శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కీరో బ్రాహ్మణ గురువులు - ఇండియాలో ఆధ్యాత్మిక జీవనం

>> Tuesday, July 29, 2008

పూజ్య శ్రీ ఎక్కిరాల వేద వ్యాస్ గారి రచనలనుండి(3)

బొంబాయి ప్రాంతంలో నివసించే బ్రాహ్మణుడు ఒక జోషీ కులస్తుడు . తనకు సాముద్రిక జ్యోతిషం నేర్పించాడనీ ఆయన తనకు బొంబాయిలోనే ఓడల రేవువద్ద కలిసాడనీ స్పష్టంగా ఇంగ్లీషు మాట్లాడే బ్రాహ్మణుడు పురోహితుడివలే వున్నాడనీ తన ఆత్మ కథలో కీరో ఈవిధంగా వర్ణించాడు.

“ Yet, out of that motley crowd, there was one person who was actually coming to greet me ! An old man, garbed as I thought , like a Brahmin priest, was even then, making his way towards me ! I could hardly believe it at first, but our eyes met, and that seemed to decide his action.”

“ Again the Study I loved so much, had opened another door for me . I shall never forget the expression that passed over the old mans face! He held out his hands for me to read. I told him all I could, of the dates of changes in his life, illness in the past, and other things.”

“Wonderful ! “ was all he muttered. After sometime he told me of himself that he was a descendant of the old joshi caste . who had kept the study of hand, together with that of Astrology, alive since some far- distant ages.

“ He described where he lived and pointed to the western Ghats, or range of low mountains to the North of the city. He told me of his associates , how simply they lived, the occult studies they believed in and practiced.

“ Of course , I was fascinated! It remembered me so much of a book my mother had let me read, dealing with the Yogis of India.

“ I expressed a wish to go and live there with him. He held out his hand. Very simply he said “ Come ! you will be welcome among us ! Whatever our knowledge is , shall be yours, provided you pass through certain tests of willpower and faith”

“ Thus there was, that I had the inestimable privilege living for upwards of two years, in the society of men who were not only devotees of Indian occultism but who were Masters of whatever branch of it they had especially made their own.”

బాంబే పరిసర ప్రాంతాలలో వుండే పశ్చిమ కనుమల పర్వతాలలో జోషీ కులస్తులు క్రీస్తుకు పూర్వం 3000 సంపత్సరాలనుండీ అనాదిగా జ్యోతిష విద్యను రహస్యంగా పరిరక్షించుకుంటూ జాగ్రత్తగా బోధిస్తూ వచ్చారు. వారివద్దనుంచీ కీరోకు అధ్భుతమైన హస్తరేఖల శాస్త్రంలో శిక్షణ లభించినదని కీరో తన ఆత్మకధలో స్వయంగా వ్రాసుకున్నాడు పై వాక్యాలలో.

ఆ బ్రాహ్మణుడు కీరోకి తానీ విద్యను నేర్పేముందు ఒక ప్రమాణం చేయించాడు. తానీ విద్యనేర్చుకుని తెల్లదొరల దేశాలకు తిరిగి వెళ్ళి కనీసం 21 సంవత్సరముల పాటు ఈ శాస్త్రంయొక్క గొప్పదనం విదేశీయులకు అర్ధమయ్యేలాగు ప్రచారమయ్యేలాగ ఈ శాస్త్రాన్ని గౌరనం చెడకుండా కాపాడుకుంటూ ప్రజలకు భవిష్యత్తు చెబుతూ, ఈ విద్యను మానవులకు కష్టంలో సహాయం చేయడానికి ఉపయోగిస్తాననీ ఎవ్వరికీ అపకారం చేయడానికి, లేక స్వార్దానికి వినియోగించడానికి ఈ జ్యోతిష పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చెయ్యనని ప్రమాణం చేశాడు.

కీరో లండన్ కు తిరిగి వచ్చిన తరువాత దాదాపు 21 సంవత్సరాల పాటు రాజులు, మహారాణులు , కళాకారులు, విద్యావేత్తలు, రచయితలు ఒక్కరేమిటి , చివరకు స్వామి వివేకానందుని వంటి మహానుభావుని చేతిముద్రలు కూడా సేకరిస్తూ అధ్భుతమైన జ్యోతిష ఫలితాలను ఎందరికో చెప్పాడు.

అంతేకాదు తన గురువుకు మాటఇచ్చినట్లుగానే జ్యోతిషమంటే విదేశాలలో భక్తి, గౌరవాలు పెరిగేలాగ, ఈవిద్యను సద్వనియోగం చేశాడు. అంతాకాడు ఇప్పటివాళ్లలాగ బ్రాహ్మణులను, తనకు విద్య చెప్పిన వారిని చులకన చేస్తూ ఎన్నడూ మాట్లాడలేదు. మీదుమిక్కిలి ఎంతో భక్తితో ఈ భ్రాహ్మణుల నిస్వార్ధ జీవితాన్ని వారు తరతరాలుగా ఈ పవిత్ర విద్యను కాపాడుతూ ఎన్నో కష్టాలను అనుభవిస్తూకూడా డబ్బు కోసం ఆశపడకుండా ఇప్పటికీ ఈ జోషీ కులస్తులు తనకీ విద్యలో ఎలా శిక్షణ ఇచ్చారో స్పష్టంగా వర్ణించాడు కీరో.

అంతేకాదు ఈ బ్రాహ్మణ గురువు కేవలం జాతకం నేర్చుకుంటే చాలదు మనిషికి వాక్ శుధ్ది, జపధ్యానములు దైవ చింతన లో కూడా శిక్షణ వుంటేగాని ఈ విద్య నాస్తికులకు స్వార్ధపరులకు చెప్పరాదని నియమం పెట్టి కీరోకు మంచి శిక్షణ నిచ్చాడు.

ఈవిధంగా కీరో మూడు సంత్సరములపాటు ఉప్పు కారంలేని ఆహారం తింటూ పాలూ అన్నంమీద తన గురువు చెప్పిన సాధన చేస్తూ జ్యోతిషం నేర్చుకున్నాడు.

చివరకు పశ్చిమ కనుమలలోని కొండ గుహలలో ఒక రహస్య దేవాలయ శివాలయనికి కిరోను తీసుకువెళ్ళి అర్ధరాత్రి అతనికి యోగ దీక్షనిచ్చి ధ్యానంలోకి పంపాడు. అక్కడ గాఢ సమాధిస్థితుడైన కీరో మూడు రోజులవరకూ ఆన్నాహారములు లేకుండా అసలు వంటిమీద బాహ్యస్పృహలోని యోగ సమాధి స్ధితుడైనాడు. తరువాత క్రమంగా మెలుకువ వచ్చింది. కాని నీరసానికి కళ్ళు చీకట్లుక్రమ్మి కళ్లు కనిపింటలేదు.ఆ తరువాత హిమాలయ పర్యతాలలో మానస సరస్సు వద్ద ధ్యానిస్తూ కీరో తన జ్యోతిష శిక్షణకు తన జప ధ్యానాదులకు ఇంకా మెరుగులు దిద్దుకున్నాడు.

ఆయన తాను వ్రాసిన హస్తసాముద్రికం భాష అన్న పుస్తకంలో హిమ శిఖరాలలో బాలచంద్రుని చూస్తూ ధ్యానించిన తనకు ప్రాచీన వేద మంత్రాల ఘోషలు ఇప్పటికీ గాలి హోరులో నాదంలాగ వినిపిస్తాయని తాను తన్మయంతో పులకించాననీ, ఆ ఆనందంలో దైవంకు దగ్గరై దైవసన్నిధి పొందినట్లు పులకించాననీ వర్ణించాడు., తన బ్రాహ్మణ గురువులకు కృతజ్ఞత తెలుపుతూ

భారత దేశంలో ఉండగా ఎన్నో రహస్య ఆధ్యాత్మక అనుభవాలను వారినుండి అనుగ్రహంగా పొందటమేకాక గొప్ప ఆధ్యాత్మిక సద్గురువులను ( పేరు చెప్పలేదు) కలిసాడు కీరో

వారి వద్ద పొడవాటి తోలు మీద వ్రాసిన జ్యోతిష గ్రంధాలు ( నాడీ గ్రంధాలు) చూపించారనీ అందులో మూడు పేజీలు మాత్రమే తనకు వివరించి ఇది చాలుననీ ఆమూడు పేజీల వలన మనిషి గతంలోను జరగబోయే భవిష్యత్తునూ నడుస్తున్న వర్తమానమూ అన్నీ తెలుస్తాయని చెప్పి ఆశీర్వదించి పంపుతూ-

“ నీవు విదేశాలకు , నీ స్వదేశానికి తిరగి వెళ్ళే సమయము కూడా ఆసన్నమైంది. నీవీ విద్యను దూర దేశాలలో ప్రచారం చేయ్యి. రాజులు , మహారాణులు ప్రముఖులు నీవద్దకు వస్తారు. భవిష్యత్తును తెలుసుకోవడానికి. అందరికీ ఉపకారం చెయ్యి ఎవ్వరినీ స్వార్ధానికి వినియోగించుకోరాదు. దైవచింతన నిత్యమూ చేస్తూవుండు. పవిత్ర జీవనం గడుపు. నీజీవితం చివరలో నీ సద్గురువు అనుగ్రహం మళ్ళీ నీకు లభిస్తుంది. “ అంటూ ఆశీర్వదించి తిరిగి కీరోను విదేశాలకు పంపారు.

ఈ విధంగా “భగవంతుడు నిర్దేశించిన చదువు “ తనకిలా పూర్తిఅయ్యిందని కీరో తన సొంత వాక్యాలలో ఇలా ఆన్నాడు.” After in this way completing may Education if I may use that term , I was enabled to return to London by the death of a relation who had left me a considerable amount of money”

- “ Confessions and Memories of Modern Seer “ ( - page 33.)

Read more...

బలముతో కూడిన మంచితనం ఆవశ్యకత

>> Sunday, July 27, 2008

" అశక్తుణ్ణి ఏడిపించటం అందరికీ సరదా" అని ఎవరో వ్రాయగా చదివాను. అది నిజమేననిపిస్తున్నది నేడు. కర్రలేనివాణ్ణి గొర్రెకూడాకరుస్తుందంటారు పెద్దలు సామెతగా. ఏ రెండుమాటలు మనకొక హెచ్చరికచేస్తున్నాయి.
సామాన్యంగామనం మంచితనానికి ప్రాధాన్యతనిస్తాము. అంతేగానీ,బలమూ,దైర్యము కలిగివుండాలనుకోము. బలము లేని మంచితనం నిరుపయోగం. ఎవరిజోలికీ పోనివాణ్ణి ,తనపని తాను చూసుకునేవాణ్ణి మంచివాడని అంటాము. మంచివాడంటే భయస్తుడు,స్వవిషయము చూసుకునేవాడు,ఆయుధము ముట్టనివాడు అనే అభిప్రాయం మనలో ఏర్పడింది.
ఈ దురభిప్రాయం పోవాలి . బలం కలిగివుండటం మంచితనములో భాగం కావాలి. ప్రపంచములోనూ, దేశములోనూ హింసా ప్రవృత్తి పెరుగుతున్నది. స్త్రీలకేకాదు అసలు దేశవాసులకే రక్షణలేకుండా పోతున్నదనిపిస్తున్నది నేడుజరుగుతున్న పరిస్థితులను గమనిస్తే. వీటిని ఎదుర్కోవాలంటే మంచివారు బలాన్ని పెంపొందించుకోవాలి.
మనం పూజించే దేవీ దేవతల చేతులలో ఉండే ఆయుధాలను చూడండి. శ్రీరాముడు ధనుస్సును, దుర్గ శూల ఖడ్గాలను, ప్రతి దేవతా రూపం చేతిలోనూ వివిధ ఆయుధాలెందుకున్నాయి? వాళ్ళు దుర్మార్గాలను ప్రతిఘటించారేగానీ దాసోహమనలేదు. కనుక శక్తియుతమయిన సౌశీల్యం మనలక్ష్యం కావాలి. లేదంటె రేపు మన కల్లెదుటే మన అక్క చెల్లెళ్ళకు అవమానంతప్పదు. మనం సంపాదించే నోట్లకట్టలు మనలను రక్షించవు . ఎఅక్కడ ఎవడు బాంబులు పేలుస్తాడో , కత్తులు పట్టుకుని నీకుత్తుక కత్తెరించడానికి వెంటపడతారో తెలియదు. తస్మాత్ జాగ్రత్.

Read more...

ఉపదేశవాణి

>> Thursday, July 24, 2008

నీవు ఇతరులకు ఏమి ఇస్తావు అన్న దానిపై నీ ఆనందం ఆధారపడి వుంటుంది. నీవు పుచ్చుకొనే దాని మీద కాదు.
ఇంద్రియాలు అధీనములో లేని వానికి బైట ప్రపంచం మీద ఏ అధికారమురాదు. అతడు ప్రపంచానికి బానిస అవుతాడు.
వేదాంతం అంటె జీవించేకళ. ఇంట్లోను, పొలములోను, ఫ్యాక్టరీలోను, ఎక్కడైనా అన్ని సందర్భాలలోను అన్ని సమయాలలోను దాన్ని అభ్యాసం చేయవచ్చు. ..... svaami chinmayaanamda

Read more...

కమ్మవారిపాలెములో రామాలయాన్ని పూర్తిచేపించిన రామదూత.

నూజండ్ల మండలములో గల ఒక చిన్న గ్రామం కమ్మవారిపాలెం. కానీ ఆగ్రామానికి చెందిన పలువురు చదువులలో ముందంజవేసి ఈరోజు పెద్ద వుద్యోగులుగా అనేక చోట్ల పనిచేస్తున్నారు. అమెరికాలో నూ వున్నారు .ఈ గ్రామములో 40 సంవత్సరాల క్రితం రామాలయాన్ని నిర్మించటానికి సంకల్పించి గోడలుకూడా పూర్తిచేశాక గ్రామములో విబేధాలు వచ్చి, ఆగిపోయినది. అప్పుడు పరస్పరం జరిగిన దాడులలో ఒక వ్యక్తిమరణించటముతో గ్రామము నిలువుగా చీలిపోయినది. తరువాత పలువుర ఈ గ్రామము విడిచి వేరే ప్రాంతమునకు వెళ్ళిపోయారు. దానితో ఆర్ధికముగా శక్తికలిగినా ప్ర్గతిలేని కుగ్రామము గానే మిగిలిపోయినది. మా జేజినాయన గారినుండి ఈగ్రామములోని వారితో స్నేహ సంబంధాలువున్నాయి మాకు.
మేము ఊరూరా చేస్తున్న హనుమత్ అభిషేకాలను చూసిన నావిద్యార్ధి చిరంజీవి గంగినేని రాధాకృష్ణమూర్తి {బాబు} వచ్చి సార్! మాగ్రామము లో కూడా స్వామికి అభిషేకాలు చేయవచ్చుకదా? అని అడిగాడు. మీవూరిలోకి వెళ్ళీ అందరి నీ అడుగు అన్నాను. అలా అడిగితే ఎవరోఒకరు అడ్డుచెబుతారు మనంచేస్తే స్వామివారే అందరినీ రప్పిస్తాడు,అని వాడు ఎంతోవిశ్వాసంగా చెప్పేసరికి నిజమేకదా అనిపించింది. సరే అన్నాను. వూరిలోకివెల్లి ఫలాఆ రోజు అభిషేకాలుఅని కార్యక్రమ వివరాలన్నీ అరుగుల మీద కూర్చున్న పెద్దమనుషులకు చెప్పాము. అప్పటికప్పుడు తాటి ఆకులు తెప్పించి ,పాత గోడలమీదనే ఆలయానికి పందిరి వేయించాము. విగ్రహాలు లేవుకనుక వినుకొండ గుంటి ఆంజనేయస్వామివారి ఆలయము నుండి వుత్సవ విగ్రహాలు తెప్పించాము. అభిషేకము రోజుకు అన్నీ సమకూర్చుకుని ,నూజండ్ల పురోహితులు జన్నాభట్ల నరసిమ్హ శాస్త్రి,వుగ్రకుమార్,సుదర్శనం మొదలయిన వాళ్ల చేత కార్య క్రమాన్ని వైభవంగా జరిపించాము. ఈ గ్రామానికి 1 కి,మీ, దూరములో శక్తివంతమయిన దక్షిణముఖ ఆంజనేయ క్షేత్రం ఏకాంతముగా వుంటుంది. అక్కడ ముందుగా ఏ ఆటంకాలు కలగకుండా వుండేందుకు అర్చన జరిపాము. గ్రామములో అందరూ ఎంతో సంతోషముతో పాల్గొన్నారు. కార్యక్రమము చూడటానికి వచ్చిన ఆగ్రా మ దళిత వాడప్రజలు, తమవాడలో కూడా స్వామివారి అభిషేకం జరపాలని కోరారు. నేను ఇది స్వామివారి ఆదేశం మీరు ఈకార్యక్రమానికి వచ్చిజరపాలని కోరాను. వాళ్ళుకూడా సంతోషముతో వచ్చారు. అప్పటికప్పుడు వాళ్ళు చందాలు వేసుకుని సామ్మనులు తెచ్చుకున్నారు మరుసటిరోజు మేమువెళ్ళి పాఠశాల ముందరవున్న ఖాళీలో టెంట్లు వేపించి నాపరాళ్ళతో తాత్కాలికముగా వేదిక నిర్మించి అభిషేకాలకు సిద్ధమయ్యాము. అక్కడా ఇదే పరిస్థితి. చెన్నకేశవ స్వామివీరాచార వంతులు ఒక వర్గము. మతమార్పిడీకి గురయినవారు ఒక వర్గము. అక్కడ నిర్వాహకులు అందరినీ రమ్మని పిలచారు . కానీ వాళ్ళ మత పెద్ద మనం వెళ్ళకూడదు అని ఏదేదో చెబుతూవుంటే రెండవ వర్గమువారు దూరముగా నిలుచుని చూస్తూవున్నారు. సరేకానివ్వమని ,మేము రుద్రసూక్తముతో అభిషేకాలు మొదలు పెట్టాము. పల్లెలో వారంతా నిష్టగా బోరింగువద్ద నుంచి నిండుబుంగనీళ్ళు తెచ్చి స్వామివారిని అభిషేకిస్తున్నారు . పావుగంట గడచేటప్పటికి దూరంగా చూస్తున్న వారు పూనకం వచ్చినట్లు వారిస్తున్న ఆమత బోధకుడిని విదిలించి తిట్టి తాముకూడా బోరింగువద్దకు వచ్చి స్నా నాలుచేసి అభిషేకాలలో మమేకమయినారు. ఆరోజు నృత్యగానాదులతో మేమంతా స్వామిని కీర్తిస్తూ వారితో పాటు మైమరచిపోయాము. నిజంగా భగవద్భక్తిభావన ఎవరిలో నిష్కల్మషంగా మిగిలివుందో ఆరోజు నాకు గోచరమయినది. ఆవిధంగా కార్యక్రమం దిగ్విజయంగా ముగిసినది. పలుకారణాలవలన వేరయిన మనసులు దగ్గరయ్యాయి ఆగ్రామములో .
తరువాత శనివారము మాత్రము గ్రామస్తులు సాయంత్రం భజన చేసుకుంటూ వుండేవారు. తరువాత తరువాత వారిలో ఆగిపోయిన రామాలయం పునర్ణిమించాలనే ప్రేరణ కల్పించాడు స్వామి. అది ఐదుసంవత్సరాలకు కార్యరూపము దాల్చినది. బాబు నావద్దకు వచ్చి సార్ గ్రామములో అందరూ ఆలయం పూర్తిచేయాలని కోరికతోవున్నారు. మీరురావలని కోరితే వెళ్ళాను, ముందు పాతనిర్మాణము తొలగించాలని నిర్ణయించాము. ఆలయానికి ఆగ్నేయమునుండి వీధి పోటువున్నది. దానితో ఈకార్యక్రమము మొదలుపెడితే గొడవలు మొదలుకాఅచ్చని ముందుగానే అందరినీ హెచ్చరించాను. దానిని కూల్చేరోజు నేనువస్తాననిచెప్పాను. అనుకున్నరోజుకు వాళ్ళు ప్రొక్లయినర్ తెచ్చి సిద్ధముగా వున్నారు నేను వెళ్ళేసరికి, మేమంతా పూజజరిపి తొలగింపుప్రారంభిచబోయేసరికి రానేవచ్చినది విఘ్నము. వుణ్ణట్టుండి బాబువాళ్ళ నాన్న గారు బ్రహ్మనాయుడు, సివాలెత్తిపోతూ ,ఒరే నీకు ఈపనివద్దు. నిన్ను దీనిలోదింపి అందరూ తప్పుకుంటారు, మనకెందుకు నువ్వు ఇంట్లోకిరా! అని బాబుతో వాదన వేసుకున్నాడు. అది తండ్ఱీ కొడుకుల మధ్య పెద్దవాదనగా మారి ఆయన నువ్వు ఇంట్లోకివచ్చి నాశవాన్నే చూస్తావు అంటూ పురుగుమందు దబ్బా తీసుకుని ఇంట్లోదూరి తలుపువేసుకున్నాడు. గోల..గోల మొడలయినది. నేను వెంటనే కుర్రవాళ్ళను ఎలర్ట్చేసి వీధిపోటువున్నవైపు రాళ్ళను గోడలాగా పెట్టించి ,ఆయన ఇంటికి వెళ్ళి బ్రతిమిలాడితే తలుపుతీశాడు. మాస్తర్ గారూ మీకు తెలియదు. మావాడిని ముంచుతారు అని ఆవేదన చెందుతున్నాడు. వాడసలు నిర్మాణ కమిటీలోనే వుండడు. ,అందరితోపాటు మీరూ చందాయివ్వండి చాలు. సరేనా అని అడిగి ఆయనను ఒప్పించి బయటకుతెచ్చాము. తరువాత దాన్ని కూల్చివేశారు.
మరలా సిధ్ధాంతులను పిలిపించి ప్లాన్ వేసి ముహూర్తము నిర్ణయించి శంఖుస్తాపనకు ఇతరప్రాంతాలలో వున్న ఆగ్రామస్తులనందరినీ పిలిపించాము. అప్పటికప్పుడు 9 లక్షలరూపాయలు ఇవ్వటానికి దాతలు వాగ్దానం చేశారు. ఇదంతా స్వామి అనుగ్రహము. తరువాత చాలా చక్కటి ఆలయాన్ని నిర్మించి 2007 లో ప్రతిష్టను వైభవోపేతముగా జరిపించి స్వామి తనను నమ్మిన వారి కార్యక్రమాలకు తానే రక్షగా నిలుచుంటాడని నిరూపించాడు. శ్రీ ఆంజనేయం.

Read more...

భార్య చనిపోతే కన్నీరు రాలేదేమి?

>> Tuesday, July 22, 2008

లోకమాన్య బాలగంగాధర తిలక్ పూనా లో వుంటూ కేసరి,మరాఠా అను పత్రికలను నడుపుతూ ,వానిలో విప్లవ కారులను సమర్ధిస్తూ వ్యాసాలు వ్రాసినందుకు,దేశద్రోహ నేరము మోపి ఆయనకు ఆరుమాసాల కారాగార శిక్ష విధించింది ,బ్రిటీష్ ప్రభుత్వం. ఆయనను బర్మా లోని మాండలే జైలుకు పంపింది.
జైలులో వుండగా వారి భార్య మరణించింది.తంతి ద్వారా ఈ విషయము ఆయనకు తెలుపబడినది. జైలు అధికారి ఆతంతిని తీసుకవచ్చి ఆయనకిచ్చాడు. ఆయన దానిని చదువుకుని మరలా దానిని బల్ల మీద వుంచాడు.ఆయనకు,ధు:ఖము గానీ,శోకము గానీ కలుగలేదు.
మీ ధర్మపత్ని చనిపోయినది.అయినను మీ కంటివెంట ఒక్క నీటి బిందువుకూడా రాలేదేం అని ఆ అధికారి తిలక్ గారిని అడిగాడు.
అందుకు తిలక్ గారు చెప్పిన సమాధానం: " i have no tears to shed at this occasion, because they all for my country". { ఈసమయములో నా నేత్రముల నుండి ఒక్క కన్నీటి చుక్కను గూడా రాల్చలేను, కారణ మేమంటే ,వున్న కన్నీటినంతా నా మాతృభూమి కొరకు ఇదివరకే ఖర్చు చేసాను.} అన్నారు తిలక్. తిలక్ మహాశయుని దేశభక్తి అట్టిది.

Read more...

ఇండియా పిలిచింది

>> Monday, July 21, 2008

ఇండియా పిలిచింది (పూజ్య శ్రీ ఎక్కిరాల వేద వ్యాస్ గారి రచనలనుండి}

బయటి ప్రపంచానికి కీరో అన్న మారువేషములాంటి ముసుగు జీవితం గడిపిన వ్వక్తి అసులు పేరు – విలియమ్ జాన్ వార్నర్ . అతడు 1- నవంబరు 1866 లో ఇంగ్లండులోని విక్లో మండలములో జన్మించాడు.తరువాత తన పేరును చట్ట ప్రకాపము లూయీస్ వార్నర్ హ్యూమన్ అన్న జమిందారీ పేరులోకి మార్చుకున్నాడు . ఇతడు విలియమ్ హ్యామన్ అన్న ఇంగ్లీషు పెద్ద మనిషి కుమారుడు. ఇతని తల్లి ఒక ప్రెంచి లేడీ మార్గరెట్ డూమాస్. ఈమె జన్మతహ ఆధ్యాత్మిక చింతన గల వ్యక్తి.

ఈమె తన కొడుకు పదేళ్ళ పిల్లవాడుగా వున్నపుడే అరచేతి గీతలను బట్టి భవిష్యత్తు తెలిపే ఓ చిన్న పుస్తకం బహూకరించింది. కాని అతడి తండ్రి నాస్తికుడు కాకపోయినా జ్యోతిషాలన్నా , మంత్రాలన్నా , మహిమలన్నా ఆయన సుద్ద వ్యతిరేకము. తన కొడుకు పాడై పోతున్నాడని భయంతో కీరోను ఒక క్రైస్తవ చర్చి మతగురువుగా తయారు చేసే శిక్షణనిచ్చే మత ఛాందస క్రైస్తవ కాన్వెంటులో చేర్చాడు.

ఈదెబ్బతో పిల్లవాడు పూర్తిగా మారక తప్పదని నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు . కాని హిరణ్య కశిపుని శిక్షణ, విద్యాభ్యాసము ప్రహ్లాదుడిని ఎంత మార్చిందో ఈ క్రైస్తవ బిషప్ ల మత మూఢత్వపు విద్యా విధానం కూడా ఈతనిపై అంతే పనిచేసింది. ప్రతి నిత్యము పాఠశాలలో ఖాళీ దొరికినప్పుడల్లా చేతి రేఖల గురించిగానీ , జన్మతేదీల గురించిగానీ తెలిపే పుస్తకములు వెతికి తెచ్చుకొని చదివేవాడు.ఒక రోజున ఇతని క్రైస్తవ టీచరు ఒక చండశాసనుడు కీరోను కఠినంగా పాఠం వల్లె వేయిస్తున్నాడు. కాని ఎంతకీ పాఠం మీద నిలకడలేని పిల్లవాడిని చూచి ఆనుమానపడి తనిఖీ చేస్తే కీరో క్లాసు పుస్తకం పధ్య పేజీలలోపల దాచిన ఓ జ్యోతిష పుస్తకం చదువుచున్నాడు. చావకొడతాడని భయపడ్డ కీరోను ఆ టీచర్ పిలిచి నీకు నిజంగా చేతిలోని గీతలమీద అంత నమ్మకం వుందా వు.టే నాచేతి గీతల గురించి చెప్పగలనా చదివి చెప్పు చూద్దాం అండూ ఒక ఛాలెంజ్ లాంటిది విసిరి తన చేతిని చాపి పిల్లవాడైన కీరో ముందు తెరచి పెట్టాడు.

పిల్లవాడు ఒక్క సారిగా భయపడ్డా నెమ్మదిగా తనను తాను సంభాళించుకుని తన టీచరు రేఖలను పరిశీలించుచూ ఇలా చెప్పసాగాడు

టీచర్ క్రైస్తవ సన్యాసిగా బ్రహ్మచారి జీవితంలోనే మీరు కనిపిస్తున్నా నిజానికి మీరు మీ చిన్నతనంలో ఒక అమ్మాయిని ప్రేమించారు అతి గాఢంగా ప్రేమించిన ఆ ప్రేమ భగ్నం కావడంతో మీ హృదయం గట్టిపడిపోయి క్రైస్తవ సన్యాసుల పాఠశాలలో చేరారు.. అంటూ తన టీచరు యొక్క వ్యక్తిగత జీవితమంతా పూర్తిగా చదివేశాడు పిల్లవాడైన కీరో.

తనని చూసి భయపడే పిల్లవాడు అలా ఒక్కసారిగా తన వ్యక్తిగత జీవితానికి తెరతీయడంతో తేలు కుట్టినట్లు తన చేతిని లాగేసుకున్నాడు. ఆరోజు నుండ్ పిల్లవాడైన కీరో ను ప్రేమతో చూచేవాడు . ఎన్నో సార్ల కఠినమైన హోమ్ వర్క్ రాకపోయినా కీరోను వదలి వేశాడు.ఇలా ఫ్రారంభమైంది కీరో జీవితంలో జాతకాలు చూడటం.

ఇంకోరోజుల తన స్కూలు వార్షికోత్సవం , వైభవంగా ఉత్సవాలు , ప్రైజ్ లు , డ్రామాల ఏర్పాట్లతో అందరూ తయారవుతున్నారు. పిల్లవాడైన కీరో మాత్రం దిగులుగా ఓ ప్రక్కగా పాలిపోయిన ముఖంతో కూర్చుని వున్నాడు.

టీచరు చూచి పిల్లవాడైన కీరోను బుజ్జగించి స్కూలు వార్షికోత్సవం రోజున అలా దిగులుగా వున్నావేమని ప్రశ్నించాడు. పిల్లవాడైన కీరో తనకు ఒక చెడుకల వచ్చిందని బహుశా ఆరోజుతో తన స్కూలు జీవితం అంతం కోబోతుందనీ దిగులుగా చెప్పాడు. టీచరు అతనిని ప్రేమగా మందలిస్తూ అలాంటిది జరుగదు బాగా చదువు అనిచెప్పాడు.

ఆపుడు తను క్లాసులో కూర్చును ఉండగా ఓ మత్తులాంటి మైకం లోకి జారిపోయినట్లుండగా అప్పుడొక వార్తాహరుడు ఒక పొడవాటి కవర్ ను తెచ్చి కీరోకు ఇచ్చినట్లు తలకో దృశ్యంలా కనుపించినదనీ ఆకవరు మీద తన తండ్రి దస్తూరీ కవరు అందుకోగానే అందులో ఏదో చెడువార్త వచ్చినట్లు కీరో శరీరమంతో చలి వంటి గగుర్పాటు కలిగి, తుళ్ళి పడి బహుశా ఏదైనా చెడువార్తవచ్చి తన స్కూలు జీవితానికి తెపపడుతుందేమో అంటూ కీరో భ.యపడుతూనే చెప్పాడు తన టీచరుతో

టీచరు అబ్బే అదేమీలేదు అంతా మంచిగానే జరిగి పోతాయి అంటుండగానే నిజంగానే ఒక వార్తాహరుడు రావడము అతడు పొడవాటి కవరు తెచ్చి కీరో కివ్వడమూ జరిగిపోయాయి.

దానిపైది తన తండ్రి దస్తూరి అనీ చూదగానే గుర్తు పట్టేశాడు కీరో. కలరు ముట్టుకోగానే ఒక కరంటు వలె చేడు వార్త ఏదో వచ్చినట్టు భయం. చివరకు కవరు చింపి చూస్తే తండ్రికి తన వ్యాపారంలో అంతా నష్టపోయి దివాలా తీసాడట. చేతిలో పైసాలేదు. అందుకని కీరో చదువు ఆరోజుతో స్వస్తిచెప్పి ఏదైనా జీవనోపాధి చూచికోవడం మంచిదని ఆలేఖ సారాంశం.

ఇలా ఒక అకస్మాత్తు సంఘటనతో కీరో జీవితం నడి సముద్రంలో వదిలేసిన నావలాగ ఐపోయింది. దాంతో చర్చిమత గురువుగా తయారుచేసే చదువుకు ఆనాటితోనే తెరపడింది.

దిక్కుతోచని కీరో వీధిన పడ్డాడు. ఏంచేయాలి. ఎటు పోవాలి. ఏమీ దారి కనిపించక , దిక్కుతోచక అలా నడుస్తుంటే , లండన్ లోని ధేమ్స్ నది ఒడ్డున ఓడలు లంగరులెత్తి వున్నాయి. అందులో ఒక అతుకుల బొంతలాంటి నౌక లేక ఓడ లోకి నడిచాడు అప్రయత్నంగా.

అది చదువులేని మూర్ఖులైన ఏడ దొంగలనంటి బండ తేరి పోయిన బ్రిటీషునావికుల డబ్బా ఓడ తనకు సముద్రం పైన ప్రయాణించే సరంగుగా వెళ్ళాలని ఉంది అంటూ ఓడ కెప్టెన్ తో భయం భయంగా సణిగాడు కీరో.

సముద్రంలో మునిగి చావు గంగలో దిగు నాకేమిటి అన్న చీదరింపుతో తనపనిలో తాను పడ్డాడు కెప్టెన్ . తన విషయాన్ని నెమ్మదిగా వివరించాలని నానా తంటాలు పడుతున్న కీరో ని ఏమీ పట్టించుకోకుండా ఓడ సరంగులు త్రాళ్ళు విప్పి నావను సముద్రంలోకి వదిలారు.

అలా కెప్టెన్ తో వాదిస్తుండగానే కీరో జీవితం, నిజంగానే నడి సముద్రాన పడింది. మొదట నావికులు త్రాగుబోతులు., ఓడ దొంగలు, క్రుళ్ళిన మాంసము , పచ్చి చేపలు తిని బ్రతికే కటికవారిమద్య ఛస్తూ లేస్తూ పడి ప్రయాణించాడు. చివరకు ఓడ కెప్చెన్ చదువు రాని వాడు కావడం వల్ల కీరో వాడికి రోజు వారి ఖర్చులు లెఖ్ఖల పద్దులూ వ్రాసే సాయంచేసిపెట్టాడు. ఫలితంగా ఉడక బెట్టిన బంగాళాదుంపలు వంటశాలలో మిగిలినవి కీరోను తిననిచ్చేవారు.

అలా తుఫానుల్లో అలల్లో లేస్తూ పడుతూ నెలరోజలు సముద్రంమీద ప్రయాణించి చివరిగా ఓడ తూర్పుగా బంగారురంగు సూర్యోదయమౌతుంటే ఓ రేవుకు చేరింది. అందరితోపోటే కీరోను ఒడ్డున పడేశారు. ఎవ్వరూ ఏమీ పట్టించుకోకుండా.

అది ఏఉరో ఏదేశమో అంతు తెలియని కీరోకు. చుట్టూరా హడావుడిగా అటూ ఇటూ పరిగెత్తే సరంగుల కేకల వల్ల బొంబాయి బొంబోయి అంటూ ఓపేరు వినిపించంది.

ఇదెక్కడ వుంది. ఇదే దేశం అని ఏమీ ఎరుగని పిల్లవాడైన కీరో హార్బరుమీద కనిపించిన ప్రతివాడి వెంట పరుగెత్తి అడిగితే ఒకడు చివరకు ఆశ్చర్యంగా కీరో వైపు పిచ్చివాడిని చూచినట్లు చూసి ఏ దేశమా ఇది ఇండియా రా ను వ్వు భూతాల నరకం నుండి ఊడిపడ్డావా , నువ్ను చేరింది ఎక్కడికో తెలియనంత పిచ్చివాడివా అంటూ కసిరి వెళ్ళిపోయాడు.ఒక్క సారిగా కీరో హృద.యం ఆనందంతో గంతులేసింది. ఓహో ఇండియా ఆహా ఇండియా కీరో ఎప్పుడూ కలలుగనే జ్యోతిషం చెప్పే బ్రాహ్మలుండే ఇండియా , జాతకాలు చెప్పే మంత్రాలు నేర్పే ఋషీశ్వరులుండే ఇండియానా అంటూ కీరోకు తన ఆదృష్టానికి ఆనందంతో కళ్ళవెంట ఆనంద భాష్పాలు పొంగి వచ్చాయి.

కీరోకి తన్నితే బూరెల బుట్టలో పడ్డట్టయింది తన పని ఓహో కానీ ఖర్చులేకుండా తనను ఇండియాకు చేర్చాయా తన చేతిలోని ఈ గీతలు, అనుకుంటూ ఓడలు ఆగిఉన్న హార్బరులోనే కూలబడి తనచేతిలో అలానే గీతలు చూచుకుంటూ మురిసి పోతున్నాడు.

చుట్టూరా వాళ్ళంతా ఎవరిళ్ళకు వాళ్లు వెళ్ళి పోగా బొంబాయిలోని బాంద్రా అనే ఆ ఓడరేవు. అబ్బాయీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అంటూ ఏదో భాషలో అడిగిన ప్రశ్న వినబడి తలఎత్తి చూసాడు. అక్కడో వింత మనిషి నిలబడి వున్నాడు. తల గుండు గీయించుకున్నాడు . పొడుగాటి విగ్రహం చొక్కాలేదు ఏమీలేదు. ( తర్వాత తెలిసినది ఆయన ఒక బ్రాహ్మణుడని జోషీ కులస్తుడని ) కీరో సమాధానం చెప్పలేక పోతే ఆయన తలకు తెలిసిన భాషలు హిందీ , గుజరాతీ, మరాఠీలలో ప్రశ్నించి విసిగి వేసారి చివరకు వచ్చీరాని ఇంగ్లీషులో అడిగితే కీరో మాత్రం తాను ఇంగ్లండు ఇంగ్లండు అంటూ సముద్రంవైపు చూపించాడు.

ఎక్కడికెళ్ళాలి అని అడిగితే దిక్కులు చూపించి చూపుడు వ్రేలుతే ఆకాశంవైపు చూపెట్టి ఇంగ్లీషు వచ్చీరాని ఆయనకు తన నుదుట గీతగీసి చూపిస్తూ తన అరచేతిలోని గీతల్ని చూపించాడు. దానికి ఆయన ఫక్కున నవ్వి నుదుట వ్రాసిన వ్రాతా చేతిలో జాతకం రేఖలూ చూపెట్టే ఈ పిల్లవాడు ఇంగ్లండునుండి పైసా లేకుండా ఓడలోని సామాన్లతో సహా దించబడ్డాడని గ్రహించాడు. పిల్లవాడి ముఖ కవళికలు ,సాముద్రికం చూసి , ప్రేమతో బుజ్జగిస్తూ అతని అరచేతిలోని రేఖలను పరిశీలించాడు.

ఆనాటిముండి కీరోను తన ఇంటికి తీసుకొనివెళ్ళి తన స్వంత కొడుకు వలె , భోజనం పెట్టి ఆశ్రయమిచ్చి కాపాడాడు. ఆయన వద్దనే కీరో భారతీయుల జ్యోతిషం ముఖ్యముగా చేతి రేఖలను బట్టి వనిషియొక్క నాడీ గ్రంధాల్ని చదివే సాముద్రికశాస్త్రం నేర్చుకున్నాడు.

ఆప్పటినుండి కీరో జీవితం గొప్ప మలుపు తిరిగి అతని దశ పూర్తిగా మారిపోయింది. తాను బ్రతికివున్నన్నాళ్ళూ కీరో రాజులకు , మహా రాజులకు ఎన్నో జ్యోతిషాలు చెప్పినా సరే తానుమాత్రం భారత దేశంలోని బ్రాహ్మణులకు జీవితాంతం ఋణపడివున్నానని వారి పాదాల వద్దే కూర్చుని తాను నేర్చిన ఈ రెండుముక్కలే తనని ప్రపంచంలో ఇంతవాడిని చేశాయని సగర్వంగా చెప్పుకునేవాడు కీరో.

వింతల్లోకల్లా వింత వేలాదిమంది భారతీయులు తమ జాతకాలను చేతి గీతలను , తాము పుట్టిన జన్మతేదీల అదృష్టాన్ని తెలుసుకోవడానికి ఇంగ్లీషులో కీరో వ్రాసిన పుస్కకాలనే చదివి తెలుసుకుంటున్నారు. కానీ కీరో మాత్రం భాతతీయులనుంచే తనకు ఈ విద్య భిక్షగా లభించిందని అదే తనకు వరప్రసాదమని సగర్వంగా చెప్పుకున్నాడు.

కీరోకు జ్యోతిషాన్ని భిక్షపెట్టిన భారతదేశం ఈనాడు బిక్షగాళ్ళ దేశం అయింది. జ్యోతిషం పోయింది. భారతీయ విద్య పోయింది. డబ్బుకు చదువుకు ఇంగ్లండుమీద ఆధాపపడి బ్రతికే బానిస దేశం అయింది. భారత దేశం కీరోకు గురువు . ఏదీ ఆ భారత దేశం. కీరో కు ఓ కొత్చ జన్మనిచ్చింది ఈ భారతదేశంకాదు. మహాఋషులను గన్న భారతదేశం.

అందుకే కీరో చదివినది మనలాంటి ఇంగ్లీషు చదువు కానేకాదు. మనం వదిలేసిన జ్యోతిషం., మనం మరచిపోయిన హస్తసాముద్రికం. మన వేదాలలో మరచిపోయిన సంఖ్యాశాస్త్రము., సాఖ్యయోగము . భరతీయ విద్యావిధానంలో నడిమద్య ఈ స్కూళ్లు కాలేజీలు పుట్ట గొడుగులవలే పుట్టుకొచ్చి గలకరాళ్లవలే ఏరి పారేసిన మన జ్యోతిషము, హస్తసాముద్రికము అంటే వేదాలలో సారమే. కీరోను ఇంతవాణ్ణి చేసింది.

ఇండియా పిలిచింది కిరోను.ఎందుకంటే ఇండియో కోసమే పుట్టాడు కీరో.

Read more...

హే ! భగవాన్ ,ఆశ్చర్యం! అద్భుతం.

హేభగవాన్!
ఆశ్చర్యం! అద్భుతం! అనిర్వచనీయం నీలీల.!

ఇంకా తల్లిగర్భములో వుండగానే ,ఒక మాంసపు ముద్దకు సర్వావయవములు తీర్చిదిద్ది శిశువుగా రూపొందించు శిల్పివినీవు.
బిడ్డజన్మించుటతోనే మాతృ రక్తాన్ని క్షీరముగా మార్చి, ఆహారాన్ని సిద్ధం చేసెడి పాకశాస్త్ర ప్రవీణుడవునీవు.

మానవులకు పశు పక్ష్యాదులకు అనుక్షణము ప్రపంచమును వీక్షించుటకు అద్భుతమయిన రీతిలో చక్షువులను అమర్చిన ఘనవైద్యుడవీవు.
తమ ప్రమేయము లేకుండనే సకల ప్రాణులచేత వుఛ్వాస నిస్వాసములను జరిపించి, చెడు రక్తమునుమంచి రక్తముగ మార్చి జీవులను జీవింపజేయుచున్న ప్రాణదాతవు నీవు.
ఆడ మగ అనే రెండు తెగలను సృజించి జీవుల నడుమ అనురాగాన్ని,ఆప్యాయతను,అనిర్వచనీయమైన అనుబంధాన్ని కల్పించి జీవితాలకు అతిగొప్ప వ్యాపకాన్ని సృజించిన ఇంద్రజాలికుడవీవు.
నెమలి పింఛానికి అతి సున్నితముగ రంగులనద్దటమేకాక ,పచ్చని ఆకులనడుమ రంగుపూవులను పూయించడమేగాక,ఎక్కడో మహా సముద్రం లో వుండే జలచరములను సైతము రంగులతో అలంకరించెడి చిత్రకారుడవీవు.
ఎట్టి
ఆధారము లేకుండా ఇంత పెద్ద భూప్రపంచమును నిలబెట్టుచు,రాత్రింబవళ్ళ నేర్పరచి , జీవులకు శ్రమకు,విశ్రాంతికి తగు వీలుకల్పించిన పరిపాలనా దక్షుడవు.
అవ్యయుడవు,సర్వ వ్యాపివి ,సర్వ శక్తిమంతుడవగు ఓ సర్వేశ్వరా ! శిరము వంచి సాష్టాంగ ప్రణామములాచరించి నీ పాదపద్మములకు ఈ నా ప్రార్ధనను నివేదన చేయుచున్నాను.

Read more...

భవిష్యవాణి-కీరో

>> Sunday, July 20, 2008

ముందుమాట

ప్రపంచ చరిత్రలోనే అత్యంత ప్రాచీనమైన శాస్త్రం జ్యోతిషమే 1 దీనికి కారణం- ఆదికాలమునుండి మానవుడికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో అన్నదే అత్యంత కుతూహలాన్ని కలిగించే ఆసక్తికరమైన ప్రశ్న కావడమేనేమో 1

అసలు ఎవరన్నా జరగబోయే విషయాలను ముందుగానే చెప్పగలిగారా .

- అలా చెప్పినది చెప్పింది చెప్పినట్టే ఎవరకైనా జరిగాయా ఉంటే చెప్పండి 1 చరిత్రలోనే యదార్ధ సాక్ష్యాలతో

అంటూ అనేక మంది జ్యోతిషంగురించి తెలియనివారు తరచూ ప్రశ్నించడం మనకు అనేక సార్లు విని పిస్తుంది ముఖ్యంగా పత్రికలలోనూ ఇంకా ఇతరిత్రా1

దానికి సనాధానం ఇచ్చేది చరిత్రయే1 ప్రపంచం పుట్టకనుంచీ యదార్ధంగా జరగబోయే భవిష్యత్తు చెప్పినవారూ వాళ్ళు చెప్పినది చెప్పినట్టే జరిగినవారూ కావాలంటే కాలంలో తొలి కాలజ్ఞానంగా భవిష్యపురాణం అన్న అద్భుత గ్రంధాన్ని రచించిన వేదవ్యాస మహర్షియే అంటే ఇది పురాణకధలనుకుంటారు.

అలాగే పుట్టబోయే అనేక మంది జాతకాలను నాడీ గ్రంధాల రూపంలో వ్రాసినవి ఇప్పటికీ తాటాకుల గ్రంధాలరూపంలో తాళ పత్రాలలో మనకింకా లభిస్తున్నాయంటే మన వేలి ముద్రలను పరిశీలించి ఆ రేఖలనుబట్టి ప్రతిమనిషి పుట్టినటైమూ, నక్షత్రమూ వారి జాతకములోని గ్రహాలను తల్లి తండ్రిపేరు వగైరా లూ తెలిపే ఏనాడో కొన్ని వేల సంవత్సరములనాడే ఈనాడీ గ్రంధకర్తలైన భృగు, అగస్త్య మహర్షి వంటినారూ వ్రాసిన గ్రంధాలూ ఇంకా ఈనాటికీ లభిస్తున్నాయంటే అది ఒక్క భారత దేశఁలోనే సాధ్యం. కాని ఇవన్నీ అతి ప్రాచీనమైన విషయాలు

ఆధునిక కాలంలో ఇలా జరిగింది జరిగినట్లు జరగకముందే ఎన్నో సంవత్సరాలకు ముందే జరగ బోయే భవిష్యత్తు చెప్పినవాడు కీరో

అలాగే ప్రపంచ భవిష్యత్తు వ్రాసినవాడు కూడా కీరో యే అలాగే ప్రపంచ భవిష్యత్తు వ్రాసినవాడు ఫ్రెంచి ద్రష్ట నోస్ర్టడేమస్ ఎక్కువగా దేశాల భవిష్యత్తునే రాసాడు అదీ చాలమందికి అర్ధం కాని నిగుఢమైన ఫ్రెంచి భాషలో . కాని కీరో మాత్రం ప్రతివారికి అర్దమయ్యే భాషలోనే ప్రతివారికి జరగబోయే భవిష్యత్తును అతి స్పష్టంగా వారి జన్మ తేదీలతో సహా ఎంతో ముందుగానే వారికి తెలిపాడంటే ఆశ్చర్యంగానే ఉంటుంది గదా.

ఇలాంటి ఆశ్చర్యాల అనుభవాల మాలికయే ఈ అదృష్టరేఖ అన్న కీరో భవిష్యత్తు తెలిపిన భవిష్యాలను తెలిపే , ఈ అద్భత అనుభనాల గ్రంధము.

ఇది కథకాదు. ఇది సమకాలీన చరిత్ర . యదార్ధ జీవితం ఉజ్వల జ్యోతిష చరిత్ర 111 జ్యోతిషంయొక్క చిరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం

ఫలితంగా, ప్రపంచంలోని అతి ప్రాచీన కాలంనుంచీ జ్యోతిషం భనిష్యత్తును తెలిపే జాతకం హస్తసాముద్రికం . ప్రశ్న శాస్త్రం వంటివి భగవంతుని తరువాత దేవునుతో సమానంగా గౌరవాన్ని ఆదరణనీ పొంది అనేకులచేత ఆసక్తితో అధ్యయనం చేయబడుతున్నాయి ప్రపంచంలో 1 అతేకాదు ఈనాడు జ్యోతిషాన్ని తిరస్కరించాలని రోమన్ కాధలిక్ క్రైస్తవ ఫాదరీలు వెయ్యేళ్ళుగా తలక్రిందులుగా తపస్సు చేస్తున్నా సరే జ్యోతిషాన్ని ప్రచారం చేసిన వాళ్ళు ముఖ్యంగా ఈనాటి సమాజంలో ఎవరంటే విదేశీయులు క్రైస్తవులే నని చెప్పక తప్పదు1

విదేశీయులలో అగ్రగణ్యుడూ జ్యోతిషాన్ని ప్రపంచ వార్తా పత్రికల స్ధాయికి ప్రచారము ఆదరణ పెంచిన వాడూ ఎవరంటే ప్రపంచ కప్రఖ్యాత జ్యోతిష్కుడైన కీరో మహాశయుడే.

ఈనాడు మన దేశంలో ప్రతినాడూ తన చేతిలోని రేశలు చూసుకొని తన అదృష్టాన్ని పరిశీలించుకోనడం అంటే ఏమిటో కీరో హస్త సాముద్రికం అనబడే పామి స్ట్రీ పుస్తకాలనుండే మొదలైంది- ఇలా ఇంతగా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తీ . అధ్యయనమూ పెంచినవాడు కీరో . నిజానికి కీరో ఈ జ్యోతిషం నేర్చుకున్నది మన భారత దేశంలోనే.

-

బ్రాహ్మణ గురువులైన జ్యోషి పండితుల ప్రేమ, ఆదరణములతో నాకు నేర్పిన జ్యోతిష శిక్షణనుంచే ఇంత వాడినయ్యానని కీరో వ్రాశాడను చాలామందికి తెలియక పోవచ్చు1

అంతేకాదు కీరో మహాశయుడు తాను జీవించిన సుమారు 80 సంవత్సర కాలములో ఎన్నెన్ని పరమాశ్చర్యకరమైన వింత జ్యోతిషాలు చెప్పాడో అవన్నీ ఎంత ఆశ్చర్యంగా అక్షరం పొల్లు పోకుండా - ప్రతి ఒక్కటీ యధాతధంగా ఎలా జరిగాయో అన్న విషయం కూడా మన వారిలో చాలా మందికి తెలియదు1

అందుకే అదృష్టరేఖ కీరో జ్యోతిష భవిష్యాలు ఆన్న ఈచిన్ని అధ్భత- యదార్ధ అనుభవాలను తెలిపే సస్పెన్సు గ్రంధం మీ చేతులలో ఉంచుతున్నాను. చదవండి.

కీరో మహాశయుడు పుట్టినది ఇంగ్లండులోనే. కాని ఈయన నేర్చినది తన జీవితాన్ని ధారపోసి ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేసిందీ కూడా భారతీయ శాస్త్రమైన జ్యోతీష శాస్త్రాన్నే111

అసలు ఇదెలా జరిగిందో ఆయన జీవితంలోని యదార్ధ అనుభవాలను తెలిపేది ఇండియా పిలిచింది అన్న అధ్యాయంలో అన్నీ వివరించాడు.

దాదాపు పాతికేళ్ళపాటు ఎడతెరిపీ లేకుండా ఉదయం నుండీ సాయంకాలందాకా లెఖ్ఖ లేనంత మందికి జాతకం చూసి హస్త సాముద్రికం ఫలితాలను తెలిపి వాళ్ళ జన్మ తేదీలలోని అదృష్టసంఖ్యలను లెఖ్ఖించి వారికి జరగబోయే భవుష్యత్తును తేదీలతోసహా రోజూ వందలమందికి చెప్పినవాడు బహుశా కీరో ఒక్కడేనేమో 1

కీరో చెప్పిన జ్యోతిషం విక్టోరియా మహారాణినుండీ ఇంగ్లండు చక్రవర్తి సప్తమ ఎడ్వర్డు వరకూ బెల్జియం రాజు లియోపాల్ట్ నుంచీ ఇటలీ మహారాజు హమ్ బర్డ్ దాకా పర్ష్యా చక్రవర్తి సుల్తాన్ ముఖఫరుద్దీన్ షా దగ్గిరనుండీ రష్యాను శతాబ్దాలుగా పాలించిన జార్ చక్రవర్తిదాకా ఇలా ఎందరో రాజులు , mahaa రాజులు కీరోముందు చెయ్యి చాచి తమ bhavuSyattunu అడిగి ఆసక్తితో తెలుసుకున్నవారే

ఒక్కరాజులేకాదు మిలటరీ సేనాధిపతులు లార్డ్ కిచ్ సర్ వంటి కమాండర్ ఛీఫ్ లూ , ప్రఖ్యాత హాలీవుడ్ సినీనటి సారా బెర్నాడ్ దాకా, ఇటు ప్రఖ్యాత అమెరికన్ రచయిత మార్క్ ట్యైన్ నుండీ చికాగో హంతకుడు , డాక్టర్ మేయర్ దాకా అంతా కీరో జ్యోతిషం వలన లాభ పడిన వారే.

అంతేగాదు ఈమధ్య ఉధృతమైన సినిమా ఉజ్వల సినిమాతీసి కోట్లకు కోట్ల డాలర్లు దోచుకుంటున్న టైటానిక్ ఓడ జల ప్రళయం ఎంతో ముందుగానే 15 ఏప్రిల్ 1912 మధ్యభాగంలో జరుగుతుందని స్పష్టంగా చెప్పినవాడు బహుశా కీరో ఒక్కడే 1

రష్యాలో 1917 లో కమ్యూనిష్టు విప్లవం జార్ చక్రవర్తుల పతనం , రక్తపాతం ఇంకా రెండు ప్రపంచ యుద్దాలూ రష్యాలో కమ్యూనిజం టైఫాయిడ్ జ్వరంలా వ్యాపించడం భారత దేశానికి స్వాతంత్య్రం రావడం ఇండియా రెండు దేశాలుగా విఢిపోయి రక్తపాతంలో స్వతంత్య్రం సంపాదించుకోవడం ఇంకా మహాత్మా గాంధీయొక్క అహింస ఉద్యమం బ్రిటీషురాజ్య సింహాసనాన్నే గడగడలాడించి వేయగలదని ముందుగానే స్పష్టంగా రాసినవాడు కీరో మహాశయుడొక్కడే.

అంతేకాదు కీరో ప్రపంచ భవిష్యత్తు అన్న సంచలన గ్రంధాన్ని 1925 లోనే రాసి 1931 లో ప్రచురించి లండన్ లో భూకంపంవంటి సంచలనాన్ని సృష్టించాడు కీరో.

అంతేకాదు రష్యాయోక్క రానున్న మహోన్నత ఉజ్వల భవిష్యత్తు అమెరిగా అపరిమిత ధనసంపదా అమెరికా సంయుక్త రాష్ఠ్రం యొక్క నైమానిక బలమును ప్రపంచములో సాటిలేనివిగా పెరుగుతాయని ఎంతోముందే స్పష్టంగా వ్రాసినవాడు కీరో.

ఇవన్ని చదివి కీరో ఒక్క జ్యోతిష్కుడే అనుకుంటే మనం పప్పులో కాలు వేసినట్టే కీరో కేవలం జాతకాలు గుణించి గ్రహాలను మాత్రమే లెఖ్ఖించి డబ్బులు గడించే జ్యోతిష్కుడేకాదు ఈయన ఒక గొప్ప యోగి .

గొప్ప యోగ సాధకుడుగా భారతదేశంలో మూడున్నర సంవత్సరములవాటు కేవలం పాలూ , అన్నమే తిని ఉప్పు, కారం లేకుండా కఠిన సాధన చేసిన దీక్షాపరుడు 1 పశ్ఛిమ కనుమలలోని గుహలలోని శివాలయాలలో మంత్రోపదేశం పొంది ధ్యాన స్థితిలో తీవ్రమైన గాఢ సమాధి లో మునిగి పోయి అలా 7 రోజులు శరీర స్మరణయే లేకుండా మరణించి తిరిగి జీవించిన యోగ సాధకుడు కీరోయే

ఆయన జీవితం చూస్తే కీరో కారణ జన్నుడు ఆయన జ్యోతిష్కం కోసం తన జీవితాన్ని థారపోసిన, కీరో శరీరంలోకి అవతరించినది ఒక ప్రాచీన టిబెటన్ యోగ పురుషుడు. అన్న విషయం కూడా చాలామందికి తెలుయదు. ఇది వింతల్లోకల్లా వింత.

అందుకే అమూల్యమైన ఏరిన వజ్రాలనంటి అధ్భుత అముభవాలను ప్రపంచాన్నే గడగడ లాడించిన భవిష్యత్తునూ స్పష్ఠంగా చిత్రగుప్తుని శాసనంలాగా ముందుగానే రాసే జ్యోతిష భవిష్యాలను ఒక్క కీరోయే వ్రాయగలిగాడు.

ఇంకా వివరంగా చెప్పాలంటే అవన్ని ఒక్కొక్కటే తదుపరి అధ్యాయాలలో వివరించడం జరిగినది.- అందుకే నదిలోని నూళ్ళన్నీ సముద్రంలో కలిసినట్లుగా ఈ ముందుమాట తోనే మిమ్మల్ని కీరో అనుభవాలనే ఆశ్చర్య సముద్రంలోకి నెట్టి విడిచిపెడుతున్నాను.దీంతో.

కీరో పుట్టినది ఇంగ్లండులో కావచ్చు కానీ ఇండియా పిలిచింది కీరోనే. ఎందుకంటే కీరో పుట్టింది ఇండియాకోసమే . ప్రాచీన ఋషుల విఙ్ఞానమైన జ్యోతిషాన్ని ఉజ్జ్వలంగా వెలిగించడంకోసమే ఆయన పుట్టాడు ఇదే ఆయన అదృష్టరేఖ.

భారతదేశం adhRushTarEkha కూడా ఇదే నేమో.


{వేదవ్యాస్ ఐ.ఎ. ఎస్. గారి రచన్ అదృష్టరేఖనుండి}

Read more...

అవధూత మహాయోగిని మాల పిచ్చమ్మ {అమ్మ}

>> Saturday, July 19, 2008

" దేవుణ్ణిఎవరు చూపిస్తారురా? అసలు వేరేవాడెవరు చూపించగలరు.? దేవుణ్ణి చూడాలనుకునే కాంక్షలోపలినుండి యేరల్లే పొంగిపొరలి లోపలినుండి తన్నుకురావాలి. వీడికి ఎవరు చూపించారురా ? వీడు రాత్రా పగలా అని తెలియకుండా,శ్మశానాలలో చెట్టుతొర్రలలో ,రక్కసి కంపలలో కూర్చునియేడ్చాడు. ఆకలయితే దోసిల్లతో బూడిద నోట్లో పోసుకుని కాలవలో నీళ్ళుతాగి ఆకలి తీర్చుకుని దేవుని కోసం రావి ఆకులా అల్లాడి పోయాడు. అప్పుడుకాని దర్శనం కాలేదు వీడికి," అంటూ రూపం లోవున్న దివ్యమంగళ మూర్తి ,తనను ఆర్తితో భగవంతుని చేసే మార్గం చూపమని అడిగే పండిత ప్రకాండులకు ,దేవుని పట్టుకునే రహస్యమును వివరించేది. ఆమహాత్మురాలే
అవధూత పిచ్చమ్మ.
ఆమె తన గురించి చెప్పేటప్పుడు "వీడు" అనీ "రాముడు" అనీ చెబుతుంది. అమ్మకు అక్షరజ్ఞానం లేదు అయినా అక్షరుని చూసేందుకు సాహిత్య సాంమ్రాట్టులు సహితం అక్షయానందము కోసం ఆతల్లి పాదాలముందుమోకరిల్లేవారు.
అమ్మ మాలకులములో జన్మించింది . అగ్రకులజు లనుకున్న బ్రాహ్మణులు సహితం జ్ఞానభిక్ష కోసం ఆమె నాశ్రయించే వారు. ఆ పాదపద్మాలనర్చించేవారు.
గుడివాడతాలూకా కురుముద్దాలి గ్రామ వాసులయిన వడ్డె ముత్తాయి,వీరమ్మలకు 1870లో జన్మించారు అమ్మ. చిన్నతనమునుంచి కట్టెలా బిగుసుకుపోవడం ,ఎవరో గొంతు పట్టుకున్నట్లు మాట్లాడలేక పోవడం జరిగేది . తల్లిదండ్రులు గాలిచేష్టలని భూతవైద్యం చేయించినా ఆమెలో మార్పు కనపడలేదు. " అమ్మా నాలో ఏదో నాదాలు వినపడుతున్నాయి శంఖువు వే ణువు ఊదినట్లుగా నాదాలు వినబడుతున్నాయి . అవి వినపడగానే నన్ను నేను మరచి పోతున్నాను. అనేది. పిచ్చమ్మకు తనలో తనంత వయస్సుగల అమ్మాయి బంగారపు బొమ్మలా వున్న అమ్మాయి కనిపిస్తుండేది. ఎవరీ అందాల బాల అని తల్లిని అడుగుతుండేది.
పిచ్చమ్మని గుడివాడ తాలూకా తుమ్మలపల్లి గ్రామ పల్లెలో నీలంవారి అబ్బాయి కిచ్చి చేశారు. కాపురానికి వెళ్ళిన తరువాత కూడా ఈమెలో ఈలక్షణాలు కనపడుతుండటం తో మూర్చలదాన్ని మోసం చేసి మాకు కట్టబెట్టారు అని అత్తగారి తరపునవారు పరిహాసం చేసే వాళ్ళు. పిచ్చమ్మకు కూతురు కలిగింది. భాగ్యమ్మ అని పేరుపెట్టారు. కానీ అనతి కాలం లోనే భర్త పరలోక గతుడయ్యాడు. పునర్వివాహానికి ఆమె సుతారమూ ఒప్పుకోలేదు.
భాగ్యాన్ని పిచ్చమ్మ అల్లారు ముద్దుగా పెంచుకునేది. తాను భూస్వాముల పొలాలలో పనిచేసేది.నాలుక కోసినా అబద్దం ఆడియెరుగదు. కండపుష్టి ,ధర్మ పుష్టి గల పిచ్చమ్మ ఇద్దరి మనుషుల పని ఒక్కతే చేసేది. తాను ముఠా మేస్త్రి. తానేకాదు తన ముఠా అంతా ధర్మంగా తీసుకున్న కూలికి తగినట్లుగా ఒళ్ళు దాచుకోకుండా శ్రమించాల్సిందే.
ఊళ్ళో వున్న అన్నకొడుకుకు భాగ్యాన్నిచ్చి పెళ్ళీ చేసింది. కానీ మూణ్ణాళ్ళ ముచ్చటగా అతడు కాస్తా రాలి పోయాడు. పిచ్చమ్మ కూతురుని దగ్గర పెట్టుకుని ఎలాగో కాలం ఈడుస్తుంది.కూతురుకు
మారు మనువు చేయడానికి తాను పూర్తిగా వ్యతిరేకం. కానీ పిచ్చమ్మ అక్క కపిలేస్వర పురమ్నుండి వచ్చి పట్టుబట్టి భాగ్యానికి మారుమనువు చేయాల్సినదేనని తనవెంట కపిలేస్వర పురం తీసుకెళ్ళి మూడుముళ్ళూ వేయించినది. పిచ్చమ్మ అళ్ళున్ని చాలా ప్రేమగా చూసుకునేది. వచ్చినప్పుడల్ల ,రాచమర్యాదలు చేసి రూకలిచ్చి పంపేది. . కానీ అదేమి దురదృస్టమో గాని అతను భాగ్యాన్ని నానా బాధలూ పెట్టేవాడు. సూటిపోటుమాటలతో చిత్రహింసలకు గురిచేసేవాడు. అత్తవారింట్లో బాధలు పడలేక భాగ్యం నూతిలో పడి ఆత్మహత్య చేసుకున్నది. పిచ్చమ్మ కాసంగతి తెలిసి కపిలేస్వరపురమ్లో ఆ నూతివద్దకు పోయి,వలవ లా ఏడూస్తూ కురుముద్దాలి వచ్చేసింది. అంతటితో పిచ్చమ్మ జీవితం పూర్తిగా మారిపోయింది. రాత్రి, పగలు భాగ్యంభాగ్యం అని ఒకటే శోకం .సూర్యచంద్రులే ఆమెను చూడలేక పోతున్నారు.
ఒక గోసాయి ఆవూరు వచ్చాడు. "నిరుడు ఇదే రోజుల్లో ఈవూరు వచ్చాను. ఆ గుడెసెలో నుండి ఏడుపు విన్నాను. ఇప్పుడూ వినిపిస్తోంది ఏమిటికారణం అని గ్రామస్తుల నడిగాడు. వారు పిచ్చమ్మ గాధ చెప్పారు. ఆ గోసాయి పిచ్చమ్మ గుడెసెలోకి వెళ్ళాడు. అరగంట తరవాత బయటకువచ్చి తనదారిన తాను వెళ్ళాడు. పిచ్చమ్మలో మార్పువచ్చింది ఇంకాపెద్దగా ఏడవటం మొదలయినది కాకుంటే ఇప్పుడు ఏడుపు భగవంతునికోసం సాగుతోంది.
ఇల్లు వదలి వేసింది. సకల జీవులకు లయస్థానమయిన రుద్రభూమి ఆమెనివాసం .మృత్యురహస్యాన్ని శోకంతో శోధిస్తున్నది. ఆమెకు మంత్రం లేదు,తంత్రం లేదు. ఏడుపు వట్టిఏడుపు ఏడుపు.
ఎవరన్న
తెచ్చిపెడితే అహారం తింటుంది. ఒక్కొక్కసారి ఆకో అలమో ,కాలవలో వండ్రో,శ్మశానమ్లో బూడిదో కడుపులో వేసుకునేది.
అమ్మ ఏమి చెబితే అది జరిగేది. 1925 లో అమ్మకు ఆశ్రమం కట్టారు. రోజు విడిచిరోజు అమ్మ సమాధిలోకి వెళ్ళేది. ధనం ముట్టుకోదు. అమ్మ ఐశ్వర్యాన్ని "రోత" అనిపిలిచేది. పొర పాటున వెండి బంగారాన్ని ముట్టుకుంటే వళ్ళంతా కాల్చినట్టుందని అల్లాడిపోయేది. మామూలుగా అమ్మ నగ్నంగా అర్ధ నగ్నంగా వుండేది. కామసంకల్పము కలవారు వస్తున్నట్లయితే "వాడి కంట్లో దోషముందిగానీ నాకున దుప్పటికప్పండిరా అనేది.
ఒకసారి సనాతన విప్రులొకరు అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ మాల కులమునకు చెందినదనే దృష్టితో దూరంగా వుండి మాట్లాడుతున్నాడు. అమ్మ వేదాంత మూలతత్వాన్ని ఇలా వివరించింది. " వడికిన పోగులు మెడలో వేసుకుని గొప్ప కులమని భ్రమ పడుతున్నావు . వడకని పోగులు నీలో వున్నాయి. వెతికి చూసుకో దొరుకుతాయి " అని జ్ఞాన బోధ చేసినది.
అమ్మ ఆథ్యాత్మ బోధ చాలా చక్కగా విడమరచి చెప్పేది". గోంగూర , తోటకూర అనుకున్నార్రా? చేటలో వడ్లుపోసికొనటానికి" .
" వేదాంతం అనపగుగ్గిళ్ళు కావు. ఇనుపగుగ్గిళ్ళు "
ఆత్మయుద్ధం చేయాలి రా .. నా... నీ ....లు లేకుండా పోవాలి. అప్పుడు కనపడతాడు దేవుడు.
" ఎద్దల్లే తిని మొద్దల్లే పనుకుంటే దేవుడు కనపడడు. "
ఇలా ఆథ్యాత్మిక మార్గమెంత కష్టమైనదో సాధకులకు తెలిపేది.
అమ్మ పనుకుంటే ఆమె మీదుగా పాములు పాకి వెళ్ళి పోతుండేవి. అను కోకుండా అమ్మ భారత దేశ యాత్ర చేసింది. వల్లభ నేని అన్నపూర్ణమ్మ, పిన్నమనేని నాగయ్య వంటి భక్తులు అమ్మవెంట వెల్లారు. " యాత్రలకని వెళ్ళాంగానీ ,క్షేత్రాలలో దేవునికంటే ,నాలోని దేవుడే కమ్మగా వున్నాడు" అన్నది అమ్మ . అమ్మ స్థూల దేహానికి ఏమాత్రం ప్రాముఖ్యత నిచ్చేవారు కారు. "ఇందులో గాలి పోతే ఏమున్నదిరా? అనేది. చివరిరోజులలో కర్రపట్టుకుని నడుస్తూ ఈ కట్టెకు,ఈకట్టె సాయం అనేది.
గాంధీగారి హత్య జరిగినదని బాధపడుతున్న శిష్యులతో "పూర్వ జన్మ లో గోవును చంపిన పాపం నాయనా .ఈజన్మలో అది ఇలా పగ సాధించింది అని వివరించిందట.
పండితులనుండి, పామరుల దాకా ఆమెనుమంది ఆశ్రయించారు. శ్రీ వున్నవ లక్ష్మీనారాయణ్పంతులు, శ్రీ వేలూరి శివరామ శాస్త్రి ,గుడిపాటి వెంకటా చలం ,త్రిపురనేని గోపీచంద్ మున్నగువారు భక్తితో దర్శించి తమ రచనలలో ఆమెను ప్రస్తుతించారు. అమ్మ 1951 నవంబర్15న సిద్ధి పొందారు. .... ..... జయ గురుదత్త.

Read more...

గాయత్రీ మంత్రశక్తి

>> Friday, July 18, 2008

గాంధీగారి హత్య జరిగిన రోజులలో ఒక యువకుడు భగవాన్ రమణ మహర్షులవారి వద్దకు వచ్చి వుగ్రంగా చూస్తూ " గాడ్సే గాంధీని చంపి వినుతికెక్కాడు. నేను నిన్ను చంపి కీర్తి కెక్కుతాను." అని బెదిరించాడు.
చంపు నాయనా నాకీ దేహ బాధ తప్పిపోతుంది. అన్నారు,భగవాన్. అక్కడున్నవాళ్ళు అతన్ని అటకాయించి తోసెయ్యాలని చూసారు. కాని భగవాన్ అతన్ని తనదగ్గరే వుంచుకుని తనతో భోజనానికి తీసుకు వెళ్ళారు. రెండు రోజులాశ్రమమ్లో వుండిపోయాడు.
మూడవరోజు
అతను భగవాన్ వద్దకు వచ్చి నన్ను క్షమించండి. నాకు మతిస్థిమితం వుండటం లేదు. నామతి స్థిమితంగా వుండటానికి ఏదైనా వుపదేశించండి. అన్నాడు.
" గాయత్రిచెయ్యి "అన్నారు భగవాన్.
అలాచేసి కొన్ని నెలలలో తిరిగివచ్చాడు. అతని పిచ్చి అంతా పోయి గొప్పభక్తితో.

Read more...

గురుపాదుకా స్తవము.

>> Wednesday, July 16, 2008

శ్లో// శ్రీ సమంచిత మద్వయం పరమప్రకాశ మగోచరం
భేద వర్జిత మప్రమేయ మనంత మాద్య మకల్మషం
నిర్మలం నిగమాంత మద్వయ మప్రతర్క్య మబోధకం
ప్రాతరేవహి మానసాంతర్భావయే గురుపాదుకాం
శ్లో// నాదబిందు కళాత్మకం దశనాద భేదవినోదకం
మంత్ర రాజ విరాజితం నిజమండలాంతర్భాసితం
పంచవర్ణ మఖండ మద్భుత మాదికారణ మచ్యుతం
ప్రాతరేవహి మానసాంతర్భావయేద్గురు పాదుకాం

శ్లో// వ్యోమవత్ బహిరంతరస్థిత మక్షరం అఖిలాత్మకం
కేవలం నిజశుద్ధమేకమ జన్మహిప్రతిరూపకం
బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుబోధ సుబోధకం

ప్రాతరేవహి మానసాంతర్భావయేద్గురు పాదుకాం

శ్లో // బుద్ధి రూపమ బుద్ధికం త్రితయైక కూటనివాసినం
నిశ్చలం నిరతప్రకాశక నిర్మలం నిజమూలకం
పశ్చిమాంతర ఖేలనం నిజశుద్ధ సమ్యమి గోచరం
ప్రాతరేవహి మానసాంతర్భావయేద్గురు పాదుకాం

శ్లో // హృద్గతం విమలం మనోజ్ఞ విభాసితం పరమాణుకం
నీల మధ్య సునీలసన్నిభ నాద బిందు నిజాం శుకం
సూక్ష్మకర్ణిక మధ్యమ స్థిత విద్యుదాది విభాసితం
ప్రాతరేవహి మానసాంతర్భావయేద్గురు పాదుకాం

శ్లో// పంచ పంచ హృషీక దేహ మనశ్చతుష్క పరంపరం
పంచ భూత సకామ షట్క సమీర శబ్దమఖేతరం
పంచకోశగుణత్రాయాది సమస్త ధర్మ విలక్షణం
ప్రాతరేవహి మానసాంతర్భావయేద్గురుపాదుకాం

శ్లో // పంచముద్ర సులక్ష్య దర్శన భావమాత్మ నిరూపణం
విద్యుదాది ధగద్ధగిత సుచిర్విచిత్ర వివర్ధనం
చిన్ముఖాంతరవర్తనం విలసద్విలాస మమాయకం
ప్రాతరేవహి మానసాంతర్భావయేద్గురు పాదుకాం

శ్లో// పంచ వర్ణ సుచిర్విచిత్ర విశుధ్దతత్వ విచారిణం
చంద్ర సూర్య చిదగ్నిమండల మండితం ఘన చిన్మయం
చిత్కళా పరిపూర్ణమంతర చిత్సమాధి నిరీక్షణం
ప్రాతరేవహి మానసాంతర్భావయేద్గురుపాదుకాం
శ్లో// హంస చార మఖండనాద మనేకవర్ణమ రూపకం
శబ్దజాలమయం మయం చరాచర జంతుదేహ నివాసినం
చక్రరాజ మనాహతోద్భవ మేకవర్ణమరూపకం
ప్రాతరేవహి మానసాంతర్భావయేద్గురు పాదుకాం

శ్లో// జన్మకర్మ విలీన కారణ హేతుభూత మబోధకం
జన్మకర్మ నివారకం రుచిపూరకం భవతారకం
నామ రూపవివర్జితం నిజ నాయకం సుఖదాయక
ప్రాతరేవహి మానసాంతర్భావయేద్గురుపాదుకాం

శ్లో// తప్తకాంచన దీప్తమాన మహాణుమాతృక రూపకం
చంద్రకాంతర తారకైరవ ముజ్వలం పరమాస్పదం
నీలనీరద మధ్యమస్థిత విద్యుదాది విభాసితం
ప్రాతరేవహి మానసాంతర్భావయేద్గురుపాదుకాం

శ్లో// స్థూల సూక్ష్మ సకారణాంతర ఖేలనం పరిపాలనం
విశ్వ తైజస ప్రాజ్ఞ చేతస మంతరాత్మ నిజాంసుఖం
సర్వ కారణమీశ్వరం నిటలాంతరాళ విహారకం
ప్రాతరేవహి మానసాంతర్భావయేద్గురు పాదుకాం

Read more...

సహస్రఘటాభిషేకంతో కుంభవృష్టి.

{గుంటూరు సమీపము లోని పొత్తూరు వాస్తవ్యులు శ్రీ వణుకూరి శూరా రెడ్డిగారి అనుభవమిది." హిందూధర్మ వైభవము" లో నుండి}
1987 లో వర్షము లేక మాగ్రామములో చేలు ఎండిపోయినవి. రైతులు ఆవేదన పడుతున్నారు. త్రాగునీరుకూడా లేక జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈసంగతి నా మిత్రుడు,పొత్తూరు సత్యన్నారాయణ వరప్రసాద్{పారట్నర్,సత్యశ్రీ ఆగ్రో కెమికల్స్} తో చెప్పగా" మాగురువుగారున్నారు,వారిని సలహా అడుగుదామని అన్నారు. మేమిద్దరము శ్రీవిద్యా వుపాసకులగు డాక్టర్ a.v.l.నరసిమ్హం గారిని గుంటూరులో కలుసుకున్నాము. వారినీ విషయం అడుగగా, ప్రశాంత వాతావరణమ్లో శివాలయములో సహస్ర ఘటాభిషేకము చేసి వందమందికి తక్కువ కాకుండాఅన్న దానం జరిపితేతప్పక వర్షము కురుస్తుందని చెప్పారు. అందుకు మేమగీకరించాము.
గుంటూరుకు ఆరు కిలోమీటర్ల దూరం లో గల పొత్తూరు గ్రామానికి వారిని తీసుకొని వెళ్ళాను. 20-09-1987 ఆదివారంఉదయం గం. 8-00 లకు శివాలయం లో అభిషేకము ఆరంభించారు 20 మంది శిష్యులు కడవలతో నీరు తెచ్చి అందిస్తుంటే ఒకురు రుద్రం చెబుతూఉంటే నలుగురు శిష్యులు స్వామికి అభిషేకము చేస్తూ ఉన్నారు.
శ్రీ నరశింహంగారు యోగ విధానమున సంధానము చేసి శివలింగమునకు ప్రక్కగా కూర్చున్నారు. ఎండచాలా తీవ్రముగానున్నది.దూరమునుండి నీళ్ళుతెస్తున్న మిత్రులు బాగా అలసిపోతున్నారు.కానీ పట్టు విడువక అభిషేకముకొనసాగిస్తున్నారు. మధ్యాహ్నం 12-45ఐనది.ఆకాశమ్లో మబ్బులు లేవు. తల కాళ్ళు మాడుతున్నవి. మేము వర్షము కురిసే అవకాశము ఎంతమాత్రము లేదనుకున్నాము.
అభిషేకము మధ్యాహ్నం 1-15 ని. లకు పూర్తయినది. స్రీ నరశిమ్హం గారు గర్భ గుఇడినుండి బయటకు వచ్చి నిలబడ్డారు. అంతే ఐదు నిమిషాలలో విచిత్రం గా మబ్బులు కమ్ముకువచ్చాయి .కుండపోత వర్షం కురిసింది ఆ వూరిరైతులు షుమారు 400 మంది వర్షములో త డుస్తూ గొతెత్తి శివనాంచ గానం చేసారు.మేము. ఆశ్చర్యం చెందాము. శ్రీ నరశింహంగారు నవ్వుతూ రెడ్డీ ! భోజనం చెయ్యి అన్నారు.
ఇంతవాన కురుసింది . కడుపు నిండింది. ఇంకాభోజనమెందుకండీ అన్నాను . భోజనం కోసమేనయ్యా ఈ వర్ష అని అన్నారాయన.అభిషేఅము యెక్క ప్రాధాన్యతను ఆయన ఆతరువాత అందరికీ విపులంగా వివరించారు.

Read more...

బ్లాగర్లారా మీపిల్లల చేత ఇది చదివించండి. దయచేసి.

>> Tuesday, July 15, 2008

చిన్నారులందరకూ,
శుభాకాంక్షలు. ఈనెల 18 న శుక్రవారం వ్యాసపూర్ణిమ వస్తున్నది. వేదాలను విభజించి మానవాళికి జ్ఞానసంపదను పంచిన మహాత్ముడు వ్యాస మహర్షి జన్మదినమీరోజు. గురువులకు గురువు గా లోకానినికి వెలుగు బాటను చూపిన . ఈసందర్భంగా గురువులను పూజించటం అనాదిగా వస్తున్నది, త్యాగము ,ధీరత్వము, కృతజ్ఞత సత్య ,ధర్మముల అనుసరణ వంటి దివ్యగుణాలుగల భారతీయులము మనము. మనకు చదువు చెప్పి జ్ఞానవంతులుగా తయారు చేస్తున్న మన గురువులను పూజించటం మన సంస్కారానికి గుర్తుకదా భరతమాత బిడ్డలుగా ఆ సాంప్రదాయాన్ని అనుసరించవలసిన బాధ్యత మనదే కదా? కనుక ఆరోజు మీరు పూలు పండ్లు తీసుకుని వెళ్ళి మీ వుపాధ్యాయులకు ,ఆచార్యులకు సమర్పించి ,అక్షతలు ఇచ్చి వారికి నమస్కరించి ఆశీశ్శులు పొందండి. ఇది చిన్నతనము కాదు.గొప్పసంస్కారము. మీరు వేలకు వేలు ఫీజులిచ్చినా తృప్తిపడని మీ గురువులు ,మీ నమస్కారాలకు పొంగిపోయి తన శిష్యుని సుగుణాలకు మురిసి పోయి మనస్పూర్తిగా మిమ్మలను దీవిస్తారు. మిమ్మలను గురించి చెప్పుకుని గర్వపడతారు. వీలైతే గురుపూజ ,లేదా ఆది గురువైన దత్తాత్రేయ స్వామి పూజ జరుపుకోండి. మీరు భారత దేశములో వున్నవారయినా లేక పరాయిదేశములో లోవున్నా దీనిని పాటించగలరని ఆశ. ఇతరదేశీయులకయితే మీ గౌరవ మర్యాదలను ,సాంప్రదాయాన్ని చూసి మరింత ఆసక్తి మీ పట్ల అభిమానము కలుగుతుంది ఈ సంస్కృతీ సంపదలకు వారసులు మీరు .దీనిని సం రక్షించుకోవలసిన బాధ్యతమీదే......మీ మామయ్య

Read more...

విపత్తునుండికాపాడిన లలితా సహస్రనామమంత్రం

>> Monday, July 14, 2008

లలితా సహస్రనామ మహిమను అనుభవపూర్వకంగా తెలుపుతున్న ఒక సాధకుని అనుభవం .వారు విజయవాడ srr& cvr ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ . కె.జి.సి.హరివిఠల్ గారు. ఆయన మాటలలో నే ఆవిషయాన్ని తెలుసుకుందాం.

1983 డిసెంబర్లో నన్నురైలెక్కించడానికి విధ్యార్ధులు , బంధువులు శ్రీకాళహస్తి రైల్వే స్టేషనుకు వచ్చారు వారికి వీడ్కోలు చెబుతూ కదులుతున్న రైలు ఎక్కబోతూ జారి పట్టాల పక్కన పడిపోయాను. అందరూ చనిపోయాననే అనుకున్నారు. కానీ కాళ్ళువిరిగి,తలకు గాయమై, వీపుకు గాయాలయి రక్తం ఓడుతూ సృహతప్పిపోయి వున్నాను. వెంటనే నన్ను తిరుపతి రుయా హాస్పటల్ కుతరలించగా 48 గంటల తరువాతగానీ చెప్పలేమని ,రాయవెల్లూరుతీసుకు పోవటం మంచిదని సూచించటంతో అక్కడికి చేర్చారు. 24 గంటలకు నేను కళ్ళుతెరచేసరికి బ్రతుకుతానో లేదో, బ్రతికినా లేచితిరగ గలుగునో లేదో అనే పరిస్తితిలో వున్నాను. అక్కడి డాక్టర్లు మిషనరీ జీల్తో పనిచేసె అత్యంత నిపుణులైన వారు. మీకు నయంకావడానికి 6 నెలలు పడుతుంది. అప్పటిదాకా వుంటే నడిపించి ఇంటికి పంపుతామని అన్నారు.
ముందుగా వారు నావీపుమీద ప్లాస్టిక్ సర్జరీ చేసి చర్మం అతికించారు. అది మిగతా చర్మంతో కలవాలంటే 7 రోజులు పడుతుంది. ఆ 7 రోజులు పక్కమీద బోర్లాపడుకోవాలని పక్కకు తిరగకూడదని చెప్పి పను కో బెట్టారు.ఒక్కగంట అలా పనుకోవాలంటేనే కష్టం. 7 రోజులు ఎలా పనుకోగలను?.
అప్పుడు దేవుని స్మరిస్తూ అలాగే పండుకున్నాను. నాకు లలితా సహస్ర నామము నోటికి వచ్చు. స్తోత్రాన్ని చదువు కుంటున్నాను. అసలు మన శరీరము జగన్మాత అంశముతో ఏర్పడినది . మన అవయవములన్నింటిలో ఆమె సుప్రతిష్ఠితమై వుంది.అందుచేత నాచర్మం కలసిపోయి గట్టిపడాలికనుక చర్మమునందుండు అమ్మవారి స్వరూపమును వర్ణించే శ్లోకముని మనసులోనే వెదకటం మొదలుపెట్టాను.
పాయసాన్న ప్రియా త్వక్ స్తా పశులోక భయంకరీ
అమృతాదిమహాశక్తి సంవృతా ఢాకినీశ్వరీ
అనే శ్లోకం లో "త్వక్ స్థా " అంటే త్వగింద్రియ దేవతయై చర్మము నందుండునది అని అర్ధం .అందు చేత బీజములను అనుసంధించి " ఓ0 , ఐం ,హ్రీం ,శ్రీం ,త్వక్ స్థాయై నమోనమ: " అనే మంత్రాన్ని రాత్రింబవళ్ళు నా భార్య చేత జపింప చేసి ఆ తీర్ధాన్ని పుచ్చుకున్నాను. ఆశ్చర్యమేమిటంటే 7 రోజులు లలో కలసిపోవలసిన చర్మం 24 గం టలలో గట్టి పడింది. డాక్టర్లు వచ్చి చూసి ఆశ్ఛర్యపోయారు. ఇది ఎలా జరిగింది అని అడిగారు. నేను చేసిన పని చెప్పాను. ఇది మన మహర్షులు అందించిన మంత్ర ప్రభావమని చెబితే వాళ్ళూ నిర్ఘాంత పోయారు.
ఆతరువాత వాళ్ళు నాకాలు విరిగిన చోట ఎముకలు సరిచేసి కట్టుకట్టారు. ఆఎముకలు అటుక్కోవ డముకోసం మరలా సహస్ర నామాలను పరిశీలించాను . అందులో 106వ శ్లోకములో ఇలావుంది.
" మూలాధారాంభుజా రూఢా, పంచవక్త్రాస్థి సంస్థితా
అంకుశాది ప్రహరణా వరదాది నిషేవితా "
ఇందులో అస్థి సంస్థితా అంటే ఎముకలయందు నివసించియుండుతల్లీ అని అర్ధము . అందుచేత మరలా "ఓ0, ఐం, హ్రీం, శ్రీం, అస్థి సంస్థితా యై నమోనమ: అనేమంత్రాన్ని జపింపజేసి ఆఫలాన్ని పొందాను. ఎముకలుగూడా త్వరలో కలుసుకున్నాయి. దీనంతటి ఫలితంగా 6 నెలల లో జరగవలసిన చికిత్సను 2 నెలలో ముగించుకుని వచ్చాను. డాక్టర్ లు మిక్కిలి ఆశ్చ్ర్యపోయారు. ఈచికిత్సా కాలములో జరిగిన మరొక విశేషంవుంది. డాక్టర్లు తామిచ్చే ఆహారమే తినాలన్నారు. అందులో నాన వేసి వండిన పెసలు ఆహారంగా ఇచ్చారు. అవి తింటే ఎముకలకు బలం వస్తుందని చెప్పారు, సరేనని తింటున్నాను. మరలా నేను లలితా సహస్ర నామాన్ని పరి శీలించాను. అందులో ఎముకలలో నివశించివున్నామ్మవారికి "సాకిని " అని పేరు చెప్పబడింది. ఆమె ముద్గౌదనా సక్తచిత్తా అని వర్ణించబడినది. అనగా ఈమె మనస్సు పెసలు కలిపి వండిన అన్నమునందు ఆసక్తి కలదియై యుండునని అర్ధము. ఈవిధముగా నిపుణులైన డాక్టర్లు నిర్ణయించిన ఆహారము., ఎముకలయందు నివసించు అమ్మవారు ఇష్టపడే ఆహారము ఒకటే అయినది.
ఈవిధముగా నా అనుభవమేకాక అనేకమందికి ఈ విషయాలు చెప్పగా వారికి ఆశ్చకరమైన ఫలితాలు వచ్చాయి.
[ వీరు పలుసార్లు పత్రికలలో ఇచ్చిన ఇంటర్వ్యూల ఆధారంగా }

Read more...

భారతీయులు అంటే?

భ అనగా కాంతి అని అర్ధం . రతి అనగా మునిగియుండుట . భారత అనగా వెలుగులో కాంతిలో జ్యోతిలో తన్మయుడై యుండువాడు, అని అర్ధము . భారతీయుడనగా అంధకారమును,అజ్ఞానమును వర్జించి కాంతిని,వెలుగును జ్ఞానాన్ని స్వీకరించు వాడని అర్ధము. అట్టివ్యక్తులుగల దేశం భారత దేశం.
- స్వామి చిన్మయానంద

Read more...

గురుపౌర్ణమి రోజు సత్సంగం లో గడపండి

>> Sunday, July 13, 2008


ఒకేకాలం లో జ్ఞానులైన గురువులెందరున్నా వారి శిష్యుల మధ్య ఎట్టి వైరుధ్యాలు ప్రాచీనకాలం లో రాకపోవడమే ఆశ్చర్యం. ఒకానొక వుత్తమ సాంప్రదాయమే యిందుకుకారణం. తేనెటీగ వేరువేరు పువ్వులనుండి తేనెను గ్రహించినట్లు ,జ్ఞానప్రియుడైన శిష్యుడు గూడా అనేకమంది గురువులనుండి జ్ఞానమార్జించాలని గురుగీత చెబుతుంది. ప్రతిజ్ఞానీ తమ శిష్యులను ఇతర గురువులనుండి జ్ఞానమార్జించాలని ఆదేసించేవారు,. శ్రీకృష్ణుడు అర్జనుని భగవద్గీతలో అలానే ఆదేసించారు. రఘువంశానికి గురువైన వశిష్ఠుడు రామున్ని విశ్వామిత్రునితో పంపమని ఆదేశించారు . వ్యాసుడు శుకుణ్ణి జనక మహారాజు వద్దకు పంపాడు. రాముడు అరణ్యం లో ఋషులందరినీ సేవించాడు. భాగవతం ఏకాదశ స్కందం లో అవధూత 24 మంది గురువుల నుండి జ్ఞానమార్జించినట్లు చెప్పుకున్నాడు. ఇందువలన వేరు వేరుగురువుల రూపాలు ,విధానాలు-వేరు వేరు జాతులపువ్వులులాగ స్థూల దృష్టికి భిన్నంగా కనిపించినా , వారందరిలోవున్న జ్ఞానమనే తేనె ఒక్కటేనన్న వివేకం శిష్యులకు కలుగుతుంది. అప్పుడే సాంప్రదాయబేధాలు ,తగవులు వుండవు. "ఆనోభద్రాః క్రతవోయంతు విశ్వతః " వుత్తమమైన భావాలు మాకు అన్ని దిక్కులనుండి లభించుగాక అన్నదే వేదఋషుల ప్రార్దన.
ఇలా అనేక మంది మహనీయులలను సేవించగలగాలంటే మొదట ఈ సూత్రమెంత ప్ర్శస్తమైనదో తెలిసి,దాని పట్ల అత్యంత శ్రద్ధ కలగాలి. తరువాత పూర్ణులైన మహనీయులెలా వుంటారో తెలుసుకోగలగాలి. లేకుంటే ఆధ్యాత్మ విద్యపై ఆశ తో మహనీయులమని చెప్పుకునే ప్రతివారిని నమ్మి ,సేవించి అన్ని విధాలా పక్కదారిపట్టే ప్రమాదముంది. అందుకే యిలాంటి సంస్కారం ధృఢంగా నాటుకోవడానికి వ్యాసుడు భాగవతం లో అనేకమంది మహనీయుల చరిత్రలను పొందుపరచాడు . తమిళదేశం లో పెరియపురాణం లో అరవయి ముగ్గురు శైవ సిద్ధులను గురించి భక్తులు చదువుతారు. అలానే అళ్వారులు అను 12మంది మహాత్ముల చరిత్రలు పారాయణం చేస్తారు. మహనీయులు మరణానికి అతీతులు కనుక ,వారిచరిత్రలు భక్తితో పాఱాయణం చేసే వారికి వారి అనుగ్రహం గూడ నేటికి లభిస్తున్నది. ఇక ఏడు రోజులలో మరణించనున్న పరీక్షత్తుకు అందుకే అందుకే శుకయోగి వేరొక సాధన చెప్పక ,భాగవత శ్రవణం మాత్రమే చేయించాడు. విజయానందుడనే సన్యాసికి మరణించనున్న రోజులలో శిరిడి సాయిబాబా కూడాతరింపునకు భాగవత పారాయణాన్ని చేయించారు.
ఈవుత్తమమైన సత్యాన్ని గుర్తించకుంటే శుకుడు, సాయిబాబా లకంటే మనకే ఎక్కువతెలుసునని భ్రమించి ,అనేక మంది మహాత్ముల చరిత్ర పారాయణమనే సాటిలేని సాధనాన్ని మనం అలక్ష్యం చేస్తాము. మహాత్ముల చ్రిత్రలు మరియు బోధలు శ్రద్ధ తో పారాయణ చేయడం వారి ప్రత్యక్ష సాన్నిద్ధ్యంతో సమానము. శ్రీ రమణ మహర్షి గూడ చెప్పారు. వెంకయ్యస్వామికూడ పోతులూరి వీరబ్రహ్మం గారి చరిత్రవంటివి చదవమని ఒక భక్తునితో చెప్పారు. వీరబ్రహ్మం గారుకూడా తాము దత్తావతారమని కాలజ్ఞానం లో వ్రాసారు. రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి తమగురించి శ్రీ గురుచరిత్ర గ్రంథరూపములో తామే వుంటామని, అదిపారాయణ చేసినవారికి ఇహపర శ్రేయస్సు తమ అనుగ్రహము కలుగుతాయని ప్రమాణము చేసిచెప్పారు. ఇతరమతాలలో గూడా ఈ సాంప్రదాయ మే వున్నది. బైబిల్, ఖురాన్ లలో ఎక్కువభాగం ఆయా జాతులలో వెలసిన ప్రవక్తలు అనబడు మహనీయుల చరిత్రలుంటాయి .. అందుకే ఆయా మతస్థులు వాటిని శ్రద్ధగా చదవాలని విధించారు అందుకే రానున్న గురుపౌర్ణమికు అరమరికలు లేక అందరూ మహాత్ముల చరిత్రలు పారాయణం చేసుకోండి.

Read more...

గురుపూర్ణిమ కు గురుచరిత్ర పారాయణం ఆవశ్యత

>> Saturday, July 12, 2008

మానవుడుతన బాల్యం లో చిన్నచిన్న మాటల దగ్గరనుంచి జీవితములో సర్వవిషయాలునూ మరొకరినుంచి నేర్చుకుంటాడు. ఇందులోభాగంగా ప్రకృతినుంచి వైజ్ఞానిక విషయాలను తెలుసుకొనడానికి కూడా మరొకరి బోధ అవసరమవుతుంది. అదేప్రకృతి నుండి పారమార్ధిక విషయాలనుగూడా నేర్చుకోవడం మానవుడు వుత్తమమయిన గురువులవద్దనుండి నేర్వవలసినదే. భాగవతం లోని అవధూత వుద్ధవగీతలో సాక్షాత్తూ శ్రీ కృష్ణుని చేతగూడా ప్రశంసించబడిన పూర్ణపురుషుడు. తాను ప్రకృతిలోని 24 మంది గురువులనుంచి ఏమి నేర్చి పరిపూర్ణతను సాధించాడో చెబుతాడు. దానినే పరమ ప్రామాణికంగా శ్రీకృష్ణుడు వుద్ధవునికి బోధిస్తాడు. తిరిగిఅదేబోధ మొదటిరెండు దత్తాత్రేయ అవతారచరిత్రల సంపుటమైన శ్రీం గురుచరిత్ర మనకు బోధిస్తుంది.తిరిగి మూడవ దత్తాత్రేయ అవతారమైన శ్రీమాణిక్య ప్రభువు గూడా తిరిగి జ్ఞానమలాగే ఆర్జించినట్లు తమభక్తులతో చెప్పారు
పారమార్ధిక జ్ఞానమేలేని పామర జీవితం అసూయ,ద్వేషం,మమకారం మొదలగు వాటిని పెంపొందించి,ఇతువ్యక్తిని,అటుసమాజాన్ని గూడా తారుమారు చేస్తుంది. జీవితానికి ఏకైక లక్ష్యమైన శాంతి,తృప్తి కొంచెమైనా తొంగిచూడవు. అమావాస్య నాడు ఆకాశం లో యధాపూర్వం చ్ందమండలమున్నప్పటికీ సూర్యుని కాంతిని భూమిపైకి ప్రతిబింబించనందున అగోచరమవుతుంది. అలానే ఆధ్యాత్మికజ్జానాన్ని మనజీవితం లో గురుస్వరూపం లభ్యం కాకపోతే మానవజీవితం సాగర మధ్యం లో చిక్కిన దిక్సూచి,నావికుడు,లేని నావవలె వుంటుంది. ఏ అనంతవిశ్వం పైన చెప్పిన మహనీయులందరికి గురుస్వరూపమై బ్రహ్మజ్ఞానులుగా చేసిందో శాంతి,తృప్తులను వారిరూపములో మూసపోసిందో అదిపామరుల పాలిట దుఃఖ సాగరంగా పరిణమిస్తుంది.
ఈ సృష్టిలోని అసంఖ్యాకమైన జీవులలో అదృషవశాత్తూ వివిధ స్తాయిలలో ఆధ్యాత్మిక పరిపాకంగలవారుకూడా వుంటారు. పూర్ణగురుని సాన్నిధ్యం ప్రతివారికిలభ్యంకానప్పటికి శాంతి తృప్తులు కుదిర్చే ఆధ్యాత్మిక జీవనము ఒకటివున్నదని మనకు తెలిపేవారు కొందరుంటారు. ఇట్టివారి సాంగత్యం సుద్ధ పాఢ్యమి నుండి నానాటికీ వృద్ధిచెందే చంద్రకళలవలె మనజీవితాలలోకి ఆత్మజ్యోతిని ప్రసరింపజేస్తారు. ఈ వికాశం పూర్ణగురు సందషనంతో పరిపూర్ణమవుతుంది. ఈ రహస్యాన్ని తెలుపుతుంది గురుపౌర్ణమి
పూర్వ జన్మ సుకృతం వలన పూర్ణగురుని సాంగత్యం ఎందరికో కలగవచ్చు. కానీ వారి వారి పరిపాకాలను అనుసరించి మాత్రమే వేరు వేరు సద్గురుభక్తులు ఫలితాన్ని పొందుతారు . అంతేకాదు పూర్ణగురుని సాంగత్యం జీవితం లోని కష్టసుఖాలనే మబ్బుతెరల మాటుఅన మరుగవనివ్వకుంటే వారిసాంగత్య ప్రభావము , చంద్రుని ప్రభావము వలన కలువకువలె చెట్టు సాంగత్యమువలన కాయ పండయినట్లు ,అట్టి ధృఢ భక్తుల పాత్రత పెరుగుతుంది. ఈవికాశములోని దశలను చంద్ర కళలతో పోలిస్తే పూర్ణవికాశము కలిగిన దశను పున్నమితో పోల్చవచ్చు. అట్టి స్థితిపై తీవ్రమయిన ఆకాంక్షకలిగి భక్తుని జీవితాన్ని వుంచగలిగినప్పుడే గురుసేవలో ఆట్టి స్థయిర్యం చిక్కుతుంది.
కనుక సాధకుని ప్రధాన కర్తవ్యం తన పూర్ణగురుని పూర్ణస్థితిని తన హృదయ ఫలకం మీద స్పష్టంగా ముద్రించుకోవడమే ! . అందుకు సాధనమే గురుపూర్ణిమ నాడు,సద్గురుని పూజించుకునే ఆచారం అనాదిగా వస్తున్నది. అందుకు వుత్తమమైన పూర్ణగురుని చరిత్ర పారాయణం చేయడమే. ( ఆచార్య భరద్వాజ గారి రచనలనుండి)

Read more...

ఒలెఒలె హాయి ! హుళక్కి హాయి ! చిచ్చే హాయి !

>> Thursday, July 10, 2008

84లక్షలజీవరాసులలో రకరకాలయోనులలో జన్మించిన జీవి ఎన్నో జన్మలలో చేసుకున్న పుణ్య ఫలములవల్ల ఒకసారి మానవ గర్భవాసాన పడతాడు. ఆతల్లి గర్భములో పెరుగుతూ అక్కడి పరిస్తితులకు తట్టుకోలేక అంటే వుమ్మునీరు నరకప్రాయమైన గర్భాశయములోపరిస్థితులలో పెరుగుతూ వేదనచెందుతుంటాడు. తాను ప్పటికి ఎన్నిజన్మలెత్తి చేసిన కర్మలవలన ఇటువంటి జనన మరణచక్రములో పరిభ్రమిస్తున్నాడో పూర్వజ్ఞానము కలిగి, దానికి చింతిస్తూ వేదనతో అటూ ఇటూ తిరుగుతూ వుంటే ,ఆతల్లి మాత్రం నా బిడ్ద లోపల తిరుగుతూ ఆడుకుంటున్నదని మురిసి పోతుంటుంది. ఇక 9 నెలల గర్భవాసనరకం అనుభవించిన జీవి తల్లికి ప్రసవ సమయమురాగానే తొందరగా బయటకు రావాలని కదలుతూ బయటకు వస్తాడు. మళ్ళీ తాను ఇంకొక జన్మ ఎత్తానని పెద్దగా ఏడుస్తాడు. పుట్టగానే అది అమెరికా శిశువయినా ఆస్ట్రేలియా బిడ్డయినా, ఇండియా అయినా ఇండోనేషియా అయినా తాను క్వాక్వా, క్వా అని ఏడుస్తుంది. క్వా ,అంటే ప్రాకృతములో ఎక్కడ, అని అర్ధము. తాను ఈగర్భవాస,జనన మరణ బాధలనుంచి తప్పించుకుని పొందే శాంతి ఎక్కడ? ఎక్కడ? అని ఆజీవి ఆవేదనతో ప్రస్నించుకుని వేదనతో రోదన చేస్తున్నది. మనపూర్వ కాలపు ముసలమ్మలు, కేవలము సంసారాన్ని మోసే వాళ్ళేకాదు, సంస్కారబలాలను గుర్తెరిగిన తత్వవేత్తలు. అక్కడేవున్న వాళ్ళూ ఆబిడ్డను సముదాయిస్తూ ఒలె,ఒలె హాయి అంటే అయ్యో ఇక్కడ హాయిని వెదుకుతున్నావా ?హుళక్కిహాయి అంటే నిరంతర వేదనలతో సాగే ఈజన్మ ప్రక్రియలో మానవ జన్మ ఎత్తిననీకు ఇక్కడ, సంసారబంధం లో ఇరుక్కునే నీకు హాయి లేదు. చిచ్చేహాయి అంటే ఎప్పుడయితే నీవు ఈమానవ జన్మ చాలించినతరువాత తలకొరివి పెడతారో అప్పుడేరా వెర్రికన్నా నీకు హాయి అప్పటిదాకా నిరంతర పోరాటమే అని నీకుమిగిలేది అశాంతి మాత్రమేనని అర్ధంవచ్చేలా ఈపాట పాడుతూ శిశువు పై మాయనీళ్ళు చల్లగా అప్పటివరకు వున్న పూర్వజ్ఞానం నశించిన జీవి తన జీవితాన్ని ప్రారంభిస్తుంది.

Read more...

అమ్మా!నాన్నా! అనిపిలవడం ఛాదస్తమట

>> Tuesday, July 8, 2008

ఇది సత్యన్నారాయణ రెడ్డి అనే మిత్రుడు చెప్పినవిషయం. సత్యన్నారాయణరెడ్డి గారు ఒకసారి తన పిన్నికూతురు చంద్రకళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళేసరికి రాత్రి 7గంటల సమయమైనది. ఆసమయములో ఈయన చెల్లెలు చంద్రకళ తనబాబును చంకనేసుకుని చంద్రుడిని చూపిస్తూ అన్నంపెడుతున్నది. ఇదిసాధారణ విషయమే. అయితే ఒకాసాధారణవిశయం ఈయనగమనించాడు. ఆవిడ చంద్రున్ని చూపిస్తూ, ట్వింకిల్ ట్వింకిల్ లి.టిల్ స్టార్...ఒక్కముద్దతినమ్మా..హౌఐ వండర్ వాట్ యు ఆర్ ...ఇంకొక్క ముద్ద పట్టునాన్నా, ......అప్ అబౌ సోహై మమ్మగదూ ఇంకొక్క ముద్ద తినాలి .... అంటూ పాడుతూ అన్నం పెడుతున్నది. ఈయనను చూసి రా అన్నయ్యా అంటూ పలకరించి మరలా తన పిల్లవానికి అన్నంపెడుతూ పాట సాగిస్తున్నది. ఈయన కుబోలెడు ఆశ్చర్యం వేసింది. అమ్మాయ్ చ0ద్రకళా చందమామ రావే ...జాబిల్లి రావే అంటూ ఆడవాళ్ళు పిల్లలకు అన్నంపెట్టడము చూసాను..అలాగే చాలా సినిమాల్లో కూడా అలాగే పాటలు పాడుతూ అన్నం పెట్టడంపిల్లలు తినడం చూశాను కానీ... నువ్వుమాత్రం చాలా వెరైటీగా ..పాట ..అన్నంపెట్టడం చూస్తున్నానమ్మా. ఏమిటీ ప్రత్యేకత అని అడిగాడు. అప్పడు ఆవిడ ఈయన అజ్ఞానం తొలగించేలా ,అన్నయ్యా మనం ఇలా చిన్నప్పటినుండే ఇంగ్లీషులో అలవాటు చేశామనుకో వీడు బడికెల్లేటప్పటికి బోలెడు ఇంగ్లీష్ పదాలు విని వుండటము వల్ల ఇంగ్లీష్ చాలా చురుగ్గా నేర్చుకుంటాడు. ఈరోజులలో ఇంగ్లీష్ లేకుండా బ్రతకటం కష్టం అని విషయ బోధ చేసినదట. ఇక ఆపసివానిచేత ఏదీ అనునాన్నా ... డాడీ.. మమ్మీ ... అంటూ సంవత్సరమ్ గుంటవెధవ చేత పలికించాలని పాపం విశ్వ ప్రయత్నం చేస్తున్నది. ఇక ఈయన వుండబట్టలేక అమ్మాయ్, రేపు మీవాడిచేత ఇలానే పిలిపించాలంటావా ? అది అవసరమా ? అనగా ఆవిడ అంతేకదన్నయా చిన్నప్పటినుంచి ఇంగ్లీష్ లోనే మాట్లాడితే వాడు నలుగురిలో మెప్పు పొందుతాడు ,అలాపిలిపించుకోవడమే నాకిష్టం అన్నదట.
ఔ నమ్మా నీకో విషయం చెప్పనా అని అడుగగా ఆవిడ చెప్పన్నయ్యా అన్నది. మమ్మీ అంటే అర్ధము తెలుసమ్మా నీకు, ఈజిప్టులో చనిపోయిన శవాలను భద్రపరచి వాటిని మమ్మీలంటారు. ఇకడాడీ అన్నపదానికి తండ్రి అనే కాక డాడ్ అంటే మూర్ఖుడు అనే విశేషణము కూడా అర్ధముగా వున్నదమ్మా నువ్వూ ఇంటర్ చదివావుగా కావాలంటే డిక్షనరీలో చూడు. వేలకు వేలు ఫీజులు పోసి వీడిని చదివించి వీడిచేత చచ్చినదానా...అని నిన్ను , మూర్ఖుడా అని బావగారిని పిలిపించుకోవాలంటావా ? అని అనగానే ఆవిడ ఇంతెత్తునలేచి మీరు ఎదగలేరన్నాయ్ ..తెలుగులో చదివి తెలుగు మాట్లాడుతూ మీరిలా గుమస్తావుద్యోగాలు చేసుకోవలసినదే అని ఎగతాళి చేసినదట. భాష నేర్చుకోవటం పెద్ద సమస్య కాదమ్మా దాని కోసం మనంకృత్రిమంగా మన మాటను పాటను మార్చుకుని జీవించాలా? మన భాషలో మనం ఏవిషయాన్నయినా తేలికగా నేర్చుకోవచ్చు. అవసరమయినప్పుడు పరాయి భాషలు నేర్చుకోవచ్చు అంతేగానీ...అని ఈయన చెబుతుంటే.... ఆవిడమాత్రం ...మీచాదస్తం ..మీరూనూ అంటూ ...విషయాన్ని కట్ చేసినదట. పాపం అమాయకులను ఏ ప్రచారం అమ్మా నా న్నా అనే తీయని పదాలనుంచి దూరం చేస్తున్నదోకదా!

Read more...

పూర్ణం పూర్ణస్య: పూర్ణమిదం (కదలివచ్చిన కనకదుర్గ..చివరిభాగం)

>> Monday, July 7, 2008

{తరువాయిభాగం]

ఇక మిగతా సరంజామా గూడా సిద్దమవుతున్నది. రామలింగేస్వర స్వామి లింగము,నరసరావుపేటలోను, నవగ్రహాలు, అయ్యప్ప,కుమారస్వామి, లక్ష్మి,సరస్వతి, గణపతి విగ్రహాలు పురుషోత్తమ పట్నములో తయారయ్యాయి. శ్రీ పెంచలరెడ్డిగారు [సి.ఇ.ఓ.] గారు గణపతి, శ్రీ యుగంధర్ కుమార్ దంపతులు శివ, ప్రతిష్ఠ తీగలరవీంద్రబాబు, సి.ఐ. హనుమంతుని ప్రతిష్ట లకు ముందుకు వచ్చారు. నెల్లూరు వాసులు వెంకటేస్వర రెడ్డిగారుఅన్నదానమునకు
బియ్యము ఇప్పించారు అనూహ్యముగా ఎక్కడెక్కడినుండో కావలసినవి కొరతలేకుండా వచ్చి పడుతున్నాయి. వినుకొండలో స్వాతి డ్రసెస్ అధినేత సూరి, అన్నయ్య మాకు చెప్పలేదేమిటి అని అడిగిమరీ నాతమ్ముడు క్రిష్ణతో కలసి సరుకులూ వెచ్చాలు,పోగుచేసారు, వినుకొండ డాల్ మిల్స్ వాళ్ళు కందిపప్పు అందించారు. వీళ్ళెవరినీ నేను ప్రత్యక్షముగా కలవక పోయినా అమ్మ కు వారిపైగల ప్రేమకు నిదర్సన మేమోగాని అందరూ తమయింటిలో పెళ్ళిలాగా ఈకార్యక్రమానికి తలా ఒకవైపునుంచి సహకార మందించారు. ఈ లోపల మరొక పరీక్ష ,శ్రీ లలిత్ మనోహర్ గారి సెక్రటరీ ఫోన్ చేసి సార్ అమెరికా వెళుతున్నారు ,మీకార్యక్రమము మరొకసారి ఏర్పాటు చేసుకోండి, లేదా ప్రత్యామ్నాయము చూసుకోండి అని చెప్పారు. ఇదేమిటి ఇందులో ప్రధానమయిన ఖర్చు భరిస్తారనుకున్న వారు ఇలా? నాకు తల తిరుగుతున్నది. ఒకవైపునుంచి అడగకుండానే కొన్ని వస్తుంటే సంతోషించాలా ,అనుకున్నవి అందకపోతే బాధపడాలా? మళ్ళీ అమ్మలీల మొదలయినది. నెల్లూరు జడ్.పి. చైర్మన్, శ్రీ గోవర్ధన రెడ్డిగారు వేంకటేశ్వర స్వామివారికార్యక్రమము కనుక ముందుకువచ్చి ఇచ్చారు. ఎక్కడి నెల్లూరు ఎక్కడి రవ్వవరం. డబ్బున్నా ఇలా భగవంతుని కోసం ఖర్చుపెట్టగల వారు ఎందరున్నారు? అందులో తనకు తెలియని ప్రాంతములో . నేనుఖచ్చితముగా చెప్పగలను ,ఇదిస్వామివారిలీల అని. తనవాళ్ళు ఎక్కడున్నా తనసేవకు పిలిపించుకుని మరీ చేపించుకుంటాడు,ఆ కొండలరాయడు. గంగినేని బాబు , నెల్లూరునుండి చక్రపాణి, దారామల్లి ఖార్జునరావు,చండ్రసాంబశివరావు మరెందరో వారందరికీ పేర్లువ్రాయటానికి ఇదివేదికకాదుకనుక కృత జ్ఞ తలు తెలుపుకుంటున్నాను తలా ఒకచేయి అందించారు. ఇంతపెద్ద కార్యక్రమము కనుక పెద్దలు శ్రీఅన్నదానం చిదంబర శాస్త్రిగారిని వచ్చి ఈకార్యక్రమము పర్యవేక్షించవలసినదిగా కోరాను. అయితే చీరాలలో ధర్మసమ్మేళనము వున్నది కనుక వారురాలేకపోతున్నానని కానీతన మనస్సంతా అక్కడేవుంటుందని అన్నారు. నాదగ్గరున్న మొత్తాలను పోగుచేసుకుని సిద్దపడ్డాను ఒక వంక నాతమ్ముళ్ళిద్దరూ నిద్రాహారాలు మాని పరుగులుపెడుతున్నారు. వూర్లోచూస్తే ముమ్మరంగా వ్యవసాయ పనులు జరుగుతున్నాయి. కూలీలుదొరకక రైతులు తీవ్రమైనఇబ్బందులతోవున్నారు. నీవు ఈకార్యక్రమన్ని వేసవిలో పెడితే అందరమూ నిలబడేవాళ్ళము,ఇలా చేసావేమిటి అని నిస్ఠూరాలాడారు కొందరు. నేనేమిచేయగలను అమ్మకు కూలీవాడిని ,ఆమె ఎన్నుకున్నపని ఆమె ఇష్టమువచ్చినప్పుడుమాత్రమే చేయాల్సివుంది ఇవన్నీ నేననుకున్నానా? అని సర్ధిచెప్పాను . ఇక కార్యక్రమాలకు అవసరమగు యజ్ఞ శాల నిర్మాణము నకు ఎవరినిపిలిచునా రావటము లేదు,పనివత్తిడులు అలావున్నాయి. ఎలాచేద్దామురా అన్నాను ,అంతే మాపిల్లలు బాల హనుమంతులై విజృంభించారు. స్తంభాలు బాతటం వాసాలు కట్టటం, తాటాకు కప్పే మనిషికి అందివ్వటం, సాయంత్రానికల్లా రెడీచేశరు. ఇక ఋ త్విక్కులు వచ్చారు. 26వతేదీ కార్యక్రమాలు మొదలుపెట్టారు, ముందుగా ఈకార్యక్రమానికి యజమాని ఎవరు? కంకణధారణ చెయ్యటానికి అని అడిగారు. నేను వెంటనే చూపించాను క్సేత్రపాలకుడైన హనుమంతుని, అడుగో ఆయనే ఈకార్యక్రమం అంతా చేపిస్తున్నవాడు,కనుక ఆయనకే కంకణధారణ జరపండి అని చెప్పారు. దానితోవారు వుత్సాహంగా ఈ కార్యక్రమమే చిత్రముగానున్నది అనుకుని,స్వామువారి మూర్తికే కంకణధారణ జరిపి వస్త్రాలు సమర్పించారు. నాబ్లాగులో మీరుచూస్తున్న ఆంజనేయస్వామి ఆయనే. ఇక కార్యక్రమానికొచ్చిన ప్రతివొక్కరిలో వుత్సాహం కట్టలుతెంచుకున్నది. పనుల సీజన్ అని చెప్పాను కదా .జలాధివాసానికి మూర్తులను తీసుకెళ్ళటానికి కూడా జనము సమయానికి రాలేకపోతే ,పెద్దవాళ్ళమే ఎత్తటానికి గిజగిజ లాడే బరువున్న ఆ విగ్రహాలను పిల్లలే జై శ్రీరాం అంటూ దగ్గరలోవున్న సాగర్ కెనాల్ వద్దకు మోసుకెళుతుంటే,జొన్నబెండ్లులాగా తేలికకా వెళుతున్న ఆమూర్తులను,ఆపిల్లలను చూసి ఋత్విక్కులు ముక్కున వేలు వేసుకున్నారు. మేము ఇన్ని కార్యక్రమాలు చేశాము గానీ ,ఈపిల్లలేమిటి ?,ఇంత కార్యక్రమాన్ని అలవోకగా చేసెయ్యడమేమిటి, ? నిజంగా ఆంజనేయుడు వీరిలో దూరి చేస్తున్నట్లేవుంది. అని ఆశ్చర్యపోయారు. చీరాలలో కార్యక్రమముఅనూహ్యంగావాయిదాపడినదంటూ,చిదంబర శాస్త్రిగారు రెండవరోజు వచ్చారు. అమ్మ సంకల్పం మరి. ఇక పుట్తపర్తి సాయి భక్తుడయిన మా బంధువుల అబ్బాయి రాయలు, మా మేనత్తకొడుకు శ్రీను, కార్యక్రమానికి ముందుకువచ్చినసూరి మాతమ్ముళ్ళు క్రిష్ణ ,శ్రీను తదితరులు నిద్ర అంటే తెలియనట్లు ఈమూడురోజులూ యంత్రాలులాగాపనిచేశారు. ప్రతిష్ఠ రోజు 70 మంది వంటవాళ్ళ ట్రూపు అన్నదానంకార్యక్రమాలు చూస్తున్నది. ఆయేర్పాట్లు ,తెఁట్లు చూస్తున్న చిదంబర శాస్త్రిగారు ఈ పల్లెటూరిలో ఎంతమంది వస్తారు? ఎందుకింత పెద్ద ఎత్తున ఏర్పాట్లు< ? అని అనుకున్నారట. ఆయన నాతో తరువాత చెప్పారు. ఇక 28 వతేదీ pratishThaku ఎక్కడెక్కడినుండో జనం తండోపతండాలుగా రాసాగారు. విపరీతమయిన జనం రాకతో ఆపరిసరాలన్నీ కిటకిటలాడాయి. అంతమందికి కూడా ఏ ఇబ్బందీ కలగ కుండా పిల్లలు అన్నపానాదులు,ఏర్పాట్లు చేస్తున్న తీరుచూసి జనం వీళ్ళు పిల్లలు కాదు నాయనా పిడుగులు అని అంటున్నారు. ఎ క్కడా చిన్న పొరపాటు జరగకుండా, అత్యద్భుతమ గా ,ఆదివ్య ముహూర్తానికి, గోవిందా..గోవిందా, ఓమ్ కాళిమాతాదుర్గకూ జై ,హరహర మహాదేవశ్ంభో అనే భక్తుల నామస్మరణ లతో పరిసరాలు మార్మోగుతుండగా, వేదఘోషలు మిన్నుమిట్టుతుండగా మంగళవాద్యాలు మనసును వురకలెత్తిస్తుండగా ఆదివ్యశక్తి భక్తజన రక్షణార్ధమై దిగివచ్చి ఆలయములో స్తిరపడినది. ఆసమయములో అమ్మ ఎన్నిలీలలుగా ఈకార్యక్రమాన్ని నడిపినదో మైకులో చెబుతుంటే భక్తులు కన్నీరు కార్చారు ఆనందముతో, ఇక కార్యక్రమానంతరం దర్శనమునకు ఋత్విక్కులు అనుమతిచ్చారు. మొదటగా నన్ను పిలచి అద్దములో అమ్మను చూడమని ఇచ్చారు, అప్పుడునాకు పిల్లలు పుడితే ఆలయములో శాంతులుచేసి వాళ్ళముఖము చూడమంటారుకదా అలాంటిభావన కలిగినది . చూద్దును కదా అక్కడ మాచ్చిన్నారి దివ్యప్రభలతో వెలుగొందుతూ... జన్మ ధన్యమయిపోయినది. అమ్మా!.. నీవుజగత్తుకుతల్లివా? ఇప్పుడు నాకు కూతురువయ్యావా? నామనసు ఈలోకములోలేదు ..మాటలు రావటములేదు.. కళ్ళవెంటధారా పాతముగా నీళ్ళు. ఇక నిభాళించుకొని శ్రీవారిని చూద్దునుకదా.. అహో ఏమిటా .. సొగసు.ముసిముసినవ్వుల మోహనరూపం . చూస్తున్నవారందరికీ స్వామివారి మోములో చిరునవ్వులు స్పష్టంగా కనపడుతుండటముతో ఆనందముతో వెర్రెక్కి పోతున్నారు. గోవిందా గోవిందా అని బిగ్గరగా కేకలు వేస్తున్నారు ఇటుచూస్తే . రామలింగేశ్వరులు ప్రశాంతగంభీర సాగర సదృశములా... బయట కలియుగములో భక్తజన రక్షణార్ధము దీక్షాధారులయిన పార్వతీ నందనుడు,గణపతి, శివపుత్రుడు కార్తికేయుడు,అత్రిపుత్రుడు, దత్తాత్రేయస్వామి , హరిహరసుతుడు అయ్యప్ప, వాయునందనుడు హనుమంతుడు. , నవగ్రహదేవతలు చిరునవ్వుల నొలకబోస్తూ నిలుచున్నారు. శాంతిమంత్రాలు మనస్సులకు ప్రశాంతిని కల్గించగా దర్శనమునకు బారులుతీరిన జనం సాయంత్రమువరకు సాగుతానే వున్నారు. అన్నదానం జరుగుతూనే వున్నది సాయంత్రము చూస్తే ఇంకా రాసులుగా అన్నం కూరలు మిగిలాయి వచ్చిన జనానికి వండినవి చాలవేమోనని వంటవాళ్ళు భయపడితే.. ఇలా రాసులు రాసులు మిగిలి వుండటము ఆశ్చర్యము. ఆరాత్రల్లా మేము,పిల్లలు కలసి. అన్నమురాసులను, దగ్గరలోని సాగర్ కెనాల్ కు మోసుకెళ్ళి నీటిలో కలుపుతూనే వున్నాము. జలచరాల ఆకలి సహితము తీర్చాలని అమ్మ అనుగ్రహము కాబోలు. ఎంతప్రతిష్ఠ జరిగినదో అంత అన్నదానము జరిగినది,చాలా గొప్పగా జరిగినది అమ్మ సంకల్పము అని శాస్త్రిగారు వెళ్ళేటప్పుడు చెప్పారు. అంతా కలలో లాగా జరిగినది. ఇప్పటికీ ఈఅల్పుడు అంతకార్యక్రమము అన్నీ సమకూర్చుకుని ఎలా జరిగినదో అర్ధముకాక తికమక పడుతూనే అంతా అమ్మ అనుగ్రహమని సమాధానము చెప్పుకుంటున్నాడు. అలాగే 16రోజుల పండుగ సందర్భముగా కళ్యానోత్సవములు,40రోజులకు యజ్ఞపూర్ణాహుతి వైభవముగా జరిగాయి. తరువాత వచ్చిన వేసవిలో మిగిలిన సరుకులతో ఆంజనేయదీక్షతీసుకున్న భక్తులకు అన్నదానము 21రోజులపాటుసాగినది. ఈసంవత్సరము నవరాత్రులు,కార్తీక మాసములో 40రోజులు అయ్యప్పదీక్షలు తీసుకున్నవారికి అన్నదానము వంటికార్యక్రమాలు జరిగాయి.భక్తుల కొరకు వారి గోత్రనామాలతో పూజలు జరుపబడుతున్నాయి. శఠారిలో డబ్బులు వేసే పద్దతికి ఇక్కడ స్వస్తి పలికాము, భక్తులెవరూ జేబులోంచి డబ్బులుతీసి పళ్ళెములో వేయవలసిన అవసరము లేదు. సమర్పించాలని కోరిక వున్నవాళ్ళు బయటనున్న హుండీలో వేయవచ్చు .ఆలయములో మాత్రము ప్రశాంతమంస్కులయి దర్శనము చేసుకోవాలి .స్వయముగా అర్చన అభిశేకము చేసుకోవాలను కునేవారిచేత అర్చామూర్తులకు, పూజలు చేపిస్తారు. యజ్ఞము కూడా స్వయముగా యజమానుల చేత జరిపించబడుతున్నది. వచ్చి సేవించిన వాళ్ళెందరో అయ్యా ఇక్కడకు వచ్చి పూజ చేసుకుని వెళ్ళిన తరువాత మా సమస్యలు తీరిపోయాయి,మాకిలా మేలు కలిగినది అని, చెబుతూ వుంటారు. వాళ్ళందరికీ మేము ఒక్కవిన్నపము చేస్తుంటాము. మీకు మేలుజరిగినదికదా! మరికృతజ్ఞతగా మీరు మీకున్న 24 గంటల సమయము లో 23 గంటలు మీకోసము వాడుకుని ఒక్కగంట భగవంతుని,పూజ,ధార్మిక గ్రంధాల పఠనము, ధార్మిక కార్యక్రమాలకు కేటాయించ0డి అని. ...చేరీకొలువరో ఈతడు శ్రీదేవుడూ. . ...

Read more...

కరుణాలావాలా ఇదునీదులీలా ....

>> Sunday, July 6, 2008

విగ్రహంకోసము ప్రయత్నము చేస్తూనే అసలు కావలసిన లక్ష్మీ ప్రసన్నత కోసం ప్రయత్నము ప్రారంభించాను. గ్రామాలలో అడుగుదామనుకుంటే ఇది వ్యవసాయపనులు జరుగుతున్న సమయం పంటలింకా రాలేదు. అందువలన అడిగినా ప్రయోజనముండదు. ఈ సమయములో నాకు హైదరాబాదులో లలిత్ మనోహర్ గారు గుర్తుకొచ్చారు. మేము శ్రీ అన్నదానముచిదంబర శాస్త్రి గారి ఆద్వర్యములో సికిందరాబాద్ లోని వారి స్వరాజ్ ప్రెస్ లో కోటి హనుమాన్ చాలీసా పారాయణ యజ్ఞం జరిగినప్పుడు పాల్గొన్నాను. రాష్ట్రమంతా హనుమద్ భక్తులు కో టిచాలీసా పారాయణము జరుపగా పూర్ణాహుతి అక్కడ జరిపినప్పుడు, స్వామి నాసేవలను వుపయోగించిన తీరు మరొకసారి తెలియ పరుస్తాను. నేను ఈసమయములో దీక్షలో వున్నాను. హైదరాబాద్ లో మాబంధువు అమ్మవారి మహిమలను అనుభవపూర్వకముగా తెలుసుకున్న వీరనారాయణ అనే భక్తుడు బ్రతుకుతెరువుకు అక్కడకు చేరివున్నాడు కనుక ఆయనను సంప్రదించాను నేను హైదరాబాద్ లో వుండే నాలుగు రోజులు కాస్త నా నిస్టకు భంగము కలగకుండా ఏర్పాట్లు చేయాలని. ఆయన సంతోషముగా ఒప్పుకున్నాడు. హైదరాబాద్ వెళ్ళాను . అక్కడ చాలీసా కార్యక్రమము లో పరిచయమయిన కొందరిని కలసినా పెద్దగా ప్రయోజనము లేక పోయినది. లలిత్ మనోహర్ గారిని కలవాలని వారి ఆఫీస్ కెల్లాను. వారు మధ్యాన్నం వస్తానని చెప్పారు. అప్పటికే నిరాశ తో వున్న నేను అలానడుస్తూ వెళుతుండగా ఆరోజు గురువారంకనుక భక్తులతో కిట కిట లాడుతున్న ఒక సాయి దేవాలయానికి చేరుకున్నాను. అది ముషీరాబాద్ లో సాయి ఆలయ మనుకుంటా. లోనికి వెళ్ళి ధునికి కొబ్బరికాయ సమర్పించుకుని సాయి ముందు కూర్చుని తాతా ఏమిటీ పరీక్ష ,ఎలా జరగాలి ఈ కార్యక్రమం అని ప్రార్ధిస్తూ గడిపాను. తరువాత బయటకు రాగానే ఫోన్ వచ్చింది ,నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ విష్ణు భక్తుడు, ,ధార్మికుడు ,గోవర్ధన రెడ్డిగారు,సహాయమందిస్తానని చెప్పారు అని. మహాత్ముల సహాయము వెన్నంటివుందని ధైర్యము వచ్చింది. తరువాత ఆఫీస్ కు వెళ్ళి, మనోహర్ గారిని కలసి విషయము వివరించాను. ఆయన సంతోషపడి తప్పనిసరిగా సహాయము చేస్తానని మాటయిచ్చారు. ప్రతిష్టకు వచ్చే ఋత్విక్కులకయ్యే ఖర్చు భరాయిస్తరని ఆశపడ్డాను. ఇక విగ్రహము కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి కానీ అమ్మ ఎక్కడినుండి వస్తున్నదో. ఋ త్విక్కులకోసం ఎక్కడప్రయత్నించినా అందరూ బిజీ. ఒకపక్క ఆహ్వానపత్రికలు తయారయి అందరికీ అందుతున్నాయి. 9 సంవత్సరాల క్రితం గుంటూరు రైల్లో వెళుతుంటే ఒక దేవీ భక్తురాలు పరిచయ మయ్యారు .పేరు ఝాన్సీగారు. వారిచ్చిన అడ్రస్ నాదగ్గరున్నది హైదరాబాద్ లో లొత్తుకుంట. వారి నివాసం. నాపక్కన వున్నాయనకు కూడా హైదరాబాద్ కొత్త ,ఆఅ డ్రస్ కనిపెట్టలేక పోయాము. చివరకు సిటీబస్సూలో వెళుతూ నిద్రపోయాను మెలుకువ వచ్చేసరికి ఒక షాప్ పై లోతుకుంటా అనే నేమ్ బోర్డ్ కనపడింది. అక్కడదిగి ఝాన్సీ గారి అడ్రస్ కెళ్ళగా వారు ఎంతో సంతోషించి తన సహాయం అందిస్తానని మాటిచ్చారు. అక్కడనుండి నెల్లూరు వెళ్ళి మాతమ్ముడిని తీసుకుని ఆత్మకూరు లో వున్న శివకుమార్ గారిని కలసి వారిని ఈకార్యక్రమానికి బ్రహ్మగా ఎన్నుకుని మిగతా ఋత్విక్కులను ఏర్పాటుచేసుకోమని బాధ్యతలప్పగించాము. అమ్మ నిర్ణయమేమో గానీ జొన్నవాడ కామాక్షిదేవి ఆలయ అర్చకులు, నెల్లూరు రాజరాజేశ్వరిదేవి ఆలయ అర్చకులు తో బృందము తయారయ్యినది. ఇక అమ్మవారి విషయము తేలలేదు ఒకపక్క సమయము వేగముగా దగ్గరకొస్తున్నది. భోగిపండుగరోజు నేను నె ల్లూరులో వున్నాను 13వ తేదీ .ప్రతిష్ఠఏమో 28 . ఇక ఆరోజు సాయంత్రం మాతమ్ముని పత్రికాఫీసులో కూర్చొని దీనిపై మాట్లాడుతున్నాము . మావాడు అన్నా! నీవేమో అమ్మవారు ఎక్కడో వున్నది , ఇలా లీలజరిపి వస్తున్న దంటావు. అవతల సమయము దగ్గరపడుతున్నది. ఇవి చెప్పుకోవడానికి బాగుంటాయి కాని వాస్తవానికి చాలాఇబ్బంది కలుగుతుంది. రేపు విగ్రహము లేకుండా ప్రతిష్ట ఎలా చేయగలము? ఏ దోవొక రాయిని నిలబెట్టలేముకదా? వుగ్రహము లేకుండా ఇ దేమన్నా ఆటా? అని అడుగుతారు వచ్చినవాళ్ళు. ఇక సందేహించకుండా మహాబలిపురము వెళ్ళి అమ్మవారి ఏదో వొకరూపము, తయారు చేసివున్న శిల్పము కొంచెము ఎక్కువ ఇచ్చయినా తీసుకురావటము మంచిది అని బాధగా చెప్పాడు. ఇలా మేముమాట్లాడుతుండగా వాళ్ళకొలీగ్ వెంకటేస్వర్లు గారువచ్చి విషయమేమిటనగా మాతమ్ముడు చెప్పాడు. వెంటనే అమ్మవారి విగ్రహానికయ్యే ఖర్చు నేనుభరిస్తాను అందుకోసం 20 వేలు ఇస్తాను మరొక పదివేలు ఏర్పాటుచేస్తాను తీసుకోండిఅని అన్నాడు. మేము ఆశ్చర్యపోయి ఏ మిటీ మాయ మనం అడగకుండానే అమ్మ ఈయనచేత ఇప్పిస్తున్నదేమిటి అనుకుంటుండగా దానికి ఆయన మరొక ఆశ్చర్యకరమయిన కారణాన్ని చెప్పాడు,. నాలుగుసంవత్సరాలక్రితం రాత్రి పూట హైదరాబాద్ నుండి నేను కారులో వస్తుండగా కారంపూడి ఏరియా లో కారు ఆగిపోయినది చుట్టూ చిమ్మ చీకటి. అసలే నక్సలైట్ల సమస్యతో సతమవుతున్న ప్రాంతం ఎలా చెయ్యాలా అని ఆందోళన పడుతున్నాను ,అంతలో అటుగా ఒక కారువస్తే ఆపాను. అందులోవున్నతను ఒక మెకానిక్ ఆయన నాపరిస్తితినిగమనించి తనకారుకు నాకారును కట్టుకుని తన వూరిలోని తనషెడ్కు తీసుకు వచ్చాడు. అయ్యా! ఈకారు గుంటూరు పంపి బాగుచేయవలసినదే మీకు అంత అర్జంట్ అయితే నాకారు తీసుకెళ్ళి పొద్దుననే ఎవరినన్నా పంపించ0డి అనిచెప్పి తన ఇంటిలోకి తీసుకెళ్ళీ మంచినీరు ఇచ్చాడు. రేకులు కప్పివున్న ఆ చిన్న షెడ్లో పెద్ద అమ్మవారి కాళికా రూపం. హనుమంతుని విగ్రహం వున్నాయి .తాను అమ్మవారి ఆలయం కట్టించాలని సంకల్పముతో పనిచేస్తున్నానని అతను వివవరించాడు. అమ్మా నన్ను ఈ గండమునుండి కాపాడావు. నీకోసం ఏదోవొకటిచేస్తానని మొక్కుకుని వచ్చి ,కారు మరసనాడు వేరే వారిచేత తెప్పించుకున్నాను. కానీ మరలా నాలుగైదు సారులు ఆరూట్ లోవచ్చినా ఆ ప్రాంతము నాకు కనిపించలేదు .మీరుమాట్లాడుతుంటే అమ్మవారు గుర్తుకొచ్చారు. అందువలన అమ్మకు ఈసేవ చేయాలనుకుంటున్నాను అని చెప్పగా మాకు నోటమాట రాలేదు. మరుసటిరోజు ఇక విగ్రహము కోసము ఎదురుచూస్తూ కాలము గడపటము మంచిదికాదని, 10 రోజులలో ఎలా ఏర్పాటుచేయగలమనే మా వాళ్ళ మాటకు నేను కూడా ఆలోచనలో పడ్డాను ఒకపక్క అమ్మ ఎక్కడోవున్నది వస్తున్నది అని మనసులో ఒక చలించని నమ్మకమేదో స్థిరపడిపోయింది. కానీ దానిని వ్యక్తము చేసినా నలుగురూ నవ్వుతారేతప్ప ప్రయోజనమేమున్నదని నాకు నేను సర్ది చెప్పుకుని,సంక్రాంతిరోజున అన్నంతిని మధ్యాన్నం బస్సెక్కాను మద్రాసు వెళ్ళటానికి .నాతమ్ముడు శ్రీనివాస్ నన్ను నెల్లూరు బుస్ స్టాండ్ లో బస్సెక్కించి వెళ్ళాడు ద్రైవర్ వాళ్ళు టీ తాగుతూ పావుగంట లేట్ చేసారు. ఈలోగా మావాడు మళ్ళీ తిరిగివచ్చి అన్నా! ఇప్పుడు నీవు మద్రాసు వెళ్ళే సరికే రాత్రవుతుంది. అక్కడనుండి మహాబలిపురం వెళ్ళటం సాధ్యంకాదు. 40 వేలు చేతిలో వుంచుకుని ఇబ్బంది పడతావు. నీవుతిరుపతి వెళ్ళీ అక్కడ చక్రధర్ వడయార్ గారని శిల్ప కళాశాల మాజీ ప్రినిసిపాల్ గారున్నారు ఆయనను కలసి సలహా తీసుకుని పొద్దునే మద్రాస్ వెళ్ళు అని అన్నాడు. ఆబసు దిగి తిరుపతి బస్ ఎక్కాను . బస్ బయలు దేరినది నాపక్కనే కూర్చున్న వ్యక్తి మీరెవరు ఎక్కడకు వెళుతున్నారు అని అడిగాడు. నేను విషయము చెప్పాను. ఆయన తనపేరు వెంకటరెడ్డి అ ని ,తాను పూలు హోల్ సేల్ వ్యాపారినని తనది కడప జిల్లా అనిచెప్పాడు. అంతేకాక తాను ఎన్నిసార్లు తిరుమల పూలుపంపాలను కున్నా కుదరలేదని మీకెన్ని పూలుకావాలో చెప్పండి? విజయవాడ బస్లో వేస్తాను మీరు వినుకొండలో దించుకోవచ్చు. నాతరపున స్వామికి సమర్పించ0డి ఈకార్యక్రమానికయ్యే పూలు మొత్తము నేనే పంపుతాను అన్నాడు. అంతే నాకర్ధమయిపోయింది. అమ్మ తిరుపతిలో వున్నది అని. పూలుఎదురొచ్చాయి కనుక అమ్మ అక్కడే వున్నదనే సంకేతము అందినది. ఆయన అడ్రస్ తీసుకుని తిరుపతిలో దిగాక చక్రధర్ గారి ఇంటికి వెళ్ళాను . అయితే ఆయన త్న మ్నమ రాలి పెళ్ళి పెట్టుకుని,పిలుపులకు బెంగళూర్ వెళ్ళారని ఆయన నాలుగైదు రోజులకుగానిరారు అని వాళ్ళమ్మాయి ,చెప్పినది. అమ్మా మీకుతెలిసిన శిల్పులు ఇంకెవరన్నా వున్నారా అని అడిగాను. లేదండీ!ఇప్పుడు పండగ సెలవలవటము వలన శిల్ప కళాశాలలో ఎవరూ వుండరు. మహతీ ఆడిటోరియం దగ్గార ఎవరో వున్నట్లు చెప్పుకునేతప్పుడు విన్నాము అన్నదా అమ్మాయి. ఏమిటితల్లీ నీలీల అని అమ్మనుతలచుకుని అక్కడకు వెళ్ళి విచారిస్తే నాగరాజు గారని ఒక శిల్పి అడ్రస్ దొరికింది. వాళ్ళ ఇంటికెళ్ళాక ఆయన భార్య ఆయననుఫోన్ చేసి పిలిపించింది. ఆయన వచ్చి విశయమంతావిని మాష్టర్ గారూ మీరు ఇంతకార్యక్రమము ఇలా విగ్రహం లేకుండా పెట్టుకుని ఎలా చెయ్యాలనుకున్నారు, మీరుకోరిన జగన్మాత రూపమును మలచాలంటే కనీసము రెండు నెలలు కావాలి .ఎక్కడా తయారుచేసి వుంచుకోరు.మాదగ్గ ర తమిలనాడు వాళ్ళు ఎక్కువ వస్తుంటారుకనుక మారియమ్మన్ రూపము [చేతిలో కత్తి,రక్తపాత్ర} కావాలంటే ఎక్కడైనా దొరుకుతుంది. మీరు మహా బలిపురము వెళ్ళినా లలితా దేవిలేక రాజరాజేశ్వరీ రూపమో దొరుకుతుంది పొద్దున్నేవెళ్ళి ఏదో ఒక రూపము అమ్మవారే కనుక తెర్చ్చి ప్రతిష్టిన్ చటం మంచిది ఆంతకంటే వేరు మార్గములేదు అని వివరించాడు. అమ్మవారు ఇక్కడే ఎక్కడో వున్నదని నామనసు చెబుతున్నది .దయచేసి నీకుతెలిసినవాళ్ళందరినీ విచారించి చూడమని బ్రతిమిలాడాను. ఆయన నవ్వుకుని ఆనక నామీదజాలిపడి. తన బండిమీద తనకు తెలిసిన ప్రయివేట్ వర్క్ షాపులన్నింటికి తిప్పాడు. తిరుపతి స్వామివారి శిల్పకళాశాలలో పనిచేసే శిల్పులు ప్రయివేట్గా శిల్ప తయారీకేంద్రాలునిర్వహిస్తుంటారు. ఎక్కడా అమ్మరూపం లేదు. మరికొందరిని ఫోనులో సంప్రదించాడు. వాళ్ళందరినుండి ఒకటే సమాధానం ఆరూపము మనమెందుకు తయారు చేసుకుని వుంచుకుంటాము. ఎవరన్నా ఆర్డరిస్తే తయారు చేస్తాముగాని అని. ఆయనకు విసుగొచ్చినది. చూశారుగా మాష్టర్గారూ ,మీరు పొద్దున్నే మహాబలిపురం వెళ్ళటం మంచిది అన్నాడు. నేను నిరాశపడకుండా చివరిసారిగా ఇంకెవరన్నా వున్నారేమో చూడండి అన్నాను ఆయన నన్ను వెర్రివాన్ని చూసినట్లు చూశాడు. మల్లా గుర్తుతెచ్చుకుని ఒకరిని మరచిపోయానని చెప్పి ఫోన్ చేసి మామా! నీదగ్గరేమన్నా అమ్మవారి విగ్రహము రడీగావున్నదా అని అడిగాడు. అవతలనుంచి విజయవాడలొ రూపము వున్నది కావాలా అని సమాధానము విన్ని నామనస్సు గాలిలో తేలింది, క్షణము ఆలస్యము చేయకుండా వెళ్ళివాలాము. చిత్రము శ్రీ వేంకటేశ్వరుని ఎక్కడనుంచి తెచ్చామో ఆ శ్వామివారి శిల్ప కళాశాలప్రక్కననే గోడవెంటవున్న నేత్రానందము అనే శిల్పకారుని ఇల్లుఅది. ఆయన చెప్పినదివి0టే అమ్మలీలేమిటొ అర్ధమవుతున్నది. నాలుగు సంవత్సరాల క్రితము నావద్దకు ఒక వ్యక్తి వచ్చి విజయవాడలో మూలమూర్తిరూపము చెక్కుతావా అని అనిగాడు. నేను సరేనన్నాను అతను అమ్మవారి అలంకరణ లేని మూలరూపము ఫోటోలిచ్చి అడ్వాన్స్ ఇచ్చివెళ్ళాడు తన అడ్డ్రస్ ఇవ్వలేదు నేను రాయిమీద రఫ్ గా రూపము తెచ్చివదలివేశాను అనిచెప్పాడాయన. నాపరిస్థితి చెప్పాను ఇంత త్వరగా ఎలా ఇవ్వగలము. పొరపాటున ఏచిన్న దెబ్బ పొరపాటుగాతగిలినా విగ్రహము మొత్తము వ్యర్ధమవుతుంది. మీరిలా అనాలోచితముగా ,విగ్రహము లేకుండా ఏలా పెట్టుకున్నారు కార్యక్రమాన్ని ? అని అన్నాడు. అయ్యా! ఇది అమ్మలీల నన్నుపిచ్చికుక్కను తిప్పినట్లు తిప్పి ఇక్కడ ప్రత్యక్షమయినది . అని వివరించాను .ఆయనకుకూడా ఈ విగ్రహము తయరుచేయాలనే పట్టుదలవచ్చి నేనూ, నాకొడుకులూ రాత్రింబవాళ్ళూ పండగా మానుకుని కష్టపడితే మీకు 25 వతారీఖుకల్లా అందించగలుగుతాము . అన్నాడు. ఎంతివ్వ మంటారు అని అడిగితే 18వేలు ఇవ్వమని అడిగాడు. అది అమ్మవారి సంఖ్య {18} పైసా కూడా తగ్గవద్దు అని చెప్పి 10వేలు అడ్వాన్స్ ఇచ్చి వచ్చాను. ఎట్టి పరిస్థితిలో 25కల్లా విగ్రహము వచ్చేలా చూడాలని,లేకుంటే కార్యక్రమం గందరగోళముగా మారుతుందని చెప్పాను.ఇంటికిరాగానే మా మందిరానికి ప్లాన్ ఇచ్చిన ప్రసాద్ గారి అబ్బాయి శంకర్ వచ్చి చూశాడు. నాన్నగారు ఇచ్చిన ప్లాన్ ప్రకారము విగ్రహము మూడున్నర అడుగులకు మించకూడదు అని చెప్పాడు. ఇదెక్కడ గొడవరా దేవుడా అక్కడ నాకు విగ్రహము నాలుగున్నర అడుగులు వుంటుందని శిల్పి చెప్పాడు,ఎలాచేయాలనుకుని, ఇప్పుడు చేయగలిగినది ఏమీలేదు. తప్పయినా ఒప్పయినా నేను చేయలేను మార్పులు జరిపే అవకాశములేదు ,కనుక ఏమిజరిగినా ఎదుర్కోవటము సరిచేసుకోవటము నీదేభారమని అమ్మకు చెప్పుకున్నాను. విగ్రహము రాగనే ఆత్రుతతో కొలిచి చూస్తే ఖచ్చితముగా పాదాలనుండి శిఖవరకు మూడున్నర అడుగులే వుంది మిగతా అడుగు పీఠము వున్నది. అమ్మ సంకల్పానికి తిరుగేమున్నది. {మిగతాదిరేపు.}

Read more...

కదలివచ్చిన కనకదుర్గ..కనికరించినవైనం.. {మూడవ భాగం}

>> Saturday, July 5, 2008

అది 1999 సంవత్సరములోవిజయదశమి పర్వదినము. పూర్ణాహుతి, కలశవుద్వాసన చెప్పి ప్రశాంతముగా కూర్చొనివున్నాము. మనసులో ఒక సంకల్పము తళుక్కునమెరిసింది. మందిరనిర్మాణము ప్రారంభించాలి అనిభావన మనసును వూపేస్తున్నది. పక్కనున్న నాతమ్ముళ్ళను. మిత్రులను అడిగాను చేయగలమా అని . అమ్మసంకల్పముంటే అది పెద్దలెక్క కాదు అని ఆత్మవిశ్వాసంతో చెప్పారు. అప్పటికప్పుడు కాగితాలమీద కార్యక్రమంప్లాన్ తయారు చేసాము. ముహూర్తము నిర్ణయించాము. ప్రతిష్ఠ కు మూడురోజులుముందునుండి జపాలు, హోమాలు ప్రారంభించాము. ఆమూడురోజులు ఆప్రాంతమంతా అవ్యక్తమయిన ఆనందం అందరిమనస్సులలో తాండవించింది. పూర్ణాహుతి హోమము జరిగినప్పుడు తీసిన ఫోటోలో అగ్నికీలలు ఓమ్ కార రూపములో దర్శనమిచ్చి అమ్మ కరుణను ప్రత్యక్షముగా చూపినది ఈఫోటో ఇంతకు ముందు పోస్టులో ఇచ్చాను. తరువాత నాదగ్గరున్న కొద్ది డబ్బుతో పునాదులు తీసి పనిప్రారంభించాము. నాకుతెలిసిన మిత్రులు బంధువులు సహాయము కోరాను. అయితే ముందే నిర్ణయించుకున్నాను ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా అదంతా అమ్మ లీలలో భాగముగానే భావించాలి. అమ్మకిష్టములేకుంటే వారిని ఇవ్వనివ్వదు. అందువలన మనసులో ఎటువంటి బాధకు గురికారాదు అని. నిజముగా ఎన్నిలీలలో ఇవ్వకూడని వాళ్ళను డుబ్బు ఇవ్వనివ్వలేదు. నేనెంత ప్రయత్నించినా. అప్పుడు ఇలా ఎందుకుజరిగిందా అని ఆలోచిస్తే తెలిసినది అలా ఎందుకు జరుగుతున్నదో . ఒక రు వెయ్యిరూపాయలిస్తానని ప్రతిరోజూ కనపడ్డప్పుడు రమ్మంటాడు .ఏదో కారణము అతనికి అడ్డువస్తుంది ఇవ్వటానికి ఒక నెల ఆగినాక పోలిసులు అరెస్ట్ చేసారు అతను దొంగసామానులు ఆభరణాలు కొన్న కారణము మీద. ఆతరువాత అతను చాలా సార్లు అన్నాడు,ఎందువలనో నేనివ్వలేకపోతున్నాను అని. అలాంటి సొమ్మును తన మందిర నిర్మాణానికి అమ్మ రానివ్వలేదు. ఒక డి.. ఎస్.పి.
గారు నేను విషయము చెప్పినప్పుడలా రండి తప్పనిసరిగా అంటాడు. నాకు ఆయన దగ్గరకు బయలుదేరదామనుకున్నప్పుడల్లా ఏదోవొక అడ్డంకి వస్తుంది అలా గడచిపోతుండగా ఆయనను ఎ.సి.బి. వాళ్ళుపట్టుకున్నారు అని వార్త పత్రికలో చూసి ఆశ్చర్యపోయాను. అప్పుడర్ధమయింది నన్ను వెళ్ళకుండా ఏశక్తి అడ్డుకున్నదో. కేవలము తమ శ్రమశక్తి చేత నిజాయితీగా సంపాదించిన డబ్బులను మాత్రమే ఈ కార్యక్రమములో పాల్గొన్న వారిచేత సమర్పింపజేసినది. తీగల రవీంద్ర బాబుగారు అని సర్కిల్ ఇన్ స్పెక్టర్గారు మా పత్రికా విలేఖరులు వెళ్ళి అడగగానే ఆంజనేయస్వామి విగ్రహాన్ని నిర్మింపజేయడానికి ముందుకువచ్చారు. ఆంధ్రజ్యోతి విలేఖరి దారా మల్లిఖార్జునరావు, కుమారస్వామి ప్రతిష్ట , చండ్ర సాంబశివరావు దంపతులు దత్తాత్రేయ స్వామిని అలాగే అయ్యప్ప, మహా గణపతి నవగ్రహ ప్రతిష్టలు చేయాలని సంకల్పించాము .ప్రధాన దేవతలుగా, శ్రీ వేంకటేశ్వర స్వామి, రామలింగేశ్వర స్వామి మధ్యలో జగన్మాత శ్రీ కనకదుర్గాదేవిని ప్రతిష్టించాలని , అమ్మవారిని దేవీ భాగవతములో వర్ణించిన పంచ రూపాలుగా {దుర్గ, రాధ,లక్ష్మి , సరస్వతి, గాయత్రి స్వరూపాలుగా} ప్రతిష్ఠజరపాలని అమ్మద్వారా భావన పొందాము. పాఠశాల మీద వస్తున్న ఆదాయము ఈ కార్యక్రమము కోసం వెచ్చించాము. ఇక స్వామి అనుగ్రహం మాపై ప్రసరించింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి మూర్తిని ప్రసాదించారు. స్వామివారి ఖర్చుతో, స్వామివారి శిల్పశాలలో తనకు తానే సృష్టింపజేసుకుని ముసిముసి నవ్వుల మూర్తిగా శ్రీవారు వేంచేశారు . ఇలా ఆరు సంవత్సరాల కాలం గడచింది. ఈ కాలములో కొన్నిసారులు తీవ్రమయిన బాధలకు గురయ్యాను. వివాదాలు ,ఆర్ధిక ఇబ్బందులు . ఈకార్యక్రమం పూర్తిచేయగలనా అనే నిరాశ ఇలా అనేక వత్తిడులు తో గడచి పోయినది. ఇక ఈకార్యక్రమము నేను చేయగలనా అనే అనుమానం పెరిగిపోతున్నది. ఎవరన్నా డబ్బున్నవారు సానుకూలముగా నున్నా వారి సంపాదన సరయినది కాకపోతే వాళ్ళను ఇవ్వ నివ్వదు నేను అడగటము వాళ్ళు చూద్దాము చూద్దామంటూ దాటవేయటము. కూలీ .వ్యవసాయం చేసుకునే వారు ఇచ్చే పదులు,వందలతో ఇది ఎప్పుడుపూర్తవుతుందనే బాధ. నాకొచ్చే కొద్ది ఆదాయము తో ఎన్నేళ్ళకు పూర్తిచెయ్యగలుగుతాము అనే ఆవేదన. ఈలోపల రిటయిఱ్డ్ ఎం. ఆర్వో ఒకాయన అమ్మవారి విగ్రహం చేపిస్తానని చేపిస్తే ఆరూపము చూస్తే నాకు అమ్మవారి కళఏమూలనా కనపడలేదు. అందువలన ఆవిగ్రహము ప్రతిష్ట చేయనని చెప్పాను. ఇంతకీ ఆవిడ ఎక్కడవున్నదో అంతులేదు. ఇలా 2006 డిశంబర్ దాకా గడచిపోయినది. ఆసంవత్సరము డిశంబరులో మాపూజ్యగురుదేవులు శ్రీరాధికా ప్రసాద్ మహరాజ్ గారిని 1 00 సంవత్సరాలు పూర్తయినదాకా తల్లిలా సాకి గురుసేవ చేసుకున్న ,మహా యోగినిగురుసమానురాలు అంజనీ మాత బృందావనము నుంచి గుంటూరు వచ్చారని తెలిసి మాట్లాడివద్దామని వెళ్ళాను. ఆమహా యోగిని చూడటానికి చాలా సామాన్యురాలిగా కనిపిస్తారు పైకి. వెళ్ళగానే ఆదరముగా పిలచి విషయాలు అడిగారు . అమ్మా ఈ కార్యక్రమము పూర్తిచేయగలుగుతానా ? అని అడిగాను. అమ్మ ముహూర్తము చూసి వచ్చే మాఘమాసము 2007 జనవరి 28 వ తారీఖున ముహూర్తం నిర్ణయించారు . అమ్మా నాదగ్గర ప్రస్తుతము డబ్బులేదు. నాలుగు నెలల క్రితమే లక్షరూపాయలు పోగుచేసుకుని గోపురాలు పూర్తిచేసాను. ఇప్పుడు ప్రతిష్ట అంటే మాటలా? అని అన్నాను. మరేమి ఫర్వాలేదు అన్నీ అమ్మ చూసుకుంటుంది. నీ ప్రయత్నము నీవుచేయి. అని దీవించింది. నాకు వున్న సమయము ఒక నెల. కావలసిన డబ్బు సుమారు ఆరు లక్షలు. దీనికంటే మరొకపెద్దపని అమ్మవారి మూర్తి ఎక్కడవున్నదో తెలియదు. భారం మనగురువుగారు ఆంజనేయస్వామిని తలుచుకుని ఆయనకు చెప్పుకున్నాను స్వామీ అసాధ్యాలు సాధ్యం చేసే వాడివి నువ్వు రంగం లోకిదిగితే తప్ప ఈ కార్యక్రమం సాధ్యంకాదు అని. అటునుంచి అటే తూర్పుగోదావరి జిల్లా పందల పాకలో వున్న వీరభద్రరావు అనే మాకు తెలిసిన ప్రతిష్టాచార్యులు ఒకాయనను కలవాలని వెళ్ళాను. అక్కడికి వెళితే ఆయన సంగతివిని ఈముహూర్తం ఈ సంవత్సరమంతటిలోకి చాలా ప్రసస్థమయినది. ఆరు నెలలక్రిందే మాకు కార్యక్రమాలు ఒప్పుకుని వున్నాము. పిచ్చిబ్రాహ్మణుదుకూడా ర్జుకు 500 లుఇచ్చినా దొరకడు. ఆరోజు కనుక ముహూర్తము మార్చుదాము అన్నారు .గుంటూరు ఫోను చేస్తే ముహూర్తము మార్చవద్దు అన్నారు. అయ్యా మహాత్ముల నోటినుండి వచ్చిన మాట జరిగి తీరాలి . కనుక ముహూర్తము మార్చలేను అని చెప్పాను. అక్కడనుండి రాజమండ్రి వచ్చి అమ్మవారి విగ్రహము కోసము ప్రయత్నించాను .కానీ అక్కడ రూపాలు నాకు తృప్తికలిగించలేదు. సరే అక్కడనుండి బయలుదేరి విశయాన్ని మాతమ్ముళ్ళకు ఫోనులోతెలియజేసి మహాబలిపురం వెళ్ళాను. అక్కడ శిల్పులుఅమ్మ వారి రూపము నేను కోరినట్లు మలచాలంటే రెండు నెలల సమయము కావాలని అడిగారు. తిరిగి వచ్చాను. నెల్లూరులో ఒక దిన పత్రికలో పనిచేస్తున్న నా చిన్న తమ్ముడు శ్రీనివాసరావు, వినుకొండ మండల పరిషత్లోపనిచేస్తున్న పెద్ద తమ్ముడు నామాట ను తలదాల్చి ప్రయత్నాలలోకి దిగారు. తెనాలి వెళ్ళి ప్రయత్నించాను, ఆళ్ళగడ్ద .చిలకలూరిపేట ఇలా పిచ్చికుక్కలా దేశమంతా తిరుగుతూ విగ్రహం కోసం ప్రయత్నించాను, జైపూర్ వెళ్ళి పాలరాతి విగ్రహము తెప్పిద్దామని అనుకుని ప్రయత్నించినా అభిషేకాలకు పాలరాతి విగ్రహాలున శ్రేష్ఠంకాదని తేలడముతో విరమించుకున్నాను. సమయము చాలా గడచినందున మిగతా విషయము మరొక పోష్ట్ లో వ్రాస్తాను.

Read more...

కదలివచ్చిన కనకదుర్గ ...........(రెండవభాగము)

>> Friday, July 4, 2008

                            నాకు చిన్నతనమునుండి భగవత్ కార్యక్రమములతో పరిచయము అవటము వలన అదీ,భక్తిసాంప్రదాయము నకు చెందినవవటమువలన సంకీర్తన అన్నా, భగవంతుని కీర్తించే కీర్తనలన్నా  చాలా ఇస్టము. మా నాన్నగారు నాకు చిన్నతనములోనే తిరుపతినుండి రాజాజీ మెచ్చిన భాగవతము అనే పుస్తకాన్ని తెచ్చి ఇచ్చాడు అది చదవటము, ఆయన చెప్పే మహాభారత, రామాయణ గాధలను వినటము వలననో , పూర్వజన్మ సంస్కారమో తెలియదు. హరిభక్తి మనసులో నాటుకుపోయినది. భక్తుల గాథలు చదువుతుంటే ఒళ్ళు పులకరించి పోతుంది. భగవంతుని కథలు విన్నా, సినిమాలలో చూసినా మనసు భావలోకములోకి వెళ్ళిపోతుంది కళ్ళవెంట నీళ్ళు ఆగవు. మావూరి శివాలయములో నాచిన్నప్పుడు ఋత్విక్కులు చేసే రుద్ర పారాయణాన్ని విని మనసు వురకలు వేసేది. నేనుకూడా నామనసారా నీళ్ళుతెచ్చి స్వామిమీద పోసి స్నానము చేపించాలని మనసు తహతహ లాడేది. అయితే ఇవన్నీ ఆ జగన్మాత కు పలురూపాలుగా తప్ప అన్యము అనేభావన ఇప్పటివరకు నాకు కలగటములేదు. "పురుషేచ విష్ణుః క్రోధేచ కాళీ ,సమరేచ దుర్గ, భోగ్యేచ భవానీ" అమ్మ పలు రూపాలలో తనలీలా విలాసాలు సాగిస్తున్న దిగా కనపడుతుంటున్నది వుదాహరణకు మీ అమ్మగారికి ఎర్రరంగు చీర, పచ్చరంగుచీర, నీలిరంగుచీర ఇలా పలురంగుల చీరలున్నాయను కుందాము .వాటిలో ఏరంగు చీరలో చూసినా మీఅమ్మగారు మీకు ఒకేరకముగా ఎలా కనపడతారో ,నాకూ ఏరూపాన్ని చూసినా అమ్మ అలాగే భావనలోకొస్తున్నది. ఇక మన ఫేవరేట్ హీరో మనగురువుగారు ఆంజనేయ స్వామివారు. ఆయన నడచిన విధముగానే భక్తుడు భగవంతుని సేవచెయ్యలనేది నామనసుకు వచ్చిన బోధ. ఇలా క్రిష్ణరాసకేళిని  అమ్మలీలతో సమన్వయంచేసుకునేవిద్య  ఎలా నేర్పినదో నాకింకా ఆశ్చర్యమే. అయితే ఆధ్యాత్మిక మార్గములో  ఎవరికి వారే అనుభవం తో తెలుసుకోవలసినదే .మరొకరు వివరిస్తే గందరగోళముగా వుంటుంది. వదిలేద్దాం.
      ఇంటర్మీడియెట్ నుండి పీఠములో సేవా కార్యక్రమాలు నాకు లభించిన అదృష్టముగా భావిస్తూ నిర్వహించే వాడిని. నా చిన్నతనము నుంచీ ఏదో నామస్మరణ ప్రసాదము, హారతి కీర్తనలతో నిర్వహించటమె తప్ప శాస్త్రీయముగా పూజా విధి తెలియదు. ఒక సారి పుస్తకాల షాపులో గాయత్రీ పూజా విధి చూసికొని దానిప్రకారము పూజా కార్యక్రమాలు జరిపేవాడిని. మానాన్న గారు నాకు చిన్నప్పుడు చెప్పిన బాలాత్రిపురసుందరీ మంత్రాన్ని నిష్టగా జపించేవాడిని. ఖడ్గమాల ,తీక్షణముగా పఠించేవాడిని.  ఇక అమ్మ శిక్షణప్రారంభమయినది. లలితా సహస్రనామ పారాయణము చేయమని ప్రేరణ మొదలయి అది,గీతా పారాయణము సాగినది. దసరా నవరాత్రులు వైభవముగా సాగుతున్నాయి. పెళ్ళిజరిగినతరువాత ,నాన్నగారు చనిపోయినతరువాత,మా గ్రా మము నకు 1 కి.మీ. దూరం లోవున్న మాపొలములో  చిన్నపాకలు నిర్మించి హిందూ పబ్లిక్ స్కూల్ పేరుతో చిన్న స్కూలు ప్రారంభించాను. ఆస్కూలు ప్రారంభసమయములో అక్కడి స్థలాన్ని పరిశీలించిన మా పురోహితుడు  ఒరే దుర్గా ! ఈస్థలము  తులసి, దర్భలు పెరిగివున్నది . ఈస్థలము చాలా పవిత్రమయినది అని అన్నాడు. అలా స్కూలు జరుగుతున్న సమయములో వుపాద్యాయ పోష్టు రావటము అమ్మలీలగా యెలా జరిపినదో ముందుపోష్టులో తెలియజేశాను. ఈసమయములో అమ్మ  దయవలన లక్ష్మీ దేవికి ఇష్టమయిన కనకధారా స్తవం , సరస్వతీ మాతకు ఇస్టమయిన  శ్యామలా దండకం పారాయణ చేస్తుండటం అలవాటయినది. ఈసమయములో ఒకసారి ఋషిక్షేత్రములో జరిగిన గాయత్రీ హోమము, చూశాను. చేయాలనిపించింది అంతే భవానీ దీక్షలో వున్న నేను త్రిపురాంతకం వెళ్ళినప్పుడు అక్కడ గాయత్రీ పరివార్ సభ్యులతో పరిచయం యజ్ఞ క్రియను నేర్చుకోవడము అంతా అమ్మ చెప్పిన పాఠములా జరిగింది . అంతకు ముందే రుద్రసూక్తము సుస్వరముగా చేయటము వచ్చింది. ఎలా సాధ్యమయిందో అమ్మకే ఎరుక. అన్నిసాంప్రదాయాలకు చెందిన మహాత్ముల జీవితాలు, వారిబోధనలు, సాధనా పద్దతులన్నీ అనేక పుస్తకాల రూపేణా నాకు అందుబాటులోకి రావటము, నేనుచదవటము, ఇవన్నీ అమ్మ ఇచ్చిన శిక్షణలో భాగముగానే జరిగాయనుకుంటున్నాను. ఇక నేను మాగురువుగారిని రకరకాల ప్రశ్నలతో వేధిస్తున్నప్పుడు., ఆయన ఒరే నీ నోరుమూపించే మహానుభావుడు బృందావనములో వున్న శ్రీ రాధికా ప్రసాద్ మహారాజ్ గారే వెళ్ళి ఆయనను ఆశ్రయించు. ఆయన కొంతకాలము గుంటూరులోని ఆశ్రమము నకు వస్తారు. వెళ్ళి కలవమని చెప్పారు. మూడుసంవత్సరాలు ప్రయత్నించిన తరువాత ఆమహా పురుషుని దర్శించే భాగ్యములభించింది. భారతభూమిలో వున్న మహాసాధకుడు ,సాక్షాత్తు రాసనాయకి శ్రీరాధాదేవి కృష్ణసహితముగా ఎవరితోనయితే నిత్యము ఆటలాడుకుంటుందో ఆ మహానుభావుని ఆశ్రయించటం ,నిజముగా నాపూర్వజన్మ సుకృతం. ఆ రాధాసఖీస్వరూపాన్ని గురించి మరొక పోస్ట్లో వ్రాస్తాను. మొదటిసారి చూడగానే వారు నన్ను ఆదరించి దగ్గరకు చేర్చుకున్నతీరు, పూర్వజన్మలో ఎప్పుడో ఆ మహానుభావుని సేవించిన ఫలితమాఅని అనిపించినది. ఆకరుణామూర్తి దయ నాపైవుండి . రాధా షడక్షరీ మంత్ర రాజాన్ని. నాచివివినగలిగింది చిన్నారి కృపకు నేనుపాత్రుడనయ్యాను. అయితే అమ్మ శిక్షణలో ఇన్నిమలుపులెందుకున్నాయో నాకిప్పుడు అర్ధమవుతున్నది. మూలప్రకృతి అయిన అమ్మ మొదట  అయిదు రూపాలుగా వ్యక్తమయినదని దేవీ భాగవతము చెబుతున్నది. భగవంతుని హ్లాదినీశక్తి రాధ, క్రియాశక్తిదుర్గ, ఐ శ్వర్యశక్తి,లక్ష్మి , విద్యా జ్ఞానశక్తి సంకేతాలయిన సరస్వతి, సావిత్రి{గాయత్రి} గా వ్యక్తమయినదట. అందుకనే కాబోలు ఆతల్లి నాచేత తన విభూతులన్నింటినీ తెలుసుకునేలా చేసింది. ఏమిటో ఆతల్లి దయ. నేనా గొప్ప సాధనలు, యోగాలు జపాలు, తపాలు చేసిన వాడినికాను. నిజంచెప్పాలంటే పట్టుమని గంటసేపుకూడా ధ్యానములో కూర్చొని ఎరుగనే, మరేమిటీ ఆతల్లికి ఈఅపారప్రేమ? అమ్మా అని పిలిచిన ఒక్కపిలుపుకే కరిగిపోయి పతనమయ్యి జారి పడబోయినప్పుడల్లా చేయిపట్టుకు ని నడుపుతున్న ఆతల్లి ప్రేమ ను ఎలా వర్ణించాలి? ఒక హీనుడను,దీనుడనయిన నాపట్లే ఇంత కరుణ చూపే ఈతల్లి నిజమయిన సాధకుల నింకెంత గా కరుణిస్తుందో చెప్పనక్కరలేదు. ఇంత చిన్న సేవకే కరుణించి తన మందిర నిర్మాణము జరిపే లీలలో నాకుప్రధానపాత్రనిచ్చిన ఆలీల మరొక పోష్టులో వివరిస్తాను.

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP