శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

>> Saturday, November 28, 2009









చిరునవ్వులు చిందించిన శ్రీవారు [గీతాజయంతి పూజవివరాలు]

గీతాజయంతి రోజున పీఠములో శ్రీవారికి ప్రత్యేక అర్చనలు జరిగాయి . ఉదయం నుండి పురుషసూక్త ప్రకారంగా స్వామి వారికి అభిషేకాలు నిర్వహించబడ్డాయి . స్వామి భక్తులు ఢిల్లీ నివాసులైన కౌండిన్యస గోత్రీకులు రామమూర్తి_ లక్ష్మీ దంపతులు తమ అతల్లిదండ్రుల తరపున శ్రీవారికి సమర్పించవలసినదిగా కోరుతూ పంపిన పట్టువస్త్రాలను ధరించి స్వామి చిరునవ్వు లొలకిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.

తదనంతరం విష్ణుసహస్రనామ సహితంగా అష్టాక్షరీ మంత్రాన్ని అనుసంధానిస్తూ నారాయణ యాగము భక్తిప్రపత్తులతో సాగించబడింది . చెన్నై నుంచి సునీల్ వైద్యభూషణ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ,వినుకొండనుంచి వచ్చిన భక్తులు పాల్గొని స్వామిని సేవించుకున్నారు.

ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని " శ్రీరాధే జయరాధే జయజయ రాధే " అనే దివ్యనామాన్ని శనివారం ఉదయం ఆరుగంటలనుండి ఆదివారం ఉదయం ఆరుగంటలవరకు నిర్విరామంగా ఏకాహం గా జపించటం జరిగింది . పరమాత్మ యొక్క హ్లాదినీశక్తి అగు రాధామాత నామాన్ని పఠించటం ద్వారా ఆతల్లి దివ్యానుగ్రహాన్ని భక్తులు సులభంగా పొందగలుగుతారని శాస్త్ర రహస్యము . కృష్ణున్ని పట్టుకోవాలంటే బృందావనేశ్వరి రాధాదేవి అనుగ్రహం లేనిదే సాధ్యం కాదని శాస్త్రవచనం . సాయంత్రం భగవద్గీతా పారాయణం జరిగింది

// పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం
వ్యాసేన గ్రథితాం ,పురాణమునినా మధ్యే మహా భారతం
అధ్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం
అంబత్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం //

Read more...

ఆథ్యాత్మిక గ్రంథాలలో భగవద్గీత ఎందుకు తలమానికమైనది ?[గీతాజయంతి సందర్భంగా]

>> Friday, November 27, 2009


లోకం లో పరమాత్మను గూర్చి ఆయన లీలలను గూర్చి వివరించే ఆథ్యాత్మిక గ్రంథాలు అనేకమున్నాయి. వాటన్నింటికీ తలమానికం వంటిదని ఆథ్యాత్మికగ్రంథరాజంగా ఎన్నబడుతున్నది భగవద్గీత . కారనమేమిటంటే మిగతా గ్రంథాలనే ఆణిముత్యాలన్నీ భగవంతుని లీలా విభూతులను దర్శించిన మహాత్ముల ద్వారా అందివ్వబడినవి .అలాగే వేదాలు కూడా మహర్షులు దర్శించినవే. కానీ గీత సాక్షాత్తు భగవానునిచేత పలకబడినది . కనుక ఏ సందేహానికి తావులేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్యమార్గాన్ని చూపే పవిత్రగ్రంథం.

గీకారం త్యాగరూపం స్యాత్
తకారమ్ తత్వబోధకమ్
గీతా వాక్య మిదమ్ తత్వం
జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి:

గీత అను రెండక్షరముల తాత్పర్యమును ఈ శ్లోకం తెలుపు చున్నది. "గీ" అను అక్షరము త్యాగమును బోధించుచున్నది. "త" అను అక్షరము తత్వమును అనగా ఆత్మస్వరూపమును ఉపదేశించుచున్నది. గీత యను రెండుశబ్దముల కర్ధము ఇదేనని ముముక్షువులు తెలుసుకోవాలని పెద్దలు భోధిస్తున్నారు.

త్యాగశబ్దమునకు నిష్కామ యోగమగు కర్మ ఫలత్యాగమనియు లేక సర్వసంగపరిత్యాగమనియు అర్థము కలదు . అలాగుననే తత్వబోధనము కాత్మ సాక్షాత్కారమనియు,బంధమునుండి విముక్తి గల్గుటయనియు నర్థము కలదు . ఈ పరమ రహస్యమునే గీతాశాస్త్రముపదేశించుచున్నది .

అతువంతి పరమ పావనమైన గీత భగవానుని నోట వెలువడిన మహాపుణ్యదినము మార్గశిర శుద్ధ ఏకాదశి. ఈనెల 28 శనివారం. ఈరోజు ఆపవిత్రగ్రంథాన్ని సృజించినా మహాపుణ్యము వస్తుంది . ఇక పఠనము ప్రభావాన్ని వర్ణించనలవికాదు. మానవాళి కి సర్వ సమస్యలకు పరిష్కారాన్ని సూచించే జగద్గురువైన ఈ గ్రంథరాజాన్ని ఈ రోజునుంచైనా పఠించటం మొదలెడదాం . మన జన్మ ధన్యం చేసుకుందాము.

Read more...

మహిమోపేతులైన రాఘవేంద్రుల మఠమెలా మునిగింది వరదలో

>> Thursday, November 26, 2009


ఇటీవల వరదల దుర్ఘటనలో ఎందరెందరి జీవితాలో నీటిపాలయ్యాయి. వేలకొలది కోట్లనష్టమొచ్చినది .[జీవితం లో ఆర్దికం ముఖ్యమైపోయినదికదా! ? అందుకే కోట్ల రూపాయల విషయం ముందు.] అపార జీవ నష్టం [ మనుషులే కాదండొయ్ ....జంతువులు ,పక్షులు క్రిమి కీటకాదులు, వగైరా]జరిగింది. ఎంతోమంది ఇళ్ళు కుటుంబాలు కొట్టుకపోయాయి.[ఆకలి చావులకంటె పర్యావరణం ....జనాలకంటె తోటలు[లాన్శ్] సంరక్షణకు ఎక్కువ ప్రాధాన్యం కదా ఈరోజులలో ... అందుకే మనుషులు కూడా పర్యావరణం తర్వాతే, పొలాలతర్వాతే . కుటుంబ వ్యవస్థ వ్యక్తికన్నా ,స్వార్ధం కన్నా తక్కువ విలువైనదిగా తయారైంది .అందుకే అది తరువాత, . ఇకపోతే రవాణా ,విద్య ఆరోగ్యరంగాలు సేవలూ దెబ్బతిన్నాయి. [ప్రస్తావన వరుసగా ఇంకా వివరించాలా....?]

ఈ దుర్ఘటనలో మంత్రాలయ మహాక్షేత్రం ,"మన" రాఘవేంద్రులవారి మఠం కూడా నీళ్లలో మునిగిపోయింది. [ఆథ్యాత్మికత ప్రాధాన్యత అన్నింటికంటె చివరిదికదా ! ] ఇంత కల్లోలంగావుంటే చూస్తూ కూడా ,సానుభూతి నటిస్తూనే ఒక అమాయక నిర్హేతువాది అడిగాడు [హేతువు భగవంతుడు. కాదనటం నిర్హేతుకం కదా !] అయ్యా..............రాఘవేంద్రుడు అంత మహిమ కలవాడంటివే ! మరి ఆయన మఠాన్నైనా కాపాడుకోలేక పోయాడా ?"ఆయన గొప్పవాడు ,మహిమకలవాడు కాదని అంటే వరదలాగిపోతాయ్ ! అన్నంత సీనుంది వాడి బొంగురు గొంతులో .
ఒకసారి ఒక వ్యక్తి ఆచార్యులవారితో " సార్! ప్రపంచం అస్సలు బాగోలేదు సార్ ! అన్నాడట . వెంటనే మాస్టర్ గారు : అవునోయ్!నువ్వునేను వుంటాం కదా ! అన్నారట.

అలా ,రాఘవేంద్రుడు ,ఆయన పీఠం నీట మునిగింది ఈనాడు కాదు. ఎందరో మహనీయులు అవతరించి ఆథ్యాత్మిక జీవితాన్ని నిర్ధుష్టం చేసి ఆచరించి నిరూపించి చూపిన భరతవర్షం లో గురు రాఘవేంద్రులు అవతరించటం ,సరైన మార్గం చూపటం జరిగింది. చారిత్రకంగా రాముడు ,కౄష్ణుడు గురించి ఆధారాలివ్వలేకపోయినా ,శ్రీ రాఘవేంద్రుల బోధలు ఇంకా అందుబాటులోనే వున్న సమయమిది. ఆయన ఎక్కడ జన్మించినది ,ఎలా ప్రవర్తించినది ఎలా ఆథ్యాత్మికోన్నతి కనబరచారో ,అన్నీ చారిత్రాత్మకంగా "సత్యాలు"గా ఇంకా నిలిచే వున్నాయి. మానవజాతి ఆవిర్భవించిన కాలాన్ని ఒక సంవత్సరంతో పోలిస్తే ాఘవేంద్రులు ఆవిర్భవించి కొన్ని నిముషాలు కూడా గడిచుండదు. అయినా ఆయనగురించి ,ఆయన బోధల గురించి మన ఆంధ్రజాతి మరచిపోయి చాలాకాలం అయ్యింది. "గుండానంద": " బండానంద" మొదలైన కొత్తగురువుల అగత్యం జాతికి పట్టనవసరం లేనంతగా, భక్తి వైరాగ్యం మొదలైన అంశాలను ఆచరణాత్మకంగా చూపిన దివ్య బోధను మన మానస సరోవరం లో "కల్తి" ఆలోచనల వరదనీటిలో ఎప్పుడో మనజాతి ముంచేసింది. ఏకొద్దిమందో వారిని గుర్తుపెట్టుకుని పూజిస్తున్నారు.
తక్కినవాళ్లమందరము ఆయనను "మనరోజువారీ మురికి జీవితపు"అలవాటు మాటున కప్పివేశినప్పటి నుండి ,నిజంగా ఎంతో నష్టం జరిగింది. ఇవాళ మునిగినది ఆవూరిలో ఒక కట్టడం. ఆపుణ్యక్షేత్రం పవిత్రత మన మనసుల్లో ఎప్పుడో సమాధి అయిపోయినది.

ఆథ్యాత్మికత అంటె నిజంగా ఏమిటో మాహాత్ములెలావుంటారో ? వారి బోధలేమిటో ఆచరణాత్మంగా చూపిన పరమాచార్యులు సాయి మాస్టర్ గారు ఆయన రచనలు ఆధారంగా మళ్ళీమనజాతికి శుభోదయం కలిగింది. కుల్లు కుతంత్రాల ,అసూయా-ద్వేషాల కుల్లుకంపు మనమనస్సులను వొదులుతుంది.
మన జాతి గతం లో జలసమాధి చెసిన మహనీయుల మహిమాన్విత మూర్తులు మళ్లీ మన మనసులలో పున:ప్రతిష్టించబడతారు . అప్పుడు దత్త కథలనే పిల్లవాయువుల తాకిడికి సరైన ఆలోచనలనే తరంగాలు ఉద్భవిస్తాయి. ఆమానస సరోవర మధ్యమున ప్రతిష్టితమైన రాఘవేంద్రులవంటి మహనీయ మూర్తుల పాదాలను తలలతో సృజిస్తూ నిత్యపవిత్రములైన ,ఆతరంగాలు వారి పదచరణ సేవలో నిమగ్నమవుతాయి. ప్రతి ఆలోచన వారి పాదాలను సోకుతుంది. ప్రతి కార్యము వారిని అర్చిస్తుంది. ప్రతి మాట వారిని కీర్తిస్తుంది.అప్పటికి నిజానికి మనందరికీ ,మానవజాతి మొత్తానికీ ప్రాణికోటి మొత్తానికీ ఇట్టిమానసికబురద అనే విధ్వంసం ముగుస్తుంది .. సరైన మానతా విలువలనే కమలాలు ఆ సరోవరాలలో నిలుస్తాయి. ధర్మాచరణమనే సుగంధాలు నలుదిశలా వ్యాపిస్తాయి.అప్పుడు జగమంతా మంత్రపూరితమవుతుంది .అది రాఘవేంద్రుల విశ్వరూపమవుతుంది .

మానవజాతి ని,ధర్మాన్ని పునరుజ్జీవనం చేసే సాయి ప్రభోదామృత ధారలకు స్వాగతం పలుకుదాం .ప్రతిరోజూ కొంతైనా మన మనస్సుల్లోకి ప్రవహించనిద్దాం . జీవితాలను సార్ధకం చేసుకుందాం . అప్పుడే మహితాత్ములు , కారుణ్య మూర్తులు అయిన మహనీయులకు మనం నిజంగా అంజలి ఘటించినట్లు .వారు నిజంగా గొప్పవారని అంగీకరించినట్లు. అలా ఆంగీకారం అయితే ఆ అంగీకారం నిలిస్తే ఇక మానసిక బురదవరదలు ఎప్పటికీ మనమనస్సులను తాకవు.
జై సాయిమాస్టర్.......నమో గురు రాఘవేంద్రాయ .

ద్వారకానాథ్
[సాయిబాబా మాసపత్రికనుండి]



Read more...

కొండగురునాథుని కొండపై జరుగుతున్న దత్తజయంతికి రండి.

>> Monday, November 23, 2009


బ్రహ్మవిష్ణుశివాత్మకుడైన దత్తప్రభువు

కూర్మగిరిపై కొండగురునాథుని దారుశిలా మూర్తులు




మానవాళిని ఉద్ధరించాలనే ప్రేమతో పరమాత్మ ఎత్తిన దివ్యావతారమే దత్తాత్రేయస్వామి. అత్రి అనసూయలకు పుతృనిగా త్రిమూర్త్యాత్మకుడు గా ఉధ్భవించి తన కార్యాన్ని నిర్వర్తించాడు. కాదుకాదు ఈ సృష్టి వున్నంతవరకు మానవకళ్యాణమనే కార్యక్రమం ఆయన పలురూపాలలో సాగిస్తూనే వుంటాడు . ఆ దత్త ప్రభువు మార్గశిర పౌర్ణమినాడు భూమి మీద అవతరించిన సుదినం . డిసెంబర్ 2 ఆపర్వదినం వస్తున్నదీ సంవత్సరం .ఆరోజు కు పూర్తయ్యేలా దత్తదర్శనం గాని లేక గురుచరిత్రగాని పారాయణం చేసుకుని ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు నని పెద్దలు చూపిన బాట. ఈ సద్గ్రంథాలను పారాయణం చేయటం గురువు అనుగ్రహాన్ని శీఘ్రం చేయటమే కాక కామధేనువు వలె సకలాభీష్టాలు నెరవేర్చగలుతాయి .

ఇక ఈసందర్భంగా శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం ప్రసిధ్ధమయిన దత్తక్షేత్రం కొండగురునాథుని కొండపైన ఆరోజు స్వామికి రుద్రాభిషేకములు ,గాయత్రి హోమము .దత్తకృపాసిద్ధికై నిర్వహిస్తున్నది . కొండగురునాథుని కొండమీద దత్తుని గూర్చి ఈక్రింద లింక్ లో చూడండి .
http://durgeswara.blogspot.com/2009/01/blog-post_04.html

మీరు వారం ,లేక ఐదు ,మూడు రోజులుగా ఈసథ్గ్రంథాలలో ఏదో ఒకదానిని పారాయణం చేయాలి . మీ గోత్రనామాలు పంపితే మీతరపున అక్కడ కార్యక్రమములో సంకల్పం చెప్పబడుతుంది. అలాగే పౌర్ణమి చంద్రోదయ కాలంలో అమ్మవారికి లలితా సహస్రనామసహితంగా కుంకుమార్చన జరుగుతుంది . రాత్రి మొత్తం కొండమీద ధ్యానం ఉంటుంది . పాల్గొన దలచినవారు ఏ సాంప్రదాయం లోనివారైనా రావచ్చు. మీకు గురుచరిత్ర గ్రంథం ఇక్కడ దొరుకుతుంది .
http://teluguthesis.com/index.php?showtopic=181


డౌన్ లోడ్ చేసుకోండి . దత్తదర్శనమయితే గణపతి సచ్చిదానందులవారు రచించిన గ్రంథం బాగుంటుంది .వారు స్వయంగా దత్తోపాసకులుగనుక అది ప్రమాణగ్రంథం . దత్తాంభజే గురు దత్తాంభజే .. ఈ సందర్భంగా కోరినవారి తరపున మొత్తం నూటాఎనిమిది కలశాలను ఏర్పాటుచేసి వారి తరపున ఆకలశముల లోని జలాలతో స్వామికి అభిషేకము జరుగుతుంది. తమ తరపున కలశాలను ఏర్పాటుచేసి అభిషేకము జరిపించాలని కోరేవారు , ప్రసాదాలు పంపమని కోరేవారు మాత్రం నన్ను ఫోన్ లో సంప్రదించగలరు .9948235641] ముక్కోటి ఏకాదశి దాకా జరగనున్న నారాయణ యాగానికి కూడా స్వామి అనుమతిని కోరటం కూడా ఇందులో ఒకభాగం.


భక్తజన పాదసేవలో

దుర్గేశ్వర

Read more...

గుణత్రయ సాంగత్యం

>> Sunday, November 22, 2009

సత్వరజస్తమోగుణాలు ఒకదానితో ఒకటి కలుస్తూఉంటాయి మరలా ఆశ్రయిస్తూ కూడా వుంటాయి. ఇవి నిరాశ్రయాలు కావు. కేవలం వీటిలో ఏదో ఒక్కగుణమే ఎక్కడా వుండదు.ఎప్పుడూకలిసేవుంటాయి .అన్యోన్యాశ్రయాలు.

జ్ఞాతమైన పనిపట్ల శ్రధ్ధ అనేది ఫలానుభూతి లభించేవరకు ఉంటేనే అదిపరిజ్ఞాతమవుతుంది..లేకపోతే నిష్ఫలం .ఏదైనా విన్నంతమాత్రాన్నే చూసినంతమాత్రానే పరిజ్ఞాతం కాదు ,అనుభూతం కావాలి. ఉదాహరణకు తీర్ధయాత్రలగూర్చి ఎవరో చెప్పగావిని రాజసమైన కోరికతో అతడు ఆతీర్ధాన్ని దర్శించి స్నాదాలు చేసి మహాదానాలు చేస్తాడు. ఇంకా కొద్దికాలం అక్కడ నివసిస్తాడు . ఆపైన తిరిగి ఇంటికివచ్చాక మళ్ళీ మామూలే . తన రాగద్వేష కామక్రోథాదులు అన్నీ యథాతథం .మరింకేమి మిగిలింది శ్రమతప్ప.? ఇతనికి విన్నది అనుభూతంకాలేదు. తీర్థసేవనకు ఫలం నిష్కల్మషత్వం .అలాంటి ఫలం లభించలేదు .ఇది రజోగుణం .రాగద్వేషాలను వదిలించుకోకుండా ఎన్ని తీర్ధయాత్రలు చేసినా నిష్కల్మషత్వం రాదు. రైతు నేలదున్నేదగ్గరునించిజాగ్రత్తలు తీసుకుని పంట చేతికొచ్చేసమయాని ఆదమరిస్తే పంటంతా పశుపక్ష్యాదులపాలవుతుంది.అలాగే అనుభూతి పర్యంతం శ్రద్ధ వహించకపోతే సాధకునికి సత్వానుభూతి కలగదు.

శాస్త్రదర్శనాదులవల్ల సత్వగుణం వృద్దిచెంది వైరాగ్యభావం కలుగుతుంది ఐనా ,తమోరజోగుణాల సాంగత్యం తో నిత్యమూ పరాభవాలను అనుభవిస్తుంది . నిరంతరం ఘర్షణే .కనుక సత్వగుణానిన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి.అదిపెరిగినప్పుడు వైరాగ్యం తమోరజగుణాలను జయించి బుద్ధిధర్మమార్గాన్ని అనుసరిస్తుంది. బాహ్యార్థాలనువాంచించకయజ్ఞయాగాదులపట్ల ఆసక్తమై యథాలాభ సంతుష్టి ఏర్పడుతుంది.
ఇలాముందుగా రజోగుణాన్ని నియంత్రించి తమోగుణాన్ని అంతం చేయాలి. అప్పుడుగాని సత్వం నిలవదు. అలాకాక రజోగుణం పెరిగిఒనదనుకో ,అధర్మాలలో శ్రద్ధకలిగి సనాతన ధర్మాన్ని వదిలేయాలనిపిస్తుంది .ఇక తమోగుణం వృద్దయితే వేదశాస్త్రాలపట్ల విశ్వాసం నశిస్తుంది .దుష్కర్మలతో అక్రమమార్గాన్నయినా ధనం సంపాదించాలనే ఆరాటం మొదలవుతుంది. శాంతి నశిస్తుంది. క్రమక్రమంగా సత్వగుణలక్షణాలు కనుమరుగై కామ చోరభావాలు రాజ్యమేలుతాయి..

అయితే ఈ గుణాలు ఒంటరిగా వుండవు ఒకప్పుడు సత్వరజస్సులు, మరొకప్పుడురజస్తమస్సులు, మరోకప్పుడు సత్వతమోగుణాలు జంటలవుతాయి .మూడవదానిని అణగదొక్కుతాయి. బుద్ధిస్థానాలైన ఈజంటలు మిథునాలవుతాయి .పరస్పరం ప్రబోధించుకుంటూవుంటాయి.

నారదా ! ఈగుణ సాంగత్యం చాలాచిత్రంగాఉంటుందొకప్పుడు .కేవలం సత్వం తనంత తానుగా ఒక్కటిగావుండదు అలాగే రజస్తమస్సులకు ఊడిగం చెయ్యదు. పరమ పతివ్రత సవతికి సేవచెస్తుందా? నిర్మలంగా వున్ననైజ గుణాన్ని రజస్తమస్సులు మురికి చేస్తాయి. వాటిమురికిని ప్రయత్నపూర్వకంగా వదిలించుకోగలిగితే సత్వం ప్రవేశిస్తుంది. అప్పుడు మిగతావి కుళ్ళుకుంటాయి . సవతులు ఏడ్చినట్లుగా .భార్యసేవలకు భర్త సంతోషిస్తే సవతులు ఏడుస్తారు. రాజభటులను చూసి సజ్జనులు సంతోషిస్తే దుర్జనులు బెంబేలెత్తుతారు.వానకురిసి రైతు సంతోషిస్తుంటే ఇంటిపైకప్పులేనివాడు తిట్టుకుంటాడు.. స్వభావస్థమైన గుణాలు అవస్థా బేధాలనుబట్టి ఇలా సుఖదు"ఖాలను కలిగిస్తుంటాయి.

నారదా ! ఈ గుణాలను పోల్చుకోవటానికి గుర్తులు చెబుతాను విను. దేనినైనా సరే తేలికగా చూడటం ,తేలిగ్గాలేవడం తేలిగ్గాపోవడం ,మనస్సు ఎప్పుడు నిర్మలంగా ఉండటం ఇవి సత్వగుణసమృద్దికి నిదర్శనాలు. శరీరం లో జృంభాస్తంభ,తంద్రాచంచలత్వాలుకనిపిస్తే అవి రజో గుణానికి కొండగుర్తులు. కలిని వెతుక్కుంటూ వెళ్లడం ,చిత్తచాంచల్యం ,దుష్టులతో స్నేహం ,బరువుపెరగటం వివాదాలకు కాలుదువ్వడం ఇవి తమో గుణలక్షణాలు. ఇంద్రియాలు మనస్సు శూన్యమై పోతాయి నిద్రనుకోరడు.

ఇలా బ్రహ్మదేవుడు గుణలక్షణాలను విశదీకరించగా నారదుడు శ్రద్దగా విని లబ్దిపొందాడు. మరొక సందేహం పొటమరించింది.వినయంగా ప్రశ్నించాడు. తండ్రీ ! విభిన్న లక్షణాలు కలిగిన ఈ గుణాలు ఒకేచోట ఎలా నిలుస్తున్నాయి? కలిసి ఎలాపనిచేస్తున్నాయి? నిజానికి ఇవి పరస్పరం శత్రువులుకదా !

పుత్రా! ఈగుణాలు దీపాలవంటివి . పత్తి నూనె మంట ఇవి పరస్పర విరుద్దాలే అయినా దీపం వస్తుదర్శనం చెయ్యడం లేదూ ! తైలానికి వత్తితోనూ అగ్నితోనూ వైరుద్యమే .అలాగే అగ్నికి వత్తితో తైలంతో శతృత్వమే అలాగే మూడోదానికి కూడా ఐనా కలిసివుంటున్నాయి .వెలుగుతున్నాయి.పదార్ధాలను ప్రదర్శిస్తున్నాయి .ఇలాగే గుణాలు వాటి కలయికా ప్రకృతి సిద్దాలు .అని బ్రహ్మదేవుడు నారదునికి చెప్పగా నారదుడు వ్యాసునికి,వ్యాసుడు జనమేజయునికి చెబుతున్నాడు.

జనమేజయా ! ప్రకృతి సిద్దాలైన ఈ మూడు గుణాలే విశ్వప్రాదుర్భావానికి కారణం .కనుక గుణలక్షణవిభాగం తెలుసుకోవటం ముఖ్యం .దీనికంతటికీ కారణమైన సర్వవ్యాపకతా లక్షణంతో విరాజిల్లే శక్తిని ఆరాధించటం అన్నింటికన్నా ముఖ్యం .సగుణ నిర్గుణ కార్యబేధాలన్నీ శక్తి ప్రభావ సంజాతలే .నిరూహుడు ,పూర్ణుడు.పరముడు,అవ్యయుడు అగు పురుషుడు అకర్త.సదసదాత్మకమైన ఈ విశ్వాన్ని మహామాయయే సృష్టిస్తోంది ........................................

{ దేవీ భాగవతం నుండి }

Read more...

విభీషణుని వివేకం

>> Friday, November 20, 2009


రామాయణంలో విభీషణుడి పాత్ర అంతగా ఉండకపోయినా... ఆయన పాత్రకున్న ఔదార్యం అంతా ఇంతా కాదు. రావణుడి వంటి దురాచారుడు జన్మించిన లంకలో విభీషణుడి లాంటి సాధువులు కూడా జన్మించారంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. గంజాయ వనంతో తులసి మొక్కలా చాలా పవిత్రమైన వ్యక్తి విభీషణుడు. రావణుడి సోదరుల్లో విభీషణుడు రెండోవాడు.




రావణుడు సీతను లంకకు తీసుకువచ్చినప్పుడు, వదిన మండోదరికి పరిస్థితిని వివరించి భర్తకు నచ్చచెప్పమని వేడుకున్నాడు విభీషణుడు. ఆమె చెప్తే మాత్రం వింటాడా? కాదు పొమ్మన్నాడు. ఇలాగే పలు విషయాల్లో అన్నకు వ్యతిరేకంగా ధర్మమార్గాన్ని పట్టాడు. రావణుడితో యుద్ధం చేసేందుకు రాముడు లంకకు వచ్చిన సమయంలో విభీషణుడు రాముడిని కలిసుకున్నాడు. రాముడికి మంచి మిత్రుడిగా మారి యుద్ధంలో సాయం చేశాడు.

రాక్షస కుటుంబంలో ఇలాంటి వ్యక్తి జన్మించాడా అని రాముడు సాధారణ మానవుడిలానే ఆశ్చర్యపోయాడు. కాగా, రావణుడి యుద్ధం తర్వాత లంకకు నిన్నే రాజుని చేస్తానని అన్నాడు రాముడు. సాధారణంగా ఓ రాజ్యంపై యుద్ధానికి వచ్చి గెలుచుకున్నవారికే ఆ రాజ్యం సొంతమవుతుంది కదా! అయినప్పటికీ, పరుల సొత్తు వద్దని ఆ రాజ్యాన్ని రావణుని సోదరుడైన విభీషణుడికి అప్పగించాలని భావించాడు రాముడు.

అప్పుడు విభీషణుడు "రామా నాకు ఈ రాజ్యాలు, సుఖాలు అనుభవించాలని లేదు. నీ సోదరుడు భరతునికి పాదుకలు ప్రసాదించిన రీతిలోనే నాకు కూడా ప్రసాదించమని" వేడుకున్నాడు. ఇది విభీషణుడి ఔదార్యానికి తార్కాణంగా నిలిచింది. ఇంకా చెప్పాలంటే, రాజ్యాన్ని వదిలిన రాముని ఔదార్యంతో పోలిస్తే విభీషణుడి ఔదార్యం ఎక్కువనే చెప్పాలి. తనకు రావలసిన రాజ్యాన్ని కాదన్నాడు విభీషణుడు. రామ సేవలో రాజ్యాలు తుచ్ఛంగా భావించాడు. యుగపురుషుడిగా చెరిగిపోని ముద్ర వేసుకున్నాడు. ఔదార్యానికి చక్కని ఉదాహరణగా నిలిచాడు.

Read more...

మీకు మీరు సంతోషంగా లేరు అనిపిస్తే వీళ్లని చూడండి

>> Wednesday, November 18, 2009

ఎవఱైనా విమర్శిస్తే పట్టించుకోకండి. సాధారణంగా ఱాళ్ల దెబ్బలు తగిలేది విరగకాచిన చెట్లకే.

* * *

మీకు మీరు సంతోషంగా లేరు అనిపిస్తే వీళ్లని చూడండి

cid:1.1419825572@web59101.mail.re1.yahoo.com

* * *

మీది చాలీచాలని జీతం అని అనుకుంటున్నారా? మఱి ఆమె సంగతో?

cid:2.1419825572@web59101.mail.re1.yahoo.com

* * *

మీకు బోలెడంతమంది స్నేహితులు లేరనుకుంటున్నారా?

cid:3.1419825573@web59101.mail.re1.yahoo.com

* * *

వదిలేద్దామనుకుంటున్నారా? ఇతన్ని చూడండి!

cid:4.1419825573@web59101.mail.re1.yahoo.com

* * *

జీవితంలో ఎదురయ్యే కష్టాల గుఱించి బాధపడుతున్నారా, ఇతను పడేటంత కష్టాలా అవి?


cid:5.1419825573@web59101.mail.re1.yahoo.com

* * *

రవాణా వ్యవస్థ బాగోలేదని గొడవపెడుతున్నారా? మఱి వీరో…!


cid:6.1419825573@web59101.mail.re1.yahoo.com

* * *

సమాజం చిన్నచూపు చూస్తోందని వాపోతున్నారా? ఈమెను గమనించారా?

cid:7.1419825573@web59101.mail.re1.yahoo.com

* * *

జీవితాన్ని ఎలా ఎదురౌతుందో అలాగే స్వీకరించండి. మనకంటే ఇబ్బందులు పడుతున్నవారు ఈ భూమిపై చాలామందే ఉన్నారు.

* * *

మన దృష్టిలోపడే వస్తువులు ఈ ప్రపంచంలో చాలానే ఉంటాయి కానీ వాటిల్లో గుండెలకు హత్తుకునేవి కొన్నే ఉంటాయి, వాటిని తృణీకరించకూడదు *

1.PNG

1.PNG

1.PNG

1.PNG

1.PNG

1.PNG


ఇంకా మీ నిరసన ధోరణి పోలేదా? మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించండి. ఈ పిసరంత జీవితకాలంలోనూ మీకు లభించినదానికి సంతోషించండి. తృప్తిగా హాయిగా జీవితం గడపడానికి అవసరమైనదానికంటే మనకు ఎక్కువే ఉంది, ఆ అదృష్టాన్ని చూడండి. ఈ వినియోగవాదాన్నీ నయరహితజీవితాలనీ విడనాడి, మన సమాజంలో మూడింట రెండు వంతులు ఉన్న అభాగ్యుల గుఱించి కూడా ఆలోచిద్దాం. నిరసించడం మాని ఇవ్వడం అలవాటు చేసుకుందాం.


[ నేనందుకున్న ఒక మెయిల్ ఇ






Read more...

మానాయన పాండిత్యం కొంత .... నాపైత్యం కొంత.

>> Tuesday, November 17, 2009

అర్ధ జ్ఞానం తో పండితుడనని వాదనలు చేసే నాలాంటి ఓ తల తిక్క పంతులు గారిని మీలాంటి మహాను భావులెవరో అడిగారట ఎగతాళిగా . అబ్బా! మీరిన్నిన్ని విషయాలను ఎక్కడ నేర్చుకున్నారండి .ఎవరితోనైనా అడ్డగోలుగా వాదించగలుగుతున్నారు . దానికి ఉప్పొంగి ," మానాయన నేర్పిన పాండిత్యం కొంత ,నాపైత్యం కొంత కలగలిపి చెప్పేస్తున్ననోయ్ ... అని అసలు విషయం వెళ్ళబెట్టాడట .

అలాగే ,నేడు ఆథ్యాత్మిక విషయాలలో మిడిమిడి జ్ఞానంతో తాము నేర్చుకున్నరెండు ముక్కలే జ్ఞానమని ,తాను అనుసరిస్తున్న మార్గమే మొదటిదని ,ఇంతకుముందున్న జీవులంతా అజ్ఞానులనే వాదనలతో బోధనలు చేసేవారిని చూస్తుంటే ఈ సామెత గుర్తుకొస్తున్నది.
ఏదో పూర్వజన్మ సుకృతంగా ఈ పథాన అడుగులు నేర్చుకుంటూన్న నాకు ఇలాంటి సాధకులు[వారే ప్రకటించుకుంటారు] ఆథ్యాత్మిక బోధకులు అప్పుడప్పుడూ తగులుతుంటారు . వీళ్లవాదనలు ఎలావుంటాయంటే . సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనే విషయము వాస్తవమే కానీ అది మావూర్లో ప్రాగ్దిగ్భాగాన మాత్రమే ఉదయిస్తారంటారు .ఓరి మగడా ! మాఊర్లో కూడా తూర్పునే ఉదయిస్తాడయ్యా అంటే చత్..... అలా జరగదు మేము చెప్పినదే ..ప్రాగ్దిగ్భాగానమాత్రమే ఉదయిస్తాడు . నువ్వు నేర్చుకున్నది తప్పు అంటారు.

ఇలాంటి ఆథ్యాత్మిక సంస్థలు ,వాదనలు సిద్ధాంతాలు రోజు కొకటి పుట్టుకొస్తూ అసలు పెద్దలు చెప్పిన దివ్యపథాన్ని తెలియకుండా గందరగోళాలు సృష్టిస్తూ ఆథ్యాత్మిక మార్గం లో అడుగుపెట్టాలనుకునే వారిని చికాకు పరచి ,ఈమార్గమే సత్యం కాదన్న అపోహను కలిగిస్తున్నారు. తాతగారు బ్రహ్మం గారు నాడు చెప్పారు "ఉల్లిగడ్డకు కూడ ఉపదేశమిచ్చేటి కల్లగురువులు భువిని పుట్టేరయా " అని . అంతకుమునుపు భవిష్య.భాగవత పురాణాదులలో కలిలో ఆథ్యాత్మిక మోసాల లెలా ఉంటాయో భగవాన్ వ్యాసదేవులు వర్ణించి వున్నారు.

కలి పురుషుడు మహా మాయావి. తగవులంటే అత్యంత ప్రీతి . భగవన్మార్గాన పయనించే వారిని పలు రకాలుగా వంచించి పతనం గావించటం అతని లక్షణం . ఇవి కూడా భగవన్మార్గాలే అనేలాగనో లేక ఇవి మాత్రమే భగవన్మార్గములు అని వాదులాటకు తిరిగేలా వాటిని సృష్టిం చి నమ్మించి ఆమార్గాన గొర్రెల మందలా జనం నడిచేలా చేయగలడు.
మనిషి ఆలోచనాఅస్థితిని కోల్పోయి అత్యంత మమకారానికి లోనై తన లోపల దాగివున్న బలహీనతలను వ్యక్తపరచుకునే అవకాశం .అవి తప్పుకాద అనే సమర్ధన ఇచ్చే మార్గాలు నిజమని నమ్మి తాను పతనా వస్థకు చేరుతాడు. అంతటితో ఆగడు .తా చెడ్ద కోతి వన మెల్లా చెరిచిందని ఇతరులను కూడా ఈ మార్గం లోకి లాగటానికి తీవ్రంగా శ్రమిస్తాడు. తనతో భావసారూప్యత గల గుంపులను పెంచటమే ఆథ్యాత్మిక ప్రచారమని భగవంతునికిష్టమైన పనని మురిసి పోతుంటాడు .
మానవ జాతిని ముక్తి మార్గం వైపునడిపిన పూర్వులచే ఆచరించబడి ,సూచించబడిన మార్గాలు అన్నీ వ్యర్ధమనే అహంకారపూరిత వాదనలను చేస్తూ , అణువణువునా అహంకారాగ్నిని ప్రజ్వరిల్లజేసుకుంటూ చివరకు దానికే దగ్దమవుతాడు. దీనికీ కారణమున్నది .

ఉన్నది ఒకేసత్యం . కలిమాయనుంచి జీవులను రక్షించాలనే తపనతో మహాత్ములు, ఋషులు ,ముక్త జీవులు,దయార్థహృదయం తో ప్రయత్నాలు సాగిస్తారు . ఈమార్గాలకు ఆకర్షింపబడాలని జీవుల కొరకు స్థాయీ బేధాలననుసరించి వలసిన రకరకాల సిద్ధాంతాలను ప్రవేశ పెడతారు . నేరుగా వారినుంచి ఈ జ్ఞానాన్ని అందుకున్న మొదటి తరం శిష్యులకు సత్యం పట్ల తమ సద్గురువులు ఎటువంటి బేధం చూపించలేదనే గమనిక ఉంటుంది . తరువాత తరువాత వచ్చే వారి పైన కలి తన మాయా జాలాన్ని కప్పుతాడు . వారికి మాత్రం ఇక ఇదే సృష్టికి ప్రారంభం ,అంతం అనే పైత్యం బాగా ఎక్కుతుంది . ఎందుకంటే గుంపులచేర్చుకుని వారిచేత పొగిడింపజేసుకోవాలనే దుగ్ద ఎక్కువై .
ఈ సాధక మహానుభావులు తాము అనుసరించే మార్గం చెప్పినదాని లోతులకెళ్లరు . ఆమార్గం లో తీవ్రసాధన చేసి దాని అంత్యమైన లక్ష్యాన్ని చేరుకోవాలనే ఆసక్తి కలిగి యుండరు . అసలు వీళ్లకు నేర్చుకుందామనే ఆసక్తికంటే , నేర్పుదామన్న కుతి ఎక్కువ. అందుకనే వీళ్ళు మిగతా మార్గాలలో ఏమి చెప్పారనే విషయాన్ని పరిశీలించరు ,దానిని తాము నేర్చుకున్నదానితో సమన్వయమ్ చేసుకోరు . తాము విన్న నాలుగు ముక్కలను ఇతరులముందు భాషావిన్యాసాలతో ప్రదర్శించి గొప్పవారిలా ఆనంద పడిపోతుంటారు . తేనెటీగలా మనిషి పలువురు మహాత్ములపాదపద్మాలవద్దకు చేరి మకరందాన్ని గ్రహించాలి, అని సూచించిన పెద్దల మాట వినరు. అలాచేస్తే ఎల్ల ఎడలనిండి వున్న సత్యం అనుభవగోచరమవుతుంది . వాదబేధాలు నశించి వాస్తవ మైన భగవత్ పథాన పయనిస్తారు.

కొన్ని చిత్రాతి చిత్రమైన వాదనలకు సమయాన్ని ఇచ్చి వృధా చేసుకోలేక ఇక్కడ వ్రాస్తున్నాను.
ఇప్పుడు కొత్తగా ప్రాచుర్యం పొందుతున్న కొన్ని మతశాఖల అనయూయులు చేస్తున్న వాదనలువింటే మనకు వున్న మతి కూడ పోతుంది . కొత్త కాలానికి కొత్త జ్ఞానమట. జ్ఞానమనేది కొత్తా ,పాత అనేదిగా వుంటుందని పెద్దలు చెప్పగా నేనువినలేదు . తాము అనుసరించిన మార్గం లో పయనిస్తే మాత్రమే లోకం లో శ్రేష్టులుగా దివ్యత్వం కలిగినవారిగా మారతారట. జ్ఞానం లేనందునే మిగతావారు ఇంకా తమ స్థాయికి చేరు కోలేదట. పూర్వం మనం విన్న పురాణాదులు ,దైవగ్రంథాలు అన్నీ పుక్కిట పురాణాలట. వాడు వీడూ అని కూడా వాదనలో చరిత్రలో చెప్పిన మహాత్ముల గూర్చి మాట్లాడగల కుసంస్కారులు వీరు . మరి మన పూర్వ ఋషులు ,ఆధునిక కాలం లో రామకృష్ణులు,శ్రీ రమణులు ,అరవిందులు,షిరిడి సాి ,అక్కోల్ కోట్ స్వామి , తాజుద్దీన్బాబా , వంటి మహనీయులంతా వీరి మార్గాన్ని అనుసరించలేదు కాబట్టి తరించలేదని అర్ధమా? వీరిమార్గం వారు పుట్టేప్పటికి లేదుకదా ? మరెలా పాపం .

వీళ్లగూర్చి మరో చిత్రమైన విషయం నేను పరిశీలించినది చెబుతాను . వీళ్ళుమనమార్గం లో అంటే ఇప్పటిదాకా ఈ నేలమీద పెద్దలు సూచించిన దివ్య మార్గం లో వున్నంత కాలం ఏ నాడూ మన దివ్య గ్రంథాలను పరిశీలనాత్మకంగా చదివింది లేదు . ఆయా మార్గాల సు ముక్తులైన మహానుభావుల చరిత్రలు తెలుసుకున్నది లేదు . అవన్నీ మాకు తెలియదు , మేమనుసరించే మార్గం లో మాత్రమే మానవులు దివ్యులుగామారుతారు ,దేవీ దేవతలై ోతారనే వితండవాదం మాత్రం చేయగలరు . ఏసీ రూముల్లో ,ఫాన్ గాలి సుఖం లో గురువు కెదురుగా ఉన్నత స్థానాలలో కూర్చుని సాగించిన వీరి సాధన ఎంతమందిని దేవీ దేవతలుగా మార్చిందో మనకు తెలియదు. మాకు మనశ్శాంతిగా ఉంది . హాయిగా సాగుతుంది అనేమాటలు ప్రమాణం కాదు . దివ్యులుగా మారిన వ్యక్తులు తమకోసం కాదు సృష్టి కళ్యాణం కోసం జీవిస్తారు . అలా ఎంతమంది తయారవగలిగితే ఆ కల్ట్ అంత గొప్పది . ఈరోజు హిందుత్వం లో వున్న కూలి చేసుకునే వాడుకూడా సాటిజీవికోసం తనకున్నది పంచుతున్నాడంటే ఆ సంస్కారాలను ఇచ్చిన ఈ ఆథ్యాత్మిక మార్గం ఎంత దివ్యమైనదో ఆలోచించాలి .

కొత్త పథాన నడవటం తప్పుకాదు .నీ సంస్కారాన్ననుసరించి నీకు ఆమార్గము ,ఆగురుపరంపర చేరువయ్యాయి . నిజాయితీగా సాగి భగవంతుని చేరుకో . అంతేగాని ఇతరుల మార్గాలన్నీ తప్పు అనే మూర్ఖవాదనలు చేస్తే పతితులమై నరకాన పడతాము . అప్పుడు మానవునికంటె శ్రధ్ధాశక్తులతో ధ్యానించి భగవంతుని చేరిన జంతువులకంటె హీనమై పోతుంది మన జన్మ .నేనేదో గొప్ప సాధకుడనై ఇది వ్రాయటం లేదు . పెద్దల ద్వారా విన్న ఈ పాఠాన్ని బట్టీ పెట్టి మీకప్పగిస్తున్నానంతే.

సర్వే జనా సుఖినోభవంతు .
[ఈ వ్యాసంలో ఏదైన లోకానికి మేలు చేసే విషయాలన్నీ సద్గురు పరంపరవి. లోకానికి ,ఇతర్లకు బాధ కలిగించేవి వుంటే అవి ఖచ్చితంగా నా అజ్ఞానం నుంచి జనించినవి గా మన్నించి క్షమించగలరు ]



Read more...

పరమేశ్వరానుగ్రహంగా పంచాక్షరీ జపయాగం పూర్ణాహుతి

>> Sunday, November 15, 2009


మహాదేవునికి ప్రీతిపాత్రమైన పంచాక్షరి జపమును జపింపజేస్తూ కార్తీక మాసం ప్రారంభం లో మొదలుపెట్టిన పంచాక్షరీ జప యాగం ఈరోజు ముగిసినది . స్వామికి ఉదయాన్నుంచి రుద్రసూక్త ప్రకారంగా అభిషేకాదులు అర్చనలు జరిగాయి. భక్తులు ఓం నమః శివాయ అని జపిస్తుండగా గోత్రనామాలు పంపిన భక్తులందరి తరపునా ఆహుతులిస్తూ పూర్ణాహుతి ని నిర్వహించటం జరిగినది. మీసాల మురళి [అమెరికా] తన సోదరుని పంపి ఈసందర్భంగా అన్నదానం నిరవహించారు . అలాగే సునీల్ వైద్యభూషణ్ జ్యోతిర్లింగార్చన నిర్వహనకు అన్నదానమునకు సహకరించారు . స్వామి అనుగ్రహం నిన్న జరిగిన జ్యోతిర్లింగార్చనలోను ,ఈరోజు యాగానంతరం కురిసిన వర్షం తో ప్రత్యక్షంగా అనుభవమయినది భక్తులకు . పరమేశ్వరుని కృపా కటాక్షం తో మీ అందరకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు చేకూరాలని స్వామిని వేడుకుంటున్నాము .






Read more...

శనిప్రదోష పూజకు సంతసించిన స్వామి

>> Saturday, November 14, 2009




జ్యోతిర్లింగం లోని దీపాలనుండి మూలవిరాట్ వైపుకు సాగుతున్న కాంతి కిరణాలు .





పరమశివునికి ప్రీతి పాత్రమైన కార్తీక మాసములో వచ్చిన రెండవ శని త్రయోదశి అగు ఈ రోజున పీఠములో రామలింగేశ్వర స్వామి వారికి శనిప్రదోష పూజ భక్తి శ్రద్దలతో జరపబడినది. సాయంత్రం రుద్రాభిషేకము ,అర్చన అనంతరం జ్యోతిర్లింగార్చన జరిగినది. చిన్న జగన్నాథ మిశ్రో -కృష్ణవేణి దమ్పతులతరపున వారి కుమారులు సునీల్ వైద్యభూషణ జరిపించిన ఈ కార్యక్రమములో స్వామి జ్యోతిస్వరూపుడై దర్శన మిచ్చారు . స్వామి వారి జ్యోతిర్లింగాన్ని ఫోటో తీయగా జ్యోతులనుండి కాంతులు మూలవిరాట్ వైపుకు పయనిస్తూ స్వామి తాను సంప్రీతుడనయ్యానని నిదర్శనం చూపించారు.
రేపు ఉదయం జరగబోయే పూర్ణాహుతి కార్యక్రమానికి భక్తులు శ్రధ్ధా శక్తులతో ్ సిద్ధముతున్నారు . ఈరోజు ఉదయాన్నే శనీశ్వరునకు తైలాభిషేకం అర్చన గోత్రనామాలు పంపిన వారి తరపున నిర్వహించటం జరిగినది .


Read more...

శనిత్రయోదశి సందర్భంగా శనిప్రదోషపూజ,జ్యోతిర్లింగార్చనలకు గోత్రనామాలు పంపండి

>> Friday, November 13, 2009



శనిత్రయోదశి విశేషమైన రోజు .అదీ కార్తీకం లాంటి విశేషమైన మాసం లో రావటం మరింత శుభకరం . ఈ కార్తీకం లో రెండు త్రయోదశులు శనివారమే రావటం ఇంకా విశిష్టమైన సంగతి . అలాగే పౌర్ణమి అమావాస్య తిథులు సోమవారం రావటం ఈసంవత్సరం ప్రత్యేకత . రేపు శనివారం త్రయోదశి కనుక పీఠం లో నవగ్రహ శాంతి పూజలు ,శనీశ్వరునకు తైలాభిషేకం అర్చనలు జరుగుతాయి . శనీశ్వరునకు ప్రీతి కలిగించి , దుష్ప్రభావాలను తొలగించి శుభాలను కలిగించే పూజ ఇది . జనకళ్యాణం కొరకై శ్రీ పీఠం ఇక్కడ గోత్రనామాలు పంపిన వారి కొరకు శనీశ్వరునకు అభిషేకాలు అర్చనలు జరుపుతుంది.

ఇక ఇప్పుడు " కోటి పంచాక్షరీ జపయాగము" జరుగుతున్నందున హోమాదులు కూడా జరుపబడుతున్నాయి.ఆదివారం పూర్ణాహుతి జరుగుతుంది . అలాగే శనివారం సాయంత్రం శనిప్రదోషపూజ జరుగుతుంది . రుద్రాభిషేకములు ,జ్యోతిర్లింగార్చన జరుపబడుతుంది . జ్యోతిర్లింగార్చనలో తమ తరపున జ్యోతులు వెలించాలని కోరుకునేవారు కోరి ఆ ఖర్చును తామే భరిస్తే వారి తరపున శివలింగాకారం లో జ్యోతులు వెలిగించి పూజ జరపటం చేస్తారు. పూర్ణాహుతి రోజున జరిగే అన్నదానం లోను తాము పాలుపంచుకోవచ్చు. అలాగే ఆదివారం పూర్ణాహుతి అనంతరం యజ్ఞ శేషం గా మిగిలిన భస్మ ప్రసాదం ,రక్షలు పోస్ట్ ద్వారా,లేక కొరియర్ ద్వారా పంపాలని కోరుకునేవారు .ఆఖర్చును తామే భరించాలి . ఏదైనా దైవ కార్యక్రమం లో తాముకూడా పాల్పంచుకున్న ఫలితం భక్తులకు కలగాలనే ఉద్దేశ్యం తో మాత్రమే ఈ సూచన చేయటం జరుగుతున్నది . మామూలుగా గోత్రనామాలను పంపిన వారందరి తరపున నిత్యం సంకల్పం చెప్పబడుతున్నది .

******************** సర్వే జనా సుఖినో భంతు *****************************


Read more...

పూర్ణాహుతి కి రండి ..పరమశివుని కరుణ పొందగా ...

>> Wednesday, November 11, 2009


పంచాక్షరీ జపాన్ని కోటిసార్లు జపించి ఈ మహా జపయాగము పూర్తయిన సందర్భంగా ఈనెల పదిహేను ఆదివారం రోజున పూర్ణాహుతి యాగము జరుప బడుతున్నది . ఈ కార్యక్రమములో ఇప్పటికే తమ గోత్రనామాలను పంపి జపం చేస్తున్నవారు ఇప్పటివరకు తమ జపం ఎంత జరిగినదో శనివారమునకల్లా తెలియజేయగలరు . అలాగే ఇంకా పాల్గొనలేకపోయినవారెవరైనా ఇప్పుడు జపం చేయదలచుకున్నా తమ గోత్రనామాలు పంపి తమ శక్త్యానుసారం జపం చేయవచ్చు . ఈ కార్యక్రమ పూర్ణాహుతి యాగాన్ని నిర్వహించేందుకు హైదరాబాద్ నుంచి ఆర్యసమాజానికి చెందిన ఋత్విక్కులు ఇక్కడకు చేరుకుంటున్నారు.
జనక్షేమం కోసమ్ ఉద్దేశించి నిర్వహించబడుతున్న ఈ యాగం లో జపం చేయటం ,యాగానికి సహాయమందించటం కూడా యజ్ఞఫలితాన్ని అందజేస్తుంది . పరమశివునకు ప్రీతి పాత్రమైన కార్తీక మాసాన ఆయన కిష్టమైన మాసశివరాత్రి రోజున జరుగుతున్న ఈ యాగము తో భక్తులందరకూ ఆమహాదేవుని కృపాకటాక్షం కలుగుతుంది .

యాగానికి రాదలచుకున్న భక్తులందరికీ మా హృదయపూర్వక ఆహ్వానం . ఈ యాగానంతరము ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించే ఆమృత్యుంజయుని మహా ప్రసాదము , యజ్ఞశేషముగా మిగిలిన విభూధి ,స్వామి వారి రక్షలు కావాలనుకునేవారు అవి పంపటానికి అవసరమైన , పోస్టల్,కొరియర్ చార్జీలను పంపితే వారికి అలా పంపగలము .
సర్వలోక శుభంకరుడగు పరమేశుని కరుణ మీపై ప్రసరించాలని వేడుకుంటున్నాము .



Read more...

మూడు కన్నుల హనుమంతుని మున్నెన్నడైనా చూసారా

>> Wednesday, November 4, 2009





హనుమంతుడు ... ఈ పేరు వినగానే మనకు వానర రూపంలో ఉండే ఆంజనేయస్వామి గుర్తుకు వస్తాడు. అంతే కాదు భక్తికి మారుపేరుగా, బ్రహ్మచర్యానికి ప్రతీకగా కూడా ఆంజనేయుడు కీర్తికెక్కాడు. హనుమంతుడు సాధారణంగా చేతిలో సంజీవని పర్వతంతోనో, లేదా రాముని పాదాల వద్దో మనకు కనిపిస్తాడు. అయితే పదిభుజాలు, మూడు కళ్లు కలిగిన ఆంజనేయుడిని తెలుసుకున్నారా ?

అయితే ఆ రూపాన్ని చూసేందుకు తమిళనాడు రాష్ట్రం, నాగపట్నం జిల్లాలోని ఆనందమంగళం పట్టణంలో ఉన్న త్రినేత్ర దశభుజ వీరాంజనేయ ఆలయానికి వెళ్లాల్సిందే. ఈ ఆలయంలో పది భుజాలు, నుదురుపై మూడో కన్ను కలిగిన ఆంజనేయుడు భక్తుల పూజలందుకుంటున్నాడు. త్రేతాయుగంలో విష్ణుమూర్తి రామావతారమెత్తి రావణుడిని సంహరించిన పిమ్మట నారదుడు ఆయనను కలుసుకున్నాడు.

"స్వామి లంక నాశనముతో మీ యుద్ధము పూర్తికాలేదు. రావణుని వారసులు ఉన్నారు. తండ్రి మృతిపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారు తప్పకుండా మీపై యుద్ధానికి వస్తారు. వారు ప్రస్తుతం సముద్ర అడుగు భాగంలో తపస్సు చేస్తున్నారు. వారి తపస్సు పూర్తి కాకముందే మీరు వారిని సంహరించాల"ని వేడుకున్నాడు.

అప్పుడు రాముడు "నారదా ! రామావతారంలో నా కర్తవ్యం పూర్తయినది. మరికొన్ని రోజుల్లో ఈ అవతారాన్ని చాలించనున్నాను. ఇందుకు ఇంకెవరినైనా ఎంపిక చేయుమ"ని అన్నాడు. , రాక్షస వధకు హనుమంతుడిని పంపించాలని అందరూ నిర్ణయించారు.

యుద్ధంలో సహాయంగా ఉండేందుకు విష్ణు మూర్తి తన శంఖు, చక్రాలను హనుమంతుడికి ప్రసాదించారు. బ్రహ్మదేవుడు తన కమండలాన్ని, పరమ శివుడు తన మూడో కంటిని ఆంజనేయుడికి ఇచ్చారు .. ఇలా వివిధ దేవతల నుంచి పది ఆయుధాలు పొందిన అంజనీపుత్రుడు దశభుజుడయ్యాడు.విశిష్ఠంగా కైలాసనాధుని నుంచి మూడో కన్ను పొందడంతో ముక్కంటిగా మారాడు.

వానర శ్రేష్టుడు రాక్షస వధ పూర్తిచేసి విజయంతో తిరిగి వచ్చాడు. ఈ రూపంలో ఆయన రాక్షసులను అంతమొందించి అక్కడ వెలిసినందున ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించి భక్తులు పూజిస్తున్నారు. రాక్షస వధతో హనుమంతుడు ఆనందంగా ఉన్నందున ఆ ప్రాంతానికి ఆనందమంగళమ్ అనే పేరు స్థిరపడిందని భక్తులు చెబుతుంటారు.

Read more...

రక్తాక్షర చరిత్ర పల్నాటి యుద్ధం

>> Sunday, November 1, 2009



రక్తాక్షర చరిత్ర పల్నాటి యుద్ధం

(ఆన్‌లైన్‌, పిడుగురాళ్ల, కారంపూడి) పల్నాటి యుద్ధంలో ముఖ్య భూమిక పోషించిన బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ ఇరువురు ఇరు రాజ్యాల్లో మంత్రులే. బ్రహ్మనాయుడు మాచర్లను పాలించిన మలిదేవరాజు వద్ద, గురజాలను పాలించిన నలగాముని వద్ద నాగ మ్మ మంత్రులుగా పనిచేశారు. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి మహిళా మంత్రి నాగమ్మే కావటం గమనార్హం.

యుద్ధానికి దారి తీసిన పరిస్థితులు
బ్రహ్మనాయుడు వైష్ణవ సంభూతుడు. నాగమ్మ శివ భక్తురాలు. అనాదిగా శివ , వైష్ణవుల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. ఎవరి మత ప్రచారం వారు చేసుకున్నా ఆధిపత్య పోరు వెంటాడుతూనే ఉంది. బ్రహ్మనాయుడు కారంపూడి , మార్కాపురం, మాచర్లలో చెన్నకేశవ ఆలయాలను నిర్మించి తన విష్ణుభక్తిని చాటుకున్నాడు. నాగమ్మ శివ క్షేత్రాలను నిర్మించి తన శైలిని వెలిబుచ్చింది.

బ్రహ్మనాయుడు దళితులకు ఆశ్రయం కల్పించి దేవాలయాల ప్రవేశం గావించాడు. చాపకూటితో సహపంక్తి భోజనాలను ఏర్పాటుచేశాడు. మాల కన్నమదాసును దత్తత పొంది మాచర్ల రాజ్యానికి సర్వసైన్యాధ్యక్షుడిగా చేసి అశేష జన నీరాజనాలను అందుకున్నాడు. ఈ పరిస్థితిని నాగమ్మ సహించలేకపోయింది. అగ్రవర్ణాలలో అధిక భాగం నాగమ్మ చెంతన చేరటంతో కుట్రలకు, కుయుక్తులకు తెరలేచింది.

గెలిచినా 'కోడిపోరులో' ఓడిన బ్రహ్మన్న
కోడిపోరులో పాల్గొనేందుకని బ్రహ్మనాయుడు మాచర్ల నుండి తన ప్రముఖులతో కలిసి కోడేరుగుట్టల వద్దకు ( ప్రస్తుతం ఈ ప్రాంతం రెంటచింతల మండలంలోని పాల్వాయి వద్ద ఉన్నది) చేరుకుంటాడు. పోరులో పాల్గొనటానికి చిట్టెమల్లు అనబడే కోడిని తీసుకొని బ్రహ్మనాయుడు అక్కడకు వస్తారు. ఆ ప్రదేశానికి చేరుకోగానే బ్రహ్మనాయుడు చేతుల్లోని చిట్టెమల్లు పెద్దగా కూత కూయటంతో ఆ కూత శబ్దానికి దరిదాపుల్లోని కోళ్లన్నీ చనిపోయినట్లుగా చరిత్ర చెబుతుంది. నాగమ్మ కూడా సివంగిడేగ అను పేరుగల కోడిని తెప్పించి పందానికి సిద్ధమయ్యింది.

ఒకవేళ ఏదన్నా అద్భుతం జరిగి తను ఓడిపోయిన పక్షంలో బ్రహ్మనాయుడిని, అతనితో వచ్చిన వారిని అంతమొందించేందుకు కూడా నాగమ్మ కుట్ర పన్నినట్లుగా చెబుతారు. కోడిపోరు జరిగే ప్రదేశంలో ఒక తమకము తవ్వించి అందులో బల్లాలు, శూలాలు, విచ్చు కత్తులు ఉంచి పైన పందిరి ఏర్పాటుచేసి దానిపై వేదిక అమర్చినట్లుగా చెబుతారు. ఆ వేదికపై బ్రహ్మనాయుడిని, అతనితోపాటు వచ్చిన ప్రముఖులను కూర్చుండబెట్టి హతమార్చవచ్చునన్న ఆలోచనతో నాగమ్మ వ్యూహరచన చేశారు. కోడిపోరు ఆరంభం కాగా మొదటి రెండు పందాల్లోనూ బ్రహ్మనాయుడు తీసుకువచ్చిన చిట్టెమల్లు గెలవటంతో బ్రహ్మనాయుడు వర్గం ఆనందంతో ఈలలు, కేకలతో ఉత్సాహభరితంగా ఉంటుంది.

ఈ పరిణామంతో గురజాల రాజ్యానికి చెందిన వారి ముఖాన నెత్తుటి చుక్క ఉండదు. అయినప్పటికీ నిరుత్సాహాన్ని ఏ మాత్రం తన కళ్లలో కనపడనీయకుండా జాగ్రత్తపడిన నాగమ్మ బ్రహ్మనాయుడు వద్దకు వచ్చి మూడవ పందెం పెట్టేందుకు సిద్ధపడమని ప్రోత్సహిస్తుంది. మూడవ పందెంలో ఓడిన వారు రాజ్యాన్ని వదలి ఏడేళ్ల పాటు వనవాసం చేయాలని షరతు విధిస్తుంది.

అయితే అప్పటికే విజయోత్సాహంలో ఉన్న బ్రహ్మన్న చిట్టెమల్లుపై ఉన్న విశ్వాసంతో పందానికి సరేనని ఒప్పుకుంటాడు. అయితే అప్పటికే చిట్టెమల్లును కట్టడి చేసేందుకు మంత్రతంత్రగాడైన కట్టుపోతుల వాడిని రంగంలోకి దింపిన నాగమ్మ బ్రహ్మనాయుడు దృష్టి మరల్చేందుకు కుంకుడుకాయ రసాన్ని చీరపై పోసుకొని బహిష్టయినట్లుగా నాటకమాడుతుంది. విష్ణుసంభూతుడైన బ్రహ్మనాయుడు బహిష్టయిన ఆడవారి ముఖాన్ని చూడకూడదన్న నియమం ఉన్నందున దృష్టిని పక్కకు మరల్చుతాడు. దాంతో చిట్టెమల్లుపై కట్టుపోతుల వారు మంత్రాక్షతలు ప్రయోగించటంతో నాగమ్మ సివంగిడేగ విజయం సాధిస్తుంది.

రాజ్యం అప్పగించని నాగమ్మ
కోడిపోరులో ఓడిపోయిన బ్రహ్మనాయుడు, మలిదేవులతో కలిసి ఏడేళ్లు అరణ్యవాసంకు వెళతారు. నాగమ్మ మాచర్ల రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటుంది. నిర్ధేశిత ఏడు సంవత్సరాలు అరణ్యవాసం పూర్తయిన పిమ్మట తన రాజ్యం తనకిమ్మని బ్రహ్మనాయుడు చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చి దూతగా వచ్చిన నలగాముని అల్లుడైన అలరాజును చర్లగుడిపాడు వద్ద రహస్యంగా చంపిస్తుంది నాగమ్మ. ధర్మబద్దంగా తమకు రావలసిన రాజ్యభాగం కోసం పోరాడవలసిన సమయం ఆసన్నమైనదని బ్రహ్మన్నవర్గం తలచింది. పల్నాటి యుద్ధం అనివార్యమైంది.

కారంపూడే కదనరంగం
దాయాదుల రాజ్యభాగం తిరిగి ఇవ్వటానికి నలగాముడు తిరస్కరించటంతో పల్నాటి యుద్ధానికి ఇరువర్గాలు సన్నద్ధమయ్యాయి. పలనాటి రణక్షేత్రంగా సుప్రసిద్ధమైన కారంపూడిని ఎంచుకున్నారు. బ్రహ్మనాయుడు సేనలను మాచర్ల వరకు రానివ్వకుండా ముందుగానే అడ్డుకునేందుకు కారంపూడి పాలిస్తున్న తన సామంతరాజును నాగమ్మ ఎంచుకుంది. కారంపూడిలోనే బ్రహ్మనాయుడిని అంతమొందిస్తానని నాగమ్మ వద్ద ఆ సామంతరాజు మంతనాలు జరిపాడు. పల్నాడు నైసర్గిక స్వరూపాన్ని పరిశీలిస్తే నాగరికల్లు నుంచి ఈశాన్యాన ధరణికోట, దక్షిణాన నాయకురాలు కనుమ, పశ్చిమోత్తరాలుగా ప్రవహిస్తున్న కృష్ణానది , నాగార్జున కొండ లోయలోని విజయపురి వరకు వ్యాపించి ఉంది.

మేడపి నుంచి వచ్చే బ్రహ్మన్న సైన్యాన్ని, గురజాల నుంచి వచ్చే నాగమ్మ సైన్యానికి మధ్యలో కారంపూడి రణక్షేత్రంగా నిర్మించటం ఉభయులకు ఆమోదయోగ్యమని యుద్ధ పరిశీలకులు వెలిబుచ్చారు. అత్యంత పవిత్రమైన మహిమాన్విత గంగధార మడుగు ( కాశీలోని మణికర్ణికానదితో సమానమైనది ) ఒడ్డును యుద్ధభూమిగా నిర్ణయం కావటం, తను నిర్మించిన చెన్నకేశవ ఆలయం, తన విజయాన్ని కాంక్షించే అంకాళమ్మ తల్లి కారంపూడిలో కొలువై ఉండటం బ్రహ్మనాయుడుకి అనుకూలించే అంశాలు కావటంతో యుద్ధభూమి కారంపూడి ఎన్నుకోవటానికి ముందుగా సుముఖత వ్యక్తంచేశారు.

నాయకురాలు నాగమ్మ పరంగా చూస్తే ఆనాడు కార్యమపూడి పరిసర పరగణాలన్నీ గురజాల నలగామరాజు అధీనంలోనే ఉన్నాయి. చుట్టుపక్కల ఉన్న మండలాధీశులు, సామంతరాజులందరూ అనుకూలంగా ఉండటం నాగమ్మ కారంపూడి వైపే మొగ్గుచూపింది. ప్రత్యేకంగా కారంపూడిని పాలిస్తున్న సామంతరాజు తనకు అత్యంత అనుకూలుడైన ఆప్తుడు కావటంతో నాగమ్మ అంగీకారానికి కలిసొచ్చే అంశమైంది. ఈవిధంగా ఇరువర్గాలు తమ అనుకూల వాతావరణంలోనే కారంపూడిని రణక్షేత్రంగా నిర్ణయించుకొని పలనాటి యుద్ధానికి నాగులేటి ఒడ్డునే శ్రీకారం చుట్టారు. దీంతో చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిన కథనసీమ కారంపూడి వాసికెక్కింది.

బ్రహ్మనాయుడు ఆశయం నెరవేరిందా ?
పల్నాటిలో సర్వమత సమానత్వం తేవాలనే బ్రహ్మనాయుడి ఆశయం పూర్తిస్థాయిలో నెరవేరక ముందే యుద్ధం ముగిసింది. యుద్ధంలో చనిపోయిన 66మంది వీర నాయకులకు లింగ ప్రతిష్టచేసి వీరారాధన ఉత్సవాలు జరిపించాలని పిడుగు వంశం వారిని వంశ పారంపార్యంగా ఏర్పరచి జరిగిన నెత్తుటి నేలను చూసి చలించి గుత్తికొండ బిలానికి తపస్సుకై వెళతాడు. వైష్ణవ సంభూతుడుగా పేరొందిన బ్రహ్మనాయుడుకు మరణం లేనందున ఇప్పటికీ గుత్తికొండ బిలం లోపలి గుహల్లో సజీవుడుగా ఉన్నాడని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు.

అత్యంత రాజ్యకాంక్షతో పల్నాటి యుద్ధానికి రంగంలోకి దిగిన నాగమ్మ యుద్ధానంతరం మనసు మార్చుకొని చేసిన తప్పిదం గుర్తించి ఆధ్యాత్మికంగా దిట్టగామాలపాడులోని శైవ క్షేత్రంలోకి పయనించింది. ఇలా జరిగిన పల్నాటి యుద్ధంలో మృతిచెందిన వీరుల ఆత్మలు కార్తీక అమావాస్యనుండి ఐదురోజుల పాటు కారంపూడిలోని మరుభూమిలో అదృశ్యంగా విలపిస్తుంటాయని చరిత్ర తెలుపుతుంది.

అందుకే బ్రహ్మనాయుడు కోరిక మేరకు కార్తీక అమావాస్య నుంచి ఐదురోజుల పాటు రాచగావు, రాయభారం, మందపోరు, కోడిపోరు, కల్లిపాడు పేరుతో వీరారాధన ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం వీరాచారం పాటిస్తున్న 12 జిల్లాల వీరాచారవంతులు ఆనాటి కొణతములను ( ఆయుధాలను) నిధి మీదకు తీసుకువచ్చి పూజలు అందుకుంటారు. ప్రస్తుతం పిడుగువంశ వారసుడు తరుణ్‌ చెన్నకేశవ అయ్యవార్‌ పీఠాధిపతిగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వంశ పారంపర్యంగా వస్తున్న ఈ ఆధిపత్యం చిన్న వయసులోనే అందిపుచ్చుకోవటంతో నిర్వహణను విజయకుమార్‌ అయ్యవార్‌ పర్యవేక్షిస్తూ నిరాటంకంగా ఇప్పటికీ నిర్వహిస్తుండటం గమనార్హం.

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP