావరణానికి సరిపోయిన ఈవాదనలను చిలకపలుకుల్లా వల్లించే వారు అక్కడకు పోయి చెప్పమనండి ప్రయోజనముంటూంది . ఇక్కడ వారికాశ్రమ అక్కరలేదు .ఇది మతవిద్యకాదు ధార్మిక విద్య అని చెప్పండి


Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP