నాకు ఇప్పుడు రెండు సంకటాలు ఎదురయ్యాయి. మొత్తం మూడు కుటుంబాల లో దాంపత్యజీవితం ప్రమాదం లో పడినది.ఇందులో ఒకటి భగ్నమయినది ఆల్రెడీ.ఇక రెండు కుటుంబాలు ప్రమాదపు అంచులో వున్నాయి. దీనికి కారణాలను వెదుకుతూ సమస్య పరిష్కారాన్ని ఎన్నిరకాలుగా ఆలోచించినా అన్ని రకాల కారణాలు కన్పడుతూ మరింత సంక్లిష్టంలో పడవేస్తున్నాయి.మూల కారణాన్ని కనుగొనేందుకు నేనుచేస్తున్న ప్రయత్నానికి మీ సహ్హయం కూడాలభిస్తుందేమోనన్న ఆశతో మీముందుకూడావుంచుతున్నాను.
**************************************************************************************
ఒకటి
ఇది నా భార్యతరపున చుట్టాలైన ఒక అబ్బాయి కథ. వానికి రెండుసంవత్స్రాలక్రితం ఒక సంబంధం కుదిరినది. వినుకొండలోనే ఒక సంబంధం. అమ్మాయి నర్స్ గా ఉద్యోగం చేస్తున్నది .ఇదే జిల్లాలో. వాళ్ళు కన్వర్టేడ్ క్రిష్టియన్స్ . సంబంధం మాట్లాడుకున్నాక ముహూర్తాలు పెట్టు కునేటప్పుడు నన్ను రమ్మని పిలచారు. వెళ్ళాను అమ్మయి వాళ్ల ఇంటికి వాళ్ళు కూడా తమ ఇంటి లో వెంకటేస్వర స్వామివారి కాలెండర్లు ,ఫోటోలు తెచ్చి తగిలించారు. మగపెళ్ళివారి ఆచారాలను గౌరవించాలనో లేక మరేమోగాని వాళ్ళ ప్రయత్నాలు వాల్లు చేసుకున్నారు. ఇక నాకెందుకో వీనికి ఈ అమ్మాయి తో ఎక్కువనాల్లు పొసగదు అనిపించింది. ఎందుకంటే వీనికి బుద్ది నిలకడ తక్కువ .కొంగరి చేస్టాలు,మాట్లాడే టప్పుడు నాటకీయఫక్కీలో మాట్లాడటం ఇవి వాని లక్షణాలు. ఏదో కంప్యూటర్ వర్క్ చేస్తూ గుంటూరు లోనే సంపాదిస్తున్నాడు.కానీ వీని నిలకడ లేనితనం ను సరిదిద్దుకుని సంసారం సాగించాలంటే దాన్ని నిలుపుకోవాలంటే ఆడపిల్ల చాలా సమర్ధురాలై ఉండాలి. కాడి గట్టినప్పుడు ఒక ఎద్దు దుడుకుగా లాగినా రెండవది తన సామర్ధ్యం తో నడవగలిగితే మొదటిది తప్పనిసరయి సరిగా నడకకొస్తుంది. ఇదే సంసారజీవితాన్ని లాగే భార్యా భర్తలకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు వేరే చెడు అలవాట్లు లేవుగాని వీని ద్ ఆలోచనావిధానము వీని సంసార జీవితాన్ని సవ్యంగా సాగనివ్వదు. అది ఆ అమ్మాయి సర్దుకుని పోయే మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఇదే అబ్బాయి వాళ్ళమ్మ అడిగితే చెప్పాను.
పెళ్లయింది .గుంటూరు లొనే కాపురం పెట్టారు, ఒకమ్మాయి పుట్టినది. నేననుకున్న విధముగానే మొదలయినది ఇద్దరి మధ్య గొడవ. నువ్వెంత అంటే నువ్వెంత .నువ్వుసంపాదిస్తే నెను సంపాదించటం లేదా? నీమీద ఆధారపడటం లేదు నేను. ఇలా సాగుతున్నాయి వీళ్ల గొడవలు.దూరమయ్యారు.మధ్యవర్తులు వెళ్ళి వచ్చి వీళ్ళిద్దరిలో ఎవరూ సర్దుకునేవారు లేరు అని తేల్చారు. చివరకు అమితుమీ తేల్చుకోవాలని మొదలు పెట్టారుప్రయత్నాలు .అబ్బాయి వాళ్లమ్మ నన్ను ఒక్కసారి మాట్లాడమని బతి మాలితే అబ్బాయితో మాట్లాడి చూసినప్పుడు వాని లోపాలు అమ్మాయి లోపాలు కనపడ్డాయి.ఇంతకంటే అమ్మాయి తరపున పెద్దవాళ్ల లోపం ఏమిటో అర్ధమయినది. కనీసం పిల్లలకు సమస్యలను ఎదుర్కోవటములో ఆడపిల్లలకివ్వవలసిన శిక్షణ ఇవ్వలేదు. భార్యా భర్తల మధ్య ఉండవలసిన సంబంధాలను బోధించటమ్ లోపించింది వీళ్ల పెంపకంలో. ఇక అబ్బాయి చెడు అలవాట్లు లేకున్నా ,సరయిన శిక్షణ లేదు. నాకు వెంటనే విడాకులిప్పించు వాళ్లతో మాట్లాడి అని అడిగాడు. కలపాలని ప్రయత్నించటం తప్ప విడాకులిప్పించే పాపం నావల్ల కాదని చెప్పి వచ్చేశాను.
ఆతరువాత వాళ్ళు విడాకులు తీసుకున్నారు. ఏమైంది విడాకులిస్తే వీడుకాకుంటే ఇంకొకడు అని అమ్మాయి తరపు వాళ్ళు.ఇదికాకుంటే మరొకటి అని అబ్బాయి వాళ్ళు అనుకున్నారు.
*******************************************************************************************
రెండవ కథ...
నేను పనిచేసే పాఠశాలలో jayakumar అనే ఉపాధ్యాయుడు చేరాడు. అతని మామగారయ్యె చుట్టం డీయివో కార్యాలయం లో పెద్దవుద్యోగి.అతని కూతురు కూడా మామండలములోనే ఉద్యోగమ్ లొ చేరింది. ఇద్దరికి నాలుగు నెలలో పెళ్ళి చేశారు. వినుకొండలో కాపురం .నన్ను బావా అనిపిలుస్తాడు. వాళ్ళుక్రిష్టియన్లు. హిందూ ధర్మాన్ని ఇతిహాసాలను విమర్శిస్తాడు నాతోనే. ఇవి భగవంతునికి మాత్రమే సంబంధించిన విషయాలు కావు. మానవజాతి ప్రవర్తనను శాసించి,నియమాను సారంగానడిపించే ధర్మ సూత్రాలు అని నేను చెప్పటం మామూలయింది. వ్యక్తిగతంగా మనుషులను నేను ఎప్పుడూ ద్వేషించను.కారణం నాకు నాధర్మం నేర్పిన విశ్వాసం "ఎవరు నమ్మినా నమ్మకున్నా సత్యమెప్పుడూ మరుగుకాదు అనేది." కనుక అన్ని మతాలవారూ నాతో స్నేహానికి ఏ అడ్దంకులూ లేకున్నారు.
ఇక ఇతనికి తన భార్య పట్ల ప్రేమ చాలా ఎక్కువ.పేదరికం లోంచి వచ్చినవాడు.ఇక అమ్మాయి నాన్న ఉద్యోగస్తుడు కనుక ఆ అమ్మాయికి కాస్త గర్వం వున్నట్లు కనపడేది. మాతో మాత్రం గౌరవంగానే మాట్లాడేది.
ఇద్దరమ్మాయిలు పుట్టారు.మాయింటి కొచ్చినప్పుడల్లా మా అక్క ఇంతగా చేస్తుంటే నువ్వు కులుకుతున్నావు,అందరూ అలావుండరు.మాఇల్లలో చూడు నువ్వు సంపాదిస్తే,నేనుసంపాదించటం లేదా అన్న ధోరణిలో వుంటాయి వ్యవహారలు అని అంటూ వుంటాడు. ఇతను బయట సాయంత్రం కాలేజీలలో కూడా పనిచేసి కష్టపడిసంపాదిస్తాడు. కొద్ది కొద్దిగా వీళ్ల మధ్య ఆధిపత్యధోరణులతో రాధ్ధాంతాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. వీళ్ల మామ గారు వచ్చినప్పుడల్లా ఇతనిని గదమటము,ఇతనేమొ వాళ్లమామంటే భయంతొ అణగిమణగి ఉండటము ఎలాగో గడచిపోయేది. ఇక ఇతని తల్లిదండ్రులు కూడా ఇతని దగ్గరుండాలని వస్తే పెద్దగొడవ. వాళ్లకు నేను సేవలు చేయాల్సిన అవసరం లేదని ఆమె వాదన. కానీ వాళ్లమ్మగారు పాపం సర్దుకుని తానే అన్ని పనులు చేస్తున్నా వీళ్ళు వుంటే నాకు కుదరదని బెదిరింపులు. పాపమా తల్లిదండ్రులు మానుంచి నీసంసారం లో చిచ్చులెందుకులేయ్యా! అని వాళ్ల సొంతవూరు పొన్నూరు వెళ్ళి పోయారు. మాకప్పుడప్పుడూ ఇంట్లో తన బాధలు చెబుతూవుండేవాడు.దగ్గరకనుక ప్రతిసారీ ఈఅమ్మాయి నరసరావుపేట తన పుట్టింటి కెళ్ళటం .ఈకుర్రాడు పోగానే వాళ్ల అమ్మానానలు పలు మాటలు అనటం,ఇలాజరిగిపోతున్నది.
ట్రాన్స్ఫర్ లొచ్చాయి.అందరం కౌన్సిలింగుకు వెళ్ళాము. ఇక్కడ వుంటే మీ వాళ్ల జోక్యంతో నాకు కుదరదు. మనం పొన్నూరు ప్రాంతానికి కోరుకుందామని ఇతను.వీల్లేదు నరసరావు పేటలోనైతే అన్నిటికి మా నాన్నవాళ్ళు తోడుగావుంటారు.కాబట్టి నరసరావు పేట కోరుకుందాము మావాళ్ల ఇల్లు కూడా వుంది అద్దెకూడా అవసరం లేదని ఆ అమ్మాయి,వాదన.
అక్కడకైతే నేనురాను అని ఇతను నువ్వొచ్చినా రాకున్న నేను నరసరావుపేటకే వెళతానని ఆమె ఇద్దరూ ఎడమొఖమ్ పెడమొఖమ్ గా గుంటూరు కౌన్సిలింగ్ కువచ్చారు. అతను నాదగ్గరకొచ్చి ఇక సహించటం నావల్ల కాదు,నరసరావు పేట లో వాళ్ళింటికి వెళితే నాబతుకు కుక్క బ్రతుకే. నేను తెగతెంపులు చేసుకోవటానికైనా సిద్దమే. ఇలా మా వద్దకు వచ్చి బాధపడ్డాడు. ఇక తప్పక నేను వాల్లకు కొద్దిగా సన్నిహితంగా వుండే మరి ముగ్గురు టీచర్లను పిలచి అక్కడే అందరం కూర్చుని వాళ్లకు సర్ది చెప్పటం మొదలెట్టాము. భార్యా భర్తల మధ్య మరొకరు తలదూర్చవలసిన అవసరం రావటం ఎంత బాధాకరమో ,చెప్పి,కొన్ని మానసంబంధాలు,వాటిపట్ల మన బాధ్యతలు,ఇంతకంటె ముఖ్యంగా మీఇద్దరూ విడిపోతే పిల్లల భవిష్యత్తు ఎలావుంటుందో వాళ్లకు వివరించాను. మీ ఇద్దరి పట్టుదలలకు పిల్లలను బలి చేసే హక్కు మీకెక్కడిదని? అలాంటివాళ్ళు పిల్లలను ఎందుకు కన్నారని? వాళ్ళను కొద్దిగా మందలించి మొత్తానికి ఒక రాజీకి ఒప్పించాము.నన్ను నరసరావుపేటలో వుండేట్లు చేస్తే నాచావు చూస్తావు బావా,నువ్వు అని అతను బాధ పడ్దాడు.ఏమికాదులేవయ్యా సంసారం లోఇవన్నీ సహజమే అని సర్దిచెప్పి సాతులూరు మండలము కోరుకునేటట్లు, నరసరావు పేటలో వేరే చోట ఇళ్ళుతీసుకుని వుండేటట్లు ఒప్పించాను.మూడు సంవత్స్రరాలు కావస్తున్నది. ఈమధ్య నేను పెద్దగా వాళ్ళవిషయం పట్టించుకోలేదు.. నాలుగు నెలల బట్టి అతను ఫోన్ చేస్తున్నాడు. నువ్వు చేసిన పనికి నాకు నిత్యం నరకమయినది.ఆరోజే నేను మావూరు వెళ్ళి పోయివుంటే హాయిగావుండేది. నా పరిస్థితి ఎలావున్నదో నీకుతెలియదు.
మామామ వీడుకాకపోతే ,ఇంకొకన్ని చేస్తాను అంతేకాని వీడుచెప్పినట్లు నువ్వు వినేదేమిటని మా ఆవిడను తన ఇంటిలోనే వుంచాడు .తనకున్న అంగబలంతో నన్ను బెదిరించి కొన్నస్థలాలు అన్నీ ఆ అమ్మాయి పేర వ్రాపించాడు. నన్ను తన ఇంట్లో పడివుండమంటున్నారు.మా అమ్మానాన్న ఊసెత్తవద్దంటూన్నారు,అని దు:ఖపడుతున్నాడు.నువ్వొచ్చి చెప్పమంటున్నాడు.ఏమిచేయాలి.? భార్యా భర్తల మధ్య వుండాల్సినది సమానత్వాలు,సమానబాధ్యతలూనా?ప్రేమాభిమానాలా?అసలు ఇంత కు లోపము ఎక్కడున్నది. స్త్రీధర్మాలను మనసంస్కృతిని బోధించకుండా పెంచిన తల్లిదండ్రుల లోపము లేదా ఇక్కడ.నిన్ననే ఫోన్ చేశాడు మరలా.నేను పొన్నూరు చేరాను.అక్కడ వుండటం నావల్లకాదు. విడాకులకు వాళ్ళు సిద్దమయ్యరు తప్ప నావెంటరావటానికి ఒప్పుకోలేదు మా ఆవిడ.విడాకులు తీసుకుంటాను,అంటున్నాడు. ఆరోజు అంత చెప్పిన పెద్దమనిషివి ,ఈరోజు వెళ్ళి వాల్లను గదిమావా?అని అడుగుతున్నాడు. వెళ్ళి ఏదన్నా మాట్లాడదామన్నా, ఆ అమ్మాయి వింటూన్నదన్న నమ్మకము లేదు. పాపం ఆపిల్లల పరిస్థితేమిటని బాధ కలుగుతున్నది.నేనేమి చేయాలి.భగవాదరాధన రూపములో ఏదన్నా సహాయం చేద్దామంటే ,నన్ను మతమార్పిడికి ప్రయత్నించే నీచుల జాబితాలో లెక్కవేస్తారేమోనని భయం.
*******************************************************************************************
ఇక మూడవ కథ
ఈమధ్య నా దగ్గరకొక వ్యక్తి వస్తున్నాడు. విలేఖరి గాపనిచేస్తున్నాడు దినపత్రికలో .మంచివాడు. ఇతను తన బాధను చెప్పుకొస్తున్నాడు. తన భార్యకు ఉపాధ్యాయురాలిగా జాబ్ వచ్చినది. తెలాంగాణ ప్రాంతం లో నుండి కశ్టపడి వినుకొండకు తీసుకొచ్చాడు.ఆ అమ్మాయి వాళ్ళు కన్వర్టెడ్ క్రిష్టియన్స్ ,వాళ్ల ఆచారాలు వ్యవహారాలు వేరయినా ఇతను సర్దుకుని పోతుండేవాడు. ఇక అమ్మాయి వాళ్ల అమ్మగారికి నాన్నగారికి ఇద్దరూ ఆడపిల్లలవటముతో ఈఅమ్మాయి ఉద్యోగస్తురాలు కూడా అవటముతో.అమ్మాయి తమతోనే వుండాలని అమ్మాయిని తమతోనే వుంచారు. ఇతనికి జాతకప్రభావమో,ఏమోగాని అతను చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యి ఏపనిలోనూస్థిరపడ లేక పోయాడు. మానసికంగా కొద్దిగా డిసప్పాయంట్ అయ్యాడు.కొద్దిగా కలతలు.అమ్మాయి ఉద్యోగం తో నే వాల్ల అమ్మనాన్నల కుటుంబము కూడా గడపాలి. ఇద్దరికీ తగాదాలు .విడిపోయారు ఇద్దరు పిల్లలు తల్లి దగ్గరె వున్నారు. ఇతన్ని ఇంటికి రానీయరు. ఇప్పుడు 40 సంవత్సరాలు వచ్చాయి ఇంకా గొడవలెందుకు అని ఇతను సర్దుకుని కలవాలనుకుంటున్నా విడాకులిస్తాగాని నిన్ను రానివ్వనని ఆమే పట్టుదల. ఈమధ్య ఇతను నన్ను మాష్టర్ గారూ నాకుటుంబాన్ని నిలబెట్టమని ,మీచేతులతో ఎందరికో సహాయం చేస్తున్నారు, నావిషయం చూడమని బాధ పడుతున్నాడు. ఆమెగురించి కొందరు వుపాధ్యాయమిత్రులను,యూనియన్ నాయకులను విచారించాను ,వాళ్ళంతా ఆమె పెద్దగా తెలివిగలిది కాదండీ , అని తన గురించి వివరాలు చెప్పారు. ఆవిషయం అర్ధమవుతూనేవుంది ,లేకుంటే అమ్మనానలను తన బంధువులను పోషిస్తూ రేపు తన బిడ్దల భవిష్యత్తు ,తన భర్త గురించి ఆలోచించని ఆమె తెలివి తేటలు ఏపాటివో.ఒకసారి పూజచేపిద్దామని రమ్మని అడిగి చూడమన్నాను.పాపం అతను అడిగితే ఆ అమ్మాయి తిక్కలగా మాట్లాడుతున్నదే కాని తన కాపురం సరి చేసుకుందామని ప్రయత్నించేలా లేదు. తనకు భర్తను ,కాపురాన్ని సరిచేసుకోవాలనే భావన లేదు. మన సంస్కృతీ సాంప్రదాయాలను ఆమెకు అందించకుండా పెంచిన తల్లిదండ్రుల పెంపకం ఇలా వున్నది. విడాకులు,,,,విడాకులు ఏమిటీ సంస్కృతి .తీసుకుని ఏమి బావుకుంటారు.? సహనము ప్రేమతో కాపురాలను సరి చేసుకునే స్త్రీలను .ఆ మనస్తత్వం నుండి వేరు చేస్తున్నదెవరు? మగవాళ్లంతా మంచివాళ్లని ఆడవారి మీద తప్పులు మోపటము లేదు నేను. కాని భూదేవంత సహనంతో దారి తప్పిన భర్తలను కూడా పరివర్తనతో దారికి తెచ్చుకోగలైగిన ఈదేశ స్త్రీ మూర్తులు కూడా ఇలా ఎందుకవుతున్నారు? పుట్టిన బిడ్దల కు తగిలే మనోఘాతాలు భవిష్యత్తు లో వాళ్లనేమి చేస్తాయి> ఆలోచిస్తున్నారా? నాకు అయోమయం గావున్నది.ఏమి చేయాలో వాళ్లకు ఎలా చేతనయినంత సహాయం చేసి కాపురాలు ఎలా నిలబెట్తాలో తెలియక. మీలో ఈవిషయాల లో నిష్ణాతులైన మేధావులు వున్నారు.
ఈ సమస్యకు బలైన వాళ్ళు వుండవచ్చు. కొద్ది సేపు సమాన హక్కులు , చట్తాలు జోలికి వెళ్లకుండా ఈపరిణామాలకు అసలు కారణాలు విష్లేషించండి. మీ కుతోచిన పరిష్కారాలు చెప్పండి ,విడదీసే పాపం కాకుండా.ఇవన్నీ స్నేహితులుగా లోకం యొక్క భావాలు ఎలా వున్నాయో వారి ప్రవర్తన పట్ల వాళ్లకు చూపుతా.అదృష్టం బాగుండి ఈప్రయత్నం వల్లనైనా ఒకకుటుంబం విచ్చిన్నం కాకుండా కాపాడగలిగినా ధన్యులమే.[ వ్యక్తుల పేర్లు మార్చాను ]
Read more...