శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శనిత్రయోదశి పూజా నివేదన

>> Saturday, October 31, 2009



కార్తీక మాసాన వచ్చిన ఈ శనిత్రయోదశి రోజున పీఠము లోని నవగ్రహ మండపములో శనిదేవునికి ప్రత్యేకంగా ఆరాధనాధికములు జరుపబడ్డాయి. గోత్రనామాలు పంపిన భక్తులందరి తరపున వారి వారి జాతకప్రభావములలో వున్న శని వక్రదృష్టి తొలగి శుబ్భాలు ప్రాప్తింప జేయాలని అర్చనలు నిర్వహించటం జరిగినది . ఉదయాన్నే తైలాభిషేకము ,అలంకారము అర్చన ,తదనంతరము హారతులు సమర్పించబడ్డాయి . గోత్రనామాలు పంపిన భక్తజనుల కు సకల శుభాలు కలిగేలా అనుగ్రహించమని వారిని [శనీశ్వరులవారిని] ప్రార్ధించటం జరిగినది.

***************** లోకాస్సమస్తా సుఖినోభవంతు**********************************



Read more...

31 న జరగనున్న శనిత్రయోదశికి జరిగే శాంతిపూజలకు గోత్రనామాలు పంపి పాల్గొనండి

>> Tuesday, October 27, 2009



శనిత్రయోదశి పర్వదినము ఈనెల 31 న వస్తున్నది. ఈరోజు శనిగ్రహ ప్రతికూల ప్రభావాలతో ఇబ్బంది పడేవారు ,శనీశ్వరునకు ప్రత్యేక పూజలు జరుపుతారు. నువ్వుల నూనెతో అభిషేకం జరపటం ,అర్చనలు చేయటం ద్వారా శనీశ్వరుని అనుగ్రహాన్ని పొంది .ఆయన అనుగ్రహంతో బాధలనుండి ,దోషాలనుండి విముక్తులవుతారు. ఈ పర్వదినాలలో శ్రీ పీఠం భక్తులకొరకు వారిగోత్రనామాలతో నవగ్రహమండపం లో నవగ్రహశాంతి పూజలు,ప్రత్యేకంగా శనీశ్వరునకు శాంతిపూజలు జరుపటం విదితమే .

ఇది కార్తీకమాసము .ఇంకా విశేషము ,అందులో కోటిపంచాక్షరీ జప యాగము కూడా జరుగుతున్నది .ఆరోజు పీఠములో ప్రతిష్టితులై వున్న రామలింగేశ్వర స్వామి వారికి రుద్రసూక్త ప్రకారం అభిషేకములు అర్చనలు జరుగుతాయి.
గోత్రనామాలతో పూజ జరిపించుకోదలచిన వారు మెయిల్ లేదా ఫోన్ ద్వారా తమ గోత్రనామాలను పంపవచ్చు.
ఆరోజు సూర్యోదయత్పూర్వమే లేచి తలారా స్నానం చేసి ,నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఇష్టదేవతారాధన చేయాలి. ఓమ్ నమ:శివాయ నే మతాన్ని పూజానంతరం జపించాలి. దగ్గరలో నవగ్రహదేవాలయం వుంటే వెళ్ళి ప్రదక్షిణలు చేయవచ్చు. అవకాశం లేనివారు ఈక్రింది శ్లోకంతో శనీశ్వరునిధ్యానించాలి.

{నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం } అని ధ్యానించాలి

తదనంతరం కాళ్ళూచేతులు శుభ్రపరచుకుని మరలా దేవతాదర్శనం చేయాలి . ఆరోజు నువ్వు;లనూనె ,ఉప్పు ,ఇనుము వంటి పదార్ధాలను ఎవరినుంచి స్వీకరించవద్దు. కుంటివారికి వికలాంగులకు భోజనం పెట్టండి . ఆరొజు ఎక్కువగా పంచాక్షరీ జపం చేయండి .

గోత్రనామాలను పంపవలసిన చిరునామా

durgeswara@gmail.com
cell 9948235641

Read more...


శనిత్రయోదశి పర్వదినము ఈనెల 31 న వస్తున్నది. ఈరోజు శనిగ్రహ ప్రతికూల ప్రభావాలతో ఇబ్బంది పడేవారు ,శనీశ్వరునకు ప్రత్యేక పూజలు జరుపుతారు. నువ్వుల నూనెతో అభిషేకం జరపటం ,అర్చనలు చేయటం ద్వారా శనీశ్వరుని అనుగ్రహాన్ని పొంది .ఆయన అనుగ్రహంతో బాధలనుండి ,దోషాలనుండి విముక్తులవుతారు. ఈ పర్వదినాలలో శ్రీ పీఠం భక్తులకొరకు వారిగోత్రనామాలతో నవగ్రహమండపం లో నవగ్రహశాంతి పూజలు,ప్రత్యేకంగా శనీశ్వరునకు శాంతిపూజలు జరుపటం విదితమే .

ఇది కార్తీకమాసము .ఇంకా విశేషము ,అందులో కోటిపంచాక్షరీ జప యాగము కూడా జరుగుతున్నది .ఆరోజు పీఠములో ప్రతిష్టితులై వున్న రామలింగేశ్వర స్వామి వారికి రుద్రసూక్త ప్రకారం అభిషేకములు అర్చనలు జరుగుతాయి.
గోత్రనామాలతో పూజ జరిపించుకోదలచిన వారు మెయిల్ లేదా ఫోన్ ద్వారా తమ గోత్రనామాలను పంపవచ్చు.
ఆరోజు సూర్యోదయత్పూర్వమే లేచి తలారా స్నానం చేసి ,నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఇష్టదేవతారాధన చేయాలి. ఓమ్ నమ:శివాయ నే మతాన్ని పూజానంతరం జపించాలి. దగ్గరలో నవగ్రహదేవాలయం వుంటే వెళ్ళి ప్రదక్షిణలు చేయవచ్చు. అవకాశం లేనివారు ఈక్రింది శ్లోకంతో శనీశ్వరునిధ్యానించాలి.

{నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం } అని ధ్యానించాలి

తదనంతరం కాళ్ళూచేతులు శుభ్రపరచుకుని మరలా దేవతాదర్శనం చేయాలి . ఆరోజు నువ్వు;లనూనె ,ఉప్పు ,ఇనుము వంటి పదార్ధాలను ఎవరినుంచి స్వీకరించవద్దు. కుంటివారికి వికలాంగులకు భోజనం పెట్టండి . ఆరొజు ఎక్కువగా పంచాక్షరీ జపం చేయండి .

గోత్రనామాలను పంపవలసిన చిరునామా

durgeswara@gmail.com
cell 9948235641

Read more...

మాతృ భాషనూ ధ్వంసం చేయాలనుకుంటున్న మూర్ఖులు

>> Monday, October 26, 2009




ఈవార్త చదవండి మీ రక్తం ఉడికి పోవటం లేదూ ?


మైదుకూరు, న్యూస్‌టుడే:
దేశభాషలందు తెలుగులెస్స.. అంటూ బయటకు చెప్పుకుంటూ లోలోన మాత్రం ఆంగ్ల
మాధ్యమం పేరుతో పిల్లల్ని మాతృభాష మమకారం నుంచి దూరం చేస్తున్నారు.
తెలుగును నిర్బంధిస్తూ 'ఐ నెవ్వర్ స్పీక్ ఇన్ తెలుగు (నేనెప్పుడూ తెలుగు
మాట్లాడను)'అంటూ మెడలో ఉపాధ్యాయులు బోర్డు తగిలించడం విస్మయానికి
గురిచేసింది. కడప జిల్లా, మైదుకూరులోని సెయింట్‌జోసెఫ్ ఆంగ్ల మాధ్యమం
పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీన్ని మీడియా సిబ్బంది ప్రశ్నిస్తే...
పాఠశాలలోనికి రావడానికి మీకెవరు అనుమతిచ్చారంటూ ఉపాధ్యాయులు
చిర్రుబుర్రులాడారు. దీంతో విలేకరులు తహశీల్దారు సుబ్బరాయుడు, మండల
విద్యాశాఖాధికారి సుకవనంకి సమాచారం అందించారు. తహశీల్దారు పాఠశాలకు
వస్తున్న విషయాన్ని గమనించిన ఉపాధ్యాయులు విద్యార్థుల మెడలోని బోర్డులను
తొలగించేశారు. ఈ మొత్తం తతంగంపై తహశీల్దారు విద్యార్థులను ప్రశ్నించి,
బాధిత విద్యార్థుల పేర్లను నమోదు చేసుకున్నారు. ఆంగ్ల మాధ్యమం అయినా
రెండో భాష కింద తెలుగు ఉంది కదా? దాన్ని కూడా నేర్పించాలి కదా? అని ఎంఈఓ
ప్రశ్నించారు. ఇలా విద్యార్థుల మెడలో బోర్డులు వేయడం తప్పని మందలించారు.

Read more...

పంచారామ క్షేత్రాల వివరాలు తెలుసుకోండి

మహాదేవుని దయ ఎంత అనంతమైనదో ఆయన భక్తులకోసం వెలసిన స్థానాలు కూడా అలా అనంతమైనవే. పరమ శివుడు వెలసిన పంచారామ క్షేత్రాల వివరాలను ఇక్కడ చూడండి .



http://telugu.webdunia.com/religion/religion/places/0908/18/1090818063_1.htm

Read more...

మహాదేవా నీనామం పలుకగ మా మార్గమేదో ఇలా చూపావా ?!! అల్లా హో..అక్బర్

>> Thursday, October 22, 2009

నిన్న బుధవారంఉదయం కోటి పంచాక్షరీ జపయాగం ప్రారంభించాము . సాయంత్రం పూజముగించుకుని రాగనే ఫోన్ మ్రోగింది .
ఫోన్ ఎత్తగనే " బాగున్నారా ! స్వామీ . ఎక్కడో విన్న గొంతు పలకరించింది .
ఎవరు ?

నేను స్వామీ ! మూసా కలీముల్లా ను ముసలమడుగునుంచి .......
మనసువెంటనే .బాధతో నిండింది .అయ్యో ఎంతకష్టమొచ్చినది . ఎలా వున్నారని అడిగాను.
ఊరంతా మునుగుపోయినది స్వామి .ఇల్లన్నీ కూలిపోయాయి . పట్టలతో గుడారాలు వేసుకుని కాలం గడుపుతున్నాము. సర్వం వరదకు కృష్ణార్పనం అయిపోయి మనుషులం మిగిలాము
అయ్యయ్యో ! తాతగారెలావున్నారు ? పలుమార్లు హజ్ యాత్ర కెల్లివచ్చిన ఆథ్యాత్మిక సాధకుడు పండుముసలి అయిన ఆవృద్దుని క్షేమం అడిగాను.
తాతగారితో మాట్లాడండి అని ఆఫోన్ ఆయనకిచ్చాడు .
తాతగారు ! ఈవయసులో ఎంతకష్ట మొచ్చినదండి ? ఓదార్చబోయాను
నా అమాయకత్వాన్ని అపహాస్యం చేస్తూ ఆ పండిపోయిన భగవద్భుక్తుని నోట నిర్లిప్తంగా ” భగవంతుని లీల స్వామీ ! ఎన్నిపాపాలు చేశామో ? ఇలా అంతా ఆయన లీల .అనే మాటలు విని ,. గీతలో పరమాత్మ చెప్పిన సుఖ దు:ఖాలను సమానంగా తీసుకోగలిగిన యోగిలక్షణాలు కనపడి మనసులోనే ఆ స్థితప్రజ్ఞునికి నమస్కరించుకున్నాను.

ఏమిటితండ్రీ ! నీలీల నిన్నటివరకు నిశ్చితంగా వున్నవారిని ఇలా దిక్కులేనివారిగా చేశావు ? మనసులోనే ప్రశ్నించుకున్నాను.
నాసంగతి సరే !ముందు నీ రుణం తీర్చుకుని ఏడువు . మనసుకు సంకేతం అందింది .
అవును . ఎవరివల్ల మనం కొద్దిగా సహాయం పొందినా ప్రత్యుపకారం చేసి రుణం తీర్చుకోవాలి . లేకుంటే అది జన్మ జన్మ లకూ బాకీగా మనలను వెంటాడుతుంది . నిరాకారస్వరూపం లో భక్తులచేత అల్లాహో అక్బర్ అని పొగిడించుకుంటూన్న పరమేశా ........పాహిపాహి వెంటనుండి ఇలా ఎప్పుడూ మెలకువకలిగించి కాపాడు తండ్రీ . అని వేడుకున్నాను .


....................................................................................................................................................................
ఈ సన్నివేశానికి మూలకారణమైన విషయాన్ని మీకు వివరిస్తాను.
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

గత సంవత్సరం జరిగిన తుంగభద్రపుష్కరాలకు సంగమేశ్వరం వెల్లాము .ఇక్కడ అంతర్జాలములో అనేకమంది భక్తుల తరపున కూడా తుంగభద్రకు పూజ దీపదానం చెసే కార్యక్రమం గురించి చెప్పగానే చాలామంది తమ తమ గోత్రనామాలను కూడా పంపారు గుర్తుందనుకుంటాను మీకు .

నేను మా అమ్మగారిని ,భార్యను పదిహేడుమంది పదవతరగతి విద్యార్ధులను , తీసుకుని సంగమేశ్వరం బయలుదేరగా రాత్రికి అక్కడకుెల్లటం ప్రమాదకమని వెళ్లరాదని పోలీసులు ఆపటం ,తో మాతోపాటు ప్రయాణిస్తున్న మరో బ్రాహ్మణులజంట ,ఇంకో కుటుంబముతో కలిసి ముసలమడుగు అనే వూరిలో దిగాము . ఆరాత్రివేళ ఆవూరివారైన ఈకుటుంబము పిల్లలకొరకు అప్పటికప్పుడు భోజనాలు ఏర్పాటు చేసి ఏంతగానో ఆదరించారు . ఆవివరాలన్నీ ఒకపోస్ట్లో వ్రాసి వున్నాను అప్పుడే.చూడండి ఇక్కడ
http://durgeswara.blogspot.com/2008/12/blog-post_20.html



మీకు ఇబ్బంది కలిగిస్తున్నామని మొహమాటపడగా ఆముసలాయన భగవత్ భక్తులు రావటం మా అదృష్టం ,దొరకమన్నా దొరుకుతారా అంటూ ఆయన చూపిన ఆదరణ మరువలేము . నిజమైన భారతీయవిలువలకు ప్రతీక ఇలంటివారే .ఆ సమయం లోనే మామధ్య నిరాకార స్వరూపుడైన శివున్ని అల్లా అనే నామంతో ముస్లిం భక్తులు ఎలా కొలుస్తున్నది , తరచిచూస్తే గాని భవిష్యపురాణం లో చెప్పబడిన ఈ రహస్యాలు అర్ధమవటం జరుగుతుందని చర్చ కూడా జరిగింది. అలానే కాలం విపరీత కష్టాలను తేబోతుందని .తాతగారు వీరబ్రహ్మేంద్ర స్వాములవారు చెప్పిన కాలజ్ఞానం లో సూచనల ఆధారంగా రాబోతున్న కష్టాలను గుర్తించి మానవులు భగవంతున్నాశ్రయించవలసివున్నదని ఇలా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకున్నాము . వారి అడ్రస్ వ్రాసుకున్న కాగితాన్ని పిల్లలు పోగొట్టటంతో వారితో ఫోన్ నంబర్ కూడా గుర్తులేదు. మొన్న వరదలు వచ్చినప్పుడు మేము సేకరించి పంపిన బియ్యాన్ని ఆత్మకూరు పంపమని గోకవరం కేంద్రంగా చేపట్టిన సహాయ చర్యలలో ముసలమడుగు ప్రాంతం లో పంపిణీ చేస్తామని విశ్వహిందు పరిషత్ కార్యకర్తలు చెప్పినప్పుడు ,స్వామీ నాసంకల్పం లేకుండానే ఈ సహాయం చేపిస్తున్నవా అనుకున్నాను . .ముస్లిం కుటుంబాలు ఎక్కువగా వున్న ఈగ్రామం లో వరదనీరు ముప్పైఅడుగులకు పైగా నిలచినదట . ఊరంతా దగ్గరలో వున్న కొండప్రాంతానికి చేరుకోవటం తో ప్రాణ నష్టం లేకున్నా ఇల్లన్నీ నేలమట్టమయ్యాయని చెప్పారు . అక్కడ సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్న కార్యకర్త వాసుదేవరెడ్డి గారిని ఈకుటుంబ వివరాలు తెలుపమని అడిగాను .కానీ గందరగోళంగా వున్న ఈపరిస్థితిలో సాధ్యంకాలేదు వారికి .

కానీ రుద్రహోమము మొదలుపెట్టగనే సాయంత్రానికి రుణమున్న వారి విషయం లో నిరాసక్తత తగదని హెచ్చరిస్తూరుణం తీర్చుకునే అవకాశం కల్పించి వీరినుంచి ఫోన్ చేపించిన పరమేశ్వరుని లీలకు ఆశ్చర్యపోయాను . నాకు చేతనైన సహాయం వెంటనే పంపాను .
భగవంతుడే గొప్పవాడు ...[ అల్లా హో అక్బర్ ]

ఏలీల ఎందుకు జరుగుతుందో అర్ధంకాని మాయామోహితులము ప్రభూ ! వీరికష్టాలను తొలగించమని కరుణా సాగరుడైన పరమశివుని వేడుదాము.

Read more...

కార్తికమాసం దీక్షనుబూని మాలవేసుకోండి ...మీరూ ,,మాలవేసుకోండి

>> Wednesday, October 21, 2009

మాలధారణం ....నియమాల తోరణం ... అంటూ భక్తజనులు నియమనిష్ఠలతో సాగించే దీక్షాధారణలు మొదలయ్యాయి.
మనిషిని మహోన్నతుని గామార్చగల ఆథ్యాత్మిక లోకాలకు ప్రయాణం లో ఇదొక అద్భుతమార్గం . ప్రకృతి లో జరిగే మార్పులకు అనుకూలంగా మన శరీర తత్వాన్ని సిద్దపరచగల నియమాలతో ను , అజ్ఞానపు చీకటినుంచి బుద్దిని సుజ్ఞానపు కాంతులవైపుకు నడిపించే మానసిక సాధనలతో సాగే ఈ దీక్షా ధారణలు మానవజాతి మహోన్నతికి మార్గం చూపే దీపశిఖలు.
తినటం ,సంపాదించటమనే ,భౌతిక సుఖాలను అందుకునే ఆరాటం తో పోరాటం చేసే నేటి సమాజానికి అసలైన జీవితం ఏమిటో ,ఆజీవితాన్ని అందుకోవాలంటే ఎంతత్యాగం , ఎంతవినయం ప్రకృతిపట్ల ,సమాజం పట్ల చూపాలో శిక్షణ నిస్తాయిఈ దీక్షలు. ఆశిక్షణతో సునిశితమైన బుద్దిని పెంచుకుని తమ జీవిత యానాన్ని ఎలాసాగించాలో బోధిస్తాయి. రాజు- పేదా. యజమాని సేవకుడనే బేధాల కల్పిత మాయను పటాపంచలు చేస్తూ సర్వోన్నతుడైన పరమాత్మ ముందు అందరూ సమానమేననే సత్యం ఆచరణాత్మకంగా నిరూపించబడుతుంది. రాగద్వేషాలు ,కామక్రోధాలను అదుపులో వుంచుకుని జీవిస్తే ఎంత అద్భుతమైన సుఖం లభిస్తుందో దీక్షాధారణ చేసినవారికి అనుభవం లోకొస్తుంది. ఈభావన మనుషుల లో నిలుపుకోగలిగితే ఈ లోకం లో కష్టాలు ,కన్నీల్లన్నీ తుడిచివేయబడతాయి . ఈదీక్షలతో తమ కష్టాలను తొలగించుకున్నవారెందరో ,ఇతరుల కన్నీళ్ళూ తుడిచినవారెందరో వున్నారు మహానుభావులు .వారందరికీ వందనము. వ్యక్తికి శారీరిక మానసిక శిక్షణ, పరమాత్మ కరుణ ప్రసాదించే ఈ మాలా ధారణలు ముఖ్యంగా యువత తప్పనిసరిగా తీసుకోవాలి . అది మీరు శక్తివంతులవటానికి , మానవజాతిని సక్రమ మారగంలో నడపగలిగే నాయకులుగా తయారవ్వటానికికూడా ఉపయోగపడుతుంది. అయితే అది శ్రద్దా భక్తులతో సాగితేనే , సాగిస్తేనే సుమా !
అలసత్వం ,సోమరితనం , అజ్ఞానాన్నివదులుకోలేని అహంకారం తో నడిస్తే ఈమాల దొంగగొడ్డు మెడలో యజమాని కట్టిన గుదిబండకు సమానమవుతుంది .

మహోన్నతమైన ఆత్మ విద్యను అభ్యాసం చేయటానికి ఆచరణలోకి తేవటానికి ఇది మంచి శిక్షణామార్గం.
ఒక్కో దీక్ష ఒక్కొక్క విధంగా సాగినా మౌలికంగా నియమ నిబంధనలు ,అంతిమ లక్ష్యం ఒక్కటే.
అయ్యప్ప . శివ,భవానీ ,గోవిందమాల ,దత్త దీక్షల గూర్చి వివరంగా మరొక పోస్ట్ వ్రాస్తాను.

తెలుగు బ్లాగర్లలోగాని ,చదివేవారిలోగాని ఎవరైనా మాలాధారణ చేసి ఏదైనా దీక్షలో వున్నవారు తమ గోత్రనామాలు పంపండి . వారి ఈఆథ్యాత్మిక పయనం లో ఆటంకాలు కలగకుండా కాపాడమని ఇక్కడ శ్రీపీఠం లో వారి కొరకు ప్రత్యేకంగా అర్చనలు చేయటం జరుగుతుంది.

Read more...

దేవుడున్నాడా అనేసందేహ జీవి జీవితం లో జరుగుతున్న ప్రత్యక్షలీల

>> Tuesday, October 20, 2009

భగవంతుని నమ్మిఆశ్రయించాలా వద్ద అనేసందిగ్దం లో కొట్టుమిట్టాడుతున్న ఓ ప్రముఖ బ్లాగర్ తన జీవితాన జరుగుతున్న ఆదైవలీలలను చూసి తబ్బిబ్బయిపోతున్నాడు .తనపేరు చెప్పవద్దని ,అదితనకు అహంకారాన్ని పెంచుతుందేమోనన్న వినయంతో ఆయన పేరు చెప్పవద్దనగా ఆయనపేరు వెల్లడించటం లేదు. ఇక ఆయన మాటలలోనే చదవండి ఆకొండలరాయుని లీల

------------------------------------------------------------------------------------------------

విరోధి నామ సంవత్సర, ఆశ్వీయుజ మాసం బహుళ సప్తమి తిథి.
(10 Oct, 2009)

ప్రతి యేడు తిరుపతికి వెళ్ళడం మా ఇంట ఆచారం, నాకు మానసికంగా ఉత్తేజం చేకూర్చే ఓ అలవాటు. కొన్నేళ్ళుగా వెళ్ళలేదు. అయితే ఎందుకో సంకల్పం కలిగింది. అదీ ఒక వారం ముందు మాత్రమే. శుక్రవారం రోజు ఉన్నపళాన బెంగళూరునుండి, తిరుపతి బస్సెక్కాను, రాత్రి. బయల్డెరే ముందు ఓ విషయం అనుకున్నాను. దర్శనం లేట్ అవుతుంది అన్నట్లయితే, వాపస్ వచ్చేసి, తిరిగి మళ్ళెప్పుడయినా చూడాలి అని.

సరే, శనివారం పొద్దున తిరుపతి బస్ స్టాండ్ వద్ద సుదర్శనం క్యూలో నించున్నాను. ఓ మూడు గంటల తర్వాత ఉదయం 9 కు దర్శనం టికెట్ దొరికింది. 9 లోపల స్నానాదులవీ ముగించి, క్యూలో నిలబడితే, 9:45 కంతా దర్శనం అయిపోయింది. ఇది ఒక వింత. ఇదివరకు నేను ఎప్పుడు దర్శనానికి వెళ్ళినా ఇంత తక్కువ సమయంలో నేను తిరిగి వచ్చింది లేదు.

తిరుపతికి వెళ్ళడానికి ప్రేరణ - అనుకోని సమస్యలలో చిక్కుకొని, ఎవరూ పరిష్కారం చూపలేక, చివరకు "అన్యథా శరణం నాస్తి" అని స్వామిని వేడుకోవడం కోసమే.

నేను జన్మ రీత్యా బ్రాహ్మణుణ్ణి. చిన్న వయసులోనే
మా నాన్న గారు ఉపాకర్మ జరిపి, మా తాతగారి సహాయంతో, సంధ్యావందనాదులు, నిత్యకర్మ మొదలైనవి ఆచరించేట్టు చూశారు. కొన్ని యేళ్ళ క్రితం మా
అమ్మ స్వర్గస్తులయారు. అప్పుడు కొన్ని సంఘటనల వలన నేను నాస్తికుణ్ణి (నాస్తికత్వం అన్నది చింతన మాత్రమే, ఆస్తిక ద్వేషం కాదు) కావడం జరిగింది. సంధ్యావందనాదులు
పక్కన పెట్టాను. పూజలు, అవీ అసలు లేవు.

ఆ తర్వాత గతవారం నుండీ మళ్ళీ నిత్యకర్మలు చేస్తున్నాను. తిరుపతి నుండీ వచ్చిన తర్వాత రోజు ఉదయం 5:30 కు నాకు, ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోను ఎత్తగనే, "వెంకటేశా" అని పిలిచారెవరో.
(రాంగ్ నంబర్ అది). అలా ఆ రోజూ ఉదయమే లేచి నిత్యకర్మ ఆచరించాను. (ఆ కాల్ రాకపోయి ఉంటే చాలా నిదానంగా లేచేవాణ్ణి). ఆ తర్వాత కొన్ని సమస్యలు నేను కల్పించుకోక
ముందే పరిష్కారమయాయి, విచిత్రంగా. ఇంకా ఏమి జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

(పొద్దున 5:30 కు ఎవరో రాంగ్ నంబర్ కాల్ చేసి, నిద్రలేపడం అన్నది దైవలీల మాత్రమే. సరే కాకతాళీయం అనుకుందాం. నేను నిద్ర లేచినా, కాసేపలా బద్ధకంగా ఉన్నాను. కాసేపటి తర్వాత మళ్ళీ ఇంకొక కాల్ (అదే నంబర్ అనుకుంటాను). ఈ సారి ఓ పెద్దావిడ. సౌమ్యంగానే ఏదో అడిగింది. ఆమే ఏమన్నదో నాకు గుర్తు లేదు. అప్పటికి నాకు పూర్తిగా మెలకువ వచ్చింది)

ఇంకో విచిత్రం. మా ఆవిడ ఉద్యోగం గత ఐదు యేళ్ళుగా డోలాయమానంగా ఉంది. అంటే, ఉద్యోగానికి ప్రమాదమంటూ ఏదీ లేదు కానీ, పర్మనెంట్ అవడానికి ఏవేవో ఆటంకాలు. తిరుపతి నుండి వచ్చిన రెండవ రోజు, ప్రభుత్వపు జీవో వచ్చింది. ఆమె ఉద్యోగం పర్మనెంట్ కానున్నట్టు. అయితే - మరో చిక్కు వచ్చింది. ఆమె సర్టిఫికెట్లు సొసయిటీ వారికి దాఖలు చేసినవి, ఎక్కడో మిస్ అయాయి అని వారి సొసయిటీ నుండీ ఉత్తరం వచ్చింది. ఆమె ఖంగారు పడింది. నేను సౌమ్యంగా ఉండమని, స్వయంగా కడపకు వెళ్ళి, సొసయిటీ అధికారులను మాట్లాడమని చెప్పాను. మరుసటి రోజామె కడపకు బయలుదేరింది. (కడపకు వెళ్ళాలంటే, కదిరిమీదుగా వెళ్ళాలి కదా అనుకున్నాను మనసులో నేను. కదిరిలో యోగలక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్నాడు). సాయంత్రానికి ఆమె పని చక్కబడింది. . అయితేనేం, పని అనుకున్న దానికన్నా సులువుగా జరిగింది.ఇది స్వామి దయమాత్రమే అని నాకు అనిపిస్తున్నది.
ఇంకా విచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. నిన్న పాత మితృడు, నా రూమ్మేటు, పది యేళ్ల తర్వాత కలిశాడు, తనంతట తనే నన్ను వెదుక్కుంటూ వచ్చి. తన పేరు - "శేషాద్రి". ఆ మితృడితో, ఏమి చేయిస్తాడో, ఏమి చేయించుకుంటాడో ఆ స్వామి, ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

Read more...

కార్తీక మహాత్మ్యం ఇక్కడవున్నది .చదవండి

ఆథ్యాత్మిక కార్యక్రమాలకు ఆలంబమైన ఈ కార్తీక మాస విశేషాలను ,మహిమలను చదవాలనుకున్నవారికి ఈక్రింది లింక్ లో చక్కటి కార్తీక మహాత్మ్యం పురాణవర్ణన దొరుకుతుంది . చాలా శ్రమకోర్చి భక్తజనులకోసం అందుబాటులో వుంచారు .తప్పనిసరిగా చదివి తెలుసుకోదగినది .
http://teluguone.com/bhakti/shivastutulu/index.jsp



Read more...

ఆథ్యాత్మిక కార్యక్రమాలకు ఆలంబమైన ఈ కార్తీక మాస విశేషాలను ,మహిమలను చదవాలనుకున్నవారికి ఈక్రింది లింక్ లో చక్కటి కార్తీక మహాత్మ్యం
http://teluguone.com/bhakti/shivastutulu/index.jsp


Read more...

గోత్రనామాలు పంపి " కోటి పంచాక్షరి " జపయాగం లో పాల్గొనండి

>> Monday, October 19, 2009




శ్రీగణపతిర్జయతి

మహాదేవుని మహిమాన్విత నామ మంత్రము ఓంనమ:శివాయ అనే పంచాక్షరి . సకల శుభాలను ప్రసాదించి ,కోరిన కోర్కెలను తీర్చగల భోళాశంకరుని మెప్పించగల సులభ సాధనము ఈ మంత్రరాజ జపము. గురూపదేశము లేకున్నా జపించి తరించవచ్చు .సకలవిధాలైన దోషాలను పోగొట్టి భక్తజనరక్షణచేయు పరమశివుని మెప్పించిన మాహాభక్తులంతా స్మరించి తరించిన మంత్రమిది . మృత్యుంజయుడైన ఆతండ్రి కరుణపొందటాని కార్తీకము అనుకూలమైన కాలము. ఆథ్యాత్మిక దివ్యతేజస్సు భువిపైన అధికంగా ప్రసరించే ఈ కాలాన ఈమంత్ర రాజమును జపించి స్వామి అనుగ్రహానికి పాతృలగుదురుగాక .ఈసంవత్సరాన జరుగుతున్న జరుగనున్న ఉత్పాతాలనుండి పరమశివుని ఆశ్రయించి రక్షణపొదుదుముగాక .

శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠము లో కొలువుదీరిన రామలింగేశ్వరుని సన్నిధిలో భక్తులంతా కలసి నిరుటి లాగానే ఈసంవత్సరం కూడా " కోటీపంచాక్షరి" జపయాగాన్ని నిర్వహించుటజరుగుతున్నది. ఈనెల ఇరవై ఒకటవతారీఖున శుద్ద తదియనాడు మొదలై వచ్చేనెల పదిహేను కార్తీక మాస శివరాత్రి నాడు పూర్ణాహుతి జరుగుతుంది . ఈకాలం లో భక్తులంతా ఈ పంచాక్షరీ జపం తామున్న చోటునుండే జపిస్తూ పాల్గొనవచ్చును . వారు తమ సంసిద్దతను తెలియపరుస్తూ వారి గోత్రనామాలను మెయిల్ ద్వారాగాని లేక ఫోన్ ద్వారాగాని తెలియజేయాలి . వారి తరపున స్వామికి అభిషేకాలు యాగములో సంకల్పములు చేయబడతాయి. పూర్ణాహుతి సమయానికల్లా తాము చేసిన జపసంఖ్య తెలియపరచాలి. జపం చేసేవాల్లు జపకాలంలో మద్యమాంసాదులను ముట్టుకోరాదు. కులమత బేధాలులేకుండా ఎల్లరూ పాల్గొనవచ్చు. స్త్రీలు తమకు ఇబ్బందయిన రోజులు వదలి మిగతా రోజులలో జపం చేయవచ్చు. పూర్ణాహుతికి వీలైనవాల్లంతా వచ్చి పాల్గొనవచ్చు. రాలేనివారు సమీపంలో శివాలయం లో ఒక కొబ్బరికాయ స్వామివారికి నివేదించవచ్చు.

ఈకాలంలో పీఠములో ప్రత్యేక అభిషేకాలు ,హోమాదులు జరిపించుకోవాలనుకున్నవాల్లు మాతో సంప్రదించండి. దేశ విదేశాలనుండి భక్తులు నిరుడు ఈ జపం చెసి యాగం లోపాల్గొన్నారు. వారందరూ మరలా తమ గోత్రనామాలను పంపవలసినదిగా మనవి. భక్తజనసేవలో ..........దుర్గేశ్వర

durgeswara@gmail.com


9948235641

Read more...

అమ్మలూ ఈనెల పందొమ్మిది న అన్నదమ్ములను పిలచి భోజనం వడ్డించటం మరచిపోకండి

>> Saturday, October 17, 2009


అమ్మలూ ఈనెల పందొమ్మిది న అన్నదమ్ములను పిలచి భోజనం వడ్డించటం మరచిపోకండి





కార్తీక మాసములో రెఁడవరోజయిన విదియ తిథి నాడు యమున తనసోదరుడయిన యముని సత్కరించినది. ఆరోజును భగినీ హస్త భోజనము, వ్యవహరిస్తారు. ఆరొజు సోదరులను తమయింటికి పిలచి ,భోజనము పెట్టి వారి ఆశీర్వాదము తీసుకొనుట భారతదేశములో మహిళలు పాటించే ఆచారము. సోదరులు కూడా తమ సోదరి లను కానుకలతో సత్కరిస్తారు. దీనివలన వారి మాంగల్యబలము మరింత శక్తివంతమవుతుందని. శాస్త్రవచనము. అలాగే తమచెల్లెళ్లను సత్కరించిన వారికి అపమృత్యువు లేకుఁడా వరమిచ్చాడు. యమధర్మరాజు.

ఇటువంటి పవిత్రమయిన ఆచారాన్ని పాటించటము వలన ఆధ్యాత్మిక లాభాలే కాక , సామాజిక బంధాలుకూడా మరింత దృఢపడి. సమాజములో శాంతిసౌభాగ్యాలు వెల్లి విరుస్తాయి. మరెందుకాలస్యం మరచిపోయిన వారుంటే వెంటనే పిలవండి. రేపు అంటే అక్టోబర్ 30 గురువారం జరుగుతుంది. బ్లాగ్ లోకములో వున్న నాసోదరీమణులకందరికీ సకలశుభాలు కలగాలని కోరుకుంటున్నాను.



Read more...

ఆథ్యాత్మిక ప్రయోగం లో పాల్గొనటానికై మీగోత్రనామాలను పంపండి




ఆథ్యాత్మికత ప్రయోగము చేసే భౌతిక విషయమా ? కానేకాదు. ఎన్నటికీ కాదు .అది జీవియొక్కఆత్మ, పరమాత్మ కోసం తపించే దివ్యప్రేమ మార్గమది. మరి ప్రయోగమనే మాటను ఇక్కడ వాడటం సబబా . ఆథ్యాత్మిక సాధనామార్గం లో వున్న సిద్దపురుషులకు క్షమాపణలు చెప్పుకుంటూ చిన్న వివరణ ఇచ్చుకుంటున్నాను.

ప్రస్తుత కాలం లో ఆథ్యాత్మికత మార్గము కలిప్రభావం చేత గందరగోళానికి గురవుతున్నది . అసలు పరమాత్మ ఉనికిని, ఆయన కరుణ ను సరిగా అర్ధం చేసుకోవటానికి వీలు లేనంత అయోమయ సిద్దాంతాలతో కలగాపులగ,మై పోయింది. అసలు భగవంతుని శక్తిని నమ్మి ఆశ్రయించవచ్చా అనే సంశయం తరతరానికి ఎక్కువైపోతున్నది. దీనివలన కలిపురుషుని లక్ష్యం నెరవేరుతుంది . భగవంతుడున్నాడాలేదా అనే సందిగ్దత కల్పించి భగవన్మార్గాన్నుంచి జీవులను దారి మళ్ళించటమే అతని లక్ష్యం .

అయితే రానున్న కలి లో కలిపురుషుని వ్యూహాలను ముందుగా గ్రహించిన మన ఋషులు మానవులు భగవంతుని పైన విశ్వాసం కోల్పోకుండా వుండేదుకు కొరకై పలు సాధనామార్గాలను కల్పించి వుంచారు. వీటిద్వారా కష్టాలను తరించిన మానవులు భగవత్ శక్తిపైన విశ్వాసము పెంచుకుని ,ఆ దివ్యచైతన్యం వైపు అడుగులు వేస్తారు అనేది వారి ఆశయం.. . ఈ కార్యక్రమానికి సహాయపడగల పెక్కు సాధనారీతులను, వర్ణించి తాముఆచరించి ఫలితములు నిరూపించి చూపారు . అలాగే కాలగమనం లో ఆథ్యాత్మిక సాధనకు బాగా దోహదపడగల సమయాలను కూడా వివరించినారు... ఈ యుగాన కూడా మహాత్ములు పలుసార్లు మరలా జన్మించి సాధారణ మానవులను ఆథ్యాత్మిక మార్గం నుంచి వైదొలగకుండా కాపాడుతూ సద్గురువులైనారు. వారి మార్గం లో నడచి మన అధిభౌతిక ఆటంకాలను మనసాధనద్వారా మనమే తొలగించుకుని ,మనజీవితాలనే ప్రయోగశాలలో ఆపరమాత్మ దివ్యకరుణామృతాన్ని గ్రోలిసోపాన క్రమం లో ఆ దివ్యధామాన్ని చేరుకునే ప్రయత్నాలు చేద్దాము .

ముఖ్యంగా కార్తీక ,మార్గశిరమాసాలు ఆథ్యాత్మిక సాధకుల సాధనలకు బాగా అనుకూలమైన కాలము. కనుక నే దీక్షలు,వ్రతాలు సాధనలు ఈ సమయం లో ఎక్కువగా జరుగుతుంటాయి . వీటిద్వారా పొందిన ఫలితాలను చూసే లక్షలాదిమంది భక్తులు దీ*క్షలు తీసుకుని తమ సాధనలను సాగిస్తున్నారు.

ఇక శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠము కూడా ఈ సమయాన పలు ఆథ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఇప్పటివరకూ తమ సమస్యలను తెలిపినవారికి వారు చేయవలసిన సాధనా రీతులను ,విధివిధానాలను సూచించి ,వారి సాధన నిర్విఘ్నంగా కొనసాగటం కొరకు వారి తరపున పీఠం లో భగవన్మూర్తులకు పలు సేవాకార్యక్రమాలు అంటే అభిషేకములు అర్చనలు,పూజలు హోమాదులను నిర్వహించుట జరుగుతున్నది.

మీరు మీజీవితం లో ఎదుర్కొంటున్న పలు సమస్యలకు ,ఆటంకములకు కారణం ,జాతక దోషాలు కావచ్చు . సంచిత ,ఆగామి,ప్రారబ్ధ కర్మలు కారణం కావచ్చు . ఈదలేని ఈసంసారజలధిలో తలమునకలవుతూ దిక్కుతోచని స్థితిలో వుండవచ్చు . ఈసమయాన మన బంధువులు,బలాలు,పదవులూ, ధనమూ మన సమస్యను ఏమాత్రం తొలగించలేక పోవచ్చు. కానీ భగవంతుని ఆశ్రయించి ఆయన అనుగ్రహం పొందగలిగితే ఈ సమస్యలన్నీ తృణప్రాయంగా నివారించి తీసివేసుకోగల శక్తి మీకొస్తుంది . అది మాత్రం నిజం .దీనిని నమ్మినవారు ఈ శుభకరమైన సమయాన్ని వినియోగించుకోవచ్చు. మీరు మమ్మల్ని సంప్రదిస్తే ,లేక మీరు చేస్తున్న సాధనకు సహాయపడగలమనుకుంటే మీగోత్రనామాలను పంపండి . ఇక్కడ జరిగే అన్ని భగవత్ సేవలలోనూ మీకొరకు ప్రార్ధనలు జరుగుతాయి. అయితే మీరుమాత్రం అక్కడ మీగృహాలలో వుండే భగవంతుని మీశక్త్యానుసారం సేవించవలసి ఉంటుంది. ఇది మాసేవా మార్గము .పదిమంది భక్తులు భగవన్మార్గం లో నడుస్తున్నప్పుడు వారికి చేతనైన సహాయము చేయటమే మా సాధనారీతి. ఈమార్గం లో పలువురు తమ సాధనలను చేసి వారి సమస్యలను నివారించుకున్నామని చెబుతున్నప్పుడు వారి కొరకు సహాయం చేసినపుణ్యం దక్కినందుకు మాజన్మధన్యమైనదని భావిస్తున్నాము. జై హనుమాన్

సంప్రదించండి .durgeswara@ gmail.com 9948235641



Read more...

జన్మకుండలి లో శని దోషాలను ఇలా గుర్తించ వచ్చు

>> Thursday, October 15, 2009


శనిగ్రహం అన్న పేరు వింటేనే ప్రజలు బెంబేలెత్తుతారు. శనిగ్రహం రాశిలో మార్పు చెందితే ప్రజలు మరీ ఆందోళనలో పడిపోతుంటారు. శనిదేవుడు ఎలాంటి విపత్తులు సృష్టిస్తారోనని దిగులు పడిపోతుంటారు. ముఖ్యంగా చాలామందికి తమ తమ జన్మ కుండలి తెలీదు. అలాంటి వారు తమ జన్మకుండలిలో శనిదోషాన్ని గుర్తించడమెలాగో తెలుసుకోవాలనుకుంటుంటారు.

శనిగ్రహం మంచి చేస్తుందా లేక చెడు చేస్తుందా అనేది ఓ పెద్ద ప్రశ్నగా ఉంటుంది. శని ప్రతికూల పరిస్థితులు మన దినచర్యల్లో మార్పులు తీసుకు వస్తాయి. వీటిని గుర్తుంచుకుని వ్యవహరించాల్సివుంటుంది.

** ఒకవేళ మీ శరీరం తరచూ అలసటకు గురవుతుంటే లేదా నిస్సహాయంగా మారిపోతుందేమో గుర్తించండి.

** నిత్యకృత్యాలు జరుపడంలో ఇష్టం కలగకపోవడం లేక స్నానం చేసే తీరిక కలగకపోవడం.

** కొత్త దుస్తులు కొనడం లేదా తొడుక్కునే అవసరం రాకపోవడం.

** నూతన వస్త్రాలు లేదా మేజోళ్ళు (చెప్పులు) త్వరగా పాడైపోవడంకాని, చిరిగిపోవడం కాని జరుగుతుంటే...

** ఇంట్లో నూనె, పప్పుదినుసులు నష్టపోతుంటే లేదా చేతిలోనుంచి జారిపోతుంటే.

** మీ ఇంట్లోని అలమారా అస్తవ్యస్తంగా ఉంటే.

** భోజనం చేయాలంటే ఇష్టం కలగకపోవడం.

** తల, కాలిపిక్కలు, నడుములో నొప్పి అలాగే ఉంటే.

** కుటుంబంలో తండ్రితో పొరపొచ్చాలు ఏర్పడితే.

** చదువు పట్ల, ప్రజలను కలిసేందుకు మనసు అంగీకరించకపోతే, చిరాకుగా ఉంటే.

ఒకవేళ ఈ లక్షణాలు మీరు స్వయంగా అనుభవిస్తుంటే, శనిగ్రహం మీ జన్మకుండలిలో ఉన్నట్లు లెక్క. దీని నివారణోపాయం ఇలా ఉంటుంది. చేసి చూడండి...

నూనె, సన్న ఆవాలు, ఉద్దిపప్పును దానం చేయండి. రావిచెట్టును పెంచండి. ఆ చెట్టువద్ద దీపాలు వెలిగించండి. హనుమంతుడు లేదా సూర్యుడిని ఆరాధించండి. మాంసం, మద్యపానం అలవాటుంటే వాటిని త్యజించండి. పేదవారికి సహాయం చేయండి. నల్లటి వస్త్రాలు ధరించకండి. నల్లటి వస్తువులు దానం చేయండి.


Read more...

వీరిని చూసి నేర్చుకోవాలి మనం

>> Wednesday, October 14, 2009

శ్రద్దా శక్తులతో ధర్మాన్ని పాటిస్తున్న వీరిని చూడండి .ఈ ధర్మానికి వారసులమైన మనం ఇంకెంత శ్రద్ధతో పాటించాలో కదా!

http://www.tehelka.com/story_main42.asp?filename=hub150809the_swami.asp

Read more...

ఆథ్యాత్మిక ప్రయోగాలలో సాధించిన ఖచ్చితఫలితాలివిగో !

>> Tuesday, October 13, 2009

ఆథ్యాత్మిక ప్రయోగాలతో ఖచ్చితమైన ఫలితాలు వస్తాయనేది కట్టుకథకాదు . నియమాను సారంగా నిబద్దతతో సాగిస్తే అద్భుతఫలితాలు వస్తాయని ఇప్పడూ ,ఈకాలంలో కూడా నమ్మవచ్చు. అలా జరుగుతుందబట్టే ఇప్పటికీ మానవులు తొంభైశాతం మంది భగవంతుని ఆశ్రయిస్తున్నారు.
ఇందులో అనాదిగా మన ఋషులు ,మాహత్ములు ప్రసాదింి ఆథ్యాత్మిక సాధనా మార్గాలు అత్యంత శక్తివంతాలు.అహంకారాన్ని విడనాడి తననాశ్రయించినవారికి భగవత్ శక్తి ఎలా సహకరిస్తుందో అందరికీ తెలిసిన విషయమే.
అయితే కలియుగం లో కలి పురుషుని ప్రభావం ఎక్కువమందిని సత్యాన్ని నమ్మడానికి అంగీకరింపకుండా చేస్తున్నది.
అది అనర్ధాలకు దారి తీస్తున్నది. భగవంతుని ఆశ్రయించడమంటే సోమరిపోతుతనం కాదు ,శక్తివంచన లేకుండా కృషిచేసి మనలో ఆ పరమాత్మ చైతన్యాన్ని నిలుపుకోవడం . దానివలన ఆజీవి కర్మానుసారంగా వచ్చే చెడుఫలితాలను కూడా ధ్వంసమొనరించుకోగల శక్తివంతుడవుతాడు. ప్రయోగశాలలో ఏరకంగా ఫలితాన్ని చూపవచ్చో అదేవిధంగా నిరూపించవచ్చు.ఆవిషయాన్ని స్పష్టపరచడానికే నేను కొందరు మిత్రులకు ఇక్కడే ఈ అంతర్జాలం లోనే ఇచ్చిన సూచనలను పాటించి వారు స్వశక్తితో ,భగవంతుని అనుగ్రహానికి పాతృలై సాదించిన ఫలితాలు సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తున్నాయి.

నామాట మీద నమ్మకముంచి సాధనచేసిసమస్యలనుపరిష్కరించుకోవడం సాధించిచూపిన సాధకులు వీరు.

౧ .తోలేటి పవనకుమార్ యుఎస్ .ఎ
౨భాస్కర్ రామరాజు యు, ఎస్. ఏ
౩నాగప్రసాద్ ఇండియా
౪మీసాల మురళి యు.ఎస్.ఎ
౫ కోటేశ్వరరావు [రిపోర్టర్] ఇండియా
౬ సునీల్ వైద్యభూషన్ ఇండియా
౭ చింతా రామశర్మ

ఇంకా మరికొందరున్నారు.


వీల్లంతా వివిధరంగాలలో వున్నవారు.అనామకంగా ఏదిచెబితే అది నమ్మేస్థితిలో వారుకాదు .సప్రమాణంగా నిరూపించబడితేనే నమ్మేవారు . వారి జీవితాలలో వివిధ సమస్యలను ఆథ్యాత్మిక మార్గంద్వారా ఎలా పరిష్కరించుకోవచ్చో సాధించి చూపారు. నాకు తెలిసినంతలో ఇక్కడ ఈ సంవత్సరంన్నర కాలం లో నేనిచ్చిన సూచనలను పాటించినవారిలో తొంభైశాతం మంది ఖచ్చితమైన ఫలితాలను నిరూపించారు. అయితే ఇందు లో నాగొప్పతనమేమీ లేదు. మాహాత్ములిచ్చిన మార్గాల శక్తి అది. భగవంతుని మన:పూర్వకంగా నమ్మి ఆయనను తమ భక్తితో మెప్పించిన పైవారి భక్తిగొప్పదనమది. చెప్పటం వందమంది చెబుతారు .చేసి చూపించినవారిదే గొప్పదనమంతా.

ఇక మిగతా పదిశాతం మందిలో ఫలితాలెందుకు రాలేదు? ాఅలోచించాల్సినవిషయం. ఇక్కడ ప్రతిజీవి జాతకరీత్యా కొన్ని ఖర్మ ఫలితాలుంటాయి . సాధారణ వైద్యవిధానం లోలాగానే .వివిధ శరీర తత్వాలున్నట్లుగా. మరిప్పుడు నా పరిజ్ఞానం వాటిని ఖచ్చితంగా అంచనావేయకపోవటానికి చాలలేకపోయి వుండవచ్చు. అది నా లోపమే. ఇక సాధకుల మనోస్థితులు ,విశ్వాసము, నిబద్దతకూడా ఫలితాలపై ప్రభావం చూపుతుంది. కనుక భక్తితో ఆశ్రయించి మన మహాత్ములిచ్చిన ఆథ్యాత్మిక మార్గాలలో నడవటం ద్వారా జీవితాన ఎదురయ్యే ఆటంకాలను.సమస్యను పరిష్కరించుకోవచ్చని చెప్పటమే ఇక్కడ నాఉద్దేశ్యము.
వినుకొండలో నాకొక మిత్రుడున్నాడు ,కుంటిరవి అని [సరదాగా అలాపిలుస్తాము వాడొకసారి గొడవలలో కాలిరగ్గొట్టుకున్నప్పటినుంచీ] ఒకసారి తీవ్రమైన వాదనకుదిగాడు . ఏడీ భగవంతుడు ? నువ్వు చూపిస్తావా? ఎన్నిరోజులు చేయాలి సాధనలు? ఖచ్చితమైన సమయం చెప్పగలవా ? బెట్ కాస్తాను ? ఇలా ఉద్వేగంతో వాదన. నేను చెప్పాన. బాబూ కుంటిరవీ! నీకాలిరగ్గొట్టుకున్నప్పుడు డాక్తర్ దగ్గరకెళ్ళి ఎన్నిరోజులలో తగ్గిస్తావు? ఖచ్చితంగా చెప్పు ? లేకపోతే నీవైద్యం అబద్దం అని ఒప్పుకో అంటే దాని నేమంటారు చెప్పు. ఆఫలితం రావాలంటే డాక్టర్ గారు సరయినమందు సూచించాల, దానిని నవ్వు నియమానుసారంగా వాడాలి .అవీ నీశారీరక తత్వానికి సరిపోవాలి . ఇంకా నీఖర్మగాలి భావోద్వేగాలు ఎక్కువై నీకు షుగర్ వచ్చిందనుకో ఇంకా ఎక్కువసమయం పట్టవచ్చు . ఇలా నీకంటిముందు చిన్న విషయానికే ఇన్ని నియమాలున్నాయి. అలానే భగవంతుని విషయం కూడా . అనివివరించాను. ఇతరులు చెప్పినది ఒప్పుకుంటే మనం తక్కువవారికిందలెక్క అనే మనస్తత్వం వున్నవారికి ఏదిచెప్పినా ఎక్కదు .వీనికి ఈమధ్య ఇక్క్లడ నాస్థికులని చెప్పుకునే వారితో సాంగత్యం కూడా వున్నది . కనుక చెప్పినా అది మనసులో నిలబడదు. వాదననుంచి తప్పుకున్నాను. అతనుమాత్రం అప్పుడప్పుడు సాయిబాబా గుడికెళ్ళినట్లు తెలుస్తున్నది. మరలా దేవుడులేడనే వాదనా జరుపుతున్నట్లు తెలుస్తుంది . కాబట్టి ఈపీకులాటలోంచి ఎప్పుడూ బయటపడతాడనేది మనం చెప్పలేం.

ఇక్కడ నేను స్పష్టం గాచెప్పేది మాత్రం ఒక్కటే . నేను గొప్ప సాధకున్ని కాదు. భగవంతునిఆశ్రయించి బ్రతకాలనే తీవ్ర మైన నమ్మకం కలవాడిని . ఇక ఈ నమ్మకం సుస్థిరం కావడానికే మహాత్ములు మానవకళ్యాణం కోసం ఇచ్చిన మార్గాలను ఇతరులకు కూడా తెలియపరచాలనే ఏదో నాకే తెలియని మనోస్థితిలో వున్నాను. ఇది జ్ఞానమో అజ్ఞానమోగాని అలా సాగుతున్నాను. దీనివలన ఇతరులకేదన్నా మేలు జరిగితే ఈమార్గాలుచూపిన మహాత్ముల గొప్పదనంగాను ,ఇందులో ఏవైనా పొరట్లుజరిగితే కేవలం నా అజ్ఞానం వలమాత్రమే జరిగినవని భావించగలరు.బుధజనులుమన్నించగలరు.సిద్దమండలి క్షమించగలరు.





Read more...

మహాపచారం.... దేశానికి అరిష్టం కలుగజేసే దుర్మార్గాలివి

>> Monday, October 12, 2009


మహాపచారాలు జరుగుతున్నాయి. పుణ్యస్థానాలలో రాక్షసులు ప్రవేశించారు . దైవ నిలయాలలో అనాచారాలకు పాల్పడిలోకోపద్రవాన్ని తెచ్చిపెట్టేపనులు చేస్తున్నారు. అన్నవరం దేవాలయం లో ప్రసాదాలకు పూజకు వినియోగించే నెయ్యిలో జంతుసంబంధిత కొవ్వులతో కల్తీ చేసి సరఫరా చేస్తున్నారని తెలిసి ఆస్తికలోకం తల్లడిల్లుతున్నది. ఇటువంటి ఆనర్ధాలను జరగకుండా వేయికళ్ళతో కాపాడవలసిన అధికారులు దేవునిసొమ్ము మెక్కేపనిలో వుండి పట్టించుకోవటం లేదు. ఈ దుశ్చర్యకు ప్రత్యక్షంగా పాలకమండలి,ప్రభుత్వము ,పరోక్షంగా దేవాలయాలలో జరిగే అవినీతి పనులు తెలిసినా స్పందించకుండా వున్న మనము కూడా బాధ్యులమే. దేవాలయాలు సమాజ రక్షణకు,శేయస్సకు ఏర్పడ్ద కేంద్రాలు. వాటిళో జరిగే అపచారం అందరికీ సామూహికంగా కష్టాలు తెచ్చిపెడుతుంది . జనం ఈ దుశ్చర్యలను అడ్డుకునేందుకు ముందుకురావాలి. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని ఈ అచారానికి కారకులైనవారందరినీ కఠినంగా శిక్షించేలా చూసేదాకా వత్తిడితేవాలి . ఆలయాలలో భగవ్ంతుని పట్ల ,ధర్మం పట్ల నిబద్దతలేని వారిని తొలగించి ప్రక్షాళన చేసేలా పోరాడాలి

మాకెందుకులే అనుకుంటే మాత్రం ప్రమాదమే . ఈ అనాచారాలు లోకోపద్రవాలకు కారణాలవుతాయి .వాటి ఫలితం మనమనుభవించవలసినదే . ఈక్రింది లింక్ చూడండి ఈదుర్మార్గాన్నిగూర్చి వివరిస్తున్నది

http://www.telugupeople.com/news/NewsItem_55644.asp?newsID=55644



Read more...

ఆథ్యాత్మిక తార ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు

>> Saturday, October 10, 2009


ఆథ్యాత్మికత కట్టుకథలమీద ,మూఢనమ్మకాల మీద ఆధారపడిన అభూతకల్పన కాదని,సత్యాన్వేషన,తత్వచింతన ,లీలాశ్రవన నిధిధ్యాసల పర్యవసానమైన అథ్యద్భుత జీవనవిధానమని,అది సనాతనము,నిత్యనూతనము,సార్వజనీనము అని,అదికులమతాలకతీతమని,ఆత్మవేత్తలు తిరిగి తిరిగి నిరూపించి,నిర్ధిష్టమ్ చేసిన శ్రేయో మార్గమని,అది అందరికీ అందుబాటులోనే వున్నదని,మానవాళికి ఈ కలి యుగాన కూడాఆచరణ యోగ్యమైనదని తెలిపి , నడచి చూపిన సద్గురువు శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు. తీవ్రమైన తపస్సుతో సమర్ధ సద్గురువులైన సాయిబాబా అనుగ్రహంతొ తన జీవితాన జరిగిన ఆథ్యాత్మిక అనుభూతులన్నీ సామాన్యులకు ఆథ్యాత్మికత పట్ల అపోహలు తొలగించేలా చేయటానికి ఉపయోగించారు. శాస్త్రీయము ,ప్రామాణికమైన ఆయన బోధనలు,రచనలు ఆథ్యాత్మిక లోకంలో వేగుచుక్కలా మార్గదర్శనం చేస్తున్నాయి .అటువంటి దివ్యసాధకుల జననం మరలామరలా జరిగి జాతిని మేల్కొల్పుతూనేవున్నది . .

Read more...

పిల్లకాకులన్నీ కలసి పుల్లలేరాయి

>> Wednesday, October 7, 2009







కాకులకు ఓ గొప్ప సామాజిక గుణమున్నది. ఏదైనా ఆహారం దొరికినప్పుడు కావుకావుమని అరచి తమ వారందరినీ పిలచి మరీ పంచుకుంటాయి . అంతేకాదు ఆపదవస్తే గోలగోల చేసి తమ జాతిని అంతా పిలచి ఆపదలోవున్న తమవారిని కాపాడుకోవాలన ప్రయత్నిస్తాయి . ఇక్కడ వున్నపిల్లలంతా వరదతో తల్లడిల్లుతున్న వారికి సహాయపడటం కోసం చేత సంచులుపట్టి బియ్యం సేకరించారు . ఇంటింటి నుండి తాము స్వంతగా సేకరించిన బియ్యం ఎనిమిది క్వింటాళ్ళు దాదాపుగా . అవన్నీ క్రాంతి టాన్స్ పోర్ట్ ద్వారా ఈరోజు పంపాము సహాయ శిబిరాలకు.
పీఠం నిర్వహిస్తున్న హిందూ పబ్లిక్ స్కూల్ విద్యార్థులంతా రాత్రి ఇల్లిల్లూ తిరిగి తెల్లవారేసరికల్లా ఇవి సిధ్ధం చేశారు.

మాస్టర్ గారూ పిల్లలు అన్నతెస్తే తమ్ముడు తమ్ముడు తెస్తే చెల్లెలు పోటీ పెట్టుకుని బియ్యం తీసుకుపోతున్నారు. ఏమిటో సరిగా చెప్పటం లేదు వరదలో వున్నవాల్లకంటున్నారు అనినన్ను ఫోన్ లో అడిగారు పెద్దవాల్లు.
అవునమ్మా ! వరదమునకలో వున్న మారుమూల గ్రామాలకు పంపాలని సేకరించమని చెప్పాను అని సమాధానమిచ్చాను.
అయ్యో అలాగా ! మీరు గానీ లేక టీచర్లను గానీ పంపితే వివరంగా చెబితే ఇంకా ఎక్కువ ఇచ్చేవాల్లమే ! అని అన్నారు.

నేను వస్తే ,మీరు ,పెద్దవాల్లంతా వస్తారు .పెద్దవాల్లే సేకరిస్తారు. అదే పిల్లలకే ఈ బాధ్యత ఇస్తే సహాయపడటం అనే గుణాన్ని ఇప్పటినుంచే నేర్చుకుంటారు . అందుకే వాల్లనే స్వయంగా పంపాను చెప్పాను వాల్లకు.

గాంధీనగర్ , సాయినగర్ ,తిమ్మాపురం ,రాముడుపాలెం.తండా,లక్ష్మీపురం నుండి పిల్లలు తాము సేకరించిన బియ్యాన్ని మూటలు కట్టి కుట్లు వేసి మన వాహనం లో తెచ్చారు. తాము కూడా ఏదో మంచి పనికి సహాయం చేస్తున్నామన్న ఆనందం వారి ముఖాలలో తాండవించింది .

"మాస్టర్ గారూ ! ఆపదలో వున్నవారికి జనం అన్ని చోట్లా బాగా సహాయం చేస్తున్నారండీ ". అన్నాడు మా టీచర్ ఒకాయన

వారికి మనం సహాయం చేయటం లేదండీ ! మనకే మనం సహాయం చేసుకుంటున్నామేమో కదా అన్నాను. ? అదేమిటి ?
అన్నాడాయన

మనలో మానవత్వం నిదురించి నశించిపోకుండా అప్పుడప్పుడూ ఇలా ఈ పనులద్వారా కాపాడుకుంటూన్నామేమో !
రాబోయే తరాల్లో మానవత్వాన్ని మసిగానీయకుండా్ చిగురులేపించే చిన్న యత్నమేమో కదా !ఇది. ఏమంటారూ?
ఆయన కర్ధం కాలేదనుకుంటా ! సమాధానమివ్వకుండా తప్పుకున్నాడు.

Read more...

చిట్టిచేతులు సాయమందిస్తున్నాయి.

>> Tuesday, October 6, 2009

ఒరే పిల్లకాయలూ ! మీరుటీవీ చూస్తున్నారా? ప్రశ్నించానీరోజు.
చూస్తున్నాం సార్ . కోరస్ గా అరచారు.
ఏం చూస్తున్నారు . ?
నీళ్ళు చాలా వస్తున్నాయి .ఊర్లు మునిగి పోతున్నాయి ఏడుస్తున్నారు ..
పాపం అన్నం లేదంట
అవును పిల్లలకు పాలుకూడా లేవంట ......;... చెప్పుకుపోతున్నారు పిల్లలు.

ఒక వేళ మనకు అలా జరిగితే ,మీరు బడికి ఇలా కారేజీలు తీసుకుని రాగలరా? మీఇల్లలో ఇలా ప్రశాంతంగా ఉండగలరా?
అమ్మో !
అవునుకదా! మరి అక్కడ మీలాంటి పిల్లలే ఆకలితో అల్లాడిపోతున్నారు .వాల్లకోసం మీరేమి చెయ్యలేరా ?
మా అమ్మవాల్లనడిగి డబ్బులు తెస్తాము సార్ .
డబ్బుకాదు ఇప్పుడు కావలసినది . అన్నం . ఆకలితో వున్నవాల్లకు అన్నంకావాలి. కాబట్టి మనం కూడా మనకు చేతనైనంతమందికి అన్నం పెట్టాలి. మనపక్కవాల్లను అడిగి కూడా పెట్టీంచాలి.మీరు మీ అమ్మావాల్లనడిగి తలా కొంచెం బియ్యం తెస్తే పంపుదాము కొద్దిమందికన్నా ఒకపూట అన్నం పెట్టొచ్చు.

ఓ !తప్పకుండా తెస్తాము సార్.
అలానే మీ చుట్టాలందరినీ అడిగితే మరిన్ని బియ్యం వస్తాయి కదా ! వాల్లందరి నీ ఆడగండి .
ఈరోజు సాయంత్రం పాఠశాల మగింపు సమావేశం లో నేను చెప్పాను.
ఆచిట్టి చేతులు వారి వారి గ్రామాలలో ఇల్లవెంట తిరుగుతూ ఇది రాస్తున్నా రాత్రి తొమ్మిది గంటల సమయానికి కూడా ఇంకా వసూలు చేస్తున్నారు బియ్యం.
మాపాఠశాలలో చదువుతున్న ,గాంధీనగర్ ,రెడ్డిపాలెం,లక్ష్మీపురం తిమ్మాపురం సాయినగర్ రాముడుపాలెం,తండా.రవ్వవరం బుర్రిపాలెం గ్రామాలలో చిన్నపిల్లలంతా సంచులు పట్టుకుని ఇల్లవెంట తిరుగుతూ బియ్యం సేకరిస్తున్నారు .ఇక్కడ విశేషమేమిటంటే వారివెంట ఉపాధ్యాయులుగాని పెద్దవారెవరూగాని లేరు . కేవలం ఆపిల్లల మనసులో సహాయం చెయ్యాలనే ప్రేమ భావనే వార చేతఈపని చేపిస్తున్నది .ఆప్రేమ శక్తే అమ్మ . ఆపసిమనస్సులలో నుండి తన కరుణను ఇలా చూపుతున్నది.

ఇప్పటికే రెండు మూడు క్వింటాళ్ళు వసూలు చేశారని తెలుస్తుంది. రేపటికల్లా సేకరించినవి వినుకొండ నుంఛి ఆత్మకూరు బస్సులో పంపాలని చూస్తున్నాను. ఆత్మకూరు సమీపం లో గోకవరం కేంద్రంగా కృష్ణ బాక్ వాటర్ లో మునిగి వున్న గ్రామాలలో సహాయ కార్యక్రమాలుచేపట్టి పడవలలో వెళ్ళి ఆహారం నీళ్ళూ అందిస్తున్న విశ్వహిందూపరిషత్ కార్యకర్తలకు ఇవి అందచేయనున్నాము. ఎందుకంటే రహదారి పక్కలున్న ప్రాంతాలకు ఎవరో ఒకరు సహాయం అందిస్తున్నారు . ఇలా మారుమూల వరదలో ఇరుక్కున్న గ్రామాలలో బాధితుల పరిస్థితి దయనీయంగా వుంది . వారికి పోలీసుల సహాయం తో పరిషత్ కార్యకర్తలు పడవలమీద వెళ్ళి ఆహార పదార్ధాలు అందించి వస్తున్నారు.


Read more...

సహాయం చేయటాన్ని ప్రచారవ్యాపారంగా మార్చుకోకండి .మీపుణ్యం వృధా అవుతుంది

>> Monday, October 5, 2009


దానం చేయటం గొప్పగుణం . త్యాగానికి గుర్తు. ఇతరులకు సహాయం చేయాలనే మహోన్నతగుణమే దానం .అంతే తప్ప మనం ఇతరులకు బిక్షవేస్తున్నాననే అహంకారం కాదు. కనుకనే మన ధర్మ శాస్త్రాలన్నీ కూడా దానం చేసిన వాడు దానిని చెప్పుకోరాదని సూచిస్తున్నాయి. కుడిచేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదని మన పెద్దలంటుంటారు.

ఇప్పుడు వరదా బాధితులకు సహాయం చేస్తున్న వారిలో కొందరి స్వోత్కర్ష చూస్తుంటే ఇది దానగుణమా? అనే సందేహం కలుగుతున్నది.
ఎక్కడ ప్రకృతి విలయాలు సంభవించినా ముందుండి సహాయకార్యక్రామాలను చేపట్టే ఆర్. ఎస్.ఎస్ వారిని చూడండి ఎక్కడా ప్రచారానికి అవకాశమివ్వరు . ఎవరు ఏమనుకుంటున్నారనేదానిని పట్టించుకొనక తమ ధ్యేయాని కనుగుణంగా పని చేస్తుంటారు.

కానీ పది పదిహేనువేల రూపాయలు ఖర్చు పెట్టి దానికి పదింతలు ప్రచారం పొందాలనుకునే వారిని చూస్తే నవ్వొస్తుంది.
టీ. వీ. తొమ్మిది వారి చేస్టలైతే మరీ ఘోరం . వారి టీము ప్రభుత్వం పట్టించుకోని.వెల్లలేని ప్రాంతాలకు కూడా వెళ్ళి సహాయకార్యక్రమాలు చేస్తున్నదట. వాల్లు ఆహారపొట్లాలు ఇతరత్రా అందించినది మాత్రం సైన్యం ,పోలీసుల వాహనాలలో వెళ్ళి మాత్రమే . కాని తమగూర్చి ఇలా గొప్పలు చెప్పుకోవటం చూసేవారికి అసహ్యం కలిగిస్తునదన్న సృహేలేదు వారికి వారిని పొగుడుకునే సమయం లో. అలాగే మరికొన్ని చానల్స్ కూడా . వీరి ప్రవర్తనను జనం అసహ్యించుకుంటున్నారన్న విషయం గమనించుకునే ఆలోచన వీరికి రాదిక.

సహాయం చేయండి .అది మరికొందరికి స్పూర్తి దాయకంగా వుండేవిధంగా ఇతరులకు తెలియనివ్వండి . కానీ దానిని ప్రచారవ్యాపారంగా మార్చుకోకండి . చేసిన పుణ్యమంతా పోతుంది .




Read more...

వీళ్ళేమి మనుషులండీ ? !


వరద ఉదృతితో జలాశయాలు ప్రమాదస్థాయికి చేరుకున్నాయి . ముందు వరదతో ముప్పు వచ్చింది . జలాశయాల వెనుక ముంపుకు గురైన ప్రాంతాలలో జనం విలవిల లాడుతున్నారు. ఈసమయం లో విలాసంగా జలాశయాల సౌందర్యాన్ని చూడటానికి పర్యాటకులు పెద్దఎత్తున వస్తున్నారని వార్తలు విని ,వీళ్ళుమనుషులా ? కాదా నే అనుమానం వస్తున్నది.

పొద్దస్తమానం టివీలలో వరద బాధితుల వేదనలను చూపిస్తున్నారు .అవిచూసీచూసీ బండబారిన గుండెలు కూడా కరిగి తమ కు తోచిన సహాయం చేస్తున్నాయి. కనీసం ఒక కన్నీటి బొట్టు రాలుస్తున్నాయి.
మరి జలాశయాల సౌందర్యాన్ని తిలకించాలనే ఈ మనస్తత్వం మనుషులదా రాక్షసులదా అర్ధంకావటం లేదు. సాటిమనుషులు బాధలోవుంటే సాయం అందించాల్సినది పోయి విలాసంగా పర్యటనలు సాగించగల వీళ్ళకు ఆబాధ తమకు స్వయంగా ఎదురైతేగాని తెలిసిరాదనుకుంటాను.
నల్గొండ ఎస్.పి. కఠినంగా హెచ్చరించారు . ఎవరూ పర్యాటకులు సాగర్ కు రావద్దని / ఒకవంక సహాయం అందించటానికి వాహనాల రాకపోకలకే రహదారులు సరిగా లేవు. దానికి తోడు ఈ పర్యాటకుల తాకిడితో ట్రాఫిక్ జామ్ అవుతున్నది. కాబట్టి ఎవరూ సహాయం చేయకపోతేమానె ఇలా మీపర్యటనలతో సహాయక చర్యలకు అడ్డుపడవద్దని మనవి.



Read more...

లోకరక్షణకై జగన్మాతను ప్రార్ధించండి

>> Friday, October 2, 2009

జలయప్రళయం రాష్ట్రాన్ని కుదిపి వేస్తున్నది. ప్రకృతి కోపగించినదా అన్నట్లు వాగులు పొంగి నదులు ఉరకలెత్తుతున్నాయి.
తమను అడ్డుకట్టలతో అడ్డుకోవటం ఎంత అసాధ్యమో నదీమతల్లులు భీకరరూపం చూపి భయపెడుతున్నారు .
ప్రాణాధారమైన నీటిని ప్రసాదించి .అన్నపూర్ణలా అన్నంపెట్టిన ఈ నదీమతల్లులకు తన ఒడిలోని బిడ్దలను కూడా కబళించే ఆగ్రహం ఎందుకొచ్చినదో తెలియదు.
ఈస్థితిలో ఆ నదుల ఉదృతిని అరికట్టేందుకు మానవ యత్నం మాత్రమే చాలదు . ఈ ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకుని ప్రసన్నతను పొందమని నదీపూజ చేయాలి. ఈ ఉపద్రవం నుంచి రక్షించమని ఆజగన్మాతను వేడుకుందాము అందరము. ఆపదలో వున్న వారిని ఆదుకోవటానికి మనకు సాధ్యమైన ప్రయత్నాలు వేగిరమే చేపడదాము.

ఓం శాంతి: శాంతి: శాంతి:

Read more...

నవరాత్రి పూజల వీడియోలు

















నవరాత్రి పూజల వీడియోలు






Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP