శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

గాణ్గాపూర్ లో జరిగే గురుపౌర్ణమి పూజకు మీగోత్రనామాలు పంపి పాల్గొనండి

>> Tuesday, June 30, 2009



పరమ పావనమైన దివ్యక్షేత్రము శ్రీగురుని లీలావిలాసభూమి గాణ్గాపురము. అక్కడ వసించిన శ్రీనృసింహసరస్వతీ యతీంద్రులు సాక్షాత్తు దత్తులు. వారి పాదస్పర్షతో పునీతమైన ఆదివ్యక్షేత్రం లో దత్తత్రేయుని పూజించటం జన్మ జన్మల పాపాలను తొలగించి తాపాలను నశింపజేసి సకల కోరికలను ఈడేర్చగలదని శీగురుచరిత్ర మనకు తెలియజేస్తున్నది.తాము అక్కడే గుప్తముగా వశించి భక్తులను కాపాడుతుంటామని సద్గురువులు సెలవిచ్చి యున్నారు.అటువంటి దివ్యక్షేత్రం లో గురు పౌర్ణమి రోజున శ్రీగురుని పూజించటం విశేష ఫలదాయకమని వేరు చెప్పాల్సిన పనిలేదు.
పరమేశ్వరానుగ్రహంతో ఒక సత్సంకల్పము కలిగినది. రేపు జూలై 7న గురుపౌర్ణమికి దత్తక్షేత్రమయిన గాణ్గాపూర్ వెళ్ళి అక్కడ నిర్గుణపాదుకలను దర్శించుకుని పూజించాలని . అయితే ఈకార్యక్రమాన్ని పదిమందితో కలసి పంచుకోవాలని సద్గురువుల సంకల్పము కాబోలు ,అందుకు ఒక ప్రణాళిక సిద్ధమైనది. సద్గురు భక్తులు ,పరమాత్మ స్వరూపులైన మీ అందరినీ ఈయాత్రకు రమ్మని ఆహ్వానిస్తున్నాము. అలా రావటానికి వీలు పడని భక్తులు కూడా తమ గోత్రనామాలను పంపించి మేము సూచించిన సూచనలను పాటిస్తే వారి తరపున కూడా అక్కడ శ్రీ గురు పాదుకలకు రుద్రాభిషేకము పూజా జరిపించదలచాము.అదికూడా క్షేత్రదర్శనమంతటి పుణ్యాన్ని ప్రసాదించగలదు.

మాతోపాటు రాదలచుకున్నవారు ,అలాగే తమతరపున అక్కడ పూజ జరిపించుకోవాలనుకున్నవారు తమ గోత్రనామాలను పంపి ఇంటివద్ద పౌర్ణమి వరకు ఈక్రిందవిధముగా సాధనలో పాల్గొనగలరు.

౧ . ఏడురోజులు ,సమయము చాలనివారు ఐదు రోజులు లేదా మూడు రోజులు సమయము లో గురుపౌర్ణమికి పూర్తయ్యేలా "శ్రీగురుచరిత్ర " గ్రంథాన్ని పారాయణం చేయాలి.[మీకు వీలుననుసరించి ఉదయము ,లేక సాయంత్రము గాని]
౨. ప్రతిరోజు శివలింగమునుగాని ,గురుపాదుకలను గాని లేక గురు ప్రతిమలను గాని అభిషేకించు కోవాలి . వీలైన వారు రుద్రసూక్తం చెప్పుకోవచ్చు ,రానివారు భక్తిగా "ఓం నమ: శివాయ " అనే మంత్రాన్ని జపిస్తూ అభిషేకం చేసుకోవచ్చు.
౩.పాటించగలిగినవారు ఒంటిపూట భోజనం ,భూశయనం ,బ్రహ్మచర్యం పాటిస్తే మరింత మంచిది.
౪. జూలై ఏడు న పౌర్ణమి రోజు దగ్గరలోవున్న ఏదైనా సద్గురువుల దేవాలయానికి లేదా శివాలయాని కెళ్ళి దర్శించుకుని ఒక కొబ్బరి కాయ సమర్పించుకోండి.,ఆరోజు ఆకలిగొన్న జీవులకు మీకు చేతనైనంత వరకు ఆకలి తీర్చటానికి ప్రయత్నించండి.
౫.ఈవారం రోజులు మీకెదురువున్నవారు పరమాత్మ స్వరూపులుగా భావించి గౌరవించండి . ఎవరినీ ధూషించవద్దు. ముఖ్య గమనిక మీఇంటికి వచ్చి బిక్షకోరినవారిని ఎవరినీ కసురు కొనక మీకు చే్తనైనంతలో భిక్షిచ్చి పంపండి.

ఇంకెందుకాలస్యం వెంటనే మాకు durgeswara@gmail.com కు మీ సమాచారాన్నివ్వండి. రాదలచుకున్నవారు ,ఏదైనా అనుమానాలున్నవారు నాఫోన్ లో సంప్రదించండి. 9948235641
పరమ గురువుల పాదసేవకు పోదాంరండి .సద్గురువుల కృపను చవిగొందామురండి.
ఈ సమాచారాన్ని మీకు తెలిసిన భక్తజనులందరకు పంపండి .



Read more...

గురువు ను గుర్తించటానికి దివ్యమైన మార్గం "గురుచరిత్ర " పారాయణం.




ఆథ్యాత్మిక మార్గం బహు క్లిష్టమైన దారి. దానిలోనుండి ప్రయాణించాలంటే అడుగడుగునా ఆపదలు కలగజేస్తూ మనలను పతనం చేయబూనే అరిషడ్వర్గాలనే ముష్కరులను ఎదుర్కోవాలి. మనము ఏచిన్న పొరపాటుకు ,కొద్దిగా ఏమరి పాటుకు గురైనా పూర్తి ప్రయత్నం వ్యర్ధమవుతుంది. కనుక ఈ మార్గం లో మనకు మార్గదర్శకుడు తోడుంటే ప్రయాణము సులభతరము. ఆమార్గదర్శకుడు,సర్వజ్ఞుడు,సర్వవ్యాపి ,సర్వ సమర్ధుడు అయిన వాడైతే సులభంగా ,నిశ్చింతగా ఆ మార్గాన్ని తరించగలము. ఆయనే సద్గురువు. అటువంటి పూర్ణగురుని ఆశ్రయాన్ని ఎలాపొందగలము? ముందు మనం ఆయనను వెతకాలి. పరిశీలించాలి .పరీ్క్షించుకోవాలి . ఆతరువాత ఆయనను నమ్మి సర్వస్వము ఆయనపై భారం వేసి ప్రాణాలు పోయినా ఆయన పాదాలను వదలకుండా పట్టు కోవాలి.అప్పుడు తల్లి పసిబిడ్డను పొత్తిల్లలో దాచుకుని సాకి రక్షించుకున్నట్లు గురుదేవుడు మనబాధ్యతలను తనపై వేసుకుంటాడు గనుక ఇక నిశ్చింతమే.


ఇక్కడే వున్నది చిక్కంతా . అసలు గురువును పరీక్షించి ఎన్నుకోవటం లోనే మన అజ్ఞానం అడ్డుపడుతుంది . మనం అజ్ఞానం లోవున్నాము కనుక సరైన నిర్ణయం చేయలేక సరైన గురువుని గుర్తించలేక ఆథ్యాత్మిక జిజ్ఞాసతో ఎవరినిపడితే వారిని గురువుగా ఎంచుకుంటే పరిస్థితి ప్రమాదకరం గా వుంటుంది. ఏ చమత్కారాలకో మాయలకో భ్రమసి సమర్ధులు కానివారిని స్వయంగా తామే తరించని వారిని ఆశ్రయిస్తే గుడ్డివాడి చేయి మరొక గుడ్డివాడు పట్టుకుని నదిని దాటాలని ప్రయత్నించిన చందంగా తయారవుతుంది స్థితి. అసలు మన గురువు దయ మనపై ఎప్పుడూవుంటుంది .కాని ఆయన కృపను మనం పొందగలిగే సంస్కారాల ఆచరణ లోపంతో మనం ఆయనకు దూరంగావున్నాము. అందుకే అంటారు శ్రీరామకృష్ణులవారు. గురువు అనుగ్రహాన్ని పొందే అర్హత నువ్వు సాధించుకుంటే దూడదగ్గరకు ఆవు పరిగెత్తు కొచ్చినట్లు ఆయనే మనలను వెతుక్కుంటూ వస్తారు అని. ఆ అర్హత సాధించటమెలా?.
దీనికి సులభమైన మార్గం మహాత్ముల చరిత్రల పారాయణం . ఆ దివ్య చరితలు చదువుతూవుంటే మన మనస్సు శుద్ధమై గురువు అనుగ్రహాన్ని గ్రహించడానికి వీలయినంతగా తయారయి సద్గురువు ను మనవేపుకు పరుగులు పెట్టిస్తుంది. కనుక గురు కథా చరిత్ర లలో కెల్లా వుత్తమమైన శ్రీ గురు చరిత్రను పారాయణాము చేస్తూ వుంటే మన ఆచరణ సంస్కరించబడి ఆయన ప్రేమకు పాత్రమవుతాము. వీతితోపాటు వీరబ్రహ్మేంద్రులు,సాయినాథులు ,రాఘవేంద్రులు,స్వామి సమర్ధ ఇలా... మహాత్ముల చరిత్రలను చదువుతూ వుంటే ఆమహనీయుల దయతో మనమనస్సు మరింతశుద్ధమై గురువును సులభంగా చేరగలము తప్పిపోయిన బిడ్డ తల్లిని చేరినట్లు.

జులై ఏడవతేదీ గురు పౌర్ణమి గనుక సద్గురువుల చరిత్రలను పారాయణము చేసి మీమీ గురువుల అనుగ్రహాన్ని పొందాలని మనవి.[వాస్తవానికి గురువొక్కడే ,కాని మన మనోభావలననుసరించి ఆయన మనకు భిన్నంగా గోచరిస్తున్నాడు .భిన్నమ్గా దర్శనమిస్తున్నాడు.]
శ్రీదత్తాయ నమ: శ్రీశ్రీపాద శ్రీ వల్లభాయనమ: శ్రీనృసింహ సరస్వత్యై నమ:

Read more...

దైవాన్ని ,ధర్మాని విమర్శించేప్పుడు తేలికే ,ఫలితం అనిభవించేప్పుడు గాని తెలియదు ,ఎంతఘోరంగా వుంటుందో?

>> Friday, June 26, 2009

దైవాన్ని ,ధర్మాని విమర్శించేప్పుడు తేలికే ,ఫలితం అనిభవించేప్పుడు గాని తెలియదు ,ఎంతఘోరంగా వుంటుందో?

నేను ఈ వివాదం లోకి రావటం సముచితం కాదని మిత్రులు కొందరు సూచించారు . నేనిప్పటివరకు ఇటువైపు రాలేదు ,నాకు చేతనైన సహాయం చేయగలిగితే చెయటమేగాని. ఈరోజు తురీయం అనే బ్లాగులో నన్ను ప్రస్తావిస్తూ కత్తి మహేష్ గారు ఒక కామెంట్ వ్రాయటం తో వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
ప్రతి వ్యక్తికీ తన తన సంచిత ప్రారబ్ద ,ఆగామి కర్మలననుసరించి కొంత సుఖం,సంపద ,సంతోషాలు ప్రాప్తిస్తాయి. చెడుఖర్మలవలన లభించే కష్టాలు,దు:ఖాలు కూడా తప్పనిసరి అప్పులే. ఇక చేసే కర్మలు మంచివయితే అదనంగా శుభాలు జమపడుతూవుంటాయి. అలాగే చెసే చెడు ఖర్మలవలనా అప్పులు పేరుకు పోతుంటాయి. తనకు వచ్చిన శుభాలు ,సంపదలు సంతోషాలు ఎలావచ్చాయో తెలిసినా తెలియకున్నా వివేకవంతుడు భగవంతుని పట్ల ధర్మము పట్ల సాటి జీవరాశి పట్ల వినయాన్ని ,గౌరవాన్ని కలిగి వుంటాడు. ఇక మాయ కు లోనైన జీవి ఇదంతా తన స్వయంకృషి తోనే సాధించాననే భ్రమలో వుండి తనమనస్సు చెసే మాయలకు లోబడి అహంకార పూరితుడవుతాడు. విదురనీతి లో కూడా ఒక పద్యం లో ఈవిషయాన్ని చెబుతాడు . సంపద, కులము,విద్య,ధనము పదవి .సాత్వికునికి వినయాన్ని వివేకాన్ని తెస్తే ,దుర్మార్గుడికి అహంకారాన్ని గర్వాన్ని తెచ్చి పెడ్తాయని.

ఒక పక్క వాని పుణ్యసంచయనం వలన లభించిన సుఖాలనే సంపద ఖర్చయి పోతూవుంటుంది. అప్పటిదాకా తీర్చాల్సిన అప్పు వున్నది కదా అది సమయం చూసుకుని వసూలు చేయటానికి సిద్ధంగావుంటుంది. దాని ప్రభావం వలన అహంకార పూరితుడైన మానవుడు ,కన్నూమిన్నూ గానక భగవంతుని ,ధర్మాన్ని విమర్శిస్తూ పాపపు రాశి పెంచుకుంటాడు. అది పెరిగి పెరిగి పెద్దదై తన పుణ్యఫలము ఖర్చైపోయిన క్షణం నుంచి మొదలవుతాయి .దు:ఖాలు. వాటిని అనుభవం లో భరించలేక విలవిలలాడుతుంటాడు. శుభాలన్నీ తనవల్లనే సంపాదించుకున్నానని నమ్మే మనిషి కష్టాలను కూడా తానే కొనితెచ్చుకున్నానని అగీకరించడు. అహంకారం తో దైవ దూషణ ధర్మ ధూషణ,సాధు దూషణ ,ఇతరుల మనసు నొప్పింఛే పనులు వీటివలన వచ్చే ఫలితాలు అనుభవించే నాడు విలవిల లాడుతూ మూర్ఖం తో పరనింద చేస్తూ పాపాన్ని ఇంకా పెంచుకుంటాడు. అప్పుడైనా ఏ పుణ్యఫలము తోనో భగవంతుని ప్రేమకు పాతృడైతే తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాప పడతాడు. తన ఖర్మ ఫలితాన్ని అనుభవించి అప్పుతీర్చుకుంటాడు.ఆయన కరుణ వుంటె రక్షింపబడతాడు కూడా .
ఇక అది తెలియని వాడు తన కష్టాలకు వేరెవరో కారణమని ఇంకా దౌర్భాగ్యపు పనులకు పాల్పడుతూ పతనం చెందుతుంటాడు.మరలమరలా నీఛ జన్మల నెత్తుతూ ఫలితాన్ని అనుభవిస్తుంటాడు.
ఇందులో కొన్ని ఫలితాలు సత్వరంగా కనిపిస్తే ,మరికొన్ని కాయపండి రాలి నట్లు ఆలస్యంగా అనుభవం లోకొస్తాయి.
నేను ప్రత్యక్షం గా చూసిన మూడు సంఘటనలను మీకు మనవి చేస్తాను.

మావూరిలో వెంకట రెడ్డి అనే అతను వున్నాడు .నాచిన్నతనం లో అంటె పదేళ్లలోపు లో అతను నిండుయవ్వనం ,మదగర్వం తో వున్నాడు రాములవారి మేడదగ్గర ఏదో సంభాషణ వాదనగా మారి పెద్దలతో దేవుడా గీవుడా ..ఎక్కడ నా ...... లో దేవుడు .అని బూతులు మాట్లాడుతూఏదీ ఏమిచేస్తాడో చూపించమని గర్వంగా మీసం మెలేసాడు. అక్కడ పెద్దవాల్లు కొందరు మౌనంగావుండగా మరికొందరు ఏదో అన్నారు. నేను ఇంటి్ లో కొచ్చి అడిగాను అమ్మా ! వెంకటరెడ్డి మామ దేవుడ్ని తిట్టాడుకదా ! దేవుడ్నితిడితే కల్లు పోతాయంటారు కదా ? మరి ఆయనకి కల్లు పోలేదే?అని .దేవుడన్నీ చూస్తాడురా అని సమాధానం మాపెద్దలు చెప్పినా నాకంతగా అర్ధం కాలేదు. దేవుడ్ని తిడితే వెంకటరెడ్డిమామకు కల్లు పోలేదెందుకని ?అలాప్రశ్న మిగిలి పోయింది. పాతికేళ్ళతరువాత అప్పుడు చూపించింది సమాధానం ప్రకృతి . ఆయన పెద్దవాడయ్యాడు. ఈమధ్య ఆయన నాలుకకు ఏదో గడ్డలాగా లేస్తే అనేక రకాల వైద్యాలు చేసి తగ్గక ఆబాధభరించలేక విలవిల లాడి పోయేవాడు. చివరకు గుంటూరు లో డాక్టర్లు అది కేన్సర్ గడ్డగా గుర్తించి ఏ నాలుకతో నైతే భగవద్దూషణ చేసాడో ఆనాలుకను కోసి చికిత్స చేశారు. ఇప్పుడు మాట్లాడలేడు . కాని యవ్వనం లో గుడివైపు చూడనివాడు .ఎప్పుడన్నా రాములవారి మేడలో భజన జరుగుతుంటె వచ్చి బయటె నిలబడి మౌనంగా వింటుంటాడు.

ఇక మావూరిలో నా సహవయస్కుడొకడున్నాడు .వానికి నామీద చిన్నతనం లో ఆటలనుండి కోపం ఎందుకో తెలియదు. నావయస్సు వారిలో నాకొక్కనికే వుద్యోగం వచ్చినది. అదొక అసూయ . తిరుణాల్లలో డాన్సులకు చందాలు వసూలు చేస్తుంటె నేనివ్వను ,అది దైవాని కి ఏమాత్రం ఇష్టం కాని పని అని వాదించాను. ఆసందర్భంగా వాడు నాతో నీవొక్కడివే పెద్దభక్తునివా అని వాదన వేసుకున్నాడు. ఆమంటతో ఒకసారి రాష్ట్రవ్యాపితంగా జరుగుతున్న కోటి చాలీసా కార్యక్రమము గూర్చి నేను బజారు లో నిలబడి కొందరి తోమాట్లాడుతూ వారికి కార్డులు ఇస్తున్నసమయం లో వచ్చి తగాదా వేసుకున్నాడు. తిరుణాళ్ళకు చందాఇవ్వమంటె ఇవ్వవు ,చాలీసా బోడి........ బూతులు మాట్ళాడుతూ వాడీష్టమొచ్చినట్లు మాట్లాడాడు. పక్కనున్నవారు ఆగుఆగు అని వారిస్తున్నా వినకుండా ఆరోజు వాడిమనసులో కసి తీరా నన్ను తిట్టాలనుకుని భగవంతుని తిట్టాడు ఆవేశం తో .అప్పటివరకు వాడు పాలకేంద్రం ,మిగతావ్యాపకాలతో బాగా సంపాదిస్తున్నాడు. నీకిష్టమైతే చేయి లేకుంటే లేదు అంతేగాని మాటలెందుకురా అని నేను అక్కడనుండి వచ్చేశాను. తరువాత నెల రోజులకు వినుకొండనుంచి వస్తుంటే మోటర్ బైక్ పడి ప్రమాదకరమైన దెబ్బలు తగిలాయి . మొన్న వీడు అనవసరంగా భగవంతుని తిట్టాడు ,అందుకే అని కొందరన్నా నేను వారించాను తప్పు కష్టాలలో వున్నవాన్ని అలా బాధించకూడదు అని. ఆతరువాత వానికి మండు అలవాటయింది, దానికి తోడు పరస్త్రీ వ్యామోహం ,వీటితో సంపద నశించింది. కుతుంబము లో కలతలు ,అప్పులు నాలు గేళ్ళలో దిగజారి పోయిం<ది స్థితి .బాగు పడతాడని అయ్యప్పమాల వేస్తే మాల లోనే తాగి దరిద్రం పట్టించుకున్నాడు. చివరకు భార్యకూడా వదలి వెళతాననే పరిస్థితి. చావాలనే ప్రయత్నం కూడా. కూడా .ఏదో ఆ అమ్మాయి పుణ్యం వలన మరలా మాల వేపించినతరువాత కొద్దిగా కోలుకున్నాడు. ఆతరువాత ఇక్కడ పీఠము లో అన్నదానం జరుగుతుంటె వచ్చి దుర్గా ! ఒక్కరోజు నాతరపున స్వాములకు అన్నదానం చేయనివ్వు ,నాదగ్గర కొద్దిగా డబ్బుమాత్రమే వున్నది సరి పుచ్చవా అని అడిగాడు. దాని దేముందిరా నీకు దీనివలన మంచి జరుగుతుందని నమ్మితే అలాగే చేద్దాము అని అతని చేత అన్నదానం చేపించానొక రోజు. ఆతరువాత పరిశ్థితి క్రమేపీ కోలుకుని ఇప్పుడు బాగుంది అతని స్థితి .చక్కగా పూజా పునస్కారాలు చేసుకుంటూ ఇంతకుముందు కొంగరి మాటలు తగ్గి అందరితో మర్యాదగా వుండటం నేర్చుకున్నాడు.

ఇక వుద్యోగం లో నాతో పాటు చేరిన విజయకుమార్ అనే మిత్రుడొకాయన వున్నాడు.నన్ను బావా ,బావా అని పిలుస్తాడు. కిరిస్తానీ. ఆయన నాతో స్నేహంగానేవుంటడు కానీ హిందూ మతమన్నా ఈ ఆచారాలన్నా మంట. సందొస్తే చాలు నన్ను నా ఆచారాలను విమర్శిస్తుంటాడు. మా నాయనమ్మ వాల్లు కూడా ఇలా పూజలు పునస్కారాలు చేసి .......... అనవసరం ఈపిచ్చిపనులు ఇలా వుంటాయి ఈవ్యాఖ్యలు. ఏమిటీ రాయిరప్పనీ పూజించటం ,స్నానం చేయకుండా వండితే నువ్వు తినవా ? ఇలా అతని మనసులో ద్వేషాన్ని వెల్లగక్కుతుంటాడు, నేనెన్ని విధాలుగా వివరించాలని ప్రయత్నించినా అవన్నీ ట్రాష్ అంటాడు. చూడు విజయకుమార్ ! నీవు నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించు .రోజుకు పదిసార్లు ప్రేయర్ చేయి .తప్పులేదు అది నీకు మంచిది . కానీ నీకు తెలియని విషయాలను గూర్చి ఇతర మతాలను గూర్చి ,తప్పుగా మాట్లాడకు అది చెరుపు చేస్తుంది అనీ హెచ్చరి
ంచేవాడిని. కానీ అతని పరమత విద్వేషం దాచుకోలేడు. మా బైబిల్ చదువు ,నీపూజలు మానుకుని ఇది అచరించి చూడు అని బోధించటం ఎక్కువైంది. మీతో ఇదేతంటా ! పరాయి మతానికి మారగనే మనుషులు దేవుడిని నమ్మటమేమోగాని హిందూ ద్వేషులుగా ,ఈదేశానికి చెందనివారిగా భావిస్తారా? అసలు చర్చిలలో మీకు భవత్ సాధనలు నేర్పుతారా ? లేక ఇతరులను ధూషించటం నేర్పుతారా? నాకు తెలిసిన ధర్మం లో దోషాలేమీ లేవు నేనామార్గం లో చక్కగా సాగుతాను నీబోధలు ఆపు అని కసురు కునేవాడిని. మీరు మూర్ఖులు ! సత్యం తెలియదని మాట్లాడేవాడు. అయితే అతను ఇతరులకు సహాయపడటం లోను స్నేహం లో వ్యక్తిగతంగా మంచివాడవటమ్ వలన నేను స్నేహం వదులుకోలేక పోయేవాడిని మాయింటి కొచ్చి మా ఆవిడను అక్కా ! అని పిలిచి అన్నీ అడిగి వడ్డించుకుని తినేవాడు స్వతంత్రంగా. సమాజం లో మమ్మలను ఇలా తక్కువ చెశారు అలాచేశారు అని ప్రశ్నిస్తే , నేము చెప్పేవాడిని , ఇవి సామాజికంగా మనుషులు ఏర్పరచుకున్న అసమానతలు వాటిని మనుషులే దిద్దు కోవాలి.అనాదిగా మహాత్ములెందరో ఆప్రయత్నాలు చేస్తూనే వున్నారు. అమెరికాలో పుట్టుకతో క్రిష్టియన్లైనా నల్లవారిని తక్కువగనే చూస్తారు. ఆ అసమానతలు బాపటానికే మార్టిన్ లూథర్ కింగ్ లాంటివారు పోరాడినది.కానీ వారు మతం మార్చుకోలేదు. అలా పోరాడటం మనహక్కు ,మనమే పరిష్కరించుకోవాలి.అంతే గాని దానిని దేవునికి మతానికి ఆపాదించి ధర్మ ద్వేషులుగా మారిపోవాలా? తద్వారా మనవారి పట్లనే అంతర్గతం గా శతృత్వం పెంచుకుని దైవనిందచేస్తూ పాపం రాశి పోసుకోరాదు అని వివరించేవాడిని .కానీ వాల్లకు నరనరాల్లో ఎక్కించిన హిందూద్వేషం నుంచి బయట పడలేక పోయేవాడు. నేను హెచ్చరిస్తున్నా వినకుండా దైవధూషణ చేసేవాడు కొద్దిగా వాదనయ్యేది. ఆతరువాత మామూలు మాటలలో కలసి పోయేవాడు.ఇది చాలాపాపం నీకు ప్రమాదమని హెచ్చరించినా వినేవాడు కాదు నేనే ఆ వాదన తుంచేవాడిని.
భార్యభర్తలిరువురూ ఉద్యోగులు ఇద్దరు పాపలు .ప్రైవేట్ కాలేజీలలో ఇంటర్ వాల్లకు క్లాసులు చెప్పి అదనంగా సంపాదిస్తాడు. స్థలాలు బంగారమ్ కొన్నాడు . అతని దైవధూషణాఫలితం ప్రభావం చూపించటం ప్రారంభించినది. అనుకోకుండా అతని చెల్లెలిని వాల్ల బావగారే హత్య చేయటం ,ఆషాక్ నుంచి తేరు కోకముందే భార్యా భర్తావిబేధాలు . మీ అమ్మగారిని మనైంటికి తీసుకు రావద్దని ఆంక్షలు. ట్రాన్స్ఫర్ల సమయం లో విబేధాలొచ్చి గొడవజరిగితే నేనే సర్ది చెప్పి అతను ఆఅమ్మాయి కోరుకున్న విధం గానే వాల్ల అత్తగారి ఊరికే కోరుకునేట్లు ఒప్పించాను. ఆమధ్య ఫోన్ చేసి నువ్వు నామాట వినకుండా ఇక్కడకు పొమ్మని ఆరోజు సర్ది చెప్పావు, నా బాధ ఏమని చెప్పుకోను ఇక్కడ మా అత్తగారు ,భార్యనుంచి నరకం చూస్తున్నాను,నా చావు కబురు వింటావుఅని ఫోన్ లో బాధపడుతున్నాడు.ఏంతక్కువచేసానని నాకీ నరకం అందరికంటె ఎక్కువగానే సంపాదిస్తున్నాను. అడిగనివన్నీ చేపించాను ,నేను తాగు బోతునో తిరుగుబోతునో కాదు నాసంగతి నీకు తెలుసుకదా ? ఎందుకు నాకీ బాధ అని వాపోతున్నాడు. బాధలో వున్నవాడితో నీవు చేసుకున్న దైవదూషనే అని చెప్పలేనుకదా ? రెండేళ్ళు నరకం అనుభవించాడు .వాల్ల అత్తగారి తరపువారితో తన్నులు కూడా తిన్నానని విలపించాడు. చివరకు విడాకులు తీసుకోబోతున్నామని బాధపడ్డాడు.నాకోశం ఏదన్నా పూజలన్నా చేయవయ్యా అని. నేను అప్పుడు చెప్పాను పిల్లలు అన్యాయమవుతారుమీరు విడాకులు తీసుకుంటే.. మనం చేసుకున్న పాపాలే ఇలా బాధలుగా వస్తాయి గుర్తు చేసుకో అని . నీవు నిష్టగా ప్రార్ధనలు చేయి నీకోసం నేను ఇక్కడ అభిషేకాలు చేస్తాను అని చెప్పాను. ఆతరువాత అతని స్థితి ఏదో సర్దుబాటయినదని చెప్పాడు. నన్ను ఒకసారి వచ్చిపొమ్మంటున్నాడు గాని వీలుగావటం లేదు. ఇక దైవదూషణకు పాల్పడడని నానమ్మకం.

ఇక నా స్వవిషయము లోనైతే తీవ్రమైన వేగం తో అనుభవానికి తెస్తున్నది" అమ్మ’ పాపపుణ్యఫలితాలను.
గుడివద్ద గుంతచేసి పనుకున్నదని రాయి వేసినందున "కుక్క" కాలువిరగగా పడ్దబాధను నాకు మూడు నెలల్లోనే యాక్సిడెంట్ రూపంలో కాలి ఎముకలు చిట్లి ఆబాధ కు విలవిల లాడేలా చేసి ఇతర జీవికి కలిగించే బాధకు పర్యవసానమేమిటో బోధించింది . కనుక మానవ జన్మ ఎత్తినందుకు జ్ఞానాన్ని పెంపొందించుకుని సన్మార్గం లో నడుద్దాము. దైవదూషణ ధర్మ దూషణ చేసి లేని కష్టాలను తలకెత్తు కోకుందుముగాక.మాబుద్ధులను సత్యమార్గం లోనడపమని గురు పరంపరను వేడుకుంటూ ...............................
దుర్గేశ్వర

Read more...

గురు పౌర్ణమిని ఇలా సద్వినియోగం చేసుకుందాము

>> Thursday, June 25, 2009



ఒకే కాలంలో ఎందరుజ్ఞానులైన గురువులున్నా ,వారి శిష్యులమధ్య ఎట్టి వైరుధ్యాలుఉ,ప్రాచీన కాలం లో రాకపోవటమే ఆశ్చర్యం. ఒకానొక ఉత్తమ సాంప్రదాయమే అందుకు కారణం .తేనెటీగవేరువేరు పువ్వులనుండి తేనెను సేకరించినట్లు ,జ్ఞానప్రియుడైనశిష్యుడు కూడా అనేక మంది గురువులనుండి జ్ఞానమార్జించాలని గురుగీత చెబుతున్నది. ప్రతిజ్ఞానీ తన శిష్యులను ఇతర గురువులనుండి గూడా జ్ఞానమార్జించాలని ఆదేశించేవారు. శ్రీకృష్ణుడు అర్జునుని [4:34] భగవద్గీతలో అలానే ఆదేశించారు. రఘువంశగురువైన వశిష్ఠుడు రాముణ్ణి విశ్వామిత్రుని తో పంపాడు .వ్యాసుడు శుకుణ్ణి జనక మహారాజ్ వద్దకు పంపాడు. రాముడూ అరణ్యం లో ఋషులందరినీ సేవించాడు. భాగవతం లో [11వస్కంధం] అవధూత 24 మంది గురువులనుంచి జ్ఞానమార్జించినట్లు చెప్పుకున్నాడు.. ఇందువలన వేరు వేరు గురువుల రూపాలు విధానాలు వేరు జాతుల పువ్వులలాగా స్థూలదృష్టికిభిన్నంగా కనిపించినప్పటికి వారందరి లో వున్న జ్ఞానమనే తేనె ఒక్కటేనన్న వివేకం శిష్యులకు కల్గుతుంది. అప్పుడె సాంప్రదాయ బేధాలు,తగవులు వుండవు. "ఆనోభద్రా:క్రతవోయన్తు విశ్వత:" ఉత్తమమైన భావాలు మాకు అన్ని దిక్కులనుండి లభించుగాక !అన్నదే వేదఋషుల ప్రార్ధన .

ఇలా అనేక మంది మహనీయులను సేవించగలగాలంటె మొదట ఈసూత్రమెంత ప్రశస్తమైనదో తెలుసుకుని,దాని పట్ల అత్యంత శ్రధ్ధకలగాలి. తరువాత పూర్ణులైన మహనీయులెలా వుంటారో తెలుసుకోగలగాలి. లేకుంటే ఆథ్యాత్మికవిద్యమీద ఆశతో ,మహనీయులమై చెప్పుకునే ప్రతివారినీ ,నమ్మి సేవించి అన్ని విధాలా ప్రక్కదారి పట్టే ప్రమాదముంది. అందుకే ఇలాంటి సంస్కారాలు ధృఢంగా నాటుకోవడానికి వ్యాసుడు "భాగవతం లో ’ అనేకమంది మహనీయుల చరిత్రను పొందుపరచాడు. తమిళ దేశంలో "పెరియపురాణ"మనే గ్రంథం లో అరవై ముగ్గురు శైవసిధ్ధులను గూర్చి చదువుతారు. అలానే ఆళ్వారులు అనే పన్నెండు మంది మహాత్ముల చరిత్రలు పారాయణం చేస్తారు. మహనీయులు మరణానికి అతీతులు గనుక ,వారి చరిత్ర భక్తితో పారాయణం చేసేవారికివారి అనుగ్రహం నేటికి కూడా లభిస్తున్నది. ఇక ఏదురోజులలో మరణిస్తాడనుకున్న పరీక్షత్తుకు అందుకే శుకయోగి వేరే సాధన చెప్పక భాగవత శ్రవణం మాత్రమే చేయించాడు. విజయానందుడనే సన్యాసి మరణించనున్న రోజులలో శిరిడీ సాయి బాబా కూడా తరింపుకు భాగవత పారాయణ మే చేయించారు.

ఈఉత్తమ సత్యాని గుర్తించకుంటే శుకుడు ,సాయి బాబా లకంటే మనకే ఎక్కువ తెలుసనుకుని భ్రమించి అనేమంది మహనీయుల చరిత్రపారాయణమనే సాటి లేని సాధనమును మనం అలక్ష్యం చేస్తాము. మహాత్ముల చరిత్రలు,బోధనలను శ్రద్దగా పారాయణం చేయటం వారి ప్రత్యక్ష్యసాన్నిధ్యం తో సమానం. శ్రీ రమణ మహర్షి కూడా ఇలా సూచించారు. వెంకయ్య స్వామి వారు కూడా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రులవారిచరిత్ర చదవమని తన భక్తులతో చెప్పారు. వీర బ్రహ్మం గారు కూడా తాము దత్తావతారమని కాలజ్ఞానం లో చెప్పారు. రెండవ దత్తావతరమైన శ్రీ నృసింహ సరస్వతి తమగురించి శ్రీగురుచరిత్ర రూపములో తామే వుంటామని ,అది పారాయణ చేసినవారికి ఇహపర శ్రేయస్సు ,తమ అనుగ్రహం కలుగుతాయని ప్రమాణం చేసి చెప్పారు. ఇతర మతాలలో గూడా ఈ సాంప్రదాయమే వున్నది. బైబిల్,మరియు ఖురాన్ లలో ఎక్కువ భాగం ఆయా జాతులలో వెలసిన మహనీయుల చరిత్రలుంటాయి.అందుకే ఆయా మతస్థులు వాటిని శ్రద్ధగా చదవాలని విధించారు. అందుకే రానున్న గురు పూర్ణిమకు[జులై 7 ] అరమరికలు లేక అందరూ మహాత్ముల చరిత్రలు పారాయణ చేసుకోండి. .

జయగురుదత్తా

[ఆచార్య భరద్వాజ గారి రచనలనుండి]

Read more...

హనుమంతుని భక్తజన పాలనకొక ప్రత్యక్ష ప్రమాణం ఇదిగో !

>> Wednesday, June 24, 2009

భక్త జనపాలకుడైన హనుమంతుల వారు ప్రయాణించటం లోనే కాదు భక్తుల పాలించటం లోనూ తన వేగాన్ని ఈ చర్యద్వారా నిరూపించారు. చూడండి ఆయన భక్తుల పట్ల ఎంత కరున కలిగి వున్నారో.

మావూరిలో శ్రీనివాసరెడ్డి అనే యువకుని కుమారుడు చదువుతున్న రెసిడెన్షియల్ స్కూల్ నుంచి పారిపోయా
డని ,ఆతల్లిదండ్రుల దు:ఖాన్ని చూడలేకపోతున్నామని మొన్న పోస్ట్ లో వ్రాసాను కదా. ఇక చదవండి.
మంగళ వారం అంటే నిన్న ఉదయాన్నే అతను పీఠము వద్దకు వచ్చాడు. ఈ రోజు నూట ఎనిమిది సార్లు చాలీసా పారాయణము చేయమని చెప్పానుకదా! కాని అతను చేయలేనన్నాడు. బావా ! నాకు కాలి మీద గడ్డపార పడటం వలన అప్పటి నొప్పి ఎక్కువ సేపు కూర్చుంటే తిరగ బెడుతున్నది. నూట ఎనిమిది సార్లు చేయలేను అన్నాడు. సరే ! నీకు సాధ్యమైనంత సేపు చేయి అని చెప్పాను. అతను నిష్ఠగా స్వామి వారికి అభిషేకము చేసుకుని ఆయన దగ్గరే కూర్చుని ఎంతో ఆర్తితో స్వామిని వేడుకుంటూ పారాయణం చేసాడు ,తదనంతరం ప్రదక్షణలు చేసాడు. ప్రస్తుతం పారి పోయిన వాని జాతకం లో శుక్ర మహా దశ లో శని అంతర్దశగా జరుగుతున్నదని చెప్పారు ,కాబట్టి శని దోషనివారణార్ధం గంగ సింధూరం లో నువ్వుల నూనె కలిపి హనుమంతునికి అభిషేకము చేయమని చెప్పి చేపించాను.తరువాత రుద్రభిషేకము లో నూపాల్గొన్నాడు. అక్కడ మాఊర్లో అతని భార్య కూడా ఊరిలోవున హనుమదాలయం లో తెల్లవారు ఝాముననే ప్రదక్షినలు ప్రారంభించినదట. ఒరే అబ్బాయి ! తల్లి బాధను అసలు చూడలేడు స్వామి . కనుక నీసమస్యను ఆయన తప్పక తీరుస్తాడు చూడు అని చెప్పాను.
చిత్రాతి చిత్రం గా ఆయన మహిమ ఎంత వేగంగా ప్రసరించినదో చూడండి. నిన్న సాయంత్రం ఏడుగంటల సమయం లో ఆపారి పోయిన పిల్లవాడు ,తిరుమల నుండి ఫోన్ చేసి నేను గుడివద్ద వున్నాను అని చెప్పాడు. వీళ్ళు నువ్వు అక్కడనేవుండరా అని చెప్పి వీళ్ళు నాకు ఫో్న్ చేసి చెప్పిఎంతో ఆనందం తో స్వామి మహిమను మరి మరి పొగిడారు. అదృష్ట వశాత్తూ వీళ్ళ బంధువులు తిరుమల వెళ్ళినట్లు తెలిసి వాల్లకు ఫోన్ చేసి మన పిల్లవాడి ఇలా ఫోన్ చేసాదని తెలియ జేశారు. అక్కద వాళ్ళు పోలీసులకు తెలియజేసి అనౌన్స్మెంట్ చేసి మొత్తానికి పిల్లవాన్ని పట్టుకున్నారు.దిగువతిరుపతికి వచ్చాము అని చెప్పారు. ఇక్కడనుండి రాత్రే ఒక జీపు మాట్లాడుకుని మాతమ్ముని కూడా తీసుకుని పదిమంది దాకా తిరుమల వెళ్ళారు. ఇప్పుడే ఫోన్ చేశారు .కాణిపాకం వెళ్ళివచ్చి మరలా తిరుమల స్వామి వారిని దర్శించుకునేందుకు వెళుతున్నాము అని చెప్పారు.
కూడూ నీళ్లు లేకుండా పది రోజులుగా ఏడ్చి ఏడ్చి కుంగి పోయిన ఆతల్లి ముఖం లో ఆనందం పొంగి పొరలుతోంది .తనబిడ్డను చూడాలని తల్లడిల్లుతున్నది. నిజంగా స్వామి మహిమను తలచుకుని మాకు నోటమాట రావటమ్ లేదు.
ఈ బిడ్డ మరలా తల్లిదండ్రులను చేరాలని కోరుకుని స్వామిని ప్రారధించమని కోరాను మిమ్మలను .మీలో వున్న భక్తుల ప్రార్ధనలు ,స్వామి దయ ఆతల్లి కడుపు శోకాన్ని ఉపశమింపజేసాయి . మీకు ,స్వామికి మరలా మరలా ప్రణామాలు తెలియ పరచుకుంటున్నాను.

నీవు సీతాశోక నివారకుడవు. అంటే జగన్మాత శోకాన్నే నివారించిన నీవు ఈ తల్లి శోకాన్ని నివారించావంటె చిత్రమేమున్నది. ధన్యమైనది స్వామీ నాజన్మ ,నీమహిమను మరొకసారి లోకానికి చాటిన ఈ సన్నివేశము లో పాల్గొని.



Read more...

ఈ తల్లిదండ్రుల దుఃఖాన్ని తొలగించు స్వామీ !

>> Monday, June 22, 2009

దు:ఖం మనిషి వివేకాన్ని నాశనం చేస్తుంది. దు:ఖసమయాన తన సర్వ శక్తులను కోల్పోయినట్లు గా భ్రమపడి మనిషి పతనమవుతున్నాడు. దీనిని మనిషి గమనించు కోవాలి .లేకుంటె ఆపదలు అవసరము లేదు కేవలము దు:ఖమే మనిషిని చ్యుతుని గావిస్తుంది. ఈవిషయాన్ని గమనించమనే పురాణేతిహాసాలు అనేక ఉదాహరణలతో ఆమనలను హెచ్చరిస్తున్నాయి.
నావద్దకిప్పుడొక చిన్న సమస్య వచ్చినది. దాన్ని పరిష్కరించాలంటే ఆ సమస్యకు గురైనవారు మెలకువగా వుండాలి. కాని దు:ఖముతో వారికి చీకట్లు కమ్మినట్లై వున్నది. దానినుండి బయట పడాలంటే వారి ప్రయత్నమే ఆధారము .కాని దు:ఖాతిరేకముతో వారి మనస్సు చంచలమై వున్నది .మామూలు మాటలతో వారిని సంతృప్తపరచలేము. మాయమాటలు చెప్పి వారిని పక్కదారి పట్టించనూ లేను. నాకిదొక సమస్య.
విషయమేమిటంటే మావూరిలో ఒక యువ దంపతులకొక సమస్య వచ్చిపడింది. వాల్ల పెద్దబాబు మానసికంగా కొద్దిగా అమాయకంగా వున్నట్లగుపిస్తాడు. ఇద్దరు పిల్లలను వినుకొండలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో చేర్పించి చదివిస్తున్నారు. వారం రోజులక్రితం పెద్దవాడు అక్కడనుండి ఎటో వెళ్ళి పోయాడు. తెల్లవారాక చిన్నపిల్లవాడు తన అన్న కనపడటం లేదని చెప్పినదాకా ఆ పాఠశాలనిర్వాహకులకు విషయం తెలియదు. ఇక వాళ్లబంధువులంతా అన్ని వైపులకు వెళ్ళి వెతుకుతున్నారు . అటు నెల్లూరు నుంచి ఇటు హైదరాబాద్ వైపుకు గుంటూరునుంచి నంద్యాలవరకు తిరుగుతూనే వున్నారు. ఆపిల్లవాని తండ్రి మా తమ్మునకు బాగా స్నేహితుడు కనుక మావాడు కూడా వారం రోజులుగా శెలవు పెట్టి రాత్రింబవళ్ళు తిరుగుతునే వున్నారు.
ఆతల్లి దండ్రి దు:ఖం చూడనలవి కాకుండావుంది. పాపం ఆకుర్రవాడు [శ్రీనివాసరెడ్డి] ఒకవైపు వెతుకుతూనే మరొకవైపు ఎక్కడ ప్రశ్నలు చెబుతారంటె అక్కడకు ,ఎక్కడ కాస్త శాశ్త్రజ్ఞానంతో పరిష్కారాలు చెప్పేవారుంటే అక్కడకు పరుగులు పెడుతున్నాడు. అన్ని మొక్కులు మొక్కుతున్నాడు . కాని చేయవలసినది మాత్రం గమనించలేకున్నాడు. దు:ఖం బుద్దిని కమ్మేసింది . ఆలోచనారహితుడవుతున్నాడు.
ఆపదలు చుట్టుముట్టినప్పుడు మానవ ప్రయత్నాన్ని మాత్రమే నమ్ముకునే వాడు అమాయకత్వం లో వున్నాడనేది నాఅభిప్రాయం. ఈపిల్లవాడు ఇప్పుడు ప్రతిగుడికి వెళ్ళి మొక్కుతున్నట్లుగా కనీసం వారానికొకసారైనా గుడికెళ్ళి భగవంతుని ఆశ్రయించ లేక పోయాడు ఎందుకని. సరే ! ఆపదవచ్చినప్పుడే లేక దెబ్బతగిలినప్పుడే అమ్మా అని కేక అప్రయత్నంగా నోటినుంచి వస్తుందిలే అని సరి పెట్టుకుందామనుకున్నా ఆ నమ్మకమైనా స్థిరమైనదా అంటే అదీకాదు. అనన్యమైన భక్తితో నన్నశ్రయించినవారి యోగ క్షేమాలు నేనే స్వయంగా చూసుకుంటానని పరమాత్మ శపథం చేసారు గీతలో ,ఐనా మనం సంపూర్ణంగా విశ్వసించం. అదేమన బలహీనత. ప్రతి చోటుకు వెళ్ళి వస్తున్నావు కానీ కనీసం నీకు నమ్మకమైన రూపాన్ని అనన్యంగా చింతనచేయవెందుకో అర్ధంకాదు . ఏం ఈ ఆపదలను బాపే శక్తి నీవునమ్మిన స్వామికి లేదని అనుమానమా ? లేక నీకు విశ్వాసం లేదా ?
చిత్రంగా ఇది రాస్తున్నాను ఇప్పుడే అతను గుడివద్దకు వచ్చాడు. నాకోసం. మొహమాటం లేకుండా ఈమాటలన్నీ అడిగాను అతనిని. నువ్వు వందమంది దగ్గరకెళ్ళి నీసమస్యను చెప్పుకుంటే ఎవరివల్లనన్నా అయినదా ? లేదుకదా ? వీళ్లనడిగినట్లు దీనంగా జాలి గొలిపేలా నీ ఇష్టదైవాన్నెప్పుడైనా అడిగావా ? అని. ఆపిల్లవాడు ఏమీ చెప్పలేక పోతున్నాడు.
నాకు తెలిసిన ఒకే మార్గం చెబుతాను .నీకిష్టమైతే ఆచరించు. ఇంతమందిని ఆశ్రయించినట్లుగా స్వామినినే ఆశ్రయించి చూడు ఆయన నీపట్ల ఎందుకు దయతలచరో ! ఎందుకు నీసమస్య పరిష్కారం కాదో ! చూద్దువుగాని . మాలాంటి మనుషులము ఏమీ చేయలేకపోయినా మాటలతో నిన్ను మోసగించి కాలం గడపవచ్చు . కాని స్వామి మోసగించడు. రేపటి నుండి [మంగళవారం } హనుమాన్ చాలీసా రోజుకు పదకొండు సార్లుపారాయణం చేయి . రేపు మాత్రం ఒకే ఆసనం లో కూర్చుని నూటఎనిమిది సార్లు పారాయణం చేయి .తప్పనిసరిగా ఆయన నీదు:ఖాన్ని తొలగిస్తాడు . నీబిడ్ద ను క్షేమంగా నీ ఇంటికి చేరుస్తాడు అని ఇప్పుడే చెప్పాను. అతను కూడా కొద్దిగా సత్యాన్ని అర్ధం చేసుకున్నట్లుగా వుంది రేపు తెల్లవారు ఝామున వచ్చి పారాయణానికి కూర్చోవాలనని అనుకుంటూ వెళ్ళాడు.

అసాధ్యాలను సాధ్యం చేసే స్వామి . ఈ తల్లీదండ్రీ దు:ఖాన్ని తప్పని సరిగా తొలగిస్తాడని సంపూర్ణంగా నమ్ముతూ ,ఆబిడ్ద క్షేమంగా తల్లి దండ్రుల వద్దకు చేరాలని కోరుతూ స్వామిని వే్డుకుంటున్నాను. మంచి మనసుగల మీరందరూ కూడా ఈవిషయమై స్వామికి మీప్రార్ధనల ద్వారా నివేదించాలని కోరుతున్నాను.

Read more...

భగవానులు _నాస్తిక వాది

>> Saturday, June 20, 2009

భగవంతుని ఉనికిని ప్రశ్నిస్తూ అధ్యాత్మికవాదులను , ధార్మికులను తన వాద పటిమతో ఓడిస్తూ ప్రఖ్యాతి పొందిన ఒక ధృడమైన నాస్తిక వాది ఒకరు భగవాను వద్దకు వొచ్చారు.

ఆయన అలవాటు ప్రకారం - "దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడని మీరు రుజువు చేయగలరా? అంటూ రమణులపై తన ప్రశ్నల వర్షం కురిపించారు.

అతని యెడ చిరునవ్వు ప్రసరిస్తూ భగవాన్ ఇలా అన్నారు- "దేవుని గురించిన చింత నీకెందుకు? ఆయన గురించి ఆయనే విచారించుకొంటాడు Grin.

అసలు ఈ ప్రశ్న ఎవరికి కలిగిందో ఆలోచించు
."
అని


ఆ పృచ్చకుడికి ఇదంతా అంతు చిక్కని అయొమయంగా ఉంది.

అది గమనించి భగవాను అతడిని "నేనెవడిని(Who Am I)"అనెడి పుస్తకము చదవమని ఆదేశించారు.

భగవానును కలిసి ఆశ్రమములో కొద్ది రోజులు మాత్రమే ఉండాలని భావించిన ఆ వ్యక్తి ఇలా అన్నాడు.

" కొన్ని దినముల వరకూ దేవుడిని తిరస్కరిస్తూ నాస్తికవాదిగా వచ్చాను. అప్పుడే నేను ఆనందముగా ఉన్నను. కాని,

ఇప్పుడు "నేనెవడిని""అని ప్రశ్నించుకొని చింతన చేయడం ప్రారంభించిన తరువాత నేను పూర్తిగా గందరగోళములో పడిపోయాను Huh.

సంతోషం కోల్పోయి నేను చాల బలహీన పడినట్లు భావిస్తున్నాను Sad"అని.



భగవాను అతని యెడ అమిత దయతో, ఔదార్యముతో కూడిన చిరునవ్వు చిందిస్తూ జవాబిచ్చారు--

"నీలో ఏర్పడిన గందరగోళం బలహీనతకు సంభందించినది కాదు. ఇంత కాలమూ నీవు నీ సహజస్థితి యైన ఆత్మానుభూతి అనే సత్యానికి దూరముగా ఉన్నావు.

ఈనాడు తలెత్తిన ఈ మూలాధార ప్రశ్న నిన్ను ఆ అజ్ఞానమునకు దూరంగా నడుపుతున్నది. కనుక అది అభివృద్ధే.

అజ్ఞానము నుండి సంశయ స్థితికి, సంశయము నుండి స్వచ్చతకు (మానసిక), స్వచ్చత నుండి అనుభూతికి, తద్వారా ఆత్మలో లీనమగుట--- ఇదీ అధ్యాత్మిక సాధన మార్గములో ఆరొహన క్రమము." అని

అజ్ఞానులలో నిండి ఉన్న అంధకారమును చిన్నాభిన్నము చేసి,

ధారళంగా ప్రసారం చేయబడుతున్న భగవాను యొక్క దయా విశేషము పొందుటకు తగిన శక్తివంతులను గావిస్తుంది భగవాను సన్నిధి.



Read more...

ఈ హెచ్చరికలు గమనించండి

>> Friday, June 19, 2009

అంతర్జాలం లో ఎవరో మిత్రుడొకాయన పంపిన హెచ్చరికలివి

>
<










PLEASE FORWARD IT TO ALL WHOM YOU CARE.

1) Mobile

Don't put your mobile closer to your ears until the
recipient answers, Because directly after dialing, the mobile phone would use it's maximum signaling power,
which is: 2watts = 33dbi. Please Be Careful. Please use left ear while using cell (mobile), because if you use the right one it may affect brain directly. This is a true fact from Apollo medical team.

2) APPY FIZZ
Do not drink APPY FIZZ . It contains cancer causing
agent.
3) Mentos
Don't eat Mentos before or after drinking Coke or
Pepsi coz the person will die immediately as the mixture
becomes cyanide. Please fwd to whom u care
4) Kurkure
Don't eat kurkure because it contains high amount of
plastic if U don't Believe burn kurkure n u can see
plastic melting. Please forward to all!!!!!!!!! !! News
report from Times of India

5) Avoid these tablets as they are very dangerous
* D cold
* Vicks action- 500
* Actified
* Coldarin
* Co some
* Nice
* Nimulid
* Cetrizet-D

They contain Phenyl- Propanol -Amide PPA.Which Causes strokes, and these tablets are banned in U.S.
6) Cotton Ear Buds

Cotton Ear Buds... (Must read it) Please do not show sympathy to people selling buds on roadside or at Signals...... Just wanted to warn you people not to buy those packs of ear buds you get at the roadside. It's made from cotton that has already been used in hospitals. They take all the dirty, blood and pus filled cotton, wash it, bleach it and use it to make ear buds. So, unless you want
to become the first person in the world to get Herpes Zoster Oticus (a viral infection of the inner, middle, and external ear) of the ear and that too from a cotton bud, DON'T BUY THEM! Please forward to all this may be helpful for someone...... ....... Please forward to all your near and dear
ones....!

PLEASE FORWARD IT TO ALL WHOM YOU CARE.

Dr. T. S. Roy MD, PhD
Professor
Department of Anatomy
All India Institute of Medical Sciences
New Delhi - 110 029
Phone: 91-11-26594880
Fax: 91-11-26588663, 26588641

Dr Rima Dada, M.D., Ph.D(Genetics) , MAMS
Associate Professor,
Dept of Anatomy,
All India Institute of Medical Sciences(AIIMS)
New Delhi
110029-INDIA








--

viswanath.bk


New window
Print all
Sponsored Links (feedback)
Win the latest Nokia N97
Join the Search for N
5 Questions, 5 Days, 10 Nokia N97s
Searchforn.com/Nokia_N97
Orkut On Your Phone
Upload Photos from Your Mobile With the New Orkut Mobile App!
Google.co.in/Orkut
Buy Mobile Phone Mounts
Dashmounts For PDA, MP3, GPS, More. No More Drilling Holes! Order Now.
www.holdmyphone.com.au
Previews Mobile Phone
Keep up to date with the latest mobile phone previews from the pros
www.ITPro.co.uk/Mobile
Tinnitus- Ringing in Ears
Natural homeopathic relief for Ringing in ears and tinnitus
www.tinnituswars.com
effect energy drink
Europe´s fastest growing Energy Drink. Nr 2 in Germany Nr 4 Europe
www.effect-energy.com
Perforation equipment
Hot and cold perforators with customized perforation tools
www.sk-machinery.com
Noni Plus Kalawalla(tm)
Noni plus Kalawalla - Exclusive! Potent Noni with Kalawalla caps.
www.OrganicHope.com
About these links


Read more...

ఆథ్యాత్మికత అప్రతిహతం

>> Saturday, June 13, 2009

అన్ని ప్రాణులకులాగానే మానవునికి కూడా జీవించడమే లక్ష్యం అంటే. ఎలాగైనా మరణం నుండి తప్పుకోజూడటమే.అందువల్లనే జీవితము అన్నింటికంటె ప్రియమని తలుస్తాము.కాని ఇది నిజమా? మానవుడు జీవించడం తో మాత్రమే తృప్తి పడగలిగితేనే అలా తలచడం సాధ్యం .వాస్తవానికి కేవలం జీవించడం మాత్రమే కాక కొరతలేని తృప్తి .శాంతులతో జీవించాలని తలుస్తాము. మనం ధనమూ,కీర్తీ,పదవి,హోదాలను పొందటానికి యత్నిస్తున్నామంటే వాటిద్వారా తృప్తి శాంతి లభిస్తాయన్న ఆశే కారణం.అందుకే వాటి కోశం మానవుడు ఎన్ని కష్టాలకైనా ఓరుస్తాడు.కాని ఎన్ని సాధించినా ప్రతివాడూపొందవలసినదేదో తనకింకా లభించలేదన్న కొరతకు గురవుతాడు. ఇంకా ఏదో సాధస్తే దానిద్వారా తృప్తి,శాంతి లభించవచ్చని భ్రమిస్తూ మరణించేదాకా కాలం గడిపేస్తాడు. కాని ఎన్ని కోట్లమంది మానవులు ఎన్ని యత్నాలు చేసినా ఎన్నింటిని సాధించినా వారికింకా ఇట్టి కొరత మిగిలిండటమే చిత్రం.
ఇలా అని కొరతలేని తృప్తనేది ఒక ఊహా కల్పన మాత్రమేనని .అట్టిదసంభవమని భావించి ఊరుకొగలమా? అట్టినిశ్చయం ఏర్పడిననాడు జీవితం అర్థరహితమనిపించి మానవుడు ఆత్మహత్యకు గానీ ,ఉన్మాదానికి గాని ,మత్తు పదార్ధాలకు గాని పాల్పడతాడు. .అంటే కొరతలేని తృప్తి పొందటం జీవించటం కంటే కూడా మానవునికి ముఖ్యమన్నమాట. కాని అట్టితృప్తి ఇంతమంది లో ఎవరికీ కలగక పోయినా అందరూ జీవించాలని తాపత్రయపడటానికి రెండు కారణాలున్నాయి. ఒకటి అట్టితృప్తి ,శాంతి ఎవరికీ లభ్యం కాలేదన్న ఎరుక కలగక తమకు లేనిదానిని పొందితే అవి లభిస్తాయన్న భ్రాంతి,రెండు అంతకంటె బలీయమైన కారణం మృత్యువంటే భయం.

కాని మృత్యువంటే ఎందుకు భయం? దాని నిజరూపం తనకేమి తెలిసిమానవుడు భయపడతాడు.? మృత్యువులో తనకేమి జరుగుతుందో తెలియదు.అలా తెలియక పోవటమే భయానికి కారణం.
అట్టి మృత్యుభీతివలన జీవితానికంటిపెట్టుకుని వుంటాడే గాని,తీరా జీవించబోతే కొరత ,అసంతృప్తి మాత్రమే ఎదురౌతాయి. చావుకు పెడితే లంఖణానికొప్పుకున్నట్లు ,ఏమీ తెలియని మృత్యువుకంటే ఎంత అసంతృప్తిగావున్నా కొంతవరకైనా తనకు పరిచయమైన జీవితమే మేలనుకుంటాడు.మానవుడు. "ఏడవలేక నవ్వుతూ " వున్నట్టు చావలేక బ్రతుకుతాడు. అట్టి జీవితం లోని కొరతను ,అసంతృప్తిని ఎలా అతిక్రమించాలో తెలియక దానిని విస్మరింపజూస్తాడు.సినిమాలు ,నవలలు మొ// కాలక్షేపాలన్నీ అసంతృప్తి కరమైన అనుభవాల పరంపరలుగా గడిచే కాలగతిని మరిచే యత్నాలు మాత్రమే . వైద్యులిక తగ్గదని నిర్ణయించిన రోగబాధను మత్తుమందులతో మరుగు పరుచుకోజూట్టం లాంటిదే కాలక్షేపం. నానాటికీ ఆమత్తుమందుల ఆమత్తు మోతాదు పెరగవలసి వచ్చినట్లే కాలక్షేపాల మోతాదు కూడా పెరగవలసి వస్తుంది. కాని వాటిననుభవించాలంటే డబ్బు అవసరం. ఎక్కువ డబ్బుసంపాదించాలంటే అదికంగా శ్రమింఛాలి . కాని కాలక్షేపం మత్తుమందులకు అలవాటు పడినవాడు చిత్తశుద్ధితో శ్రమించలేడు. అట్టివాడు అవినీతికి పాల్పడాల్సివుంటుంది. తృప్తినీ ,శాంతినీ ప్రసాదించేవిగా తోచే కీర్తి ధనము పదవి ,హోదాలను పొందాలన్నా అట్టివారికి అవినీతే సులభమైన మార్గమనిపిస్తుంది. ఇదే సమాజం లో అవినీతికంతకూ మూలం .వీటికి తోడు వ్యక్తులలోని బలహీనతలను వినియోగించుకుని లాభాలను గడించే వారు అంటే మనకు కాలక్షేపాన్నందించేవారు ,ఈదౌర్భల్యానికి మరీ. దోహదం చేస్తారు.

కనుక ఇంత అస్తవ్యస్తానికి దారితీసే కాలక్షేపాలు జీవిత సమస్యకు నిజమైన పరిష్కారాలు కావు .కాలగతిలో సామాజిక ధర్మాన్ని తారు మారు చేసి జీవితం దుర్భరమయ్యేలా చేసేవి పరిష్కారాలెలా అవుతాయి ? కేవలం సమస్యనుండి పారిపోవటం అవుతాయి.మృత్యువును నుండి తప్పుకోజూడటానికి కారణం భీతి అనీ ,భీతికికారణం మృత్యువంటే ఏమిటో తెలియక పోవడం అని గుర్తించాము. కాలక్షేపాలద్వారా మానవుడు జీవితానుభవాలనుండి తప్పుకోజూడ్డం వలన అతనికి జీవితమన్నా భయమేనని అంగీకరించాలి.జీవితమంటే ఏమిటో తెలియక పోవటమే అట్టి భయానికి కారణం కాగలదు. జీవితమంటే అనుభవాలను గుర్తించే ఎరుక .దానినే "నేను" అంటాం .నేను "అంటే ఏమిటో దాని తత్వమేమిటో మనకు స్పష్టంగా తెలియకపోవటమే మనం కాలక్షేపాల మాటున దాక్కోజూట్టానికి కారణమన్నమాట.మరణ భీతిచేత జీవితానికంటిపెట్టుకుంటాం.తృప్తి కోసం ఆజీవితాన్నుండి కాలక్షేపాలచాటుకు తప్పుకోజూస్తాం.

కాని గాఢనిద్రలో నున్నపుడు కొరతలేని తృప్తిని ,శాంతిని ప్రతివాడు అనుభవిస్తాడు. అందరికీ ఒకేరీతిలో అనుభవమవుతుంది కాబట్టె, ఈజగత్తు సత్యమని మనం అంగీకరించినట్టే ,గాఢనిద్రలో తృప్తీ,శాంతి సత్యమని మనం అంగీకరించాలి. జీవితం లో ఎన్ని కోట్లమంది ఎట్టి శాంతిని తృప్తిని ఆశించి నిరంతరం< యత్నిస్తారో ,కానీ పొందలేరో అట్టిది గాఢనిద్రలో ఎక్కడనుండివస్తుంది .? అది తెలిస్తే దాన్ని మెలుకువలో సహితం పొందవచ్చు. మనకు జీవితం లో లభించే కష్టాలు ,సుఖాలు ఇంద్రియాలద్వారా మెలకువలో లభిస్తాయి. కానీ మనస్సు ఇంద్రియాలు గాఢనిద్రలో కట్టుబడతాయి. కనుక ఆస్థితిలోని తృప్తీ శాంతి మనకు వేరొకలభించేవి కావన్నమాట. అంటే మనలోనే స్వతహాగా వున్నవన్నమాట. అమ్తే కాదు గాఢనిద్రలో ,శాంతి వేరుగానూ,దానిననుభవించేమనం వేరుగను వుండం. అట్టి శాంతేమనమయ్యుంటాం. ! మనలోనేవున్న తృప్తిని శాంతిని గమనించక దానికై బాహ్యవస్తువులలో వెతికితే ఎలా లభిస్తుంది? ఇదే జీవిత కొరతకు కారణం. చంకలో మేకపిల్లనుంచుకుని ఊరంతా వెతికితే దొరుకుతుందా? మనలో కొరతలేనితృప్తీ శాంతీ వుంటే మనకవి మెలకువలోకూడ అనుభవానికిరావాలికదా? ఈప్రశ్నకు దృష్టాంతంగా చూడండి. ఒక తొట్టిలో నీరుపోశామనుకోండి . ఆనీరు నిశ్చలంగా వున్నప్పుడు అడుగు స్పష్టగా కనపడుతుంది. కానీ నీరు కలతజెందినప్పుడు తొట్టిడుగు స్పష్టంగా కనపడదు. మరుగున పడుతుంది. మానవుడు తొట్టివంటివాడు. మనస్సేనీరు .తొట్టిఅడుగే గాఢనిద్రలో అనుభవమయ్యే తృప్తీ,శాంతి , ఆ నీటి సంచలనమే చిత్తచాంచల్యంతో కూడిన మెలుకువ. కాబట్టి మెలకువలో మనస్సును నిశ్చలమ్ చేస్తే ప్రతివారికీ తామనుక్షణం కోరుకునే తృప్తి,శాంతి లభిస్తాయన్నమాట. అందుకవసరమైన క్రమశిక్షణే ఆథ్యాత్మికత అంతా. కానీ ఆథ్యాత్మిక మానవుని నిష్క్రియాపరునిగా చేయదు. సైకిల్ తొక్కటం నేర్చుకునేటప్పుడు ఎవరైనా పలకరిస్తే దిగవలసిన ఆవస్యకత వుంటుంది. . కారణం మనస్సు ఆమాటలపైన పనిచెస్తే సైకిల్ తొక్కటం పైఅ పనిచేయదు కనుక వాడు పడిపోయేప్రమాదం వుంది. కాని సైకిల్ తొక్కటం పూర్తిగా వస్తే సంభాషిస్తూ కూడా తొక్కుతాడు. అలానే ధ్యానంలో నిలకడ కుదిరాక జీవిత కర్తవ్యాన్ని కొనసాగిస్తూకూడా ఆంతర్యం లో తృప్తిని,శాంతిని అనుభవించగలుగుతాడు. ఆస్థితినే జీవన్ముక్తి అన్నారు. జీవించివుండగనే అసంతృప్తి రూపమైన దు:ఖాన్నుండి విముక్తి పొందుతాడు. ఆదు:ఖానికి కారనమైన తానేమిటో తెలియని అజ్ఞానం నుండి విముక్తుడౌతాడు. తృప్తే,శాంతే తానని ప్రత్యక్షంగా తెలుసుకుంటాడు. కనుక తృప్తి శాంతులకోసం నాడు బాహ్యంగా అన్వేషించాల్సిన అవసరం వుండదు. శరీరం తన ప్రవృత్తి ననుసరించి తనను తానే పోషించుకునే కృషిని చేస్తుంది. అట్టివ్యక్తి సమాజం లో అవినీతిపరుడు కాజాలడు. నీతికీ ,ధర్మానికీ దోహదమౌతాడు. గాఢనిద్రలో అంటేపరిపూర్ణమైన శాంతిలో ,తానంటె ఈదేహమేనన్న భ్రాంతి తొలగినట్టే జీవన్ముక్తుడికీ( తొలగుతుంది. కనుక మరణభీతి తొలగుతుంది. కనుక జఇవితాన్నంటిపెట్టుకోవలసిన ఆవస్యకత వుండదు. జీవించినంతకాలం తృప్తీ శాంతీ తానై జీవిస్తాడు. ఆతరువాత నిర్భయంగా మరణిస్తాడు. అంతేకాదు, జనన జీవన ,మరణాలు కాలబద్దమైనవి .కాలం గాఢనిద్రలో అవాస్తవమైనట్లు జీవన్ముక్తుడికి కాలంతోపాటు జననమరణాలు కూడా అవాస్తవమవుతాయి .కనుక అతను మరణిస్తాడనటం కూడా అతనిదృష్టిలో వాస్తవం కాదు. ఆథ్యాత్మికత అంటే ఇట్టిదని గుర్తించక ,దానిపేరిట ప్రపంచంలో చలామణి అయ్యే మూఢనమ్మకాలను విమర్శిస్తూ ,ఆథ్యాత్మికతనే అసత్యమని నిరూపించినట్లు నేటి నాస్తికులు భ్రమిస్తున్నారు.డబ్బుకోసం ప్రపంచంలో జరిగే అన్యాయాలను చూసి సమాజంలో డబ్బే వుండకూడదనే కుతర్కం వంటిదే వీరివాదం. ఆథ్యాత్మికతే అవసరం లేదనేవారు ,సర్వజీవులూ ఏతృప్తికోసం అన్వేషిస్తున్నాయో దానినే అవసరం లేదంటున్నారు. అప్పుడు తమ నాస్తికవాదాన్ని మాత్రం చెప్పటమెందుకు.? దేన్నాసించి చెప్పాలి? పదార్ధవాదులు చైతన్యమేలేదంటున్నారు.ఆధునిక భౌతిక రసాయన శాస్త్రాదులలో దాని యొక్క ఆస్తిక్యం నిరూపించబదలేదంటున్నారు . కానీ అట్టి శాస్త్రీయ పరిశోధన చేయాలన్నా ,అట్టి నిర్ధారణ చెయ్యాలన్నా చైతన్య మావశ్యకంకదా! అట్తి చైతన్యమే నిజంగాలేకుంటె ,సమాజానికి సత్యాన్ని బోధించాలని తలచేది ఎవరు? అట్టిచైతన్యం గలవ్యక్తులే లేకుంటే ఎవరికి బోధిస్తారు? చైతన్యమేలేని భౌతిక రూపాలకు మనుగడ చేకూర్చడమేమిటి? కనుక వారి వాదం పైవారికి విశ్వాసముంటె వారెవరికీ ఏమీబోధించకూడదు. చైతన్యమే లేదంటే దాని కనుభవమయ్యే తృప్తీ,శాంతి లేనేలేవన్నమాట. ఈసూత్రాన్ననుసరించి వారు నిత్యజీవితాన్ని కొనసాగించగలిగితే వారి సిద్ధాంతంపై వారికి విశ్వాసమున్నట్లు. కాని అలాచేయాలన్నా చైతన్యమావ శ్యకమే ! అంటే ! ఆథ్యాత్మికవాదం అప్రతిహతమన్నమాట.


----------ఆచార్య ఎక్కిరాలభరద్వాజ గారి రచనలనుండి

[ ఇది ఆథ్యాత్మికతకు భరద్వాజ మాష్టర్ గారు ఇచ్చిన అద్భుత నిర్వచనం .దానిని ఎక్కువమందికి అందించాలనే మరలా ఇస్తున్నాను.]

Read more...

అసలు మనకేం కావాలి ?

>> Friday, June 12, 2009


అన్ని ప్రాణులలకు లాగే మానవుని ప్రథమ లక్ష్యం జీవించడమే.అంటే ఎలాగైనా మృత్యువునుండి తప్పుకోజూడటమే.అందువల్లనే జీవితము అన్నింటికంటె ప్రియమని తలుస్తాము.కాని ఇది నిజమా? మానవుడు జీవించడం తో మాత్రమే తృప్తి పడగలిగితేనే అలా తలచడం సాధ్యం .వాస్తవానికి కేవలం జీవించడం మాత్రమే కాక కొరతలేని తృప్తి .శాంతులతో జీవించాలని తలుస్తాము. మనం ధనమూ,కీర్తీ,పదవి,హోదాలను పొందటానికి యత్నిస్తున్నామంటే వాటిద్వారా తృప్తి శాంతి లభిస్తాయన్న ఆశే కారణం.అందుకే వాటి కోశం మానవుడు ఎన్ని కష్టాలకైనా ఓరుస్తాదు.కని ఎన్ని సాధించినా ప్రతివాడూపొందవలసినదేదో తనకింకా లభించలేదన్న కొరతకు గురవుతాడు. ఇంకా ఏదో సాధస్తే దానిద్వారా తృప్తి,శాంతి లభించవచ్చని భ్రమిస్తూ మరణించేదాకా కాలం గడిపేస్తాడు. కాని ఎన్ని కోట్లమంది మానవులు ఎన్ని యత్నాలు చేసినా ఎన్నింటిని సాధించినా వారికింకా ఇట్టి కొరత మిగిలిండటమే చిత్రం.
ఇలా అని కొరతలేని తృప్తనేది ఒక ఊహా కల్పన మాత్రమేనని .అట్టిదసంభవమని భావించి ఊరుకొగలమా? అట్టినిశ్చయం ఏర్పడిననాడు జీవితం అర్థరహితమనిపించి మానవుడు ఆత్మహత్యకు గానీ ,ఉన్మాదానికి గాని ,మత్తు పదార్ధాలకు గాని పాల్పడతాడు. .అంటే కొరతలేని తృప్తి పొందటం జీవించటం కంటే కూడా మానవునికి ముఖ్యమన్నమాట. కాని అట్టితృప్తి ఇంతమంది లో ఎవరికీ కలగక పోయినా అందరూ జీవించాలని తాపత్రయపడటానికి రెండూ కారణాలున్నాయి. ఒకటి అట్టితృప్తి ,శాంతి ఎవరికీ లభ్యం కాలేదన్న ఎరుక కలగక తమకు లేనిదానినుఇ పొందితే అవి లభిస్తాయన్న భ్రాంతి,రెండు అంతకంటె బలీయమైన కారణం మృత్యువంటే భయం.

కాని మృత్యువంటే ఎందుకు భయం? దాని నిజరూపం తనకేమి తెలిసిమానవుడు భయపడతాడు.? మృత్యువులో తనకేమి జరుగుతుందో తెలియదు.అలా తెలియక పోవతమే భయానికి కారణం.
అట్టి మృత్యుభీతివలన జీవితానికంటిపెట్టుకుని వుంటాడే గాని,తీరా జీవించబోతే కొరత ,అసంతృప్తి మాత్రమే ఎదురౌతాయి. చావుకు పెడితే లంఖణానికొప్పుకున్నట్లు ,ఏమీ తెలియని మృత్యువుకంటే ఎంత అసంతృప్తిగావున్నా కొంతవరకైనా తనకు పరిచయమైన జీవితమే మేలనుకుంటాడు.మానవుడు. "ఏడావలేక నవ్వుతూ " వున్నట్టు చావలేక బ్రతుకుతాడు. అట్టి జీవితం లోని కొరతను ,అసంతృప్తిని ఎలా అతిక్రమించాలో తెలియక దానిని విస్మరింపజూస్తాడు.సినిమాలు ,నవలలు మొ// కాలక్షేపాలన్నీ అసంతృప్తి కరమైన అనుభవాల పరంపరలుగా గడిచే కాలగతిని మరిచే యత్నాలు మాత్రమే . వైద్యులిక తగ్గదని నిర్ణయించిన రోగబాధను మత్తుమందులతో మరుగు పరుచుకోజూట్టం లాంటిదే కాలక్షేపం. నానాటికీ ఆమత్తుమందుల ఆమత్తు మందుల మోతాదు పెరగవలసి వచ్చినట్లే కాలక్షేపాల మోతాదు కూడా పెరగవలసి వస్తుంది. కాని వాటిననుభవించాలంటే డబ్బు అవసరం. ఎక్కువ డబ్బుసంపాదించాలంటే అదికంగా శ్రమింఛాలి . కాని కాలక్షేపం మత్తుమందులకు అలవాటు పడినవాడు చిత్తశుద్ధితో శ్రమించలేడు. అట్తివాడు అవినీతికి పాల్పడాల్సివుంటుంది. తృప్తినీ ,శాంతినీ ప్రసాదించేవిగా తోచే కీర్తి ధనము పదవి ,హోదాలను పొందాలన్నా అట్టివారికి అవినీతే సులభమైన మార్గమనిపిస్తుంది. ఇదే సమాజం లో అవినీతికంతకూ మూలం .వీటికి తోడు వ్యక్తులలోని బలహీనతలను వినియోగించుకుని లాభాలను గడించే వారు అంటే మనకు కాలక్షేపాన్నందించేవారు ,ఈదౌర్భల్యానికి మరీ. దోహదం చేస్తారు.

కనుక ఇంత అస్తవ్యస్తానికి దారితీసే కాలక్షేఅపాలు జీవిత సమస్యకు నిజమైన పరిష్కారాలు కావు .కాలగతిలో సామాజిక ధర్మాన్ని తారు మారు చేసి జీవితం దుర్భరమయ్యేలా చేసేవి పరిష్కారాలెలా అవుతాయి ? కేవలం సమస్యనుండి పారిపోవటం అవుతాయి.మృత్యువును నుండి తప్పుకోజూడటానికి కారణం భీతి అనీ ,భీతికికారణం మృత్యువంటే ఏమిటో తెలియక పోవడం అని గుర్తించాము. కాలక్షేపాలద్వారా మానవుడు జీవితానుభవాలనుండి తప్పుకోజూడ్డం వలన అతనికి జీవితమన్నా భయమేనని అంగీకరించాలి.జీవితమంటే ఏమిటో తెలియక పోవటమే అట్టి భయానికి కారణం కాగలదు. జీవితమంటే అనుభవాలను గుర్తించే ఎరుక .దానినే "నేను" అంటాం .నేను "అంటే ఏమిటో దాని తత్వమేమిటో మనకు స్పష్టంగా తెలియకపోవటమే మనం కాలక్షేపాల మాటున దాక్కోజూట్టానికి కారణమన్నమాట.మరణ భీతిచేత జీవితానికంటిపెట్టుకుంటాం.తృప్తి కోసం ఆజీవితాన్నుండి కాలక్షేపాలచాటుకు తప్పుకోజూస్తాం.

కాని గాఢనిద్రలో నున్నపుడు కొరతలేని తృప్తిని ,శాంతిని ప్రతివాడు అనుభవిస్తాడు. అందరికీ ఒకేరీతిలో అనుభవమవుతుంది కాబట్టె, ఈజగత్తు సత్యమని మనం అంగీకరించినట్టే ,గాఢనుద్రలో తృప్తీ,శాంతి సత్యమని మనం అంగీకరించాలి. జీవితం లో ఎన్ని కోట్లమంది ఎట్టి శాంతిని తృప్తిని ఆశించి నిరంతరం< యత్నిస్తారో ,కానీ పొందలేరో అట్టిది గాఢనిద్రలో ఎక్కడనుండివస్తుంది .? అది తెలిస్తే దాన్ని మెలుకువలో సహితం పొందవచ్చు. మనకు జీవితం లో లభించే కష్టాలు ,సుఖాలు ఇంద్రియాలద్వారా మెలకువలో లభిస్తాయి. కానీ మనస్సు ఇంద్రియాలు గాఢనిద్రలో కట్టుబడతాయి. కనుక ఆస్థితిలోని తృప్తీ శాంతి మనకు వేరొకలభించేవి కావన్నమాట. అంటే మనలోనే స్వతహాగా వున్నవన్నమాట. అమ్టే కాదు గాఢనిద్రలో ,శాంతి వెరుగను,దానిననుభవించేమనం వేరుగను వుండం. అట్టి శాంతేమనమయ్యుంటాం. ! మనలోనేవున్న తృప్తిని శామ్తిని గమనించక దానికై బాహ్యవస్తువులలో వెతికితే ఎలా లభిస్తుంది? ఇదే జీవిత కొరతకు కారణం. చమ్కలో మేకపిల్లనుంచుకుని ఊరంతా వెతికితే దొరుకుతుందా? మనలో కొరతలేనితృప్తీ శాంతీ వుంటే మనకవి మెలకువలోకూడ అనుభవానికిరావాలికదా? ఈప్రశ్నకు దృష్టాంతంగా చూడండి. ఒక తొట్టిలో నీరుపోశామనుకోండి . ఆనీరు నిశ్చలంగా వున్నప్పుడు అడుగు స్పష్టగా కనపడుతుంది. కానీ నీరు కలతజెందినప్పుడు తొట్టిడుగు స్పష్టంగా కనపడదు. మరుగున పడుతుంది. మానవుడు తొట్తివంతివాడు. మనస్సేనీరు .తొట్టిఅడుగే గాఢనిద్రలో అనుభవమయ్యే తృప్తీ,శాంతి , ఆ నీటి సంచలనమే చిత్తచాంచల్యంతో కూడిన మెలుకువ. కాబట్టి మెలకువలో మనస్సును నిశ్చలమ్ చేస్తే ప్రతివారికీ తామనుక్షణం కోరుకునే తృప్తి,శాంతి లభిస్తాయన్నమాట. అందుకవసరమైన క్రమశిక్షణే ఆథ్యాత్మికత అంతా. కానీ ఆథ్యాత్మిక మానవుని నిష్క్రియాపరునిగా చేయదు. సైకిల్ తొక్కటం నేర్చుకునేటప్పుడు ఎవరైనా పలకరిస్తే దిగవలసిన ఆవస్యకత వుంటుంది. . కారణం మనస్సు ఆమాటలపైన పనిచెస్తే సిఅకిల్ తొక్కటం పైఅ పనిచెఅయదు కనుక వాడు పడిపోయేప్రమాదం వుంది. కాని సైకిల్ తొక్కటం పూర్తిగా వస్తే సంభాషిస్తూ కూడా తొక్కుతాడు. అలానే ధ్యానంలో నిలకడ కుదిరాక జీవిత కర్తవ్యాన్ని కొనసాగిస్తూకూడా ఆంతర్యం లో తృప్తిని,శాంతిని అనుభవించగలుగుతాడు. ఆస్థితినే జీవన్ముక్తి అన్నారు. జీవించివుండగనే అసమ్తృప్తి రూపమైన దు:ఖాన్నుండి విముక్తి పొందుతాడు. ఆదు:ఖానికి కారనమైన తానేమిటో తెలియని అజ్ఞానం నుండి విముక్తుడౌతాడు. తృప్తే,శాంతే తానని ప్రత్యక్షంగా తెలుసుకుంతాడు. కనుక ట్రుప్తి శాంతులకోసం నాడు బాహ్యంగా అన్వేషించాల్సిన అవసరం వుండదు. శరీరం తన ప్వృత్తి ననుసరించి తనను తానే పోషించుకునే కృషిని చేస్తుంది. అట్టివ్యక్తి సమాజం లో అవినీతిపరుడు కాజాలడు. నీతికీ ,ధర్మానికీ దోహదమౌతాడు. గాఢనిద్రలో అంటేపరిపూర్ణమైన శాంతిలో ,తానంటె ఈదేహమేనన్న భ్రాంతి తొలగినట్టే జీవన్ముక్తుడికీ( తొలగుతుంది. కనుక మరనభీతి తొలగుతుంది. కనుక ఝివితాన్నణ్టిపెట్టుకోవలసిన ఆవస్యకత వుండదు. జీవించినంతకాల్ం తృప్తీ శాంతీ తానై జీవిస్తాడు. ఆతరువాత నిర్భయంగా మరణిస్తాడు. అంతేకాదు, జనన జీవన ,మరనాలు కాలబద్దమైనవి .కాలం గాఢనిద్రలో అవాస్తవమైనట్లు జీవన్ముక్తుడికి కాల్ంతోపాటు జననమరనాలు కూడా అవాస్తవమవుతాయి .కనుక అతను మరణిస్తాడనటం కూడా అతనిదృష్టిలో వాస్తవం కాదు. ఆథ్యాత్మికత అంటే ఇట్టిదని గుర్తించక ,దానిపేరిట ప్రపంచంలో చలామ్ణి అయ్యే మూఢనమ్మకాలను విమర్శిస్తూ ,ఆథ్యాత్మికతనే అసత్యమని నిరూపించినట్లు నేటి నాస్తికులు భ్రమిస్తున్నారు.డబ్బుకోసం ప్రపంచంలో జరిగే అన్యాయాలను చూసి సమాజంలో డబ్బే వుంశ్డకూడదనే కుతర్కం వంటిదే వీరివాదం. ఆథ్యాత్మికతే అవసరం లేదనేవారు ,సర్వజీవులూ ఏతృప్తికోసం అన్వేషిస్తున్నాయో దానినే అవసరం లేదంటున్నారు. అప్పుడు తమ నాస్తికవాదాన్ని మాత్రం చెప్పటమెందుకు.? దేన్నాసించి చెప్పాలి? ప్దార్ధవాదులు చైతన్యమేలేదంటున్నారు.ఆధునిక భౌతిక రసాయన శాస్త్రాదులలో దాని యొక్క ఆస్తిక్యం నిరూపించబదలేదంటున్నారు . కానీ అట్టి శాస్త్రీయ పరిశోధన చేయాలన్నా ,అట్టి నిర్ధారన చెయ్యాలన్నా చైతన్య మావశ్యకంకదా! అట్తి చైతన్యమే నిజంగాలేకుంటె ,సమాజానికి సత్యాన్ని బోధించాలని తలచేది ఎవరు? అట్టిచైతన్యం గలవ్యక్తులే లేకుంటే ఎవరికి బోధిస్తారు? చైతన్యమ్లేని భౌతిక రూపాలకు మనుగడ చేకూర్చడమేమిటి? కనుక వారి వాదం పైవారికి విశ్వాసముంటె వారెవరికీ ఏమీబోధించకూడదు. చైతన్యమే లేదంటే దాని కనుభవమయ్యే తృప్తీ,శాంతి లేనేలేవన్నమాట. ఈసూత్రాన్ననుసరించి వారు నిత్యజీవితన్ని కొనసాగించగలిగితే వారి సిద్ధాంతంపై వారికి విశ్వాసమున్నట్లు. కాని అలాచేయాలన్నా చైతన్యమావ శ్యకమే ! అంటే ! ఆథ్యాత్మికవాదం అ
ప్రతిహతమన్నమాట.


----------ఆచార్య ఎక్కిరాలభరద్వాజ గారి రచనలనుండి








Read more...

గురువు అవసరమా ? కాదా?

>> Thursday, June 11, 2009



ఆథ్యాత్మిక తాత్విక రంగాలలో కొందరు ప్రముఖులు గురువు అవసరం లేదనివాదిస్తారు .వారిలో జిడ్డుకిష్ణమూర్తిగారు ప్రముఖులు.ఆథ్యాత్మిక సంచలనం గా గుర్తింపబడిన వారిని ఆశ్రయించిన వారు అర్ధంకాకపోతే ప్రశ్నించి తెలుసుకుంన్నారు. ఆయనకూడా తన శక్తియుక్తులన్నీ వినియోగించి శ్రోతలలో ,అడిగేవారి లోనూ సత్యాన్వేషణ రేకెత్తించడానికి తీవ్రంగా కృషిచేశారు..ఆవిధంగాచూస్తే ఆయన నిజమైన వేదాంతగురువుగా భాసిస్తారు. ఆయనే ఒకచోట ఇలాఅంటారు " నిజమైన గురువు నిన్ను నీవు అర్థం చేసుకొమ్మని చెబుతాడు" [ if he is real guru he will tell you understand yourself "] .కృష్ణమూర్తిగారు గురువు కిచ్చిన నిర్వచనానికి ఆయనా సరిపోతున్నారు.

గురువులు అవసరం లేదంటూ శ్రీకృష్ణమూర్తిగారు చేసే తర్కం ఇలావుంటుంది. " భ్రమలో చిక్కిన ప్రజలు తమ రాజకీ్య నాయకులను ఎన్నుకుంటారు . వారి ఎన్నిక కూడా భ్రమలో భాగమే .అలానే అజ్ఞానం లోచిక్కిన ప్రజలు తమ గురువునెన్ను కోవడం ఇలాంటిదే .అజ్ఞానం లో వున్న ప్రజలెన్ను కొన్న నాయకుడెలావుంటాడో అలానే అజ్ఞానం లో వున్న శిష్యుడెన్నుకున్న గురువు కూడా అలానే కాక మరేమవుతాడు? [why spiritual Teachers in the first and last freedom] . చూచేదానికి ఈతర్కం బాగున్నా అది ఎంత అసంబద్దమో ఆవాదాన్నే కొంచెం పొడిగిస్తే తెలుస్తుంది.
ఆయన చెప్పేదెలావున్నదంటే ..........
అనారోగ్యం తో బాధపడుతున్న రోగి ,రోగియైన డాక్టర్ నే ఎన్నుకుంటున్నాడు .రోగం లో వున్నవాడు మరొకరి రోగాన్ని ఎలా బాగుచేయగలడు? కనుక డాక్టర్ ను చికిత్సకై ఆశ్రయించడం అనవసరం !

మరి జిడ్డు కృష్ణమూర్తిగారు అంత సులభంగా పొరబడ్డారా? వారి ప్రసంగాలను జాగ్రత్తగా చూస్తే శ్రీకృష్ణమూర్తిగారు ద్వజమెత్తేది నిజమైన గురువులమీదకాదని ,గురువుల పేరుతో అమాయకులను తప్పుదోవపట్టించే వారిపైనని అర్ధమవుతుంది.అమ్దుకే ఆయన ఒకసారి ఆవేడనతో ఇలాఅంటారు ." నిజమైన గురువులను మనమిప్పుడు ఎక్కద చూడగలం ? అని. ఆమాట సత్యం. శ్రీ సాయి కూడా అన్నారు కదా "నిజమైన ఫకీరు అరుదు అని .

- ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారి ప్రసంగాలనుండి .

Read more...

నందనందనా కృష్ణా ...కృష్ణ లీలా తరంగం [౩]

>> Tuesday, June 9, 2009

నందనందనా కృష్ణా ...కృష్ణ లీలా తరంగం [౩]



Read more...

సువ్వి గోపాలుడే సుందరాంగుడే--కృష్ణ లీలా తరంగం -2

>> Monday, June 8, 2009

సువ్వి గోపాలుడే సుందరాంగుడే



Read more...

కృష్ణ లీలా తరంగం --- 1

>> Sunday, June 7, 2009


పరమాత్మ దివ్యగానం లో పులకరించటానికి వెళదాము రండి


Read more...

సిద్దపురుషుల మహా సమాధి సమయములో

>> Thursday, June 4, 2009



సిద్దపురుషుల మహా సమాధి సమయములో కూడా మహిమల వెల్లువలే .బాలా ఉపాసకులు సిద్ధపురుషుడు గురుదేవులైన చందోలు శాస్త్రిగారు మహాసమాధి చెంది న సమయాన అద్భుతముగా దేవతా శక్తుల దర్శనము లభించినది. అంత్యక్రియలకు హాజరైన వారికి. నాడు ప్రముఖముగా పత్రికలన్నీ ఈ విషయాన్ని తెలియ జేసాయి. చూడండి.

ఫోటోపై నొక్కండి వివరంగా కనపడుతుంది .

Read more...

ఆత్మతో మమేకం కావాలి ;................

మంచిని చూస్తే చెడు మటుమాయమవుతుంది. మంచి అనేది కాలుష్య రహిత సమాజం. చెడు పరిసరాలను సైతం మలిన పరిచే మురికి కూపం. మంచి సంకల్పమే చెడుకు దూరం కావటానికి మొట్టమొదటి మెట్టు.

మనల్ని మనం నియంత్రించుకోకపోతే అస్థిరత, కష్టాలు, విషాదం, భయం అన్నీ వెంటాడుతాయి. దీంతో మన జీవితం అథ:పాతాళానికి చేరినట్టుగా కృంగిపోతాం. ఇలాంటి సమయంలోనే యోగసాధన వలన మనలో ఆధ్యాత్మికత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.

అసలు స్థిర చిత్తంతో ,ఆత్మతో మమేకం కాగలిగితే జీవితం యోగ సంపన్నమవుతుంది. ఆత్మ ప్రయాణంలో అధమ ప్రవృత్తులు జీవితాన్ని శాసించలేవు. పరుల మాటలు, చేతలు మనల్ని నొప్పించజాలవు. అవి మనల్ని ఒక వేళ బాధపెట్టినా ఆత్మ తెలివిడితో మనల్ని కలవర పరచుకోము.

దీనికి పైగా పరుల అవగాహనా లేమిని ఇట్టే పసిగట్టేస్తాం. వారిది దోష చిత్తం అనిపించదు. మనలో మాటకి మాట, చేతకి చేత అనే భావన లేకుంటే వారి మాటల్ని, చేతల్ని పట్టించుకోం. ఈ ఉదాశీన వైఖరే మన ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఇదే స్థిర చిత్తానికి అద్దంపడుతుంది.

ఎదుటి వారిపై ప్రతీకార చర్య పనికిరాదు. ఎదుటి వారు ఒకమాట అన్నాకూడా దానిని విననట్టు ఉండిపోవాలి. ఆ మాటలు మన మనస్సును తాకవు. ఎలాంటి సమయంలోనైనా మనం అతీతులమయ్యేలా మనల్ని మనం తర్ఫీదు చేసుకోవాలి.

దానికి ఉపకరించేది కేవలం యోగసాధన మాత్రమే. ఆ యోగ సాధనవలన మన శరీరంపై మనకు పట్టు లభిస్తే మన మనస్సు మన ఆధీనంలోవుంటుంది. దానినే స్థిర చిత్తం అంటారు ప్రపంచ ప్రఖ్యాత జిడ్డు కృష్ణమూర్తిని తత్త్వవేత్తగా ఆవిష్కరించిన లెడ్‌బీటర్.

ఈ అతీత మానసిక స్థితివల్ల మనిషిలో పవిత్రత, నైర్మల్యం ప్రోది అవుతాయి. ఆత్మతో మమేకం కావడంవల్ల మనసు పారదర్శకమవుతుంది. మన యోగసాధన, ఆధ్యాత్మక ఉన్నతి పదిమంది కోసం అయితే, ప్రతీకారం అనేది మనసా, వాచా, కర్మేణా మన దరికి చేరదు.

Read more...

నర్శింగ్‌వాడిలోని దత్తాత్రేయ ఆలయం

>> Tuesday, June 2, 2009

నర్శింగ్‌వాడిలోని దత్తాత్రేయ ఆలయం






ఈ వారం తీర్థయాత్రలో భాగంగా దత్తేశ్వర ఆలయాన్ని మీకు పరిచయం చేస్తున్నాం. మహారాష్ట్ర రాష్ట్రంలోని కోల్హాపూర్‌, నర్శింగ్‌వాడి అనే గ్రామంలో పవిత్ర కృష్ణానది తీరాన ఈ ఆలయం వెలసివుంది. ఈ ప్రాంతం నర్సోబావాడి అనే ప్రాంతంగా కూడా మంచి పేరుపొందింది. ఈ ప్రాంతంలో దత్తాత్రేయ సుమారు 12 సంవత్సరాల పాటు భక్తితత్వాన్ని ప్రజలకు అందించారు.

అందుకే ఈ ప్రాంతాన్ని దత్తా మహారాజ్ తపోభూమిగా అభివర్ణిస్తారు. ఇక్కడ ఉన్న దత్తాత్రేయ పాదముద్రలను ఇక్కడకు వచ్చే భక్తులు పూజిస్తారు. పురాణాల ప్రకారం దత్తా మహారాజ్ ఇక్కడ ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఆయన తన యాత్రను ప్రారంభించి, ఉడుంబెర్, గనగపూర్‌లను సందర్శించి చివరకు కర్డాలివన్‌‌కు చేరుకున్నట్టు పేర్కొంటారు.

నర్శింగేశ్వరాతి అనే తన మానవ అవతారాన్ని ఇక్కడే వదిలిపెట్టి ఇక్కడి భక్తుల భావన. ఈ ప్రాంతాన్ని ప్రతిరోజు వేలాది మంది


భక్తులు దత్తాత్రేయ మందిరాన్ని సందర్శించి, భక్తి ప్రపత్తులతో పూజిస్తారు. ఇక్కడే పంచాంగ, కృష్ణ నదుల సంగమం జరుగుతుంది. కృష్ణానదీ నీటి పరవళ్ళ శబ్దంతో ఆలయ గంటల శబ్దం, వేద మంత్రోచ్ఛారణలు మిళితమై అదోరకమైన అద్వితీయమైన అనుభూతికి లోను చేస్తుంది.


ఈ ఆలయ గోపురం మసీదు నిర్మాణ ఆకారాన్ని పోలివుండటం దీని ప్రత్యేకత. ఈ ఆలయ ప్రాంగణంలో అనేక చిన్న ఆలయాలు, కోటలు, పేరొందిన సాధువుల విగ్రహాలు ఉన్నాయి. ప్రతి పౌర్ణమికి ఇక్కడకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ప్రతి శనివారాన్ని దత్తాత్రేయ జన్మదినోత్సవంగా ఇక్కడ వేడుకలు నిర్వహిస్తుంటారు. దీంతో ఈ ప్రాంతం ప్రతి శనివారం భక్తుల సంఖ్యలో తరలి వచ్చి దత్తాత్రేయ పాదముద్రికలను దర్శనం చేసుకుని పూజలు చేస్తారు.



ప్రతి యేడాది దత్తాత్రేయ జయంతి వేడుకలను ఇక్కడ నిర్వహిస్తారు. ఆ సమయంలో దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఇక్కడకు వచ్చి దత్తాత్రేయ ఆశీర్వాదాన్ని అందుకుంటారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులను ఏ ఒక్కరు కూడా అడ్డగించరు. ఆలయ ప్రాంగణంలో శునకాలు కూడా సంచరిస్తుంటాయి. ఈ శునకాలను కూడా భక్తులు ప్రార్థిస్తూ.. వాటికి ఆహార పదార్థాలను అందజేస్తుంటారు.

ఎలా చేరుకోవాలి... రోడ్డు మార్గం.. కోల్హాపూర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో నర్షింగ్‌వాడి ఉంది. అలాగే పూణెకు 245 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూణె నుంచి బస్సులు లేదా టాక్సీలలో ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.

రైలు మార్గం.. కోల్హాపూర్‌కు చేరుకునేందుకు ముంబై, పూణెల నుంచి రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి.

విమానమార్గం ద్వారా... ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న విమానాశ్రయం కోల్హాపూర్‌.

aMtarjaalmlo dorikina vivaraalu


Read more...

ప్రవాస భారతీయ యువకుల్లారా ! ఆపదలు బాపే హనుమద్రక్షలను అందుకుని ధరించండి.

>> Monday, June 1, 2009


ఈసంవత్సరాన అకారణ విరోధాలు ,విపత్తులు పెరుగుతాయని శాస్త్రాలు హెచ్చరించిఉన్నాయి. వీటి దుష్ఫలితాలను ముందుగా వూహించే సర్వత్రా రక్షణ కలిగించగల హనుమత్ రక్షాయాగానికి "శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం " సంకల్పం చేసి నది. భక్తజనుల రక్షణార్ధమై ఉగాదినుండి -మే 20 వరకు 54 రోజులు యాగము నిర్వహించి అక్కడ పూజలో వుంచిన రక్షలను అడిగినవారికందరకు పంపటము జరిగినది. దేశవిదేశాలలోనుండి ఎందరో భక్తులు ఈ యాగములో చాలీసా పారాయణము చేయుటద్వారా పాల్గొని సర్వరక్షకుడు,రాక్షసాంతకుడైన హనుమంతుని రక్షణ పొందారు.
ప్రపంచములో రోజురోజుకు పెరుగుతున్న దౌర్జన్య కరసంఘటనలు రాక్షస మనస్తత్వముతో కూడుకున్నవై అమాయకులెందరో బలవుతున్నారు.

భక్తజనుల రక్షణార్ధము ఈ యాగమును మరొక ఆవర్తి చేయటము ,గోత్రనామాలు పంపిన వారి కొరకు పూజించిన రక్షలను పంపటము చేయాలని శ్రీపీఠ సేవకులు ఆలోచనలో నున్నారు. ప్రస్తుతము అమెరికాలోనూ ,ఆస్ట్రేలియాలోనూ జరుగుతున్న దుర్ఘటనలను దృష్టిలో నుంచుకుని అక్కడనుండి అడిగినవారందరకూ స్వామి రక్షలు పంపాలని నిర్ణయించుకున్నాము. పీఠము జనకళ్యాణము కొరకు కార్యక్రమాలు చేపడుతున్నది. వీటి కొరకు ఎవరూ డబ్బులు పంపవలసిన పనిలేదు. కాకుంటే విదేశాలకు పోస్టలి ఖర్చులు భరించే స్థితి మాకులేనందున ఎక్కువమందికి అందే అడ్రస్ లు ఇస్తే అక్కడకు పంపటానికయ్యే పోస్టల్ ఖర్చు పంపగలిగితే ఎంతమందికైనా రక్షలు పంపటానికి ప్రయత్నిస్తాము.అయితే ఇవిధరించాలంటే ఖచ్చితముగా పాటించవలసిన నియమములు కొన్నున్నాయి.
ఇవి సాధారణముగా పాటించగల నియమాలే.
౧. నలభైరోజులు పాటు హనుమాన్ చాలీసా పారాయణము చేయాలి.
౨.ఈకాలములో మధ్యమాంసాదులు ముట్టరాదు.
౩ జీవిత భాగస్వామిని తప్ప మిగతావారిని అక్కచెల్లెల్లుగా ,అన్నదమ్ములుగా భావించి వ్యవహరించాలి.
స్వామి నిష్ఠాగరిస్ఠుడు .అధర్మ నాశకుడు ,గుర్తుంచుకోండి.
౪.బయటకు వెళ్ళేప్పుడు తప్పనిసరిగా స్వామి చాలీసా మననము చెస్తూ వెళ్ళాలి.
౫. ధార్మిక ప్రవృత్తి కలిగి అందరినీ స్వామి స్వరూపంగా భావించి గౌరవించాలి.

ఈరక్షలను ధరించుటద్వారా మీకు హాని చేద్దామనుకున్న వారిలో సహితము భీతి,పరివర్తన కలిగి మీపట్ల మిత్రత్వము వహిస్తారు. ఇతరులకు హానిచేయాలనే రాక్షస తత్వాన్ని ,రాక్షసాంతకుడైన పవనకుమారుడు నిర్మూలిస్తాడు.మీరు నియమముగా వున్నంత కాలము ఈ రక్షలు శక్తివంతములై మిమ్ము రక్షిస్తుంటాయి.
మీ గోత్రనామాలు పంపితే మీ కొరకు ఇక్కడ పూజ జరుగుతుంది . దీనికొరకు మీరేమీ పంపనక్కరలేదు . నలభైరోజుల అనంతరము మీరున్నచోట సామూహికముగా హనుమత్ చాలీసా హోమము చేసుకునే విధానము సూచించటము జరుగుతుంది .కోరినవారి పేర ఇక్కడ ని్ర్వహించటము జరుగుతుంది.

*॑ విజ్ఞప్తి.
ఈసమాచారాన్ని తెలిసినవారందరూ ,అవసరమగు వారందరకూ తెలిసేట్లుగా ప్రయత్నించ ప్రార్ధన.ఇది హనుమత్ సేవా కార్యక్రమముగా భావించ మని మనవి.

బుద్ధిర్భలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరాణాద్భవేత్
contact
durgeswara@gmail.com
9948235641


Read more...

హతవిధీ ! ఏమి దౌర్భాగ్యం దాపురించినది వేదవిదులకు .

హతవిధీ ! ఏమి దౌర్భాగ్యం దాపురించినది వేదవిదులకు .

మహిమాన్వితములైన దివ్యశక్తి ప్రసారితములైన వేద విద్యలనభ్యసించి న వేదవిదులలో కొందరి ఆచరణ ఎంతో బాధాకరముగానున్నది. అపౌరుషేయములైన వేదములు మహిమాన్వితములు. పరమాత్మ కొరకు , ఆ దైవశక్తిని లోకశ్రేయస్సు కొరకు ప్రార్థించేందుకు వేదగానం చేస్తారు. ఎవరి మెప్పుకోసము ,ధనము కోసము వేదగానము చేయరాదని ఆదివ్య విద్యలను అపహాస్యం చేసే వారి ముందు ఎట్టి పరిస్థితులలోనూ వేదగానము చేయరాదని వారి గురువులు విద్యాభ్యాస సమయము లో హెచ్చరిస్తుంటారు. ఎంతో పవిత్ర భావనతో వేదాభ్యాసము చేసి మహాశక్తి వంతులై వెలుగొందే నాటి వేద పండితులు భువిలో దేవతలవలె మన్నన పొందారు. ఎంతటి చక్రవర్తులైనా వేదవిదుల పట్ల వినయ విధేయతలను చూపేవారు. వారికి ఆగౌరవము వారి భౌతిక శక్తివలననో భౌతిక సంపదలవలననో రాలేదు . కేవలము వేదాభ్యాసము వలన వచ్చిన శక్తి అది.

నేటి పరిస్థితి ఏమిటి. రాజకీయ నాయకులు వస్తుంటె చాలు ,పరుగులెత్తి వెళ్ళి వారి ముందు వేదగానము చేయటము జరుగుతున్నది. డబ్బు పడేస్తే చాలు వాళ్ళే మంత్రాలు చదువుతారనే చులకనభావము ఏర్పడినది. ఎందుకు? ఎందుకంటె అటువంటి భావనను కలిగించుకొనుటలో పోటీపడి పనిచేస్తున్నకొందరివలన.
చూడండి .వేదపండితులు శ్రద్దా శక్తులు లేకుండా ఆలయాలకువచ్చే మంత్రులకు, రాజకీయ నాయకులకు చేస్తున్న మర్యాదలు హడావుడి టీవీలలో చూస్తుంటే ఎంతబాధ కలుగుతుందో . ఇక ఈధర్మము పట్లగాని ,ఈ వేదవిద్యలపట్లగాని ఏమాత్రం శ్రద్ధాసక్తత లేని పాలకుల దగ్గరకు పరిగెత్తి మరీ చేస్తున్న వేదగానం వీరికి విద్యలను చెప్పిన మహానుభావులకు ఎంతవేదన కలగజేస్తోందో. గతములో హైదరాబాద్ లో ఆశ్వమేథ యాగము చేస్తున్న పండితులు అక్కడకు చెప్పులు కూడా విడవకుండావచ్చిన రాజకీయనాయకుని కనీసంవారించటం కాదు,ఆశీర్వచనాలతో ముంచెత్తినవైనం టీవీలలో చూసి ఆస్థికులు తల్లడిల్లారు.
ఇక మంత్రివర్గ ప్రమాణ స్వీకారాలలో చూడండి . ప్రస్తుత స్థితి. పాపం పాలకులకు ఈ ధర్మం పట్ల ఏమాత్రం గౌరవం లేదు. వేదవిదులు వేదగానం చేసి ఆశీర్వదించినా నమస్కారం చేయటముగాని లేచినిలబడి అభివాదము చేయటముగాని చేయరు. కాని వారికి నమ్మకమైన మతగురువులు వచ్చినప్పుడు ఎంతో భక్తి శ్రద్దలతో లేచినిలబడి ఆశీస్సులందుకుంటారు. ఇది తప్పుకాదు.అది వారి విశ్వాసము. విశ్వాసము లేనివారి కొరకు వేదమంత్రాలను పఠించవలసిన ఖర్మ మనకెందుకు పట్టినదా ?అని.
తిరుమల లాంటి పవిత్ర సన్నిధానానికొచ్చినా అక్కడ శ్రీవారి పట్ల తమకు నమ్మకమున్నదని తాము విజిటర్స్ పుస్తకంలో సంతకం చేయరు. కాని ఆయనెవరో డాలర్ శేషాద్రట పరిగెత్తు కెళ్ళి ప్రసాదాలిస్తుంటాడు కెమెరాలకు అడ్దంబడి మరీ. ఇక శ్రీవారిని నిరంతరం సేవించుకునే భాగ్యం కలిగిన అర్చకులు సహితం ఆయనపట్ల నమ్మకమేలేనివారికి ఇల్లకెళ్ళీ మరీ ప్రసాదాలివ్వటం ఎంతవిచారకరం? వారికి అభిమానముంటే వ్యక్తి గతంగా వెళ్ళొచ్చు. కాని వీళ్ళకు తెలుసు వ్యక్తిగతంగా శ్రీవారి పేరు చెప్పుకోకుంటె తమను గడపకూడా తొక్కనివ్వరని . మరి ఇంత దివ్యభాగ్యాన్నిచ్చిన శ్రీవారి ప్రసాదాన్ని నమ్మకం లేని వారికిచ్చి అపవిత్రం చేయటం తగునా.
ఈ నాయకులు ,ధనవంతులు పుడతారు పోతారు. కాని అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని స్తుతించే వేదవిద్యలను ఈ విధముగా దుర్వినియోగం చేయుట పాడియా ? ఆలోచించాలి పెద్దలు.
వచ్చేవారు ఏమతానికి చెందినవారైనా ఆవేద విద్యల పట్ల నమ్మకముంటే మీరు వారికొరకు ఆదివ్యవిద్యలతో పరమాత్మను ప్రార్ధించవచ్చు. కాని జరుగుతున్నదేమిటి? వీరి ఆదరణ లతోటె మన జన్మ గడవటము లేదు. ఈనాటి స్థితిని మీకు ఈ మానవులివ్వటము లేదు .అవిదైవమిచ్చినవిద్యలు.అనర్హులముందు వేదగానము చేసి శక్తిహీను లైనమిమ్మల్ని ఎవరూ గౌరవించరు. దైవకోపానికి గురవుతారు .

పాలకులు కూడా ఆలోచించాలి. మీరంతా వేదవిద్యలను నమ్మమని ,వాటి ప్రకారం ఆచరించమని కోరటం లేదు . మీ విశ్వాసాలకు అనుగుణముగా మీరు దైవప్రార్ధనలను చెసుకోండి. తప్పులేదు. మీకు నమ్మకం లేని మత కేంద్రాలకు వెళ్ళి అక్కడ నటన చేసి [అది ఆలయం ,చర్చి.మసీదు ఏదైనా కావచ్చు] దైవ ప్రార్ధనలను వ్యాపారం చేయవద్దు.
సొమ్ముకోసము గర్వించి వేదవిద్యలను ధర్మ వ్యతిరేకంగా వినియోగించటము ఏఫలితాన్నిస్తుందో :శ్రీగురుచరిత్రలో" మనకు ప్రమాణాత్మక అనుభవాలు కనపడతాయి.మీకు తెలియనిది కాదు. కలి పురుషుని ప్రభావం చే వర్ధిల్లుతున్న ఈ అనాచారాలను ,నశింపజేయాలని
ఎన్ని జన్మల పుణ్యఫలితంగానో లభించిన ఈ దివ్య గానాన్ని పరమాత్మ కోసము మాత్రమే చేయాలనే సద్బుద్ధి ,అందరి లో కలుగజేయాలని పరమ గురువు ఆదత్తాత్రేయుని ప్రార్ధిస్తున్నాము. ఎవరి మతధర్మము పట్ల వారు శ్రద్దాసక్తులుగలిగి పరధర్మములపట్ల గౌరవాభిమానాలను మామనస్సులలో పెంపొందించమని ఆపరమగురువు చరణారవిందములకు ప్రణమిల్లుతున్నాము.



Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP