శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మీనక్షత్రానికి సంబంధించిన చెట్టు పెంచండి .సర్వ సౌఖ్యాలను పొందండి.

>> Saturday, May 30, 2009

జీవి ఈ భూమ్మీదకు వచ్చేప్పుడు సూర్యుడు ఏనక్షత్రానికి దగ్గరలో వున్నాడో అది మన జన్మ నక్షత్రంగా జ్యోతిష్యశాస్త్రం తెలుపుతుంది. జీవన గమనం లో వచ్చే అన్ని మలుపులను దీని ఆధారంగా చెప్పగలిగే దివ్య శాస్త్రము జ్యోతిష్యము. ఇక జీవితములో మనిషికి దు:ఖాన్ని కష్టాలను ఎలాసంభవిస్తాయో వాటికి ఏగ్రహములకు శాంతులు చెయ్యాలో ఈశాస్త్రము లో పరిహారాలు సూచించబడతాయి. దానికనుగుణముగా మనము నక్ష్తర శాంతులు గ్రహ శాంతులు జరిపించుకుంటూంటాము.
మన నక్షత్రానికి సంబంధించిన వృక్షాన్ని స్వయంగా పెంచటం ద్వారా దోషాలేమన్నా వుంటె తొలగటమే గాక .సర్వ సౌఖ్యాలను పొందవచ్చు. ఈసూత్రాన్ని ఆచరించి ఎంతో మేలు పొందవచ్చు.మీరు పుట్టిన నక్షత్రానికి దగ్గర సంబంధమ్ గల వృక్షాన్నిపెంచితే అది పెరిగి పెద్దయ్యేకొద్దీ శుభాలను కురిపిస్తుంది మీ జీవితం లో.
మీరునాటవలసిన మొక్కనుగాని లేక ,విత్తనాన్ని గాని మీకు ఎక్కడవీలైతే అక్కడ ,రోడ్లపక్కన వీధి పక్కలన ,పార్కు,కొండ,అడవి దేవాలయం ఇలా మీకు ఎక్కడ వీలుంటే అక్కడ నాటాలి. దానిని పెరిగేలా శ్రద్ద చూపాలి. మీకు నాటాక వాటి పోషణ కు సమయము చాలకుంటే మీస్వతం దబ్బుతో దానిని పెరిగేదాకా సంరక్షించే ఏర్పాటు చేయాలి.మీ నక్షత్రం చూసుకుని ప్రతి నెల ఒక్కసారయినా ఆవృక్షాన్ని దర్శించి నమస్కరించాలి. మీరు నాటిన ప్రదేశానికి సంవత్సరం లో ఒక్కసారైనా వెళ్ళి నమస్కరించి రావాలి. మీగ్రామము లో లేదా నివాస సమీపం లో ఎక్కద ఆవృక్షము కనిపించినా నమస్కరించాలి.ఎట్టి పరిస్థితి లోనూ ఆవృక్షాన్ని దూషించటం గాని నరకటం గాని చేయరాదు.పసిపిల్లలచేత కూడా ఇలా వృక్షాన్ని నాటించిచూడండి వారి జీవితాన శుభాలు వెల్లివిరుస్తాయి. ఇది చదివిన వెంటనే మీ మిత్రులందరికీ తెలియజేయండి. మీరంతా కలసి రోడ్డుపక్కన ఒకప్రదేశములో మీ అందరి నక్షత్రాలకు సంబంధించిన వృక్షాలను సామూహికంగా పెంచటంద్వారా అందరికీ వేడుకగా వుంటుంది కూడా.

ఏనక్షత్రానికి సంబంధించిన వారు ఏవృక్షం నాటాలి
--------------------------------------
అశ్వని - జీడిమామిడి
భరణి - దేవదారు
కృత్తిక - అత్తి [మేడి]
రోహిణి - నేరేడు
మృగశిర - మారేడు
ఆరుద్ర -చింత
పునర్వసు - గన్నేరు
పుష్యమి - పిప్పలి
ఆశ్లేష - బొప్పాయి
మఖ - మర్రి
పుబ్బ - మోదుగ
ఉత్తర - జువ్వి
హస్త - కుంకుడు
చిత్త - తాడి
స్వాతి - మద్ది
విశాఖ - మొగలి
అనూరాధ - పొగడ
జ్యేష్ఠ - కొబ్బరి
మూల - వేగి
పూర్వాషాఢ - నిమ్మ
ఉత్తరాషాఢ - పనస
శ్రవణం - జిల్లేడు [తెల్లజిల్లేడు మరీ శ్రేష్ఠం]
ధనిష్ఠ - జమ్మి
శతభిషం - అరటి
పూర్వాభద్ర - మామిడి
ఉత్తరాభాద్ర -వేప
రేవతి -విప్ప




Read more...

దర్శిద్దాము ! ఆదివ్యధామాన్ని [ కైలాస శిఖర దర్శనం]

>> Friday, May 29, 2009



పరమేశ్వరుని పరమధామము కైలాస శిఖరము.ప్రమథ గణ పరివేష్టితమై ,సకల మునిగణ ,దేవతా సంసేవ్యమానమై విరాజిల్లెడు ఆదివ్యలోకాన్ని చూడటానికి ఎంత అదృష్టం చేసుకుని పుట్టాలో ! లేదు లేదు పరమాత్మ ను ఎంత భక్తిగా సేవించాలో. ఆదివ్యలోకానికి ప్రతీకాత్మకమైన కైలాస శిఖరాన్ని దర్శించేందుకు దేశం లో వున్న ఆస్తిక గణం సిద్దమవుతూ వున్నది. సాక్షాత్తూ శివలింగ స్వరూపం తో దర్శనమిచ్చే ఆపర్వతరాజాన్ని చూడం డి. ఇది అంతరిక్షం నుండి తీసిన ఫోటో . శివలింగము ,దానిచుట్టూ పానపట్టము నిర్మితమైనట్లుగా దర్శనమిస్తున్న ఆ అద్భుత దర్శనం జన్మజన్మలప్రయాణం లోచేరు కోవలసిన చివరి స్థానమేమిటో చూపుతున్నట్లుగా నున్నది.

Read more...

బ్లాగ్లోకం లో ప్రవేశించి సంవత్సరం పూర్తయింది . ఏమి సాధించానిక్కడ?

>> Tuesday, May 26, 2009




భగవత్ సేవాకార్యక్రమాలలో మునిగివుండే నాకు భక్తజన సేవాకార్యక్రమం లో భాగంగా బ్లాగ్ లోకం లోకి ప్రవేశించి సంవత్సరకాలం పూర్తయింది.. నిరంతరం జగజ్జనని సేవలో మునిగి వుండే నేను సమయాభావంవలన నాకు ఆసక్తి గల పత్రికారంగం నుంచి కూడా తప్పుకున్నాను. కాని నాకు అలవాటైన ఈ అభ్యాసం భగవత్సేవా కార్యక్రమాలలో ఒక భాగమయ్యేందుకేమో ఇక్కడకు లాక్కురాబడ్డాను. ఇది ఆ జగన్నాటక సూత్రధారి లీలావిలాసం లో ఒక భాగము.ఎందుకంటే ఈ జగన్నాటక రంగం లో ఎవరి పాత్రను ఎక్కడ పోషించాలో ఆయన ఇఛ్చాను సారం సాగుతుంటుంది.

ఇక్కడేమి చేయగలిగాను?
...............................................
ఎందరో మంచిమనసుగల మనుషుల అభిమానాన్ని పొందగలిగాను.నా సిధ్ధాంతాలు వ్యతిరేకించేవారి నుండికూడా వ్యక్తిగతంగా గౌరవించబడ్డాను. .ఇది భౌతిక విషయాలగూర్చి.సమశ్సత్రౌచ మిత్రౌచ తథా మానావ మానయో అని గీతాచార్యులు చెప్పిన స్థితికి చేరుకోలేదుగాని ఆదారిలో కొద్దిదూరం పయనించగలిగాను .అందుకు ఇక్కడ నాకు కొన్ని అభ్యాసాలు లభించాయి. ఇది నాకువ్యక్తిగతం గా జరిగినమేలు. తిట్టినవారి పట్ల పొగిడినవారిపట్ల ఎలా సమస్థితిని అలవర్చుకోవాలో నేర్చుకోవటానికి ఇదొక అవకాశం.

ఇక అనేక సమస్యలతో తల్లడిల్లుతున్న వారికి మన మహర్షులు చూపించిన దివ్య మార్గాలలో నాకు సాధ్యమైనంతవరకు పరిష్కారాలు సూచించాను .ఆచరించిన ఎందరో తమ సమస్యలను భగవదనుగ్రహం తో పరిష్కరించుకున్నామని తెలియజేశారు. అది వారి భక్తి కి,భగవంతుని ప్రేమ కు నిదర్శనము మాత్రమే. నాకు కూడా ఆయన లీలా ప్రదర్శనలో ఒక పాత్రనిచ్చినందుకు జన్మ ధన్యమయినదనుకుంటున్నాను.
ఈ సంవత్సరము భక్తజనుల శ్రేయస్సుకార్తీకమాసములో నలభై రోజులపాటు కోటి పంచాక్షరీ మహాయాగాన్ని ,ఏబది నాలుగురోజులపాటు మొన్నటివరకు సాగిన హనుమద్రక్షాయాగాన్ని ,నడపటానికి నావెనుకవుండి తమ ఆర్ధిక ,హార్ధిక సహాయాలనందించి న భగవద్భక్తులు భాస్కర్ రామరాజు,ఉమాశంకర్ రామరాజు, ఉప్పుటూరి శ్రీనివాస్ ,చెరుకూరి దుర్గాప్రసాద్.జడ్చర్ల శ్రీనివాస్ ,డాక్టర్ రజని , వెంకటసూర్యనారాయణ ,విజయమోహన్ లాంటి సహృదయుల ఋణం తీర్చు కోలేనిది. అలాగే భారతీయ యువతలో వుండవలసిన కార్యసాధకత ,సదాచారము ,సుశీలతలతో నిజమైన భారతీయ యువతకు ప్రతిరూపాలుగా కనిపించే చిరంజీవి రంజిత్,నాగప్రసాద్ ,మనోహర్ లాంటిఎంతోమంది యువత అభిమానాన్ని సంపాదించు కోగలిగాను .మాశ్టారూ అని అభిమానించబడ్దాను. బ్లాగ్ లోకం లో దిగ్గజాలైన తాడెపల్లి, చదువరి, వంశీ,విహారి సుజాత ,శిరీష ,దూర్వాసుల ,నరసింహ , మధురవాణి ,బొల్లోజు బాబా,జాన్ హైడ్ ఇలా వీరందరి అభిమానానికి పాత్రుడనయ్యాను.
నాబ్లాగును అందంగా తీర్చిదిద్దిన జ్యోతిగారికి , దీనిని పదిమందికి దగ్గరకు చేర్చిన వీవెన్ గారికి,జల్లెడవారికి ,బ్లాగ్ కుట్ గారికి తెలుగురత్న శివకు బ్లాగర్ .కామ్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
నానమ్మకాన్ని మరింతగా సానరాయి పై పెట్టి చూసుకునేలా ప్రోత్సహించిన విమర్శకులు కత్తిమహేష్ గారి లాంటివారికి నన్ను తీవ్రపదజాలంతో తిట్టిన నా సహనాన్ని పరీక్షించుకోగలిగే అవకాశం ఇచ్చిన రసూల్,మార్తాండ గారిలాంటి వారికి వేలసార్లు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వీరందరి పట్ల నాకు మనసులో మిత్రభావమే తప్ప ఏమూలనా ద్వేషభావం లేదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను." ఎదుట ఎవ్వరు లేరు అంతావిష్ణుమయమే వదలక హరిదాస వర్గమైనవారికి " అని సందేహం లేకుండా నమ్ముతున్నాను.

ఇకపై ఏమి చేయాలి?
......................................
భక్తులకు సహాయపడటము భగవంతునకు అత్యంత ప్రీతి పాత్రము. కలిప్రభావము వలన,జాతక,జన్మ దోషాలవలన మార్గం కానరాక తల్లడిల్లుతున్న,బాధలతో సతమతమవుతున్నవారికి,వారికి నేను తెలుసుకున్నంతలో మహాత్ములు చూపిన మార్గం లో పరిష్కారాలు చూపించటము . నిరంతరం భగవత్ కార్యక్రమాలద్వారా భక్తజనులను వాటికి అనుసంధానించటము ద్వారా వారిలో భగవన్నామస్మరణను జరిగేలా ప్రయత్నించటము నేనెన్నుకున్న సేవామార్గము. ఈనాప్రయతనములో మేలు జరిగితే అది మహాత్ములు ప్రసాదించిన దివ్యవిద్యవలన కలిగినదని ఏదన్నా వ్యతిరిక్తముగా జరిగితే అది పూర్తిగా నా అజ్ఞానము వలన జరిగిన పొరపాటని మన్నించప్రార్ధన.

సాగుతున్న ఈ హరిసేవా మార్గములో ఈమజిలీకి నన్ను పంపిన ఆ పరమాత్మకు ఈదారిన నడుస్తున్న భగవద్భంధువులందరికీ మరొకసారి నానమస్సుమాంజలులు సమర్పించుకుంటున్నాను.

మానవజాతికి మార్గదర్శనం చేసిన జగద్గురువులు పుట్టిన ఈ పుణ్యభూమిలో ,పరమాత్మ పాదస్పర్శచే పునీతమైన ఈ భారత మాత ఒడిలో పుట్టి ,మానవత్వానికి పరిపూర్ణత్వం పొందే మార్గాన్ని మహర్షులు బాగానడిచి నలిగిన దారిని చూపించగల వారసత్వసంపదను వారసత్వంగా పొంది ధన్యత పొందిన నా భాగ్యాన్ని నేనే పొగుడుకుంటున్నాను."చాలదా బ్రహ్మమిది సంకీర్తనం" అన్న అన్నయ్య అన్నమయ్య పదసంకీర్తన చేసుకుంటూ

భక్తజనదాసుడు
దుర్గేశ్వర
.





Read more...

పత్నీం మనోరమాం దేహి మనో వృత్తాను సారిణీం [ ఈ ప్రార్ధన ఫలించింది ]

>> Monday, May 25, 2009




ఈరోజు మాపెళ్ళి రోజు .భగవత్ సేవలో తన సంపూర్ణ సహకారాన్నందించగల సహచరిని నాకు అమ్మ ప్రసాదించి నేటికి పద్దెనిమిది సంవత్సరాలు దాటి పందొమ్మిదవ సంవత్సరం లో కడుగు పెట్టాము. నాకోపాన్ని తన సహనం తో గెలుస్తూ ,పట్టణం నుంచి వచ్చానన్న అహం లేకుండాఅవసరమైన సమయం లో నాతో పాటు శ్రమనుకాదు కాదు నాకంటే ఎక్కువగా కష్టపడుతూ గడ్డికోసి పాలు పిండి ,పిల్లలకు ఫాఠాలు చెప్పి ,నా పూజలకు అన్నీ సమకూరుస్తూ.వచ్చిపోయేవారికందరకు ఎప్పటికప్పుడు మంచీమర్యాదా చూస్తూ మాజీవిత నౌకకు తానే ప్రధానమైన ,రత్నాల్లాంటి ఇద్దరు బిడ్డలనిచ్చి నా అర్ధాంగి జయప్రద తానే అన్నీ అయి నడుపుతున్నది. ఏ అర్ధరాత్రి ఎవరొచ్చిన విసుక్కోకుండా వండివడ్డించి ఆకలితీర్చి ,నా ప్రయత్నాలకు బాసటగా నిలుస్తున్న తనకు నేను జన్మజన్మలకు ఋణపడివుండవలసి వస్తుందేమో.
"
పత్నీం మనోరమాందేహి మనోవృత్తానుసారుణీం . అని నేనుప్రార్ధించిన కోరికను అమ్మ తీర్చినదనుకుంటాను. మానాన్న గారు చెప్పేవారు ,ఒరే ! అన్నిసంపదలకన్నా అనుకూలవతి అయిన భార్యదొరకటం గొప్ప అదృష్టం తో కూడిన సంపదరా, అని. లక్షల రూపాయల కట్నాలిస్తానన్నా కాదని ఆయన ఏరి కోరి చేసిన వివాహం నాది. పెద్దవాళ్ళు ఇన్ని రకాలుగా ఆలోచిస్తారు కనుకనే వివాహవిషయం లో వారి అభిప్రాయాలకు విలువనివ్వటం క్షేమము నేటి యువత.
పొద్దుటె హైదరాబాద్ నుంచి రాగానే ఈరోజుమన పెళ్ళిరోజని అవిడ నాకు చెప్పినదాకా గుర్తురాలేదు. వెంటనే పందొమ్మిది సంవత్సరాలకు గుర్తుగా పందొమ్మిది జ్యోతులను వెలిగించి అమ్మవారికి విశేష నైవేద్యాలు సమర్పించి ఇంటికొచ్చిన అతిథులకు కూడా వాటిని పంచాము. ఎవరన్నా వస్తారేమో అన్నం తినే సమయానికని ఎదురు చూసాము కానీ ఈరోజెవరూ రాలేదు .అదొక్కటే లోపం .ఇలానే అమ్మసేవలో భగవద్ భక్తుల సేవలో సాగిపోయేలా ఆశీర్వదించమని పెద్దలందరికీ నమస్కరిస్తున్నాము.

Read more...

ఎంతవగచినా !ఏమితలచినా !జరిగేదీ నీచిత్తమే స్వామీ![నన్ను సికిందరాబాద్ పంపినది ఇందుకా!]





మనం ఎంత తలచుకున్నా కొన్ని కార్యక్రమాలు మనాలోచనలకు మించి ,మన మనమేసుకున్న ప్రణాళికను తోసిరాజని ఎవరో అజ్ఞాత శక్తి నడుపుతున్నట్లుగా సాగుతుంటాయి. మనమేమో ఆశ్చర్యపోతుంటాము. ఆదివ్యశక్తి సంకల్పానికి అనుగుణముగానే పనిచేస్తున్నామే గాని మనమేధస్సు నిర్ణయాలప్రకారం కాదనే విషయమ్ నిదానంగాగ్రహిస్తుంటాము.

హనుమత్ రక్షాయాగము మొదలు పెట్టినప్పుడు,గ్రామ రక్షణకొరకు పీఠము జరిపే సామూహిక హనుమదభిషే
కములను జంటనగరాలలో ని ఆని హనుమన్మూర్తులకు ఏకకాలం లో జరపాలనే తీవ్ర ఆకాంక్షతో హైదరాబాద్ వచ్చి చాలాప్రయత్నం చేశాను.అక్కడ నివాసమున్న సకలజనులకు విరోధినామ సంవత్సరాన ముంచుకొస్తున్న వ్యాధి, పీడలు ప్రమాదాలనుండి రక్షణకల్పించాలని స్వామిని వేడుకుంటూ చేసే క్రతువిది. .కాని ఫలితం శూన్యము. కనీసము ప్రోత్సాహము కూడా లేదు. ఇక్కడ నేను చేపించాలి అనే అహం మనసు లోతు పొరలలో ఎక్కడో మినుక్కుమినుక్కు మంటున్నది. అంతే స్వామి నవ్వుకున్నాడు .అవునా నీవు చేపించగలసమర్ధుడవా ? ఏదీ ప్రయత్నించుఅని స్వామి నాశక్తికి పరీక్ష పెట్టాడు. అదెంత అల్పమైనదో అర్ధమైనది , మన సొంత తెలివితేటలేవీ పనిచేయవని తేలి పోయినది.
ఈపాఠాలు మాబాస్[ఆంజనేయ స్వామి వారు] కాస్త ఒల్లు పొంగి అతికి పోయినప్పుడలా చెపుతుంటారు కనుక అర్ధమైపోయినది. చేసే పని ఆయనమీదకాకుండా నామీద వేసుకోవటం ఎంతబుద్దితక్కువపనో అని.

ఇక యాగమై పోయినది. ప్రసాదాలు పోస్ట్ లో పంపుతున్నాము. కాని హఠాత్తుగా సికిందరాబాద్ వెళ్ళి తాడిబందు ఆంజనేయ స్వామి ఆలయం లో పంచాలని అది చేరవలసిన కొందరు అక్కడికొస్తారని మనసుకు సంకేతాలు అందుతున్నాయి. నేను వస్తున్నాని మన బ్లాగర్ సతీష్ కు ఫోన్ చేశాను .ఆకుర్రవాడైతే బ్రహ్మచారి కనుక ఇబ్బంది లేదని సంసారుల ఇల్లలోకి హఠాత్తుగా వస్తున్నామని చెబితే ఏదన్నా ఇబ్బంది పడతారని ఆలోచననాది. ఏంపర్వాలా ! మనకు హైదరాబాద్ వెళ్లినా వసతికి ఢోకాలేదు అనే కాస్త గర్వం కూడా వచ్చినట్లున్నది ,ఇక్కడాఒక లీల చూపాడు. మన పలకా బలపం బ్లాగర్ సత్యప్రసాద గారు మధ్యప్రదేశ్ నుంచి వారి నాన్నగారికి ఫోన్ చేసి మాశ్టర్ గారు హైదరాబాద్ వస్తున్నారని చెప్పారట . ఆయన గుంటూర్నుంచి హైదరాబాద్ ఎప్పుడొచ్చారో నాకు తెలియదు.యాగానికి మధ్యలో ఒకసారి వచ్చివెళ్ళారు. మాఆవిడ బయలుదేరేటప్పుడు అడగనే అడిగింది .ఏమండి ఆ హైదరాబాద్ లో స్నానాలు జపాలు ఎలా కుదురుతాయి అని. మనకేం చాలామందివున్నారు అని గర్వంగా అన్నాను , అన్నమయ్యసినిమాలో లక్కమాంబగారి టైపులో ఆవిడ ఆ ఏమోలెండి ! రైల్వేస్టేషనో. బస్టాండులోనో కాకుండా చూసుకోండి .లోకజ్ఞానం లేనిదాన్ని ...... అని .అన్నది. గతుక్కుమన్నది మనసు. ఏమిటె నీశకునం చల్లంగుండా.అనుకునిబయలుదేరాను. నావన్నీ హడావుడి ప్రయాణాలే ఎప్పుడు బయలుదేరుతానో? తీరా బయలు దేరాక వెళతానోలేదో ఇంట్లోవాళ్ళకి అర్ధం కాదు.నాకు కూడా
.
తీరా సికిందరాబాద్ లో దిగాక ఫోన్ చేస్తే , పాపం ఆపిల్లవాడు రాత్రి నాలుగుగంటలదాకా పనిచెసి నిదరమత్తులోనే ఫోన్ ఎత్తి ఆటో లో వెస్ట్ మారేడ్ పల్లి పోలీస్ స్టెషన్ దగ్గరకు రండి అక్కడుంటాను అన్నాడు. ఆటోవాడు కూడా పొద్దున్నే ఎవడు మీటర్ మీదవస్తాడు అని పాపం ధర్మంగనే అడిగి ఏబైతీసుకుని నామానాన్ నన్నొదిలేసి వెళ్ళాడు.ఇంకా తెల్లవారలేదు. ఇక ఫోన్మీద ఫోన్లు ఎన్నిసార్లు చేసినా రింగవుతుందేగని సమాధానం లేదు. పావుగంట గడిచాక గాని అర్ధం కాలేదు నాకు ఏరా! నీపరిచయాలు నీతెలివితేటలే నిన్ను నడుపుతాయా అని మా బాస్ వెక్కిరిస్తున్నారని.బుద్దొచ్చిందిస్వామి నాపూజ చేసుకుని ఆలయానికి వెల్లెసరికి ఆలస్యం కాకూడదు. ఏడుగంటలకల్లా అక్కడకు వెళ్లాలి దారి చూపమని చెంపలువేసుకున్నాను. వెంటనే సత్యప్రసాద్ వాల్లనాన్నగారు రామ్మోహన్ శర్మగారు గుర్తుకొచ్చారు ,ఆయనకు ఫోన్ చేశాను .చిత్రమేమిటంటె ఆయన ఉన్నది కూడా మారేడ్ పల్లి లోనే ఆయనకూడా మాస్టర్ గారూ మీరు వెస్ట్ మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ దగ్గరకు రమ్మన్నాడు . ఆయన అక్కడకు వచ్చి నన్ను తమఇంటికి తీసుకు వెళ్ళి ఆయన వారి వదినగారు పెద్దవారైనా చాలా ఓపికతో నాకు అన్నీ సమకూర్చారు.
ఆయన కూడా చిన్నతనం లో వెల్లటూరులో వారి నాన్నగారితోపాటు స్వామి సేవచేసినవాడినని ,నన్ను కూడా ఈ కార్యక్రమం లో భాగం చేశారని నాతో పాటు వచ్చారు. బయలుదేరేముందు పదిగంటలు దాటేదాకే ఆలయం లో వుంటామని ఆలోపల ఎవరిని స్వామి పంపితే వారికి మాత్రమే ఇస్తామని చెప్పుకున్నాము .
ఆలయానికెళ్ళి దర్శనమ్ చేసుకుని ఒకపక్కన అనుష్ఠానం చేసుకుంటూ కూర్చున్నాము. విషయం తెలిసినవారు బ్లాగర్లేకాక వారిద్వారా తెలిసినవారు ఒక్కొరొక్కరుగా వచ్చి పోతున్నారు.అమెరికానుంచి సూర్యనారాయనగారు చెప్పగా వాల్ల తమ్ముడు.చక్రవర్తిగారు సతీ సమేతంగాను ఇలా తెలిసినవాల్లు వచ్చి రక్షలు తీసుకుంటున్నారు. ఇది గమనించి వచ్చి అడిగినవారికి ,లేదా నాఅకు ఇవ్వుఅని మనసుకు స్పందనకలిగితె వాల్లకు ఇస్తున్నాను. ఒకతను నాపక్కన కూర్చున్నాడు అతనికివ్వాలని మనసులో బలంగా నిపించి ప్రసాదం ఇచ్చాను.రోజుకు పదకొండుసార్లు చాలీసా పారాయణం చెస్తూండు నీ సమస్యతీరుతుంది అను అనాలోచితంగా చెప్పాను. ఆయనవెంతనే సంతోషించి స్వామి నాపట్ల స్వామి కరుణవున్నది అని ఆనందంగా తన్మయుడయ్యాడు. ఏమిటయ్యాసంగతి అని అడగగా ., నాపేరుశ్రీనివాసరెడ్ది సార్. గ్రనైట్ మార్బల్స్ వ్యాపారం సాహసించి పెట్టాను ,కాని దిగాక చాలా కష్టంగావున్నది. ఐదువారాలు స్వామికి ప్రదక్షణాలు తిరిగితే ఆయనే మార్గం తెలియజేస్తాడని ఒక పెద్దాయన చెప్పగా ప్రదక్షిణలు చేస్తున్నాను. ఈరోజు ఐదు శనివారాలు పూర్తయ్యాయి. నేను ప్రదక్షిణలు చెసికూర్చోగానే అయాచితంగా స్వామి ప్రసాదమిచ్చి ఏమిచేయాలో చెప్పారు, అని వివరించాడాయ. నీభక్తుల మేలు చేకూర్చటమ్ కోసం నన్నొక పరికరంగా వాడుకున్నావు చాలుస్వామీ అని నమస్కరించాను.
అలా వస్తూనే వున్నారు. వారి సమస్యలు తీర్చడానికి రక్షలు ఇప్పిస్తున్నాడనే నమ్మకం నాకు బలపడిపోతునది. సమయము అయిపోతున్నది. శర్మగారూ ! ఈపని అయిపోతున్నదిగానీ అభిషేకాలవిషయం ఎవరిని లింక్ చేస్తాడోతెలియటం లేదు అని మేము మాట్లాడ్తూవుండగనే ఒకాయన వచ్చి కూర్చుని ఎంతో మధురంగా స్వామి గానామృతంతో సేవిస్తున్నాడు. ఆయనకు రక్షలివ్వగానే వివరాలడిగాడు. స్వామి అనుగ్రహం కలిగి ఆపదలుదాటాలంటే ఏమిచేయాలో వివరిస్తున్నాడు. నాపక్కనున్న శర్మగారు ,ఆంజనేయ స్వామి అభిషేకాల ఆలోచనగురించిి చెప్పాడు. తనపేరు సుబ్రహ్మంణ్యం గారని తానొక హనుమదుపాసకుడనని తెలుపటమేగాక ,మాకు ఆప్తులు గురు సమానులైన అన్నదానం చిదంబరశాస్త్రిగారి గూర్చి చెప్పారు. నేను కూడా చిదంబరశాస్త్రి గారి మిత్రవర్గము లోవాడినని తెలిసి ఆయన సంతోషం తో మరికొన్ని వివరాలు చెప్పారు.
సమయము పది దాటగనే మేము ఆలయ కమిటీ చైర్మన్ గారిని కలిసి వివరాలు చెప్పగా ఆయన మాకు సహకరించగల ఈ కార్యక్రమన్ని నిర్వహించగల ఒక ప్రముఖునికి ఫోన్ చేసి విషయం చెప్పారు ,అతను ఒకపదినిమిషాలు ఆగండి పూజ పూర్తిచేసుకుని ఆలయం దగ్గరకు వస్తానని మాటిచ్చాడు. నేను బయటకు వస్తుండగా చెన్నైనుంచి వెబ్ దునియా వెంకటేశ్వర్లుగారు పంపగవచ్చిన వారి మిత్రుడు వచ్చి స్వామి సన్నిధిలో రక్షలివ్వమని అడిగాడు, నాకిచ్చిన సమయము అయిపోయినదికదా నుకుంటూనే లోపలి కెల్లి ఆయనకు రక్షలిస్తుండగా యమకింకరులవలె ఇద్దరు అటెండర్లు వచ్చి .ఏమిటి ఇక్కడదుకాణం పెట్టావు లే అని గదమటం మొదలెట్టారు. పాపం శర్మగారు వివరించబోయినా వారు వినిపించుకోవటం లేదు. వాల్ల కల్లకు నేనుచెట్లకింద తాయెత్తులమ్ముకునే మోళీవాని లాగా కనపడివుంటాను.మరలావచ్చినందుకు నువ్వేనన్ను ఇక్కడనుండి తరుముతున్నావులే స్వామీ అనుకుని వారికి సర్దిచెప్పి బయటకు వచ్చాము.తరువాత్ బయటకు కూడా వచ్చి న వారికి రక్షలనిచ్చి ,మాటప్రకారం వచ్చిన ఆప్రముఖునితో మాట్లాడగా ఆయన సంతో షించి తనసహాయం తప్పనిసరిగా అండజేస్తానని ఈ కార్యక్రమము గ్రౌండ్ వర్క్ కే నెలపడుతుంది కనుక స్మయం కావాలన్నారు..
ఆతరువాత సాయంత్రము ఆదివారము కూడా మరికొందరిని కలసి సోమవారం ఉదయానికల్లా పీఠానికి చేరుకున్నాను.
మన ప్రయత్నాలేవీ కావని ఇవి తన సంకల్పము తోనే జరుగుతున్నవని మరొకసారి సోదాహరణగా స్వామి నాకు పాఠం నేర్పారు.
ఈ పాట నాకు గుర్తొచ్చింది. ఎంతవగచినా ఎమితలసినా జరిగేది నీ చిత్తమే .......

Read more...

రేపుసికిందరాబాద్ తాడుబందు ఆంజనేయ యం లో హనుమత్ రక్షాయాగం లో పూజించిన రక్షలనందుకోండి.

>> Friday, May 22, 2009


రేపుసికిందరాబాద్ తాడుబందు ఆంజనేయ యం లో హనుమత్ రక్షాయాగం లో పూజించిన రక్షలనందుకోండి.

ఈరాత్రికి బయలుదేరి హైదరాబా ద్ చేరుకుని స్వామి వారు కొలువైయున్న మహాశక్తివంతమైన తాడుబందు ఆలయం లో రక్షాయాగం లో పూజించిన హనుమత్ రక్షలను భక్తులకందజేయనున్నాము. దీనికి కారణమున్నది.
యాగానంతరము కోరినవారికి పోస్టద్వారా రక్షలు పంపుతామని బ్లాగులో చెప్పాము. సహజంగా నాకు ఏకార్యక్రమము చేయాలన్నా శుక్రవారము పూజలో అమ్మ ఆజ్ఞ మనసులో ప్రేరణ గా అందుతుంది .ఈరోజు పూజలో వున్న నాకు హైదరాబాద్ వెళ్ళి తాడుబందు హనుమదాలయం లో 1008 రక్షలు పంచితే ఇవి అందవలసిన స్వామివారి భక్తులకు చేరుతాయని సంకల్పము కలిగినది. ఎందుకిలా?
మాచిన్నప్పుడు మా జేజినాయన గారు [నాన్నగారి తండ్రి] పూజ అయి పోయాక శనివారం కొబ్బరిముక్కల పళ్ళెం ఇచ్చి బజారులో నిలబడి వచ్చి పోయే వారికందరకు పంచిపెట్టమనే వారు .అప్పుడదొక సరదా . కాని పెద్దాయ్యాక తెలిసినది దానిలో ఆంతర్యం .భగవప్రసాదాన్ని ఒంటరిగా కాకుండా పదిమందితో కలసి పంచుకోవలనే సత్యాన్ని.
స్వామి వారి అనుగ్రహం తో ఈ యాగాన్ని పూర్తి చేసి పొందిన స్వామి వారి ప్రసాదాన్ని కూడా పదిమందికి పంచాలనేది స్వామి వారి ఆనతనుకుంటున్నాను. యాగములో పూజించి శక్తివంతమైన రక్షలను ,యజ్ఞశేషాన్ని [విభూతిని ] తాడుబందు ఆలయం లో పంచాలన్నది నాకు అందుతున్నా ఆజ్ఞగా భావిస్తున్నాను.
మరి హైదరాబాద్ లోనే ఎందుకు పంచాలి.? దానికి కారణాలున్నట్లున్నాయి.
మొదటిది .దీక్షాధారణ అయిపోగానే నేను ఏదైనా ప్రముఖ హనుమత్ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చెసుకుని వస్తాను. ఈసారి కుదరలేదు. 2000 సంవత్సరం లో బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారి పర్య వేక్షణలో జరిగిన కోటి హనుమాన్ చాలీసా మహాయాగానికి మమ్మల్ని రమ్మనిపిలచారు, కార్యక్రమము తాడుబందుఆలయం లో అని చెప్పారు. కానీ తీరా కార్యక్రమము మొదలయ్యే సమయానికి అక్కడ ఆలయ కమిటీ వారికి యాగనిర్వాహకులకు కుదరక కార్యక్రమాన్నిసికిందరాబాద్ లోని స్వరాజ్ ప్రెస్ లో ఏర్పాటుచేశారు. ఆ ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించలేక పోయాము.తరువాతెప్పుడు వచ్చినా పనులవత్తిడివలన హడావుడిగా రావ టం తోస్వామిని దర్శించలేదు.
కనుక ఇప్పుడు సమయమొచ్చి స్వామి దర్శనానికి రమ్మని పిలుస్తుండవచ్చు.
రెండవది యాగము నకు సహకరించిన ,ప్రచారము చేసి పదిమందికి తెలియబరిచిన వారు ఎక్కువమంది ఇక్కడున్నారు. వారిలో చాలామంది యాగమునకు వారి వృత్తులవలన పనులవత్తిడివలన రాలేక పోయారు. వారందరకు స్వామి వారి సన్నిధిలోనే రక్షలు అందజేయాలనే సంకల్పముకావచ్చు.
ఇక స్వామి వారి ఆంతరింగిక భక్తులు ఈకార్యక్రమము గూర్చి తెలియకున్నా ఈ రక్షలు అందవలసి వున్న వారెవరికో ఇవి అందజేయవలసిన బాధ్యత మనమీదున్నట్లున్నది.
ఇన్ని కారణాలున్నయనుకుంటున్నాను నా మనసుకు స్పురించిన సంకేతానికి. అదీగాక మొన్న ఎన్నికల హడావుడి వున్నందున జంటనగరాలలో వున్న స్వామి వారి అన్ని ఆలయాలలో సామూహిక అభిషేకాలు జరిపించే కార్యక్రమం గూర్చి కొందరు భక్తజనులతో సంప్రదించాలనుకుంటే కుదరలేదు. ఇప్పుడు కుదురుతుందేమో చూడాలి.
ఇక నేను రేపు ఉదయం ఐదుగంటలకల్లా హైదరాబాద చేరుతాను.అక్కడనుండి ఒక బ్లాగమిత్రుడు సతీష్ గారి రూమునకెళ్ళి స్నానాదికాలు పూర్తిచేసుకుని ఏడుగంటలకల్లా ఆలయానికి చేరుకుని దర్శనం చేసుకుని ఏదో ఒక చోటకూర్చుని అనుష్ఠానం చేసుకుంటుంటాను . స్వామి వారు ఎవరిని పంపితే వారికి వెయ్యిన్నెనిమిది రక్షలు పంచినదాకా కూర్చుని ఆతరువాత వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఇది తెలిసిన బ్లాగర్లు కాని ,వారిద్వార తెలుసుకున్నవారు కాని లేదా స్వామి ప్రేరణద్వారా వచ్చేవారికి గాని అక్కద అప్పటికప్పుడు అడిగినవారికి ,రక్షలు పంపిణీచేస్తాము. నేను పసుపు రంగు వస్త్రాలు ధరించి వుంటాను. నానంబర్ 9948235641 . శనివారము అదీ మాసశివరాత్రి అందులోనూ ఏబదినాలుగురోజులు పారాయణాదులు సాగించి పూజించిన రక్షలు స్వామి సన్నిధిలో అందుకోవటము. ఎవరికి చెందాలో వారు వస్తారు. కనుక మీ రు మీమిత్రులకు తెలిసినవారికందరకు ఈవిషయము చెప్పగలరు. ధన్యవాదములు


స్వామి వారిసేవలో
దుర్గేశ్వర

Read more...

హనుమత్ రక్షాయాగం వీడియోలు

>> Thursday, May 21, 2009


హనుమత్ రక్షాయాగము పూర్ణాహుతి రోజున ఓవైపున రుద్రహోమము .మన్యుసూక్త హోమములు జరుగుతుండగా మరోవైపున ద్వాదశ కుండీలతో హనుమాన్ చాలీసా హోమము జరుగుతున్న దృశ్యములు




Read more...

ఇదీ స్వామి శక్తి !ఆశ్రయించి అనుగ్రహాన్ని పొందిన వారి భక్తి.[మహావైభవంగాముగిసిన హనుమత్ రక్షాయాగము]

>> Wednesday, May 20, 2009


భక్తజనపోషకుడైన హనుమంతు ని అనుగ్రహముచే ప్రారంభమయి ఏబది నాలుగురోజులు పాటు సాగిన హనుమత్ రక్షాయాగము వై్భవవోపేతముగా జరిగినది. మొదటిరోజు జరిగిన గణపతి హోమము నకే సంతోషించి న తొలిదైవము విఘ్నాధిపతి హోమ జ్వాలలో దర్శనమిచ్చి భక్తజన క్షేమమము కొరకు సాగే ఈ యాగానికి తమ అనుగ్రహమున్నదని సంకేతము అందజేసారు.
ఇక యాగము వివరాలను తెలుపగనే ఆస్తికలోకము అపూర్వ స్పందన చూపినది. ఈ కార్యక్రమము తమదిగా భావించి హైదరాబాద్ నుండి తిలక్ గారిలాంటివారు కరపత్రాలద్వారా ప్రచారము చేయగా తెలుగుబ్లాగర్లు తమ బ్లాగులలో ఈ వివరాలను ప్రచురిస్తూ పదిమందికి తెలియజేసేపని ప్రారంభించారు. వివిధదేశాలనుంచి తాము ఈకార్యక్రమములో హనుమాన్ చాలీసా పారాయణముచేస్తూ పాల్గోవటానికి ముందుకు వచ్చారు.స్వామి ప్రీత్యర్ధం ప్రత్యేకముగా బ్రహ్మచారులచే స్వామి ఉపాసన చెపించాలి ఇది జనక్షేమము కోసమని చెప్పగానే ఇరవై ఒక్కమంది పిల్లల తల్లిదండ్రులు ముందుకు వచ్చి తమ పిల్లలకు దీక్షనిప్పించారు. యాగానికి కావలసిన సరంజామా సమకూర్చటానికి ఇక్కడ స్థానిక భక్తులతో పాటు అమెరికానుండి కుమార్ గారు,చెరుకూరి దుర్గాప్రసాద్ గారు,రామరాజు భాస్కర్ ఉమాశంకర్ సోదరులు ,ఉప్పుటూరి శ్రీనివాస్ గారు,వెంకటసూర్యనారాయణ గారు లాంటివారు ఆర్దిక సహాయము చేయటానికి మరికొందరు వస్తురూపేణా సహాయమందించటానికి ముందు కొచ్చారు.ప్రతిరోజూ మన్యు సూక్త ,రుద్రసూక్త ములతో అభిషేకాలతో హోమాలతో సాధన సాగినది. పూర్ణాహుతి రోజున ప్రధాన హోమకుండముతో పాటు ,ఇక్కడకు రాలేక తమపేరన ప్రత్యేక హోమము చేయాలని కోరిన భక్తులకొరకు స్వామి ద్వాదశ నామాలతో హోమకుండాలను ఏర్పాటు చేసిన యాగము జరిపి పూర్ణాహుతి ఇచ్చాము.

స్వామి అనుగ్రహ ప్రవాహము మొదలయినది. వివిధ సంకల్పాలతో సాధకులు తమ సాధనలను కొనసాగిస్తుండగా స్వామి వారి జీవితాలలో చూపిన అనుగ్రహ లీలలు తెలియజేస్తుంటే వళ్లు పులకరిస్తున్నది. తమ ఉద్యోగ ,జీవితసమస్యలను ఈ సాధన ప్రారంభమయ్యాక స్వామి ఎలా తొలగిచారో చెబుతుంటే వారి భక్తికి స్వామి శక్తికి పదేపదే వమ్దనాలు సమర్పించుకుంటున్నాము. ఆహా ! ఏమి స్వామీ మీ భక్తానుగ్రహ దీక్షాతత్పరత అని స్వామిని సాష్టాంగ పడ్డాము.
ఏమి సాధించాము ఈ యాగముతో?
.........................................................................
భక్తితో దైవము నాశ్రయించి ఎలా మన సమస్యలను పరిష్కరించుకోవచ్చో ప్రయోగాత్మకంగా నిరూపించారు భక్తులు . ఇందరి జీవితాలలో స్వామి చూపిన లీలలకు నేనూ ఒక పరికరాన్నయ్యే భాగ్యం కల్పించినందుకు స్వామికి ఏమివ్వగలను. ఇంతమంది భక్తుల పరిచయ భాగ్యమ్ కలిగించాడాయన. ఇంతకన్నా సమ్పదేమి కావాలి లోకంలో.

స్వామి ప్రసాదాలు అందరికీ అందజేసే పని మిగిలినది.
స్వామి వారి రక్షలు ,యాగకుండము లో మిగిలిన యజ్ఞశేషము [భస్మం] అడిగిన వారికి పంపేందుకు సిద్ధముగా నుంచాము. స్వామిరఖ్శలు ధరించి ఎల్లవేళలా ఆయన రక్షణలో నుండండి. యాగ ప్రసాదమై ఈ విభూతి మహిమాన్వితమైనది. వ్యాధులు ,బాధలు లోనున్నవారు ఈ విభూతిని ధరించటంద్వారా వాటినుండి విముక్తి పొందవచ్చు. ఇంకెందు కాలస్యం స్వామిని ఆశ్రయించండి .ప్రసాదాలను అందుకోండి.



























Read more...

స్వామి కిష్టమైన "అప్పాలు" ఇలా చేయాలి.

>> Saturday, May 16, 2009

హనుమంతునకిష్టమైన ప్రసాదాలలో అప్పములు ముఖ్యమయినవి. అవి ఎలాచేసుకోవాలో చూద్దాము.

ఒక గిన్నెలో నీరు తీసుకుని పావుకేజీ చక్కెర ను కరిగించాలి.దానిలో ముద్దగా అయ్యేలా గోధుమ పిండి ని కలపాలి.దానిలో కొద్దిగా డాల్టా గాని నెయ్యిగానీ కలుపుకోవాలి. ఆపిండిని చిన్నచిన్న బిల్లలుగ చేసుకోవాలి .తరువాత కాగేనూనెలో వేసి వేయించి తీసుకోవాలి. హనుమంతునికి ఇష్టమైన ఈ వంటకమ్ నివేదించి స్వామి ప్రసాదాన్ని పదిమందికి పంచండి.ఈనెల పందొమ్మిదిన హనుమత్ జయంతి రోజు.

Read more...

బ్లాగ్ మిత్రులందరకూ హనుమత్ రక్షాయాగానికి ఆహ్వానం

>> Friday, May 15, 2009

పరమదయాళువు భక్తజనరక్షకుడైన హనుమంతుని అనుగ్రహం తో సాగుతున్న "హనుమత్ రక్షాయాగము " గణపతి హోమము తో మొదలై ఆదిపరాశక్తి కిష్టమైన చండీయాగముతో అనుసంధానమై నిర్విఘ్నంగా సాగుతూ హనుమజ్జయంతి మరుసటి రోజు అంటే 20 పూర్ణాహుతి తో ముగియనున్నది .భక్తజనులకు ఈవిరోధినామ సంవత్సర దుష్పలితాల నుండి రక్షణ కలగాలని.అలాగే తాము సాధనాపూర్వకంగా భగవదుపాసనా ఫలితాలను ప్రయోగాత్మకంగా తెలుసుకోవాలని దీన్నొక ఆథ్యాత్మిక ప్రయోగముగా చేపట్టాలని కోరటం జరిగినది.ఎందరో భక్తులు సాధకులు ఈకార్యక్రమములో పారాయణము చేస్తూ పాలుపంచుకుంటూ ఉన్నారు. భగవద్భక్తులైన బ్లాగ్మిత్రులు కొందరు తమ బ్లాగులలోనూ యాగమునుగూర్చి ఇతరులకు తెలియజేశారు.వారందరికీ ధన్యవాదములు. వారందరికీ హనుమంతుని అనుగ్రహము ఆయన రక్షణ ఎళ్లవేళలా వుండాలని ప్రార్ధనచేస్తున్నాము. ఈనెల ఇరవైన జరిగే పూర్ణాహుతి హోమానికి మీఅందరూ రావాలని మాకోరిక .ఏబది నాలుగురోజులుగా సాగుతున్న ఈమహాయాగ పూర్ణాహుతి ఉత్సవ సంతోషాన్ని,హనుమత్ ప్రసాదాన్ని మీఅందరితో కలిసి పంచుకోవాలనేది మా కోరిక. యాగమునకు విచ్చేయువారందరికీ భోజనవసతులు సమకూర్చబడుతున్నాయి.

రూట్:_
  1. నా నంబర్ మీదగ్గరవుంటుంది కనుక మీరు సమ్ప్రదిస్తుంటే రూట్వివరాలు తెలియబరుస్తాము.ముందుగా మీరు బయలుదేరుతున్న విషయము తెలియజేయండి.
నా నంబర్ 9948235641

Read more...

హనుమత్ రక్షాయాగములో పూజించిన హనుమత్ "రక్ష" లు పంపుతున్నాము అందుకుని ధరించండి.

>> Monday, May 11, 2009

హనుమత్ రక్షాయాగమునకు గోత్రనామాలు పంపి పారాయణము చేస్తున్న భక్తజనులందరికీ నమస్కారములు.
యాగము పూర్ణాహుతి ఈనెల 20 న జరుగుతున్నది. .ఆరోజు మీరు కూడా ఇంటివద్ద కొద్దిగా పాయసము వండి, అరటిపండ్లు కొబ్బరికాయ,పానకం వడపప్పు తో స్వామికి నివేదనచేయండి.ఆప్రసాదాన్ని మీరు మీచుట్టుపక్కలవారికి కూడా వీలైతే పంచండి.

ఇక యాగనంతరము ఇక్కడపూజజరుపుతున్న హనుమత్ రక్షలను మీకు ఉచితముగానే పంపబడతాయి.కానీ ఇంతమందికి పోస్టల్ ఖర్చు భరించటము పీఠమునకు భారమైన విషయము కనుక మీరు అన్యధా భావించక పోస్టల్ ఖర్చులను పంపగలరు. మనదేశములోనైతే ఎక్కడికైనా 50 సరిపోతుంది.ఇతరదేశమునకైతే 100 లేక 150 రూపాయలు సరిపోవచ్చు.పోస్టల్ చార్జీలు తెలుసుకుని పంపగలరు.ఇప్పటికే అన్నదానమునకు ,గాని పూజలకు గాని తమ సహాయాన్ని అందించినవారు మర్లా పోస్టల్ ఖర్చులు పంపనక్కరలేదు. మరొక చిన్నవిషయము. మీకుటుంబసభ్యులు ఎందరో మీకు ఎన్ని రక్షలు కావాలో చెప్పగలరు.అడగకుండా శ్రద్ధలేకుండా వున్నవారికి ఈరక్షలను మీరుగా ఇవ్వవద్దు. మీకుటుంబం వరకే ధరించండి. ఇంకెవరన్నా కావాలంటే వారు స్వయంగా సంప్రదిస్తే వివరాలు నియమాలు చెప్పి మేమే పంపుతాము .
హనుమంతుని రక్షణలో మీరంతా సకలశుభాలను పొందాలని. మీపై ఎల్లవేళలా స్వామి రక్షణ వుండాలని ఆపవనసుతుని వేడుకుంటూ

భక్తజన పాదదాసుడు

దుర్గేశ్వర
శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం

సంప్రదించాల్సిన చిరునామా
durgeswara@gmail.com

9948235641

postal adress

b.v.b.durgeswararao

srivenkateswara jaganmaatapeetham
ravvavaram po
nuzendla manadal
guntur dt

andhrapradesh
pin 522660

Read more...

అమ్మంటే ఏమనిచెప్పగలం అమ్మే

>> Sunday, May 10, 2009

అమ్మ అంటే ఏమని చెబుతాము అమ్మే
అమ్మ గొప్పతనంఎంతంటె ఏమిచెబుతాము అమ్మంత
అమ్మకు సాటి అమ్మ మాత్రమే
అమ్మతో పోల్చదగ్గ ఉదాహరణ అమ్మ మాత్రమే
కాబట్టి అమ్మగూర్చి చెప్పాలంటే అమ్మ అనిమాత్రమే

Read more...

హనుమత్ రక్షాయాగం పూర్ణాహుతి నాడు ప్రత్యేక హోమము జరిపించుకోవాలనుకుంటే

>> Friday, May 8, 2009


హనుమత్ రక్షాయాగం పూర్ణాహుతి నాడు ప్రత్యేక హోమము జరిపించుకోవాలనుకుంటే !

హనుమత్ రక్షాయాగము ఈనెల 19 న హనుమజ్జయంతితో పూర్తవుతుంది.కానీ ఆరోజు మంగళవారము కనుక పూర్ణాహుతి నివ్వటానికి వీలుపడదు కనుక 20 బుధవారం నాడు పూర్ణాహుతి జరుపబడుతుంది. ఈ కార్యక్రమానికి గోత్రనామాలు పంపినవారి అందరి పేర్లమీద ఆహుతులివ్వబడతాయి.
ప్రత్యేక హోమములు
.........................................
పూర్ణాహుతి కార్యక్రమములో ప్రత్యేక హోమము జరిపించుకోవాలనుకునేవారి కోసము ,ప్రత్యేకముగా హోమకుండము లు ఏర్పాటుచేయ బడుతుంది. ప్రత్యక్షముగా పాల్గొనేవారు వారికుటుంబ సభ్యులతోపాటు కూర్చుని స్వయముగా హోమము జరుపుకోవచ్చు.
అలా స్వయముగా పాల్గొనలేక పోయినా తమతరపున ప్రత్యేక హోమము నిర్వహించమని కోరే వారి కోసము కూడా హోమకుండము ఏర్పాటు చేసి ఇక్కడ హనుమత్ దీక్షాధారణలో వున్న స్వామిని వారి తరపున కూర్చోబెట్టి వారిచే హోమము జరిపించుట కు ఏర్పాట్లు చేయబడతాయి.హోమద్రవ్యాలు,అన్నదానము నకు కలిపి ప్రత్యేక హోమము జరిపించుకోదలచినవారు 501 రూపాయలు పంపవలసి వుంటుంది. మీరు కోరితే ఎక్కౌంట్ నంబర్ ఇవ్వబడుతుంది.లేదా ఎమ్.ఓ అయినా చేయవచ్చు.
సర్వసంపత్తులనుకలుగజేసి, హనుమత్ రక్షణను ప్రసాదించగల ఈమాహాయాగం లో పాల్గొనండి.పాల్గొనువారందరికీ వసతి భోజనసౌకర్యాలు కలుగజేయబడతాయి. పూజలోను అన్నదానము లోనూ తమవంతు సహాయము అందించాలనుకునేవారందరికీ ఆహ్వానము.
మామనవి:
.......................
హనుమత రక్షాయాగము లో పూజజరిపించుకొనుటకు గోత్రనామాలు పంపిన వారందరి పేర్లమీద పూజ హోమము జరుగుతుంది.అందుకొరకు మీరు ఏమీ తప్పనిసరిగా పంపించవలసిన అవసరము లేదు.ప్రత్యేక హోమము జరిపించాలనుకునేవారు,ఈకార్యక్రమములో తమ చేయి కలపాలనుకునేవారు మాత్రమే వారి ఇష్టానుసారం తమ సహాయం అందించవచ్చు. తప్పనిసరి కాదు.గమనించగలరు.
ప్రత్యేక హోమములకొరకు పూజాద్రవ్యాలఖర్చు కొరకు మాత్రమే వారినుంచి కోరుట జరుగుతున్నది. ఇప్పటివరకు మేము అడగకున్నా భగవత్ ప్రేరణతో సహాయము చేయటానికి ముందుకువచ్చిన భక్తుల,భగవత్ సేవకుల సహకారము తోనే కార్యక్రమము నిర్విఘ్నముగా నిర్వహించబడుతున్నది. దీనిలో ఎటువంటి వ్యాపారదృక్పథము చేరనివ్వము.మాగురించి అన్యధా భావించవద్దని మనవి.

Read more...

రామా నామ మాలా ....భజరే !...శ్రీరామనామ మాలా!


రామా నామ మాలా ....భజరే !...శ్రీరామనామ మాలా!
రామనామ మాలా భజరే......శ్రీరామ నామ మాలా
భజరే !భజరే !మాలా .................శ్రీరామనామ మాలా .

మాలా సీతా స్వయంవరం లో సాధించినమాలా
ఈప్రేమ సుమాలా భజరే !....భజరే రామ నామమాలా ! //రామనామ//

మాలా లక్ష్మణుడు ఎల్లవేళలా ,,,జపియించినమాలా !
ఈ ప్రేమసుమాలా భజరే........భజరే రామనామ మాలా //రామనామ//

మాలా హనుమానిరంతరమ్ము..జపియించెడి మాలా
ఈప్రేమ సుమాలా భజరే!.....భజరే రామనామమాలా // రామ నామ //

Read more...

ఇలాంటప్పుడు భగవంతుడు నవ్వుకుంటాడట.!

>> Thursday, May 7, 2009

మనిషి చర్యలు ఒక్కోసారి సాటి మనిషికే కాదు భగవంతునికి కికూడా నవ్వు తెప్పిస్తాయట. ఈక్రింది సన్నివేశాలలో ఆయన కు విపరీతం గా నవ్వు వస్తుందట.
రోగి గాభరా పడుతుంటాడు.తనకు మరణము తప్పదేమోనన్న అనుమానం వస్తుంది, కాని వైద్యుడు మాత్రం నీకేం ఫరవాలేదు,నేనున్నాను నీకేమీ కాదు అని హామీ నిస్తుంటాడు.తన మరణము గూర్చేతనకు తెలియని వ్యక్తి ఎదుటి వ్యక్తి కి మరణము దూరం చేస్తానని పలకటము భగవంతునికి నవ్వుతెస్తుందట,

ఇక అన్నదమ్ములు భూమిని భాగాలు గా పంచుకుంటూ ఒరే ఇది నీది అదినాది అని సరిహద్దులు నిర్ణయించుకుంటూ ఇది తనదని పూర్ణనమ్మకముతో దీనిపై తనకు సంపూర్నహక్కున్నదని తనకే స్వంతమనే భావనతో మమేకమవటం పరమాత్మకు ఆశ్చర్యాన్ని కలిగించి నవ్వుతెప్పిస్తాయట. ఇప్పుడు పుట్టి కేవలం స్వల్పకాలం లో భూమి మీదనుండి అదృశ్యమయ్యే మనిషి అనాదినుంచి వున్న భూమి తనదంటున్నాడేవిటి?ఏమి ఈతని అమాయకత్వమని భగవానునికి నవ్వు వస్తుంది. పసిపిల్లవాడు ఇది నాదిఅని మారాం చేసేప్పుడు మనకు నవ్వు వచ్చే విధం గా.

Read more...

పలకండి ..పలకండి .రామనామము ..మీరు పలకంటే పలకరేమి రామ నామము.[ముప్పు ముంచుకొస్తోంది]

>> Wednesday, May 6, 2009



కలి లో మానవుల పాపాచరణ ,స్వార్ధము, దురహంకారములవలన ప్రకృతి కోపించి ఉత్పాతాలు కలగజేస్తుంది. అప్పటికీ తెలుసుకోకుండా తన మేధస్సును నమ్ముకుని ఎదుర్కోవాలనే ప్రయత్నము చేస్తాడు. అందులోనూ వినయానికి బదులు,ప్రకృతి నియమాలను తారుమారు చేయగలననే అహం తాండవిస్తున్నందున ప్రకృతి కన్నెర్రజేస్తుంది. ఎలుకతో పిల్లి చెలగాటమాడినట్లు పలురకాలుగా వేదనలు కలగజేస్తుంది,వాస్తవానికి ఇది మనిషితెచ్చుకుంటున్నముప్పే. కాని ఆమాట ఒప్పుకోడు. సత్యాన్ని అంగీకరించేందుకు అతని దురహంకారం అడ్డువస్తున్నది.

కనుకనే వీరబ్రహ్మేంద్రుల వంటి భవిష్యద్రష్టలు ,మహాత్ములు రానున్న కాలాన ఏమి జరగనున్నదో వివరించి హెచ్చరించారు. మానవ జాతి మేలు కోసం. ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో,అది మానసికంగా భౌతికంగాకూడా ప్రపంచములో కనులకు కట్టినట్టు వివరించారు కాలజ్ఞానములో .
నేటి పరిస్థితులు గమనించి చూస్తే వారి వాక్యాలు పూలు పోకుండా ఎలా వాస్తవ రూపం లోకి వచ్చి హెచ్చరిస్తున్నాయో తెలుస్తుంది.
రకరకా ల వ్యాధులు మానవులను ఎలా పీడిస్తాయో చెప్పారు. నేడు చూడండి మొన్న బర్డ్ ఫ్లూ ,చికెన్ గున్యా అన్నారు.దానినుండి తప్పుకోనేలేదు మరలా స్పైస్ ఫ్లూ వచ్చెసినది. రేపొక కొత్త జబ్బు దాడి చేయవచ్చు. ఇక ప్రకృతి వుత్పాతాల హెచ్చరికలు వణకు పుట్టిస్తున్నాయి. అకాల వర్షాలు వడగండ్లు నోటికాడ తిండిని నేలపాలు చేస్తున్నాయి. మున్నెన్నడూ లేనివిధంగా టోర్ణడో లు కూడా మనదేశానికి వచ్చి విలయాన్నిసృష్టించనున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేస్తున్నారు,
ఇప్పుడు ఎన్నని మనమేధస్సుతో ఆపగలము.? ఎన్ని ఉత్పాతాలను నిలువరించగలము? అసలు ఎన్ని జాగ్రత్తలు తీసుకోగలడు మనిషి? ఇప్పటికీ సత్యాన్ని ఒప్పుకోకుండా ఎన్నో కారణాలు వుదహరిస్తూ తనని తాను మభ్యపెట్టుకుంటున్నాడు. తాను ప్రపంచాన్నుంచి నిర్మూలించాననుకున్న ప్లేగు లాంటివ్యాధులు సజీవంగానేవున్నామని సవాల్ విసురుతున్నాయి.
ఎవరు నమ్మినా నమ్మకున్నా ప్రకృతి తన అనుగ్రహాన్ని ,అదే విధంగా ఆగ్రహాన్ని ప్రకటిస్తుంది. కనుకనే కాగల కార్యం కనురెప్పపాటులో[అంటే నిదురపోయి లేచేసరికి ] జరుగుతాయని బ్రహ్మం గారు హెచ్చరించారు. రామా అనని వాడెలా రాలి పోయేను అని మన అహంకారాన్ని ఎత్తి చూపుతున్నారు.
మీదంతా చాదస్తం . ఈకాలం లో కూడా నా ఇవి మూఢనమ్మకాలని కొట్టి పారవేసేవారు ,జరుగుతున్నదానికి శాస్త్రీయ వివరణ చెప్పలేకపోతున్నారు .కావచ్చు ,బహుశా అనే పదాలతో తప్ప.అసలు సత్యాన్ని గమనించడమే శాస్త్రీయత.అంతే కాని బద్దకించి సత్యాన్వేషణను వదలివేయటము కాదు.
ఇప్పటికైనా భగవంతుని శక్తిని అంగీకరించి ,భగవత్ ప్రసాదితమైన ప్రకృతి సంపదలను తల్లి రొమ్ము కోసి రక్తం తాగేవిధంగా కాకుండా,బిడ్డ తల్లి పాలు తాగినట్లు సేవించాలి.
బ్రతికే నాలుగురోజులకోసం నలుగురినీ హింసించటం,నలుగురినీ మోసగించి దోచుకుని కూడవేసుకుని కుల్లబెట్టుకోకుండా మనిషిగా బ్రతకాలని ప్రయత్నించకపోతే మానవజాతికి మనుగడలేదు.
ఉచ్చనీఛాలు మరిచి పశుప్రాయమైన జీవన విధానాలను అలవరచుకుని ,కేవలము కలిపురుషుని కిష్టమైన కామ,జిహ్వేంద్రియాలను తృప్తిపరచటమే జీవితసౌఖ్యమనే సిద్ధాంతాలను ప్రచారం చేసుకుంటూ మనకు మనమే హానిచేసుకోకుందుముగాక. ఇక ఇదంతా మూఢత్వమనే సిద్ధాంతాల రాద్ధాంతాల మాయలో పడకుండా జాగ్రత్తవహించాలి.భగవంతుని శరణు వేడాలి . ఈ సిద్దాంతకర్తలవి చిలకపలుకులు. చిలుక అది నేర్చుకున్న రకరకాల మాటలను ఎంతోఅందంగా పలుకుతుంది.కాని పిల్లి నోటనబడ్డప్పుడు తన సహజ భాషలో కీచుకీచుమని అరుస్తుంది.మృత్యువు మీదకొచ్చినప్పుడు గాని వీరి అసలు రూపము బయటపడదు.
భగవంతుని ఆశ్రయించటమంటే ఆపేరుతో మాయగాల్లు విసిరే వలలోచేపల్లా పడటం కాదు. మనసహజ జ్ఞానంతో పెద్దలు చూపిన మార్గం లో భగవంతుని ఆశ్రయించటం. ఇప్పటికైనా భేషజం వదలి రామనామాన్ని ఆశ్రయించాలి.
అందుకే ...పలకండి పలకండి రామనామము ..మీరుపలకంటె పలకరేమి రామనామము.

Read more...

108ప్రసిద్ధ హనుమదాలయాలు.[మహారాష్ట్రలో]

>> Monday, May 4, 2009

సమర్ధ రామదాసులవారు స్థాపించిన వానిలో అతి ముఖ్యమైన పదకొండు హనుమదాలయాలు న్నాయి,
అవిషాహాపూర్,మసూర్ గ్రామము,శ్రీప్రతాప మారుతి[బాఫలగ్రామము] శ్రీ దాసమారుతి[బాఫల],ఉంబ్రజ్ హనుమాన్[కృష్ణానది ఒడ్డున],షిరోలె హనుమాన్ ,బీజాపూర్ దగ్గర మనపాద్ లో,పార్ గ్రామం లో ,మాజ గ్రామం లో ,శింగనవాడి కొండమీద,బోర్ గ్రామానికి దగ్గరలోనున్న బాహె గ్రామం లో ,సతారా రోడ్ స్టేషన్ నుంచి సుమారు రెండుమైల్లదూరం లో వున్న ఆలయం, బాందారా జిల్లాలో బనియి నది ఒడ్డున వున్నరామ్ పాయిలీ మందిర్,ఇంకా
నాసిక్
.............
నాసిక్ పంచవటి లో గోదావరి ఒడ్డున ఉన్న అహల్య కొండ దక్షిణ భాగం లో రెండుముఖముల హనుమదాలయం.
త్రయంబకేశ్వర్
.......................
నాసిక్ నుంచి ఇరవైతొమ్మిది మైళ్ళ దూరం లో ఉన్న చిన్న మందిరం లో స్వామికి పది చేతులుంటాయి.
పూనా
...........
మూడువందల నలభై సంవత్సరాల పూర్వపు ఈ ఆలయం లో స్వామి వినాయకుని ;లాంటి పెద్ద బొజ్జతో వుంటారు. సమర్ధు లవారు ప్రతిష్ఠించిన ఈ స్వామిని దుల్య మారుతి అంటారు.

సామ్పగావ
...................
ఇక్కడ హనుమంతుని ఒక ఆల కాపరి కట్టించాదని ప్రతీతి.

పులసా
...............
అమరావతి జిల్లాలో పులసా ఒక చిన్నగ్రామము.బేతనది నుండి లభించిన ఈమూర్తిని రథముపై చేర్చి తీసుకువచ్చుటకు ప్రయత్నించి గ్రామస్తులు విఫలమై తరలి వెల్లగా మరునాడు స్వామే రథముముపై నుండి ఆశ్చర్య పరచాడు. అంతే కాక పొట్టపైభాగము కదులుతూ విచిత్రం చూపించారు.
అలబేలా హనుమాన్
..................
దాదర్ బడాలా బస్ డిపో బొంబాయి ౩౨ దగ్గరున్న ఈ హనుమమ్తుని హిందువులతో పాటు,ముస్లిం,పారశీ ,కిరస్తానీ భక్తులు కూడా పూజిస్తుంటారు.
సాంగలీ
................
...........కృష్ణానది ఒడ్డున వున్న ఇక్కడస్వామి ఇరవై నలుగడుగుల ఎత్తువుంటారు.
టాకలీ
.........
సమర్ధ రామదాసుల జన్మస్థలమైన ఈ గ్రామములో గుడి ప్రసస్థమైనది పదమూడు కోట్ల రామనామ జపమును సమర్ధులు ఇక్కడే జపించారట.

సజ్జనఘడ్
....................
సమర్ధ రామదాసుల మహాసమాధి ఇచ్చతవున్నది. ఆయన నిర్మించిన రామ మారుతీ ఆలయాలున్నాయి.

వారామతి,నలద గుణవడి
......................................
పూనాకుదగ్గరలో ఈమూడుగ్రామాల సమీపాన వున్న ఇచ్చోట స్వామిని మలదమారుతీ,శివానీ మారుతి అనికూడా పిలుస్తారు. ఈమందిరం క్రింది గుహలో స్వామి నాగరూపం లో దర్శనమిస్తారు.
నింబరగీ
................
పందరీ పూర్ రైల్వేస్టేషన్ నుంచి నలభై మైల్లదూరమ్ లో వున్న ఇక్కడ శ్రీరాముడు శివలింగము ఒకే శిలపై నుండుట విశేషము.హనుమంతుడు తపస్సు చేయగా స్వామి ఇలా కనిపించాదని చెబుతారు.అందువలన ఇది మారుతీ క్షేత్రం గా ప్రసిద్ధి.
ఔరంగాబాద్.
............
ఈ నగరం మధ్యలో నున్న సువారీ హనుమాన్ కూర్చుని వెలసిన స్వయం భూ.
ఖుల్తాబాద్
..........
ఔరంగాబాద్ నుండి పదకొండు మైళ్లదూరం లోనున్న ఇక్కడ స్వామి శయనించి వుంటారు.భద్రమారుతీ అని అంటారు.

Read more...

108 ప్రసిద్ధహనుమదాలయములు [తమిళనాడు లో] 4 వభాగం

>> Sunday, May 3, 2009

షోలంగి పూర్ క్షేత్రం
....................................
ఈక్షేత్రము ఎంతో ప్రాచీనమైనది. ఇక్కడ ఒకకొండపైన నరసింహుని ఆలయం రెండవ కొండపైన హనుమంతుని ఆలయం వుంటాయి.యోగముద్రలో వున్న హనుమంతుడు నాలుగుచేతులతో దర్శనమిస్తారు.రెండు చేతులలో శంఖ చక్రాలు .క్రిందచేతులలో జపమాల,చిన్ముద్ర వుంటుంది.ఇది హనుమంతుడు తపస్సు చేసిన స్థలం.ఇటువంటిక్షేత్రమ్ మరొకచోటలేదు.

కుర్తాలం
................
మాయవరం జిల్లాలో కుర్తాలం గ్రామంలో ఈ హనుమంతుని మధ్వాచార్యులవారు స్థాపించారు.

నామక్కల్
........................
సేలం జిల్లాలోని నామక్కల్ లో హనుమాన్ మందిరం లో హనుమంతుడు 12 అడుగులు వుంటారు.వేలాదిమంది దర్శించుకుంటుంటారు.

దొడదారాపురం
..............................
కోయం బత్తూర్ జిల్లాలోని ఈవూరిలో స్వామిని అభిషేకించదలిస్తే నిచ్చన ఎక్కి చేయాలి. మధ్వ ప్రతిష్ఠ.

శుచీంద్రం
...................
కన్యాకుమారి దగ్గరలోనున్న ఇక్కడ స్వామి ఇరవై అడుగులఎత్తుంటారు.

మరుత్వమలై
.............................
సంజీవని పర్వతం తెచ్చేప్పుడు కొద్దిభాగం ఇక్కడ పడింది.భూమికి పదహారు వందల అడుగుల ఎత్తున వున్న ఈక్షేత్రం లో సంజీవని పర్వతాన్ని ఎత్తుకున్నరూపం లో దర్శనమిస్తారు.

రామేశ్వరం లో హనుమతేశ్వర్
.........................................................
రామేశ్వరం లో ప్రధానమందిరం నకు మైలు దూరం లో పంచముఖ ఆంజనేయస్వామి వున్నది. ఇదికాక రామజరోకె రోడ్డులో బాలాంజనేయస్వామి ఆలయం ఉన్నది.

Read more...

నీకు గుర్తున్నా !గుర్తు లేకున్నా ! మేలే చేస్తుంది.

>> Saturday, May 2, 2009

అయ్యవారు ప్రతిరోజూ ఆలయం లో సత్సంగము చేస్తున్నారు. పురాణాదులనుండి ధర్మ సూక్ష్మాలను వివరిస్తున్నారు చక్కగా.ప్రతిరోజూవింటున్నా మనసుకేమీ ఎక్కని ,ఈ కార్యక్రమమంటె అంతగా ఆసక్తి లేని వెంకటరెడ్డిగారికి ఆవలింతలు వస్తున్నాయేతప్ప ఏమీ ఆసక్తి కలగటం లేదు. అందుకని ఒక రోజు బయటపడి అడిగేశాడు.
ఏమి స్వామీ ! మీరురోజూచెప్పటమేగాని నాకు ఒక్కముక్కా గుర్తుండటం లేదు.ఎందుకొచ్చిన దండగమారిపని ఇది.చెప్పిన మీకు విన్ననాకు ఏమీ ఉపయోగమున్నదనుకోను అన్నాడు.
అయ్యవారు చిన్నగా నవ్వాడు.
"లేదు రెడ్డీ! తప్పనిసరిగా ఉపయోగమే"
"ఎలా మీరు చెప్పేది నాకు ఒక్కముక్కా గుర్తుండనప్పుడు నాకేమి ఉపయోగము"?
అయ్యవారు అడుగుతున్నాడు
నిన్న మీ ఇంట్లో ఏమి కూర చేసారు?
"చారు"
మొన్న?
దోసకాయ కూర
అటు మొన్న?
"గుర్తు లేదు."
అంతకు ముందు రోజు?
అబ్బే అసలు గుర్తు లేదు.
ఆముందురోజు ?
"నాకు ఆసలు గుర్తుకు రావటము లేదు"
ఇంకాముందు ?
అబ్బే !గుర్తుండే సమస్యే లేదు. జవాబిచ్చాడు వెంకటరెడ్డి.
అయ్యవారు వివరిస్తున్నాడు"రెడ్డీ నీకు ఇంట్లో తిన్నకూరే గుర్తు లేదు.అంతమాత్రాన తిన్న కూర వృధాఅయినట్లా ? కాదుకదా .నీకు గుర్తున్నా గుర్తు లేకున్నా ఆ ఆహారం నీ శరీరానికెలా మేలు చేసినదో !అలానే గుర్తున్నా గుర్తు లేకున్నా ఈ భగవద్విషయాలు,కథల శ్రవణము నీకు మేలే చేస్తుంది,వృధాకాదు .
చేతులు జోడించాడు శ్రోత.

Read more...

108 ప్రసిధ్ద హనుమదాలయాలు [౩ వ భాగం]

>> Friday, May 1, 2009

[కర్ణాటక లో ప్రసిద్ధ ఆలయాలు.]

హంపి యంత్రోద్ధారక హనుమాన్
..............................................................
బ ళ్ళారి జిల్లాలో ని హంపిలోని మందిరం లో స్వామినియంత్రోద్ధారక హనుమాన్ అని అంటారు. ప్రాచీన కిష్కింధ గా పేర్కొంటారు.చక్రతీర్థము లో పూజజరిపి వ్యాసరాయలవారు నిద్రిస్తూవుండగా నీవు స్తోత్రము చేస్తేచాలదు నామూర్తిని ప్రతిష్ఠచేయాల్ని స్వామి వారు ఆనతిచ్చారు. మరునాడు తన అనుష్ఠానానంతరము ఇదేవిషయాన్ని ఆలోచిస్తూ తన ఎదురుగావున్నా బండపై నల్లని బొట్టు తో స్వామి చిత్రాన్ని చిత్రిస్తూవుండగా ఆబొమ్మ లో స్వామిచలనం వచ్చి నిజాకారం తో ఎగిరి వెళ్ళిపోయాడట. దీనితో చాలా ఆశ్చర్యం కలిగి వ్యాసరాయలవారు ఐదారు సార్లు ఇలా చిత్రించినా మరలా మరలా అలానే జరిగినది. అలా కాదని వ్యాస్రాయలవారు యంత్రాన్ని చిత్రించి దానిలో ద్వాదశ నామాలి లిఖించి మధ్యలో చిత్రాన్ని చిత్రించగా స్వామి వారు వెల్లలేక పోయారు. ఆయన సంతోషించి అక్కడే ప్రతిశ్ఠించి తన తపశ్సక్తినంతటిని ధారబోశారు.
వ్యాసరాయలవారు చేసిన ౭౩౨ ఆంజనేయస్వామి ప్రతిష్ఠలకు ఇదే నాంది.

ఋష్యమూక పర్వతం
..........................................
సుగ్రీవ,హనుమంతుల వారు నివసించిన పరవతమిది .హంపికి సమీపములో నున్న క్షేత్రమిది.

కిష్కింధ
...............
శ్రీరాముడు సప్త తాల బేధనము చేసిన స్థలమిది. తుంగ భద్ర ఒడ్డున ఉంటుంది ఈ మందిరం
అంజని పర్వతం
.........................
పంపా సరోవరం నుంచి ఒక మైలు దూరములో ఈపర్వతం పైన గుహాలయమ్ దర్శించదగినది.

మాల్యవానపర్వతం
.......................................
విరూపాక్షాలయం నాలుగు మైల్ల దూరం లో వున్న ప్రవర్షణ గిరి పై స్పటికశిలామందిరము ఇది. సీతమ్మ జాడను శ్రీరాములవారికి చెప్పినస్థలమిది.

ఉడిపి
............
మధ్వాచార్యులచే ప్రతిష్టింపబడిన ఈ మందిరములో హనుమంతునిపూజించిన తరువాతనే పరమాత్మయగు కృష్ణుని పూజిస్తారు.

బసవగుడిక్షేత్రం
...........................
బసవగుడి గ్రామము లో నున్న ఈక్షేత్రము లో స్వామిని వ్యాసరాయలవారు ప్రతిష్ఠించి నారు.
మంత్రాలయం పంచముఖాంజనేయ స్వామి
..................................................................................
మంత్రాలయం నుంచి అతికొద్దిదూరమ్ లో తుంగభద్రకు ఆవలివడ్డున వున్న మహా శక్తి వంతమైన క్షేత్రమిది. ఈయన ఆదేశానుసారమే రాఘవేంద్రులు మంచాలగ్రామము లో స్థిరపడ్డారట.

పాత పోస్టుల కోసం
http://durgeswara.blogspot.com/2009/04/108.హ్త్మ్ల్
http://durgeswara.blogspot.com/2009/04/108.html

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP