శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నవరాత్రులలో అర్చన జరిపించుకొనుటకు గోత్ర నామాలు పంపండి

>> Monday, September 29, 2008


అమ్మలగన్నయమ్మ, దుర్గమాయమ్మ ,అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు,శ్రీవేంకటేశ్వర స్వామి, చిదానంద పరమాత్మ రామలింగేశ్వరస్వామి వారల సమేతులై శ్రీ పీఠములో కొలువుదీరియున్నారు. మహగణపతి, గురుదత్తాత్రేయ,కుమారస్వామి,హరిహరసుత అయ్యప్ప,నవగ్రాహది పరివారదేవతా సమేతముగా భక్తజన రక్షకులు హనుమంతులవారు పీఠరక్షకులై భక్తుల బ్రోచుచున్నారు. భక్తజనుల క్షేమ,శ్రేయస్సులకోసం, లోకములోని సకలజీవుల ఆర్తిని బాపాలని ప్రార్ధిస్తూ ఆ జగన్మాతకు, దుష్టజన శిక్షకురాలు,భక్తజన పరిపోషకి కి నవరాత్రి పూజానివేదనలు భాగవత సాంప్రదాయములో ,భక్తిమార్గములో జరుపబడుతున్నాయి. ఎందరో ఆర్తులు అమ్మను ఆశ్రయించి తమ అభీష్టాలను నెరవేర్చుకుంటున్న సిద్ధ స్థలమీ పీఠము. తమగోత్రనామాలు పంపిన వారందరి తరపున కూడా అమ్మకు జరిగే సేవలలో నివేదనలు జరుగుతాయి. భక్తుల అభీష్తాలు శీఘ్రముగా నెరవేరుటకు పేర్లు పంపినవారు. ఇక్కడకువచ్చి ఉపాసన చేసుకొనుటకు భోజన,వసతులు కల్పించబడతాయి. రాలేనివారు తమగోత్రనామాలను పంపి మీరున్న చోటనే ఈతొమ్మిదిరోజులు మధ్యమాంసాదులు ముట్టకుండా నిష్ఠతో,లలితా సహస్రనామ పారాయణాదులు,సప్తశతి పారాయణాలు సాగించుకొనవచ్చు. అమ్మవారి ఒక్కొక్క నామము తో ఒక్కొక్క కష్టం తీర్చుకొని అభీష్టములను నెరవేర్చుకొనవచ్చు. మీసమస్యను తెలిపితే ఏ నామాన్ని సాధనలో ప్రయోగించుకోవాలో మాకు తెలిసిన వరకు చెప్పగలము. వీటిని సంపుటీకరణమంత్రాలు అంటారు. ఇది సిధ్ధప్రయోగము. పరిశీలించి చేపించి చాలామందికి ఫలితాలు రావటము అనుభవపూర్వకముగా చూసాము. మనభక్తిలో లోపమున్నదేమో కాని ఆనామాలలోశక్తి అనంతము

ప్రతిరోజూ జరిగే సేవా కార్యక్రమాలు.

ప్రభాత సమయము: సుప్రభాతము. బాలభోగము
సంధ్య హారతి
ఉదయము : పురుషసూక్త శ్రీసూక్త ,రుద్రసూక్తాది వేదసూక్తాలతో అభిషేకములు.
అలంకరణలు ,మొదటిపూజ అర్చనలు.
9 గంటలకు : శ్రీచక్రార్చన ,కుంకుమ పూజలు, హారతులు.
11గంటలకు : యజ్ఞము
12 గంటలకు | మధ్యాహ్న పూజ , సంద్యహారతి ,మహా నివేదనలు.
సాయంత్రం 6గం. : సంధ్యహారతి. సాయం కాలార్చనలు. తదనంతరం అమ్మవారికి సంకీర్తనా సేవలు.
రాత్రి 10.30 ని. : అమ్మవారికి డోలోత్సవం ,పవ్వళింపుసేవ
08-10-2008 : మహర్ణవము ప్రత్యేక ఉత్సవము 9-10-2008 : పూర్ణాహుతి
పీఠ సాంప్రదాయాన్ననుసరించి మహర్ణవమి రోజున ప్రత్యేక ఉత్సవము, ప్రత్యేక పూజలు ,అన్నదానము నిర్వహించబడతాయి.
ఈ కార్యక్రమాలన్నింటిలోనూ భక్తులపేర్లమీద నివేదనలు జరుగుతాయి. దీనికొరకు ఎటువంటి రుసుములు నిర్ణయింపబడవు. భక్తులు తమఇచ్చితార్ధం గా పంపిన డబ్బును వారు కోరిన సేవలో ఉపయోగించటం జరుగుతున్నది. అది ఎంత అన్నది వారిష్టము. పంపదలచుకున్నవారు మాకు ఫోన్ చేసి చెప్పగలరు. కానీ డబ్బు పంపితేనే పూజలు జరుపుతారని అపోహ పడవద్దని ప్రార్ధన. మీఅందరకూ ఆ జగన్మాత పూజానంతరము ,రక్షలు,కుంకుమ ప్రసాదము పంపవలెనన్న ,పోష్టుఖర్చులు మీరేభరించవలసి వుంటుంది.

Read more...

బ్లాగ్లోక సోదరీ,సోదరులందరకు,ఆహ్వానం.

>> Sunday, September 28, 2008


65 సంవత్సరాలక్రితం మా జేజినాయన గారు. అమ్మ అనుగ్రహానికి పాత్రులై స్థాపించిన శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠములో సర్వజిత్ నామ సంవత్సర శరన్నవరాత్రి ఉత్సవములు ఈ నెల 30 వతేదీ ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి ప్రారంభమవుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రతిఏటా మాకుతెలిసిన వారిని,బంధువులను,స్నేహితులనందరినీ ఆహ్వానించటం ఆనవాయితీ. అమ్మ సంకల్పమేమో కంప్యూటర్ రంగములో ప్రవేశమేలేనినేను మూడున్నర నెలల కాలము క్రితం బ్లాగులోకంలోకి ప్రవేశించటం, ఎందరో భక్తజనులు,మేధావులు,దార్శనికులు, స్వాప్నికులను పరిచయంగా పొందటం అమ్మ సంకల్పమని నేను భావిస్తున్నాను. ఏ ఋణానుబంధం లేనిది ఎవరికి ఎవరు తటస్థపడి పరిచయమవరని నానమ్మకము. "ఎదుటా ఎవ్వరులేరు అంతా విష్ణుమయమే ,వదలక హరిదాసవర్గమైన వారికీ....................అని పాడిన అన్నమయ్య పాటలోని అర్ధమే మాబాట. కనుక మీరంతా నాకు ఆత్మ బంధువులే. మేము అమ్మకు చేస్తున్న ఈ సేవలలో మీరందరూ పాల్గొనేందుకై సకుటుంబ బంధువర్గ సమేతంగా ఆహ్వానిస్తున్నాము. మంచిమనసున్న మీరంతా వ్యక్తిగతముగా వచ్చి పిలవలేదని భావింపక మన్నించి రాగలరని మా కోరిక.
భక్తజన పాదదాసుడు
దుర్గేశ్వరరావు
శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం
రవ్వవరం,నూజండ్ల మండలం గుంటూరు జిల్లా

Read more...

లలితానామసహస్ర నామ ప్రయోగాలు

>> Friday, September 26, 2008

[ లలితా నామ సహస్రనామలను ఎలా ఉపయోగించి .....2][35వశ్లోకం ను0డి అనువాదం ]

యే క్రూరదృష్ట్యా వీక్షంతే నామసాహస్ర పాఠకం
తా సంధాన్ కురుతే క్షిప్రం స్వయం మార్తాండభైరవ:
సహస్ర నామ పఠనం చేసేవారిని ఎవరైనా దుష్టంగా చూస్తే అట్టివారిని మార్తాండ భైరవుడు స్వయంగా వారిని అతితక్కువ కాలమ్లో అంధులను చేస్తాడు. ... సహస్రనామ పఠనం చేసేవారి సొమ్మును దొంగలించిన చోరులను ఎక్కడవున్నా సరే క్షేత్రపాలుడు వారిని సంహరిస్తాడు. ఎవరైనా సహస్ర నామోచ్చారకునితో వాగ్వాదకునితో తలపడితే అటువంటి వారికి నకులేశ్వరి నోటిమాటలేకుండా చేస్తుంది.
ఏ ప్రభువైనా నామ పారాయణం చేయువారితో కయ్యం పెట్టుకుంటే ,అలాంటి ప్రభునికి గల చతురంగబలాలను దండినీదేవి నశింపజేస్తుంది. భక్తు లెవరైనా ఆరునెలల పాటు పారాయణం చేస్తే అటువంటివారి యింట లక్ష్మీదేవి వదలక స్థిరంగా వుంటుంది.

దినమునకు మూడుసార్లు చొప్పున ఒక మాసం రోజులు దీక్షగా పఠనం చేస్తే అటువంటి వారి నాలుక మీద వా గ్దేవి సర్వదా నాట్యం చేస్తూవుంటుంది.
యస్త్వేకవారం పఠతి పక్షమాత్ర మతంద్రితి: మహ్యంతి కామవశగా మృగాక్షస్తస్య వీక్షణాత్ "
య: పఠేన్నామ సాహస్ర0 జన్మ మధ్యే సకృన్నర: తదృష్టిగోచరా త్సర్వే ముచ్యంతి సర్వ కిల్భిషై :
జీవిత గమనం లో ఒక్క సారైనా నామపారాయణం చేస్తే అట్టివారిని చూచినంతనే సర్వ పాపములు నశించిపోతాయి. సహస్రనామ పారాయణం చేయు భక్తులకు అన్నమూ వస్త్రం ,ధనం ,ధాన్యందానంగా యివ్వడం మంచిది. పండితులైనవారు శ్రీ విద్యను జపించేవారిని శ్రీచక్రారాధన చేయువారిని సహస్రనామాలను పఠించేవారిని సత్పురుషులుగా తెలుసుకుంటున్నారు. లలితా దేవి భక్తులకు ఆమె సంప్రీతికై ఎవ్వరు ఏదానం చేసినా అట్టివారిని మెచ్చుకుని శ్రీదేవి సంతోషిస్తుంది. సహస్ర నామ పారాయణం శ్రీవిద్యారహితులకు చేయు దానములు నిరర్ధక మవుతాయై . బుద్ధి మంతులు దానాదులను చేసేటప్పుడు శ్రీవిధ్యానిధులను పరీక్షించి చేయవలెను. శ్రీ మంత్ర రాజంతో సమానమయిన మంత్రం లేదు
కుంభసంభవమునీ దేవతలలో లలితతో సమానమైన వారు లేనట్లే లలితా సహస్రనామముతో సమానమయిన స్తుతి మరొకటి లేదు. మంచిదయిన ఈ స్తోత్రరాజాన్ని గ్రంథముగా వ్రాసి వుంచుకుని భక్తిభావంతో పూజించేవారిని తెలుసుకుని అమ్మ ఆనంద పడుతుంది. చాలా మాటలు చెప్పి ఏమిలాభం ? అన్ని తంత్రాలలోనూ ఈ సహస్రనామములతో సాటి చెపదగినది,ఇంకొకటి లేదని తెలుసుకో.... ఈకారణం చేత శ్రీ విద్యారాధకులు ఈ స్తోత్రరాజాన్ని గౌరవ భావంతో సర్వదా పఠించాలి.
పద్మాలు,తులసీదళాలు, కలువలు, కడిమి పూలు,సంపంగి పూలు,జాజి పూలు,మల్లెపూలు ,ఎర్ర గ న్నేరు పూలు ,ఎర్ర కలువలు,బిళ్వపత్రాలు,మొల్ల పూలు,పొన్నపూలు, ఇంకా కమ్మని సువాసన గల పూలు మొగలి పూవులు,పూలగురివింద పుష్పాలు మొదలైన పలురకాల పువ్వులతో సహస్రనామార్చన జరపాలి. ఈ విధంగా చేసిన శ్రీచక్రార్చన ఫలము ఇంతయని చెప్పటం మహేశ్వరునకు కూడా శక్యం కాదు. తన స్వరూపము ఆతల్లికి మాత్రమే తెలుసు. నిజంగా శ్రీ చక్రార్చన వలన కలుగు ఫలితాన్ని వర్ణించటానికి బ్రహ్మాదులకే సాధ్యమవదనగా ఇతరులు ఎంతని తెలుసుకోగలరు ?
ప్రతి నెలలోనూ పూర్ణిమ రాత్రి చంద్రుడు ఉదయించేసమయాన శ్రీ చక్రార్చన చేసేవారు లలితా స్వరూపులు ,లలిత వారి రూపం లోనే వుంటుంది. శ్రీచక్రార్చనచేసే శ్రీ విద్యో పాసకులను ,శ్రీ దేవిని బేధభావం తో చూసేవారిని మహాపాపాత్ములుగా పరిగణించాలి. ఆశ్వయుజ శుక్ల పక్షం మందు వచ్చు శరన్నవమి నాటి రాత్రి అనగా మహర్నవమి నాడు శ్రీ చక్రమందుండు లలితాంబికను తలచి స హస్రనామాలతో అర్చించేవారికి ముక్తి కరతలామలక మవుతుంది. మహా భక్తితో ఎవరైనా శుక్రవారాలలో శ్రీ చక్రమున శ్రీ దేవిని సహస్రనామాలతో ఆరాధిస్తాడో ,అటువంటి పుణ్యాత్ముడు పొందే ఫలితాన్ని చెబుతాను విను. ...శ్రీ లలితాదేవి భక్తుడు ఈ పుట్టుకయందుసమస్త సంపదలను పొందుతున్నాడు. తన కోరికలన్నింటిని పొంది మనమలతో ,అభివృద్ధి చెందుతూ అన్ని భోగభాగ్యాలను అనుభవించి ఆఖరికి ఈశ్వరాదులచే కోరదగిన అసాధ్యమయిన లలితా0బ సాయుజ్యాన్ని చేరుతున్నాడు.
ఈ సహస్రనామాలతో వేయిమంది బ్రాహ్మణులను పూజించి వారిని తృప్తిగా భుజింపజేసి తాంబూల,దక్షిణ లతో సత్కరించిన వారికి ఆ తల్లి తన సామ్రాజ్యాన్నిస్తుంది. ఇటువంటి ఉపాసకులకు ముల్లోకాలలోను అసాధ్యమయినదేది లేదు. ఏవిధమయిన కోరికలు లేకుండా నిష్కామంగా ఈ సహస్రనామాన్ని పఠిస్తారో అటువంటివారు బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారు. సంసార బంధనాలు లేకుండును. ధనార్ధం చేస్తే దానిని పొందుతారు. కీర్తికోసం చేస్తే కీర్తి ని పొందుతారు.
విద్యను కాంక్షించేవారికి విద్య,నివ్వడములోనూ భోగాన్ని ,మోక్షాన్ని ఇవ్వడానికి దీనిని మించినది మరొకటి లేదు. కనుక సుఖ బోగాదులను వాంచించేవారు సహస్రనామాలు పారాయణం చేయాలి . బ్రహ్మ చారులు గృహస్తులు ,వానప్రస్థులు, మరియు సన్యాసులు అనే నాలుగు ఆశ్రమాలవారు తమ ధర్మాలను చేయటములో జరిగిన లోపాలను పూర్తి చేయటానికి ఈ నామ పఠనం చెయ్యాలి. స్వధర్మాలను విడచి పాపాత్ములతో నిండిన ఈ కలికాలమందు. లైతా సహస్రనామ పఠనం ఒక్కటె మనుష్యులకు తరునోపాయం దీనికి సాటి మరొకటి లేదు.
లోకాలలో వాక్యాలన్నింటికంటే విష్ణు నామాన్ని కీర్తించటం మంచిది, విష్ణు సహస్ర నామాలకంటే ఒక్క ఈశ్వర నామోచ్చరణం మంచిది. వెయ్యి శివ నామాలకంటే ఒక్క లలితా దేవినామం ఉత్తమం , అగస్త్య మునీ వేలకొలది దేవీ నామాలు కోటిరకాలుగా చెప్పబడ్డాయి. వాటిలో పదివిధాలైన సహస్ర నామాలు ప్రధానమైనవిగా చెప్పబడ్డాయి. అవి ఇలా వున్నాయి. గంగ,భవాని,గాయత్రి, కాళీ,లక్ష్మీ,సరస్వతి, రాజరాజేశ్వరి ,బాల ,శ్యామల లలితా అని పదిరకాలు. ఇవి అత్యుత్తమాలు. వీటన్నిటిలో లలిత ప్రధానము. దీని సంకీర్తనం వలన కలిదోషం తొలగిపోతుంది. విష్ను ,శివ సహస్రనామాలతో పాటు మిగిలిన కూడా శ్రేష్టమయినవయినా సర్వశ్రేష్టమయిన వీనిపై అందరుదృష్టి సారించుటలేదు. .వేరు వేరు నామాలను పఠించినవారికి ఆయా పుణ్య ఫలం వలన ఆఖరి పుట్టుకలో శ్రీవిద్యాశక్తుడవుచున్నాడు. ఈ లోకములో లలితోపాసకులు ఎలా తక్కువగా వుంటున్నారో అలానే శ్రీవిద్యయందు శ్రద్ద చూపువారుకూడా చాలా తక్కువగా వున్నారు. సహస్రనామ పఠనం చేసే ఆసక్తి కలగటము గొప్పతప: ఫలితం కన్నులు లేనివాడు రూపాన్ని దర్శించలేనట్లే సహస్రనామాన్ని పఠించకుండా లలితా దేవిని సంతుస్ఠురాలిని చేయలేరు. అన్నం భుజించకుండా ఆకలి తీరనట్లు. లలితా దేవి భక్తులయినవారు నిత్యమూ సహస్రనామాలు చెయ్యాలి. ఆ తల్లి అనుగ్రహ సిద్ధికి ఇతి ఆవశ్యకం .
ఓ అగస్త్యమునీ ! నేను నీకోసం ఈ రహస్య నామాన్ని చెప్పాను. లలితోపాసన లో విముఖులకు,అభక్తులకు దీనిని ఉపదేశించరాదు. శ్రీవిద్య ఎంత రహస్యంగా ఉంచదగినదో, అలాగే ఈ రహస్యనామాలను గోప్యంగా ఉంచాలి. పశుతుల్యుడు, భక్తిలేనివారికి తెలియక అయినా చెప్పరాదు. అలా చెబితే యోగినీ సంఘం కోపపడును. ఆకారణం చేతనే నేను నీకు అడిగితేగానీ చెప్పలేదు. ఇప్పుడు దేవీ ఆజ్ఞ చేత నీకు రహస్యంగా ఉపదేశించాను.. సదా దీనిని శ్రద్ధా సక్తులతోనూ పఠిస్తూండు. ఆ తల్లి నీ పై కరుణ చూపిస్తుంది.
సూత ఉవాచ:ఈవిధంగా చెప్పిన హయగ్రీవుడు లలితా దేవిని స్మరిస్తూ ఆనంద పూరిత హృదయుడయ్యాడు.
ఇది లలితా సహస్రనామ స్తోత్రరత్న మహాత్మ్యం అనబడు ఉత్తర భాగము.
సమస్త సన్మంగళాని భవంతు. ...ఓమ్ శాంతి: శాంతి: శాంతి

Read more...

లలితాసహస్రనామము ఏకార్యం సాధించటానికి ఎలా పారాయణం చేయాలి.1


కలియుగములో సులభతరముగా భక్తుల కామ్యములను సిద్ధింప జేసే లలితా సహస్రనామ పారాయణము ఏవిధముగా చేస్తే ఏవిధమయిన ఫలితం వస్తుందో బ్రహ్మాండ పురాణములో హయగ్రీవభగవానులు అగస్త్యులవారికి ఉపదేశించారు.దానిని తెలుసుకుందాము.

[లలితా సహస్రనామ మహాత్మ్యము తృతీయాధ్యాయము.]
-------------------------------------------------------------------
ఇత్యేతన్నామ సహస్ర0 కథితం తేఘటోద్భవ
రహస్యానాం రహస్యంచ లలితా ప్రీతిదాయకం "
ఓ అగస్త్యమునీంద్రా లలితాంబకు సంతోషాన్ని చేకూర్చే ఈస్తోత్రం రహస్యాలన్నింటిలోనూ రహస్యంగా ఉంటోంది. అటువంటి ఈ సహస్రనామావళిని నీకోసం చెప్పబడినది. ఈ స్తోత్రమ్ అకాల మృత్యువును శాంతింపజేస్తుంది.,కాలమృత్యువును పోగొడుతుంది. అన్నిరకాలైన జ్వరాలను తగ్గించగలుగుతుంది. ఆయుర్ధాయమును విశేషంగా పెంచుతుంది.
ఈస్తోత్రమునకు సాటియైనది ఇంతవరకు లేదు ఇకముందు కూడా ఉండబోదు. దీనిని చదవడం వల్ల వ్యాధులు నయమవుతున్నాయి. ఇంకా దీని పఠనం వల్ల అన్ని సంపదలు వృద్దవుతున్నాయి. సంతానం లేనివారికి పుత్రులను ప్రసాదించగలదు. ధర్మార్ధ కామ మోక్షాలను పొందగలుగుతారు. ఈదేవీ స్తోత్రము ఆమెకు సంతోషకారక మవుతున్నది.
లలితా దేవియొక్క ఉపాసన యందు ఆసక్తి కలవారు నిత్యం ప్రయత్నించి చదవాలి. శాస్త్రానుసారం వేకువనే లేచి స్నానమాచరించి సంధ్యావందనాదులు ముగించాలి. అనంతరం ఆరాధనాశాలకు వెళ్ళి శ్రీచక్రాన్ని శాస్త్రోక్త రీతిగా పూజించాలి. శ్రీవిద్యను, అంటే షోడశినయినా ,పంచదశినయినా అధవా త్ర్యక్షరి నయినా సహస్రము, మూడువందల మార్లుగాని కనీసం నూట ఎనిమిది సార్లైనా జపించాలి.
మంత్రాన్ని జపించిన తరువాత సహస్రనామం చెయ్యాలి నరులు వారిజన్మలో ఒక్కసారయినా ఇలా పఠిస్తే పొందేఫలితాన్ని చెబుతాను విను. ఓ అగస్త్యమునీంద్రా! గంగాది మహాపవిత్ర తీర్థాలలో కోటిజన్మలలో ఆచరించిన స్నాన ఫలము లభిస్తున్నది. వారణాసి యందు కోటిలింగాలను ప్రతిష్టించిన పుణ్యఫలితాన్ని, కురుక్షేత్రమందు సూర్యగ్రహణవేళ కోటిసార్లు దానాలు చేసిన ఫలితాన్ని పొందగలుగుతున్నారు. బ్రాహ్మణులకు కోట్లకొలది బంగారు దానం చేసిన ఫలితాన్ని,గంగానది ఒడ్డున కోటి అశ్వమేధ యాగములను చేసిన ఫలితాన్ని పొందగలరు.
జలం లేని మరుభూమియందు, కోట్లసంఖ్యలో నూతులుతవ్విన ఫలితాన్ని,దుర్భిక్ష దినాలలో రోజూ కోట్ల సంఖ్యలో అన్నదానం చేసిన ఫలం లభిస్తుంది. శ్రధ్ధగా వేయేళ్ళు అన్నదానం చేస్తే పొందగల ఫలితాన్ని కంటే కోటిరెట్లు ఎక్కువ ఫలితం లభిస్తున్నది. వేయి రహస్యనామాలలో ఒక్కటయినా పఠిస్తే వెనుక చెప్పిన పుణ్యము పొందవచ్చు. రహస్యనామాలలో ఒక్కదాన్నయినా త్రికరణశుద్ధిగా జపించినచో ఎటువంటి మహాపాతకాలూ నిస్సంసయంగా నశిస్తాయి. నిత్యకర్మలు ఆచరించకపోవడమువల్ల ,కూడని పనులు చేయడమువలన,ఏఏ పాపాలు సంభవిస్తాయో అటువంటివన్నీ మనుషుల లో నశించిపోతాయి.
ఓ అగస్త్య మునీంద్రా ఇన్ని చెప్పి ఏమి ఫలం? అసలు సంగతి చెబుతున్నావిను. పాపాలను పోగొట్టటములో ఈ సహస్ర నామాలకు గలశక్తి ఎట్టిదంటే పదునాలుగు లోకాలలోని వారంతా కలసి చేసినా ఒక్క లతా సహస్రనామంతో పోగొట్టలేనంత పాపం చేయలేరు.
ఈ సహస్రనామాలనువదలి తనకిల్భిషాలను పోగొట్టుకోవాలని ప్రయత్నించేవాడు శీతబాధను బాపుకోవడానికి హిమవత్పర్వతమునకు పోయినట్లుంటుంది. పరమ పవిత్రమయిన ఈ నామావళిని పఠించే భక్తునిపట్ల సంతోషముతో లలితాదేవి అన్ని కోరికలను ఈడేర్చును. ఈ స్తోత్రాన్ని అనగా దేవీ గుణగణాలను స్తుతించనివారు ఎలా భక్తులు కాగలరు? కాలేరుకదా ! దేవిఅనుగ్రహం పొందటానికి అనుదినం స్తోత్రాన్ని పఠించాలి అవకాశం లేనివారు పర్వదినాల లోనైనా పఠించాలి సంక్రాంతి, కాని విశువత్ కాలములయందుకానీ తనవారియొక్క అనగా భార్యా పుత్రాదుల జనం నక్షత్ర తిథులయందుగానీ,నవమి,చతుర్ధశి,శుక్లపక్షశుక్రవారాలు యందు విశేషించి పఠించాలి.

"కీర్తయేనామసహస్రం" పౌర్ణమాస్యాం విశేషత:
పౌర్ణమాస్యాంచంద్రబింబే ధ్యాత్యా శ్రీ లలితాంబికాం
పౌర్ణమినాడు చంద్రబింబాన్ని దర్శించి శ్రీ దేవినిధ్యానించటం ,సహస్ర నామాలను పారాయణం చేయటం చాలా మంచిది .
పంచోపచారాలను మనస్సులో అనుకున్న మీదట సహస్రనామం పఠించిన అన్ని వ్యాధులు తగ్గి దీర్ఘాయుష్మంతులవుతారు. జ్వర పడిన వారి తలను సృశిస్తూ పఠనం చేసిన శీఘ్రంగా వుపశమించును. కల్పమందు ఇది ఆయుర్వృద్దికరమని తెలుపబడినది. ఇందుమూలముగా శిరోబాధతో వున్న జ్వరం కూడా తగ్గును. అన్ని రోగాలు తగ్గటానికి విభూతి మంత్రించి ఇచ్చిన తీవ్రత తగ్గును. అలా మంత్రించిన భస్మాన్ని తాల్చినంతనే సర్వ రోగాలూ నయమవుతాయి .
నిండివున్న కలశాన్ని స్పృశిస్తూ సహస్రనామం పఠించి మంత్రించిన నీటితో స్నానం చేపిస్తే గ్రహ పీడితులకు ఆబాధ వెంటనే తొలగిపోతుంది. అమృతసాగరం నడుమ వుంటున్న అతల్లిని ధ్యానించి పఠించేవారిని ఏ విషమూ ఏమీ చెయ్యలేదు.
వెన్నను మంత్రించి గొడ్రాలితో తినిపించిన అచిర కాలం లోనే అమె పుత్రవంతురాలవును. ఇదిసత్యంఅనిచెప్పుచున్నారుహయగ్రీవులవారు
ద్యాత్వా. భీష్టాం స్త్రియం రాత్రౌ జపేన్నామ సహస్రకం
ఆయాతి స్వసమీప0సా యద్యప్యంత:పురం గతా

రాజా కర్షణ కామేశ్చే ద్రాజాన వధ దిజ్ఞ్ముఖ :
త్రిరాత్రం య: పఠేత్ శ్రీదేవీ ధ్యాన తత్పర:
రాజును వశపరచుకో గోరువారు ఆ రాజు వుండే నివాసానికి ఎదురుగా కూర్చుండి మూడురాత్రులు దేవిని ధ్యానిస్తూ
మూడురాత్రులు సహస్రనామం పఠిస్తే...... ఆరాజు వశంతప్పినవాడై వుపాసకునకు దాసునిలా ప్రణామం చేసి నిలబడి అతను వాంచించిన దానిని సమర్పించును.
ఈ సహస్ర నామాలను సర్వదా పఠించే వాని ముఖం చూసినంత మాత్రముననే మూడులోకాలూ సమ్మోహితులగును. శత్రు సంహారం కోరి ఏ భక్తుడయినా సహస్ర నామాలను పఠిస్తే శరభేశ్వరుడు ఆశత్రువులను సంహరించును. వానిమీద ఎవరన్నా అభిచారాది దుష్ట ప్రయోగాలను చేస్తే అట్టి వారిని ప్రత్యంగిరా దేవి స్వయంగా సంహరించును.
[ 1 నుండి 34 శ్లోకాలకు అనువాదం ] ...
[ ఇంకా వుంది ]

Read more...

27 న విశేషతిథి, లో జరుగుతున్న పూజలకు మీగోత్రనామాలు పంపండి.

>> Thursday, September 25, 2008


ఈ నెల 27 వతారీఖున విశేషమున్నది 27 అనేది నక్షత్రముల సంఖ్య .ఆధ్యాత్మిక లోకములోఈ సంఖ్య బహు శుభకరమైనది. సంఖ్యా
శాస్త్రం లో కూడా.ప్రత్యేక స్థానమున్నది ఆరోజున శనివారం త్రయోదశి . ఇది శనీశ్వరుని ప్రసన్నం చేసుకొనుటకు విశేషమయిన రోజు. శనివారం, త్రయోదశి తిథి కలసి సంవత్సరములో చాలా తక్కువగా వస్తాయి. ఇక ప్రతి నెలలోనూ అమావాస్యకు ముందురోజు అనగా బహుళ చతుర్థశి నాడు మాస శివరాత్రి అంటాము. అది శివునకు అత్యంత ప్రీతిపాత్రమయిన రోజు .కనుక శివారాధనకు చాలా ఉత్తమమయిన రోజు .27 మధ్యాహ్నం నుంచి ఆతిథి వస్తున్నది. ఇన్ని విశేషాలు కల గలసిన శుభతిథి నాడు, లోకక్షేమంకోరుతూ శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠం లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుపబడుతున్నాయి. శనిగ్రహ ప్రభావం వలన మానసిక వత్తిడులు, చికాకులు, బాధలు తొలగేందుకు శనీశ్వరునకు తైలాభిషేకము, నక్షత్ర జపములు , అలాగే సర్వ దోషములు నిర్మూలించి సకల శుభములనొసగే రుద్రాభిషేకం ,మహా మృత్యుంజయ మంత్రజపం తదంగ పూజలు నిర్వహించబడతాయి. అలాగే శనివారము కనుక కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారికి అర్చనకైంకర్యాలు జరుపబడతాయి. ఈ సందర్భంగా గోత్రనామాలు పంపిన వారందరితరపునా వారిపేర్లమీద ఆయా పూజలు నిర్వహించబడతాయి." తవసుఖేన మమసుఖం" అన్న సూత్రం తో ఆధ్యాత్మిక సేవలో వున్న పీఠ పరివారం ఎవరినుంచి ఏమీ ఆశించరు. భక్తులు తమకు తాముగా ఇచ్చిన పూజాద్రవ్యాలు, ధనసహాయముతోనే ఇవి నిర్వహించబడతాయి. భక్తులకు క్షేమాన్ని కలిగించటం భగవంతుని కిష్టం , భగవంతుని కిష్టమయిన సేవచేయటమే మాకిష్టము కనుక భగవద్ భక్తులైన మీ అందరికీ శ్రేయస్సు కలిగించే ఈ సేవ మాకు మరీమరీ ఇష్టం. కనుక గోత్రనామాలను పంపిన అందరి కీ పేరు పేరున ఈ అర్చనలు జరుపబడతాయి. కనుక పంపించండి.
గతముపూజలలో పేర్లను పంపినవారుకూడా ఏకార్య క్రమానికి ఆకార్యక్రమానికే గోత్రనామాలు పంపవలెను. అన్ని పూజలకు వస్తున్న పేర్లను మరలా వెదికి చూడటము కష్టము కనుక ఇక్కడ జరుపబడే ప్రతి పూజకు కొత్తగా నామాదులను పంపించ మనవి. బ్లాగులో మెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్ లున్నాయి సంప్రదించండి.

Read more...

లలితా సహస్ర నామ రహస్యాలు

>> Wednesday, September 24, 2008


భక్తులపై అమ్మ వారి కరుణ కలగటానికై నామపారాయణం సులభతరము ,శక్తివంతమయిన మార్గము. అందులోనూ లలితా సహస్రనామము సాక్షాత్తు,హయగ్రీవభగవానులు అగస్త్యులవారికి ఉపదేశించిన మహాశక్తిపూరితమయిన మంత్రరాజము. దీనిని జపించినవారు తరించుట తథ్యమని మహర్షుల శాసనము. దీనిని, నమ్మకము లేనివారికి, అవిశ్వాసులకు,అడగనివారికి ,శఠులకు చెప్పరాదని శాసనం. కానీ కష్టాల కడలిలో కలిప్రభావము వలన బాధలు పడుతున్న కొదరుజీవులకైనాదీనిని ఆశ్రయించిశుభం కలగాలనే కోరికతో ఈరహస్యాలను దీనిలో వుంచుతున్నాను. యోగినీ బృందము,నన్నుమన్నించుగాక. పరమగురువులునాపైకృపజూపుదురుగాక.

లలితా రహస్యనామ మహాత్మ్యము
................................................................................
" శ్రీవిద్యాం జగతాం ధాత్రీం స్వర్గస్థితిలయేశ్వరీం
నమామి లలితా నిత్యాం మహాత్రిపురసుందరీం.
సర్వజగత్తులకు తల్లియైనదీ ,సృష్టిస్థితిలయములకు కారకురాలగునదీ ,గొప్ప త్రిపురసుందరీ రూపమునవుండే శ్రీవిద్య అనబడే లలితాంబకు నేను భక్తితో నమస్కరిస్తున్నాను.

అగస్త్య ఉవాచ :-
" అశ్వానన మహాబుద్ధే సర్వశాస్త్ర విశారద
కథితం లలితా దేవ్యా శ్చరితం పరమాద్భుతం
సమస్త శాస్త్రములనూ పూర్తిగా తెలుసుకున్నవాడా గొప్ప బుద్ధి వైభవంతో ప్రకాశిస్తున్న ఓ హయగ్రీవ దేవా అత్యంతమూ, ఆశ్చర్యాన్ని కలిగించే శ్రీ లలితాంబయొక్క దివ్యమయిన పవిత్రమయిన చరితము చెప్పబడియున్నది.
.....
తొలుదొల్తగా శ్రీదేవి జన్మప్రకారమును చెప్పారు. ఆతరువాత ఆమహాదేవియొక్క త్రైలోక్య పట్టాభిషేకమును గురించిచెప్పారు. ఇంకా భండాసుర సంహారాన్ని కూడా వివరించారు. .
మనోహరమైనదీ గొప్ప వైభవముతో కూడినదీ విస్తారమయినదిగా శ్రీపురం వర్ణించబడినది.అలాగే శ్రీ పంచదశాక్షర మంత్రమహిమ కూడా విస్తారంగా వర్ణింపబడినది.
షోడశాన్యాసాలూ వ్యాసఖండమున బాగుగా వర్ణించబడ్డాయి. అంతర్యాగ ,బహిర్యాగ పద్దతి కూడా చెప్పబడ్డాయి.
పూజా ఖండమున మహాయాగ పద్దతి చక్కగా వివరింపబడినది. పునశ్చరణ ఖండమున జపలక్షణాన్ని వివరించారు.హోమ
ఖండమున సాధన సామాగ్రుల బేధాలను గూర్చిచెప్పినారు.
రహస్య ఖండమున శ్రీచక్రానికీ ,శ్రీవిద్యకూ, మరియు శ్రీ విద్యకు గురుశిష్యులకు ఉండవలసిన తాదాత్మ్య భావాలు చెప్పబడ్డాయి. స్తోత్ర ఖండములో బహువిధములయిన స్తోత్రరాజములను తెలియబరచారు.
"
మంత్రిణీ దండినీ దేవ్యో : ప్రోక్తేనామ సహస్రకే .. నతు శీలలితా దేవ్యా : ప్రోక్తం నామ సహస్రకం "
మంత్రిణీ యొక్క దండినీ దేవియొక్క వేయినామాలు చెప్పారు. శ్రీలలితా సహస్రనామములు మాత్రం చెప్పబడి యుండలేదు.
తత్రమే సంశయోజాతో హయగ్రీవ దయానిధే
కింవాత్వయా విస్మృతం తత్ జ్ఞాత్వావా సముపేక్షితం.
కరుణా సాగరుడవయిన ఓ హయగ్రీవదేవా ఆవిషయాన్ని మీరుమరచారా? లేక వూరుకున్నారా అని నాకు సంశయము కలిగినది. అలా కాకుంటే లలితా దేవియొక్క వేయినామాలు నాకు వినే యోగ్యత లేక పోవుచున్నదా ? అలా మీరు చెప్పక పోవుటలొ గల ఆంతర్యం చెప్పండి స్వామీ

సూత ఉవాచ:-
"ఇతి పృష్టో హయగ్రీవో మునినా కుంభజన్మనా
ప్రహృష్టోవచనం ప్రాహ తాపసం కుంభ సంభవం.
సూతుడు చెప్పుచున్నాడు:-
ఈవిధంగా కుంభ సంభవుడైన అగస్త్యుడు, భగవంతుడయిన హయగ్రీవుని అడుగగా అందుకు ఆయన సంతోషపడి. ఇలా అన్నాడు.
హయగ్రీవ ఉవాచ:-
లోపాముద్రాపతేఅగస్త్య సావధాన మనా శ్శ్రుణు
నామ్నా సహస్రం యన్నోక్తం కారణం తద్వదామిదే

లోపాముద్ర సహచారిణిగాగల ఓ అగస్త్యా నేచెప్పే సంగతి శ్రద్ధగావిను. లోగడ నీకు లలితా సహస్రనామం చెప్పని కారణం ఉన్నది. విను. శ్రీ లలితా దేవియొక్క వేయినామాలు చాలా రహస్యమయినవి. అంతకంటే వేరేవిధమయిన కారణమేమీలేదు. ఇప్పుడు నీవు సవినయంగా భక్తి భావంతో నన్ను మళ్ళీక అడిగావు కనుక నీకు ఉపదేశిస్తున్నాను.
ఉత్తముడయిన గురువు ఎటువంటి మంత్ర రహస్యాన్నయినా వినయ
సంపదా ,భక్తి తత్పరత గల శిష్యునకు మాత్రమే తెలుపవలెను. ప్రస్తుతం నేను నీకు ఉపదేశించబోయే లలితా సహస్రనామావళిని భక్తుడు కానివానికి ఎన్నడు చెప్పరాదు. శఠునకు, దుష్తునకు ,విశ్వాస రహితునకు ఈవిద్యను కొద్దిపాటికూడా చెప్పరాదు.
[శఠుడు = గురువు ఉపదేశించిన గూఢ విషయాన్ని తెలుసుకుని తనకు ఇంతమాత్రమే తెలుసునని ,తెలిసినా తెలియదని గురువును తిరస్కరించువాడు. దుష్టుడు:= గురువు చెప్పిన రహస్యాన్ని తెలుసుకుని దానిని ఇతరులకు చెప్పి వేళాకోలము చేసేవాడు.
అవిశ్వాసుడు= గురువు ఉపదేసం పొందిన తరువాత ఆ రహస్యం మీదగాని,గురువు మీద నమ్మకం లేక చరించువాడు. ]
శ్రీదేవియందు భక్తి తాత్పర్యం గలవాడూ శ్రీవిద్య ఉపదేశం పొందినవాడూ,ఉపాసకుడు, పవిత్రుడు అయిన వానికి ఈ నామావళిని ఉపదేశించాలి. శ్రీదేవియొక్క వేయిపేరులూ చదివినంతనే ఫలదాయకాలని శ్రీవిద్యా తంత్రములలో పేర్కొనబడినది. వాటిలో లలితా సహస్రనామాలు అతి ముఖ్యమయినవి.

మంత్రరాజములలో శ్రీవిద్య ఎలా ముఖ్యమయినదో, పురములన్నింటిలో శ్రీపురం ఎంతముఖ్యమో శక్తులన్నింటిలో శ్రీలలితా దేవి ఎంత ప్రధానమో ,శ్రీ విద్యోపాసకులలో హరుడెంత ముఖ్యుడో లలితా సహస్ర నామాలు అంతముఖ్యము .
ఈ సహస్రనామములను పఠించితే ఆ తల్లి ఎంతసంతోషిస్తుందో చెప్పనలవికాకున్నది. లలితా దేవి దయనికోరుకునే భక్తుడు ఎల్ల వేళలా ఈలలితా సహస్రాన్ని పఠిస్తుండాలి.
శ్రీచక్ర రాజమందు లలితా దేవిని మారేడు పత్రాల చేతగాని, వికసిత పద్మాల చేతగానీ ఈ సహస్ర నామాలు చెబుతూ ఎవరు అర్చిస్తారో ? వానియందు ఆపరాశక్తియైన లలితాంబ తక్షణమే ప్రసన్న మవుతుంది.
శ్రీచక్రారాధన పూర్తిచేసి పంచదశాక్షరీ మంత్రరాజమును జపించి అనంతరం సహస్రనామ పఠనం గావించవలెను. పూజ,జపం చేయడానికి శక్తిలేనప్పుడు ఈ సహస్ర నామావళిని పఠించిన చాలును.
భక్తుడు పరిపూర్ణపూజ చేసికాని,సంపూర్ణ జపంచేసికాని ఏ ఫలితాన్ని పొందుతున్నారో ? ఈ నామావళిని పఠించి ఆఫలితాన్ని పొందగలుగుతున్నాడు. ఉపాసన తరువాత నామపారాయణం చేస్తే విశేష శ్రేయం.
శ్రీ విద్యారాధకులకు పూజాజపం మరియు సహస్రనామ సంకీర్తన చేయటం అత్యంతావస్యకములు. శ్రీ చక్రారాధనం, శ్రీవిద్యజపం సహస్రనామావళి పఠనం సంధ్యావందనాదులలా చేస్తూండాలి . కనీసం నామపారాయణాన్నయినా చేస్తుండాలి. చెప్పేదేమిటంటేభక్తుడు సహస్రనామ సంకీర్తనం తప్పక చేయాలి.
ఓ అగస్త్య మునీంద్రా అందుకుగల కారణాన్ని చెబుతున్నాను విను.
"వాగ్దేవీ వశినీ ముఖ్యాస్సమాహూదయేదమబ్రవీత్
వాగ్దేవతా వశిన్యా ద్యా శ్శృణుధ్వం వచనం మమ "

పూర్వ భక్తుల శ్రేయస్సుగోరిన జగజ్జనని ,సరస్వతివశినీ మున్నగు దేవతా శక్తులనుబిలచి ఇలా ఆజ్ఞాపించింది. నాదయవలన మీరు సమస్త వాక్సంపత్తిని పొందారు. నా ఆరాధకుల వాక్సంపదికొరకు నాచే ఆజ్ఞాపించబడుతున్నారు. మీరందరూ నాతాలూకూ శ్రీచక్ర రహస్యమును బాగుగా తెలిసికొన్నవారూ,నా నామ పఠనమునందు ఆరితేరిన వారు అయినందున స్తోత్రం చెసేపద్దతికొరకు మిమ్ము ఆజ్ఞాపిస్తున్నాను . రహస్యా ర్ధాలతో నిండిన నా వేలకొఅలది నామాలతో స్తోత్రాలను చేయండి. భక్తులు వాటిని పఠిస్తే నాకు కొంగొత్త ప్రీతికలిగేలా స్తోత్రాలను అమర్చండి.
ఇలా వశిన్యాది దేవతలు ఆజ్ఞాపింపబడ్దవారై శ్రీ లలితా పరంగా రహస్య గర్భితంగా నామావళులను శ్రీదేవీ స్తోత్రాలను ఘటించారు. ఆస్తుతే రహస్యనామ సహస్రంగా అత్యుత్తమమైనదిగా ఈలోకములో వ్యాప్తిలోకివచ్చినది. ఓ అగస్త్యమునీంద్రా! ఒకానొక వేళ శ్రీదేవి సిమ్హాసనాధిష్టయై ఉండగా ,ఆదేవి ఆరాధనకై వేచివున్న భక్తులకు దర్శనమొసగుటకై ఆజ్ఞఇచ్చినది. ఆసమయములో అక్కడికి ఎందరో బ్రహ్మలు ,సరస్వతులూ నిలచివున్నారు.
లక్ష్మీ నారాయణానాం చ కోటయ స్సముపాగతా:
గౌరీకోటి సమేతానాం రుద్రాణా మపికోటయ:
ఇంకా విశేష మేమిటంటే మంత్రిణిగా విన్నదగిన శ్యామలాంబ మరియు దండిని మొదలైన నానా రూపాలలో బహుశక్తులు సమూహాలుగా తద్దర్శనార్ధం వచ్చారు. అయితే ఆ శక్తులసంఖ్య చెప్పటం కూడా కష్టమే.
ఆ మహా పరిషత్తుకు బ్రహ్మ మొదలుగా గల దేవతా సమూహాలు,మానవ సంఘాలు,సనకాదులతోగూడిన సిద్ధుల గుంపులూ. వ్యాసుడు ఆదిగాగల మనుష్యసంఘాలూ రాగా అందరికీ ఆదేవిదర్శనమిచ్చినది. ఆమహా సభకు వచ్చిన వారందరూ లలితాదేవిని దర్శించి తమ చోట్లలో ఆశీనులు కాగా శ్రీదేవి కటాక్ష వీక్షణాలతో తిలకిస్తున్నది.
అలాంటి సమయములో వశిన్యాది గీర్వాణీ దేవతలు ముకుళిత హస్తాలతో వారు రచించిన లలితాంబ పేరుగా సహస్ర నామావళులను కీర్తించసాగారు. ఆస్తుతులను విని శ్రీదేవి చాలా సంతోషించింది. అందులకు పరిషత్తు లోని వారందరూ విస్మయం చెందారు.
ఓ అగస్త్య మునీంద్రా ! అప్పటినుంది లలితా దేవి ఆజ్ఞప్రకారంగా బ్రహ్మ ,హరిహరులు, శ్యామలాంబాది శక్తులు మంత్రిణీత్యాది దేవతలు ఈ సహస్రనామావళిని భక్తిబద్ధ హృదయముతో పఠిస్తున్నారు. ఈ నామాధ్యయనం భక్తునికి అత్యంతమూ ఆవస్యకంగా పఠనీయము.
ఓ మహర్షీ ! ఈ సహస్రనామాన్ని అత్యంతావస్యకంగా ఎందుకు పఠించాలో నీకు ఇదివరకేచెప్పాను. ఇప్పుడు సహస్రనామాలను చెబుతాను శ్రద్ధగావిను.

[ఇది శ్రీ బ్రహ్మాండ పురాణమునందు గల హయగ్రీవాగస్త్యులవారి సంవాదమనబడు లలితా సహస్రనామ పూర్వభాగము. ప్రథమ అధ్యాయము. ఓమ్ శాంతి: శాంతి:శాంతి:: ]

Read more...

పరమగురువులు శ్రీరాధికా ప్రసాద్ మహారాజ్ [నాన్నగారు]

>> Tuesday, September 23, 2008


భువిలో ప్రేమభక్తిని పంచగా దిగివచ్చిన రాదాసఖి, బృందావన విహారులైన రాదా కృష్ణుల ప్రియ సేవకు భువిపైన అవతరించిన మహానుభావులు రాధికా ప్రసాదమహారాజ్ [నాన్నగారు. ] పుట్టినదాదిగా నిరంతరం దైవతత్వాన్వేషకులయి
భారతదేశంలో ఉన్న పలు సాధనారీతులను అనుసరించి, కుసుమ హరనాద, రాదాస్వామి సత్సంగ్, మొదలయిన సాంప్రదాయాలను, గురుసిద్ధారూఢులచే పంచాక్షరిని, అనిబిసెంట్ గారిచే తత్వబోధను, జ్ఞ్జానప్రసూనాంబతల్లిచే దివ్యబోదను చివరకు సాక్షాత్తు దుర్గా దేవిచే రాధా షడక్షరిని మంత్రోపదేశముగా పొందిన సిద్ధపురుషులు. ప్రపంచములో నున్న ఆర్తులను చేరదీసి వారికి అమ్మ ప్రేమమార్గాన్ని అందించి, బృందావన వాసులై నిండు నూరేళ్ళకు పైగా ఆతల్లి లీలా  విలాసాలను ప్రజలకు తెలిపి ముక్తిమార్గాన్ని చూపిన రసయోగి. ఏజన్మ లో చేసిన పుణ్యమో ఆ గురుపాదాలను తాకే అద్రుష్టం దక్కినది. పూజ్య గురుదేవుల జీవిత చరిత్రను త్వరలో మీకందించబోతున్నాను.

Read more...

జీవితం లో కష్టాలతో విసిగివేసారుతున్నారా?తొలగించుకునేమార్గమిదిగో

>> Monday, September 22, 2008


మానవజీవితం కష్టసుఖాల సమ్మేళనం . పూర్వజనం పుణ్యపు పాలు మిగులుగా నున్నప్పుడు సుఖాల రూపంలోనూ ,పాపఖర్మ రాసి మిక్కిలిగానున్నప్పుడు కష్టాల రూపం లో అవి అనుభవానికొస్తుమ్టాయి. భగవంతుని అనుగ్రహం వలన వీటిని నిర్వికారంగా అనుభవించే మహానుభావులు ఖర్మను నిశ్శేషం చేసుకుంటారు.కాని సాదారణమయిన మనలాంటి మానవులు ,వీటిని భరించే శక్తి లేక కష్టాలు వచ్చినప్పుడు తల్లడిల్లు తుంటాము. ఇవిధంగా సమానంగా వచ్చినా కొంతవరకు తట్టుకోవచ్చు, కానీ నిరంతరం కష్టాల కాష్ఠం లో కాలుతుండే అభాగ్యజీవుల ఆవేదన భరించరానిది . కరుణామయులైన మహర్షులు ఈ స్థితిని గమనించారు. మానవుల కర్మ పరిపక్వమయ్యే మార్గాలు కనిపెట్టారు. పరమశక్తిని ప్రసన్నం చేసుకుని ఈ కష్టాలనుండి విముక్తులయ్యే మార్గాలను అన్వేషించి ,ఆవిష్కరించారు. వాటిని దయతో మానవాళికి అందచేశారు .
కర్మ ఫలితం అనుభవించక తప్పేది కాదు. కాని తొలగించుకోలేనంత కష్టం కూడా కాదు. ఉదాహరణకు nadini దాటటం తప్పనిసరి అయినప్పుడు ఈదిదాటాలని ప్రయత్నించటం భాహుప్రయాస. ఒక దుంగ,లేక చేక్కముక్క తోదాటటం శ్రమతో కూడుకున్నది. ,కానీ పడవ మీదనో ఒడమిదనో దాటటం శుఖదాయకమే కదా? అలానే ఫలితాలను యధాతథంగా అనుభవించటం కంటే పరమాత్మ పాదాలు అనే ఓడను ఆశ్రయిమ్చి దాటటం సులభం కదా?.
కనుక మనం మహర్షులిచ్చిన విజ్ఞానాన్ని ఉపయోగించుకుందాము. మన కష్టాలను మనమే తొలగించుకుందాము సిద్ధపడండి.
జగన్మాత అయిన ఆతల్లి దుర్గ దుర్గతులను నాశమ్మొనరించగలదని సకల శాస్త్రములు ఘోషిస్తున్నాయి. అట్టితల్లిని ఆశ్రయిమ్చి తమ బాదలనే సుడిగుండాలను తరిం చినవారెందరో మనకు చరిత్రనిండా కనపడతారు. ఆతల్లికి పరమ ప్రితికరమయిన శరన్నవరాత్రులు వస్తున్నాయి. ఆసమయంలో అమ్మకు ఇష్టమయిన ఎన్నోరితులలో పూజించే ప్రక్రియలు పెద్దలు మనకిచ్చారు. వాటిలో మన సంస్కారానికి తగిన మార్గమేన్నుకుని అమ్మకృపకు పాత్రులమయితిమా, మన జన్మలు తరించినట్లే. శ్రీవెంకటేశ్వర జగన్మాత పీఠము భక్తులకు అటువంటి మార్గాలను సూచిస్తుంది. సాధకులు మీరే. మీ కువచ్చిన కష్టాలను తెలియబరచితే ,ఆయా కష్టాలను భక్తిమార్గంలో విశుద్ధ మార్గంలో ఎలా నవరాత్రులలో అమ్మను ఆశ్రయిమ్చి తొలగించుకోవాలో సూచిస్తుంది. ఇది దైవ సేవగా భావించి చేసే సేవఏగాని అనయము కాదని మనవి. నమ్మినవారికేన్నాడు నాశాములేడుగాడంమా! అని త్రికరణశుద్ధిగా నమ్మాము. ఆపాదాలనాశ్రయించి నిర్భయులమయి సేవలో నున్నామని చెప్పుకోగల అద్ర్రుస్టాన్నిచ్చిన ఆతల్లికి చేసే సేవగా భావిస్తున్నాము. రండి అమ్మ అనురాగాన్ని అందరితో పంచుకుందాము.

Read more...

నా ఇష్ట కామేశ్వరి యాత్ర

>> Sunday, September 21, 2008


1995 లో శ్రీశైలం అరణ్యాలలో ఉన్న ఇష్టకామేశ్వరి అమ్మవారి గురించితెలుసుకున్నాము. దట్టమయిన అరణ్యం మధ్యలో వున్న దేవీ స్థానమది. అక్కడ ఎవరో మహాపురుషులు తీవ్ర సాధన చేసి అమ్మను మెప్పించి ప్రతిష్టించారు. అక్కడ సాధకులకు మంచి యోగసిద్ధులు లభిస్తాయని ప్రతీతి. కనుకనే కొందరు యోగులు అక్కడికెళ్ళి సాధనలు చేస్తుంటారని విన్నాము. అంతేకాదు ప్రతిరోజూ అగస్త్యులవారు బ్రహ్మీముహూర్తములో అదృశ్యరూపములో అక్కడకొచ్చి వెళతారని అనుకుంటారు. ఆ అడవిలో గిరిజనులు ఆమెను కామాచ్చమ్మ ,కామేశ్వరమ్మ అని పిలుచుకుంటారు. ఈ వివరాలన్నీ తెలిసిన దగ్గరనుండి ఎలాగైనా ఒకసారి అమ్మ వారిని దర్శించాలనే కోరిక బలంగా మనసులో నాటుకున్నది. కాని అప్పటికి అక్కడకు వెళ్ళేందుకు అడవిలో కాలి బాట తప్ప మరి సరయిన దారిలేదు. అసలు ఆ ప్రదేశం ఎక్కడవున్నదో చూపించేవారు లేరు. మేము ఆసంవత్సరం భవానీ దీక్షలో వుండగా ఎలాగయినా అక్కడకు వెళ్ళాలని మనసులో తీవ్రమయిన సంకల్పం రావటం మొదలయినది .సరే ఇదేదో అమ్మ సంకల్పములా వున్నదని భావించి ప్రయాణం అయాము. నావెంట నామిత్రులు శ్రీరామనేని హనుమంతరావు, ఓబులాపురం సుబ్బారావు, తిరుపతిరావనే యువకుడు మొత్తం నలుగురము బయలు దేరాము. ప్రయాణానికి ముందు పీఠములో కూర్చొని అక్కడకు చేరేదెలా అని మాట్లాడుకుంటుంటే మావెంటవున్న సుబ్బారావుకు [కాస్త గట్టి సాధకుడులెండి] ఒక 14 సంవత్సరాల వయసుండే పిల్లవాడు మాకు తోడువస్తున్నట్లు ధ్యానములో గోచరమయినదని చెప్పాడు. మరీ మంచిదనుకుని బయలుదేరాము. వినుకొండ వెళ్ళి కావలసిన సరంజామా అంతా తీసుకుని ,ఇప్పటికే ఒకసారి అనుకోకుండా ఇష్టకామేశ్వరిని దర్శించుకుని వచ్చిన మామిత్రుడు చిత్రాలయ స్తుడియో అధినేత శంకర గుప్తా గారివద్దకు వెళ్ళి కలిశాము. ఆయన చాలా కష్టమండి ,దారి లేదు. మేము 50 మంది బృందంతో వెళ్ళీ ఆరాత్రి సరిగా దారిదొరకక చాలాదూరం వెళ్ళి వచ్చాము. అడవిలో దారితప్పితే ప్రమాదం. శిఖర దర్శనం నకు మూడు కిలో మీటర్లకు ఇవతల పాలుట్ల దారిలోదిగి అడవిలోకి నడచివెళ్ళాలి, షుమారుగా 18 కిలోమీటర్లు పైగా వుంటుంది. అక్కడనుండి అడవిలో కాలిబాటన మరికొంత లోపలికి వెళ్ళాలి. పగలెవరన్నా చెంచులు గాని మరెవరన్నా కనపడితే మాత్రమే ఆలయం వద్దకు చేరుకుంటారు. లేకుంటే ఇబ్బందే నని వివరించాడు. ఏమయినా సరేననే మొడిపట్టుదలతో శ్రీశైలం బయలుదేరాము.
శ్రీ శైలం చేరుకున్నాక స్వామివారిని ,అమ్మ వారిని దర్శించుకున్నాము. తరువాత శ్రీశైలములో చాలామందిని దారి ఎటుగా వెల్లాలో విచారించాము. కానీ ఎవరినుండీ సరయిన సమాధానం దొరకలేదు. సాయంత్రం సంధ్యా హారతి సమయానికి అమ్మవారి ఆలయములోకి వెల్లి దర్శనం చేసుకున్నాము. ఆలయ ప్రధానార్చకులు శ్రీరాములు గారు మానాన్నగారికి మిత్రుడు. వారిని అడిగాము. ఆయన తనకు తెలియదని, పక్కనున్న మరియొక అర్చకుని పిలిచి ఈయనకు తెలుసు అన్నారు. ఆయన కూడా వెళ్ళడం చాలా కష్టమని , సున్నిపెంట నుండి లోయలోకి దిగి ఎక్కితే వరుసగా కనిపించే విధ్యుత్ లైన్ స్థంభాల వెంటగా వెళితే 7 స్థంభాలు దాటాక పక్కకు దిగి వెల్లాలని అక్కడ ఒక వాగు వుంటుందని చెప్పారు. సమాచారం పూర్తిగా లేదు మేము మాట్లాడుకుంటూ గదికి వచ్చి భోజనాలు చేసి మాట్లడుతూ టైం చూసుకోలేదు, కొబ్బరికాయలూ పూజా సామాగ్రి కొందామనుకునేసరికి అప్పటికే రాత్రి 11 గంటలవటం తో కొట్లు మూసేసారు. అరే రేపటికి పూజా ద్రవ్యాలెలా బస్సులు తెల్లవారుఝామున 5 గంటలకే బయలుదేరతాయి అప్పటికి కొట్లు తెరవరు, ఏమిచెయ్యాలి అనుకున్నాము. పాలుట్లనుండి అమ్మవారిగుడి దూరమయినా కాలిబాటలాగానన్నా వుంటుంది, సున్నిపెంటనుంచి దారీ తెన్నూ లేకుండా వెళ్ళడం ఎలాగ? కనుక పొద్దుటనే పాలుట్ల దారిలోనే దిగుదాము అని నిర్ణయించుకుని నిద్రపోయాము. తెల్లవారుఝామున 4 గంటలకే లేచి స్నానాలు కానిచ్చుకుని బస్ ఎక్కి పాలుట్ల దారిదగ్గరదించమని కండక్టరుకుచెప్పాము. బస్ బయలు దేరాక పక్కనున్న అతనిని అడగగా ఎవరన్నా తెలిసిన వారినడగండి అన్నాడు. బస్ సున్నింపెంటకు చేరుకున్నాక, మాతో మాట్లాడినతను బస్ దిగి బస్స్టాండ్ లో నిలబడ్డ ఒక రైతుని అడిగాడు ,అతను మాదగ్గర కిటికీవద్దకు వచ్చి సామీ మీరు ఇక్కడేదిగి వెళ్ళడం మంచిది...దిగండి...దిగండి అన్నాడు. వెంటనే అక్కడే దిగాము. ఇంకా తెల్లవారలేదు. కొట్లుకూడా ఏవీ తెరవలేదు. అక్కడున్నవారినడిగి దారి కనుక్కుని వూర్లో నడక మెదలుపెట్టాము. దారిలో ఒక తల్లి పొద్దున్నే లేచి కల్లాపి చల్లుతున్నది. ఆవిడ ముందు ఒక కొట్టువుంటుంది పిలవండి లేస్తారు అన్నది. మేము వెళ్ళి వాల్లను లేపి కొబ్బరికాయలు,పసుపు కుంకుమ మొదలయినవి తీసుకుని అయ్యా మేమిలా వెళుతున్నాము, అమ్మవారికి పాలాభిషేకానికి పాలెమన్నా దొరుకుతాయా ? అని అడగగా, నాగమయ్య అనే అతనిఇంటిని చూపారు. మేము వెళ్ళేసరికి వాల్లు పాలుతీస్తున్నారు. 1 లీటరు ఆవుపాలు కొనుక్కుని వాల్లను కూడా దారిగురించి అడిగాము. వాల్లుకూడా ఇదేదారిలో ముందుకెలితే కొండ అంచుకు చేరుకుంటారు, అక్కడనుండి లోయలోకి దిగి పైకెక్కి వెళ్ళమన్నారు. వాళ్ళింటిలో వున్న పూలు కూడా సమృద్ధిగాకోసుకుని దారిచివరకు చేరుకున్నాము. అక్కడనుండి చూస్తే లోతయిన లోయ, దానవతల మరలా కొడలమీదుగా కరెంట్ లైన్. [విద్యుత్ వుత్పత్తి కేంద్రాన్నుండి వెలుతున్నది] సరే జారిపోయేట్లున్న ఆకొడలమీదుగా దిగి లోయలో వున్న వాగులో మల్లీ స్నానం చేసి తరువాత నిలువుగా వున్న కొండను ఎక్కాము కష్టపడి. అక్కడనుండి అడవిలో కాలినడక దారి. గుడిలొ పూజారి చెప్పినట్లు 7 స్తంభాలు దాటాము. ప్రతిరెండుస్థ0భాల మధ్య అరకిలో మీటరు దూరం పైగా వున్నది. అక్కడనుంది ఎటుపోవాలా అని చూస్తుంటె దూరం నుంచి కుక్కలను వెంటపెట్టుకుని 14 సంవత్సరాల పిల్లవాడు గొడ్దలిని బుజాన వేసుకుని ఓ స్వామీ ఎక్కడికి వెలుతున్నారు? అంటూ కేకవేసి పిలుస్తూ మాదగ్గరకొచ్చాడు. సుబ్బారావన్నావచ్చాడు నీకు ధ్యానములో కనిపించినోడు,అని నవ్వాను నేను. అతను చెంచుల పిల్లవాడు. స్వామీ నేనువచ్చి చూపిస్తాను రండి,7 కాదు 18 స్థంభాలుదాటాలి అని మమ్మల్ని వెంటబెట్టుకుని నడక సాగించాడు. చుట్టూవున్న అడవిని చూస్తూ వానితో మాట్లాడుతూ అమ్మ లీలలను చెప్పుకుంటూ అలుపు లేకుండా నడిచాము. 18 స్తంభాలు దాటాక దారి పక్కకు మల్లించి ఒక లోయలోకి దించాడు. అక్కడకు చేరుకోగానే మనోహరదృశ్యం. ఎత్తయిన చెట్లు, నీడపడదు. చిన్న ఆలయం. ఆలయం ముందు కొండవాగు. అక్కడ మామిడిచెట్లు ఎలావచ్చాయో మాకు అర్ధం కాలేదు. ఎంతో దివ్యమయిన ప్రదేశం. ప్రశాంతంగా వుంది. ఇలా దట్టమ మయిని అడవిలో ప్రశాంతతను చవిచూడటం ఇదే మొదటి సారి. నేల మాళిగలాగ వున్న ఆగుడిలో అమ్మవారి మూర్తి సజీవంగా వున్నట్లు అనిపిస్తున్నది అవయవాలన్నీ ఎంతో అద్భుతంగా మానవ శరీరమా అన్నట్లు వున్నవి, నుదుటన వేలు పెట్టి నొక్కితే బొట్టుపెట్టుకునే చోట మానవ శరీరాన్ని తాకినట్లుందిగాని రాతివిగ్రహాన్ని తాకినట్లుండదు. కరుణించి రప్పించుకున్నందుకు అమ్మకు మరీమరీ ప్రార్ధనలు చేస్తూ. చిన్నపిల్లలమయిపోయాము. ప్రకృతిమరియు స్ధలములో వున్న శక్తితరంగాలు మమ్మల్ని అలా ఆనంద ముగ్ధులను చేస్తున్నాయి.
ఆరోజు దత్తజయంతి. హనుమంతరావు వాల్లను అన్నం వండమని ,తిరుపతిరావును యజ్ఞకుండీ రాల్లతోనే నిర్మించమని, చెంచుపిల్లవాన్ని అక్కడున్న ఎండు మామిడి పుల్లలు తెగగొట్టమని చెప్పి నేను అభిషేకం చెయ్యాలని ప్రారంభించాను. లోపల ఒక్కరే పడతారు. పైగా అభిషేకం చేస్తే నీల్లు ఎటూపోవు. అందుకని అమ్మ వారినే బయటకు తెచ్చాము చిన్నపిల్లలా నాచేతులలో చిన్నారి మురిసిపోతూ వున్నట్లనిపించింది . సంకల్పం చెప్పి శ్రీసూక్తంప్రారంభించగానే నోరు పిడచకట్టినట్లు ఆగిపోయింది. మరలా ప్రారంభించాను, మరలా గొంతుపట్టుక పోయింది. మరలా ప్రయత్నించినా అంతే, ఆశ్చర్యపోయాను. నన్ను చూసి సహచరులు నవ్వుతున్నారు. ఏమిటి చెప్పలేకపోతున్నావు అని. కారణమేమిటా అని అనుమానం వచ్చి అప్పుడు పరిశీలనగా చూసాను ఆవరణలోను ఆలయం గోడలమీద వున్న రక్తపు మరకలను. ఇదేమిటని అడగగా గతవారం ఎవరో వచ్చి కోళ్ళు కోసి పూజచేసి వండుకుని తిని వెళ్ళారని. ఆపిల్లవాడు,చెప్పాడు. మరిచెప్పవేమినాయనా అమ్మకు చాలా అయిస్టంగా వుంది వాతవరణం అందుకే మనకు పాలు పూలు కూడా సిద్ధంచేసిపిలచినది అనిచెప్పి మిగతా పనులాపి, ముందు ఆవరణ అంతా శుబ్రం చేయటం ప్రారంభించాము. వాగులో నీల్లు తెచ్చి[మావెంట ప్లాస్టిక్ బుంగ తీసుకువెల్లాము లెండి] అంతా కొబ్బరిపీచుతో రుద్ది శుభ్రపరచాము.
తరువాత అభిషేకం ప్రారంభించాము. నిజంగా పాలతో అభిషేకంచేసేటప్పుడు దృశ్యం వర్ణించలేను. తళతల మెరుస్తూ తెల్లని కాంతి మాచుట్టూ ఆవరించుకుని వున్నట్లనిపించింది. మేము ఏలోకానున్నామో మాకే అర్ధం కాని పరిస్థితి. మనసు ఆనందతరంగాలలో తేలియాడుతున్నది. తరువాత పూజ చేసేసరికి సహచరులు అన్నం సిద్దపరచారు. ఇక యజ్ఞానికి కూర్చున్నాము. ఎంతో ఆనందంగా సాగింది యజ్జం. ఇంతలో కొందరు ఆడవిలోకొచ్చిన పోలీసులొచ్చారు. వాల్లు కూడా భక్తితో అమ్మవారిని దర్శించుకుని, యజ్ఞములో పాల్గొన్నారు. వారికి కూడా రక్షలనుఇచ్చి ప్రసాదాలిచ్చాము. చాలా సంతోశించారు. దత్తజయంతిరోజున అమ్మవారిదర్శనం లభించింది. తరువాత చెంచుపిల్లవానితో కలసి భోజనం చేసాము. పోలీసులు ఇచ్చిన డబ్బులు మరికొంత మావికూడా కలిపి చేర్చి ఆచెంచు పిల్లవానికిచ్చి అప్పుడప్పుడూ నూనెతెచ్చి దీపారాధన చేయమని చెప్పాము. 4 గంటలయింది. అమ్మకు మేము తెచ్చిన వస్త్రాలు కట్టి ఎత్తుకుంటె చిన్నపాప మారాం చేస్తున్నట్లు మాచేతులలో ఇమిడిపోయింది. అమ్మను మాచేతులలోనుండి ది0చలేక వదలి వెళ్ళలేక వెళ్ళలేక బయలు దేరాము. ఈసారి పాలుట్ల దారిలోకి ఎక్కాలని నడక ప్రారంభించాము. అడవిలో కొంతదూరం నడచి దారి చేరుకున్నాము. అక్కడనుండి తారురోడ్డుకు రావటానికి సుమారు 20 కిలోమీటర్లు వున్నట్లున్నది. చుట్టూదట్టంగా వెదురుపొదలు ఎత్తైన వృక్షాలు ఎంతనడచినా రోడ్ రాలేదు. చీకటిపడుతున్నది. ఇంతలో హనుమంతరావు కాలు సహకరించటమ్లేదు నడవలేనన్నాడు. దీక్షలో వుండటం వలన చెప్పులులేక అతని పాదాలు మెత్తబడ్డాయి. వెంటనే మా కండువలు చించి వాని పాదాలకు పాదరక్షల్లా చుట్టి, పక్కనుండి ఒక వెదురు బొంగు చేతికిచ్చి నడవమన్నాము. అలా నే చీకటిపడింది. దారిమొత్తం పలుకురాళ్ళతో నిండివుంది. అమ్మను తలుకుకుని మాట్లాడుతూ నడిచాము. విచిత్రంగా మాకు భయమన్నది రాలేదు. అమ్మ మావెంటవస్తున్నట్లే అనిపించింది. రాత్రి 8.30 కి తారురోడ్డుకు చేరుకున్నాము. అక్కడనిలబడి శ్రీశైలం నుండివస్తున్న లారీని చెయ్యెత్తి ఆపి ఎక్కాము. దోర్నాల చేరుకుని అక్కడనుండి బస్ ఎక్కి వినుకొండ చేరుకున్నాము.
నిజంగా అమ్మ అనుగ్రహంతో చేసిన ఈ యాత్ర నా జీవితములో మరపురానిది. మరలా రెండుసార్లు అక్కడకు వెల్లి వచ్చాను. ఇప్పటికి 7 సంవత్సరాలుగా వెళ్ళివద్దామని అనుకుంటున్నా కుదరటం లేదు. ప్రస్తుతం అక్కడికి వెల్లటానికి వాహన సౌకర్యం ఏర్పడిందని దేవస్థానం వారు ఆలయాన్ని నిర్మించి అభివృద్ధి చేసారని విన్నాను. ఝాన్సీ గారని ఒక భక్తురాలు హైదరాబాద్ నుండి మరికొందరు మరికొన్ని చోట్లనుండికూడా వస్తామంటున్నారు. దసరా తరువాత ప్రయత్నం చేయాలి. అమ్మ పిలుపురావాలికదా !!

Read more...

జీవహింస జీవుడిని దేవునిదగ్గరకు చేర్చదు.దూరంచేస్తుంది.

>> Saturday, September 20, 2008

ఈరోజు దినపత్రికలలో స్థానిక వార్తలలో మాచర్లప్రాంతములో జరిగిన గ్రామదేవతల జాతరలో జరిగిన జీవహింసపై వచ్చిఅ కథనాలు చదివి మనసు వికలమయినది. జాతరలో మూగజీవుల[మేకపోతుల] గొంతుకొరికి చంపిన వైనం తలచుకుంటేనే మనసు దు:ఖం తో నిండిపోతుంది. ఏమిటీ తామసిక మనస్తత్వం . ఏమి ఆశించి వీళ్ళు ఈపని చేస్తున్నారు? భగవంతునికి ఈచర్య ప్రీతి కలుగుతుందా? దీనివలన వచ్చే పపం మనలను ఎంతగా బాధిస్తుందో వీల్లకు వివరించే పనిని ఏవిధంగా వివరించాలని నాకు ఆవేదన కలుగుతుంది. ముందుగా అసలు జీవహింసద్వారా భగవంతుని తృప్తిపరచాలనే విధానాలను అనుసరించిన సాధకుల గతి ఏమవుతుందో ఒక సాధకుని జీవితమ్లో చూద్దాం.
ఒకప్పుడు ఒక కాపాలికునికి కాళీ మాతను ప్రసన్నం చేసుకోవాలని సంకల్పం కలిగింది. ఆ సాంప్రదాయం లో అవివేకంగా పాకిన ఒక సిద్ధాంతం ప్రకారం 100 గొర్రెపొటేళ్లను బలియిచ్చి పూజను సాగించటంద్వారా దీనిని సాధించాలని ప్రయత్నం మొదలు పెట్టాడు. చాలాకాలం తనపూజ నిర్విఘ్నంగా కొనసాగించాడు.99 పొట్టేళ్ళను బలిచ్చే కార్యక్రమం అయిపోయింది. చివరగా 100వ బలికి సిద్ధమయ్యాడు. ఒక గొర్రెపొటేలును కొని తెచ్చి దానిని పూజించి బలికి సిద్ధపరచి తన పూజా కార్యక్రమాన్ని సాగిస్తున్నాడు. అంతలో పకపకా నవ్విన శబ్దం వినిపించింది. ఏమిటా అని చూస్తే ఏమీ కనిపించలేదు. మరలా పూజలో నిమగ్నమయాడు. మరలా నవ్వు ఆతర్వాత పెద్దగా ఏడ్పువినిపించింది. ఏమిటా అని భయంతో చూడగా గొర్రెపొటేలు పెద్దగా ఏడుస్తూకనిపించింది. భయంతో బిక్కచచ్చిన కాపాలికుడు ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. ఆగొర్రె నవ్వు ఏడుపు ఆపి నేనూ ఒక జీవినే అన్నది. అయ్యా మీరెవరు? గొర్రెమాట్లాడటం ఏమిటి? నిజంచెప్పండి అన్నాడు . నాయనా నేనూ పూర్వజన్మలో ఒక కాపాలికుడనే అని అన్నదా గొర్రె. అలాగా మరయితే మీరు ఇలా ఎందుకున్నారు? ముందు నవ్వారు మరలా ఏడ్చారు ఎందుకు? అని ప్రశ్నించాడు భయంభయంగా.
భయపడకునాయనా! నేనుకూడా నీలాగనే ఎవరో చెప్పిన మాటను విని 100 పొట్టేల్లను కాలీమాతకు బలిస్తే అమ్మ అనుగ్రహిస్తుందని నమ్మి బలి కార్యక్రమం పూర్తి చేసాను. కాలీ మాత అనుగ్రహము కలగలేదుగానీ మహా పాపంచుట్టుకున్నది. దానివలన ఇప్పటికి 100 సార్లు గొర్రె జన్మమెత్తాను. 99సార్లు నరికి చంపబడ్దాను. ఖర్మ ఫలితం అనుభవిస్తున్నాను. ఇది చివరి జన్మ కనుక దీనినుండి విముక్తమవుతున్నాననే ఆనందం వలన నవ్వు వచ్చింది. కానీ నాయనా! నాలాగే నీజీవితం కూడా అమాయకత్వంతో ఇలా నాశనం చేసుకుంటున్నందుకు బాధతో దు:ఖం వస్తున్నది అన్నదిగొర్రె. త్వరగాబలి ముగించినన్ను ఈపాపమునుండి విముక్తం చేయమనికోరింది కాపాలికునికి ముచ్చెమటలు పోసాయి. తాను చేసిన పాపం గుర్తుకువచ్చి గడగడ లాడాడు.
అయ్యా ! తెలియక చేసిన పాపాన్ని తలచుకుంటే భయం ఆవరిస్తున్నది. ఇక నేను ఈపని చేయను. మిమ్మల్ని రక్షిస్తాను అని అన్నాడు. అప్పుడు ఆగొర్రెనవ్వి నేను చేసిన పాపఫలితంగా ఈరోజు నాకు మరణదండన తప్పదు. అని అన్నది. అయ్యా లేదు. ఈరోజు మిమ్మల్ని తప్పనిసరిగా కాపాడతాను అని ఆగొర్రెను తీసుకుని ఆ కాపాలికుడు తన గుహనుండి అడవిలోకివచ్చాడు. ఆ అడవిలో ఒక పెద్ద చెట్టువద్ద గొర్రెలమందను చూసి,అక్కడకువెల్లాడు. వాని కాపరియగు యువకుడు చెట్టెక్కి ఆకులు కొట్టి వేస్తుండగా, అవిమేస్తున్నాయి.
కాపాలికుడు ఆ కాపరిని కేకవేసి పిలిచాడు, నాయనా నేను నీకు ఈగొర్రెనిస్తాను దీనిని చంపకుండా మేపుకుంటావా ? అని అడిగాడు. అలాగే సామీ ! ఆమందలో వదలండి అన్నాడతను. కాపాలికుడు గొర్రెను మందలో వదలి నాలుగడుగులు వేసి వెలుతున్నాడు. అంతలోనే పైనుండి కత్తితో ఆకులు మండలు కొడుతున్న గొర్రెల కాపరి చేతినుండి జారిన కత్తి సరాసరి కింద కాపాలికుడు వదలిన గొర్రె మెడపైన పడటం ,ఆగొర్రెపొట్టేలు తలతెగి నేలవాలటం క్షణాలలో జరిగింది. అదిచూసిన కాపాలికుడు బిత్తరపోయి మతిచలించి పిచ్చివానిలా అరచుకుంటూ అడవిలోకి పరుగుతీసాడు.

అర్ధమయిందికదా? జీవహింస ద్వారా చేసే సాధనల ఫలితం. అసలు ఈ జీవహింస ఎందుకు మొదలయిందో చూద్దాం. పూర్వమునుండి. గ్రామవాసులయిన అమాయకులు తమ కష్టనష్టాలలో భగవంతుని ఆశ్రయించ్చేవారు. తమ కష్టాలు తీరితే తమకు వున్నది సమర్పించుకుని కృతజ్ఞత చూపాలనుకునేవారు. వారికుండే సంపద సహజంగా పశుపక్ష్యాదులేకనుక
తమకష్టాలు తీరగనే వారికున్న జంతుసంపదను బలి ఇచ్చేవారు. దానిని తామసిక ప్రవృత్తిగలవారే ఇతర సాధనలలో చెసేవారు. భగవంతుని చేరే శుద్ధమార్గాన్ని వేదాలు తెలియజేసాయి. వాటిని ఆశ్రయించటమె భగవంతునికి ఇష్టం కానీ ఇతరం కాదు. ఒకవేళ అలా జంతుహింసద్వారా జరిగిన కార్య క్రమాల ఫలితం కష్టాలే మిగిల్చాయి

అశ్వ మేధయాగం చేసిన తమకు ఈ అరణ్యవాసమెందుకు వచ్చినదని ఆవేదన పడిన ధర్మజునితో నారదుడు ఈవిధంగా అంటాడు. ధర్మజా ! యజ్ఞానికి మంత్రం,కర్త ,ద్రవ్యం పవిత్రమయినవయి ఉండాలి. నీ తమ్ముల్లు బలవంతులయి ప్రపంచమ్లో రాజులను చంపి సంపాదించకొచ్చిన ద్రవ్యం చేత జరుపబడ్డ యజ్ఞము నీకు నెల తిరక్కుండానే అరణ్య వాసాన్ని ఇచ్చిందని వివరిస్తాడు. కనుక విజ్ఞతతో ఆలోచించి శుద్ధ సాత్వికతతో భగవంతున్ని ఆరాధించాలి.
ఇక ఈవిషయం గురించి ఎంటో ఆవేదనతో వ్రాసినట్లు కనిపించిన విలేకరులు, విమర్శించినవారు, దాదాపు నిత్యం మాంసాహారం తినేవారే .. కాల్లముందు రోజూ ఆహారం కోసం వందలాది జీవులు చంపబడుతుంటే గుటకలు వేస్తూ కొని తీసుకెల్లేవారే/ అన్ని మతాలలో ముస్లిం.క్రిష్టియన్ మతాలలో కూదావున్న ఈ జంతువద బలి కార్యక్రమాన్ని ఎప్పుడూ విమర్శించనివారు. ఇది ఈదేశ ప్రజలు పాటించేసాంప్రదాయంగా విమర్షిస్తారు. పాపం వాళ్లకు వున్న ధైర్యం ఇంతమాత్రమే
జీవహింస పాపమనే విషయాని గ్రహించాలి అదిదేనికోసమయినా సరె...పాపం..పాపం.....పాపం.

Read more...

మూకం కరోతి వాచాలం......

>> Friday, September 19, 2008

మూకం కరోతి వాచాలం ...... 


అని శ్లోకంలో మూగవాడు సహితం నీ అనుగ్రహం ఉంటే వాచాలునిలా మాట్లాడ గలుగుతాడని అర్ధాన్ని చదువుకున్నాను. కాని దాని అర్ధాన్ని నేనే ఒకసారి ప్రత్యక్షముగా అనుభవించేట్లు చేసాడు స్వామి. ౨౦౦౧ లో సికిందరాబాద్ స్వరాజ్య ప్రెస్ లో హనుమాన్ కోటి చాలీసా మహా యజ్ఞ్జం జరిగింది. పూజ్య అన్నదానం చిదంబర శాస్త్రి గారు సంవత్సర కాలం శ్రమించి రాష్ట్రం పర్యటించి అనేకమంది భక్తులచేత కోటి చాలీసా పారాయణాలు చేయించి కార్యక్రమాన్ని రూపొందించారు. దానికోసం ఎక్కడెక్కడ నుండో  భక్తులు పారాయణములు చేసిన సంఖ్యతోగూడిన కార్డులను కట్టలుగా కట్టి తీసుకుని రాజధానికి చేరారు. ముందుగా కార్యక్రమం తాడిబందు ఆంజనేయస్వామి ఆలయంలో అనిచెప్పారు. కానీ అక్కడ కుదరక స్వరాజ్య ప్రెస్ కు మార్చారు. అందరితో పాటు మాకు కూడా ఆహ్వానాలు అందాయి. మూడురోజుల కార్యక్రమం. మొదటిరోజు నేను వెళ్ళలేకపోయాను. మా తరపున వెళ్ళిన జన్నాభట్ల ఉగ్రనరసింహ శాస్త్రి , శ్రీరామనేని హనుమంతరావు, అంజయ్య ,సుద్దపల్లి ఆంజనేయులు అనే భక్తులు ముందురోజు కార్యక్రమానికి అందుకున్నారు. అయితే అక్కడ నిర్వాహక భాద్యత చేపట్టిన పెద్దలు కార్యక్రమాన్ని తమ పలుకుబడిని పెంచుకునేందుకు ఉపయోగించుకుని, శాస్త్రిగారిని వాడుకుంటున్నారని తెలిసింది. వేలాదిగా తరలివచ్చే భక్తులచేత కార్యక్రమాలను చేయించేటందుకు  అవసరమయినంత మంది కార్యకర్తలు కూడా లేరు.అప్పటి గవర్నర్ రంగరాజన్ భార్య ,ఎంతోమంది పెద్దలు పండితులు ఆహ్వానించబడ్డారు. మొదటిరోజు రాత్రికి నేను చేరుకున్నాను. మావాళ్ళు నాకు అన్ని వివరంగా చెప్పారు. శాస్త్రిగారు ,దుర్గేశ్వరరావు గారూ మీరొస్తారని చూస్తున్నాను. ఆలస్యంచేసారు. అన్నారు. కార్యక్రమము శాస్త్రిగారి సాధనకు ప్రతీక కనుక ఎలాగయినా దీనిని విజయవంతంగా నడపాలని నిర్ణయించుకున్నాము. మరుసటిరోజు కార్యక్రమము మొదలయినది

 

ఆరోజు హనుమద్ వ్రతాలు చేయించాలి.


 

ముందుగానే ఆకార్యక్రమములో పాల్గొనటానికి తమ పేర్లను నమోదుచేసిన భక్తులు వందలాదిగా తరలివచ్చారు. వారిలో పామరుల వద్దనుండి మహాపండితుల వరకున్నారు. అందరిని వరుసలలో కూర్చోబెట్టి వారికి పూజాద్రవ్యాలు అందజేస్తున్నారు మావాళ్ళు అంతటా తామై . మైకు నాచేతికిచ్చి అందరికి సూచనలిస్తూ నడపమని చెప్పారు శాస్త్రిగారు. వేలాదిమందివచ్చిన కార్యక్రమం లో వందలాది జంటలు కూర్చునివున్నారు. నేనేమి బ్రాహ్మణ జన్మనెత్తి వ్రతాలు గట్రా చేయించిన వాడిని కాను. భక్తి మార్గంలో పయనిస్తున్న వాడినేకాని ఇంతమంది పెద్దల ముందు అది శాస్త్ర‍రీతులను పోసనపట్టిన మహాను భావులముండు నేను నోరుతెరవటమే తప్పు. దానికి తోడూ వారికే సూచనలిచ్చి కథ నడపటం అంత సులువుకాదు. ఏమాత్రం మాట తేడావచ్చినా అభాసపాలవుతాను. ఏమిటితండ్రి! పరీక్ష!  అని మనసులో హనుమంతుని తలచుకుని ఆయనను మనసులోన కాహ్వానించుకున్నాను. మనోజవం మారుత తుల్యవేగం మారుతతుల్యవేగం ...అంటూ ,బుద్దిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగతా ..అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్వరణాద్భవేత్ . అంటూ స్మరించుకుని కళ్లు తెరిచాను ఎక్కడ లేని  దైర్యం వచ్చింది.అంతే నోటినుంచి ప్రవాహంలా స్వామివారి మహిమలను వర్ణిస్తూ ప్రసంగము సాగిపోతున్నది దాదాపు మూడుగంటలు కార్యక్రమం విసుగుపుట్టకుండా జరిగింది. పూర్తయ్యాక శాస్త్రి గారూ మరికొందరు పెద్దలువచ్చి నన్ను చాలా చక్కగా నిర్వహించారని అభినందిస్తుంటే ,అసాధ్యాలను సుసాధ్యం చేసే స్వామి వుండగా కానిదేమున్నది అని నమస్కరించాను. నిజంగా ఇప్పటికి అనుమానమే అంత కార్యక్రమాన్ని అటువంటి సన్నివేశాన్ని కల్పించి నాబోటి అల్పునిచేత కూడా చేయించాడంటే,  పై శ్లోకానికి ఇంతకన్నా నిదర్శనం అక్కరలేదని.

Read more...

అమ్మముందు బెగ్గర్లగా కాదు బిడ్డలుగా మారాలి.

>> Thursday, September 18, 2008


మా పూజ్య గురుదేవులు రాధాసఖి ,శ్రీ రాధికాప్రసాద్ మహరాజ్ [నాన్నగారు] గారి పాదపద్మాలను స్మరించినప్పుడల్లా వారుచెప్పిన ఈ మాటగుర్తుకొస్తుంది. భగవంతుని ముందర భక్తులెలా ప్రవర్తించాలో వారు ఉపదేశించేవారు. ప్రతివాడూ దేవుని ముందు నిలబడి సరుకుల లిస్ట్ చదువుతారేమిరా? దానివలన ఎంతకోల్పోతున్నారు మీరు,అనేవారు. నాకుఅది ఇవ్వు ,నాకు ఇది ఇవ్వుఅని తెలివితక్కువ కోరికలు కోరరాదు. అనేవారు.
ఒక మహా ధనవంతురాలయిన గృహిణి తన భవనములో పరిచారికలతో సేవించబడుతూ తన పనులలో వున్న సమయములో ఒక బిచ్చగాడు వచ్చి అమ్మా! బిక్షమెయ్ తల్లీ అని కేకలు వేస్తాడనుకుందాము. అప్పుడు ఏదో పనిలో వున్న ఆమె ముందు పట్టించుకోక పోవచ్చు. కానీ మన బిచ్చగాడు పట్టువదలకుండా మాతా కబళం తల్లీ అని కేకలమీద కేకలు వేస్తుంటాడు. వీని పోరు పడలేక తన పరిచారకులతో ఏదో ఒక ముద్ద పంపి వీని బొచ్చెలో వేపిస్తుంది. వానికి ఆమె ఇచ్చే ప్రాధాన్యత అంతే. కానీ ఆతల్లి బిడ్ద ఏమీ అడగకుండా ఏ పొయ్యిదగ్గరకో వెళ్ళీ బూడిద మసి పులుముకుని ,నిప్పులో చేయిబెట్టబోతుంటే ,గమనించిన ఆతల్లి ఏమి చేస్తుంది? వెంటనే తనకెంతటి ముఖ్యమయిన పనయినా దానిని అవతల పారవేసి పరుగున వచ్చి బిడ్దను ఎత్తుకుంటుంది. వాడు మురికిగా వున్నా మసిపులుముకుని చీమిడి కార్చుకుంటూవున్నా, మానాయనే.. మాబుజ్జే.. నాకన్నా.. అంటూ ఎత్తుకుని తనబట్టలకు మురికి అంటుకున్నా లెక్కచేయక బిడ్డకు ముద్దులు పెడుతుంది. బిడ్దను ఎత్తుకుని ప్రమాదాలనుంచి కాపాడుకుంటుంది.
ఒక్క జన్మమకే తల్లి గామారిన జీవికే బిడ్ద పట్ల ఇంత మమకారం ఉంటే! జన్మ జన్మలనుంచి మనలను రక్షిస్తున్న ఆజగన్మాతకెంత కరుణ వుంటుందో ఆలోచించుకోవాలి మనం. ఆప్రేమను మనస్వంతం చేసుకోవాలంటె అమ్మ ముందు మనం బిడ్దలుగా మారాలి అమ్మ ప్రేమను పొoదటానికనువుగా పసిబిడ్దలాంటి స్వచ్చమయిన మనస్సును పొందాలిమనం. అలా పొందారుగనుకనే రామకృష్ణుల వంటి మహాను భావులు అమ్మ దర్శనం ఒక్కక్షణం లేకున్నా మట్టిలో బడి దొల్లి ఏడ్చేవారట. అందుకనే నిరంతరం అమ్మ వారికి కనిపిస్తుంటే , అలాచూడగలిగేలా ఎదగడానికి కృషిచేయటానికి బద్దకించే మనం ఆ దేవుడున్నాడా? వుంటే నాకు కనిపించమను అనే సోంబేరితనంతో కుతర్కాలకు దిగుతాము, ఆదివ్యజనని ప్రేమనుంచి మరింత దూరమయిపోతాము. కనుక అమ్మను ఆశ్రయించేందుకు వేలప్రయత్నాలతో వెదకాలి, అంటారు పరమ గురువులు,

Read more...

బాసరలో

>> Wednesday, September 17, 2008

Read more...

అష్టోత్తరశతటపా [108]సమర్పయామి.[భరతమాత]

సగరమాంధాతాదిషట్చక్రవర్తుల
అంకసీమననిల్పినట్టిసాధ్వి
కమల నాభుని వేణుగాన సుధాంబుధి
మునిగితేలిన పరిపూత దేహ
కాళిదాసాది సత్కవికుమారులగాంచి
కీర్తిగన్న పెద్దగేస్తురాలు
బుద్ధాది మునిజనంబుల తపంబున
మోదభాష్పముల్ విడిచిన భక్తురాలు

సింధుగంగానదీ జలక్షీరమెపుడు
గురిని బిడ్డల పోషించుకొనుచున్న
పచ్చిబాలెంతరాలు మాభరతమాత
మాతలకు మాత సకలసంపత్సమేత.
ఇది మా వినుకొండ కవికోకిల గుర్రం జాషువా గారి కలమునుండి ,కంఠమునుండి జాలువారిన భరత మాత స్తుతి . నా బ్లాగును ఆదరించి న మీ అందరికీ ఏమి సమర్పించుకోవాలా అని ఆలోచిస్తుంటే, మా మహాకవి మదిలోకి వచ్చారు. నాకు ఇంటర్వ్యూలో కూడా మంచిమార్కులు తెచ్చి వుద్యోగమిచ్చిన పద్యమిది. వారికి నా కృతజ్ఞతలు తెలుపుకునే సందర్భం గాకూడా వుంటుందని భావించి మీకు వ్రాసి సమర్పిస్తున్నాను.
ఇక మొదలుపెట్టి న మూడున్నర నెలలలో 108 పోష్టులు వ్రాసి, 3880 మంది చూడగా 74 కామెంట్లను పొందిననేను మీఅందరికీ కృతతజ్ఞలను తెలుపుకుంటున్నాను. మన మహర్షులిచ్చిన ,మానవ వికాసానికి ,శ్రేయస్సుకు ఉద్దేశించబడిన విజ్ఞానాన్ని మీఅందరితో కలసి పంచుకునే చిరుప్రయత్నమ్లో నేనీ బ్లాగును ప్రారంభించాను. ఇందులో నాకు సహాయం చేసిన వారందరికీ నన్నుప్రోత్సహించిన వారెల్లరకూ మరొకసారి వినమ్రపూర్వక ధన్యవాదనులు.
ఇందులో మీఅందరికీ మేలుచేసేవి, మంచిని పంచేవన్నీ మనపూర్వీకులైన మహాత్ముల వలన లభించినవి. దోషముతో కూడినవీ, ఇతరులకు హానికలిగించేవన్నీ నాయొక్క..ఖచ్చితముగా నాయొక్క బుద్ధిహీనత వలన కలిగినవిగా పెద్దమనసుతో భావించగలరు. భగవద్భక్తులైన మీ ఎల్లరకూ ... ....భక్తజన పాద దాసుడు.
దుర్గేశ్వర

Read more...

ఔరా ! నేనెప్పుడన్నా కృతఙ్ఞత కలిగి ప్రవర్తించానా ?

>> Tuesday, September 16, 2008

ఏమిటీ? మనలో కృతజ్ఞతా భావం క్రమేపీ తగ్గిపోతున్నదా? అని అనుమానం. వస్తున్నది. కొన్నిసార్లు. ఇలా వ్రాయకూడదు, కానీ మనసులో అణుచుకోలేక వ్రాస్తున్నాను.భగవంతుని సేవకులకు సేవచేయటం కూడా భగవంతుని కిష్టమని నమ్మి , మహర్శులు ప్రసాదించిన విజ్ఞానాన్ని పదిమందికి పంచాలనే ప్రయత్నములో వున్నాను. ఈమధ్య ఆప్రయత్నం లో భాగంగా శనిత్రయోదశి రోజున భక్తుల గోత్రనామాలతో అభిషేకాలను జరిపించాలని సంకల్పించాను. దానికోసం పత్రికలలోనూ అంతర్జాలం లోనూ దీనిగురించి తెలియజేశాను. మంచిస్పందన వచ్చింది. దేశ విదేశాలనుంచి అనేకమంది తమ గోత్రనామాలను పంపి తమకోసం పూజ జరపమని కోరారు. వారికి పాటించవలసిన నియమాలను తెలిపి వారికోసం ,వారికుటుంబసభ్యుల క్షేమంకోసం అభిషేకాలు నిర్వహించాము. తరువాత వాల్లందరికీ విశయాన్ని తెలియ జేశాము.
ఇంతమందికోసం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారివద్దనుండి మేమేమీ కోరలేదు. ఈ పూజల వలన వెంటనే మంచిఫలితం కనపడినదని మనందరికీ అంతర్జాలమ్లో చిరపరచితులయిన వారిగురించి తెలిసింది. ఇక ఈకార్యక్రమం జరిపినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు అందిన వేగులు ముచ్చటగా ముగ్గురి నుండిమాత్రమే. వారు, జ్యోతిగారు, విజయ్ మోహన్ గారూ, భాస్కర్ రామరాజు గారు.

ఇతనేమిటి ? తనకు కృతజ్ణతలకోసం వెంపర్లాడుతున్నాడని అపోహ పడకండి. నేను దానికోసం కాదు ఇదివ్రాస్తున్నది. దత్తాత్రేయుల వారు ఒకచోట తనకు 24మంది గురువులన్నారు. ఈసన్ని వేశం తో నాకు చెప్పకుండా గురుబోధ అందింది. నాకు మేలుచేసిన వారిపట్ల నేను కృతజ్ఞతలేకుండా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెప్పుకోవడానికి వ్రాస్తున్నాను.
తల్లీ ! భూమాతా నాకు మా అమ్మ జన్మనిస్తే , నాకు ఆడుకోవడానికి, తిరగడానికి , స్తలమిచ్చావు చివరకు నామలమూత్రాదులను కూడా సహించావు. నా ఆహారం కోసం దున్నినా ఇంటికోసం తవ్వినా నాకుమేలేచేశావు.
అటువంటి నీపట్ల నేనెలాంటికృతజ్ఞతను చూపలేకపోయాను. క్షమించు.
తండ్రీ వాయుదేవా ! నేనుబ్రతకడానికి అవసరమయిన ప్రాణవాయువునిచ్చావు. ఐ నా నేను పలురకాల విషవాయువులను వదలి నిన్నుకలుషితం చేస్తున్నాను.
నాకు నీడనిచ్చిన చెట్లను నరికి మోడుచేశాను. జీవజలాలనిచ్చిన నదులను కలుషితం చేసేపనులలో నేనూబాగస్వామినే అవుతున్నాను, నన్ను సృష్టించి నాకొక భూఒతిక ఆకారాన్నిచ్చి సక్రం గా పనిచేయటానికి అవకాశం ఇచ్చిన పరమాత్మా! నిన్ను నిరంతరం స్మరించలేకపోతున్నాను.
నాకు నోటివద్దకు ఇంత ముద్ద అన్నం రావటానికి కారకులయిన మనుషుల వద్దనుండి,కీటకాలవరకు ఎవరిని గుర్తుంచుకోకుండా , వారికి ప్రతిగా వుండే జీవరాసికి ప్రతినిత్యం ఇంత అన్నం[వైశ్వదేవం] నివేదన చేయలేకపోతున్నాను.
ఇంతవిజ్ఞానాన్ని మానవాళికి అందజేసి తమ జీవితాలను మానవాళికి అంకితం చేసిన మహర్షుల మార్గమ్లో నిజంగా నడుస్తున్నాన్నా అని అనుమానం.
ఇంత స్వాతంత్ర్యాన్నిచ్చి , నాకు అన్నీ సమకూర్చిన ఈ తల్లి భరత మాతకు నేనేమీ సమర్పించలేకపోతున్నాను.. ఈదేశ ఔన్నత్యాన్ని కాపాడటానికి నేనెటువంటి త్యాగాన్ని చెయ్యలేకపోతున్నాను. ఈరోజేచదివాను. వైమానిక దళమ్లో పనిచేసే ఫైటర్ పైలెట్లకు పిల్లనివ్వడానికి కూడా ఎవరూ అంగీకరించటం లేదట. ఎందుకంటే వారెప్పుడు దేశంకోసం ప్రాణాలుపోగొట్టుకుంటారో తెలియదుకనుక. ఎ0డనక వాననక .చలికి వణకుతూ వాళ్ళు దేశానికి కాపలా కాస్తుంటే . హాయిగా ఇంట్లో కూర్చుని పెల్లాం పిల్లలతో గడుపుతూ మనకింత భద్రత నిస్తున్న వారిత్యాగాలకు కనీసం కృతజ్ఞతలుకూడావారికి ఏరోజూ తెలపలేకపోయాను.
ఎవరిపట్ల నిజమయిన కృతజ్ఞతను చూపకుండా వున్న నాకు ,ఈసన్నివేశం ద్వారా కృతజ్ణతను చూపటం ఎంత అవసరమో తెలియజేసిన ప్రతిఒక్కరికీ నేను కృతజ్ఞుడను. తల్లీ జగన్మాతా! నాకుశ్రేయస్సుకలిగించడానికి కారణభూతులయిన ప్రతిఒక్కరిపట్ల నేను కృతజ్ఞతా భావాన్ని కలిగివుండే మానసిక స్థితిని నాకు ప్రసాదించు.

Read more...

ఏమిటీ ప్రాణాయామం? ఎందుకింత ప్రాధాన్యత.?

>> Monday, September 15, 2008


ప్రస్తుతం ప్రాణాయామం అనే మాటను వినని వారు సాధారణంగా వుండరనుకుంటాను. పలు సంస్థలు పలుచోట్ల శిక్షణలను నిర్వహించడం, ప్రచారం జరపటం మూలంగా అందరికీ ఈమాట తెలిసింది. గతములో అయితే ఏ గుళ్ళోకి వెల్లినప్పుడో ,పెళ్ళి,శుభకార్యాలప్పుడో అయ్యవారు. ముక్కుపట్టుకో నాయనా, గాలిపీల్చుకో నాయనా అని చెప్పటం మనకు అర్ధం కాకున్నా తంతులాగా ముగించటం జరిగేది. ఇప్పుడు దీనివిలువ తెలిశాక అప్పుడు నవ్విన వాళ్ళే నేర్చుకోవడానికి పరుగులు

మనిషి జీవనానికి ఆధారం ప్రాణవాయువు[ఆక్సిజన్] ను మనం ఎంత ఎక్కువగా తీసుకోగలిగితే మనశరీరవ్యవస్థ అంత సమ్ర్థంగా పనిచేస్తుంది. దీనికవసరమయిన శ్వాస క్రియ అసంకల్పితంగనే జరుగుతుంది. దీనివలన మనం 500 మి.లీ. గాలిని మాత్రమే తీసుకోగలుగుతాము. కానీ మన ఊపిరితిత్తులకు రెండున్నరలీటర్ల గాలిని తీసుకోగలిగే అవకాశం ఉంది. మనం సంకల్పించి పూర్తిగా గాలిని తీసుకోవాలనుకుంటే 5 లీటర్ల గాలిని పీల్చవచ్చని వైద్య నిపుణులు అంగీకరిస్తున్నారు. సంకల్పించి పూర్తిగా గాలిని పీల్చటం[పూరకం,] దానిని వీలైనంత సేపు అక్కడ నిలిపిఉంచగలగటం[కుంభకం] పూర్తిగా గాలిని వేలైనంత ఎక్కువగా బయటకు వదలటం[రేచకం] ప్రక్రియ లనే క్రమబధ్ధమయిన పద్దతిలో మనవాళ్ళు చేసి సత్ఫలితాలు సాధించి మానవాళికి అందజేశారు. రోజూ పది పదిహేను నిమిషాలపాటు దీన్ని ఆచరించటం వలన అప్రయతనం గా మనం చేసే శ్వాసక్రియలో ఒకటిన్నర లీటర్ చొప్పున గాలి లోపలకు బయటకు నడుస్తుంది. దీ నిప్రభావం రోజంతా ఉంటుంది.
శ్వాస క్రియ ద్వారా మనం పీల్చే గాలి పరిమాణం పెరిగితే జీవకణాలకు ఆక్సిజన్ ఎక్కువగా అందుతుంది. జీవకణాలు శక్తివంతమవుతాయి,అవిశక్తివంతమయ్యాయంటె ఆరోగ్యంగా వున్నట్లే. ప్రాణాయామంతో పాటు శరీర కండరాలు కూడా బాగా బిగించటం వదులు చేయటం ద్వారా శక్తివంతం చేయవచ్చు. శరీర భాగాలను పైకి క్రిందకు పక్కకు కదిలిస్తూవుంటే శక్తిని పొందుతాయి. ఆరోగ్యం కాపాడ బడుతుంది. దీనినే యోగాసనాలుగా మన మహర్షులు మనకందించారు. ఈనాడు ప్రముఖులైన వైద్యులంతా గాలిపీల్చండి, ఆరోగ్యంగా వుండండి. అని చెబుతున్నది ఇదే . కాకుంటే మన పూర్వీకులనుండి మన నిర్లక్ష్యం వలన నేర్చుకోకుండా వదలివేసిన సంస్కారాలను, కార్పొరేట్ గురువులవద్ద ఎ.సి.. గదులలో డబ్బులిచ్చి నేర్చుకునే దుస్థితికి వచ్చాం.
కనీసం ఇప్పుడయినా మన అచార వ్యవహారాలన్నింటిలో గల శాస్త్రీయతను అర్ధం చేసుకుని తరవాత తరానికి అందజేద్దా0.
అసలు మనిషి ఆయువు ఇన్ని సంవత్సరాలు అనికాక ఇన్ని శ్వాసలకాలం అని నిర్ణయించబడి వుంటుందట. తక్కువ శ్వాసలు తీసుకునే తాబేలు దీర్ఘకాలం బ్రతుకుతుంటే, వేగంగా శ్వాసలు తీసుకునే పాము, చాలా తక్కువకాలం బ్రతుకుతుందంటారు. మనలోకూడా వేగంగా శ్వాసలు తీసుకునేవారు అనారోగ్యాలతో బాధపడుతుంటారు. తక్కువసార్లుగా ఎక్కువ మొత్తమ్లో గాలిని తీసుకుని విడిచేవారు ఆరోగ్యంగా వుంటారు. గమనించి చూడండి. మరెందుకాలస్యం మనం మొదలెడదాం.... ఆరోగ్యకరమయిన భరతజాతిని భూమిమీద నిలుపుదాం.

Read more...

శరణాగతి అంటే.............సామాన్యమా?


మనలో చాలామంది భగవంతునికి శరణాగతుల మయ్యామని , తాము భారంతా ఆయనమేదే వేసి వున్నామని, చాలా వేదాంత ధోరణితో మాట్లాడటం వింటుంటాము. తాము ఆయననే నమ్ముకున్నా, తమను ఆయన అన్యాయం చేశాడని కొన్నిసందర్భాలలో వాపోవడం వింటుంటాము. ఇక్కడ మనం కొంచెం నిదానంగా మనసులను పరిశీలించుకుందాము. మనం నిజంగా ఆయన్ను శరణు వేడుతున్నామా? లేక మన కష్టాలు తీర్చడానికి ఆయన వస్తే బాగుండు అని భావిస్తూ ,మనప్రయత్నం మనం చేస్తున్నామా? ఈ అనుమానం మహాభాతరతములో ఒక సన్నివేశములో కనబడుతుంది.


శ్రీకృష్ణ భగవానులవారు. అరణ్యవాసములో వున్న పాండవులను చూడటానికి వచ్చారు. అందరి పలకరింపులు అయిపోయాక భోజనాలు గట్రాముగిశాక ద్రౌపది ఒంటరిగా కృష్ణుని కలుసుకుని తన బాధను వెళ్ళబోసుకుంటుంది.
అన్నా! నేను నిన్ను పరమాత్మవని పరిపూర్ణంగా నమ్మిన భక్తురాలను. నీవే నాతోడూ దిక్కూఅని విశ్వసించి పూజిస్తున్నదానిని. నీవుకూడా నన్ను సుభద్రకంటే ఎక్కువగా చూస్తున్నావు. నన్ను ఆపదలనుండి కాపాడుతున్నావు. సాక్షాత్తూ నీవు నన్ను రక్షిస్తున్నప్పుడు దుస్టులయిన కౌవులుర నన్ను పరాభవిస్తుంటే వచ్చి నామానాన్ని కాపాడావు. సర్వవ్యాపివి నీకు అన్నీ తెలుసు. అలాంటప్పుడు ఆదుష్టులు నన్ను సభలోకి ఈడ్చుక వచ్చేటప్పుడే కాపాడివుంటే నాకు ఈ అవమానము కూడా తప్పేదికదా? ఎందుకు ఉపేక్షించావు. ? న న్నెందుకు ఇలా అవమానాగ్నిలో దహించుకు పోయేలా చేశావు, ఇదా నాపట్ల నీకున్న ప్రేమ? ఇదా శరణాగతులపట్ల నీ దయ? అని పరిపరివిధాల విలపించింది.
అప్పుడు ఆలీలా మోహనుడు చిద్విలాసంగా నవ్వి అమ్మా ! నన్ను నాభక్తులు అన్యధా శరణం నాస్తి అని ఆశ్రయించిన మరుక్షణాన్నే కాపాడతాను. అన్నాడు. మరి నేనలాగే వేడుకున్నానుకదా అన్నది ద్రౌపది.
కాదు. దుశ్శాసనుడు నిన్ను సభలోకి లాక్కెల్లాలని ప్రయత్నించినప్పుడు, నిరోధించటానికి ప్రయత్నించావు. వానిని తిట్టి శాపనార్ధాలు పెట్టి . వాడు మూర్ఖుడు. నిన్ను లాక్కెళ్ళుతున్నప్పుడు, ఎవరన్నా కాపాడతారేమోనని ఎదురుచూసి వానిని విడిపించుకోవాలని చూశావు. సభలోకి వెళ్ళిన తరువాత అయ్యా ఈ అన్యాయం చూడండని ఎలుగెత్తి ఘోషించావు. అప్పుడు లోకములో ఏపెద్దలైనా నిన్ను కాపాడక పోతారా అనే ఆశ వున్నది నీలో . నీ భర్తలను చూశావు, తిట్టావు, అందరినీ వేడుకున్నావు. కానీ నీనమ్మకం వమ్మని తేలింది , వాడు నీ బట్టలు విప్పతీయబోతుంటే కాపాడుకోవటానికి శాయశక్తుల అక్ప్రయత్నించావు. అప్పుడు నిన్ను నీ శరీర బలంతో కాపాడు కోగలనన్న నమ్మకం నీకున్నది .వాని పశుబలం ముందు అదిసాధ్యం కాదని తేలిపోయింది. నిన్ను నిరాశ ,నిస్సత్తువ ఆవహించాయి ప్రపంచములో ఏజీవరాశీ నిన్ను కాపాడదని రూఢిఅయిపోయింది . అప్పుడు..ఆక్షణాన నేనుతప్ప ప్రపంచములో ఎవరూలేరనే భావన పరిపూర్ణంగా నీలో కలిగింది. అన్యధా శరణం నాస్తి అని ఆక్షణాన నీ పిలుపువినగానే క్షణం ఆలస్యంచేయకుండా నిన్ను కాపాడుకున్నాను. నాభక్తులు నన్ను పరిపూర్ణంగా నమ్మి నప్పుడు వారి యోగక్షేమాలను నేను ఒక్కక్షణంకూడా ఆలస్యం చేయకుండా చూస్తాను. అని ఆ పరమాత్మ తన భావాన్ని ఆవిష్కరించారు. మనం అంత భక్తిగా ఆశ్రయిస్తున్నామా? లోపం మనదగ్గరుంది. అలావుండటానికి మనమిష్టపడకనే ఆయనకు దూరమవుతున్నాము. జయశ్రీకృష్ణ.

Read more...

టాన్సిల్స్ ను ఆపరేషన్ లేకుండా కరిగించవచ్చు

>> Sunday, September 14, 2008

సాధారణంగా టాన్సిల్స్ వాసి నప్పుడు ఆపఱేషన్ చేసి తొలగిస్తారు. దీనివలన శరీరము లో సహజసిద్దంగా పెరిగిన ఒక అవయవాన్ని ఖండించటం అనే ప్రక్రియ జరుగుతుంది. వీటిని తొలగించకుంటే నొప్పి ఆహారాన్ని తీసుకోవటమ్లో ఇబ్బంది కలుగుతుంది. కనుక తొలగించకతప్పదు. ఆయుర్వేదం లో అదీ ప్రకృతిచికిత్సలో చిన్న చిట్కా ద్వారా వీటిని కరిగించవచ్చు. కొంతమందికి ప్రయోగపూర్వకంగా చూసాను మంచి ఫలితం వచ్చింది. అలా వున్నవారికి మీరూ ప్రయత్నించి చూడండి.

మనకు చింతపండులో వుండే చింత విత్తనం దీనిపై అద్భుతంగా పనిచేస్తుంది. చింత విత్తనాన్ని బండ, లేదా సానరాయి మీద గంధం వచ్చేలా అరగదీయాలి. వచ్చిన గంధాన్ని గొతుక్రింద టాంసిల్స్ వాసి చేతికి తగిలే భాగమ్లో పట్టీలాగా వేయాలి. అలాగే ఒక పుల్లకు దూదిచుట్టి ,దానితో గంధాన్ని తీసుకుని నోరుతెరవమని చెప్పి టాంసిల్స్ కు తగిలేలా పూయాలి. ఇలా రోజుకు నాలుగైదుసారులు టాంసిల్స్ కు పూయాలి . వారము రోజులు చేయండి తప్పనిసరిగా తగ్గుతాయి. రోజురోజుకు ఫలితాలు మనకు తెలుస్తుంటాయికనుక మరికొన్ని రోజులు పట్టినా వాడిచూడండి. . మనపెద్దలిచ్చిన వైద్యమిది. దీనికిఎటువంటి పేటెంఠక్కులు లేవు నిరభ్యరంతరంగా అందరికీ పంచండి.

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP