శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శ్రీవేంకటేశ్వరజగన్మాతపీఠంలో ఈరోజు వరలక్ష్మీ విభవం

>> Friday, July 31, 2009






అనంతరూపాల భాసిస్తూ ,ఆశ్రితులను కాపాడు ఆదిపరాశక్తి ఆతల్లి వరలక్ష్మిగా అవతరించి భక్తుల సేవలందుకునే సుదినం ఈరోజు . శ్రావణమాసాన ఆతల్లిని ఆరాధించే అతివలు ఆమెకృపకు పాతృలై అనంత సంపదలను పొందుతారు.


శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠము లో ఈరోజు ప్రాత: కాలమునుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించబడినాయి .
ఉదయాన్నుండి మూలమూర్తులకు పురుషసూక్త ,రుద్రసూక్తములతో వేంకటేశ్వర,రామలింగేశ్వరులకు ,శ్రీసూక్తప్రకారంగా అమ్మవారికి పంచామృతాలు ,కుంకుమ ,గంధ,హరిద్రాచూర్ణయుక్త జలములతో అభిషేకములు నిర్వహింపబడ్డాయి. తదనంతరం శ్రీచక్రార్చన ,పూజలు జరిగాయి . ఆతరువాత గోత్రనామాలు పంపిన భక్తులతరపున కుంకుమార్చన జరుపబడినది.

ఆతరువాత మాయింటి కోడల్లు ,ఆలయానికి వచ్చిన భక్తురాళ్లచేత సామూహికంగా వరలక్ష్మీ వ్రతం భక్తి శ్రద్దలతో సాగినది. ఆతరువాత ప్రత్యేకించి చేసిన ఐదురకాలైన ప్రసాదాలను అమ్మకు నివేదించి వాయినదానాలు ఇచ్చిపుచ్చుకున్నారు పరస్పరం .


సాయంత్రం మరలా సంధ్యహారతి అనంతరం అమ్మవారికి లలితా సహస్రనామాలతో పుష్పాలతో పూజ జరుపబడినది. అలాగే జ్యోతిస్వరూపమైన ఆతల్లికి దివ్యజ్యోతుల నీరజనం సమర్పించబడినది.

Read more...

మీ ఇంట నోచిన నోముగురించి ఇక్కడ పదిమందికి తెలియజేయండి

>> Thursday, July 30, 2009

.


మాతృస్వరూపిణులైన తల్లులకు నమస్కారం

ఈజాతి జీవధారమీరు .ఇక్కడ సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడి తరువాతతరాలకు అందిస్తూ సజీవంగా వుంచుతున్న జ్ఞానఝరులు మీరు. వందమంది మగవాళ్లం ఐవ్వలేని శిక్షణ తరువాతి తరాలకు మీరొక్కరొక్కరే ఇవ్వగలరు. కనుకనే ఈజాతి తనసాంప్రదాయాన్ని ధార్మికతను ,విలువలను కాపాడుకోగలుగుతున్నది ఇప్పటీవరకు .
కాకుంటే కొత్తతరాలకు ఈవిద్యను అందించటం లో అనేక కారణాలవలన ఆఆటంకాలు ఎదురవుతున్నాయి .నిరంతరం జీవితాన్ని పరుగులమయంగామార్చుకుని అన్నివిలువలను ,అన్ని సత్సాంప్రదాయాలను అందుకోలేక కొత్తతరం ఈ దివ్య విజ్ఞానాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడినది.

ఈస్థితిలో ఈ మానవ కళ్యాణ కారకమైన ఈ సనాతన సాంప్రదాయాలను కొత్తతరానికి అందించవలసిన బాధ్యతకూడా మీ పైనేవున్నది. ఈ ఆచారాలలో ఇమిడివున్న ,ఆథ్యాత్మిక ,ఔషదీయ ,మానవీయ ,ప్రేమమయ జీవన విలువలు తెలియపరచాల్సివున్నది. ఈపండుగలు మీరు జరపటం లో పొందే ఆనందము ,తద్వార కుటుంబములో పొంగిపొరలే ఆప్యాతానురాగాలు తెలుసుకున్న తరువాత, భౌతికవనరుల సంపాదనే గొప్పనుకుని మనసును ఎడారిగామార్చుకుని తల్లడిల్లుతున్న ఈతరానికి ఈసాంప్రదాయ ఆచరణవలన కలిగే మేలు తెలుస్తుంది . గతం లో ఎవరికి వారుగా ఈపండుగలను పాటించేవారు. అప్పటి తరం లో అందరికీ ఈ విజ్ఞానము తెలుసుకనుక ఇంకొకరికి చెప్పవలసిన అవసరం వుండేది కాదు. కానీ కాలం మారింది మంచినైనా పదిసార్లు చెప్పిచేపిస్తేగాని స్వీకరించని దురవస్థ దాపురించింది. కనుక మీరు ఆచరించే ఈపండుగలగూర్చి ,చేసిన విధముగూర్చి పదిమంది పదిచోట్ల చెబితే అది ధర్మప్రచారమవుతుంది. ధార్మిక సేవ అవుతుంది.
నిన్నొక సోదరి నన్నడిగినది . సత్కార్యానికి కూడా ప్రచారము అవసరమా మాస్టారూ ! అని
నేను ఖచ్చితంగా చెబుతున్నాను . మనిషికి రెండు ఆప్షన్స్ వున్నాయి .ప్రస్తుతం ,ఒకటి మంచి ,రెండు చెడు అదిలేకుంటే ఇది మనిషిమనసులోకి చొచ్చుకు పోతుంది. ఈ ఆచారాలవలన మనసులు పవిత్రమై ,పవిత్రభావలతో ,ప్రేమానురాగలతో కుంటుంబములలో శాంతి సౌఖ్యాలు వెల్లివిరుస్తాయి ,భగవంతుని అనుగ్రహం కూడా తోడవుతుంది కనుక. ఇవి వదిలెసేలా మనసుకు వీటిపట్ల అనాసక్తిని పెంచుతున్న " కలి" సేనల ప్రచారప్రభావాలనుండి ఒక్కరు మీ ఆచరణను చూసి కాపాడబడినా .ఈసంస్కృతి పట్ల అనురక్తి పెంచుకున్నా మీకు పుణ్యమే . మీరు పండుగను వ్రతాన్ని ఆచరించినతరువాత ,ఆవివరాలను ఇక్కడ మీ బ్లాగులలో వ్రాయండి లేదా మీవారు బ్లాగునడుపుతున్నట్లైతే దానిలో వ్రాయండి . నాకైనా మెయిల్ లోవివరాలు పంపండి ఇక్కడుంచుతాను . మహాలక్ష్మీ సమానులైన మీఅందరికీ వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటున్న ఈ శుభసమయాన శుభాకాంక్షలు .ధన్యవాదములు .

Read more...

పసుపు కుంకుమలివ్వండి ముత్తైదువులకు

>> Wednesday, July 29, 2009

చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా 1
కురువింద మణిశ్రేణీ కనకత్కోటీర మండితా 2

శుక్రవారం పూట మహిళలు సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకుని పూజచేయడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.

అదీ శుక్రవారం పూట లలితసహస్రమ నామ స్తోత్రమును పూర్తిగా పఠిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. కుదరని పక్షంలో శుక్రవారం పూట పై మంత్రముతో అమ్మవారిని స్తుతించి కర్పూర హారతులు సమర్పించుకుంటే ఈతిబాధలు తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు.

ఇంకా శుక్రవారం రోజున ఇంటికి వచ్చే ముత్తైదువులకు పసుపు, కుంకుమలిస్తే.. వంశం వృద్ధి, సకల సంపదలు, ఉద్యోగరీత్యా వృద్ధి వంటి మంచి ఫలితాలుంటాయి. దీంతో పాటు శుక్రవారం పూట పసుపు కుంకుమలిచ్చే మహిళలకు దీర్ఘసుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుందని విశ్వాసం.

Read more...

శ్రావణమాసం లో పండుగలివి తెలుసుకుందాము

>> Tuesday, July 28, 2009

సమస్త సంపదలకూ మూలంమహాలక్ష్మి . ఆమె కృప వల్లనే మనకు ఆకర్షణీయమైన రూపం ఏర్పడుతోంది. ఆమె కృప వల్లనే విద్యాధికులమై, విఖ్యాతి పొందుతున్నాం. లకీకటాక్షం మానవులందరికీ అవసరమే. ఆ దేవి దయ ఉంటే అన్నింటా అభివృద్ధి. అంతులేనన్ని సంపదలు. ఆమె అనుగ్రహం పొందాలనుకునే వారందరూ ఆమె ప్రాణనాథుడు శ్రీమహావిష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం పేరు మీదుగా ఏర్పడిన శ్రావణమాసంలో విష్ణువల్లభను శ్రద్ధాభక్తులతో కొల్చి ఆమె అనుగ్రహానికిపాత్రులై ధనకనక వస్తువాహనాలు పొందాలని కోరుకుంటూ ఈ మాసంలో ఆచరించవలసిన విధులను వివరిస్తున్నాం.

సకల సౌభాగ్యాలకు, సిరి సంపదలకు, శుభకార్యాలకు ఆవాసం శ్రావణమాసం. కాబట్టి సంప్రదాయాలను పాటించే ప్రతి ఇంటి ముంగిటా చక్కగా నీళ్లు చల్లి, ముగ్గులు పెట్టి, గుమ్మాలన్నీ మామిడి తోరణాలతోటీ, గడపలు పసుపూ కుంకుమలతోటీ శోభాయమానంగా కనిపించే ఇంటిలో ఘల్లుఘల్లుమనే గజ్జల సవ్వడితో లకీదేవి కాలు పెడుతుంది. అమ్మ పాద స్పర్శ సోకితే నట్టిల్లు బంగారంగా మారుతుంది. ఇక ఆ యింటిలో సిరిసంపదలకు కొదవుండదు.

శివప్రీతికరం శ్రావణ సోమవారం
శ్రావణ మాసంలో వచ్చే సోమవారం శివునికి ప్రీతికర మెనది. కాబట్టి శివభక్తులు ఈ నాలుగు సోమవారాలు దీక్షగా ఉపవాసముండి శివుడికి అభిషేకం, రుద్రనమకం, చమకం పఠిస్తారు. పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే అయిదవతనం కలకాలం నిలచి ఉంటుందని భక్తుల నమ్మకం.

ముఖ్యమైన పండుగలు ఇవి
ఈ నెలలో వచ్చే సోమ, మంగళ, శుక్ర, శనివారాలు ఎంతో పవిత్రమైనవి.మంగళ గౌరీవ్రతం, నాగపంచమి, భానుసప్తమి, పుత్రదా ఏకాదశి, దామోదర ద్వాదశి, వరాహజయంతి, వరలకీవ్రతం, జంధ్యాల పౌర్ణమి, పోలాల అమావాస్య వంటి పండుగలు, పర్వదినాలు ఈ మాసంలోనే వస్తాయి.

మంగళగౌరీవ్రతం: మంగళకరమైన తల్లి మంగళగౌరీ దేవి. పెళ్లికాని పడచులు గౌరీదేవిని పూజిస్తే మంచి భర్త లభిస్తాడని, పెళ్లయిన వారు ఈ వ్రతం ఆచరిస్తే సౌభాగ్యం కలుగుతుంది. కోరిన కోరికలు తీరతాయని ప్రతీతి. అందుకే నూతన వధువులు సౌభాగ్య సిద్ధికోసం ఈ మాసంలోని ప్రతి మంగళవారం నాడు మంగళ గౌరీవ్రతం ఆచరించడం సంప్రదాయం. పసుపు, కుంకుమ, పూలు, సుగంధ ద్రవ్యాలు, ఆవునేతితో వెలిగే జ్యోతిరూపంలోనూ మంగళగౌరి కొలువై ఉంటుంది.అందుకే ఈ మాసంలో ఇంటికి వచ్చిన ముత్తయిదువులకు మంగళకరమైన వస్తువులను ఇచ్చి, వారి ఆశీర్వాదం పొందడం శుభకరం.

నాగపంచమి: హిందువుల ప్రధాన పండుగల్లో నాగపంచమి ఒకటి. కన్నెపిల్లలు, గర్భధారణలో ఆటంకాలు ఏర్పడుతున్నవారు, కుజదోషం కారణంగా వివాహం ఆలస్యం అవుతున్నవారు ఈ పండుగను జరుపుకుంటే, స్వాంతన చేకూరుతుందని శాస్త్రోక్తి. ఈరోజున గోడపై పసుపు కుంకుమలతో నాగమూర్తులను లించిగాని లేదా మృత్తికాదులతో నిర్మించిన సర్పాలను గాని పూజించాలి. పంచమినాడు సర్పాలను పూజించిన వారికి సర్పభయం ఉండదని విశ్వాసం.

భానుసప్తమి: ఈరోజున ప్రత్యక్షనారాయణుడైన సూర్యుడిని ఆరాధించడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది. అభీష్టాలు సిద్ధిస్తాయి.

పుత్రదా ఏకాదశి: పూర్వం రాజులు పుత్రసంతానం కోసం ఈ వ్రతం ఆచరించి ఫలితాలు సాధించేవారు. కాబట్టి ఈ ఏకాదశి నాడు శ్రద్ధగా విష్ణుపూజ చేస్తే సంతాన ప్రాప్తి కలగడం తథ్యమని పురాణ కథనం. శ్రావణ శుద్ధ ఏకాదశికి పుత్రదా ఏకాదశి అని పేరు. ఈరోజున విష్ణుపూజ, ఉపవాసం, జాగరణ చేసి, గొడుగు దానం చేస్తే విశేష పుణ్యదాయకం.

దామోదర ద్వాదశి: దామోదర ద్వాదశిగా పేరుగాంచిన శ్రావణ శుద్ధ ద్వాదశినాడు విష్ణుపూజ, విష్ణుసహస్రనామ పారాయణ చేసి, విష్ణుప్రతిమను దానం చేస్తే మంచిది.

వరాహజయంతి: శ్రీమన్నారాయణమూర్తి వరాహ రూపంలో అవతరించిన శ్రావణ శుక్ల త్రయోదశినాడు వరాహస్వామివారికి పూజలు, అర్చనలు చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని ప్రతీతి.

జంధ్యాల పున్నమి లేదా రాఖీపూర్ణిమ: దైవీశక్తులతో కూడిన శ్రావణ శుద్ధ పూర్ణిమను రాఖీపూర్ణిమగా, జంధ్యాల పూర్ణిమగా జరుపుకుంటారు. శక్తిస్వరూపిణిగా వ్యవహరించబడే ఇంటి ఆడపడచు(సోదరి) చేత ఈరోజు రక్షాబంధనం కట్టించుకున్న సోదరులకు దేవతలు రక్ష గా నిలిచి అరిష్టాలను తొలగిస్తారని, అన్నింటా అండదండగా నిలుస్తారని విశ్వాసం. ఈరోజున బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు తదితర జంధ్యాన్ని ధరించే అన్ని కులాలవారు స్నానాన్ని ఆచరించి నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు. కొత్తగా ఉపనయనం జరిగిన వారికి ఉపాకర్మ జరిపిస్తారు. అందుకే దీనికి జంధ్యాల పూర్ణిమ అని పేరొచ్చింది. ఈరోజునే హయగ్రీవ జయంతి

"జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతిం
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే'

అంటూ సర్వవిద్యలకూ ఆధారభూతంగా చెప్పుకునే హయగ్రీవుని స్తుతించడం వల్ల విద్యార్థులలో జ్ఞాపకశక్తి పెరుగుతుందని శాస్త్ర వచనం.

కృష్టాష్టమి: శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన దివ్యతిథే కృష్ణాష్టమి. ఈరోజు ఉదయాన్నే స్నానపానాదులు చేసి షోడశోపచారాలతో కృష్ణుని అర్చించాలి. కృష్ణునికి ఇష్టమైన సాత్వికాహారం పాలు, పళ్లు, వెన్న, మీగడ మొదలైన వాటితో నైవేద్యం పెట్టాలి. కృష్టాష్టమి రోజున కృష్ణుని అర్చిస్తే సకల పాపాలు పోతాయి. ధర్మార్థ కామ మోక్షప్రాప్తి, కార్యజయం కలుగుతాయని స్కాందపురాణంలో కనిపిస్తుంది..

కామికా ఏకాదశి: శ్రావణ బహుళ ఏకాదశికి కామికా ఏకాదశి అని పేరు. ఎందుకంటే ఈ రోజున ఏకాదశీ వ్రతాన్ని ఆచరిస్తే కోరికలు తీరతాయట. ఈ రోజు వెన్నను దానం చేస్తే విశేష ఫలితాలు పొందవచ్చు.

లకీదేవి ఎక్కడ నివసిస్తుంది?
గోవులు, తామరపుష్పాలు, పాడిపంటలు, ఏనుగులు, గుర్రాలు, రత్నాలు, అద్దాలు, శంఖనాదం, ఘంటారావం, హరిహరార్చన, పూజామందిరం, సర్వదేవతలనూ అర్చించే వారి స్వరం, తులసి ఉన్న ప్రదేశం, పూలు, పండ్లతోటలు, మంగళకరమైన వస్తువులు, మంగళవాద్యాలు, దీపకాంతులు, కర్పూర హారతి, చెట్లలోని హరిత వర్ణం, స్నేహం, ఆరోగ్యం, ధర్మబుద్ధి, న్యాయస్థానాలు, శుచి, శుభ్రత, సదాచార పరాయణత, సౌమ్యగుణం, స్త్రీలు ఎటువంటి చీకూచింతా లేకుండా హాయిగా ఉండే ఇండ్లు, బ్రాహ్మణులు, విద్వాంసులు, పెద్దలు, పండితులకు సన్మాన సత్కారాలు జరిగే ప్రదేశాలు, వేదఘోష, సత్వగుణ సంపదలు, క్రమశిక్షణ, కార్యశూరత్వం, సమయపాలనలోనూ మహాలకి నివసిస్తుంది.

సంపదలంటే ఏమిటి?
సాధారణంగా మనం ధనం అంటే డబ్బు ఒక్కటే అనుకుంటాము. అయితే ఆయుష్షు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ధైర్యం, స్థ్యైర్యం, విజయం, వీర్యం, అభయం, శౌర్యం, సౌభాగ్యం, సాహసం, విద్య, వివేకం, ధనం, ధాన్యం, సంపద, బంగారం, వెండి, ఆభరణాలు, వస్తువులు, వాహనాలు, ఆయుధాలు, పశువులు, పుత్రపౌత్రాదులు, కీర్తిప్రతిష్ఠలు, సుఖసంతోషాలు మొదలైనవన్నీ సంపదలే. వీటన్నింటికీ అధినేత్రి ఆ తల్లే.ఆమె అనుగ్రహంతోటే సాధ్యం. కాబట్టి ఆమెను పూజించి ఈ సంపదలను పొందుదాం.

శ్రావణమాసంలోని ముఖ్య పర్వదినాలు
నాగపంచమి: జులై 26
మంగళగౌరీవ్రతం: జులై 28
వరలకీవ్రతం: జులై 31
పుత్రదా ఏకాదశి: ఆగష్టు 1
దామోదర ద్వాదశి: ఆగష్టు 2
రక్షాబంధన దినోత్సవం: ఆగష్టు 5
కృష్టాష్టమి: ఆగష్టు 13
పోలాల అమావాస్య: ఆగష్టు 20

[ సాక్షి పత్రికనుండి డి. వి. ఆర్ .భాస్కర్ గారు వ్రాసిన వ్యాసం భాక్తజనుల కోసం ఇక్కడ వుంచుతున్నాను .]

Read more...

త్యాగధన సంసిద్ధులు ,దృఢగాత్రులైన యువకులు కావాలి

>> Sunday, July 26, 2009

స్థలం : బేలూరు మఠం
కాలం : ౧౯౦౧

ఈమధ్య స్వామీజీ మఠం లోనే వుంటున్నారు.ఆరోగ్యం అంతగా బాలేదు. కాని ఉదయం సాయంత్రం వాహ్యాళికి వెళ్ళివస్తున్నారు.
శిష్యుడు : స్వామీజీ మీ ఆరోగ్యం ఎలావున్నది ?
స్వామీజీ : ఈశరీరం దైన్యస్థితి లో వున్నది .కానీ నాఉద్యమం లో తోడ్పడటానికి మీరెవ్వరు ముందుకు రావటం లేదు .ఒంటరిగా నేనేం చేయగలను ? ఈసారి ఈశరీరం వంగభూమి లోపుట్టింది . కాబట్టి అదెక్కువ శ్రమకుఓర్చలేదు .మీరు నాకు సహాయకారులు కాకుంటె నేనేం చేస్తాను ?

శిష్యుడు : స్వామీ ! సర్వసంగపరిత్యాగులైన ఈ బ్రహ్మచారులకు సన్యాసులు మీకు అండగావుండగా మీ వెనుక ని్లచివున్నారు . మీ ఉద్యమాని కి వారిలో ప్రతిఒక్కరు తమజీవితాన్ని అర్పించటానికి సిధ్ధంగాఉన్నారు. అయినా మీరిలా మాట్లాడుతున్నారే ?
స్వామి : నాకు బెంగాల్ యువకులు ఒక జట్టు కావాలి .వారే ఈదేశానికి ఆశ. భవిష్యత్తు లో నా ఆశంతా శీలవంతులైన యువకులపైనే ఆధారపడిఉంది. .వారు బుధ్ధి కుశలురు .తమ సర్వస్వాన్ని యితరుల సేవకై త్యాగం చేసేవాల్లై యుండాలి .నాఉద్దేశ్యాన్ని కార్యరూపం లోకి తేవటానికి తమ జీవితాలను త్యాగం చేసి దానివల్ల తమకు దేశానికి సౌభాగ్యం చేకూర్చేది ఈయువకులే .ఇప్పుడు సామాన్యులైన యువకులు గుంపులుగుంపులుగా వస్తున్నారు .ఇకముందుకూడా వస్తారు. వీళ్ల ముఖాలు మొద్దుబారిఉన్నాయి .వీళ్ళ గుండెల్లో ఉత్సాహం లేదు. దుర్భలమైన వీళ్ళ శరీరాలు పనిచేయటానికి నిరుపయోగం .,. ఇక వీళ్లమనసుల్లో ధైర్యం శూన్యం .ఇటువంటివారిద్వారా ఏంపని జరుగుతుంది .? నచికేతునివంటిఉత్సాహంకలవారు పదిమంది దొరికితేచాలు ఈదేశప్రజల ఆలోచనలను ,విధానాల్ని కొత్తపుంత తొక్కించగలను.

శిష్యుడు : స్వామీ మీదగ్గరకు యెందరో యువకులు వస్తున్నారు కదా ! వారిలో అటువంటి స్వభావం కలవాడు ఒక్కడైనా మీకు కన్పించలేదా ?

స్వామీజీ : వాళ్లలో బుద్ధికుశలురైన వారున్నా వారు వివాహబంధం లో కట్టుబడి పోయారు .ప్రాపంచికమైన పేరు ప్రతిష్థలు లేదా డబ్బు సంపాదించటానికి కొందరు అమ్ముడుపోయినారు.ఇంకకొంతమంది దుర్భలశరీరులు .మిగిలిన బహుసంఖ్యాకులు ఉన్నత భావాలనుగ్రహించలేరు . నావున్నత భావాలను గ్రహించేశక్తి నీకున్నమాట నిజమే కానీ నీభావాలను ఆచరణలో పెట్టలేవు. ఈకారణాలవల్ల నామనస్సు ఒక్కోసారి తీవ్రమైన వేదనకు గురవుతున్నది. మానవ శరీరాన్ని ధరించికూడా దురదృష్టం చేత ఏ పని ఎక్కువ చేయలేకపోయానే అని బాధపడుతున్నాను. అయినా పూర్తి ఆశవదలి పెట్టలేను . ఎందుకంటే భగవంతుని దయవలన ఈ యువకుల్లో నుండే సకాలం లో కార్య ధురీణులు ,పారమార్ధికబలసంపన్నులైన వారు నాభావాలను ఆచరణలో పెట్టటానికి బయటకు వస్తారేమో !

శిష్యుడు : విశాలమైన మీ ఉదారాశయాలు ఏదో ఒకరోజు సార్వజనీంగాకారన్ని పొందుతాయని నా దృఢవిశ్వాసమ్ .
కారణం ఆభావాలు సర్వతో ముఖాలు ,ప్రతి కార్యరంగం లోనూ ,ప్రతి ఆలోచనావిధానం లోనూ ౌత్తేజాన్ని కల్గించేవి కాబట్టి .ఈదేశ ప్రజలు మీభావాలను బహిరంగం గాగాని ,రహస్యం గాగాని ఆమోదించి వాటిని ప్రజలకు బోధిస్తున్నారు.


స్వామీజీ : వాళ్ళు ఆభావాలు నావి అని చెబితే ఏమి? చెప్పకపోతే ఏమి? నాభావాలు అంగీకరిస్తే చాలు. సాధువులలో నూటికి తొంభై తొమ్మిది మంది కామినీ కాంచనాదులను త్యాగం చేసికూడా ,పేరు ప్రతిష్థలమీద కాంక్షతో కట్టుబడి పోతున్నారు. "ఉదారమైన మనస్సు కలవాడికి కూడా కీర్తి అనేది చిట్టచివరి బలహీనత " అని నీవు చదవలేదా ? ఫలాపేక్ష పూర్తిగా వదలి మనం పనిచేసి తీరాలి . ప్రజలు మనలను మంచివాల్లనవచ్చు.లేదా చెడ్డవాల్లనవచ్చు. కానీ ఆదర్శాన్ని ముందుంచుకుని "నీతినిపుణులు భూషించినా ,ధూషించినా " లెక్కచేయకుండా సింహాలలాగా మనం పనిచెయాలి.

శిష్యుడు : ఇప్పుడు మనం ఏ ఆదర్శాన్ని అనుసరించాలి ?

స్వామీజీ : హనుమన్మహావీరుడే మనకిప్పుడు ఆదర్శపురుషుడు .రామాజ్ఞతో అతడు సాగరాన్ని ఎలా లంఘించాడో చూడు. అతనికి భీతి మృత్యుభయం లేదు.అతడు జితేంద్రియ చక్రవర్తి .అత్యద్భుత వివేక మహిమాన్వితుడు . మనం ప్రస్తుతమున్న దాస్యభావ నిర్మూలనం కోసం హనుమంతుని జీవితాదర్శంగాఎన్నుకోవాలి. దానివల్ల మిగతా ఆదర్శాలన్నీ జీవితం లో క్రమంగా అభివ్యక్తమౌతాయి. ఎదురు చెప్పకుందా గుర్వాజ్ఞను పాటించటం ,కఠోర బ్రహ్మ చర్యపాలన _యివే జయం పొందటానికి కీలకాలు. హనుమంతుడు ఒకవైపు దాస్య భావానికి ఆదర్శమూర్తి .మరో వైపు లోకాన్ని హాహాకారాలెత్తించే సింహసదృశ బలాన్వితుడు .రామకార్యార్ధమై తనజీవితాన్ని త్యాగంచేయటానికి ఏమాత్రం వెనుకాడడు .రామసేవ తప్ప హరిహర బ్రహ్మాదుల పదవినైనా ఆశించడు . అతనిది అటువంటి పరిపూర్ణ నిర్లిప్తత .శ్రీరామునికి హితం కూర్చటమే ఒక్కటే అతని జీవిత లక్ష్యం . అటువంటి పరిపూర్ణ భక్తికి కావలసిఉంది. ఖోల్ వాయిస్తూ కరతాళ ధ్వనులు చేస్తూ సంకీర్తన పిచ్చిలో గంతులు వేయటం తో జాతి యావత్తూ దిగజారి పోయింది .ప్రప్రథమంగా వాళ్ళు అజీర్తి వ్యాధిగ్రస్తమైనజాతికి చెందినవాళ్ళు. దానికి తోడు ఈవిధంగా గంతులువేస్తూ ఎగురుతుంటే శ్రమను ఎలా ఓర్వగలరు? పరిపూర్ణమైన పారిశుధ్ధ్యం ఉత్తమ సాధనకు ఎంతో ఆవశ్యకం .కానీ ఆఉత్తమసాధనను అనుసరించటానికి ప్రయత్నించటం లో వాళ్ళు గాఢ తమస్సులో కూరుకపోయారు.నీవే జిల్లాకు పోయినా ,ఏగ్రామానికిన్పోయినా ఈఖొలే,కరతాళ ధ్వనులే వినిపిస్తాయి. ఈదేశం లో భేరీలు తయారు కావటం లేదా? బాకాలు ఢంకాలు యీ దేశం లో దొరకతం లేదా ? ఈవాద్యాలనుండి వచ్చే గంభీరధ్వనులను మనపిల్లలను విననీయండి . చిన్నప్పటినుండే ఈఆడంగి సంగీతాలు,సంకీర్తనలను విని విని ఈదేశం స్త్రీమయమైపోయింది .అంటే పురుషులలో పుంసత్వం చచ్చిందన్నమాట .అంగాంగ సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ స్త్రీలు విశ్రుంఖలంగా ,సిగ్గులేకుండా చౌక బారు ప్రదర్శనలిస్తుంటె పురుషులు పతితులుగాక మరేమవుతారు ?
ఈచిత్రాన్ని చిత్రించటానికి కవి హృదయం కూడా చాలదు. ఢమరులు వాయించాలి . కొమ్ములు ఊదాలి. భేరీలు మ్రోగించాలి .గంభీర యుద్ధనినాదాలు చెలరేగి మహావీర ! మహావీర ! అంటూ "హరహర" "హరహర" ఓం ఓం ... అని అరుస్తూ దిక్కులు పిక్కటిల్లజేయాలి. మానవునిలో సున్నితభావాలను ను రేకెత్తించే సంగీతాన్ని ఇప్పుడు కొంతకాలం ఆపాలి . ఖేయాల్ టప్పా మొదలైన లలిత స్వరాలను కొంతకాలం ఆపివేసి ప్రజలు ద్రుపద సంగీతాన్ని వినేట్లు అలవాటు చేయాలి . గంభీరమైన వేదవాక్కుల మేఘ గర్జనతో దేశానికి ప్రాణం పోయాలి .ప్రతి విషయం లోనూ వీరోచితమైన పురుషత్వాన్ని పునరుజ్జీవింపజేయాలి. అటువంటి ఆదర్శం తో మీశీలాన్ని నిర్మించుకోగలిగినతరువాతే వేయిమంది మిమ్మల్ని అనుకరిస్తారు.
కాని ఆదర్శం నుండి ఒక్క అంగుళమైనా తొలగిపోకుండా జాగ్రత్త తీసుకో .అధైర్యపడవద్దు .ఆహారవ్యవహారాల్లో గానిదుస్తులవిషయాల్లోగాని ,నిద్రలోగాని ఆటల్లోగాని పాటల్లోగాని,భోగం లోగానీ ,రోగం లోగానీ ఎల్లప్పుడూ ఉత్తమమైన నైతిక బలాన్ని ప్రదర్శించు . అప్పుడే దివ్యజనని మహశక్తి అనుగ్రహం లభిస్తుంది.

శిష్యుడు : స్వామీ ! ఒక్కొక్కసారి నాకు నిరుత్సాహం కలుగుతుంది. ఎందుకోతెలియటం లేదు .

స్వామీజీ : అలా నిరుత్సాహం కలిగినప్పుడు ఈవిధంగా తలచుకో " నేనెవరి శిష్యుడిని ? అలాంటివారి సాహచర్యం లోవున్న నాకిటువంటి మనోదౌర్భల్యం కలగటమా? అలాంటి మానసిక దౌర్భల్యాన్ని అణగదొక్కి ఈవిధంగా చెబుతూ లేచి నిలబడు " నేను ధీరుణ్ణి ,మేధావంతుణ్ణి నేను బ్రహ్మ జ్ఞానిని ,ప్రజ్ఞాసంహితుణ్ణి ,కామినీ కాంచనాలనుజయించిన శ్రీరామకృష్ణుని జీవిత సహచరుడైన ఫలానావారి శిష్యుణ్ణి " అనే విషయం జ్ఞాపకముంచుకుని నీగొప్పతనాన్ని పూర్తిగా గుర్తుంచుకో .ఇది గొప్పఫలితాన్నిస్తుంది. ఇటువంటి భావన లేనివాడిలో బ్రహ్మం జాగృతం కాదు . నీవు రామప్రసాదుపాట వినలేదా ? :ఏదివ్యజనని ఏ లోకానికి పాకురాలో ఆ లోకం లో జీవిస్తున్న నేను ఎవరిని చూచి భయపడాలి ? ఎల్లప్పుడూ అలాంటీ స్వాతిశయం నీమనస్సులో మేల్కొని ఉండనీ .అప్పుడు మనోదౌర్భల్యం హృదయదౌర్భల్యం నీదరి చేరలేవు. నీమనస్సెప్పుడూ దౌర్భల్యానికి వశం కానీవద్దు. మహావీరుడైన హనుమంతుని జ్ఞప్తికి తెచ్చుకో ! దివ్యజనని గుర్తుంచుకో ! బలహీనత పిరికితనం తక్షణమే పూర్తిగా మటుమాయం .

[ శ్రీ వివేకానందులు -శిష్య సంభాషణలు నుండి]


మొన్న శుక్రవారం ఒక సత్కార్యవిషయమై మధనపడుతూ అనాలోచితంగా చేతిలోకి తీసుకున్న పుస్తకం తెరవగనే కనపడిన ప్రబోధమిది . దీని గుర్వాజ్ఞగా శిరస్సువంచి స్వీకరిస్తున్నాను .

Read more...

మహాలక్ష్మీపూజకు గోత్రనామాలు పంపండి

>> Saturday, July 25, 2009


మహాలక్ష్మీ దేవికి ప్రీతిపాత్రమైన ఈ శ్రావణమాసం లో రెండవ శుక్రవారం లో వరలక్ష్మీ వ్రతం చేయటం కన్నులపండుగగా సాగే ఉత్సవం . తెలుగు మహిళలు ఈ పర్వదినాన ఆతల్లిని సకల సంపదలను ప్రసాదించమని వేడుకుంటారు . శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠము లో ఆతల్లి లక్ష్మి,సరస్వతి ,రాధ ,దుర్గ .సావిత్రి అనబడే పంచప్రకృతి రూపాలలో విరాజిల్లుతూ భక్తజనుల బ్రోచుచున్నారు.అర్చనాప్రియ అగు ఆదిపరాశక్తి ఆ అమ్మను ఈ పర్వదినాన కోరినవారికెల్ల కోరిక లీడెర్చటానికి మంత్రిణ్యాది దేవతలు సిద్దముగా వుంటారు.

ఆతల్లి కిష్టమయిన ఈ పర్వదినాన గోత్రనామాలు పంపిన భక్తులెల్లరి కోసము అమ్మకు శ్రీ చక్రార్చనలో కుంకుమ పూజ జరుపబడుతుంది. పసుపు,కుంకుమలు సిరి సంపదలిచ్చే ఆతల్లి కరుణ పొందటానికి ఈ మహాలక్ష్మీ పూజలో గోత్రనామాలు పంపి పాల్గొనండి .

మీ పేరు ,భర్తపేరు గోత్రము పంపవలసిన చిరునామా

durgeswara@gmail.com

9948235641

Read more...

పసుపుకుంకుమలివ్వండి ముత్తైదువులకు

>> Thursday, July 23, 2009

చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా 1
కురువింద మణిశ్రేణీ కనకత్కోటీర మండితా 2

శుక్రవారం పూట మహిళలు సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకుని పూజచేయడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.

అదీ శుక్రవారం పూట లలితసహస్రమ నామ స్తోత్రమును పూర్తిగా పఠిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. కుదరని పక్షంలో శుక్రవారం పూట పై మంత్రముతో అమ్మవారిని స్తుతించి కర్పూర హారతులు సమర్పించుకుంటే ఈతిబాధలు తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు.

ఇంకా శుక్రవారం రోజున ఇంటికి వచ్చే ముత్తైదువులకు పసుపు, కుంకుమలిస్తే.. వంశం వృద్ధి, సకల సంపదలు, ఉద్యోగరీత్యా వృద్ధి వంటి మంచి ఫలితాలుంటాయి. దీంతో పాటు శుక్రవారం పూట పసుపు కుంకుమలిచ్చే మహిళలకు దీర్ఘసుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుందని విశ్వాసం.

Read more...

దారిద్ర్యదహన స్తోత్రము

>> Wednesday, July 22, 2009


విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ
కర్ణామృతాయ శశిశేఖరధారణాయ
కర్పూరకాంతిధవళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమఃశివాయ II 1 II

గౌరీప్రియాయ రజనీశకలాధరాయ
కాలాంతకాయ భుజగాధిపంకకణాయ
గంగాధరాయ గజరాజవిమర్దనాయ
దారద్ర్యదుఃఖదహనాయ నమఃశివాయ II 2 II

భక్తిప్రియాయ భవరోగభయాపహాయ
ఉగ్రాయ దుర్గభవసాగరతారణాయ
జ్యోతిర్మయాయ గుణనామసునృత్యకాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమఃశివాయ II 3 II

చర్మాంబరాయ శవభస్మవిలేపనాయ
బాలేక్షణాయ మణికుండలమండితాయ
మంజీరపాదయుగళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమఃశివాయ II 4 II

పంచాననాయ ఫణిరాజవిభూషణాయ
హేమాంశుకాయ భువనత్రయమండితాయ
ఆనంతభూమివరదాయ తమోమయాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమఃశివాయ II 5 II

భానుప్రియాయ భవసాగరతారణాయ
కాలాంతకాయ కమలాసనపూజితాయ
నేత్రత్రయాయ శుభలక్షణలక్షితాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమఃశివాయ II 6 II

రామప్రియాయ రఘునాథవరప్రదాయ
నాగప్రియాయ నరకార్ణవతారణాయ
పుణ్యేషు పుణ్యభరితాయ సురార్చితాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమఃశివాయ II 7 II

ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
గీతప్రియాయ వృషభేశ్వరవాహనాయ
మాతంగచర్మవసనాయ మహేశ్వరాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమఃశివాయ II 8 II

వశిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగనివారణమ్
సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాదివర్ధనమ్
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స హి స్వర్గమవాప్నుయాత్ II 9 II

Read more...

అద్భుతమైన ఈ గ్రహణ సమయాన్ని అపనమ్మకాలతో వృధాచేసుకోకండి

>> Tuesday, July 21, 2009

ఆస్తిక సోదరులకు విజ్ఞప్తి ఇది. గ్రహణ సమయము ఆథ్యాత్మిక లోకం లో సాధకులకు విశేష సమయము . ఈసమయాన జరిపే జపము ,తపము ,దానము కోట్లరెట్లు ఫలితాన్నిస్తుందని శాస్త్రవచనము . ఇటువంటి పవిత్రసమయం లో పవిత్రనదీ తీరానగాని లేక పవిత్ర స్థలాన లేక మీ గృహము లోనే శుద్దిచేసుకున్న స్థలము లో కూర్చుని మీ కుకులాచారము ప్రకారముగానీ .గురుపరంపర నుంచి వస్తున్న మంత్రాలను గానీ జపించుకోవటము వలన శీఘ్రమే ఫలితాలనిస్తాయి . ఏ మంత్రమూ గురువు వద్దనుంచి పొందనివారు కూడా ఓం నమ: శివాయ అనే పంచాక్షరిని గాని ,ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని గానీ నిరభ్యరంతరం గా జపం చేసి భగవదనుగ్రహం పొందగలరు. నామ జపం చేసుకునేవారు కూడా ఈ విధానం గానే జపం చేసుకోవచ్చు.

గ్రహణం పట్టే ముందుగా స్నానం చేసి జపం చేసుకుని గ్రహణానంతరం మరలా స్నానం చేసి మీ ఇంటి లోనున్న పూజా గృహాన్ని శుద్ధి చేసుకుని పటాలు లేక విగ్రహాలను కూడా ఆవుపాలు శుద్ధ జలం తో శుద్ధిపరచుకుని వారికి ఉపచారాదులు[పూజ] చేసుకోవాలి తదనంతరం మాత్రమే ఏదైనా స్వీకరించాలి. పొద్దుటే టీ లు కాఫీలు త్రాగేవారు రేపొద్దున్న ఒక్కపూట ఆ అలవాటుకు మానుకోవటం మంచిది.

తమకర్ధం కాకపోయినా అదెందుకు ఇదెందుకు అనే వితండవాదులు,సోమరుల వాదనలతో బుర్ర ఖరాబు చేసుకుని సమయము వృధాపుచ్చుకోక మనపెద్దలు ఘనవిజ్ఞానులనే విషయము నమ్మి వారు చూపిన బాటలో శుభాలకోసము ప్రయత్నం చేద్దాము

జై శ్రీరాం

Read more...

వెంట వచ్చే దెవరు ?

>> Sunday, July 19, 2009

అర్ధాగృహే వివర్తన్తే శ్మశానే మిత్ర బాంధవా:
సుకృతం దుష్కృతం చైవ గచ్చన్తుమమగఛ్చత :


సంపదలు గృహం లోనే వుండి పోతాయి . మితృలు బంధువులు శ్మశానం వరకు వచ్చి తిరిగిపోతారు .చనిపోయిన వారివెంట నంటి వచ్చేది వారి పుణ్య పాపములే !

Read more...

దైవ దర్శనానికి ఇలావెల్లటమంటే దరిద్రాన్ని కొనితెచ్చుకోవటమే .

>> Saturday, July 18, 2009




ఈమధ్యకాలం లో దైవదర్శనమునకు వెళ్ళే పెద్దలవల్ల సామాన్యభక్తులకు కలుగుతున్న ఇబ్బందులు వార్తలలో ప్రముఖముగా చోటు చేసుకుంటున్నాయి.దైవదర్శనానికెల్లే భక్తులు పాటించవలసిన విధులు వుల్లంఘించి వాల్లు ఇతరులకు ఇబ్బంది కలిగించి తమ శ్రేయస్సును తామే చెరుపుకుంటున్నవారవుతున్నారు. దోషపరిహార్ధం ఆలయము లో దైవదర్శనానికని వెళ్ళి అక్కడ తాము చేసే దోషాలమూలం గా ఇతరుల దోషాలను తలకెత్తుకుంటున్నారన్నా విషయం గమనించుకోవటంలేదు .


దైవాన్ని దర్శించటానికి వెల్లేవాళ్ళు ఎంతో వినయ విధేయ తలతో ,నిగర్వంగా వెల్లాలి ఆలయానికి. అక్కడ ఎంత శ్రమతో దైవదర్శనం చేసుకుంటే అంత కర్మ క్షయమయ్యి శుభాలు ప్రాప్తిస్తాయి. కానీ ఈమధ్యకాలం,లో తమ అధికారం .డబ్బు ,హోదా పలుకుబడులను ఉపయోగించి వక్రమార్గం లో దైవదర్శనాని కెల్లటం గొప్పగా భావించి ,ఆమార్గాలకై ప్రయత్నిస్తున్నారు. కాని దానివలన ఫలితాలు తారుమారుగా వస్తాయనే విషయం గ్రహించటం లేదు. .

యాచనకై మనింటి కొచ్చినవాడు వద్దికగా అమ్మా! అయ్యా !అని గుమ్మం ముందునుంచి వచ్చి యాచిస్తే అతనికి ఏదో ఒకటి దక్కుతుంది . అంతేగాని వాడు అడ్డదారి లో గోడదూకి వచ్చి నాకు వాల్లుతెలుసు ,వీల్లు తెలుసు ధర్మం త్వరగా చేయండి అని అంటే యజమానికి వళ్ళుమండుద్ది . దాంతో నాలుగు తగిలించే అవకాశం కూడా వుంది.భగవంతుని దగ్గరకు వెళ్ళటమంటే ఆయన దగ్గరకు యాచనకు వెళ్ళె స్తాయి మనది. మరక్కడ సాటివారిని నెట్టుకునో సాటివారి వరుసను బలవంతం గా ఆక్రమించో ముందు ఆయన దగ్గరకెళ్ళీనా సర్వాంతర్యామి అయిన ఆయనకు తెలియదా ? మహామాయకు అధినాయకుడైన ఆయనను మనం మోసం చేయగలమా? అది ఆయన ఆగ్రహానికి కారణం కావచ్చు కదా?

ఈమధ్య విజయవాడ దుర్గగుడికి మన డిజీపీ గారు వచ్చిన సందర్భంగా భక్తులకు కలిగిన ఇబ్బంది దానికి కారణమైన వారికి దోషం గా సంక్రమిస్తుంది. భక్తులను ఖైదీల్లాగా క్యూలైన్లకు తాళం వేసి నిలబెట్టారట. అందులో వున్న భక్తులు ఎంతగా బాధపడి ఈ అధికారాన్ని శపించివుంటారో తెలుసా ? అందులో వున్న సాధకులు,పరమభక్తులకు కలిగిన బాధ ఎలాంటి దుష్ఫలితాలు కలిగిస్తుందో కదా! క్రింద వుద్యోగస్తులు చేసినా ఆ తప్పుకు పై అధికారిదే బాధ్యత .భక్త జన రక్షణకై అవతరించిన ఆ పరాశక్తి ముందు భక్తులకు జరిగిన అపచారానికి ఆతల్లి ఎంత ఆగ్రహిస్తుందో కదా ?
ఒకవేళ పదిమందికి సంబంధించిన బాధ్యతలను నిర్వహించవలసిన వ్యక్తి కదా వాల్ల సమయము విలువైనది అనుకుంటే అప్పుడు ప్రత్యేకదర్శన మార్గాఅలున్నాయి కనుక వాని ద్వారా వీలైనంత త్వరగా ఇతరులకు ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకుని వెళ్ళాలి . అంతేగాని పుణ్యక్షేత్రమేదో మన ఇష్టారాజ్యమని భావించటం ,అక్కడి అధికారులు కూడా భక్తుల సేవకు కాకుండా ఈ అధికారానికి సేవలందించే దుస్థితి ఆలయాలలో నెలకొనివుంది .సరే ! ఇదెవరో నిరోధించేదాకా ఎదురు చూడటం తప్ప భక్తజనులకు సరి చేసుకోవాలనే ఆసక్తి లేదు. . వీళ్ల సంగతి అలావున్నా భక్తి కలిగి వున్న అధికారులు నాయకమ్మణ్యులు తమ క్షేమము కోసమైనా ఈ చర్యలవల్ల జరిగే అనర్ధాలు తమకు ముప్పుగా పరిణమించకుండా చూసుకోవాల్సివుంది.

Read more...

తల్లులూ ! సంవత్సరమంతా శుభాలకోసం రక్తసంబంధీకులను ఇలాగౌరవించిచూడండి.

>> Thursday, July 16, 2009


ప్రతి సంవత్సరం రక్త సంబంధీకులలో ఒకరికైనా క్రింది తిథులలో పిలిచి భోజనం పెట్టటం వలన ఆరోగ్యము ,ఉల్లాసము,ఆనందము,శుభాలు కలుగుతాయి.

౧. అన్నాచెల్లెళ్ళు ,అక్కాతమ్ముల్లు కలవారు చేయవలసినది . ఆడవాళ్ళు తమ అన్నలను ,తమ్ముల్లను దీపావళి వెళ్ళిన రెండవరోజు అంటే కార్తీక విదియ రోజున తమ ఇంటికి పిలచి భోజనం పెట్టాలి .దీనినే భగినీ హస్తభోజనమనే పండుగగా జరుపుకుంటారు. దానివలన శుభాలు ప్రాప్తిస్తాయి . ముత్తైదువులైన తమ సోదరికి సోదరులు పసుపుకుంకుమ నూతన వస్త్రాలు కానుకగాఇవ్వాలి. భర్తలేని స్త్రీలకు చీర జాకెట్టు పండ్లుమాత్రమే ఇవ్వాలి. అయితే సోదరినుండి ఎదురు కానుకగా ఏదీ స్వీకరించకూడదు ఆరోజు .అలా తీసుకుంటే అన్నాదమ్ముల్లకు శుభాలు కనిపించవు.

౨. వైశాఖ ద్వాదశి రోజున స్త్రీలు వారి మేనమామను పిలచి భోజనం పెట్టుట మంగళకరం గావుండును .మేనమామలు ఇచ్చే పసుపుకుంకాల ఫలితంగా వారి జీవితం లో సౌఖ్యాలు అనుభవిస్తారు. అయితే మేనమామ తిరిగి బట్టలు స్వీకరించరాదు.

౩.కార్తీక పౌర్ణమి రోజున చంద్రుని చూచి కుటుంబము లోనివారు వారి తల్లిదండ్రుల పాదాలుతాకి నమస్కరించుకోవాలి ..వారు స్వర్గస్తులైయుంటే వారి ఫోటోలకు నమస్కరించు కోవాలి.

౪ శ్రీరామ నవమి మరునాడు దశమి రోజున భర్తలు వారి భార్యలకు బంగారు ఆభరణం గాని ,వెండి ఆభరణం గానీ తప్పనిసరిగా ఇవ్వాలి.వారి శక్తి కొలది మెట్టెలు గాని ,లేక బంగారు రూపు [సూత్రం లోకి] .శక్తి వున్నవారు ఆభరణాలు చేపించవచ్చు. వెండి కుంకుమ భరిణలలాంటివైనా సరే ఇవ్వవచ్చు. సంవత్సరమంతా డబ్బుకు లోటుండదు.

౫. ఆషాఢ మాసం లో [ఈనెలలో] స్త్రీలు భర్తలకు ఏ బుధవారమైనా సరే తలస్నానం చేపించి ముందుగా తాము తయారు చేసిన తీపిని తినిపించాలి.ఆసంవత్సరమంతా శుభాలకు తిరుగులేదు.

౬. శ్రావణ మాసం లో స్త్రీలు మంగళవారం గాని ,శుక్రవారం గాని తమ అక్కచెళ్ళెల్లకు పసుపుకుంకాలు సమర్పించుకుంటే సౌభాగ్యవతిగా వర్ధిల్లగలరు.

౭.వినాయక చవితిమరుసటినాడు వచ్చే పంచమి రోజున బావమరుదులకు రెండు నాణెములు బంగారము ,లేదా వెండివి ఇస్తే ఆసంవత్సర కాలములో రెండు చిక్కు సమస్యలు తీరి పోతాయి.

౮ .హనుమజ్జయంతి రోజున విద్యార్ధులు వారి ఉపాధ్యాయులకు పండ్లు సమర్పించి నమస్కరిస్తే ఆసంవత్సరం లో పరీక్షలలో విజయంలభిస్తుంది.

౯. స్త్రీలు జ్యేష్ట మాసం లో వేరే స్త్రీ [బంధువుకాదు] కి గురువారం రోజు పిలచి భోజనమిడితే ఆసంవత్సరములో శుభకార్యక్రమములు,దైవదర్శనములు గురు దర్శనములాంటి శుభాలు ప్రాప్తిస్తాయి.

౧౦ పాదరక్షలు గురువారం కొనటం చాలామంచిది అంటారు .





Read more...

మాతృస్వరూపులైన స్త్రీలకోసం ఈ సూత్రాలు.అందుకొని అందరికీ పంచండి

>> Wednesday, July 15, 2009


శుభాలు పొందుటకు స్త్రీలు పాటించవలసిన కొన్ని నియమాలను విధించారు మన పెద్దలు. భర్త అనురాగం పెరగటానికి సంతానభాగ్యానికి సిరిసంపదలు పొందటానికి వ్యాధులు రాకుండావుండటానికి ఈనియమాలు పాటించి చూడండి.

౧. మంగళ సూత్రం లో పిన్నీసులు వుంచరాదు అలానే కొన్నిసార్లు హెయిర్ పిన్నులను కూడా తాత్కాలికంగానైనా స్త్రీలు మంగళ సూత్రానికి వుంచుతారు .మంగళ సూత్రం వేదమంత్రాల సహితంగా ప్రభావితము కాబడిన భర్త ఆయువు పట్టు.మంగళ సూత్రము రూపములో హృదయం వద్ద చేరివున్నది. ఇనుప వస్తువులు[పిన్నీసులు ,ఇనుముతో చేసినవి] దివ్యశక్తులను ఆకర్షించుకొను గుణముకలవి. కనుక అవి మంగళ సూత్రము లో దివ్యశక్తులను ఆకర్షించి భర్తను శక్తి హీనుడిని చేస్తాయి .భర్తకు అనారోగ్యం ,భార్యాభర్తలపట్ల అనురాగం తగ్గటం ఇలాంటి దుష్ఫలితాలొస్తాయి. కనుక వెంటనే ఈ అలవాటు వెంటనే సరి చేసుకోవాలి.
౨. స్త్రీలు ధరించే గాజులు మట్టిగాజులై వుంటె చాలామంచిది. . ఈగాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక ,వీని శబ్దము శుభాలను ,అనురాగాలను పెంచుతుంది.

౩.ఇంట్లో గుర్రం బొమ్మలు వుంచుట అంత క్షేమము కాదని డబ్బు విపరీతంగా ఖర్చవుతుందని చాలామంది నమ్మకం .
౪.సంపదలను ,ఎక్కువగా ప్రదర్షించటం వలన నరఘోష ఏర్పడుతుంది .తద్వారా చెడు జరుగుతుంది. కనుక [అలంకారాదులు]సాధారణం గా వుండేలాచూసుకోవటం సాధారణ జీవిత విధానాన్ని పాటింఛటం ఇలా నరదృష్టి నుంచి తప్పించుకోవచ్చు..
౫. పిల్లలు తమ మాటవినలేదనేవారు ఈ చిన్నచిట్కాలు పాటించి చూడండి. ఆడపిల్లలకైతే ఐదుపోగుల ఎర్రదారం కుడిభుజమునకు కట్టి కుంకుమ బొట్టు పెట్టుకునే అలవాటు చేయండి . అలాగే మగపిల్లలైతే ఆకుపచ్చదారం తొమ్మిది పోగులు వేసి కుడిభుజానికి కట్టి గంధమునుదుట ధరించటం అలవాటు చేసి చూడండి పిల్లలు మీ మాటను శిరసావహిస్తారు.

౬.ఆడపడుచులు ,అత్తమామలతో విబేధాలు ఎక్కువైతే ,వారు మిమ్మలను ఇబ్బందులు పెడుతుంటే వారు పనుకునేదిండు క్రింద తులసి వేరు వుంచండి వారు మిమ్మల్ని ఆప్యాయంగాచూసుకుంటారు విరోధాలు తగ్గి.
౭. వంట చేసేప్పుడు రెండు బియ్యం గింజలు భక్తిగా అగ్నికి సమర్పించండి వంటకాలు ఎంతో రుచిగాను ఆరోగ్యకరం గాను వుంటాయి.
౮. పని మనిషిరానప్పుడు విసుగుచెంది కోపంతో బాధపడేకంటె ,పనిమనిషికంటే నేనే శుభ్రంగా గిన్నెలు శుభ్రం చేసుకుంటాను,వాల్లకంటె నేనైతే శుభ్రంగా వుంచుకోగలనని[ నిజాన్ని] మనస్సుకు పదేపదే చెప్పుకుని మీరు మీపనిని చేసుకునే ప్రయత్నం మొదలెట్టండి అసలు పనిమనిషిని మానిపించాలనే అని పిస్తుంది మీకు.
౯.భర్త తాగి వచ్చి హింసపెడుతుంటే ఉదయం పూట టిఫిన్ చేసిన తరువాత ఒకచిన్నస్పూన్ [అంటె సుమారు అరగ్రాము] కరక్కాయ పౌడర్ ను ఆరు చెంచాల నీటి లో కలిపి త్రాగించండి. ఇలా అరవై రోజులు చేస్తే వాల్లకు తాగుడు పై విరక్తి కలుగుతుంది. కరక్కాయ పొడి ఆరోగ్యానికి చాలామంచిది ,నల్లవెంట్రుకలను కూడా తెల్లబరుస్తుంది .మొదట దీనిని త్రాగనని మారాం చేస్తారు. కొద్దిగా బతిమాలి తాగించటం అలవాటూ చేయండి ఈ ఔషధాన్ని.తాగుడు ఖాయంగా మానుతారని పలువురు అనుభవపూర్వకంగా చెబుతున్నారు.
౧౦.సుఖసంతోషాలు కరువైనవారు పసుపురంగుపూలు ధరించండి ,క్రమేపీ స్థితి మెరుగవుతుంది.
౧౧.అప్పుల బాధ ఎక్కువగావుంటె తెలుపు పూలు ధరించటం వలన రుణబాధలు తగ్గుతాయి.
౧౨.ఆరోగ్యం సరిగాలేనివారు ,శరీరం నొప్పులు వున్నవారు మరువం ,మందారాలు కలిపి ధరించండి ఇరవై రోజులలో ఫలితం కనిపిస్తుంది.
౧౩. పెల్లిచూపులప్పుడు ఎరుపు పూలు ,పసుపు పూలు కలిపి మాలకట్టి దరించండి వివాహం విషయం లో కన్యలకు ఎంతో శుభకరం గా ఫలితాలొస్తాయి .
౧౪.మంచి తీర్ధం లో రెండు తులసి దలాలు వేస్తే అవి మానససరోవర జలాలంత పవిత్రమవుతాయి.
౧౯.కూర్చునే పీఠమునకు శుభ్రం చేసి నాలుగు మూలలా బొట్లు పెట్టి కూర్చోవాలి. చాపైతే విభూది బొట్లు గుడ్డను ఆసనంగావాడితే కుంకుమ బొట్లను పెట్టండి .
౨౦.భర్త బయటకు వెళ్ళుటకు షర్ట్ వేసుకుంటుంటే గుండీలు మీరు పెట్టండి . మీకుడు చేతితో తాకి వెళ్లమనండి.భర్తలకు ఆరోజు సంపాదనా ,విజయము సంతోషము వెంటనుంటాయి .

ఆ....... ఇవన్నీ మూఢనమ్మకాలు .అలాజరుగుతుందా ..ఇలాఎందుకు జరుగుతుందనే సోమరిపోతువాదనలు చేయకండి. ప్రపంచవ్యాప్తంగా నమ్మకాలు అనుభవాలను బట్టే కలుగుతాయి . వీటిని పాటించటానికి మీకు ఖర్చేమీ కాదుకదా ? కొంచెం శ్రద్ద .కావాలి అంతే . ఇందులో మీరు నష్టపోయే విషయాలేవీ లేవుకనుక నిరభ్యరంతరంగా పాటించవచ్చు. చెప్పటం మావంతు .ఆచరించిఫలితాలు పొందటం మీ ఇష్టం . ఏదన్నా మీకు మేలుజరిగిందనుకుంటే మాకు చెప్పండి సంతోషిస్తాము . ఇదేమీ కార్పోరేట్ కౌన్సిలింగ్ కాదుకనుక మీరేమీ చెల్లించాల్సొస్తుందన్నభయం అక్కరలేదు. మొదలెట్టండి అమ్మలు


Read more...

వానాకాలపు చదువు

>> Monday, July 13, 2009


"వానకాలం చదువు "అనేది మన తెలుగు జాతీయాలలో నొకటి .ఇదెలా వచ్చినదో చూద్దాము.
పూర్వం మబ్బు పట్టి సూర్యుడు కనిపించని రోజున అధ్యయనం నిషిద్ధమని ధర్మ శాస్త్రాలు నిర్ణయించాయి..సహజంగా వర్షాకాలం లో మబ్బు పట్టిన రోజులెక్కువగావుంటాయి కనుక ఆరోజులలో అనధ్యయన రోజులుగా పరిగణించి పాఠశాలలకు సెలవు ఇస్తుండేవారు. ఈ విధానం వలన వానాకాలం చదువు సరిగా సాగేది కాదు.
అదీ కాక ఇప్పటిలాగా ఆనాడు పాఠశాలలకు భ్యవనాలు లేవు ప్రకృతి ఒడిలో చెట్లక్రింద చదువు సాగేది.ఆశ్రమాలలోనో ఏ అరుగులమీదనో . అందువల్ల వర్షాలొస్తే ఇబ్బంది .అప్పుడనే నేమిటి ఇప్పుడు కూడా జోరున వానకురుస్తుంటే మన పాఠశాలభవనాలు కారటం ,నీళ్ళలో తడిసి విధ్యార్ధులు బడులకు వెల్లలేక పోవటం ,బడులకు సెలవు ప్రకటించటం మామూలే.కనుక ఏవిధం గా చూచినా వానాకాలం లో చదువు సవ్యంగా సాగదు అందువల్లనే సక్రంగా సాగని చదువును తద్వారా వచ్చే అరకొర చదువును ఇలా వానాకాలం చదువుగా వ్యవహరించేవారు.

అందుకనే సవ్యంగా ,నిరంతరాయం గా సాగని చదువు మూలంగా సరిగా విద్య నేర్చుకోలేక పోయినవారు ఇలా
" ఆ ! ఏంచదువు లెండి . వానాకాలపు చదువు అని అనటం లోకం లో మామూలైనది .

Read more...

వానలు కురిపించాలంటావా మాకోసం ! ? ఎందుకులే స్వామీ !?

>> Sunday, July 12, 2009



ప్రకృతి దయతలచి ప్రసాదించిన సంపదలను సవ్యంగా వినియోగించుకోలేని మాకు ఇప్పుడు వర్షాలు కురిపించాలా !? అని సందేహం స్వామీ . నువ్వేమో బిడ్దలపై కరుణతో ఇలా అన్నీ ప్రసాదిస్తూ వున్నావు .మరి మేమేమో నోటికాడ కూడు కాల్లతో తన్నుకునే పనులు చేస్తున్నాము అహంకారులమై . అలాంటప్పుడు మరలా నువ్వు వండి వార్చినా ఉపయోగమేమున్నదిలే స్వామీ !
మొన్న నాలుగు సంవత్సరాలక్రితమ్ వరుసగా మూడేల్లు కరువు వచ్చినప్పుడు చూడాలి ! గ్రామాలలో గొ్డవలు లేవు.పోలీస్ స్టేషన్లలో చీటికి మాటికి గొడవలు పడి కేసులు వేసుకునేవారు తగ్గారు. ఊర్లలో బాంబుల తయారీ వార్తలు తగ్గాయి పేపర్లలో .అయ్యో బిడ్డలేడుస్తు న్నారు కదా అని కరుణాంతరంగునువి కనుక కనికరించి వర్శాలు కురిస్తే జీవ జలాలు జలజల పారిస్తే మరలా మొదలైనది మా అహం .
ఇప్పుడొచ్చి చూడు మా పల్లెలలో ప్రతి పిల్లవాడూ తాగేటోడే .అదేమంటె కష్టపడితే సాయంత్రానికి రెండొందలు సంపాదిస్తున్నాం .అవి అనుభవించకుంటే ఎందుకు అంటున్నారు. సర్దా లేని జీవితమెందుకనే ఫ్యాషన్ మాటలు వల్లిస్తున్నారు. ఇక పట్టణాలైతే చెప్పనక్కరలా పబ్బులంటూ గబ్బు పనులు చేస్తూ అది నాగరికత అంటున్నారు. నాగరికత అంటే జంతువుల ప్రవర్తన కంటే భిన్నంగావుండటమనుకుంటున్నాము కానీ ,మనిషి కూడా ఒక జంతువేననే మేధావుల సిద్ధాంత రాధ్ధాంతాలతో మతి్ పోతున్నది. పశుత్వం లో ఆనందం వెతుక్కునే నీఛస్తాయి మాకెలా వచ్చిందో స్వామీ ?
పంటలు బాగా పండితే పూర్వం గుడు లు గోపురాలు కట్టుకునేటోళ్ళం.ఇప్పుడేమో బెల్ట్ షాపులు ,బార్లు నిర్మించుకుంటున్నాం. మిగిలిన నాలుగు మెతుకులు అన్నసంతర్పణలని దానాలని చేసేవాల్లం అప్పుడు మరిప్పుడో మద్యం పంచుకుని వేడుకలు చేసుకునే వెర్రి ఆనందానికి అలవాటు పడ్డాము.
ఇది తప్పు అది ఒప్పు అని చెప్పి శాసిచాల్సిన రాజులు డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రజలను మద్యం మత్తు్లో ముంచుతుంది. ధర్మ విరుధ్ధమైన కార్యక్రమాలన్నీ తప్పేంకాదనే ప్రచారాలకు ఊతమిస్తున్నది. దాంతో మాస్థితి కొండముచ్చులను రాజుగ కొలచిన కోతుల సామితై పోతుండె. అప్పుడెప్పుడో తాతగారు బ్రహ్మం గారు చెప్పినట్లుగా మత్తులోమునగటం నోట కొరువులు పట్టుకుని తిరుగుతూ చేయకూడని పనులన్నీ చేసి వావివరుసలు మరచే హీనజనులు పెరిగి అకార్యాలు చేస్తున్నా నోరు మెదపలేని స్వార్ధ జీవులమై పాపభారం పెరగటానికి పాలు పంచుకుంటున్నాము. కామ ,జిహ్వ చాపల్యాలను ప్రేరేపించే అదర్మ సిద్ధాంతాలన్నీ గొప్పవని ప్రచారం చేస్తుంటే అగీంకారం తెలుపుతూ వుంటిమి.
మేలు చేసే చెట్లను నరికి ,తల్లి భూమాత గర్భకోశాన్ని తొలచి తొలచి హింసించి ..హింసించి .నీ సృష్టి రచనకు అలంకారమైన అన్యజీవరాశిని సమూలంగా తుడిచివేస్తూ రాక్షసానందాన్ని పెంచుకుంటున్నాము
అంతటితో ఆగామా పరమ పవిత్రమైన నీ ఏడుకొండలకే ఎసరెట్టి ఇన్ని పాపాలకు పాల్పడ్తూ మల్లా మా అవసరాలకు యాగాలు చేసి నిన్ను మాయపుచ్చాలనే మహా మేధావులమైతిమి .ఒల్లు బలుపు పనులకు తెగబడుతుంటిమి.

అసలు నువ్వప్పుడేమి చెప్పావు ? ఇచ్చిన ప్రకృతి సంపదను పరస్పర శ్రేయో దాయకంగా పంచుకోమని చెప్పిన మీ మాట మేము వింటున్నామా ,కనీసం తెలుసుకుంటున్నామా ? పాపపు పనులు చేయటమే కాదు ,వాటిని చూస్తూ మౌనంగా వుండటం కూడా పాపమేననే మాట పాటించలేక పోతిమి. ఇప్పుడేమో ఈపాపపు భారము తో ప్రకృతి మాత క్రోధముతో వేడినిట్టూర్పులు విడుస్తూంటే విలవిల లాడుతుంటిమి . ఒకవంక నిన్ను లెక్కచేయక నీవునికే లేదని హేళన చెస్తూ , ఇప్పుడేమో నువ్వు వర్షాలకురిపించటం లేదని నిందిస్తుంటిమి.

నువ్వేమో పరమ భోళావైతివి ఏదో కొద్దిమంది భక్తులకు బాధకలుగుతుందని నాలాంటి పాపులందరిని ఉదారంగా క్షమిస్తుంటివి. ఇంకెప్పుడు అర్ధమవుతుండి స్వామీ మాకు నీ లీల .
మాకు కడుపులు నిండితే కామపు పొరలు కమ్మే జబ్బుతగ్గాలంటె ,కడుపు కాలుతూ వుండాలేమో అప్పుడప్పుడూ !
ఉఛ్ఛనీచాలు మరచి నిన్నే ధిక్కరించే మాకు చెంప దెబ్బ కొట్టి సరి చేసే ప్రకృతి మాత పాఠాలు అవసరమేమో నని పిస్తుంది . మరొక కోట్లాది మంది ఆకలి కేకలు నిన్నెంత బాధిస్తాయోనని బాధగాను ఉంది . అజ్ఞానులం ప్రభూ .తల్లివైఅ తండ్రివై ,గురువువైఅ మాకు సన్మార్గాన్ని చూపించు స్వామి ఆచరణ లోకి అనుభవం లోకి వచ్చేలా .........ఇది తప్పో ఒప్పో నా మూర్ఖత్వాన్ని మన్నించు స్వామి .


Read more...

సజ్జనుల పని పాపులను క్షమించడమే

>> Saturday, July 11, 2009



లోకహింసావిహారాణాం కౄరాణాం పాప కర్మణాం ,కుర్వతామపి పాపాని నైవ కార్యమశోభనమ్

లోకం లో కొంతమంది మనస్సు చాలా కౄరంగా వుంటుంది . ఎప్పుడూ ఏదో ఒక పాపపు పని చేయడమే వారి పని. లోకం లనందరినీ ఏదో విధంగా - మానసికంగానో ,శారీరకంగానో -హింసిస్తూనే వుంటారు,వారు. అది వారి నైజం .జన్మగత సంస్కారం .అయినా ,మనం వారికి అశుభం కలిగించకూడదు అంటుంది వాల్మీకి రామాయణం .
శ్రీరాముడు రావణ సంహారం చేసి ,విభీషణుని రాజ్యాభిషిక్తున్ని చేసాడు. ,సీరకీ విషయం చెప్పిరమ్మని హనుమంతున్ని పంపించాడు. హనుమంతుడు ఆ ఆనందకరవార్త చెప్పగనే సంతోషం తో ప్రసంసించింది సీత.సీత ఆనందాన్ని చూసి నతరువాత హనుమంతుడు ఆమెకు నమస్కరించి అమ్మా! నాకు మీరు అనుమతివ్వండి .మీకు కాపలాగావున్న రాక్షస స్త్రీలందరూ మిమ్మలను ఎంతో బాధపెట్టారు. రావణాసురుడు చేయమన్నదల్లా చేశారు .వీళ్ళనిప్పుడు నా పిడికిల్లతో గుద్ది,కాళ్ళతో తన్ని మోకాళ్ళతో నలిపి చంపాలనుకుంటున్నాను.వీళ్లపళ్ళు విరగగొడతాను ,జుట్టు పీకేస్తాను ,నిన్ను నానారకాలుగా పీడించిన వారందరినీ నానరకాలుగా హింసించి చంపుతాను అని అడిగాడు ఆవేశంగా.
సీత ఒక్కక్షణం ఆలోచించినది. వానరోత్తమా ! వీరు ప్రభుసేవాపరాయణులు ..
రాజసంశ్రయవశ్యానాం కుర్వతీనాం పరాజ్ఞయా విధేయానాం చ దాసీనాం క: కుప్యేత్ వానరోత్తమ

వీరంతా రాజాశ్రయం లో బ్రతికేవారు. అతని ఆజ్ఞననుసరించి ప్రవర్తించేవాళ్ళు. వాళ్ళ విధేయతతతో వారి వారి కర్తవ్యాలను నిర్వహించుకునే వారిపై ఎవరైనా కోపిస్తారా? నా అదృష్టం లో వున్న ఎగుడు దిగుడు ఫలితాలవల్ల,నాగ్రహస్థితిని బట్టి ,దశాయోగావల్లను నేను అనుభవించాల్సివచ్చినది బాధలను అంతే!
ఆరోజు తమరాజు ఆదేశించాడు చేశారు. ఈరోజతను చనిపోయాడు కనుక ఏమీ భయపెట్తనవసరం లేదు కనుక ఈ దాసీ జనాన్ని నేనుక్షమిస్తున్నాను .అని సందర్భోచితంగా ఒక కథ చెబుతుంది హనుమంతునికి.
ఒకప్పుడు ఒకవేటగాడు పులితరమగా భయపడి చెట్టెక్కాడు. అప్పటికే ఆచెట్టుపైన ఒక ఎలుగుబంటివున్నది.
అప్పుడు పులి ఎలుగుతో "వీడు మనిద్దరికీ శత్రువు వీడిని క్రిందకు తోసెయ్ తినేసి వెల్లి పోతాను అన్నది.
ప్రాణభీతితో వీడు చెట్టెక్కాడు అంటే నన్ను శరణు వేడాడు. కనుక వీణ్ణీ నేను తోసి వేయను అన్నది ఎలుగు.
కొంతసేపటికి పులి ఎలుగు నిదురపోయాయి .అప్పుడు కల్లుతెరిచిన పులి మనిషితో ఆ ఎలుగును క్రిందకు తొయ్ తినేసి వెళతాను నిన్నేమీ చేయనని ఆశపెట్టినది. మనిషి వెంటనే ఎలుగును క్రిందకు నెట్టాడు. అయితే అది ఒక కొమ్మపట్టుకుని క్రిందపడకుండా వేలాడింది ..
"చూశావా ! ఏంజరిగిందో ! ఇప్పుడైనా ఆమనిషిని క్రిందకు నెట్టమన్నది. అప్పుడు ఎలుగు
"న పర: పాపమాదత్తే పరేషాం పాపకర్మణాం ,సమయో రక్షితవ్యస్తు సంత శ్చారిత్ర్త భూషణా: "
సజ్జనులు పాపాత్ములు చేసే పాపం లో పలు పంచుకోరు. ప్రతిజ్ఞాపాలనముఖ్యం .కనుక నేను వీణ్ణి తొయ్యను గాక తొయ్యను అన్నది. . ఈవిధం గా కథముగించింది సీత.

పాపానాం వా శుభానాం వా వధార్హాణామధాపి వా , కార్యం కరుణమార్యేణ నకశ్చిన్నాపరాధ్యతి.

ఎదిటివాళ్ళు పపులు కానీ ,పుణ్యాత్ములు కానీ ,వారు చెసిన తప్పుకు చంపదగినవారే కానీ జాలి చూపించటం పూజ్యుల పని --అంది.

ఇతరుల పాపం లో పాలు పంచుకోకుండావుండటం. క్షమాగుణాన్ని అలవరచుకోవడం మన కర్తవ్యం .



Read more...

మహాత్ముల చేతిలో మరబొమ్మనైనాను,మంత్రాలయగురుని మహిమగన్నాను.

>> Wednesday, July 8, 2009

.


సద్గురుని సేవించుట ఎంత అదృష్టమో .పరీక్షానిష్టులైన ఆసద్గురువుల లీలలను అర్ధం చేసుకుని వారి బోధలను గ్రహించటం అంత కష్టం . ఆమహితాత్ముల సన్నిధానం లో వుండాలని ,వారిని గురుపౌర్ణమి రోజు సేవించాలని నేనుపడ్డ ఆశ వృధాగాపోలేదు. విశ్వవ్యాపితమైన వారి కరుణను పొందాలంటే ,వారి వునికిని గ్రహించాలంటే ఎంత జాగ్రత్తగా వుండాలో పాఠం నేర్పారు. తామే అన్ని రూపాలలో ఎక్కడ ఎవరిని ఏరూపంలో అనుగ్రహిస్తామో తమ సంకల్పానుసారమే జరుగుతుంది తప్ప నీ ఆలోచనలకు అనుగుణంగా కాదురా ! అని గురుపౌర్ణమి రోజు గుర్తు చేశారు.

నేను గురుపౌర్ణమికి గాణ్గాపురం వెల్లాలనుకున్నతరువాత మా అమ్మ గారు,మామేనత్త గారు మేమూ వస్తామని బయలు దేరారు ,దూర ప్రయాణం పెద్దవాల్లను మీ వసతులు చూసుకోవటమే సరిపోతుంది నాకు అని తప్పుకుందామనుకున్నా మాఆవిడకూడా వీల్లు వస్తున్నారు కదా వీళ్ళకు తోడుగావుంటానని బయలు దేరటం తో తీసుకెళ్లక తప్పలేదు. వినుకొండ నుంచి గుంతకల్లు వెళ్ళి అక్కడనుండి చెన్నై-బాంబే రూట్ లో గుల్బర్గా దగ్గర దిగి అక్కడనుండి గాణగాపురం వెళ్లాలని నిర్ణయించుకున్నాము. రైల్లో అయితే వీల్లకు కొంత సౌకర్యంగా వుంటుందనిఆలోచన.
అయితే వినుకొండనుండి గుంతకల్లుకు ఎక్స్ ప్రెస్ భోగీలు ఎక్కువగా వుండవుకనుక , ఆదివారం రాత్రికి పాసింజర్ ఎక్కి బయలు దేరాము.దొనకొండ ,గిద్దలూరు లో ప్రయాణికుల వత్తిడి ఎక్కువైనది .ఆదివారం కనుక సోమవారానికి హైదరాబాద చేరుకోవాలనుకునే ఈప్రాంతం వారు ఆరోజు ఎక్కువగావుండటం వలన సీట్లు దొరికినాగాని వత్తిడిగానేవుంది.పాపం చంటిపిల్లలను వేసుకుని వస్తున్నవారికి మాసీట్లలోనే కొద్దిగా జాగా ఇచ్చి సర్దుకోవటం వలన ప్రయాణం లో నిదురలేక అలుపు వచ్చినది.డోన్ లోదిగి అక్కడనుండితెల్లవారు ఝాము కు గుంతకల్లు వెళ్ళాము. అక్కడనుండి గుల్ బర్గా వెల్లటానికి సుమారు ఆరుగంటలు పైగా పడుతుందని ,అక్కడనుండి మరొక అరవై మైల్ల ప్రయాణం చేయాలని వివరాలు తెలిసాయి. ఇక అప్పటివరకు మా ఆలోచననలో లేని మా మంత్రాలయం ముసలాయన[రాఘవేంద్రస్వామి] తన లీల సాగించారు .

రాత్రల్ల నిదురగాసి ,మరలా ఏడుగంటల ప్రయాణం ,అదీ స్నానం పానం లేకుండా కష్టమే కనుక ,అక్కడకెల్లిన దాకా నావెంటవున్న పెద్దవాల్లిద్దరు ఇబ్బంది పడతారు ఏంచేయాలా అనుకుంటుండగా ,ఈ దారి లోనే వున్న మంత్రాలయం స్తేషన్ లోదిగి అక్కడకు వెల్లి స్నానం పూజ దర్శనం చేసుకుని మరలా పన్నెండు గంటలకల్లా బండి వున్నదికనుక ఎక్కి గుల్బర్గా పోవచ్చు అనే ఆలోచన వచ్చినది. వెంటనే మంత్రాలయం స్టేషన్ వరకు టిక్కెట్ లు తీసుకుని మూడుగంటలు ప్రయాణించి అక్కడ దిగాము. అక్కడనుండి బస్సులో మంత్రాలయం వెళ్ళి తుంగభద్రలో స్నానం చేసి నదీపూజ చేసుకుని మఠలోనున్న స్వామిని దర్శించేందుకు బయలు దేరాము. ఇక అక్కడనుండి నడచినది స్వామి బోధ ,లీల . వెంటనే వెల్లటమే గనుక రూమ్ కూడా తీసు కోలేదు.

లోపల గురు సార్వభౌముడైన రాయరును దర్శించుకోగానే మనసు నిరామయ మయినది. చెప్పలేనంత ప్రశాంతత
పావన బృందవన వాసుడైన స్వామి ప్రేమానుగ్రహ దృష్టి ప్రసరిస్తున్నందువలనేమో ఆస్థలమంతా దివ్య చైతన్యము ,ప్రశాంతతా తొణికిసలాడుతున్నాయి. ఆక్కడ కూర్చుని గురు చరిత్రలో కొంత భాగాన్ని పారాయణం చేసుకుని వెళదామని లేవగనే ఎక్కడలేని నిద్రమత్తు ,నీరసం వచ్చినది.ఇక కదలలేను అని అనిపించినది. ఎక్కడకెళతావు ఇక్కడనుండి అని ఎవరో అంతున్నట్లు అనుభూతి కలుగుతున్నది. దీనికి తోడు అప్పటిదాకా బాగున్న మా అమ్మగారికి జ్వరం వచ్చినది వల్లు కాలి పోతున్నది. ఇంతనీరసం లో ప్రయాణమ్ చేసి గానగాపురం వెల్లినా ప్రశాంతం గా పూజ చేసుకోగలవా అని మా అత్తగారు సందేహం వ్యక్తం చేశారు. అప్పటికే ఒంటిగంటైనది. ఇక లాభం లేదనుకుని వెల్లి ఒక రూము తీసుకుని వాలి పోగానే గాఢ నిద్ర ఆవరించినది. మెలకువ వచ్చేసరికి ఐదు .అప్పటికే పౌర్ణమి ఘడియలు ప్రవేశించాయి ,త్వరగా స్నానం ముగించుకుని మఠానికి వెళ్ళిఅర్చనకు టిక్కెట్ తీసుకుని వెల్లాను.అయ్యా ఇలా గాణగాపుర యాత్ర చేస్తూ వెళుతున్నాను తమకోశం కూడా పూజ చేపించమనిన భక్తులకోసం కూడా మీరు సంకల్పం చెప్పి పూజ జరుపమని కోరాను. ఆ అర్చకస్వామి కూడా సంతోషముతో నేను ఇచ్చిన గోత్రనామాల లిస్టు గల పేపర్ తీసుకుని అందరి పేర్లతో సంకల్పం చెప్పి పూజ జరిపారు. అందరికీ శుభం కలగాలని సంకల్పం చెప్పి బృందావన సన్నిధి లో కూర్చుని పారాయణం చేసుకుంటుంటే స్వామి చిరునవ్వులు చిందిస్తూ చూస్తున్న భావన కలుగుతున్నది. నేనెక్కడలేను ? గాణ్గాపురమైనా, మంత్రాలయమైనా ,మనసుపెట్టి చూస్తే అన్ని చోట్లావున్నది నేనే అని ఎవరో బోధిస్తున్నట్లుగా భావన కలుగుతున్నది. అయ్యో ! గాణ్గాపురం చేరలేక పోతినే ? ప్రయాణం ఆగి పోయినదే అని నా అజ్ఞానపు ఆలోచనలు తెరలుగా వచ్చి కమ్ముకుంతున్నది కొద్దిసేపు. ఓరి నీ అమాయకత్వం చల్లగుండా శ్రీగురుని లీలను అర్ధం చెసుకోకుంటివే ? అని మరొక వైపు అంతరాత్మ సర్ది చెపుతున్నది. ఇలా ఆదివ్యసన్నిధిలో మనసు ఊగిసలాడి వుయ్యలలూగినది. ఇక కొద్ది సేపు తలపై కాషాయ వస్త్రం కప్పుకున్న శ్రీగురుని చిత్రం , అదేస్థితి లో కూర్చుని అలానే చిరునవ్వులు చిందిస్తున్న గురు రాయరు చిత్రం రెండూ కొద్దిసేపు మనోఫలకం మీద దోబూచు లాడినవి. గురు చరిత్ర పారాయణం వలన గురు సన్నిధికి చేరతారనే వాక్యం గుర్తుకు వచ్చినది .ఆతరువాత మనస్సులో రెండు రూపాలు ఒకటై , అంతటా నిండిన సద్గురువు ఆజ్ఞవలననే ఇక్కడకు లాక్కు రాబడ్డానన్న వాస్తవం గుర్తుకు వచ్చి మనసు లో శంకలు తీరి పోయాయి. రేపు ఇక్కడే గురు పౌర్ణమి జరుపుకోవాలనే ఆజ్ఞ సద్గురులు ఇచ్చారని నమ్మకం కుదురినది.
ఇక ఏడవతేదీ మంగళవారం గురుపౌర్ణమి రోజు మఠాని కెళ్ళి ప్రదక్షణలు చేసుకునే సరికి ఆరోజు ప్రత్యేక కార్యక్రమం మొదలైనది. ఈరోజు తులసి కోటనుండి మూల మృత్తికని తెచ్చి బృందావనం న స్థాపిస్తారని చెప్పారు. అప్పుడు జరిగిన వూరెగింపులో పాల్గొన్నాను.మరలా గోత్రనామాలు పంపిన భక్తులందరి తరపున సంకల్పం చెప్పుకుని పారాయణం పూర్తి చేసుకున్నాను. ఆరోజు మంగళవారం కూడా కనుక గురు రాయరు ఆరాధ్య దైవము ,మాబాస్ ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారు. పంచామృతాలతో విశేషం గా . రాఘవేంద్ర గురు రాయరు తమ మహాసమాధికి [బృందావనం] నకు కావలసిన రాయిని శిష్యులకు చూపి ,వనవాస కాలం లో శ్రీరాముని పాద స్పర్షతో పునీతమైన రాయి అది అని చెప్పారట. బృందావనం నిర్మించగా మిగిలిన రాయి తో హనుమంతుని శిల్పం చెక్కించి బృందావనానికి అభిముఖంగా ప్రతిష్టింపజేసారు. అటువంటి స్వామి మూర్తికి అందరూ అన్నిరకాల పల్లు మామిడి కాయలతో ఆభిషేకం చేస్తున్నారు.అక్కడ అరటి పళ్ళు కనపడలేదు. అయ్యో !స్వామి వారి కిష్టమైన అరటి పళ్ళు లేవే అని నేను బజారుకు పరుగెత్తు కెళ్ళి అరటి పండ్లు తెచ్చాను. ఆషాఢం లో ఇక్కడ అరటి పళ్ళు వాడము మామిడి కాయలతోనే అభిషేకాలుంటాయి అని అర్చకుడు వారించాడు నన్ను. స్వామీ కనీసం ఇవి స్వామి వారికి నివేదనలలోనైనా ఉపయోగించమని కోరగా వారంగీకరించారు. ఆతరువాత గురు సార్వభౌమా గోవిందా....... గోవిందా అని స్మరిస్తూ ఆయన బృందావనం ఎదురుగా కూర్చుని ఆదివ్యసన్నిధాన ప్రభావాన్ని అనుభవిస్తూ గడిపాను.పొద్దుటునుంచీ నన్ను మధ్యలో కదిలించవద్దని హెచ్చరించాను గనుక మా ఆవిడ మా అమ్మ వాల్లు దీపారాధనలు చేసుకుని వారి పూజలు వాల్లు చేసుకున్నారు. బయటకు రాగానే స్వయంగా పీఠాధి పతులవారు మండపంలో కూర్చుని మంత్రాక్షతలు ప్రసాదాలు ప్రసాదిస్తున్నారు. వెళ్ళి స్వీకరించి ఆసద్గురు సార్వభౌముని కృపను తలచుకుంటూ తిరుగు ప్రయాణమై నాను . ఆ శ్రీగురుని ఆశీర్వాదం ,అనుగ్రహం మీ అందరి పై సదావర్శించాలని కోరుకుంటూ ...ప్రార్ధన చేస్తున్నాను.

శ్రీపాద శ్రీవల్లభ ,నృసింహసరస్వత్యై నమోనమ:

గురు సార్వభౌమా .. గోవిందా .. గోవింద .

Read more...

నూగుజీడీలు,బఠానీలు ,బిస్కెట్లు,చాక్లెట్లు ప్రసాదాలు గా తీసుకునే స్వామిని మీరు చూసారా ?

>> Friday, July 3, 2009




ప్రసాదాలనగానే ,కొబ్బరికాయలు,పులిహోర దద్దోజనాలు, పాయసం ,పానకం వడపప్పులు గా మనకు తెలుసు. ఎంతో శ్రద్దగా తయారు చేసి దేవతలకు నివేదిస్తుంటాము . ఏమాత్రం అపవిత్రంగా వున్నా ప్రాసాదానికి పనికిరావని పక్కన బెడతాము. కాని మీరు బఠానీలి ,నూగు జీడీలు ,పిల్లలు తినే ఇలాంటి చిరుతిల్లను ప్రసాదం గా స్వీకరించే స్వామిని మీరు చూడాలంటే మీరు ఇక్కడ పీఠానికి రావల్సిందే !

విషయమేమిటంటే ఇక్కడ క్షేత్రరక్షకుడైన ఆంజనేయ స్వామి వారికి మాపాఠశాలలో [పీఠానికి అనుబంధంగా హిందూ పబ్లిక్ స్కూల్ అనే పాఠశాల నిర్వహించబడుతున్నది] పిల్లలు వుదయాన్నే రాగానే ప్రదక్షిణాలు చేస్తారు .ఆతరువాత స్వామికి తాము కొనుక్కొచ్చుకున్న వి జేబుల్లో ను బ్యాగుల్లోను దాచుకుని తెచ్చికుని స్వామి వారికి పెడతారు. తరువాత తిను స్వామీ అంటూ కల్లుమూసుకుని నిలబడతారు.స్వామి స్వీకరించాడన్న నమ్మకం కుదిరాక క్లాసులకెళతారు. వొక్కొక్కప్పుడు స్వామికి కాల్లు నొక్కుతూ సేవ చెస్తారు. ఎల్ కేజీ నుండి పదవతరగతి వరకు పిల్లలు స్వామి వద్ద ప్రదక్షిణలు , చాలీసా పారాయణం చేసుకుని క్లాసులకెళతారు. ఎల్ కేజీ నుంచి పదేల్లలోపు పిల్లలు స్వామికి చేసే నివేదనలే ఆశ్చర్యం గా వుంటాయి. కొనుక్కున్నవి పక్కవాడు పెట్టమంటే నే అమ్మా ! నేను పెట్టను ఫో ! అనే చిన్నపిల్లలు ,స్వామికని కొనుక్కున్నవి తినకుండా దాచి తెచ్చుకుని తిను స్వామీ! తిను అని ఆయనకు నివేదన చేస్తుంటె ముచ్చటగా వుంటుంది.
ఇలా చేయమని మెమెప్పుడూ చెప్పలేదు. అలాపెట్టకూడదురా అని మొదట్లో నేను వారించినా ,తరువాత్తరువాత ఆపిల్లల నివేదనలు స్వామికి ప్రీతి పాత్రమౌతున్నయన్నా నమ్మకం ,సూచనలద్వారా కలిగినందున ఆప్రయత్నం మానుకున్నాను. .కల్మషమెరుగని ఆపిల్లల భావానిననుసరించేనేమో ఆయన ఇక్కడ స్థిరమై ఉన్నారు. అందువలననే ఇక్కద స్వామిని కోరుకున్నవి నెరవేరుతున్నాయని పలువురు భక్తులు వచ్చి చెబుతుంటారు .స్వామి ఇక్కడే వున్నారనే నమ్మకం మాకు పెరుగుతున్నది.
ఎంత ప్రయత్నించినా సాంసారిక భావాలతో కలుషితమైన మా మనస్సునుంచి వచ్చే ప్రార్ధనలకు లొంగని స్వామి ,ఆపిల్లలభక్తికి కరిగి పోయి వారి లో ఒకడై , ఆపిల్లలు పెట్టేవి ప్రేమ తో స్వీకరిస్తున్నందుకు ఆశ్చర్యంగావుంది. . కొద్దిగా అసూయగా కూడా వుంది, బాల్యాన్ని ,ఆనిష్కల్మష హృదయాన్ని కోల్పోయినందుకు .



Read more...

నవగ్రహాల శక్తులు- మన అపోహలు.

>> Thursday, July 2, 2009

గ్రహాలు అనగానే మన మనసులో దుష్టత్వం తో కూడుకున్నవి ,లేక దుష్టగ్రహాలు ,శనిగ్రహం ....ఇలా భావనలు సాగుతుంటాయి.ఈ మాటలను మనం ధూషణలలో కూడా వాడుతుండటం జరుగుతుంది.. ఏదన్నా పూజ శాంతి జరిపినా భయముతో తప్ప భక్తి తో కాదన్నది అంగీకరించాల్సిన విషయము.ఇది చాలా పొరపాటు. జీవులన్నియు గ్రహ శక్తులతోనే జీవించుచున్నవి .సృష్టి కర్త జీవరాసి వికాసము కొరకు ఆయా శక్తులను ఆయాగ్రహదేవతలకు ఇచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పనిచేయమని. ఒక్కోగ్రహానికి ఒక్కొక్క శక్తి వుంటుంది. ముఖ్యంగా తొమ్మిది గ్రహాల శక్తుల ప్రభావం వలన జీవరాసి పుట్టుక, అంతము జరుగుతున్నవి. ఇందులో రెండు ఛాయా గ్రహాలు.
జీవరాశిలో మానవుడు అతి ముఖ్యమైన జీవి. అందువలననే గ్రహ శక్తులు మానవుని చు ట్టు ఆవరించుకొని ,మనిషి కదలికలపైన,ఆలోచనలపైన ప్రభావం చూపుతూ జీవితాన్ని ఆయాప్రభావాలు అనుభవించునట్లు చేయును.గ్రహబలం సరిగా లేనిచో స్త్రీ,పురుషులెవరైనా పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ గ్రహదేవతలను భక్తితో ధ్యానిస్తుంటే వారు శుభదృష్టిని ప్రసరింపజేసి మనకు కలగబోయే చెడును దూరం చేస్తుంటారు. మోసము ,కౄరము,ప్రతీకారము ,అసూయ ..ఈవిధమైన దుష్ట స్వభావాలు మనలో కలిగినప్పుడు గ్రహముల యొక్క వక్ర దృష్టి దానికి తోడైతే మనిషి పతనానికి అవి బలం చేకూర్చును. మంచి మనస్తత్వం తో ప్రవర్తించేవారిని గ్రహదేవతలు శుభదృష్టితో చూస్తారు.అలాగే పంచభూతాలు,అష్టదిక్పాలకులు కూడా . ప్రతిదినమూ ఉదయాన్నే నిదురలేవగానే ఒక్కపరి నవగ్రహాలను ,అష్టదిక్పాలకులను,పంచభూతాలను స్మరించుకుని మంచి మార్గం లో నడిపి సుఖశాంతులను ప్రసాదించమని వేడుకోవాలి.
అలాగే గ్రహముల అనుగ్రహానికి చిన్న తంత్రమున్నది. రోజూ యాభైగ్రాముల బియ్యం బెల్లం పొడితో కలిపి పక్షులకు వేయండి. పక్షులు తిన్నచో గ్రహశాంతి జరిగి మీకు మేలు కలుగుతుంది. వీలైతే ఈక్రింది శ్లోకం చదివి తర్పణమియ్యండి.

ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:


పంచభూతాలంటే : భూమి ,వాయువు ,అగ్ని ,నీరు ,ఆకాశము .

అష్ట దిక్పాలకులు: ఇంద్రుడు [తూర్పు] అగ్ని [ఆగ్నేయం] యముడు[దక్షిణం] నిరృతి [నైరుతి] వరుణుడు [పశ్చిమం]
వాయువు [వాయువ్యం] కుబేరుడు [ఉత్తరం] ఈశ్వరుడు [ఈశాన్యం]

నిద్రలేవగనే గణేశుని ,గురువును ,పైదేవతలను మహాత్ములను ,మహర్షులను తలచుకోవటం సర్వదా శుభకరమని శాస్త్రాదులు సూచిస్తున్నాయి.

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP